• విష్ణుషట్పదీ స్తోత్రం

    నారాయణ నారాయణ జయ గోవింద హరే |నారాయణ నారాయణ జయ గోపాల హరే ||

  • శ్రీ రామ

    ఆపదం అపహర్థారమ్ దాతారం సర్వ సంపదం, లోకాభి రామం శ్రీ రామం భూయో భూయో నమామ్యహమ్I

  • శ్రీ సీతామాత

    త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ, హనుమాన్ యత్న మాస్తాయ దు:ఖ: క్షయ కరోభవ

  • ఓం నమ:శివాయ:

    చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర పాహిమామ్ , చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర రక్షమామ్ I

  • శ్రీమాత్రే నమః

    అమ్మల గన్న యమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాల పెద్దమ్మ, సురారులమ్మ కడుపారడి పుచ్చిన యమ్మ, తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ మాయమ్మ కృపాబ్ధి నిచ్చుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్

  • శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు

    పురుషోవిష్ణు రిత్యుక్తః శివోనానామతః స్మృతః I అవ్యక్తం తు ఉమాదేవీ శ్రీర్వా పద్మ నిభేక్షణా I తత్ సంయోగా దహంకారః స చ సేనాపతిరుహః I

నవరాత్రిఉత్సవాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

విజయ దశమి నిర్ణయం ఎలా చేయాలి?

విజయదసమి దశమి కలిసి ఉన్నపుడు చేయల? లేక శ్రవణ నక్షత్రం రోజున చేయల?
ధర్మ సిందు ప్రకారం విజయదసమి మధ్యానం చేయాలి అంటే అపరాననికి దశమి తిధి ఉండాలి. 
ఒకో సారి మద్యానం దాటినా తరువాత తిధి వచ్చి మరునాడు మద్యననికి తిధి ఉండదు అప్పుడు ఎలా చేయాలి ?
అలంటి అప్పుడు ఏ రోజు మధ్యానానికి దశమి తిధి ఉంటుందో ఆ రోజు విజయదసమి చేయాలి అని అంటారు. శ్రవణ నక్షత్రం కూడా ఉంటె విశేషం. 

ఈ రోజు అపరాజిత దేవి పూజ కుడచేయాలి. ఎందుకు అంటే అ + పరాజిత = ఎవరికీ ఓటమి లేకుండా ఉండాలి అని అపరాజిత పూజ చేయాలి . 

ఇంకోటి సిమూలోఘనం అంటారు అంటే ఈ రోజు ఊరు దాటి వెళ్ళాలి. ఈ రోజు పూజ అంతా అయిన తరువాత ఊరికి ఈసన్యమ్ వైపు వెల్లి అక్కడ పరిశుద్ధ మయిన అష్టదల పద్మం వేసి అక్కడ పీటం పెట్టి అమ్మవార్ని పెట్టి అపరాజిత గా పూజ చేయాలి. అక్కడ కుడివైపు ఎడమ వైపు విజయ దేవి , జయ దేవి నాయి పెట్టి పూజ చేయాలి, సెమి వృక్షాని కూడా పూజ చేయాలి. ఈ రోజు ప్రయాణం మంచిది. 1. నక్షత్రం వచ్చిన తరువాత ప్రయాణం చేస్తే విజయం వస్తుంది. 
2. దశమి ప్రారంబం అయిన తరువాత 8 గంటల తరువాత మొదలయిన 48 నిముషాలు మంచిది అంటారు. 
అష్టమాన కుజుడు ఉంటె మాత్రం అ ప్రయాణం మానుకోవాలి ఎందుకంటే ప్రమాదాలు అవి జరిగే అవకాసం ఉంటుంది. 

ఈ రోజు కలసానికి కానీ పసుపు గౌరికి కూడా ఉద్వాసన చేయాలి. సెమి వృక్షం దర్శనం చేసుకోవాలి , ఈ రోజు గుడిలో కానీ పెద్దలకి కానీ జమ్మి పత్రీ ఇచ్చి అసిర్వచనం తీసుకోవాలి.

కొంతమందికి బొమ్మల కొలువు పెడతారు . ఈ 9 రోజులు చుట్టుపక్కల వర్ని పిలిచి, బదువుల్ని పిలిచి పండు తాంబూలం ఇవ్వటం, దీని ప్రయోజనం ఏమిటి అంటే పిల్లలకి మన సంప్రదాయాల్ని , పురాణాలని , ధార్మిక నియమాల్ని చెపే లాగ ఇక్కడ బొమ్మల్ని ఏర్పాటు చేయటం మనకి కనిపిస్తుంది. 


ఇంకా చదవండి »

మహర్నవమి విశేషం ఏమిటి ?

ఈ రోజు చండి హోమము చేయాలి , ఉపాసన పరులు , నవరాత్రి దీక్ష చేసే వాలు , చండి పారాయణ చేసే వారు , గుడిలో ఉత్సవాలు చేసే వారు అందరు తప్పనిసరిగా ఈ చండి హోమమ చేస్తారు. 9, 5, లేదా 3 రోజులు చేసిన ఈ రోజు హోమం చేయాలి అంటారు. ఈ 9 రోజులు నావర్ణ మంత్రాని ఎవరు ఎంత మంత్రం జపం చేస్తారో అందులో 10 వ వంతు చండి హోమం చేయాలి అనేవారు. 

మహర్నవమి ఎలా నిర్ణయం చేస్తారు , కొంటమి అష్టమి రోజు మరి కొంత మంది నవమి రోజు చేస్తారు. అష్టమి తో కలిసిన నవమి ని మహర్నవమి గ నిర్ణయించుకుంటారు. 

చండి హోమం లో ఎలాంటి సమిధలు వాడాలి? 
అమ్మవారికి ముక్యం గా మోదుగ చెక్క , ఇప్ప పువ్వులు, తెల్లని నువ్వులు కలిపిన పాయసం , లేదా తెల్ల నువ్వులు , ఆవు నేయి , తెల్ల అవ్వలు , రక్త చందనం కూడా కచితంగా హోమం లో వేయాలి అని అంటారు . 

హోమం చేయలేనివారు, దీక్షపరులు లేదా దీక్షగా చేయాలి అనుకునే వారు అకండం దీపం పెడతారు. శుక్ల పాడ్యమి రోజె ఆవు నేయి తో అఖండ దీపం పెడతారు . ఈ అఖండ దీపం ఎప్పుడు ఏ క్షణం కూడా రాత్రి కానీ పగలు కానీ కొండెక్క కూడదు. ఈ అఖండ దీపం రూపం లో అమ్మవార్ని పూజించడం. ఈ అఖండ దీపమ్ పెట్టినప్పుడు కొన్ని మంత్రాల తో దీప ప్రతిష్టాపన చేసిన తరువాత ఏ ఏ మంత్రాలూ , పారాయనాలు చేస్తామో అవి అనీ కూడా హోమం చేసిన ఫలితాలనే ఇస్తాయి. దీక్షలొ ఉన్న వాలు లేదా దీక్షగా ఈ 9 రోజులు పూజలు చేసిన వాలు హోమం చేయలేనప్పుడు ఏ ఏ మంత్రాలూ , పారాయనాలు చేస్తామో అవి అనీ కూడా హోమం చేసిన ఫలితాలనే ఇస్తాయి. 

కొంతమంది కి కలశ స్తాపన ఉండదు , ఉపాసన ఉండదు , దీక్ష ఉండదు , కాలి ఉండదు కానీ అమ్మవార్ని భక్తీ తో కొలవాలి అని అనుకుంటారు , అమ్మవారి పటానికి తోచిన పళ్ళు నైవేద్యం కింద పెట్టడం వలన కూడా అమ్మవారి క్రుపకి పత్రులు కావచ్చు. 

మహర్నవమి రోజున ఆయుధ పూజ ఎందుకు చేస్తారు?
పూర్వ కాలంలో మహర్నవమి రోజున చత్ర చామరాలకి , వాద్యలకి , గాజాస్వలకి  కి కూడా పూజ చేయాలి అని చెప్తారు , దీనికి ప్రత్యేకమయిన మంత్రాలూ పూజలు కూడా ఉన్నాయి. పాడ్యమి మొదలు నవమి వరకు గజాలకి , అస్వలకి రోజు పూజ చేయాలి, ఇంద్రుడు దగ్గర ఉన్న అస్వనికి కూడా పూజ చేయాలి (అక్కడకి వెళ్లి పూజ చేయలేము కబ్బతి పటానికి పూజ చేయాలి ). గజాలు , అశ్వాలు యుధం లో వాడే వారు కనుక వాటికి కూడా వంస వ్రుస్షి కలగాలి అని పూజ చేసే వారు. 

అమ్మవారికి ఈ నవరాత్రిలో  మినపప్పు తో చేసిన అల్లం వేసిన గారెలు నైవేద్యం పెట్టాలి . ఉపాసన దీక్ష ఉన్నవారు కచ్చితం గ పెట్టాలి. అల్లం జీర్న శక్తి ని పెంచుతుంది. దీని తేనే తో తినాలి 

అన్నం కంటే పిండి కి 8 రెట్లు ఎక్కువ బల్లం 
పిండి కంటే పాలు 8 రెట్లు ఎక్కువ బల్లం
పాల కంటే నెయ్యి 8 రెట్లు ఎక్కువ బల్లం
నెయ్యి కంటే మాంసం 8 రెట్లు ఎక్కువ బల్లం
మాంసం కంటే మినపప్పు 8 రెట్లు ఎక్కువ బల్లం



ఇంకా చదవండి »

అమ్మవారికి ఏ తిథి రోజున ఏ అబిషేకం , ఏ నైవేద్యం పెట్టాలి?

తిదులలో ఏ అభిషేకం , నైవేద్యం ?

పాడ్యమి రోజు - ఆవు నేయి తో అభిషేకం చేస్తే సకల రోగలు నివారణ అవుతాయి.
విదియ రోజు - చక్కర తో అభిషేకమ చేస్తే దీర్గాయువు కలుగుతుంది.
తదియ రోజు - ఆవు పాలు తో అభిషేకం చేస్తే ఎలాంటి అకాల మృత్యు దోషాలు తొలిగిపోతాయి ,
చవితి రోజున - పిండివంటలు నైవేద్యం పెట్టడం వలన సకల విద్యలు లబిస్తాయి.
పంచమి రోజు  - అరటి పళ్ళు నైవేద్యం పెట్టడం వలన మేధస్సు , బుద్ది శక్తి పెరుగుతుంది.
షష్టి రోజున - తేనే తో అమ్మవారిని అభిషేకించి , బ్రహ్మనుకి దానం ఇవటం వలన కాంతి పెరుగుతుంది, యషస్సు పెరుగుతుంది.
అష్టమి రోజున -  బెల్లం నీటి తో అభిషేకించి, మంచి బెల్లం ఎవరికయినా దానం ఇవటం వలన అష్ట కష్టాలు అంటారు కదా అలాంటివి అనీ తీరిపొతయి అంటారు.
నవమి రోజున - పేలాలు నైవేద్యం పెట్టడం వలన సకల సుభాగ్యలు కలుగుతాయి.
దసిమి రోజున - నల్ల నువ్వులు తో చేసిన పాదర్ధాలు నైవేద్యం పెట్టడం వలన సకల రోగలు పోతాయి అని , దిర్గయుషు పెరిగుతుంది.


వారాలలో ఏ నైవేద్యం
ఆదివారం రోజు - పాలు
సోమవారం - పాయసం
మంగళవారం  - అరటిపళ్ళు
బుధవారం - వెన్న
గురువారం - పటికబెల్లం
శుక్రవారం - తీపి పదార్ధాలు
శనివారం - ఆవు నేయి

అమ్మవారికి ఇష్టమయిన అన్నం 
పులగం - అన్నం + పెసరపప్పు
పాయసన్నం
పెరుగు అన్నం
బెల్లం అన్నం

నైవేద్యం పెట్టకుండా మనం తింటే అది దొంగతనం చేసి తినట్టు , అందుకని దేవునికి నివేదన చేయకుండా తినకూడదు.

అమ్మవారిని పూజ ఎలా చేయాలి?
ఆచమనం ముందు చేయాలి , కాల స్మరణ చేయాలి (సంకల్పం ) , అబిషేకం చేయాలి , మామిడి రసం(చూత పళ్ళు ) తో అబిషేకం చేయటం వలన సరస్వతి అ ఇంటి ని విడిచి వెళ్ళదు, అ ఇంట్లో వుండే వారికీ సరస్వతి కటాక్షం ఉంటుంది. ఆవు నేయి తో అబిషేకం చేయటం వలన సకల రోగాలు పోతాయి , పెరుగు తో అబిషేకం వలన సంపదలు కలుగుతాయి అమ్మవారికి చాల ప్రీతి గ ఉంటారు  , సకల రోగాలు పోతాయి, తేనే తో అబిషేకం చేయటం వలన యశస్సు పెరుగుతుంది, మేదస్సు పెరుగుతుంది , ఆవు పాల తో అబిషేకం చేయటం వలన సకల దోషాలు పోయి , సకల శుభాలు కలుగుతాయి , గంధం తో అబిషేకం చేయటం వలన మనలో తామస గుణం పోతుంది , పసుపు తో అబిషేకం చేయటం వలన సౌభగ్యమ్ పెరుగుతుంది.

అమ్మవారిని 108 పువ్వులు తో పూజ చేయడం విశేషం . కమలాలు, జాజిపువులు , లేత బిల్వాలు - సకల సంపదలు కలుగుతాయి , దాడిమి పువ్వులు ( దానిమ్మ చెట్టుకు పూసే పువ్వులు అంటే కాయకి ముందు వచ్చే పువ్వులు కాకుండా దానిమ్మ పువ్వు చెట్లు చిన్న చిన్న గులాబిలా ఉంటాయి వేరు ఉంటాయి ) వాటితో , మల్లెలు కూడా అమ్మవారికి ఇష్టం. 

ఇంకా చదవండి »

అమ్మవారిని ఏ పువ్వులతో , పత్రీ తో పూజ చేయాలి?

అమ్మవారికి ఈ నవరాత్రి లో రోజు ఒక రకమయిన పువ్వు లేదా పత్రీ తో పూజ చేయల ? లేక ఈ నవత్రులలో ఒకే రకమయిన పువ్వులతో పూజ చేయాలి అనుకుంటూనారో నిర్ణయించుకోవాలి. కోటి బిల్వార్చన , లక్ష బిల్వర్చాన తో కూడా పూజ చేయటం వలన శివుడికి పూజ చేయటం వలన ఎలాంటి ఫలితం లబిస్తుందో అలంటి ఫలితమే అమ్మవారికి చేయటం వలన లబిస్తుంది. 

ఉపాసన పరులు అయితే రక్త చందనం అనే గంధం తో ఆ బిల్వ ఆకుల మీద అమ్మవారి నామాలు,
బీజాక్షారలు రాసి, అమ్మవారి నామాలు చదువుతూ అంటే లలితా సహస్రనామాలు చదువుతూ ఒకో నామానికి "నమః" అని అన్నపుడు అమ్మవారి పాదాల మీద ఈ బిల్వాలు పెడుతూ ఉండాలి.

మల్లెలు తో అమ్మవారికి ఎవరు లలితా సహస్రనామాల తో పూజ చేస్తారో వారికి సకల అబిష్టాలు నెరవేరుతాయి. మగవారికి అయితే అనుకులవతి, సిళవతి అయిన బార్య  లబిస్తుంది, ఆడవారికి అయితే అనుకూలమయిన బర్త , శ్రీ రాముడు లాంటి బర్త లబిస్తాడు, సౌభాగ్యం లబిస్తుంది. 

మాలతి పుష్పాలు తో పూజ చేయటం వలన సకల శుభాలు, సౌభాగ్యాలు జరుగుతాయి. దాడిమి కుసుమాలు ( దానిమ్మ పువ్వులు ) తో పూజ చేయటం , అగస్త్య పువ్వులు ( అవిశ పువ్వులు ) తో కూడా పూజ చేయటం వలన విశేషం అయిన ఫలితం లబిస్తుంది. 

ఇంకా చదవండి »

నవరాత్రి రోజులో అబిషేకం ఎలా చేయాలి?

బంగారం , స్పటికం , ఇత్తడి , వెండి, రాగి విగ్రాహాలకి మాత్రమే అబిషేకం చేయాలి. పసుపు గౌరీ కి లేదా పట్టానికి చేయకూడదు. ప్రాతః కాలం లో అంటే బ్రాహ్మి ముహూర్తం లో అంటే 4:00 గంటల సమయం లో చేయాలి. 

అమ్మవారికి అంగ వస్త్రం కట్టి, పూల మాల వేసి , బొట్టు పెట్టి , హారతి ఇచ్చి కుమ్బబిషేకం చేయాలి . అల సత కుమ్బాలతో అబిషేకం చేస్తే 100 సంవత్సారాల నుంచి వచ్చే పాపం పోతుంది. దీనికి ముందుగానే అ కలసలకి కలసస్థాపన చేయాలి. అ కళాశాలలో కర్పూరం , పసుపు , కుంకుమ , కస్తూరి, గంగా జలం సుగంధ ద్రవ్యాలు అనీ వేసి కళాశాల కి కూడా పూజ చేసి అప్పుడు అబిషేకం చేయాలి. 

మేధస్సు లేదు , జ్ఞ్యపకశక్తి ఉండటం లేదు, గుర్తు పట్టటం లేదు , చదివినది గుర్తు రావటం లేదు , కదల లేకపొతున్నారు , అనుకున్నపుడు పానకం తో కానీ , ఇక్షు (చెరుకు )  రసం తో కానీ , పాల తో కానీ అబిషేకం చేయాలి . 100 కలసలతో అంటే 100 పూర్ణ కుమ్బాలు పెట్టి పానకం తో కానీ , ఇక్షు (చెరుకు )  రసం తో కానీ , పాల తో కానీ నింపి పూజ చేసి అప్పుడు అబిషేకం చేయాలి. 

ఎవరు మామిడి రసం తో అమ్మవారికి అబిషేకం చేస్తారో వారికీ సర్వ దోషాలు పోయి, రోగ నివారణ జరుగుతుంది. పాలతో చేస్తే వారికీ సరస్వతి కటాక్షం కలుగుతుంది. వారిని సరస్వతి విడిచి వెళ్ళదు. 

100 కలశలతొ తో కుదరక పొతే కనీసం 11, లేదా ఒక్క కలశం తో అయిన ఈ నవరాత్రులలో రోజు అబిషేకం చేయటం, లేదా రోజు ఏదో ఒక ద్రవ్యం తో అబిషేకం చేయటం వలన అమ్మవారిని ప్రస్సనం చేసుకోవచ్చును. అమ్మవారికి గంగా జలం తో అబిషేకం చేస్తే సకల పాపలు పోతాయంట. 

అమ్మవారికి పసుపు (మంచి పసుపు నీలలొ కలిపి) తో అబిషేకం చేయటం వలన ఆడవారికి సౌభ్యగ్యం లబిస్తుంది, దానిమ్మ పళ్ళు రసం  తో అబిషేకం చేస్తే సర్వ కామానాలు నెరవేరుతాయి. శోకం నివారణ కోసం మంచి బెల్లం పానకం తో అబిషేకం చేయటం వలన ఎంత తీరని శోకం , బాద , రోగం, శత్రువులు , మనః క్లేశాల వలన అయిన తీరుతున్ధి. 100 కలసాలతో చేస్తే మంచిది , 100 చేయలేని వారు కనీసం ఒక్కటి ఒక్క కలశం తో చేయటం వలన వారి ఇంట్లో శోకం అనేది ఉండదు , బాద అనేది ఉండదు. ఆ కలశం లో బెల్లం నీరు పోసి , గంధం , యాలకులు , సుద్ద గంగా జలం ఆవాహన చేసి , పచ్చ కర్పూరం వేసి అ నీటి తో మన ఇంట్లో ఉండే అమ్మవారి విగ్రహానికి అబిషేకం చేయటం వలన సర్వ దుకాలు దూరం అవుతాయి. 

ఇన్ని చేయలేని వారు, ఆవు పాలు , లేదా చెరుకు రసం ఏది వీలు అయితే దానితో అమ్మవారికి అబిషేకం చేయాలి. అయితే అమ్మవారికి రాగి తో అబిషేకం చేయకూడదు, కంచు , వెండి , బంగారం తో శ్రీ సూక్తం తో అబిషేకం చేయాలి. ఈ నవరాత్రులలో రోజు ఒక అవతారం, లేదా మామూలు రోజులలో కూడా ఏ అమ్మవారికి అబిషేకం అని ఆలోచన అవసరం లేదు, ఎప్పుడు అమ్మవారికి అబిషేకం చేసిన శ్రీ సూక్తం తోనే చేయాలి. దానికి తోడుగా లక్ష్మి సూక్తం ,సరస్వతి సూక్తం , పురుష సూక్తం , కాళి సూక్తం తో చేసుకోవచ్చు. ఒక వెల్ల తెలుగు రాదు మేము చదవలేము అనుకునే వారు ఏదయినా ఒక అమ్మవారి మంత్రం తో కూడా అబిషేకం చేయవచ్చు. 

అబిషేకం అయిన తరువాత అమ్మవారికి హారతి ఇచ్చి, బట్ట తో తుడిచి (అద్ది) , బొట్టు పెట్టి , పాపిటలో సింధూరం పెట్టి , పాదాలకి పసుపు రాసి అప్పుడు అలకరించాలి. తరువాత అమ్మవారికి పుష్పాలతో సహస్రనామార్చన చేయాలి లేదా అష్టోత్రం పూజ చేయాలి. పాలు , పళ్ళు నివేదన చేయాలి. ఒక పరిసుబ్రమయిన పాత్రలో సుగంధ ద్రవ్యాలు వేసి పచ్చ కర్పూరం వేసి , పట్టిక బెల్లం వేసి అ నీటి ని అమ్మవారి దగ్గర పెట్టాలి. "మధ్యే మధ్యే పనీయమ్ సమర్పయామి " అని అంతము కదా , నవరాత్రులలో మధుర పానీయం పెట్టాలి. 

తప్పనిసరిగా అమ్మవారికి తాంబూలం పెట్టాలి. లేత తమలపాకులు తెచ్చి దాని ఇనెలు తీసి, సున్నం , వాక్క, కాజు , ఇలాచి , లవంగాలు , జాపత్రి , జాజికాయ , పచ్చకర్పూరం తో సహా పెట్టాలి. మనం ఎవరికయినా తాంబూలం ఇవటం అంటే ఉత్తి తమలపాకులు ఇస్తూ ఉంటారు, అలా కాకుండా ఇలా అన్ని పెట్టి అమ్మవారికి సమర్పణ చేసి అప్పుడు ముతయిదువులకి ఇవ్వాలి. అల ఇవ్వటం వలన అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది, సౌభాగ్యం కలుగుతుంది , దంపతుల మద్య అన్యోన్యం కలుగుతుంది, రోగాలు తగ్గుతాయి అంట. 

లక రివాజు ఏమిటి అంటే రెండు పళ్ళు , ఒకటి లేదా రెండు అకులు (దానికి కనాలు ఉంటాయో ఇంకేమయిన ఉంటాయో ) , రెండు వక్కలు వేసి ఇస్తారు. అల చేయకూడదు. చక్కగా తాంబూలం సుగంధ ద్రవ్యాలతో చుట్టి ఇవ్వాలి. 

ఇంకా చదవండి »

మూల నక్షత్రం రోజున సరస్వతి పూజ ఎలా చేయాలి?

చండి పారాయణం కూడా మొదటి , మధ్యమ , ఉత్తమ చరిత్ర కిన ఉండి, పూజ కూడా మహాకాళి , మహాలక్ష్మి , మహా సరస్వతి ని పూజ చేస్తారు. నవరాత్రి లో 3 రోజులు , 3 రోజులు , 3 రోజులు గ పూజ చేస్తారు.

మూల నక్షత్రం మొదటి పాదం లో పూజ చేయాలి. చివరి 3 రోజులు మూల నక్షత్రం + సప్తమి - సరస్వతి , అష్టమి - దుర్గ అష్టమి , నవమి - మహర్నవమి చేస్తారు. నవరాత్రి దీక్షలు చేసే వారు , ఉపాసన ఉన్న వాలు , అన్ని రోజులు చేయలేనివారు మూల నక్షత్రం రోజున కలస స్థాపన చేసి దీక్ష గ పూజ చేసి, సప్తమి , అష్టమి, నవమి అయిన తరువాత దసరా రోజు అపరాజిత పూజ చేసి కలసనికి ఉద్వాసన చేస్తారు. 3 రోజులు పూజ చేయాలి అనుకునే వారు దుర్ముహూర్తం లేకుండా కలస స్తాపన చేసి , 3 రోజులు అకండ దీపారాధన చేసి చండి సప్తసతి పారాయణం చేయాలి. శ్రీచక్రం ఉంటె ఆవరణ పూజ , లలితా సహస్రనామార్చన, సరస్వతి అష్టోతరం , కుంకుమార్చన , తెల్లని పువ్వులు లేదా కలువలతో పూజ చేయడం విశేషం. పాయసం ప్రసాదం పెట్టడం . దీక్ష ప్రరంబించేప్పుడే నక్తం చేస్తారా ? ఏక బుక్తం చేస్తారా ? లేదా 3 రోజులు ఉప్వసిస్తర అనేది సంకల్పం లో చెప్పుకోవటం , బ్రహ్మచర్యం చేయటం , అర్చనలు, అబిషేకాలు చేయటం . వీలయితే మహర్నవమి రోజు చండీ హోమం చేయటం. తరువాత రోజు దశిమి రోజు , పూజ అయిపోయిన తరువాత, మహా నివేదన్ తరువాత , సువాసిని పూజ అయిన తరువాత కలశానికి ఉద్వాసన చేయాలి.

9 రోజులు చేసే వాలు పాడ్యమి రోజు, 5 రోజులు చేసే వాలు పంచమి రోజు, అది కూడా వీలుకానీ వారు మూల నక్షత్రం రోజున కూడా కలశ స్తాపన చేసుకుని పూజ చేయవచ్చు.

సరస్వతి సూక్తం , సరస్వతి సహస్రనామాలు చదువుకోవటం , మేధో సూక్తం , సరస్వతి కవచం , యజ్ఞవాల్క స్తుతి చదువుకోవటం మంచిది, పుస్తక రూపం లో సరస్వతి ని పూజ చేయాలి. మన ఇంట్లో ఉండే గ్రందాలు రామాయణం , భాగవతం లేదా పాట్య పుస్తకాలకి పూజ చేయలి. 

ఈ 3 రోజులు కూడా సరస్వతి అలంకారం చేస్తారు . తెల్లని పట్టు చీర కి ఎర్రని అంచు ఉన్న చీరను కడతారు. ముత్యాల హారం వేస్తారు. పాయసం , పరమాణం , పళ్ళు , పాలు, పేలాలు నివేదన చేయాలి. నువ్వులతో చేసిన లడ్డులు , వరి పేలాలు నివేద విశేషం. తేన నివేదన చేయటం , వస తో హోమమ చేయటం విశేషం. మాటలు రాణి వారు వసతొ హోమమ చేయటం వలన మాటలు వచ్చే అవకాసం ఉంటుంది. వాక్ సిద్ధి కావాలి అనుకునే వాలు, పాండిత్య రావాలి అనుకునే వాలు , జ్యోతిష్యం లో ప్రావిణ్యం కావలి అనుకునే వారు , సర్వజనులు సరస్వతి పూజ చేసుకోవాలి. 

సరస్వతి వ్రతం ఎలా చేయాలి?
మూల నక్షత్రం రోజున సరస్వతి వ్రతం చేయవచ్చు. ప్రతి నెల వచ్చే మూల నక్షత్రం రోజున చేయవచ్చు లేదా నవరాత్రి లో వచ్చే మూల నక్షత్రం రోజున అయిన చేయవచు. 

మూల నక్షత్రం రోజున సరస్వతి వ్రతం చేయాలి అనుకునే వారు ఒక వేదికను ఏర్పాటు చేసుకుని కలశ స్తాపన చేసే ప్రదేశం లో "సర్వతో భద్ర " అనే ముగ్గుని బియ్యం పిండి తో పెట్టాలి. ప్రత్యేకమయిన రంగులు ఉంటాయి వాటితో నింపాలి, ఇరు వైపులా శంకు చక్రాలు వేయాలి, గో పాదుకలు వేయాలి. అప్పుడు కలశం లో పంచ పల్లవాలు వేయటం, సప్త నదులని, సరస్వతి దేవిని ఆవాహన చేసి కలశ స్తాపన చేసి సరస్వతి అమ్మవారి ప్రతిమ / ఫోటో కానీ పెటాలి. సరస్వతి వ్రతం చేసే వాలు అ రోజు అంట అకండ దీపారాదన చేయాలి. అంటే మరునాటి ఉదయం పూజ ఆయె వరకు దీపం కొండెక్క కూడదు.

శ్రీ సూక్తం తో , సరస్వతి సూక్తం తోనూ అబిషేకం చేయాలి సరస్వతి విగ్రహం లేకపోతె కలశం మీద పువ్వులతో నీరు చలుతూ కూడా అబిషేకం చేయవచ్చు. సరస్వతి ఆశ్తోత్రం , సహస్రనామాలు చదువుకోవాలి. వ్రతం కద చదువుకోవాలి. పాయసం నివేదన్ చేయాలి. ఒక సుమంగాలికి సువాసన పూజ చేయాలి. బాల పూజ చేసి బట్టలు పెట్టి భోజనం పెట్టాలి. సరస్వతి మంత్రోపదేశం ఉంటె జపం చేసుకోవచ్చు. 

కధ 
ఒక రాజు ఉండేవాడు. నియమ నిష్టలతో ఉండేవాడు , సత్య పాలన చేసేవాడు. కానీ ఎంత వారికి అయిన సరే "నల రామ యుదిష్టరః " అని కాలం కలిసి రానప్పుడు కష్టాలు వస్తాయి. గ్రహచారం బాలేనప్పుడు సేత్రు రాజులు ఓడించారు. అయన తో పాటు తన బార్య కూడా అడవికి వెళ్ళిపోయారు. ఒక ముని దగ్గరకి వచ్చారు , మాకు పుత్రా సంతానం లేదు , రాజ్యం పోయింది ఏమి చేయాలి అని అడిగారు. అప్పుడు ముని సరస్వతి మంత్రోపదేశం చేసి ఆశ్రయం ఇచాడు. మూల నక్షత్రం రోజున సరస్వతి పూజ చేసి జపం మొదలు పెట్టారు. వెంటనే బార్య గర్బవతి అయి కొడుకు పుట్టాడు. 5 సంవత్సరాలు వచ్చే సరికి సర్వ శాస్త్రాల ప్రవీన్యుదు అయాడు. తరువాత తను యుదానికి వెళ్లి తన రాజ్యం తను తీసుకునాడు. 

విద్య ని అర్దించే వాలు సర్వ జనులూ సరస్వతి ని పూజ చేయాలి. అయితే సరస్వతి అనుగ్రహం కావాలి అనుకునే వారు సాంతం గ ఉండడం, సత్వ గుణం తో ఉండడం , శాంత చిన్తులయి ఉండాలి. కొపమ్ , ద్వేషం , క్రోదం లేకుండా ఉండడం అవసరం. 

" ఐం " సరస్వతి బీజం. సరస్వతి కటాక్షం కావాలి అనుకునే వారు కింద మంత్రం జపం చేయటం వలన సరస్వతి కటాక్షం పొందవచ్చు. 




ఇంకా చదవండి »

నవరాత్రి లో పంచమి రోజు పూజ ఎలా చేయాలి?



నవరత్రిలో 9 రోజులు కలశ పూజ చేస్తారు, ఒక వేల ఏ కారణం చేతనయిన చేయలేనివారు, ఈ పంచమి రోజు / లలిత పంచమి రోజు కలశం నిలబెట్టుకోవచ్చు.

ఉపాంగా లలితా పూజ చేయాలి , పంచమి రోజున. శ్రీవిద్య ఉపాసన ఉన్నవాలు జపం ఎక్కువగా చేసుకుంటే విశేషం, బీజక్షరలతో లలిత సహస్రనామాలతో శ్రిచాక్రచన చేయటం విశేష ఫలితానిస్తుంది.

9 రోజులు చండి పారాయణం చేస్తారు, ఒక వేల చేయలేనివారు పంచమి మొదలుకొని ఈ 5 రోజులు చండి పారాయనం చేయవచ్చు. లలిత సహస్రనామాలు బీజక్షరాల తో పూజ చేయాలి అంటే కనీసం బాల / పంచదసి / చండి / షోడశి అయిన ఉపదేశం ఉండాలి. అప్పుడు మాత్రమే బీజక్షరలతో (నమః)పూజ చేయాలి , లేకుంటే స్తోత్రం లాగా చదువుకోవాలి. అమ్మవారి మంత్రోపదేశం ఉన్నవారు తాంబూలం వేసుకుని అప్పుడు అమ్మవారికి పూజ చేయాలి అని శాస్త్రం చెపుతుంది. అంటే అమ్మవారి మంత్రాలూ మన నోటి నుంచి వచ్చే దుర్వాసన తో కాకుండా సుగంధ బరితం గ ఉండాలి , తాంబూలం వసుకుని తరువాత బయట ఉసెసి ఆ సుగంధ పరిమలాలతో అమ్మవారిని పూజ చేయాలి.

అన్నం + పెసరపప్పు + నెయ్యి / వెన్న + బెల్లం తో కూడా అమంవారికి అభిషేకం చేయవచ్చు. ఇది చేయటానికి తెలిసినవారిని వివరం అడిగి / దగ్గర ఉండగా నేర్చుకుని చేయాలి.

శ్రీచక్రం ఉన్న వాలు కుంకుమ / పువ్వులు / తులసి / బిల్వ / సెమి పత్రీ తో అర్చన చేయవచు . మల్లె / కలువలు / జాజి పత్రీ / మరువం / అగస్త్య పువ్వులు (అవిశి పూలతో అర్చన చేస్తే విశేషం) . వీలు అయినది వండి నివేదన చేయాలి.


అందరు కలశ పూజ చేయలేరు / ఉపాసన లేని వారు / చండి పారాయణం చేయలేని వారు, రోజు దీపారాధన చేయాలి. అందంగా అలకరించుకోవాలి(తలస్నానం చేసి , కుంకుమ పెట్టుకుని , కాలకి పసుపు రాసుకుని , ఆవు నేటి తో / నువ్వుల నూనె తో దీపం పెట్టాలి, ఇంటి ముగ్గు పెట్టుకోవాలి. ఒక పెద్ద ముతయిదువుకి తాంబూలం ఇవ్వండి. లలితా సహస్రనామం చేయాలి, యంత్రం ఉంటె యంత్రం మీద లేదా పసుపు గౌరి పెట్టుకుని అయిన కుంకుమ పూజ చేసుకోవచ్చు. ఏ మంత్రం రాకపోయినా లలితా అష్టోతరం , లక్ష్మి అష్టోత్రం అయిన చదువుకుంటే పూజ చేయాలి. భక్తీ తో చేయటం వలన ఎంత చిన్న గ చేసిన అమ్మవారు మన మీద కరుణిస్తుంది.


ఇంకా చదవండి »

కుమారీపూజ

శరన్నవరాత్రి తొమ్మిదిరోజులు కూడా కుమారీపూజ, సువాసినీ పూజ చేస్తారు. దీనినే బాలా పూజ అని కూడా అంటారు. కుమారి అని అంటేనే కన్య అనే అర్థంలో మనం వాడుతూ ఉంటాం. సందేహం లేదు కానీ మరొక అర్థమున్నది. కుత్సితాన్ మారయతీతి కుమారీఅని కుత్సితులని నశింపజేయునది. కుత్సితులు అంటే లోకకంటకులైన అసురులు. వారిని సంహరించే శక్తి కనుక కుమారీ, కౌమారీ ఇది ఒక అర్థం. 

అదేవిధంగా మన హృదయంలో పుట్టే కుత్సితమైన అసుర బుద్ధులు మన ప్రగతికి అవరోధాలు. వాటిని తొలగించేది కుమారీ. శ్రీవిద్యా సంప్రదాయంలో బాలాత్రిపురసుందరీ అని ఒక ఆరాధన కనపడుతున్నది. కానీ కుమారీపూజ అన్నది ఏ సంప్రదాయంలోనైనా ఉన్నది. ఈ కుమారీ పూజని శ్రీవిద్యా సంప్రదాయంలో బాల అంటారు. 

ఈ నడిమి వయస్సులో ఉన్నవారిని ఈ తొమ్మిదిరోజులు కూడా అమ్మవారి స్వరూపంగా ఆరాధన చేయాలి. దీనిని ప్రత్యక్ష పూజ అంటారు. అయితే ఈ బాలాపూజ విధానంలో ఒక్కొక్కరోజు ఒక్కొక్క పేరు శాస్త్రం చెప్తున్నది. ఇందులో రెండు సంవత్సరాల బాలికను కుమారీ అనే పేరుతో పూజించాలి. అంటే పాదాలకి పసుపు రాసి పారని పెట్టి, కొత్త బట్టలు పెట్టి, తలలో పువ్వులు , అక్షింతలు పెట్టి పసుపు కుంకుమ తో పాదాలకి అర్చన చేయాలి. 












ఇంకా చదవండి »

శరదృతువులో వచ్చే నవరాత్రులు - శరన్నవరాత్రులు

దేవీ నవరాత్రులు సంవత్సరంలో రెండు సార్లు జరుగుతాయి కానీ శరదృతువులో వచ్చే నవరాత్రులు శ్రేష్టమైనవి ఎందుకంటే...
దేవతలకు ఒక రోజు = మానవులకు ఒక సంవత్సరం. ఒక సంవత్సరం లో దేవతలకు ఉత్తరాయణం పగలు అయితే దక్షిణాయణం రాత్రి అవుతుంది. మనకు రోజు లో ప్రతి మూడు గంటలకు ఒక ఝాముగా పరిగణిస్తాం ఇందులో వేకువ ఝాము అత్యంత విశిష్టమయినది అందుకే ఆ కాలాన్ని బ్రహ్మ ముహూర్తం అంటాము.

ఈ బ్రహ్మ ముహూర్తంలో తలపెట్టిన పనులేవైనా దిగ్విజయంగా పూర్తి అవుతాయి. అలాగే మన ఒక సంవత్సరకాలం దేవతలకు ఒక రోజు అనుకున్నాం కదా ..శరదృతువు దేవతలకు వేకువఝాములాంటిది. రోజులో వేకువ ఝాము ఎంత శ్రేష్టమో సంవత్సరంలో ఈ శరదృతువు అంత శ్రేష్టం.  శరదృతువులో వచ్చే ఈ పండుగ మరియు ఈ దసరా నవరాత్రులలో అమ్మవారిని సేవించడం అత్యుత్తమం. శరదృతువులో వస్తుంది కాబట్టి శరన్నవరాత్రులుఅంటారు. ఈ ఋతువులో వర్షాకాలం ముగిసి చలికాలం మొదలవుతుంది. ఈ సమయంలో వాతావరణంలో కలిగే మార్పులు అనేక రోగాలకు కారణమవుతాయి. అందుకే ఈ అశ్వయుజ శుద్ధ పాడ్యమినుండి నవమి వరకు శక్తి ఆరాధన పేరుతో ప్రజలంతా శుచిగా, శుభ్రంగా ఉండి ఎలాంటి రోగాల దరిజేరవన్నది ఈ నవరాత్రి వేడుకల వెనుక ఉన్న చరిత్ర. మార్కండేయ మహర్షి అమ్మవారిని ఎలా ఆరాధించాలి అని అడగడంతో బ్రహ్మ ఇలా వివరించాడట.
ప్రధమంశైలపుత్రిణి, ద్వితీయం బ్రహ్మచారిణి
తృతీయం చంద్రఘంటేతి, కూష్మాంతేతి చతుర్ధామ్‌||
పంచమం స్కంధమాతేతి షష్ఠమం కాత్యాయనీ తిచ
సప్తమం కాళరాత్రంచ, మహాగౌరేతి చాష్టమం
నవమం సిద్ధితి ప్రోక్త, నవదుర్గ ప్రకీర్తిత||
ఆ జగన్మాతను వేర్వేరు ప్రదేశాలలో వేర్వేరు విధాలుగా అలంకరించుకోవడం మనందరకు విదితమే. అందుకే శ్రీశైలంలో అమ్మవారి అలంకరణలు క్రింది విధంగా ఉంటాయి.
1 శైలపుత్రి
2 బ్రహ్మచారిణి
3 చంద్రఘంట
4 కూష్మాండ
5 స్కందమాత
6 కాత్యాయని
7 కాళరాత్రి
8 మహాగౌరి
9 సిద్ధిధాత్రి




నవరాత్రులలో ఆటంకాలు ఎదురయినప్పుడు ఏం చేయాలి?

కొంతమందికి ఆడవాలకి నెలసరి వలన , బాలింత , అనారోగ్య కారనం వలన కొన్ని ఆటంకాలు. ఇంకా కొన్ని జాత సౌచం( పిల్లలు పుట్టినప్పుడు పురుడు వస్తుంది కదా దానిని జాత సౌచం అంటారు ) , ఒక వేల జాత సౌచం కలస స్తాపన కంటే ముందు వచ్చి 3,4 రోజుల తరువాత ఆగిపోతే బ్రాహ్మణుడ్ని పిలిచి కలస స్తాపన చేయవచ్చు. సౌచం పోయిన తరువాత ఇంటి ని సుద్ధి చేసి తలస్నానం చేసి దీక్ష ప్రారంబించవచ్చు.  మృత సౌచం వచ్చినప్పుడు అంటే వారి తల్లి తండ్రులే కర్మ కాండ చేసినట్టు అయితే ఒక సంవత్సర కాలం ఆ ఇంట్లో దీక్షలు చేయకూడదు. ఇంట్లో కాకుండా వంశీకులు కానీ , ఇంటి పేరు కల వారు కానీ పోయినప్పుడు ఒక 10 రోజులు మృత సౌచం అని పడుతూ వుంటారు. ఒక వేల ఈ 10 రోజులు  ఉంది అనుకోండి , వారి ఇంటి పేరు వారే అయితే ఒక బ్రాహ్మణుడి చేత ప్రారంబించవచ్చు లేదు ఈ వ్రాతనికంటే ముందే వచ్చే మద్యలో అయిపోతుంది లేదా మద్యలో వచ్చి చివరిలో అయిపోతుంది అన్నపుడు వంసికులు అయీ లేదా ఇంటి పేరు గల వారు అయి వారి ఇంట్లో కానప్పుడు (పోకుండా  ఉంటె ) ఈ వ్రత దీక్షలు నేరవేర్చవచ్చు. ఎప్పుడు అయితే ఈ సౌచం అయిపోతుందో అప్పుడు సుద్ది చేసుకుని తలస్నానం చేసి ఈ పూజ చేసుకోవచ్చు అని ధార్మిక శాస్త్రాలు చెపుతునాయి.  

విజయదసిమి రోజు పూజ ప్రారంబించి అ తరువాత ముగింపు కూడా చేసుకుని పారణ చేసి బ్రహ్మనుకి ఎదావిదిగా దానాలు , ధర్మాలు చేయవచు.

ఇంకా చదవండి »