-
విష్ణుషట్పదీ స్తోత్రం
నారాయణ నారాయణ జయ గోవింద హరే |నారాయణ నారాయణ జయ గోపాల హరే ||
-
శ్రీ రామ
ఆపదం అపహర్థారమ్ దాతారం సర్వ సంపదం, లోకాభి రామం శ్రీ రామం భూయో భూయో నమామ్యహమ్I
-
శ్రీ సీతామాత
త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ, హనుమాన్ యత్న మాస్తాయ దు:ఖ: క్షయ కరోభవ
-
ఓం నమ:శివాయ:
చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర పాహిమామ్ , చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర రక్షమామ్ I
-
శ్రీమాత్రే నమః
అమ్మల గన్న యమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాల పెద్దమ్మ, సురారులమ్మ కడుపారడి పుచ్చిన యమ్మ, తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ మాయమ్మ కృపాబ్ధి నిచ్చుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్
-
శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు
పురుషోవిష్ణు రిత్యుక్తః శివోనానామతః స్మృతః I అవ్యక్తం తు ఉమాదేవీ శ్రీర్వా పద్మ నిభేక్షణా I తత్ సంయోగా దహంకారః స చ సేనాపతిరుహః I
వినాయక లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ప్రతీ నెల కూడా బహుళ చవితి రోజున గణపతిని అర్చిస్తూ ఉంటారు, అభిషేకం , హోమం చేస్తుంటారు . బహుళ చవితి కి విశేషం . బాద్ర పద మాసంలో వచ్చే సుద్ధ చవితి కి వినాయక చవితి చేస్తాము ఎందుకంటే ఆ రోజు అయన అవతరించారు అని పూజ చేస్తుంటాము . బాద్ర పద బహుళ చవితి ఎంత విశిష్టత ఉందో అంతే విశిష్టత మాఘ బహుళ చవితి కూడా ఉంది . మాఘ మాసం లో వచ్చే సుద్ధ చవితి కి బహుళ చవితి కి విశేషం .
చవితి రోజున వినాయకుడికి పూజ ఒకలాగా ఉంటుంది . సుద్ధ చవితి కి పొద్దున్న పూజ చేస్తారు అంటే అభిషేకం , హోమం , పూజ చేస్తుంటారు కానీ పూర్ణిమ తరువాత వచ్చే బహుళ చతుర్ది మాత్రం చంద్రోదయం అయాక మాత్రమే విశేష పూజ చేయాలి. సాయంత్రమే చంద్రోదయం అయాక మాత్రమే పూజ చేయాడం విశేషం . పద్దతి కూడా సాయంత్రమే పూజ చేయాలి . పొద్దున్న నుంచి ఉపవసించి సాయంత్రం చంద్రోదయం అయ్యాక అభిషేకం చేసి , అర్చన చేసి , చంద్రుడికి , రోహిణి నక్షత్రానికి , చతుర్ది తిథి కి అర్గ్యమ్ ఇచే పద్దతి కూడా ఉంది . బాద్రపద సుద్ద చవితి రోజున గణపతి కి పూజ చేయడం వలన గణపతి అనుగ్రహం ఎలా కలుగుతుందో , గణపతి పూజ కి ఎలా విసిష్టమైనదో మాఘ సుద్ధ , బహుళ చవితి కూడా అంటే విసిష్టమయినది పురాణాలూ చెపుతునయి .
చవితి రోజున వినాయకుడికి పూజ ఒకలాగా ఉంటుంది . సుద్ధ చవితి కి పొద్దున్న పూజ చేస్తారు అంటే అభిషేకం , హోమం , పూజ చేస్తుంటారు కానీ పూర్ణిమ తరువాత వచ్చే బహుళ చతుర్ది మాత్రం చంద్రోదయం అయాక మాత్రమే విశేష పూజ చేయాలి. సాయంత్రమే చంద్రోదయం అయాక మాత్రమే పూజ చేయాడం విశేషం . పద్దతి కూడా సాయంత్రమే పూజ చేయాలి . పొద్దున్న నుంచి ఉపవసించి సాయంత్రం చంద్రోదయం అయ్యాక అభిషేకం చేసి , అర్చన చేసి , చంద్రుడికి , రోహిణి నక్షత్రానికి , చతుర్ది తిథి కి అర్గ్యమ్ ఇచే పద్దతి కూడా ఉంది . బాద్రపద సుద్ద చవితి రోజున గణపతి కి పూజ చేయడం వలన గణపతి అనుగ్రహం ఎలా కలుగుతుందో , గణపతి పూజ కి ఎలా విసిష్టమైనదో మాఘ సుద్ధ , బహుళ చవితి కూడా అంటే విసిష్టమయినది పురాణాలూ చెపుతునయి .
అయితే ఆ రోజు పూజ ఎలా చేయాలి . ఏ రూపంలో గణపతిని తలుచుకోవాలి ? ఎం నైవేద్యం పెట్టాలి అని శివమహపురణం , గణపతి పురాణం లో ఉంది.
ఎవరయిన సంకష్టహర చతుర్థి ప్రారంబించాలి అని అనుకుంటే మాఘ బహుళ చవితి , శ్రావణ బహుళ చవితి కానీ ప్రారంబించాలి. ఎవరయినా కాశి క్షేత్రం లో ఉన్న తప్పకుండ మాఘ బహుళ చవితి రోజున దుండి గణపతి ని దర్శించుకోవాలి . కాశి క్షేత్రం లో ఉండి మాఘ బహుళ చవితి రోజున దుండి గణపతి ని దర్సించకపొతె తప్పు అని కూడా చెపుతారు . అక్కడ లేకపోయినా దుండి గణపతిని తలచుకుని నమస్కరించుకొవదమ్ కూడా విశేషం .
మాఘ బహుళ చవితి రోజున ఎం చేయాలి?
ఈ రోజున తలమీద నుంచి స్నానం చేసి సంకాల్పమ్ చెప్పుకోవాలి . ఈ రోజు నుండి ఒక సంవత్సర కాలం పాటు సంకష్ట హర చతుర్ది చేస్తాను , ఏ విఘ్నాలు కలగకుండా చూదమని , మనకి ఉండే కామనలు , లేదా కోరికలు ఆటంకాలు కలుగుతునాయో , ఆ ఆటంకాలు తొలిగిపొవలి అని సంకల్పం చేసుకోవాలి . ఉదయం పూజ చేయాలి , అభిషేకం చేయాలి , హోమం చేయాలి . ఆ రోజు అంతా ఉపవసించాలి . రాత్రి మల్లి అభిషేకం చేయాలి , గణపతి కి ఎర్రని బట్టతో అలంకరించాలి , ఎర్ర చందనం/ రక్త చందనం తో అలకరించలి . జిల్లేడు పువ్వులు , గరిక , తుమ్మి పువ్వులు , బిల్వ పత్రం తో పూజ చేయాలి . గణపతి కి ఎర్రని పూలు అంటే చాల ఇష్టం . ఎర్ర మందార పూలు , కలువలు తో మాలలు చేసి గణపతికి అలకరించలి .
నైవేద్యం
పాయసం , లడ్డు , ముక్యంగా మాఘ మాసం లో నువ్వులు బెల్లం తో చేసిన లడ్డులు నివేదన తప్పకుండ చేయాలి. మొదకలు (సహస్ర మొదకలు ఎవరు నివేదన చేస్తారో వారికీ సకల సంకటాలు తిసివేస్తాడు అంట ).
గణపతి కి అర్ఘ్యం ఇచేట్టపుడు చదువుకొవలిసిన మంత్రం
చతుర్ధి తిధి కి అర్ఘ్యం ఇచేట్టపుడు చదువుకొవలిసిన మంత్రం
చంద్రుడికి అర్ఘ్యం ఇచేట్టపుడు చదువుకొవలిసిన మంత్రం : రాగి పాత్రలో జలం తెల్లని పువ్వులు , పసుపు , కుంకుమ , అక్షింతలు , పెరుగు వేసి అర్ఘ్యం ఇవ్వాలి . చంద్రుడికి కూడా నివేదన చేయాలి .
అ తరువాత బ్రాహ్మణులకి లేదా పేద వారికీ భోజనం పెట్టి తరువాత గృహస్తు ఇంక ఉపవాసం ఉండలేను అనుకునే వారు భోజనం చేయాలి . లేకుంటే ఇంకా అ రాత్రి కి ఏమి తినకుండా రాత్రికి జాగరణ కూడా చేసి మరునాడు పునః పూజ చెహ్సిన తరువాతనే తినాలి . ఉండలేనివారు ఉపహారం చేసి అయిన ఉండవచ్చు .
సాయంత్రం చంద్రుడికి , వినాయకుడికి , చతుర్ది తిధి కి అర్ఘ్యం ఇవాలి .
మంగళవారం నాడు చవితి తిధి వస్తే అది అంగారక చతుర్ధి అని కూడా అంటారు . కుజ గ్రహం వలన బాద పడే వారు , మాంగల్య దోషాలు ఉన్న వాలు తప్ప కుండ చేయడం వలన వారికీ దోషాలు పోతాయి . మాఘ మాసంలో మంగళవారం నాడు సంకష్ట హర చతుర్ధి తిధి రావటం ఇంకా విశేషం .
సంకష్ట హర చతుర్తి తిధి నిర్ణయం ఎలా చేయాలి ? తిధి తగులు మిగులు వచ్చినప్పుడు , తిధి నిర్ణయం ఎలా చేయాలి ?
ధర్మసింధు గ్రంధల ప్రకారం సుద్ధ చవితి కి చేసే పూజ ప్రాతః కాల పూజ. సంకష్ట హర చతుర్తి కి మాత్రం కచితంగ చంద్రోదయానికి చతుర్ది తిధి ఉండాలి . పగలు మొత్తం చతుర్ధి తిధి ఉండి చద్రోదయానికి చతుర్ధి తిధి లేకపోతె ఆ రోజు సంకష్టహర చతుర్ధి కాదు .
పూర్ణిమ రోజు అయితే సాయంత్రం సూర్యుడు అస్తమించే టప్పటికి చంద్రుడు కనిపిస్తాడు . బహుళ పక్షం లో చంద్రుడు కొంచం రావటం ఆలస్యం అవుతుంది , పాడ్యమి ఇంకా కొంచం ఆలస్యం , విదియ ,తదియ కి ిన ఆలస్యం , చవితి కి చంద్రోదయం సమాయం ఇంకా కొంచం ఆలస్యం అయి మనకి రోజు 8 గంటలకి వస్తుంది అనుకుంటే (క్యాలెండరు లో చూడవచు చంద్రోదయ సమయం ). అ సమయానికి చవితి తిధి ఉందా లేదా అని చూసుకుని చవితి ని పాటించాలి . చాల మంది ఉదయం అంతా చవితి తిధి ఉంది సాయంత్రం కూడా 7:45pm వరకు కూడా చవితి తిధి ఉంది కాబట్టి ఈ రిజే సంకష్టహర చతుర్ధి అంటారు , కానీ చద్రొదయనికి చవితి లేకపోతే అది సంకష్ట హర చతుర్ధి కాదు . అలాగే ఒకో సరి ఉదయం అంతా తదియ తిది ఉంది రాత్రి 7:30pm లేదా 7:50pm వరకు తదియ ఉండి తరువాత 8:00pm కి చవితి తిధి కలిస్తే ఆ రోజు చేయాలి . రేపు అంతా చవితి తిది ఉంది కదండీ రేపు రాత్రి 7:55pm వరకు కూడా ఉంది అనుకుటే రేపు చెయ్యకూడదు , ఎందుకంటే పగలు అంతా చవితి తిది ఉన్న చద్రోదయానికి పంచమి వచేస్తుంది కాబట్టి చవితి చేయకూడదు .
అయితే ఒకో సరి ఈ రోజు చద్రొదయనికి చవితి తిధి కలిసి మరునాడు చంద్రోదయ సమయానికి కి కూడా చవితి తిధి ఉంటుంది . అంటే ఈ రోజు 8:15pm చవితి వచ్చి మరునాడు రాత్రి 9:00pm వరకు కూడా చవితి తిది ఉంటుంది . కానీ ధర్మ సింధు ఎం చెపుతుంది అంటే అల తిధి ద్వయం వచినప్పుడు పూర్వ దినమే చేయాలి మరునాడు రోజు చేయకూడదు . ఎందుకంటే తదియ తో మాత్రమే కలిసిన చవితి ని గణపతి కి పూజ చేయాలి తప్ప పంచమి తో కలిసిన తిదియ గణపతి పూజ కి నిషిద్దం, చెయ్యకూడదు . అందువలన తదియతొ కూడిన చతుర్ది మాత్రమే సంకష్ట హర చతుర్తి చేయాలి కానీ పంచమి తో కూడిన చతుర్ది చేయకూడదు .
సంకష్ట హర చతుర్తి చేసేటప్పుడు ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి
మనం శుక్లపక్షం లో పూజ చెస్తునామ? లేదా బహుళ పక్షం లో పూజ చెస్తునామ ?
శుక్ల పక్షం లో పూజ చెసెవాలు , రాత్రి వరుకు ఉండనవసరం లేదు . శుక్ల పక్షం లో పూజ కూడా విశేషమే . ఉదయం పూజ చేసుకుంటే సరిపోతుంది .
ఏదయినా కామ్యం కోసం , ఆటంకాలు తొలిగిపొవలిని కోరుకునేవారు మాత్రం బహుళ పక్షం లో వచ్చే చతుర్ధి తిధి లో పూజ చెయడం వలన సంకటాలు తొలొగిపోతాయని శాస్త్రం చెపుతుంది .
బహుళ పక్షం లో వచ్చే చతుర్ది తిధి చేసే వరన్దికి గుర్తుపెట్టుకోవలిసినది తిధి నిర్ణయం . పూర్ణ తిధి వస్తే ఎ గొడవ లేదు , కానీ ఒక వేల అల కాక తిధి ద్వయాలు ఏర్పడినప్పుడు (నక్షత్రం , గ్రహాల తో ఏ సంబంధం లేదు ) పొతే చన్ద్రొదయనికి చవితి తిధి ఉంటె చాలు . రాత్రి కి చవితి తిధి ప్రారంబం అయితే తదియ తో కలిసినది కాబట్టి ఆ రోజే ( సంకష్ట హర చతుర్తి ) చేయాలి కానీ మరునాడు చేయకూడదు .
ఈ రోజు అంతా కూడాను కింది మంత్రం జపించటం వలన సంకటాలు అనీ తొలిగిపోతాయి .
ఇంకా చదవండి »
శుక్లాంబరధరం విష్ణుం
శశివర్ణం చతుర్భుజమ్ |
ప్రసన్నవదనం
ధ్యాయేత్సర్వవిఘ్నోపశాంతయేః ||
అభీప్సితార్థ సిధ్యర్థం
పూజితో యః సురాసురైః |
సర్వవిఘ్నహరస్తస్మై
గణాధిపతయే నమః ||
గణానామధిపశ్చండో
గజవక్త్రస్త్రిలోచనః |
ప్రసన్నో భవ మే నిత్యం
వరదాతర్వినాయక ||
సుముఖశ్చైకదంతశ్చ కపిలో
గజకర్ణకః |
లంబోదరశ్చ వికటో విఘ్ననాశో
వినాయకః ||
ధూమ్రకేతుర్గణాధ్యక్షో
ఫాలచంద్రో గజాననః |
ద్వాదశైతాని నామాని గణేశస్య
తు యః పఠేత్ ||
విద్యార్థీ లభతే విద్యాం
ధనార్థీ విపులం ధనమ్ |
ఇష్టకామం తు కామార్థీ
ధర్మార్థీ మోక్షమక్షయమ్ ||
విధ్యారంభే వివాహే చ
ప్రవేశే నిర్గమే తథా |
సంగ్రామే సంకటే చైవ
విఘ్నస్తస్య న జాయతే ||
|| ఇతి ముద్గలపురాణోక్తం
శ్రీగణేశద్వాదశనామస్తోత్రం సంపూర్ణమ్ ||
ఇంకా చదవండి »

శత్రు, దారిద్ర్యాది మహాకష్టములచే బాధింపబడువారికి, ఋణబాధలు ఉన్నవారికి, సంతానం లేనివారికి, భూమి, ఇల్లూ లేకపోవడం వంటి ఈతి బాధలు పడేవారికి, ధీర్ఘవ్యాధులచే పీడింపబడేవారికి, చదువు సారిగ్గా రాకపోవడం, ముందు సాగాకపోవడం లాంటి ఆటంకాలు ఎదురయ్యేవారు అనుభవించే
మానాసిక క్షోభ అంతా ఇంతా కాదు. భూలోకంలో కలియుగం మొదలై 5000 సంవత్సరములు గడిచిన తరువాత ఇట్టి క్లేశములు మనుష్యులను
ఎక్కువగా బాధిస్తాయి. ఈ విధంగా క్షోభ అనుభవించే వారి కష్టములను తీర్చే వ్రత
రాజమేదైనా ఉంటే చెప్పవలసిందిగా స్కందుని(కూమారస్వామిని) ఋషులందరూ అడిగారు.
"శ్రీలు సిద్ధించుటకు,
తక్షణ ఫలదాయిని అయిన సంకష్టహరచవితి అనే వ్రతం
మహాశ్రేష్టమైనది. ఇది వ్రతాలలోకేల్లా ఉత్తమమైనది. ధర్మరాజు అరణ్యవాస, అజ్ఞాతవాస మహాకష్టములను ఎదుర్కోన్నప్పుడు రాజ్యలాభము,
పూర్వవైభవము పొందు నిమిత్తము శ్రీ కృష్ణుని
ప్రేరణచే ఈ వ్రతాన్ని ఆచారించాడు. శ్రీ క్ర్ష్ణుడు ధర్మరాజుకు ఈ వ్రతం యొక్క
మహాత్యాన్ని వివరిస్తూ ఇది గణపతి స్వయంగా పార్వతీ దేవికి చెప్పినట్ట్లు, తాను ఆ వ్రతన్నే ఉపదేశిస్తున్నట్లు చెప్పాడు" అంటూ
కుమారస్వామి చెప్పగానే ఋషులు ఈ విధంగా అడిగారు.
"మహాసేనాధిపతి! లోకకల్యాణ
నిమిత్తం తన జనని అయిన పార్వతీ దేవికి గణపతి ఈ వ్రతాన్ని ఏ విధ్మగా చెప్పాడో,
ఆ విధానం మాకు కుడా తెలియజేయండి" అని
కోరారు.
" ఒకానొక కల్పంలో హిమవంతుని
కుమార్తే అయిన పార్వతి, సివుని పతిగా కోరి భక్తితో
తీవ్ర తపస్సు చేసినా, ఫలితం లేకపోవడంతో, పూర్వలీల రూపమున తనయందు జన్మించిన హేరంబ గణపతిని మనసులో
స్మరించింది.
స్మరణమాత్రానే తన ఎదుట
ప్రత్యక్షమైన గణేశుని చూసి "ఇతరులకు అసాధ్యమైన కఠోర తపస్సు చేసినా, సర్వజనవశంకరుడైన శంకరుని భర్తగా పొందటంలో జాప్యం జరగుతోంది.
ఇటువంటి ఆటంకాలు తొలగడానికి, స్వర్గాది లోకాల్లో నీకు
సంబంధించిన సంకటహరణం అనే వ్రతాన్ని ఆచరిస్తూంటారని నారద మహర్షి ద్వారా వినాను. ఆ
వ్రత విధానం వివరించి" అని కోరింది.
దానికి వినాయకుడు
"తల్లీ! గురు-శుక్ర మూఢాలేవి లేని శుభశ్రావణ బహుళ చవితినాడు సూర్యోదయానికి
ముందే నిద్ర లేచి, దృఢ సంకల్పంతో సంకష్టహర
చతుర్థి వ్రతం చేస్తాన్ని మొక్కుకుని, దంతధావనాధికాలు పూర్తి
చెసుకుని నల్లటి నువ్వులతో కూడిన నీటితో స్నానం చేసి, సంధావందనం మొదలైన నిత్యనైమిత్తికాలు ఆచరించి కల్పోక్త
ప్రకారం గణేశ పూజ నిర్వర్తించాలి.
ఉద్యాపన విధి :
బంగార, వెండి, రాగి లేదా మట్టితోనైనా నా
ప్రతిమ చేసి(లోభత్వం పనికిరాదు) నీటితో నింపి, ఎర్రని వస్త్రంతో చుట్టిన కలశంపై గాని, మంటపంపై అష్టదళపద్మం ఏర్పరిచి గాని నా ప్రతిమను ఉంచిం ప్రాణ
ప్రతిష్ట చేసి, విభూతి, గంధాక్షతలతో, పుష్పబిల్వాలతో,
గరికపోచలతో అర్చిచి, ధూపదీప నైవేధ్యాలు అర్పించి హారతి ఇవ్వాలి. శ్రావణ బహుళ
చతుర్థీ నాడు ఈ వ్రత ఉద్యాపన చేయాలి. పూజానంతరం హవనం(హోమం) చేయాలి. వ్రతం విధానం
బాగా తెలిసిన ఆచార్యునిచే పూజాది కార్యక్రమాలు నిర్వర్తింపజేయడం చాలా ఉత్తమం. ఈ
పూజపై చెప్పిన తిధిలో ఏడాదికొకసారైనా సరే చంద్రోద్య సమయంలో ఆచరించదగినది.
ఏ రాత్రి పురాణోత
వేదమంత్రాలతో కాలక్షేపం, దైవసంబంధిత నృత్యగీత
వ్ద్యాదులచే జాగరణం వేయాలి. మరునాడు యధాశక్తి21 మంది బ్రాహమ్ణులకు దానాదులు చేసి సంతృప్తి పరచాలి. వ్రతం
చేయించిన ఆచార్యునకు వస్త్ర. భూషణ,
ఛత్ర పాదుకాది సమస్త సంభారములు దక్షిణ సహితంగా
ఇవ్వాలి.
నాకు ప్రియమైన ఈ
వ్రతరాజాన్ని భక్తి స్రద్ధల్తో ఆచరించడం వల్ల నేను సంప్రీతి చెంది కోరికలను
తీర్చుతాను" అన్నాడు గణపతి. గణపతి ద్వారా విన్న
పార్వతీదేవి యధావిధిగా సంకష్టహర గణపతిని అర్చించి, ఈ వ్రత మహిమవల్ల 6 నెలలు తిరగకుండానే
ఇతర ప్రయత్నాలు అవసరం లేకుండానే శివుడిని భర్తగా పొందింది.
ఈ ప్రకారమే శ్రీ కృష్ణుడు
ధర్మరాజుకు ఉపదేశించడు. భారతంలో పాండవులకు విజయప్రాప్తి కలిగినదని మేకు తెలుసు
కదా! కనుక ఋషివరేణ్యులారా! లోకంలో సంకటాలు నశించడానికి, మనుష్య, యక్ష, రాక్షస, గంధరావాది సమస్త జాతులవారి
సర్వాభీష్టాలు తీరడానికి ఇంతకంటే సులభోపాయం లేదు" అని స్కందుడు ఋషులకు
తెలిపాడు.
"ఇంకా ఈ వ్రతం ఎవరెవరి వేత
ఆచరించబదింది?" అని ఋషులు అడుగగా,
" మహబలవంతుడైన వాలి, రావణునే తన చంకయందు ఇరికించుకుని బందీని చేయు సందర్భంలో
రావణుడు ఈ వ్రతం ఆచరించి సుఖంగా లంక చేరుకున్నాడు. హనుమతుడీ వ్రతప్రభాముచేత లంకలో
సీతమ్మవారి జాడ కనిపెట్టగలిగాడు.
అట్లే, మహారణ్యంలో భర్తను గానక, అలమటిస్తున్న దమయంతి సంకష్టహర గణపతిని సంకల్ప మాత్రాన
ప్రసన్నం చేసుకుని భర్త అయిన నలమహారాజును కలిసి సుఖంగా జీవించింది. అహల్యానాత కూడా
పతి శావపశాన భర్తకు దూరమై ఈ వ్రతాచరణ వల్ల తిర్గి భర్త అయిన గౌతమ మహర్షిని
చేరింది.
ఈ సంకష్టహర వ్రతం చేసి
పుత్రులు లేనివారు పుత్రలాభం, ధనం లేనివారు ధనలాభం,
విద్యలేనివారు విద్యాప్రాప్తి, వ్యాధిగ్రస్తులు ఆరోగ్యం పొంది సుఖంగా ఉండగలరు" అంటూ
కుమారస్వామి వివరించాడు.
కధా సేకరణ : శ్రీ గణేశ
పుస్తకం
ఇంకా చదవండి »

సప్త మోక్ష పురాలలో ఒకటైన
అవంతికాపురి(ఉజ్జయిని,మధ్యప్రదేశ్ లో ఉంది)లో నిత్యం
అగ్నిహోత్రాన్ని నిర్వహించేవాడు,సమస్త శాస్త్రకోవిదుడు,వేద స్వరూపుడైన భరద్వాజముని నివసిస్తుండేవారు.గంగా తీరానికి
వెళ్ళి 3 సంధ్యలలోనూ సంధ్యావందాం,అనుష్ఠానం మొదలైనవి నిర్వర్తించేవాడు.
ఒకనాడు భరద్వాజ మహర్షి
ఉషోదయాన అనుష్ఠానం నిర్వర్తించుకుని తిరిగి వస్తుండగా,గంగా తీరంలో విహారానికి వచ్చిన దేవలోకపు అప్సరస ఆతన
దృష్టిలో పడింది.ఆమె సౌందర్యం ఎంత మోహపరవశాన్ని కలిగించిందంటే మహతప్పశాలి,అపర శివావతారుడు అని పిలువబడే ఆ మహర్షిని విచలితుణ్ణి
చేసింది.
ఆ అప్సరస కారణంగా
భరద్వాజుడికి రేతస్సు(వీర్యము)పతనమై భూమిపైన పడింది.(స్వేదం(చెమట)పడిందని అని
కొందరు అంటారు.ఏది ఏమైనా కధ తెలుసుకోవడంలో ఇది అడ్డంకి కాకుడదు.)ఒక కారణజన్ముడు
జన్మించాలి కనుక,భూమాత దానిని
స్వీకరించింది.తద్వారా ఒక ఆజానుబాహుడు,ఎర్రని దేహకాంతి
కలవాడు,విశాలమైన నేత్రాలు గల
బాలకుడు ఉదయించాడు.
తన జన్మకు మహర్షి కారణమని
తెలియని ఆ బాలుడూ నిరంతరం తల్లిని తన తండ్రి ఎవరని వేధించేవాడు.తగిన సమయం
వచ్చినప్పుడు,తెలియజేయాలని అనుకున్న
భూదేవి మౌనంగా ఆ బాబుని పెంచసాగింది.
7 సంవత్సరముల వయసులో ఆ
బాలకుడిని తీసుకుని,భరద్వాజ మహర్షి వద్దకు
వెళ్ళిన భూదేవి "మహర్షీ!నీ కారణంగా ఈ బాలుడూ జన్మించినందున,ఇతడిన పుత్రుడుగా పరిగ్రహించు.చౌలము,ఉపనయనము మొదలైన సంస్కారాలు జరిపించి,అమోఘ విద్యాప్రాప్తి కలిగించు" అని ఆ కూమారుని
అప్పగించింది.
సాక్షాత్ భూదేవి తనకు
అప్పగించిన పుత్రుని వాత్సల్యంతో దగ్గరకు తీసుకున్నాడు భరద్వాజుడు.ఉపనయనాది
సంస్కారాలు యధావిధిగా జరిపించి,గణపతి మహామంత్రమును
ఉపదేశించాడు."నాయనా! ఈ గణేశ మంత్రాన్ని స్వామి ప్రీతికొరకు జపించి ఆయన
అనుగ్రహం పొంది,నీ జన్మ ధన్యం
చేసుకో!" అని చెప్పాడు.
తండ్రి ఆజ్ఞ ప్రకారం ఆ
బాలుడు నర్మదా నది తీరాన కఠొర తపస్సు చేశాడు.ఒకానొక మాఘమాసంలో కృష్ణపక్ష
చతుర్థీ(చవితి) దినానా చంద్రోదయ వేళలో "ఎవరి ఆజ్ఞ చేత బ్రహ్మ సృష్టి చేస్తాడో,ఎవరి ఆజ్ఞతో విష్ణువు స్థితికారకుడిగా రక్షిస్తాడో,ఎవరి ఆజ్ఞతోనే పరమశివుడు లయం చేస్తాడో,ఎవరి అనుగ్రహం వలన యోగులు,సిద్ధులు సిద్ధిని పొందారో,ఎవరు నిత్యం మూలాధారంలో స్థిరంగా ఉంటాడో,అట్టి పరబ్రహ్మ అయిన మాహా గణపతి" ఆ బాలునకు
దర్శనమిచ్చాడు.సర్వాభరణ భూషితుడైన గజానన మహారాజును ఆ బాలుడూ స్తూతించాక,గణపతి ప్రసన్నుడై "కుమారా!.........కోఠరమైన నీ
తపోదీక్షకు మెచ్చి నీకు వరం ఈయాదలచాను.ఏ వరం కావాలో కోరుకో" అన్నాడు.
"గణనాధా! నీ దర్శనమాత్రాన నా
జన్మ చరితార్ధమైంది.నాకు కోరికలు ప్రత్యేకంగా ఏమీ లేవు.నేనూ దేవతాగణలాలో ఒకడిగా
ఉండేలా అనుగ్రహించు.చాలు!"అన్నాడు ఆ బాలుడు.
"నీవు నిరపేక్షతో నన్ను
ప్రసనున్నుణ్ణి చేసుకునందుకు నీకు వారాలలో ఒక రోజుకు ఆధిపత్యం ఇస్తున్నా.నీకు
గ్రహాలలో స్థానం కల్పిస్తాను.నేటి నుంచి నీవు "మంగళుడు" అనే పేరుతో
ప్రసిద్ధుడవవుతావు.అనగా ప్రజలకు "మంగళాలను"(శుభాలను) కలిగించే
వాడవు.నీకు ఆధిపత్యం ఇచ్చిన రోజున నా "చవితి తిధి" ఏర్పడితే,ఇంకా ఎక్కువ పుణ్యఫలదాయకం అయ్యేలా
అనుగర్హిస్తున్నాను.భూదేవి పుత్రునిగా నీవు "కుజుడు"అనే పేరుతో
వ్యవహరించబడతావు" అని అనుగ్రహించాడు గణపతి.
అనంతరం దశభుజ గణపతిని,కుజుడు కామదాతృక్షేత్రంలో ప్రతిష్టించి తన పేరిట అంగారక
చవితి వ్రతాన్ని చేసినవారికి సర్వసౌఖ్యాలు ఓనగూడెలా దీవించమని విఘ్నరాజును
ప్రార్ధించాడు.చింతితమైన(కోరిన) అభీష్టాలను(కోరికలను)మణివలె ప్రసాదించేవాడైన ఈ
గణపతిని చింతామణి గణపతి అంటారు.నేటికి కామాదాతృ క్షేత్రంలో చంద్రోదయ సమయంలో
సిద్ధులు,యోగులు,గంధర్వులు గణపతిని సేవిస్తుంటారు.
ప్రణమ్య శిరసా దేవం
గౌరీపుత్రం వినాయకమ్ |
భక్తావాసం స్మరేనిత్యం
ఆయుష్కామార్థసిద్ధయే || 1 ||
ప్రథమం వక్రతుండం చ ఏకదంతం
ద్వితీయకమ్ |
తృతీయం కృష్ణపింగాక్షం
గజవక్త్రం చతుర్థకమ్ || 2 ||
లంబోదరం పంచమం చ షష్ఠం
వికటమేవ చ |
సప్తమం విఘ్నరాజేంద్రం
ధూమ్రవర్ణం తథాష్టమమ్ || 3 ||
నవమం భాలచంద్రం చ దశమం తు
వినాయకమ్ |
ఏకాదశం గణపతిం ద్వాదశం తు
గజాననమ్ || 4 ||
ద్వాదశైతాని నామాని
త్రిసంధ్యం యః పఠేన్నరః |
న చ విఘ్నభయం తస్య
సర్వసిద్ధికరః ప్రభుః || 5 ||
విద్యార్థీ లభతే విద్యాం
ధనార్థీ లభతే ధనమ్ |
పుత్రార్థీ లభతే
పుత్రాన్మోక్షార్థీ లభతే గతిమ్ || 6 ||
జపేద్గణపతిస్తోత్రం
షడ్భిర్మాసైః ఫలం లభేత్ |
సంవత్సరేణ సిద్ధిం చ లభతే
నాత్ర సంశయః || 7 ||
అష్టేభ్యో బ్రాహ్మణేభ్యశ్చ
లిఖిత్వా యః సమర్పయేత్ |
తస్య విద్యా భవేత్సర్వా
గణేశస్య ప్రసాదతః || 8 ||
ఇతి శ్రీ నారద పురాణే సంకట
నాశన గణేశ స్తోత్రం సంపూర్ణం ||
మహా గణపతి
అనుగ్రహప్రాప్తిరస్తు
సర్వే భవంతు సుఖినః
సర్వే సంతు నిరామయః
సర్వే భధ్రాణి పశ్యంతుః
సర్వే జనః సుఖినోభవంతుః
సమస్త సన్మంగళాని భవంతుః
ఓం శాంతిః శాంతిః శాంతిః
ఇంకా చదవండి »

ఓ బొజ్జగణపయ్య నీ బంటు
నేనయ్య ఉండ్రాళ్ళ మీదికి దండు పంపు
కమ్మనినేయుయు
కడుముద్దపప్పును బొజ్జవిరగ గదినుచు పొరలుకొనుచు - జయమంగళం నిత్య శుభమంగళం
వెండి పళ్ళెములో వేయివేల
ముత్యాలు కొండలుగ నీలములు కలయబోసి
మెండుగను హారములు మెడనిండ
వేసుకొని దండిగా నీకిత్తుఘనహారతి - జయమంగళం నిత్య శుభమంగళం
శ్రీ మూర్తి వ్యందునకు
చిన్మయానందునకు భాసురోతునకు శాశతునకు
సోమార్కనేత్రునకు
సుందరాకారునకు కామరూపునకు శ్రీగణనాథునకు - జయమంగళం నిత్య శుభమంగళం
ఏకదంతమును ఎల్లగజవదనంబు
బాగైన తొండంబు కడుపుగలుగు
బోడైన మూషికము
సొరదినెక్కాడుచు భవ్యముగ దేవగణపతికినిపుడు - జయమంగళం నిత్య శుభమంగళం
చెంగల్వ చామంతి చెలరేగి
గన్నేరు తామర తంగేడు తరచుగాను
పుష్పజాతూ దెచ్చి పూజింతు
నేనిపుడు బహుబుద్ధీ గణపతికి బాగుగాను - జయమంగళం నిత్య శుభమంగళం!!
ఇంకా చదవండి »

శుక్లాంబరధరం విష్ణుం
శశివర్ణం చతుర్భుజమ్
ప్రసన్నవదనమ్ ధ్యాయేత్సర్వ విఘ్నోపశాంతయే.
ప్రతి పూజకు ముందు ఈ శ్లోకాన్ని
మననం చేసుకుంటుంటాం. ఇందులో వినాయకుని తత్వం నిక్షిప్తమై ఉంది. ’శుక్లాంబరదరమ్’ అంటే తెల్లని ఆకాశం
అని అర్థం. తెలుపు సత్వ గుణానికి సంకేతం. ’శుక్లాంబరధరం
విష్ణుం’ అంటే సత్వగుణంతో నిండిన
ఆకాశాన్ని ధరించినవాడని అర్థం. ’శశివర్ణం’ అంటే చంద్రుని వలె కాలస్వరూపుడని అర్థం. ’చతుర్భుజం’ అంటే ధర్మ, అర్థ, కామ, మోక్షాలనే నాలుగు చేతులతో ప్రసన్నమైన శబ్ద బ్రహ్మమై
సృష్టిని పాలిస్తున్నవాడని అర్థం. సర్వవిఘ్నాలను పోగొట్టే విఘ్ననివారకునికి మనసారా
నమస్కరిస్తున్నానని ఈ శ్లోకం యొక్క అర్థం. విఘ్నాలను తొలగించి సత్వరఫలాన్ని,
శుభములనిచ్చే శుభదాయకుడు గణపతి. హిందువులు
జరుపుకునే సర్వశుభకార్యాలలోను విఘ్నేశ్వరుకే అగ్రపూజ.
దేహాన్ని ఆరోగ్యంగా
నిలుపుకుంటేనే ధర్మసాధన సాధ్యమవుతుంది. ఈ దృష్టితోనే విజ్ఞులైన మన పూర్వులు మన
ఆచారాలలో, సంప్రదాయాలలో ఆరోగ్య
సూత్రాలను ఇమిడ్చి, నియమాలను నిర్థారించారు. మన
పండుగలు, దైవారాధనలు ఆరోగ్యసూత్రాలతో
ముడిపడి ఉన్నాయన్నది నిజం. ఇందుకు వినాయకచవితి పూజ, ప్రప్రథమ ఉదాహ్రణమంటే అతిశయోక్తి కాదు.
వినాయకచవితి రోజున నూనెలేని
కుడుములను, ఉండ్రాళ్ళను నివేదించడం మన
సంప్రదాయం. వర్షఋతువు కారణంగా ఆరోగ్యభంగము కలుగకుండా
ఉండేందుకు, ఆవిరిపై ఉడికించినవాటిని
తినాలని చెప్పేందుకు ఉండ్రాళ్ళ నివేదన. ఆవిరిపై ఉడికినవి సులభంగా జీర్ణమై, పిత్త దోషాలను హరిస్తాయి. నువ్వులు, బెల్లంతో చలిమిడి తయారుచేసి గణపతికి నైవేద్యంగా
పెడతాము.నువ్వులు శ్వాసరోగాలను, అధికామ్లం, అజీర్తిని తొలగించి నేత్రరోగాలను రాకుండా చేస్తాయి. బెల్లం
జీర్ణశక్తిని కలిగించి, వాత, పిత్త దోషాలను పోగొడుతుంది. మన శరీరానికి ఆరోగ్యాన్ని ఇచ్చే
నవధాన్యాలను గమనించిన మన పెద్దలు, వినయకునికి తొమ్మిది(నవ)
రోజుల పండుగను ఏర్పాటు చేసి, రోజుకొక ధాన్యంతో
ప్రసాదాన్ని పంచే ఏర్పాటు చేసారు.
వినాయకపూజలో పిండివంటలకు,
ఫలాలకు ప్రాముఖ్యత ఉన్నప్పటికీ పత్రాలకు ఉన్న
ప్రాధాన్యత తక్కువేం కాదు. మన శరీర ఆరోగ్యపరిరక్షణకు కావలసిన పత్రాలు 21 అని గమనించిన మన పెద్దలు, ఏకవింశతిపత్రపూజ అని పత్రాలతోనే
వినాయకుని పూజించే పద్ధతిని ప్రవేశపెట్టారు. శ్రీహరి ఎత్తినవి (10) దశావతారాలైతే, శంకరుని రూపాలు
ఏకాదశ (11) కాబట్టి, శివకేశవ అబేధంతో, మొత్తం ఇరవై ఒక్క
పత్రాల్తో పూజ జరపాలని చెప్పారు. ఈ పత్రపూజ స్వామికి ప్రీతికరం.
ఈ 21 పత్రాలలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి…
1. మాచీపత్రం (Artemisia
vulgaris)
ఇది అన్ని ప్రాంతాలలో
లభిస్తుంది. ఆయుర్వేదం ప్రకారం ఇది నులిపురుగులను, కుష్ఠును, బొల్లి, దప్పికను పోగొడుతుంది. త్రిదోషాలను ఉపశమింపజేస్తుంది. ఈ
పత్రాలను కాసేపు కళ్ళపై పెట్టుకుని పడుకుంటే నేత్రదోషాలు తగ్గుతాయి. తలపై
పెట్టుకుంటే తలనొప్పులు మటుమాయమవుతాయి.. నరాలకు బలాన్నిస్తుంది. ఇది ఘాటైన వాసన
కలది కనుక, నాసికా పుటాలు శుభ్రపడతాయి.
దీని చూర్ణాన్ని నూనెలో కలిపి ఒంటికి రాస్తే మంచి సువాసన వస్తుంది.
2. బృహతీ పత్రం: వాకుడాకు:
నేలమూలిక (solanum surattense)
దీనిలో తెలుపు, నీలిరంగు పువ్వులు పూసే రెండు రకాలుంటాయి. ఇది కఫాన్ని,
వాతాన్ని తగ్గిస్తుంది. జ్వరం, శ్వాసశూల, గుండె జబ్బులను
అరికడుతుంది. మలబద్ధకం, మూలవ్యాధులు తగ్గుతాయి.
దీని రసాన్ని చర్మరోగాలకు పైపూతగా ఉపయోగిస్తారు. ఇది అన్ని ప్రాంతాలలో
దొరుకుతుంది.
3. బిల్వపత్రం: మారేడు పత్రం (Aegle
marmelos)
ఇది హిందువులకు అతి
పవిత్రమైనది . బిల్వపత్రాల రసాన్ని శరీరానికి రాసుకుని స్నానం చేస్తే, పొడ, దురద, గజ్జి వంటి రోగాలు నివారింపబడతాయి. దీని నుంచి వచ్చే గాలిని
శ్వాసిస్తే, శ్వాసకోశవ్యాధులు దరిచేరవు.
ఈ పత్రాలను నమిలి తింటే మధుమేహానికి మందులా పనిచేస్తుంది. దీనిని గాలిసోకని
ప్రాంతాలలో పెడితే పురుగు పుట్రా రావు. స్వచ్చమయిన గాలి కోసం మన పూర్వులు మారేడును
పెంచారు.
4. దూర్వాయుగ్మం: గరిక (cynodon
dactylon)
గరికకు వైద్యగుణాలున్నాయన్న
సంగతి చాలామందికి తెలియదు. చిన్న పిల్లలకు ముక్కునుండి రక్తం కారడాన్ని
అరికడుతుంది. మూత్రబంధానికి, రక్త పైత్యానికి
ఉపయోగపడుతుంది. దీనిని కషాయం చేసి తాగితే, క్రిములను
నశింపజేసి, చర్మ రోగాలను తగ్గిస్తుంది.
5. దత్తూర పత్రం ; ఉమ్మెత్త ; (Datura stramonium)
దీనిలో తెల్ల ఉమ్మెత్త,
నల్ల ఉమ్మెత్త అని రెండూ రకాలున్నాయి. ఉమ్మెత్త
పత్రాల రసం తేలుకాటు, ఎలుక కాటుల విషాన్ని
హరిస్తుంది. దీని పత్రాలు,కొమ్మలు, గింజలు, వేర్లు అన్నింటిలో ఔషధ
గుణాలున్నాయి. ఉమ్మెత్తరసాన్ని తలపై మర్ధన చేస్తే ఊడిపోయిన వెంట్రుకలు మళ్ళీ వచ్చే
అవకాశముంది. కీళ్ళనొప్పులకు, నువ్వుల నూనెను రాసి,
ఈ పత్రాలను ఐదారుసార్లు కడితే నొప్పులు తగ్గుతాయి.
6. బదరి పత్రం : రేగు ఆకు : zizyphus
jujuba)
దీని పత్రాలు కురుపులను
త్వరగా నయం చేస్తాయి. రోజు మద్యాహ్నం తరువాత రేగుపళ్ళను తింటే జీర్ణశక్తి
పెరుగుతుంది. ఈ పత్రం గాత్రశుద్ధికి మంచిది. ఎముకలకు బలాన్ని ఇస్తుంది. ఇంకా ఎన్నో
రోగాలకు ఇది మంచి ఔషధంగా పనిచేస్తుంది.
7. తులసీ పత్రం : (ocimum
sanctum)
ఇందులొ శ్వేత, కృష్ణ అని రెండు రకాలున్నాయి. ఈ పత్రాల రసం జ్వరం, జలుబు, దగ్గుఅల్ను తగ్గిస్తాయి.
క్రిమిరోగాల్తోపాటు నోటి దుర్వాసనను అరికడుతుంది. తులసీతీర్థం గొంతును
శుభ్రపరుస్తుంది….. మధుమేహం, గుండెపోటు, రక్తపోటువంటి వ్యాధులను
అరికడుతుంది. దీని గాలి సర్వరోగనివారిణి., మూత్రసంబంధమైన
వ్యాధులను, వాంతులను అరికడుతుంది.
8. అపామార్గ పత్రం : ఉత్తరేణి
పత్రం (Achyranthus aspera)
ఉత్తరేణి పుల్లతో పండ్లు
తోమడంవల్ల చిగుళ్ళవాపు, రక్తం కారడం తగ్గి, దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి.
భోజనం చేసిన తర్వాత వెంటనే
విరోచనమై, కడుపునొప్పితో బాధపడేవారు ఈ
పత్రాలను కడుపులోకి తీసుకుంటే మంచిది. కుష్టు, చర్మవ్యాధులను తగ్గిస్తుంది. కందిరీగలు, తేనేటీగలు, కుట్టినచోట ఈ పత్రాల
రసాన్ని తీసి, పూస్తే నొప్పి తగ్గుతుంది.
దీనిని దుబ్బెనచెట్టు అని కూడా అంటారు.
9. చూతపత్రం : మామిడి పతం (mangifera
indica)
లేత మామిడి పత్రాలను నూరి,
పెరుగులో కలిపి తింటే అతిసారవ్యాధి తగ్గుతుంది.
మామిడి పత్రాలు, లేత కాడలను నమిలితే
నోటిపూటలు, చిగుళ్ళ బాధలు త్వరగా
తగ్గుతాయి. మామిడికాయ రక్తదోషాన్ని హరిస్తుంది. శరీరానికి ఉష్ణాన్నిచ్చి పుష్టినిస్తుంది.
ఒరిసిన పాదాల కురుపులకు, మామిడి జీడి రసంతో పసుపును
కలిపి రాస్తే పుండు మానుతుంది. ఈ చెట్టు జిగురుతో ఉప్పు కలిపి వెచ్చబెట్టి,
కాళ్ళ పగుళ్ళకి రాస్తే, అమోఘంగా పని చేస్తుంది. దీని పత్రాలను శుభకార్యాలలో
తోరణాలుగా కడతాం.
10. కరవీరపత్రం : గన్నేరు
పత్రాలు (nerium indicum)
దీని పత్రాలు
కుష్టురోగాన్ని, దురదను తగ్గిస్తాయి. ఈ
ఆకుపసరు తలలోని చుండ్రును నివారిస్తుంది. దీని వేరుబెరడుని తీసి ఎంతకు మానని
పుండ్లకు పైన కట్టుగా కడతారు. తెల్లగన్నేరు, బిళ్ళగన్నేరు, ఎర్రగన్నేరు అంటూ
మూడు రకాలున్నాయి.
11. విష్ణుక్రాంతం : హరిపత్రం (Evolulus
alsinoides)
ఆయుర్వేదంలో ఈ పత్రాలను
జ్ఞాపకశక్తికి, నరాల అలహీనతకు వాడుతుంటారు.
వాతం, కఫాలను నివారిస్తుంది.
దంతాలను గట్టిపరుస్తుంది. క్రిములను, వ్రణాలను మటుమాయం
చెస్తుంది రకరకాల దగ్గులను తగ్గిస్తుంది. ఇది జ్వరనివారిణి.
12. దాడిమీ పత్రం : దానిమ్మ
పత్రం (punica granatum)
ఈ చెట్టులోని అన్ని భాగాలు
ఉపయోకరమైనవే. పత్రాలు, పళ్ళు, అతిసార, అజీర్ణ వ్యాధులను
అరికట్టడానికి వాడతారు. ఈ పండ్లను తింటే రక్తం శుద్ధి అవుతుంది. చర్మం
కాంతివంతమవుతుంది. ఇది వాతాన్ని,కఫాన్ని, పిత్తాన్ని హరిస్తుంది. హృదయనికి బలం చేకూరుస్తుంది.
13. దేవదారుపత్రం ;(sedris
diodaran)
దీని బెరడు కషాయం
శరీరవేడిని తగ్గిస్తుంది. వెక్కిళ్ళను తగ్గించడానికి ఉపయోగపడుతుంది.
14. మరువక వృక్షం ; మరువము:( originam marajOranaa)
దీని పత్రాల నుండి తీసిన
నూనెను కీళ్ళనొప్పులకు పైపూతగా వాడతారు. శ్వాసరోగాలు, హృద్రోగాలను తగ్గిస్తుంది. తేలు, జెర్రి మొదలైన విషపు పురుగులు కుట్టినపుడు మరువం
ఆకులరసాన్ని తీసి కడితేనొప్పి తగ్గుతుంది. ఇది దేహానికి చల్లదనాన్ని
చేకూరుస్తుంది. చెవిలోని చీమును, చెవిపోటును తగ్గిస్తుంది.
దీనిని పసుపుతో కలిపి రాస్తే గజ్జి, చిడుము మొదలైన
చర్మవ్యాధులు తగ్గిపోతాయి. ఇది విరివిగా దొరుకుతుంది.
15. సింధువార పత్రం : వావిలాకు
( vitex negundo)
దీని ఆకులను నీళ్ళలో వేసి
మరగకాచి బాలింతలకు స్నానం చేయిస్తే, వాతం రాకుండా
ఉండటమే కాకుండా ఒళ్ళునొప్పులు తగ్గడానికి ఉపయోగపడుతుంది. దీని ఆకులను నూరి తలకు
కట్టుకుంటే తలనొప్పి తగ్గుతుంది. చిగుళ్ళవాపు తగ్గేందుకు కూడ దీనిని ఉపయోగిస్తారు.
దీని ఆకుల కషాయం శూలి మొదలైన వ్యాధులను తగ్గిస్తుంది.
16. జాజి పత్రం (nax
maskaTaa)
ఇది అజీర్ణ నివారిణి. జాజి
ఆకులను తింటే శరీరానికి తేజస్సు వస్తుంది. కంఠస్వరం గంభీరంగా ఉంటుంది. నోటి
దుర్వాసన పోతుంది. దీనికి తులసికి ఉన్న గుణం ఉంది. దీనిని చాలామంది పెంచుతుంటారు.
17. గండకీ పత్రం : కామంచి (soalnum
nigrum)
దీనిని అడవిమల్లె అని కూడ
అంటారు. దీని ఆకులరసం మూర్చ రోగాన్ని తగ్గిస్తుంది ఈ ఆకులతో కఫం, వాతం, రక్తపైత్యం,విరేచనాలు అరికట్టబడతాయి. అధికమూత్రాన్ని తగ్గిస్తుంది.
18. శమీపత్రం : జమ్మి పత్రం (prosopis
spicigera)
దీని గాలి క్రిమిసంహారిణి.
వాయు సంబంధమైన రుగ్మతలను నాశనం చేస్తుంది. దీని ఆకులద్వారా మూలవ్యాధి, అతిసారం తగ్గుతాయి. ఈ ఆకులరసాన్ని తలకు రాసుకుంటే జుట్టు
నల్లబడుతుంది. ఈ ఆకు రసాన్ని పిప్పి పన్నులో పెడితే నొప్పి తగ్గి దంతం
రాలిపోతుంది.
19. అశ్వత్థ పత్రం : రావి ఆకు (ficus
religiosa)
ఈ చెట్టును త్రిమూర్తుల రూపంగా
పూజిస్తుంటారు దీని వేర్లు బ్రహ్మ, కాండం విష్ణువు, కొమ్మలు, ఆకులను శివరూపంగా భావించి
పూజిస్తారు. ఈ చెట్టు నీడను ఇవ్వడంతో పాటు మంచి కాలుష్యనివారిణిగా ఉపయోగపడుతుంది.
ఈ చెట్టునుంచి వచ్చేగాలి ఆరోగ్యానికి మంచిది.ఈ ఆకుల, చెక్కరసం విరేచనాలు, నోటి వ్యాధులను తగ్గిస్తుంది. రక్తస్రావాన్ని అరికడుతుంది.
ఈ చెట్టునీడ క్రింద కూర్చుంటే, చదివింది చక్కగా
ఒంటపడుతుందని మన పెద్దలు చెబుతుంటారు.
20. అర్జున పత్రం : మద్ది ఆకు (terminalia
arjuna)
ఇది వాత రోగాలను
పోగొడుతుంది. కఫాన్ని తగ్గిస్తుంది. ఆకుల రసం కురుపులను తగ్గిస్తుంది. దీని గింజలు
తైలాన్ని బెణుకులను తగ్గించేందుకు ఉపయోగిస్తారు. దీని తెల్ల మద్ది అని కూడ అంటారు.
21. అర్కపత్రం : జిల్లేడు పత్రం
(calotropis gigantia)
ఆయుర్వేదంలో దీనిని 64 రోగాలనివారిణిగా పేర్కొన్నారు. ఇది శరీరానికి వేడిని
తగ్గిస్తుంది. అందుకే దీనిని అర్కపత్రమని అన్నారు.దీని ఆకులను నూనెలో కాచి,
కీళ్ళకు రాస్తే కీళ్ళనొప్పులు తగ్గుతాయి. ఇది
పాము విషాన్ని కూడా హరిస్తుందని అంటారు. వాత, పక్షవాతం, కుష్ఠు, కఫం తదితర వ్యాధులకు మందుగా వాడుతుంటారు. దీని ద్వారా జలుబు
తగ్గుతుంది. జిల్లేడు పాలను పసుపుతో కలిపి ముఖానికి రాస్తే ముఖం కాంతివంతమవుతుంది.
ఇలా వినాయక పూజలో ఉపయోగించే
పత్రాల ద్వారా మన అనారోగ్య సమస్యలెన్నో తగ్గుతాయి. పత్ర పూజా విధానంలో ఎన్నో
వైజ్ఞానిక విశేషాలున్నాయి. ఉదాహరణకు వినాయకునికి వెలగపండును నైవేద్యంగా పెడతాము.
వెలగపండు గుజ్జును తేనెలోకలిపి తీసుకుంటే పైత్యం, వాంతులు తగ్గుతాయి
ఇంకా చదవండి »
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)










