-
విష్ణుషట్పదీ స్తోత్రం
నారాయణ నారాయణ జయ గోవింద హరే |నారాయణ నారాయణ జయ గోపాల హరే ||
-
శ్రీ రామ
ఆపదం అపహర్థారమ్ దాతారం సర్వ సంపదం, లోకాభి రామం శ్రీ రామం భూయో భూయో నమామ్యహమ్I
-
శ్రీ సీతామాత
త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ, హనుమాన్ యత్న మాస్తాయ దు:ఖ: క్షయ కరోభవ
-
ఓం నమ:శివాయ:
చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర పాహిమామ్ , చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర రక్షమామ్ I
-
శ్రీమాత్రే నమః
అమ్మల గన్న యమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాల పెద్దమ్మ, సురారులమ్మ కడుపారడి పుచ్చిన యమ్మ, తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ మాయమ్మ కృపాబ్ధి నిచ్చుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్
-
శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు
పురుషోవిష్ణు రిత్యుక్తః శివోనానామతః స్మృతః I అవ్యక్తం తు ఉమాదేవీ శ్రీర్వా పద్మ నిభేక్షణా I తత్ సంయోగా దహంకారః స చ సేనాపతిరుహః I
వైష్ణవం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే |
చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళమ్ || 1 ||
వేదవేదాంత వేద్యాయ మేఘశ్యామల మూర్తయే |
పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళమ్ || 2 ||
విశ్వామిత్రాంత రంగాయ మిథిలా నగరీ పతే |
భాగ్యానాం పరిపాకాయ భవ్యరూపాయ మంగళమ్ || 3 ||
పిత్రుభక్తాయ సతతం భాతృభిః సహ సీతయా |
నందితాఖిల లోకాయ రామభద్రాయ మంగళమ్ || 4 ||
త్యక్త సాకేత వాసాయ చిత్రకూట విహారిణే |
సేవ్యాయ సర్వయమినాం ధీరోదాత్తాయ మంగళమ్ || 5 ||
సౌమిత్రిణాచ జానక్యా చాప బాణాసి ధారిణే |
సంసేవ్యాయ సదా భక్త్యా స్వామినే మమ మంగళమ్ || 6 ||
దండకారణ్య వాసాయ ఖరదూషణ శత్రవే |
గృధ్ర రాజాయ భక్తాయ ముక్తి దాయాస్తు మంగళమ్ || 7 ||
సాదరం శబరీ దత్త ఫలమూల భిలాషిణే |
సౌలభ్య పరిపూర్ణాయ సత్యోద్రిక్తాయ మంగళమ్ || 8 ||
హనుంత్సమవేతాయ హరీశాభీష్ట దాయినే |
వాలి ప్రమధ నాయాస్తు మహాధీరాయ మంగళమ్ || 9 ||
శ్రీమతే రఘు వీరాయ సేతూల్లంఘిత సింధవే |
జితరాక్షస రాజాయ రణధీరాయ మంగళమ్ || 10 ||
విభీషణ కృతే ప్రీత్యా లంకాభీష్ట ప్రదాయినే |
సర్వలోక శరణ్యాయ శ్రీరాఘవాయ మంగళమ్ || 11 ||
ఆగత్య నగరీం దివ్యామభిషిక్తాయ సీతయా |
రాజాధి రాజ రాజాయ రామభద్రాయ మంగళమ్ || 12 ||
భ్రహ్మాది దేవసేవ్యాయ భ్రహ్మణ్యాయ మహాత్మనే |
జానకీ ప్రాణ నాథాయ రఘునాథాయ మంగళమ్ || 13 ||
శ్రీసౌమ్య జామాతృమునేః కృపయాస్మాను పేయుషే |
మహతే మమ నాథాయ రఘునాథాయ మంగళమ్ || 14 ||
మంగళాశాసన పరైర్మదాచార్య పురోగమై |
సర్వైశ్చ పూర్వైరాచార్ర్యైః సత్కృతాయాస్తు మంగళమ్ || 15 ||
రమ్యజా మాతృ మునినా మంగళా శాసనం కృతమ్ |
త్రైలోక్యాధిపతిః శ్రీమాన్ కరోతు మంగళం సదా ||
ఇంకా చదవండి »
తైత్తిరీయ అరణ్యకంలో చెప్ప
బడిన నారాయణ సూక్తంలో ఈ స్థూల శరీరంలో ఆ పరమాత్ముని చిరునామా, ఆయన ధ్యానించే పధ్ధతి విస్పష్టంగా చెప్పబడింది. నారాయణ
సూక్తం పురుష సూక్తానికి ఉత్తర పీఠిక లాంటింది. పురుష సూక్తంలోని విశ్వవ్యాప్తమైన
పరబ్రహ్మ స్వరూపాన్ని నారాయణ సూక్తం నారాయణుని రూపంలో విశదీకరిస్తుంది. ఆ
విశ్వమంతటా ఉన్నవాడిని అణురూపంలో విశ్లేషించి చెపుతుంది. వైదిక విధులలో పురుష
సూక్తము, నారాయణ సూక్తము, మంత్ర పుష్పము కలిపి చదవటం ఆనవాయితీ.
ధ్యానము చేయటానికి ముందు ఈ
సూక్తాన్ని పారాయణ చేసి దీని భావాన్ని చింతన చేస్తూ ఉండటం ప్రగాఢ ధ్యానానికి దోహదం
చేస్తుందిట. ఇందులో మొదట భగవంతుని మహిమ తెలుప బడినది. పిదప ఆయనను ఎక్కడ, ఎలా ధ్యానిన్చాలో, క్రమంగా ధ్యానంలో
మనస్సును ఎలా లగ్నం చేయాలో అన్న విషయం ఈ సూక్తంలో అద్భుత రీతిలో వివరించబడింది.
నారాయణ సూక్తం, తాత్పర్యము, శ్రవణం
విశ్వం నారాయణం దేవం
అథ శ్రీ నారాయణ సూక్తం
ఓం | సహస్ర శీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువం |
విశ్వం నారాయణం దేవం అక్షరం
పరమం పదం ||
విశ్వతః పరమాన్నిత్యం
విశ్వం నారాయణగ్ం హరిం |
విశ్వ మేవేదం
పురుషస్తద్విశ్వముపజీవతి ||
పతిం విశ్వస్య ఆత్మేశ్వరగ్ం
శాశ్వతగ్ం శివమచ్యుతం |
నారాయణం మహాజ్ఞేయం
విశ్వాత్మానం పరాయణం ||
నారాయణ పరో జ్యోతిరాత్మా
నారాయణః పరః |
నారాయణ పరం బ్రహ్మ తత్త్వం
నారాయణః పరః |
నారాయణ పరో ధ్యాతా ధ్యానం
నారాయణః పరః ||
యచ్చ కించిత్ జగత్సర్వం
దృశ్యతే శ్రూయతేఽపి వా |
అంతర్బహిశ్చ తత్సర్వం
వ్యాప్య నారాయణః స్థితః ||
అనంతమవ్యయం కవిగ్ం
సముద్రేఽన్తం విశ్వ శంభువం |
పద్మ కోశ ప్రతీకాశగ్ం హృదయం
చాప్యధోముఖం ||
అధో నిష్ఠ్యా వితస్త్యాన్తే
నాభ్యా ముపరి తిష్ఠతి |
జ్వాలామాలాకులం భాతీ
విశ్వస్యాఽయతనం మహత్ ||
సంతతగ్ం శిలాభిస్తు లంబత్యా
కోశసన్నిభం |
తస్యాన్తే సుషిరగ్ం
సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం ||
తస్య మధ్యే
మహానగ్నిర్విశ్వార్చిర్విశ్వతో ముఖః |
సోఽగ్రభుగ్విభజన్
తిష్ఠన్నాహార మజరః కవిః ||
తిర్యగూర్ధ్వమధశ్శాయీ రశ్మయ
స్తస్య సంతతా |
సంతాపయతి స్వం దేహమాపాదతల
మస్తకః |
తస్య మధ్యే వహ్నిశిఖా
అణీయోర్ధ్వా వ్యవస్థితాః ||
నీలతో యదమధ్యస్థ
ద్విద్యుల్లేఖేవ భాస్వరా |
నీవారశూకవత్తన్వీ పీతాభా
స్వత్యణూపమా ||
తస్యాః శిఖాయా మధ్యే
పరమాత్మా వ్యవస్థితః |
స బ్రహ్మ స శివః స హరిః
స్సేన్ద్ర స్సోఽక్షరః పరమ స్స్వరాట్ ||
ఓం తద్బ్రహ్మ | ఓం తద్వాయుః | ఓం తదాత్మా |
ఓం తత్సత్యం | ఓం తత్సర్వం | ఓం తత్పురోర్నమః |
అంతశ్చరతి భూతేషు గుహాయాం
విశ్వమూర్తిషు |
త్వం యజ్ఞస్త్వం
వషట్కారస్త్వమింద్రస్త్వగ్ం
రుద్రస్త్వం విష్ణుస్త్వం
బ్రహ్మత్వం ప్రజాపతిః |
త్వం తదాప ఆపో జ్యోతి
రసోఽమృతం బ్రహ్మ భూర్భువస్సువరోమ్ |
ఓం నారాయణాయ విద్మహే
వాసుదేవాయ ధీమహి |
తన్నో విష్ణుః ప్రచోదయాత్ ||
తాత్పర్యము:
వేలాది తలలు కలవాడు,
ప్రకాశిస్తున్న వాడు, సమస్తాన్ని చూస్తున్న వాడు, యావత్ప్రపంచానికీ మంగళకారుడు, నాశనము లేని వాడు, అత్యున్నత స్థితి
అయిన వాడు అయిన నారాయణుడనే దైవాన్ని ధ్యానిస్తాను.
ఈ విశ్వాని కన్నా ఉన్నతుడు,
నిత్యుడు, ఈ విశ్వమై ఉంటున్న వాడు, భక్తుల కష్టాలను బాపు వాడు అయిన నారాయణుని ధ్యానిస్తాను.
విశ్వానికి నాథుడు, జీవులకు ఈశ్వరుడు, శాశ్వతుడు, మంగళ రూపుడు, వినాశము లేని వాడు,
విశిష్టముగా తెలుసుకోవలసిన వాడు, సమస్తానికి ఆత్మయైన వాడు, శరణు పొందదగిన ఉత్క్రుష్టుడు అయిన నారాయణుని
ధ్యానిస్తున్నాను.
నారాయణుడే పరంజ్యోతి,
నారాయణుడే పరమాత్మ, నారాయణుడే పరబ్రహ్మం, నారాయణుడే పరతత్త్వము, ధ్యానించే వారిలో శ్రేష్ఠుడు నారాయణుడే. నారాయణుడే
ఉత్ర్క్రుష్టమైన ధ్యానం.
ఈ ప్రపంచం అంతటా కనిపిస్తూ
ఉన్నది ఏదైనా, వినిపిస్తూ ఉన్నది ఏదైనా,
వాటన్నిట లోపల వెలుపల పరివ్యాపించి నారాయణుడే
నెలకొని ఉన్నాడు.
(ఇది ధ్యానం తదుపరి మెట్టు.
మొదట మనస్సు సర్వవ్యాపియైన భగవంతుని స్మరించడంలో నిమగ్నం అయింది. ఇప్పుడు దాని
పరిధి సంకోచింప బడింది. వ్యాపితమైన మనస్సు మనలో ఒకటిగా కలిసిపోయింది. ధ్యానం తుది
మెట్టు మనస్సు హృదయ సీమలో కేంద్రీకృతం కావడం).
అనంతుడు, అవినాశుడు, సర్వజ్ఞుడు, సంసార సాగర అంతాన ఉండే వాడు, ప్రపంచం మొత్తానికీ మంగళ కారుడు అయిన నారాయణుని అదోముఖమైన
తామర మొగ్గలా ఉన్న హృదయంలో ధ్యానిస్తాను.
(సముద్రే అంతం అనే పదం ఇక్కడ
గమనించ దగినది - సంసార సాగరాంతన భగవంతుడు
ఉన్నట్లుగా తెలుపబడింది. కోరికలు భావోద్వేగాలు అనే అలలతో అల్లకల్లోలమైన జీవితమే
సంసార సాగరంగా పేర్కొన బడింది. ఈ అలలు ఉధృతమై ఉన్నంత వరకు ధ్యానం మూలంగా భగవంతుని
దరి చేరలేము. మనస్సు ప్రశాంత మైనప్పుడే ధ్యానము కుదురుతుంది).
అధో నిష్ట్యా....అనే
మంత్రములో హృదయం గురించి చెప్పబడింది. లబ్ డబ్ అని కొట్టుకునే భౌతిక హృదయం కాదు
ఇది. ఇది పారమార్థిక హృదయం. దీనికి మూడు లక్షణాలు. ఒకటి, నాభికి జానెడు దూరంలో ఉండి. భౌతిక హృదయము కూడా అంటే దూరంలో
ఉండి కాని అది కాస్త ఎడమ వైపు ఉంది. కానీ, ఆధ్యాత్మిక హృదయం
మధ్యలో ఉంది. రెండవది, దీపశిఖల వరుసతో ఆవృతమై
ఉంది. మూడవది, ఆ హృదయం దేదీప్యమానమైనది. ఈ
మూడు లక్షణములు భౌతిక హృదయానికి వర్తించవు. కానీ దీనిని మనము గ్రహించకున్నాము.
గ్రహించకున్నప్పటికీ అది అక్కడ ఉండనే ఉంది.
తామర మొగ్గ వంటి ఈ హృదయం
నలువంకల నాడులతో ఆవృతమై వ్రేలాడుచున్నది. దాని లోపల సూక్ష్మాకాశము ఉన్నది. అంతా
దానిలో నెలకొని ఉన్నది.
సర్వత్రా ప్రకాశిస్తూ,
అన్ని దిశలా వ్యాపిస్తున్న మహోన్నతమైన అగ్ని
ఆకాశానికి నడుమన ఉన్నది. ప్రాణం అయిన ఆ అగ్ని మొట్టమొదట భుజించేదిగాను, ఆహారాన్ని విభజించి ఇచ్చేదిగాను, దృఢమైనది గాను, పాతపడనిది గాను,
అన్నింటినీ చూసేదిగాను ఉంది.
ఆ ప్రాణం యొక్క కిరణాలు
అడ్డదిడ్డంగా, ఊర్ధ్వంగా, అధోముఖంగా ప్రసరిస్తూ, సర్వత్రా వ్యాపించి ఉన్నాయి, పాదం నుండి తల వరకు తన శరీరాన్ని వెచ్చగా ఉండేట్లు
చేస్తుంది. దీని మధ్య అణుప్రమాణమైన అగ్ని జ్వాల ఊర్ధ్వ ముఖంగా అమరి ఉంది.
కారు మేఘం మధ్యనుండి
వెలుగును విరజిమ్మే మెరపు తీగలా, వరి మొలకలా, సన్నమైనదిగా, బంగారు చాయగాను,
అనువులా సూక్ష్మమైనదిగాను ఆ ఆత్మ ప్రకాశిస్తూ
ఉంది.
ఆ అగ్నిశిఖ మధ్యన పరమాత్మ
సుప్రతిష్ఠుడై ఉన్నాడు. ఆయనే బ్రహ్మ,
శివుడు, విష్ణువు. ఆయనే
ఇంద్రుడు. ఆయన నాశనము లేని వాడు, స్వప్రకాశుడు. ఆయన కంటే
అధికుడు ఎవరూ లేని వాడు.
కానవచ్చే వస్తుజాతాన్ని
అందంగాను, దృశ్యానికి ఆధారం గాను ఉన్న
భగవంతుని ప్రతి శరీరం అంతటా నిండిఉన్న వాణ్ణి, నల్లని మేను విష్ణువు తెల్లని మేని శివుడు ఒకరుగా
మిశ్రితమైన రూపాన్ని, పూర్ణ పవిత్రుని, త్రినేత్రుని, సమస్తాన్ని తన
స్వరూపంగా పరిగ్రహించిన వానిని పదే పదే నమస్కరిస్తున్నాను.
నారాయణుని తెలుసుకుందాము.
అందుకోసం ఆ వాసుదేవుని ధ్యానిద్దాము. ఆ విష్ణువు మనలను ఈ ధ్యాన ప్రయత్నములో
ప్రేరేపించు గాక!
ఓం శాంతి శాంతి శాంతి
ఇంకా చదవండి »

హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి
వాదినం
నరం ముంచంతి పాపాని దరిద్ర
మివయోషితః
హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి
యోవదేత్
తస్య నిస్సరతే వాణీ జహ్న
కన్యా ప్రవాహవత్
హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి
యో ధ్వనిః
విశోభతేచ వైకుంఠ
కవాటోద్ఘాటన ధ్వనిః!!
ఫలశ్రుతిః
శ్లోకత్రయమిదం దివ్యం
హయగ్రీవ పదాంకితం
వాదిరాజయతి ప్రోక్తం పఠతాం
సంపదప్రదం!!
హయగ్రీవ హయగ్రీవ అనే
శబ్దాన్ని పలికితే చాలు అట్టి మానవుని పాపాలన్నీ తొలగి అతని దరిద్రం తొలగుతుంది. హయగ్రీవ హయగ్రీవ అని
పలికితే చాలు నిస్సందేహంగా గంగాదేవి ప్రవాహంలా చువు వస్తుంది. అంటే సర్వవిద్యలూ
వస్తాయన్నమాట. హయగ్రీవ హయగ్రీవ అనే
ధ్వనిని వింటే చాలు వైకుంఠంయొక్క తలుపులు తెరుచుకుంటాయి. అంటే వైకుంఠలోక ప్రాప్తి
కలుగుతుంది. హయగ్రీవుని పదములతో
మిళితమైన ఈ మూడు శ్లోకములు దివ్యమైనవి. ఎవరైతే వాటిని స్మరిస్తారో వారికి సంపదలు
కలుగుతాయి.
బ్రహ్మదేవుని దివ్య
వరప్రభావంతో బలగర్వితుడైన రాక్షసుడు హయగ్రీవుడు. సాధుసజ్జన హింసతో తన రాక్షస
నైజాన్ని రోజురోజుకూ రెట్టింపు చేస్తున్న సమయంలో దేవతలంతా త్రిశక్తులను, త్రిమూర్తులను శరణువేడారు. ఆ సమయంలో మహావిష్ణువు యోగనిద్రలో
ఉన్నాడు. అదీ ఓ రాక్షస సంహారానంతరం ఓ వింటిపై తలవాల్చి. దేవతలు నిద్రలేపగా
హడావుడిగా లేచిన ఆయన తలకు వింటినారి తగిలి తెగిపడిపోయింది. దేవతలంతా జరిగిన దానికి
చింతిస్తుండగా బ్రహ్మదేవుని సలహాపై ఓ అశ్వంతలను విష్ణువు శరీరానికి అతికిస్తారు.
అశ్వాన్ని సంస్కృతంలో ’హయం’ అంటారు. అందువల్ల విష్ణుమూర్తి హయగ్రీవునిగా ఖ్యాతిగాంచాడు.
ఆయన దేవతలకు అభయం ఇచ్చి హయగ్రీవుని హతమార్చాడు. అయితే ఆయన ఆ సమయంలో ఎంతో
ఉగ్రత్వంతో ఉండగా, ఆయనను శాంతింపజేయడానికి
పార్వతీదేవి వచ్చింది. ఆమె "హయగ్రీవా! నిన్ను ఆరాధించిన వారికి సర్వవిద్యలూ
కరతలామలకం కాగలవు." అని ఆయనకు ఓదివ్యశక్తిని ప్రసాదించింది. దాంతో ఆయన
ఆగ్రహంనుండి పూర్తిగా ఉపశమనం పొందాడు. పిల్లలు మారాం చేస్తుంటే వారికి ఏదోలా
నచ్చజెప్పినట్లే స్వామివారి ఆగ్రహాన్ని ఉపశమింపజేయడానికి సాక్షాత్తూ ఆ ఆదిపరాశక్తి
రూపాంశయైన పార్వతీదేవి ఈ విద్యాశక్తి స్వామివారిి అందించిందన్నమాట. అష్టకష్టాలు
పెట్టిన రాక్షసుని ఎలా సంహరించాలో తెలియక తల్లడిల్లిన ముక్కోటి దేవతలను ఊరడించి
స్వామివారు తనదైన బాణిలో ఆ అసురుని సంహరించడం అత్యంత విజ్ఞానదాయకమైన అంశం. సమస్య
పరిష్కారం కావడమంటే అది జ్ఞానానికి ప్రతీకయే కదా! అలా జ్ఞానానికి ప్రతీకగా
ప్రాదుర్భవించిన హయగ్రీవమూర్తి స్తుతి చేసినవారికి సర్వవిద్యాబుద్ధులూ
లభిస్తాయన్నమాట.
విద్య ఉన్నచోట అడగకుండానే
అష్టలక్ష్ములూ కొలువై ఉంటారు. అంటే మానవజీవితానికి సర్వసుఖాలు అందినట్లే.
హయగ్రీవుడు ఆవిర్భవించిన శ్రావణ పౌర్ణమినాడైనా హయగ్రీవ స్తుతిని చేసిన వారికి
జ్ఞానం, సకల సంపదలు చేరువ అవుతాయి.
పిల్లలు నిత్యం హయగ్రీవ స్తుతి చేస్తుంటే ఇక వారికి విద్యలో ఎదురుండదు. చక్కని
సత్ఫలితాలు తథ్యం.
మంత్రశాస్త్రం ఏం
చెబుతోందంటే...ఉపాసనాపరంగా మానవ, జంతు ఆకృతులు కలగలిసిన
దేవతలు శీఘ్ర అనుగ్రహప్రదాతలు. అటువంటి దైవాల్లో శ్రీ హయగ్రీవ స్వామివారు ఒకరు.
హయగ్రీవుని భక్తి శ్రద్ధలతో ఉపాసించిన వారికి సర్వవిద్యలూ కరలామలకమవడమే కాక,
సర్వ సంపదలు లభించడం తథ్యం.
విశుద్ధ విజ్ఞాన ఘన
స్వరూపం! విజ్ఞాన విశ్రాణన బద్ధదీక్షమ్!
దయానిధిం దేవభృతాం శరణ్యం!
దేవం హయగ్రీవమహం ప్రపద్యే!!
ఇంకా చదవండి »
తెల్లని అశ్వశిరస్సుతో
మానవాకారం కలిగి ఉన్న శ్రీ మహావిష్ణువు దివ్యస్వరూపమే హయగ్రీవ భగవానుడు. ఈ దేవుడు
జ్ఞానామృతాన్ని ప్రబోధిస్తూ భక్తులను అనుగ్రహించేందుకు తెల్లని పద్మంలో ఆసీనుడై
ఉండి ధవళ వస్త్రాలు ధరించి జ్ఞాన సముపార్జన చేయనెంచిన సాధకులకు వైష్ణవ సంప్రదాయంలో
ప్రధాన దైవంగా భాసిల్లుతున్నాడు. శ్రావణ పూర్ణిమనాడు శరన్నవరాత్రి ఉత్సవాల్లో
తొమ్మిదవ దినమైన మహార్నవమి పర్వదినంనాడు ఈ దేవునికి భక్తులు విశేష పూజలర్పిస్తారు.
హయగ్రీవ భగవానుడు పద్మదళముల
వంటి నాలుగు సున్నితమైన హస్తాలు కలిగి ఉండి ఒక చేతిని జ్ఞాన ప్రబోధాత్మకంగాను,
రెండవ హస్తంలో జ్ఞానాంతర్గతమైన గ్రంథాలను ధరించి
వుండి, మూడు, నాలుగు చేతులలో శంఖ, చక్రాలు ధారణ చేస్తూ అనుగ్రహ ముద్రలో ఉంటాడు. హయగ్రీవుడు
సూర్యభగవానుణ్ణి అంతరిక్షంవైపు ప్రబోధన చేస్తూ లోకాలను తమస్సు నుండి రక్షించేందుకు
తోడ్పడతాడని తెలుస్తోంది.
శ్రీ మహావిష్ణువు రాక్షస
సంహారం చేసి యుద్ధ్భూమి నుంచి వైకుంఠానికి తిరిగి వచ్చినప్పటి బృహత్ స్వరూపంగా
మహాభారతం హయగ్రీవుని స్తుతిస్తుంది. జ్ఞానముద్రలోని రూపాన్ని యోగ హయగ్రీవుడుగా
విజ్ఞులు సంభావిస్తారు. లక్ష్మీఅమ్మవారితో కూడి ఉన్నప్పుడు లక్ష్మీహయగ్రీవుడుగా
స్వామి పిలువబడుతున్నాడు. శాక్తేయ సంప్రదాయంలో హయగ్రీవుని గురించిన ఓ విశేష కథ
వ్యాప్తిలో ఉంది.
గుర్రపుతల కలిగి ఉన్న హయగ్రీవుడును రాక్షసుడు కశ్యప ప్రజాపతి
కుమారుడు. తనకు చావులేకుండా, ఒకవేళ చావంటూ వస్తే మరో
హయగ్రీవుని చేతిలోనే అది జరగాలని దుర్గామాత నుంచి వరం పొందుతాడు. దివ్యవర
గర్వితులయిన అందరు రాక్షసుల వలెనే హయగ్రీవ రాక్షసుడు కూడా దేవతలను బాధింప
జొచ్చాడు. విసిగి వేసారిన దేవతలు వైకుంఠానికేగి తమను రక్షింపవలసిందిగా
విష్ణుదేవునితో మొర పెట్టుకుంటారు. దుర్గామాత వరప్రసాది అయిన ఆ రాక్షసుని శ్రీ
మహావిష్ణువు కూడా నిర్జించలేని పరిస్థితి. ఆయన తన ఓజస్సును పెంపొందించుకొనే
ప్రయత్నంలో ధ్యానమగ్నుడవుతాడు. అల్లెత్రాడు దృఢంగా బిగించి ఉన్న ఒక వింటిని ఆసరా
చేసుకుని ధ్యానముద్రలో ఉన్న శ్రీ మహావిష్ణువుకు తమగోడు వినిపించే ప్రయత్నంలో
భాగంగా ఆయన్ను మేల్కొలిపేందుకు ఒక కీటకాల గుంపును దేవతలు ప్రేరేపించగా వాటి
ప్రమేయంతో చుటుక్కున తెగిన వింటిత్రాటి శక్తికి విష్ణుదేవుని తల త్రెగి పడిందట! ఈ
హఠాత్పరిణామానికి ఖంగుతిన్న దేవతలు దుర్గామాతను ఆశ్రయించగా ఆమె భయంలేదనే, ఒకానొక శ్వేత అశ్వపు శిరస్సును తెచ్చి స్వామి కంఠానికి
అతికించమనీ, హయాననుడుకు విష్ణుమూర్తి
చేతిలో హయగ్రీవ రాక్షసుడు నిర్జించ బడతాడనీ చెప్పగా బ్రహ్మ, శ్రీమహావిష్ణువు కంఠానికి అశ్వశిరస్సును అతికిస్తాడు.
హయాననుడుగా మారిన మహావిష్ణువు చేతిలో హయగ్రీవ రాక్షసుడు నిర్జింపబడిన గాధ ఇది.
గాయత్రి మహామంత్రంలోని 24 అక్షరాలు ఇరవై నలుగురు దేవతల బీజాక్షరాలు కాగా, ‘ద’ అక్షరం హయగ్రీవస్వామి
బీజాక్షరం! ఉత్సాహం, శక్తి సామర్థ్యాలు, శత్రువులపై అంతిమ విజయానికి హయగ్రీవ భగవానుడు అనుగ్రహ
ప్రేరణ యిస్తాడు. బాహ్యా శత్రువులతోపాటు అంతఃశత్రువులయిన అరిషడ్వర్గాలను శమింపజేసే
దివ్యానుగ్రహశక్తి హయగ్రీవ భగవానుని నుండి భక్తులకు లభిస్తుంది. హయగ్రీవుని
ధవళకాంతుల శిరస్సు, సూర్యభగవానుని ఏకచక్ర
రథాన్ని లాగేప్పుడు దవళాశ్వాలకు శక్తి ప్రదానం చేస్తుందట! అశ్వజాతిలో ధవళాశ్వాలు
అరుదుగా ఉంటాయి.
అరుదైన శే్వతాశ్వ శిరస్సుతో
విష్ణువు హయాగ్రీవుడుగా భక్తులకు నూతన శక్తి అనుగ్రహించి, కార్యోన్ముఖులను చేసి కర్మసాఫల్యానికి తోడ్పడుతాడని
ప్రతీతి.
ఇంకా చదవండి »

శంకరులు రచించిన కృష్ణుని అష్టకద్వయంలో రెండోది ఈ
కృష్ణాష్టకం. ఈ ద్వయంలో మొదటి శ్రీకృష్ణాష్టకంతో పోలిస్తే ఇది వ్యాకరణపరంగా
కఠినమైనది. ఆధ్యాత్మికంగా లోతైనది. ధ్యానరూపంలో శ్రీకృష్ణుని స్తుతించేది ఈ
అష్టకం. అపార కరుణాంబుధి, ప్రణత ఆర్తిహరుడు, ఆశ్రిత
వాత్సల్యైక మహోదధి అయిన శ్రీ కృష్ణుండు నా ఈ భౌతిక చక్షువులకు కనిపించుమని శంకరులు
వేడుకునే స్తోత్రము ఇది. దీనికి పూర్వ పీఠిక శంకరుల తల్లి ఆర్యాంబ మరణము, ముక్తి.
వేదములలో నుతించబడిన లక్షణములన్ని కలిగినవాడు, సనాతనుడు,
సర్వ జనులకు ఆత్మయైనవాడు అయిన విష్ణువు, ఆదిశంకరులచే
తన తల్లి ముక్తి కొరకు ఈ విధంగా పొగడబడినప్పుడు, లక్ష్మీసమేతుడై
శంఖము, చక్రము, గదతో కూడి ఆ యతి ముంగిట ప్రత్యక్షమై
ఆర్యాంబకు ముక్తి ప్రసాదించాడు.
శ్రియాశ్లిష్టో విష్ణుః స్థిరచరగురుర్వేదవిషయో
ధియాం సాక్షీ శుద్ధో హరిరసురహంతాబ్జనయనః
గదీ శంఖీ చక్రీ విమలవనమాలీ స్థిరరుచిః
శరణ్యో లోకేశో మమ భవతు కృష్ణోఽక్షివిషయః 1
యతః సర్వం జాతం వియదనిలముఖ్యం జగదిదం
స్థితౌ నిఃశేషం యోఽవతి నిజసుఖాంశేన మధుహా
లయే సర్వం స్వస్మిన్హరతి కలయా యస్తు స విభుః
శరణ్యో లోకేశో మమ భవతు కృష్ణోఽక్షివిషయః 2
అసూనాయమ్యాదౌ యమనియమముఖ్యైః సుకరణై
ర్ర్నిరుద్ధ్యేదం చిత్తం హృది విలయమానీయ సకలం
యమీడ్యం పశ్యంతి ప్రవరమతయో మాయినమసౌ
శరణ్యో లోకేశో మమ భవతు కృష్ణోఽక్షివిషయః 3
పృథివ్యాం తిష్ఠన్యో యమయతి మహీం వేద న ధరా
యమిత్యాదౌ వేదో వదతి జగతామీశమమలం
నియంతారం ధ్యేయం మునిసురనృణాం మోక్షదమసౌ
శరణ్యో లోకేశో మమ భవతు కృష్ణోఽక్షివిషయః 4
మహేంద్రాదిర్దేవో జయతి దితిజాన్యస్య బలతో
న కస్య స్వాతంత్ర్యం క్వచిదపి కృతౌ యత్కృతిముతే
బలారాతేర్గర్వం పరిహరతి యోఽసౌ విజయినః
శరణ్యో లోకేశో మమ భవతు కృష్ణోఽక్షివిషయః 5
వినా యస్య ధ్యానం వ్రజతి పశుతాం సూకరముఖాం
వినా యస్య జ్ఞానం జనిమృతిభయం యాతి జనతా
వినా యస్య స్మృత్యా కృమిశతజనిం యాతి స విభుః
శరణ్యో లోకేశో మమ భవతు కృష్ణోఽక్షివిషయః 6
నరాతంకోట్టంకః శరణశరణో భ్రాంతిహరణో
ఘనశ్యామో వామో వ్రజశిశువయస్యోఽర్జునసఖః
స్వయంభూర్భూతానాం జనక ఉచితాచారసుఖదః
శరణ్యో లోకేశో మమ భవతు కృష్ణోఽక్షివిషయః 7
యదా ధర్మగ్లానిర్భవతి జగతాం క్షోభకరణీ
తదా లోకస్వామీ ప్రకటితవపుః సేతుధృదజః
సతాం ధాతా స్వచ్ఛో నిగమగణగీతో వ్రజపతిః
శరణ్యో లోకేశో మమ భవతు కృష్ణోఽక్షివిషయః 8
ఇతి శ్రీమత్పరమహంసపరివ్రాజకాచార్యస్య
శ్రీగోవిందభగవత్పూజ్యపాదశిష్యస్య
శ్రీమచ్ఛంకరభగవతః కృతౌ కృష్ణాష్టకం సంపూర్ణం
తాత్పర్యము:
లక్ష్మీ సమేతుడు, విష్ణువు,
స్థిర చరములకు గురువు, వేదముల ముఖ్యాంశము, జ్ఞానమునకు
సాక్షి, శుద్ధుడు, హరి,
అసురాంతకుడు, కలువల వంటి కళ్ళు కలవాడు, గద,
శంఖము, చక్రము ధరించిన వాడు, స్థిరమైన
రుచి కలవాడు, వనమాలి, కాపాడే వాడు, లోకేశుడు
అయిన శ్రీ కృష్ణుని నా ఈ కన్నులు చూచు గాక!
పంచ భూతములకు మూలము, మధు
సూదనుడు, ఆనందముతో లోకాన్ని కాపాడే వాడు, ప్రళయ
సమయమున తన శక్తితో సర్వాన్ని తనలో విలీనం చేసే వాడు, కాపాడే
వాడు,లోకేశుడు అయిన శ్రీ కృష్ణుని నా ఈ కన్నులు చూచు గాక!
నియమ బద్ధులై విధులను పాటించే, ఆత్మపై
నియంత్రణ కలిగిన, లౌకిక విషయముల నుండి దూరముగా ఉండే, స్థిరమైన
మనసు కలిగిన జ్ఞానులచే దర్శించ బడిన వాడు, కాపాడే వాడు, లోకేశుడు
అయిన శ్రీ కృష్ణుని నా ఈ కన్నులు చూచు గాక!
లోకమందు భాగమై దాన్ని శాసించే వాడు, మన
బాధలను తొలగించే వాడు, వేదములలో చెప్పబడిన జగదీశుడు, శుద్ధమైన
వాడు, శాసకుడు, దేవతల, ఋషుల,
మానవుల యొక్క ధ్యాన మూలము అయిన వాడు, మోక్ష
కారకుడు, కాపాడే వాడు, లోకేశుడు
అయిన శ్రీ కృష్ణుని నా ఈ కన్నులు చూచు గాక!
ఇంద్రాది దేవతల అసురులపై విజయానికి మూల శక్తి,
ఎవరి ప్రోత్సాహము లేనిదే కర్మల నుండి విముక్తి కలుగదో, పాండిత్యము
వలన కలిగిన కవుల గర్వమును పోగొట్టే వాడు,కాపాడే వాడు, లోకేశుడు
అయిన అట్టి శ్రీ కృష్ణుని నా ఈ కన్నులు చూచు గాక!
ఎవరిని ధ్యానిన్చకున్డుట వలన జనులు పంది వంటి పశు
రూపములో జన్మ ఎత్తుతారో, ఎవరిని తెలుసుకోక పోవటం వలన జన్మ మృత్యు మొదలగు
వాటి భయము కలుగునో, ఎవరిని తలచ కుండుట వలన కీటకముల వలె జన్మింతురో,
అట్టి కాపాడే వాడు, లోకేశుడు అయిన శ్రీ కృష్ణుని నా ఈ కన్నులు చూచు
గాక!
జనుల దుఃఖమును పోగొట్టేవాడు, శరణు
కోరిన వారికి సాయ పడేవాడు, అయోమయాన్ని పోగొట్టే వాడు, నీల
మేఘ శ్యాముడు, వ్రజ కులానికి ప్రియ బాలుడు, అర్జునునికి
సఖుడు, స్వయంభూ, జీవ కోటిని సృష్టించే వాడు, శిక్షకుడు,
రక్షకుడు, లోకేశుడు అయిన శ్రీ కృష్ణుని నా ఈ కన్నులు చూచు
గాక!
ధర్మము నశించి భూ భారము పెరిగినప్పుడు, గోకుల
నందనుడు, ధర్మ పాలకుడు, జన్మ
లేనివాడు, సుజన రక్షకుడు, వేదములచే
పొగడ బడిన వాడు అయిన శ్రీకృష్ణుడు ఆవతారము ఎత్తి ధర్మ సంస్థాపన చేసే వాడు, కాపాడే
వాడు, లోకేశుడు అయిన శ్రీ కృష్ణుని నా ఈ కన్నులు చూచు
గాక!
ఇంకా చదవండి »
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)





