సంతానం కోసం రామాయణ పారాయణం
సంతానం కోసం అనేక రకాలు అయిన వ్రతాలూ , నోములు , మంత్రాలూ ఉన్నాయి . అందులో ఒకటి పారాయణం . సంతానం కలగటం కోసం రామాయణం పారాయణం చేయవచ్చు . రామాయణం - బాలకాండ లోని 15 & 16 సర్గ భార్య భర్తలు ఇద్దరు నియమ నిష్టలతో పారాయణం చేయాలి .
వచనం చదవటం కాదు , శ్లోకాలు మాత్రమే చదవాలి . అప్పుడే అది పారాయణం కిందకి వస్తుంది . ఈ సర్గలో ఏముంది ? దసరధ మహారాజు కి పిల్లలు కలగాకపోవటం తో తన భార్యలు అయిన కౌసల్య , సుమిత్ర , కైకేయి , పుత్రకామేష్టి యాగం చేస్తాడు. యాగ గుండం నుంచి అగ్ని దేవుడు ప్రత్యక్షమయి పాయస పాత్ర ఇచ్చి దీనిని తన భార్యలకి ఇమ్మని చెప్పి అంతర్ధానమయాడు . యాగం సఫలం అవటం తో ఋషులు , రాజు అందరు సంతోషించారు.
తరువాత పాయస పాత్రలోని సక భాగాని కౌసల్యకి ఇచ్చాడు , మిగిలిన సఖం లో సఖాని సుమిత్ర కి ఇచ్చాడు . మిగిలిన పావు లో సఖ భాగం కైక కి ఇచ్చి మిగిలిన సఖ సుమిత్రకి ఇచాడు . ఈ ప్రకారం గ ముగ్గురు భార్యలకి పాయసం పంచటం తో ముగ్గురు అత్యంత భక్తీ స్రద్దలతి దానిని సేవించారు ఘర్బం దాల్చారు . ఒక సుభ ముహూర్తం లో కౌసల్యకి - శ్రీ రాముడు , కైక - భరతుడు , సుమిత్రకి - లక్ష్మణ , భరత , సత్రుగ్నులు జన్మించారు .
సంతానం కోరుకునే వారు ఈ 15 & 16 సర్గలు, దసరధ మహారాజు కి సంతానం కలగలేదు కాబట్టి పుత్రా కామేష్టి యాగం తలపెట్టి నపట్టినుంచిపారాయణం చేయాలి.
రామ నవరాత్రులో చడుకుంటే మంచిదే . కానీ ఇప్పుడే పారాయణ చేయాలి అని నియమ ఏమి లేదు . ఎవరికీ వీలయితే అప్పుడు ఒక సుభ ముహూర్తం చూసుకుని లేదా జన్మ నక్షత్రం రోజున , ప్రారంబించాలి. ప్రాతఃకాలం లో శుచిగా చేయాలి . కొన్ని జంటలో భార్య చదువాలని భర్త సహకరించరు , భర్త చదవాలని కానీ భార్య సహకరించారు . పిల్లలు కావాలి అనుకుంటే అది ఇద్దరికీ సంబంధించి విషయం . ఇద్దరు అర్ధం చేసుకుని ఒకరి కోసం ఒకరు అర్ధం చేసుకుని సహకరించుకుంటూ చదువుకొవలి. భర్త చదివితే భార్య వినటం , భర్య చదివితే భర్త వినటం లేదా ఎవరికీ వారు పారాయణం చేసుకోవచ్చు . ఇందులో ఎ ఒక్కరు చేసిన సరిపోతుంది . అయితే చేసే ముందు సీతా రామ లక్ష్మణ , హనుమ పట్టం కానీ లేదా ముగ్గురు రాణులు 4 పిల్లల్ని ఉయాలలో వేసే పట్టమ కానీ పెట్టుకుని దీపరధన చేసి, రామాయణ గ్రంధానికి కూడా పూజ చేసి చదువుకోవాలి .
మహా నైవేద్యం : క్షిరానం పెట్టాలి . ఆవు పాలతో , అన్నం బెల్లం , నేయి వేసి చేసిన క్షిరానం నివేదన చేసి హారతి ఇవ్వాలి . ఈ ప్రసాదం భార్య భర్త ఇద్దరు తినాలి . ఇలా ఒక 20 రోజులు చేయాలి అని ఉమా సంహిత చెప్తుంది . ఈ కలం లో ఇద్దరు నియమ నిష్టలతో ఉండాలి . రామ నామ సంకీర్తన చేయాలి .