వివాహం కోసం రామాయణ పారాయణం

వివాహం కోసం అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ పెళ్లి అయింది అన్యోన్యం లోపించిది , భార్య భర్త విడిపోయారు , భర్య పుట్టింటికి వెళ్లిపోయింది , భర్త తప్పు దారిలో ఇంటి నుంచి వెళ్ళిపోయాడు , విడిపోయిన దంపతులు కలవటానికి రామాయణం లో బాల కాండ లోని 73 వ సర్గ పారాయణం చేయాలి . 

విడిపోయిన దంపతులు కలవటానికి, అన్యోన్యం గ ఉండడానికి , పెళ్లి కావాల్సిన వారికీ పెళ్లి జరుగుతుంది . 

పెళ్లి కావాల్సిన వారు పెళ్లి అయెంత వరుకు , అన్యోన్యంత లోపించినవారు అన్యోన్యంగా ఉండే వరకు , విడిపోయిన దంపతులు తిరిగి కలిసే వరుకు ఈ పారాయణం చేయాలి . 

తెల్లవారుఝామున లేచి శ్రీరాముడి కుటుంబ పట్టము పెట్టుకుని దీపారాధన చేసి పారాయణం మొదలు పెట్టాలి. ఏమయినా శాపాలు ఉండడం వలన పెళ్లి కాకపోవటం , అన్యోన్యంత లోపించటం , విడిపోవటం వంటి వి కూడా తొలిగిపోతాయి. ఈ సర్గ లో సీతా రాముల కళ్యాణ ఘటం ఉంది. 

పెళ్లి కావటం లేదు అని ఎవరెవరు బాదపడుతునారో వారు అంతా కూడా తమ తమ పిల్లల కోసం చదవవచ్చు . తప్పకుండ అ ఇంట్లో మంగళ వాయిద్యాలు మోగుతాయి అని ఉమా సంహిత లో ఉంది . 

నివేదన : అప్పుడే పితికిన ఆవు పాలు నివేదన చేయాలి . పారాయణ కాలమంతా నిష్ఠ గ ఉండాలి .