-
విష్ణుషట్పదీ స్తోత్రం
నారాయణ నారాయణ జయ గోవింద హరే |నారాయణ నారాయణ జయ గోపాల హరే ||
-
శ్రీ రామ
ఆపదం అపహర్థారమ్ దాతారం సర్వ సంపదం, లోకాభి రామం శ్రీ రామం భూయో భూయో నమామ్యహమ్I
-
శ్రీ సీతామాత
త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ, హనుమాన్ యత్న మాస్తాయ దు:ఖ: క్షయ కరోభవ
-
ఓం నమ:శివాయ:
చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర పాహిమామ్ , చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర రక్షమామ్ I
-
శ్రీమాత్రే నమః
అమ్మల గన్న యమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాల పెద్దమ్మ, సురారులమ్మ కడుపారడి పుచ్చిన యమ్మ, తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ మాయమ్మ కృపాబ్ధి నిచ్చుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్
-
శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు
పురుషోవిష్ణు రిత్యుక్తః శివోనానామతః స్మృతః I అవ్యక్తం తు ఉమాదేవీ శ్రీర్వా పద్మ నిభేక్షణా I తత్ సంయోగా దహంకారః స చ సేనాపతిరుహః I
శైవం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
అమర్నీతి నాయనారు చోళరాజ్యమున ప్రసిద్ధినందిన పజైయ్యరాయికి చెందిన వైశ్య కులజుడు. అ గ్రామం చాలా సారవంతమైనది. చుట్టూ తోటలతో లతలతో పచ్చగా శోభాయమానంగా ఒప్పుతూండేది. అమర్నీతి నాయనారు బంగారం, రత్నాలు, పట్టు వస్త్రముల వ్యాపారి. విదేశాలనుండి వస్తువులను తెప్పించి వ్యాపారం చేస్తుండేవాడు. ఆయన ఆర్జన ఎంతో నీతిమంతముగా ఉండేది. వ్యాపారం కలిసి రావడంతో మంచి ధనవంతుడయ్యాడు. వ్యాపారము చేస్తున్నా, ఇహలోక వ్యాపకాలున్నా, నాయనారు మనసు శివుని మీదే వుండేది. పరమశివ భక్తుడు. శివభక్తులను తన గృహమునకు పిలిచి వారిని అర్చించేవాడు. వారలకు కౌపీనము, దుస్తులు మొదలగునవి ఇచ్చి, షుష్టుగా భోజనము పెట్టి, ఏమైనా కానుకలు ఇచ్చి, వారు సంతసించునట్లుగా చేసి సాగనంపేవాడు.
పండుగలలో పబ్బాలలో తిరునల్లూరు దేవాలయమునకు దైవ దర్శనమునకు వెళ్లేవాడు. అక్కడ శివుని ముందు భావయుక్తంగా పంచాక్షరిని జపిస్తూ శివుని అర్చించేవాడు. కొన్నాళ్లకి పండుగలకు మాత్రమే తిరునల్లూరు దేవాలయమునకు వెళ్ళటంతో సంతృప్తినందక - ఆ వూరిలోనే నివసిస్తే - నిరంతరము శివ దర్శనము చేయవచ్చని, శివభక్తుల సేవకు వీలవుతుందని తలచి - తిరునల్లూరుకు తన బంధువులతో సహా వెళ్లి, అక్కడే స్థిరపడి - దైవదర్శనమునకు వచ్చెడి శివభక్తులకు వుండుటకు వీలుగా ఒక మఠం కట్టించాడు. ప్రతి దినము వారిని తన ఇంటికి పిలిచి, వారలకు కౌపీనము మొదలగునవి ఇచ్చి సంతసింపజేసేవాడు.
నాయనారు భక్తితత్పరతకు పరమశివుడు పరవశించి పోయాడు. ముఖ్యముగా కౌపీనములను ఇచ్చుచుండుట, శివభక్తులయెడ వాత్సల్యము, ఔదార్యము శివుని ఆకర్షించినవి. అతని ఔదార్యాన్ని అందరిచేత ప్రశంసింపజేయాలని, అతనికి తన శుభాశీస్సులను ఇయ్యటానికి శివుడు నిశ్చయించాడు. అందుకని ఒకరోజున బ్రహ్మచారి వేషంతో జటతో, విభూతి పుండ్రములు, భుజం మీద దండంతో శివుడుఅమర్నీతి నాయనారు మఠంకి విచ్చేశాడు. బ్రహ్మచారి దండానికి చివర 2 కౌపీనములు, విభూతిసంచి కట్టబడి వున్నాయి. ఆయన ముఖం తేజోవంతంగా ఉంది. కళ్లు ప్రకాశమానంగా వున్నాయి. ఠీవిగా మఠంలోకి ప్రవేశించాడు. అమర్నీతి నాయనారు పరమానందంతో అతిథిని ఆహ్వానించి అర్చించాడు. బ్రహ్మచారి - అమర్నీతి నాయనారుతో, "మీరు మహాత్ములు. ప్రతి ఒక్కరు మీ దానాలకి, ముఖ్యముగా కౌపీనముల దానాలకు మిమ్మలను అభినందిస్తున్నారు. మీ దర్శనానికి వచ్చాను." అని అన్నాడు. అమర్నీతి నాయనారు - బ్రహ్మాచారిని తన వద్దనుండి బిక్షను స్వీకరించవలసిందిగా అర్థించాడు. బ్రహ్మచారి ఒప్పుకొని, "నేను నదికెళ్లి స్నానము చేసి నిత్య కర్మానుష్టానము చేసి వస్తాను. వర్షము వస్తోంది. వర్షమునకు నా కౌపీనములు తడిసిపోయాయి. అందుకని ఈ పొడి కౌపీనమును జాగ్రత్త పరచండి. నేను వచ్చి తీసుకుంటాను. అది చాలా విలువైంది, ప్రత్యేకమైనది గూడ. అందుచే దానిని భద్రముగా ఉంచండి" అని చెప్పి స్నానానికి నదికి వెళ్లాడు.
బ్రహ్మచారి నదికి వెళ్లాడు. అమర్నీతి నాయనారు ఆ కౌపీనమును భద్రపరిచాడు. పరమశివుడు దానిని మాయం చేశాడు. బ్రహ్మచారి స్నానము చేసి వచ్చి, తన పొడి కౌపీనమును ఈయమని కోరాడు. తన రెండో కౌపీనము వానకు తడిసిపోంది. అందుకని పొడిదానిని అడిగాడు. అమర్నీతి నాయనారుకు తాను భద్రపరచినచోట కౌపీనము కనిపించలేదు. అంతటా వెదికాడు. ఎక్కడా కనిపించలేదు. అందుకని వణుకుతూ బ్రహ్మచారికి ఇంకొక కౌపీనముతో నిలబడి పరిస్థితిని చెప్పాడు. బ్రహ్మచారి నాయనారు మాటలను అంగీకరించలేదు. వినలేదు. నాయనారు చాలాధనము దానికి బదులుగా యిస్తానన్నాడు. బ్రహ్మచారి, "ధనాన్ని నేనేమి చేసికొంటాను? అవసరం లేదు, నా అవసరం కౌపీనము మాత్రమే" అన్నాడు. బ్రహ్మచారి ఇంకా ఇలా అన్నాడు. "మీకు కౌపీనము కనిపించనిచో, నా ఇంకో కౌపీనమునకు సరితూగే వేరొక కౌపీనమును ఈయండి" అన్నాడు. అమర్నీతి నాయనారుకు కొంచెం స్వస్థత కలిగింది. వెంటనే త్రాసును తెప్పించాడు. బ్రహ్మచారి కౌపీనమును ఒక తక్కెటలో ఉంచాడు. రెండో తక్కెటలో తాను ఇవ్వదలచిన కౌపీనమును పెట్టాడు. బ్రహ్మచారి కౌపీనమే ఎక్కువ బరువు చూపింది. అమర్నీతి నాయనారు ఏమిపెట్టినను బ్రహ్మచారి కౌపీనమే బరువుగా కనిపించింది. అమర్నీతి నాయనారుకు ఆశ్చర్యము కలిగింది. ఇదంతా శివలీలయని గ్రహించాడు. తన సంపద యావత్తు బ్రహ్మచారి కౌపీనమునకు సరితూగలేదు. పరమ శివుని కౌపీనము వేదమును తలపింపజేస్తుంది. దాని పోగులు శాస్త్రాలు.
అమర్నీతి నాయనారుకు ఏమీ పాలుపోలేదు. బ్రహ్మచారి కాళ్లమీద పడ్డాడు. "స్వామీ! నన్ను, నా భార్యను, నా పుత్రుని గూడ మీ కౌపీనమునకు సమమవుతాయేమో తూచండి" అని అర్థించాడు. బ్రహ్మచారి అందుకు అంగీకరించాడు. అమర్నీతి నాయనారు తన కుటుంబముతో సహా తక్కెటలో కూర్చుంటూ, "నేను శివభక్తులను భక్తితో, చిత్తశుద్ధితో, సేవించుచున్నట్లయితే, ఈ త్రాసు ఇప్పుడు సరితూగుగాక" అన్నాడు. త్రాసు ఆశ్చర్యకరంగా సరితూగింది. అమర్నీతి నాయనారు పుణ్యం బ్రహ్మచారి కౌపీనమూనకు తుల్యమయింది. అచ్చట చేరిన ప్రజలందరూ ఆశ్చర్య చకితులయ్యారు. వారు అమర్నీతి నాయనారు పాదములపైబడి ప్రశంసించారు. దేవతలు ఆ కుటుంబముపై పారిజాత సుమ వృష్టి కురిపించారు. బ్రహ్మచారి అంతర్థానమైనాడు. పార్వతీపరమేశ్వరులు వృషభ వాహనముపై ప్రత్యక్షమై, నాయనారును అనుగ్రహించారు. పరమేశ్వరుడుఅమర్నీతి నాయనారును ఉద్దేశించుచు, "నీ కౌపీన దాతృత్వము, శివభక్తుల నిరుపమాన సేవ మమ్మల్ని అలరించాయి. నీవు, నీ భార్య, నీ పుత్రుడు - ముగ్గురూ నా లోకంలో శాశ్వతంగా నివసించండి" అన్నారు. శివానుగ్రహం వల్ల తక్కెడ దివ్యవిమానంగా మారి,అమర్నీతి నాయనారును, అతని భార్యను, మఱియు అతని పుత్రుని శివలోకానికి చేర్చింది.
ఇంకా చదవండి »
శివ సందర్బంగా పాటించవలిసిన పర్వటి రోజులు అనేకం ఉన్నయి. మాస శివరాత్రి , అమావాస్య ముందుగ వచ్చే చతుర్దశి రోజు , సోమవారం , ఆర్ద్ర నక్షత్రం రోజు , మాస సంక్రాంతి రోజు , దక్షిణాయన పుణ్యకాలం , ఉత్తరాయణ పుణ్యకాలం , జన్మ నక్షత్రం రోజు , గ్రహణ సంమయం ఇవి విసేషమయిన రోజులు .

వీటిలో ముక్యమయిన రోజులు శివరాత్రి .
శివరాత్రి ఎన్ని రకాలుగా చేస్తాం ?
నిత్య శివరాత్రి , పక్ష శివ రాత్రి , మాస శివ రాత్రి , మహా శివరాత్రి , యోగ శివ రాత్రి .
నిత్య శివరాత్రి - నిత్యం ఉపవసించి ప్రదోష కాలం లో శివుడికి పూజ చేసి మరునాడు పారణ చసి , రాత్రి జాగరణ చేసే వాళ్ళు .
పక్ష శివ రాత్రి - పౌర్ణిమ ముందు వచ్చే చతుర్దశి , అమావాస్య ముందు వచ్చే చతుర్దశి కూడా ఈశ్వరుడ్ని అర్చించి ఉపవసించి , శివ రాత్రి రోజు ఎలా చేస్తారో అలాగే చేస్తారు .
మాస శివ రాత్రి -
మహా శివరాత్రి - మాఘ బహుళ చతుర్దశి రోజు మహా శివ రాత్రి . ఈ సివారతి రోజు అర్ద రాత్రి లింగోద్భవం గ చెపుతారు . ఈ రోజే శివ పార్వతులకి కళ్యాణం కూడా చేస్తారు . శివుడికి పూజ చేయటానికి అత్యంత విసెషమయిన రోజు .
మహా శివరాత్రి రోజున ఎం చేయాలి ?
పగలు రాత్రి కూడా శివ నామం జపించటం . ప్రత్యేకం గా దీపారాధన చేయటం అంటే కార్తిక పౌర్ణిమ కి ఎలాగా 360 వత్తులు వెలిగిస్తమొ అలాగే ఈ రోజు కూడా వెలిగిస్తారు, లేదా 11 వరసలు కల వొత్తులు తో దీపం పెట్టె పద్దతి , లక్ష వత్తులు తో దీపం , మొతం శివాలయం లో దీపాలు వెలిగించే పద్ధతి సాంప్రదాయం ఉంది .
దగర్రలొ ఉన్న నది లో స్నానం చేయటం . నది దగ్గర సైకత లింగం చేసి పూజ చేయటం . సముద్రం లో కి నది కలిసే చోట స్నానం చేయటం లేదా రెండు నదులు కలిసే చోట స్నానం చేయటం లేదా నది లో స్నానం చేసిన విశేషం. సూర్యోదయ కాలము నుండి నిరంతర శివ నామ స్మరణ చేయడం , శివ ధ్యానం లో ఉండడం. పూజ , ధ్యానం నామ స్మరణ , సంకీర్తనం , శివ తాండవం , నాట్యం .
ప్రళయ కాలం లో చీకటి ,ఘడాంతకారం గ ఉన్నపుడు , మల్లి సృష్టి ప్రరమ్బించలి అని పార్వతి దేవి శివుడ్ని గురించి ప్రార్ధన చేసింది . అ సమయం లో శివుడు అనుగ్రహించి సృష్టి జరిపించి , లింగొద్బవమ్ అయిన సమయం కాబటి అ రోజున మహా శివరాత్రి అయింది . పార్వతి దేవి శివానుగ్రహం కలిగిన తరువాత శివుడ్ని కోరింది - ప్రతి శివరాత్రి రోజు రాత్రి ఎవరు నిన్ను అర్చిస్తారో , అభిషేకిస్తారో వారిని అనుగ్రహించాలి అని.
మరి ఒక కధనం ప్రకారం శివుడు లింగ రూపం దాల్చిన కారణం గ ఎవరు ఈ శివరాత్రి రోజు శివుడ్ని పూజ / స్మరణ చేస్తూ రాత్రి జాగరణ చేస్తారో వారిని కష్ట కాలం నుంచి కాపాడతాను అని స్వయం గ శివుడే వివరించాడు .
ఇంకా చదవండి »
(అసురుడైనా మయుడు శివుని అడిగిన వరములు బహుశా మానవమాత్రులు కూడా అడగలేరేమో)
నీ పాద కమల సేవయు....
శివమహాపురాణము - 12 వ అధ్యాయము - మయ స్తుతి
మయ ఉవాచ:-
దేవ దేవ మహాదేవ భక్తవత్సల శంకర!
కల్పవృక్ష స్వరూపోసి సర్వపక్ష వివర్జితః!!
జ్యోతి రూపో నమస్తేస్తు విశ్వరూప నమోస్తుతే!
నమః పూతాత్మనే తుభ్యం పావనాయ నమో నమః!!
చిత్ర రూపాయ నిత్యాయ రూపాతీతాయ తే నమః!
దివ్యరూపాయం దివ్యాయ సుదివ్యా కృతయే నమః!!
నమః ప్రణత సర్వార్తి నాశకాయ శివాత్మనే!
కర్త్రే భర్త్రే చ సంహర్ర్తే త్రిలోకానాం నమో నమః!!
భక్తి గమ్యాయా భక్తానాం నమస్తుభ్యం కృపాలవే!
తపస్సత్ఫలదాత్రే తే శివాకాంత శివేశ్వర!!
న జానామి స్తుతిం కర్తుం స్తుతిప్రియవరేశ్వర!
ప్రసన్నోభవ సర్వేశ పాహి మాం శరణాగతమ్!!
దేవ దేవా! మహాదేవా!భక్త ప్రియా!, శుభములనే చేయు వాడా! కల్ప వృక్ష స్వరూపుడవగు నీకు స్వ, పర భేధములు లేవు. జ్యొతి స్వరూపుడవు (జ్ఙాన స్వరూపుడవు) అగు నీకు నమస్కారము. ఈ సమస్త విశ్వరూపములో ఉన్న నీకు నమస్కారము. పవిత్రమగు ఆత్మ స్వరూపుడవైన నీకు నమస్కారము. అత్యంత పావనుడవు, పాపులను కూడా పావనము చేయు నీకు నమస్కారము. చిత్రమైన రూపము కలవాడవు, నిత్యుడవు, ఏ రూపమూ లేని రూపాతీతుడవు ఐన నీకు నమస్కారము. దివ్య మైన స్వరూపము కలవాడవు, ప్రకాశ స్వరూపుడవు, గొప్పనైన దివ్య ఆకృతి కలవాడవు ఐన నీకు నమస్కారము. నమస్కరించినవారి కష్టములనన్నీ తొలగించువాడా, సర్వ మంగళ స్వరూపుడా నీకు నమస్కారము. ముల్లోకములను సృష్టించి, భరించి, లయం కావించు నీకు అనేక నమస్కారములు. భక్తిచే పొందవలసిన వాడు, భక్తులందరి గమ్యమూ, భక్తుల యెడ అపారమైన కరుణ కలవాడూ ఐన నీకు నమస్కారము. తపస్సులకు ఘనమైన ఫలములొసగు వాడు పార్వతీ మాత కు పతి, అన్ని మంగళములకు ఈశ్వరుడవు ఐన నీకు నమస్కారము. ఓ ప్రభూ! సర్వమునకూ ఈశ్వరుడవైన వాడా! నీవు స్తోత్ర ప్రియుడవు, కాని నాకు స్తోత్రము చేయుట కూడా రాదు. హే సర్వేశ్వరా! నీవు ప్రసన్నుడవై నా యందు అపార కృపతో నన్ను రక్షింపుము.
శివ ఉవాచ:-
వరం బ్రూహి ప్రసన్నోహం మయ దానవసత్తమ! మనోభిలషితం యత్తే తద్దాస్యామి న సంశయః!!
ఓ రాక్షస శ్రేష్ఠా ! మయా! నీ యందు ప్రసన్నుడనైతిని, నీ మనస్సుకు నచ్చిన వరము కోరుకొనుము, సంశయము లేకుండ ఇచ్చెదను
మయ ఉవాచ:-
దేవ దేవ మహాదేవ ప్రసన్నోయది మే భవాన్!
వరయోగ్యోస్మ్యహం చేద్ధి స్వభక్తిం దేహి శాశ్వతీమ్!!
స్వభక్తేషు సదా సఖ్యం దీనేషు చ దయాం సదా!
ఉపేక్షా మన్యజీవేషు ఖలేషు పరమేశ్వర!!
కదాపి నాసురో భావో భవేన్మమ మహేశ్వర!
నిర్భయస్స్యాం సదా నాథ మగ్నస్త్వద్భజనే శుభే!!
దేవ దేవా! మహాదేవా! నీవు నాయందు ప్రసన్నుడవతివేని, నేను వరమునకు అర్హుడైనచో, నాకు నీయంది శాశ్వత భక్తి కలుగునట్లు అనుగ్రహింపుము. నీ భక్తులతో మైత్రిని సత్సంగమును, దీనుల యందు దయను, ఇతర ప్రాణులయందును దుష్టులయందును ఉపేక్షాభావమును కలిగించుము. హే పరమేశ్వరా! నాకు ఎన్నటికీ ఆసురీ భావములు కలుగకుండుగాక. హే మహేశా! నేను సర్వదా మంగళకరమగు నీ నామ భజనము యందే నిమగ్నుడనై భయము లేక ఉండు వరమిమ్ము.
శివ ఉవాచ:-
దానవర్షభ ధన్యస్త్వం మద్భక్తో నిర్వికారవాన్!
ప్రదత్తాస్తే వరాస్సర్వేభీప్సితాయే తవాధునా!!
రాక్షస శ్రేష్ఠా! నీవు కోరిన వరములచే నా భక్తుడవగు నీవు ధన్యుడ వైనావు. నీవు కోరిన వరములనిచ్చితిని.
ఇంకా చదవండి »
పరమేశ్వరునిచే ఈ సృష్టి నిర్మించబడినది. ఆ శివుని ఆరాధించిన
వారాలనే శైవులు అన్నారు. వారు అవలంబించిన మతమే శైవమ్ అని పిలువబడింది. శైవ మతము
అతి ప్రాచీనమైనది. ప్రపంచ చరిత్ర పరిశోధకుల అభిప్రాయం ప్రకారం లింగ రూప శివార్చన
ప్రపంచంలో అతి ప్రాచీనమైనది. భారత దేశంలోనే కాక ప్రపంచంలోని పలు నదీ తీర
ప్రాంతాల్లో లింగారాధన ఉండినదని నేటికీ బయల్పడుతున్న అవశేషాల ద్వారా దృవీకరించారు.
గ్రీకుల ఆరాధనలోనూ లింగ రూపం ప్రాధాన్యతను సంతరించుకున్నది. ఈజిప్టులు
ఇప్సి అనే పేరున
నైలూ నది తీరాన పూజించారు. అమెరికనుల మాయన్ నాగరికతలోని ఉపాస్యదైవమ్
లింగరూపి ఈశ్వరుడే. మక్కాలో మక్కేశ్వర
లింగాన్ని ప్రాచీన కాలంలో
ఖర్జూరపుటాకులతో పూజించేవారానీ చరిత్ర చెబుతోంది. హరప్పా, లోధాల్, మొహంజదారో త్రవ్వకాలలో
లభించిన ఆధారాలూ లింగ పూజ ప్రాచీనత్వాన్ని చాటుతున్నాయి. క్రిష్టియన్లకు మూల స్థానమైన ప్రసిద్ద వాటికన్
సిటీ లోని అతి పెద్దదైన సెయింట్ పీటర్ స్క్వేర్ ప్లాజా సామ్ పీయిట్రో అయితే నల్లగా
శివలింగం ప్రానవట్టాన్ని పోలి ఉంటుంది.
ఇటీవలి కాలంలో అక్కడి వాటికన్ సిటీ లో బయల్పడిన పురాతన
కాలపు శివలింగం ఆనాడు ప్రపంచ మంతటా వ్యాపించిన లింగారాధనకు ఒక
నిదర్శనం (వాటికన్ లో బయలు పడిన శివలింగము గురించి మరింత ఇక్కడ పొందగలరు: www.stephen-knapp.com/art_photo_fourteen.htm).
అతి ప్రాచీనమైన ఈ లింగారాధన గురించి ఎన్నో ప్రాచీన
గ్రంధాలలో కనబడుతుంది. నేటికీ ప్రతి హిందువూ ప్రతి ఏటా జరుపుకొనే ప్రధాన పండుగ
మహాశివరాత్రి - సృష్టి మొదలైనపుడు బ్రహ్మ, విష్ణువులు నేను
గొప్ప అంటే నేను గొప్ప అని వాదించు సమయాన వారిద్దరి మద్యన
శివుడు లింగాకార అగ్నిగా వెలువడి, అబద్ద వచనాలు
పల్కిన బ్రహ్మ ఒక తలను ఖండించుట వారికి
జ్ఞానోదయం కలిగించుట అందరికీ
తెలిసిన విశయమే. ప్రాచీన
పురానేతిహాసల్లో కూడా వీరు వారు అని తేడాలేకుండా సర్వులూ లింగ పూజ చేసినట్టు
పెక్కు గ్రంధాలలో తెలియగలము.
మహావిష్ణువు కూడా
సహస్ర కమలాలతో లింగార్చన చేసి ఒక కమలం తక్కువై తన కంటినే కమలంగా అర్పించి
కమలనాధుడై విష్ణు చక్రాన్ని పొందటం జరిగిందని తెలియనగును.
హరిశ్చంద్రాది
మహారాజులు మార్కండేయాది మునులు
శివలింగార్చన చేసినట్లు కలదు.
త్రేతాయుగంలో కూడా రాముడూ, రావనాసురుడూ
లింగార్చన చేయటాన్ని బట్టి
ఆ కాలంలోనూ లింగారాధన అంతటా
జరుప బడిందని తెలియబడుతుంది.
ద్వాపరంలో శ్రీకృష్ణుడు
ఎంతో కాలం రుద్రంతో లింగారాధన చేసి శివుని వరంతో సాంబుడనే
కొడుకుని పొందాడని, పాండవులూ విశేషంగా దేశమెల్లెడలా స్థాపించిన పెక్కు
లింగాలను బట్టి ఆ కాలంలోనూ లింగారాధన ప్రముఖంగా ఉందని తెలియబడుతుంది.
తరువాతి కాలంలోనూ ఆది శంకరులు లింగారాధన చేయటమే కాకుండా పలు
ప్రదేశాల్లో లింగాలను ప్రతిష్టించడం నాటి ప్రాచీన లింగారాదనను తెలుపుతుంది.
ఇక సోమనాథ, శ్రీశైల, శ్రీకాళహస్తి, కొలనుపాక, కాశీ లాంటి పెక్కు లింగ క్షేత్రాలు ప్రాచీన కాలం నాటి
శాసనాలతో తమ ప్రాముఖ్యతను చాటుతున్నాయి.
చరిత్రనంతా పరిశీలిస్తే నాటి నుండీ నేటి వరకూ లింగారాధన అను
నిత్యమూ ఆచరించబడినదని ఆ లింగాన్నారాధించే పద్దతుల ఆచారాన్ని బట్టి కాల పరంపరలో
పలు మతాలూ - సిద్దాంతాలూ పుట్టుకొచ్చాయని చెప్పవచ్చు.
శివుడిని-లింగాన్ని ఆరాధించిన శైవులు ఆచార సంప్రదాయాల పరంగా
పలు రకాలుగా వెలిశారు.
నేటి కాలంలో శివాలయం లేని ఊరు లేదంటే అతిశయోక్తి కాదేమో.
నవీన సిద్దాంతాలతో వచ్చిన సాయి, సత్యసాయి, బ్రహ్మకుమారీ లాంటి పెక్కు మతాలూ హిందూ మతపు అతి ప్రాచీనమైన
లింగారాధనకు ప్రాముఖ్యత నిచ్చాయి.
అత్యంత ప్రాచీనమూ, పవిత్రమూ అయిన
ఇట్టి లింగానికి కొందరు పలు రకాల జుగుప్సా పూర్వక నిర్వచనాల నివ్వడం వారి
అవివేకత్వానికీ, అజ్ఞానానికీ, అహంకారానికీ నిదర్శనమే అవుతుంది. శివపార్వతుల సంగమ రూపానికి
సంకేతమని కొందరనగా, మరికొందరు ముందడుగు వేసి
శివుని అంగమే లింగమన్నారు, ఇంకొందరు శివ, బ్రహ్మ, విష్ణుల సంయోగ రూపమే
లింగమంటే, మరికొందరు శివ, పార్వతీ, విష్ణుల రూపమే లింగమనిరి.
ప్రాచీన కాలంలో మహర్షులూ, యోగులూ, సిద్దులూ, రేణుక, శంకరాది మునులూ సాకారమైన శివుని సంక్షిప్త రూపమే శివలింగముగా
భావించి కొలిచి ముక్తి నొందారు అని తెలియాలి. అలాకాక మనసులో మాలిన్యాన్ని నింపుక
ఆరాధించిన మోక్షము లభించుట దుర్లభమూ - పాపయుక్తమూనూ.
ఎలాంటి భావన మదిలో మెదలక, కేవల లింగమున లీనమవ్వాలనే
భావనో లేక మరేమో కాని
ప్రస్తుతం ఇక్కడ వివరించబోయే వీరశైవము మతమున ప్రానవట్టము లేని లింగమే
ఆరాధించబడుతుంది. నిజానికి పీఠం, ప్రానవట్టంతో ఉన్న
రాతిలింగమే వీరశైవులారాధించే ఇష్టలింగము లోపల ఉంటుంది (తైలముచే ఆ రాతి లింగానికి
కంతి వేయబడుతుంది).
ఇష్టలింగమే వారి
ప్రాణ దైవం - గురువు నుండి గ్రహించినది మొదలు ప్రాణమున్న పర్యంతమూ అర్చించి
ఆరాదించేదే ఇష్ట లింగము. మరణించిన పిదప కూడా సమాధి చేయునపుడు పద్మాసనంలో
కూర్చోజేసి చేతిలో ఇష్ట లింగాన్ని ఉంచుతారు. ఈ లింగానికే ప్రథమ ప్రాదాన్యత. దేవాలయాల్లో ప్రతిష్టింపబడిన లింగాలైనా మరే
లింగమైనా తరువాతి ప్రాధాన్యతనే కలిగి ఉంటుంది.
ఇంకా చదవండి »
- ఇతరుల మాదిరి ఎన్నో క్రియలచే కొంత ఫలాన్ని పొందక, ఉత్కృష్టమైన కొన్ని క్రియలచే కొండంత ఫలాన్ని పొందేవాడే వీరశైవుడు.
- లింగ భోగోపభోగియై ఎల్లపుడు లింగాన్ని అంటిపెట్టుకుని ఉండేవాడు (ధరించే వాడు).
- ఇతరుల వలె దేవుని ఆహ్వాన-విసర్జనల చేయక సదా తన యిష్ట లింగమును అంటిఉండి ఎల్లవేళలా పూజించువాడు.
- జాతి సూతక, జన సూతక, ప్రేత సూతక, ఉచ్చిష్ట సూతక, రజస్సూతకము అనే 5 సూతకములు లేక లింగ పూజ సల్పువాడు.
- అనృతము, అస్థిర వాక్యము, వంచనము, పంక్తిభేదము, ఉదాసీనత, నిర్దయత అనే 6 అంతరంగములు గల భవి సంస్కారములు లేనివాడు.
- త్రికాల లింగార్చన చేయువాడు.
- శివనింద, గురునింద, జంగమనింద, ప్రసాదనింద, పాదోదకనింద, భస్మధారణనింద, శివక్షేత్రనింద, శివాచారనింద, శివాగమనిందల సహింపని వాడు.
- శివమహేశ్వరుల చూడగనే లేచి వెళ్లి ప్రియవచనములు పలికి వారిని గౌరవించి అన్నపానాదులు సమర్పించువాడు.
- స్నాన, భోజన, నిద్రా, జాగరణ, మలమూత్ర విసర్జన కాలములలో అశుచి భావమున పొందక, లింగము దూరమై బ్రతుక జాలనన్న తలంపుతో సదా లింగమును ధరించువాడు.
- శివుడే సర్వమని మరి ఏ దేవతల గణింపని వాడు శివలింగ లాంచనములు లేని భవులతో సంపర్క, శయన, ఎకాసన సహపంక్తి భోజనములు చేయనివాడు.
- లింగాచార, సదాచార, భ్రుత్యాచార, శివాచార, గణాచారము లనే పంచాచార నిష్టుడు.
- దాసత్వ, వీరదాసత్వ, భ్రుత్యత్వ, వీరభ్రుత్యత్వ, సమయాచారత్వ, సకలావస్థత్వంబు లనే 6 సజ్జనత్వ యుక్తుడైన వాడు.
- దేశకాల కల్పితాది లౌకిక ఆచారములను మీరి స్వతంత్రశీలుడై శివాత్ములకు భేద భ్రాంతి లేనివాడు.
- పంచాచార్యుల, సిద్ధాంత శిఖామణి వచనముల బద్దుడై కడు భక్తితో మసలువాడు.
- పరమేశ్వర నిర్మితమైన ఈ ప్రపంచమున చరమశరీరి అనబడి అందరిలోకి విశిష్టుడైన వాడు వీరశైవుడు.
ఇంకా చదవండి »
ఆగమములనగా వచ్చి చేరుట అని
అర్థం. వీటిని శివుడు
మొదటగా పార్వతీదేవికి ఉపదేశించుట
జరిగినది. ఇవి వేదాలతో బాటు
ప్రాచీనమైనవి. వీటిని ఆవిర్భూతాలని
అంటారు. ఆగమములు వైదికము, తాంత్రికము అని కలవు.
శైవాగమములు వైదిక ఆగమములుగా చెప్పబడతాయి. ఎంతో విశేషత కలిగిన ఈ ఆగమములలో వీరశైవము
- సిద్దాంతము - దీక్ష - ఆచరణ గూర్చి
విశేషంగా కలదు. అంతేగాక ఈ ఆగమ సిద్దాంతాల ఆధారంగానే వీరశైవపు పెక్కు
గ్రంధాలు వెలువరించబడినవి.
ఆగమాల ప్రస్తావన పెక్కు పురాణాలలో కనిపిస్తుంది. అంతేగాక
శ్వేతాశ్వరాది ఉపనిషత్తులలోని శ్లోకాలు విషయమూ ఆగమములలో కూడా కలవు. భగవద్గీతలోని
చాలా శ్లోకాలు ఆగమములోనివిగా (ఎక్కువగా
పారమేశ్వరాగామము నుండి) అగుపిస్తాయి.
కొన్ని శ్లోకాలు యథాతతంగానూ మరికొన్ని కొద్ది మార్పులతోనూ కలవు.
ఆగములను ప్రాచీనులైన కాళిదాసాది పండితులు తమ రచనలలో ఆగమ
విషయ ప్రస్తావన చేయడం ఇవి చారిత్రకంగానూ బహు పురాతణమని తెలియదగును.
ప్రాచీన కాలంలో వేదపరంగా ఆచరణాధికాలు ఉండేవి, కాని ప్రస్తుతం హిందూమతం యావత్తు ఈ ఆగమ శాస్త్రం ప్రకారమే
నడుస్తుందని చెప్పవచ్చు. మనం నిత్యం ఆచరించే పద్దతులు, పూజా విధానాలు, దేవాలయాలు - వాటి
పూజాధికాలు, పండుగలు ఇత్యాది ఎన్నో ఆగమ
యుతంగా నడుస్తున్నాయి.
వేదములు కర్మను ప్రధానంగా భోదిస్తాయి, ఉపనిషత్తులు జ్ఞాన బోధకములు, కాగా ఆగమములు కర్మజ్ఞాన సముచ్చయక భోదములు. కేవల తత్వ జ్ఞానమునే కాక ఉపాసనాధి క్రియల
తెలిపి జీవులకు ముక్తిని ప్రసాదించు నట్టివి - కావున అందరికీ ఆచరనీయమైనవి.
ఆగమ శబ్దార్థం
Aagatha Shiva Vaktrebhyah,
Gathasthu Girijaa Mukham !
Maheshwara Thathva
Kathaanaadaagamah Kathitho Dvija !! (Kaaranagama)
పరమశివుని పంచ ముఖముల నుండి వెలువడి పార్వతి మరియు
బ్రహ్మాదులచే గ్రహించబడినవి. ఇవి పరమేశ్వరుని పరతత్వ భోధకములు.
ఆగమాస్ - వైదికం
"Shivaagama Midam Punyam
Shruthimoolam Vimukthidame
Tasmath Sadaa Sevaneeyam"
(Kaamikaagamam)
శివాగామములు పుణ్యమైనవి వేద మూలకములు. ఇవి
ముక్తిదాయకములైనందున వీటిని సదా సేవించవలయును.
ఆగమం అనగా ?
Aachaara KathanaathDivyagathi
Praapthi Vidhaanathahv !
Mahesha Thathva
KathanaathAagamah Kathithah Priye !! (Kiranaagama)
ఆగమములలో శైవాచారాలు, శివదీక్షాది విధులు, మోక్ష సాధకములైన శివలింగాది పూజాధికాలు, మహేశ్వర తత్వ ప్రతిపాదకుమలైన విషయములు ఉండును.
ఆగమ శాస్త్రములు 2 విధాలు:
1) శైవాగమాలు 2) శాక్తేయ ఆగమాలు
(శాక్తేయ ఆగమాలను తంత్ర ఆగమాలు అని కూడా
అంటారు )
వీటిలో
దేవతామూర్తుల నిర్మాణం, దేవాలయాల నిర్మాణం, విగ్రహ ప్రతిష్టలు, పూజోపాసనాది
క్రియలతో కూడుకొని ఉండును.
శాక్తేయ (తంత్ర) ఆగమాలు 64 కలవు, వీటిలో శాక్త పద్దతుల
సిద్దాంతాల గూర్చి వివరంగా తెలుపబడి ఉండును.
ఇవి పరాశాక్తియైన పార్వతికి సంబందించినవి.
శైవ అగమాస్
శైవాగమాలు 28 కలవు. ఈ 28 ఆగమాలను అద్వైత, ద్వైత, విశిష్టాద్వైత పరంగా కూడా విభాగించ బడ్డవి.
ప్రతి శైవాగామములో దిగువ విషయాలు ప్రతిపాదింపబడి ఉంటాయి :
క్రియాపాద, చర్యపాద, యోగపాద, జ్ఞానపాద అనే నాలుగు
పాదములు
పతి, కుండలిని, మాయ, పశు, పాశ, దీక్ష అనే షట్పదార్థములు
తెలియజేయబడి ఉండును. .
గురుముఖమున నిర్గతమగుజ్ఞానము, ప్రత్యక్షాది పదార్థరూప జ్ఞేయము, లింగార్చనా లక్షణమగు అనుష్టేయము, భస్మధారణాత్మకమగు అధికృతము, శివమంత్ర రూపమగు సాధనము, శివ సమానతా ముక్తి రూపమగు సాధ్యము అనే షట్పదార్థములు
తెలియజేయబడి ఉండును.
శివుని సగుణ, నిర్గుణ ఉపాసనల
వివరించునవే శైవాగమములు. ఇవి పూర్తిగా
శైవ సిద్దాంతాలను, పద్దతులను, దీక్షాది విధులను, ఆలయ నిర్మాణ,
నిర్వాహణాది విషయాలను భొదించును. ఇవి సమస్త శైవులందరికీ
ప్రధానమైనవి. పార్వతీదేవి సందేహాల నివృత్తి చేస్తూ శివునిచే భోదించబడెను. ఈ ఆగమాలను వేరు వేరు మహాత్ములు విని ప్రచారము
చేశారు.
సద్యోజాత ముఖమున - 5
వామదేవ ముఖమున - 5
అఘోర ముఖమున - 5
తత్పురుష ముఖమున - 5
ఈశాన ముఖమున - 8
ఇంకా చదవండి »
1. కామికాగమము:
ఏ ముఖమునుండి వెలువడినది : సద్యోజాత
శ్లోకాల సంఖ్య : పరార్థము
ఆగమములోని భేదాలు: 1.
ఉత్తర 2. భైరవోత్తర 3. నారసింహం
2. యోగజాగమము:
ఏ ముఖమునుండి వెలువడినది : సద్యోజాత
మొదట-అతని నుండి-అతని నుండి
భొదనొందిన వారు : సుదాఖ్యుడు => బహువు => విభువు
శ్లోకాల సంఖ్య : 1 లక్ష
ఆగమములోని భేదాలు: 1.
వీణాశిఖోత్తర 2. తార తంత్ర 3. సౌత్యాగమ 4.
శాంతాద్యాగమ 5. ఆత్మయోగం
3. చింత్యాగమము :
ఏ ముఖమునుండి వెలువడినది : సద్యోజాత
మొదట-అతని నుండి భొదనొందిన
వారు :
దీప్తుడు => అంబిక
శ్లోకాల సంఖ్య : 1 లక్ష
ఆగమములోని భేదాలు: 1 సుచింత్యాగామము 2 సుభగాగమము 3 వామతంత్ర 4 పాపనాశక 5 సర్వోద్భవ 6 అమృతాగమ
4. కారణాగమము:
ఏ ముఖమునుండి వెలువడినది : సద్యోజాత
మొదట-అతని నుండి-అతని నుండి
భొదనొందిన వారు : కారణాఖ్యుడు => శర్వుడు => ప్రజాపతి
శ్లోకాల సంఖ్య : 1 కోటి
ఆగమములోని భేదాలు: 1 కారణ తంత్ర 2 పావన తంత్ర 3 దాగ్భ్య తంత్ర 4 మహేంద్ర తంత్ర 5 భీమ తంత్ర 6 మారణ తంత్ర 7 ఈశాన తంత్ర
5. అజితాగమము:
ఏ ముఖమునుండి వెలువడినది : సద్యోజాత
మొదట-అతని నుండి భొదనొందిన
వారు :
శివుడు => అచ్యుతుడు
శ్లోకాల సంఖ్య : నియుతం
ఆగమములోని భేదాలు: 1ప్రభుతాగమ 2 పరోద్భూతాగమ 3 పార్వతీ తంత్ర 4 పద్మ సంహిత
6. దీప్తాగమము :
ఏ ముఖమునుండి వెలువడినది : వామదేవ
మొదట-అతని నుండి-అతని నుండి
భొదనొందిన వారు : ఈశుడు => త్రిమూర్తి => హుతాశనుడు
శ్లోకాల సంఖ్య : నియుతం
ఆగమములోని భేదాలు: 1 అమేయాగామ 2 అప్రమాగమ 3 ఆస్యాగమ 4 అసంఖ్యాగమ 5 అమితాజసాగమ 6 ఆనందాగమ 7 మాధవోద్బూతాగమ 8 అధ్బుతాగమ 9 అమృతాగమ
7. సూక్ష్మాగమము:
ఏ ముఖమునుండి వెలువడినది : వామదేవ
మొదట-అతని నుండి-అతని నుండి
భొదనొందిన వారు : సూక్ష్ముడు => వైశ్రావణుడు => సుప్రభంజనుడు
శ్లోకాల సంఖ్య : పద్మము
ఆగమములోని భేదాలు: సూక్ష్మ
సంహిత
8. సహస్రాగమము : శంఖము
ఏ ముఖమునుండి వెలువడినది : వామదేవ
మొదట-అతని నుండి-అతని నుండి
భొదనొందిన వారు : కాలరుద్రుడు => భీమ రుద్రుడు => ధర్ముడు
శ్లోకాల సంఖ్య : -
ఆగమములోని భేదాలు: 1 అతీతాగమ 2 అమలాగమ 3 శుద్దాగమ 4 అప్రమేయాగమ 5 భౌతిభానాగమ 6 ప్రభుద్దాగమ 7 విబుధాగమ 8 హస్తాగమ 9 అలంకారాగమ 10 సుభోదాగమ
9. అంశుమానాగమము :
ఏ ముఖమునుండి వెలువడినది : వామదేవ
మొదట-అతని నుండి-అతని నుండి
భొదనొందిన వారు : అంబువు => ఉగ్రుడు =>
ఔరసుడు
శ్లోకాల సంఖ్య : 5 లక్షలు
ఆగమములోని భేదాలు: 1 విద్యాపురాణ 2 భాస్వరాగమ 3 నీలలోహిత తంత్ర 4 ప్రకరణాగమ 5 భూత తంత్ర 6 ఆత్యాలంకార 7 కాశ్యపాగమ 8 గౌతమాగమ 9 మహేన్ద్రాగమ 10 బ్రహ్మాగమ 11 వాసిష్టాగమ 12 ఈశానోత్తరం
10 సుప్రబేదాగమము:
ఏ ముఖమునుండి వెలువడినది : వామదేవ
మొదట-అతని నుండి-అతని నుండి
భొదనొందిన వారు : దశేషుడు => విఘ్నేశ్వరుడు => శశి
శ్లోకాల సంఖ్య : 3 కోట్లు
ఆగమములోని భేదాలు: 1 భేదము
11. విజయాగమము :
ఏ ముఖమునుండి వెలువడినది : అఘోర
మొదట-అతని నుండి-అతని నుండి
భొదనొందిన వారు : రుద్రుడు => అనాదియు => పరమేశుడు
శ్లోకాల సంఖ్య : 3 కోట్లు
ఆగమములోని భేదాలు:1 విజయ తంత్ర 2 ఉద్భవ తంత్ర 3 సౌమ్య తంత్ర 4 అఘోర తంత్ర 5 మ్రుతపాశక తంత్ర 6 కుబేర తంత్ర 7 విమల తంత్ర 8 మహాఘోర తంత్ర
12. నిశ్వాసాగమము :
ఏ ముఖమునుండి వెలువడినది : అఘోర
మొదట-అతని నుండి భొదనొందిన
వారు : ఉదయుడు => గిరిజ
శ్లోకాల సంఖ్య : 1 కోటి
ఆగమములోని భేదాలు:1 నిశ్వాస 2 ఉత్తర నిశ్వాస 3 నిశ్వాస ముఖోదయ 4 నిశ్వాస
నిశ్వాసకారిక 5 ఘోర సంహిత 6 సుసౌఖ్య 7 గుహ్యము 8 నిశ్వాస నయనము
13. స్వాయంభువాగమము :
ఏ ముఖమునుండి వెలువడినది : అఘోర
మొదట-అతని నుండి భొదనొందిన
వారు : నిధనేశుడు => స్వయంభువు
శ్లోకాల సంఖ్య : 3 కోట్లు
ఆగమములోని భేదాలు:1 స్వాయంభూత 2 ప్రజాపతి మాత 3 పద్మ తంత్రము
14. అనలాగమము:
ఏ ముఖమునుండి వెలువడినది : అఘోర
మొదట-అతని నుండి భొదనొందిన
వారు : వ్యోముడు => హుతాశనుడు
శ్లోకాల సంఖ్య : 3 ఆయుతం
ఆగమములోని భేదాలు: 1.
అజ్ఞేయం
15. వీరాగమము :
ఏ ముఖమునుండి వెలువడినది : అఘోర
మొదట-అతని నుండి భొదనొందిన వారు : తేజుడు => ప్రజాపతి
శ్లోకాల సంఖ్య : నియుతం
ఆగమములోని భేదాలు: 1.
ప్రస్తర తంత్ర 2. ప్రస్ఫుర తంత్ర 3 ప్రభోదక తంత్ర 4 భొదక తంత్ర 5 అమోహ తంత్ర 6 మొహసమయ తంత్ర 7 శకట తంత్ర 8 శాకటీయక తంత్ర 9 హల తంత్ర 10 లేఖన తంత్ర 11 భద్ర తంత్ర 12 వీర తంత్ర 13 అమలం
16. రౌరవాగమము :
ఏ ముఖమునుండి వెలువడినది : తత్పురుష
మొదట-అతని నుండి భొదనొందిన
వారు : బ్రహ్మణేశుడు => నందికేశ్వరుడు
శ్లోకాల సంఖ్య : 8 అర్భుదములు
ఆగమములోని భేదాలు:1 కళా దహన 2 రౌరవోత్తర 3 కౌమార 4 కాళ 5 మహాకాల 6 ఇంద్రాగమం
17. మకుటాగమము :
ఏ ముఖమునుండి వెలువడినది : తత్పురుష
మొదట-అతని నుండి-అతని నుండి
భొదనొందిన వారు : చషాక్ష్యుడు =>
మహాదేవుడు
శ్లోకాల సంఖ్య : 1 లక్ష
ఆగమములోని భేదాలు: 1 మకుటం 2 మకుటోత్తరం
18. విమలాగమము:
ఏ ముఖమునుండి వెలువడినది : తత్పురుష
మొదట-అతని నుండి-అతని నుండి
భొదనొందిన వారు : సర్వాత్మకుడు =>
వీరభద్రుడు
శ్లోకాల సంఖ్య : 3 లక్షలు
ఆగమములోని భేదాలు: 1 అనంత భాగ 2 ఆక్రాంత 3 హ్రుద్వహాస 4 ఆలిప్రతాగమ 5 అద్భుత 6 మారణ తంత్ర
19. చంద్రజ్ఞానాగమము :
ఏ ముఖమునుండి వెలువడినది : తత్పురుష
మొదట-అతని నుండి-అతని నుండి
భొదనొందిన వారు : అనంతుడు ==> బృహస్పతి
శ్లోకాల సంఖ్య : 3 కోట్లు
ఆగమములోని భేదాలు: 1 స్థిర సంహిత 2 స్థాణు సంహిత 3 మహంత సంహిత 4 నంది సంహిత 5 నందికేశ్వర సంహిత 6 ఏకపాద పురాణ 7 శంకరాగమ 8 నీలభద్ర తంత్ర 9 శిభద్రాగమ 10 కళభేద 11 శ్రీముఖ 12 శివశాసన 13 శివరేఖరాగ 14 దేవీమతం
20. బింబాగమము :
ఏ ముఖమునుండి వెలువడినది : తత్పురుష
మొదట-అతని నుండి భొదనొందిన
వారు : ప్రశాంతుడు => దధీచి
శ్లోకాల సంఖ్య : 1 లక్ష
ఆగమములోని భేదాలు: 1 చతుర్ముఖ తంత్ర 2 మలయ తంత్ర 3 మహాయోగ 4 తపోభాగ 5 అప్రతిబింబ 6 అర్థాలంకార 7 వాయువ్య తంత్ర 8 కౌపిక తంత్ర 9 కుతుపినికర 10 తురావృత్త 11 తులాయోగ 12 కుట్టిమ తంత్ర 13 వర్గశేఖర 14 మహావిద్య 15.
మహాసారంబు
21. ప్రోద్గీతాగమము:
ఏ ముఖమునుండి వెలువడినది : ఈశాన
మొదట-అతని నుండి-అతని నుండి
భొదనొందిన వారు : శూలి => కవచాఖ్యుడు
శ్లోకాల సంఖ్య : 3 లక్షలు
ఆగమములోని భేదాలు: 1 కవచాగమ 2 వరాహతంత్ర 3 పింగళమత 4 పాశాబంధ సంహిత 5 దండధర తంత్ర 6 కుశ తంత్ర 7 ధనుధారిణ 8 శివజ్ఞా 9 విజ్ఞాన 10 ఆయుర్వేద 11 ధనుర్వేద 12 సర్పదంష్ట్ర విభేదన 13 సంగీత 14 భారత 15 అలోడ్యంబు 16 త్రికాల జ్ఞానము
22. లలితాగమము :
ఏ ముఖమునుండి వెలువడినది : ఈశాన
మొదట-అతని నుండి భొదనొందిన
వారు : మలయుడు => లలితుడు
శ్లోకాల సంఖ్య : 8 వేలు
ఆగమములోని భేదాలు: 1 లలిత 2 లలితోత్తర 3 కౌమార తంత్ర 4 విఘ్నేశ్వరాగామము
23. సిద్దాగమము:
ఏ ముఖమునుండి వెలువడినది : ఈశాన
మొదట-అతని నుండి భొదనొందిన
వారు : ఇంద్రుడు => చండీశ్వరుడు
శ్లోకాల సంఖ్య : సార్థకోటి
ఆగమములోని భేదాలు: 1 సారోత్తర 2 దేవేశోత్తర 3 శాలభేద 4 శశిమండలం
24. సంతానాగమము:
ఏ ముఖమునుండి వెలువడినది : ఈశాన
మొదట-అతని నుండి భొదనొందిన
వారు : వసిష్టుడు => వైశంపాయనుడు
శ్లోకాల సంఖ్య : 6 వేలు
ఆగమములోని భేదాలు: 1 లింగాధ్యక్ష 2 అనాధ్యక్ష 3 శంకర తంత్ర 4 మహేశ్వరాగమ 5 అసంఖ్య తంత్ర 6 అనిలాగమం 7 ద్వంద్వాగమం
25. సర్వోక్తాగమము :
ఏ ముఖమునుండి వెలువడినది : ఈశాన
మొదట-అతని నుండి భొదనొందిన
వారు : సోముడు => నృసింహుడు
శ్లోకాల సంఖ్య : 2 లక్షలు
ఆగమములోని భేదాలు: 1 శివధర్మోత్తరం 2 ధర్మ 3 వాయుప్రోక్తం 4 దివ్యప్రోక్తం 5 ఈశానం
26. పారమేశ్వరాగమము :
ఏ ముఖమునుండి వెలువడినది : ఈశాన
మొదట భొదనొందిన వారు : దేవి
శ్లోకాల సంఖ్య : 12 లక్షలు
ఆగమములోని భేదాలు: 1 మాతంగ తంత్ర 2 పద్మాగమ 3 పాషర 4 సుప్రయోగ 5 హంసాగమ 6 సామాన్యాగమ
27. కిరాణాగమము :
ఏ ముఖమునుండి వెలువడినది : ఈశాన
మొదట-అతని నుండి భొదనొందిన
వారు :
దేవపితృడు => సంవర్ధకుడు
శ్లోకాల సంఖ్య : 5 కోట్లు
ఆగమములోని భేదాలు: 1 గరుడాగమ 2 నైరుతాగమ 3 నీలాగమ 4 రిక్షాగమ 5 భానాగమ 6 వైక్రమాగమ 7 బుద్దాగమ 8 ప్రబుద్దాగమ 9 కాల తంత్రము
28. వాతులాగమము :
ఏ ముఖమునుండి వెలువడినది : ఈశాన
మొదట-అతని నుండి భొదనొందిన
వారు : శివరుద్రుడు => మహాకాళుడు
శ్లోకాల సంఖ్య : 1 లక్ష
ఆగమములోని భేదాలు: 1 వాతుళ 2 ఉత్తర వాతుళ 3 కాలజ్ఞాన 4 ప్రరోచిత 5 సర్వాగమ 6 సర్వాష్టాగమ 7 శ్రేష్టాగమ 8 నిత్యాగమ 9 శుద్దాగమ 10 మహానాగమ 11 విశ్వాగమ 12 విశ్వాత్మకాగమ
28 ఆగమాల శ్లోకాలను ఒకటిగా
కూడినచో సంఖ్యను ఈ విధంగా తెలుపుదురు: 2 శంఖములు, 1 పద్మము, 1 అ ర్భుధము, 19 కోట్ల 38 లక్షల 44 వేలు (శ్లోకాలు)
భేదములు - 196
Note: ఆగమాల భేదాల విషయంలో సంఖ్యా,
నామాల విషయాల్లో అక్కడక్కడ తేడా కనిపిస్తుంది.
ఈ 28 ఆగమాలను శివ, రుద్ర భేదములతో 2 విధాలుగా విభజించి చూపుతారు :
శివభేద ఆగమాలు : 10
1. కామికాగమము 2. యోగజాగమము 3. చింత్యాగమము
4. కారణాగమము 5. అజితాగమము 6. దీప్తాగమము
7. సూక్ష్మాగమము 8. సహస్రాగమము 9. అంశుమానాగమము
10 సుప్రభేదాగమము
రుద్రభేద ఆగమాలు:18
1. విజయాగమము 2. నిశ్వాసాగమము 3. స్వాయంభువాగమము
4. అనలాగమము 5. వీరాగమము 6. రౌరవాగమము
7. మకుటాగమము 8. విమలాగమము 9. చంద్రజ్ఞానాగమము
10. బింబాగమము 11. ప్రోద్గీతాగమము 12. లలితాగమము
13. సిద్దాగమము 14. సంతానాగమము 15. సర్వోక్తాగమము
16. పారమేశ్వరాగమము 17. కిరాణాగమము 18. వాతులాగమము
ఇంకా చదవండి »
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)





