• విష్ణుషట్పదీ స్తోత్రం

    నారాయణ నారాయణ జయ గోవింద హరే |నారాయణ నారాయణ జయ గోపాల హరే ||

  • శ్రీ రామ

    ఆపదం అపహర్థారమ్ దాతారం సర్వ సంపదం, లోకాభి రామం శ్రీ రామం భూయో భూయో నమామ్యహమ్I

  • శ్రీ సీతామాత

    త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ, హనుమాన్ యత్న మాస్తాయ దు:ఖ: క్షయ కరోభవ

  • ఓం నమ:శివాయ:

    చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర పాహిమామ్ , చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర రక్షమామ్ I

  • శ్రీమాత్రే నమః

    అమ్మల గన్న యమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాల పెద్దమ్మ, సురారులమ్మ కడుపారడి పుచ్చిన యమ్మ, తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ మాయమ్మ కృపాబ్ధి నిచ్చుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్

  • శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు

    పురుషోవిష్ణు రిత్యుక్తః శివోనానామతః స్మృతః I అవ్యక్తం తు ఉమాదేవీ శ్రీర్వా పద్మ నిభేక్షణా I తత్ సంయోగా దహంకారః స చ సేనాపతిరుహః I

వ్రతం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

అమ సోమవతి వ్రతం - సోమవారం + అమావాస్య

సోమవారం + అమావాస్య రోజున ఆడవారు సౌభాగ్యం కోసం ఈ వ్రతం చేయవచు . శనివారం రోజున మాత్రమే చెట్టుని తాకాలి , సోమవారం రోజున చెట్టుని తాకకూడదు .  సోమవారం రోజున తెల్లవారు ఝామున లేచి దేవాలయలం వేప చెట్టు రావి చెట్టు కింద నాగ శిలలు ఉణ్టయి , ప్రదక్షిణ చేసి దీపారధన చేసి. శిలలు కి నిలతో తడిపి పద్మం ముగ్గు పెట్టి , చెట్టుకి గంధం కలిపిన నీలు పోస్తూ మొదటి ప్రదక్షిణ చేసుకోవాలి తరువాత 108 ప్రదక్షిణలు చేయాలి. ఆమ సోమ వార వ్రాత కధ పుస్తకం లో శ్లోకాలు చుడువుకోవాలి. ఒక వేల కధ పుస్తకం దొరకక పోతే కూడా కింద శ్లోకం చడుకుంటూ ప్రదక్షిణ చేయాలి. నిత్య సౌభాగ్య వతి గ దీవించమని వెదుకొవలి. పండు నైవేద్యం నివేదించాలి. తరువాత ముతయిదువులకి పండు తాంబూలం ఇవ్వాలి.






ఇంకా చదవండి »

అమ్మవారు స్వయంగా చెప్పిన పూజలు వ్రతాలూ ఏమిటి?

ప్రతి రోజు సాయంత్రం / ప్రదోష కాలం లో అమ్మవారు , శివుడు ఆనంద తాండవం చేస్తూ ఉంటారు అంట. ఈ సమయమా లో చేసే పూజలు అంటే అమ్మవారికి చాల ఇన్స్టం అంట. అవి ఆర్ద్రనతకరి అని , అనంత తృతీయ, రసకల్యని అని వ్రతం చాలా ఇష్టం అని పురాణ వచనం. ప్రతి శుక్రవారం అమ్మవారికి అర్చన  చేయటం అత్యంత ప్రీతికరమ్. 

ప్రతి మంగళవారం అమ్మవారిని సేవించడం, పూజ చేయటం, అర్చన చేయటం , వ్రతం చేయటం కూడా విశేషం అని అమ్మవారు చెపుతుంది. ఎవరు మంగళవారం అమ్మవారిని పూజ చేస్తారో వారికీ శత్రు పీదలు ఉండవు , రోగ నివారణ , అప్పులు , రుణాలు తీరిపొతాయి అని , కుజ గ్రహ దోషాలు జాతకం లో ఎక్కడ ఉన్న కూడా దోష పరిహారం అవుతుంది అని, అమ్మవారికి అత్యంత ప్రీతికర్మయిన రోజు ఈ బౌమవారం (మంగళవారం) అని చెపుతారు. ఎవర్ని అయితే అమ్మవారు కరునిస్తుందో వారి ఇంటికి అమ్మవారు కదిలి వస్తుందంట. పిలవని పేరంటం ఎవరు వస్తారో వారే అమ్మవారి స్వరూపమ్ గా చెపుతారు. 

కృష్ణ చతుర్దశి (బహుళ చతుర్దశి ) , ప్రతి మాసం లో అమావస్య కంటే ముందు వచ్చే చతుర్దశి రోజున అమ్మవారిని స్తుతించటం వలన అమ్మవారి క్రుపకి పత్రులు కావచ్చు. 

నవరాత్రి ద్వయం అంటే సేరనవరత్రులు ( దుస్సేర నవరాత్రి )  , వసంత నవరాత్రులు ( ఉగాది నుంచి శ్రీ రామ నవమి వరకు చేసేది). అమ్మవారికి అత్యంత ప్రీతికరమయిన నవరాత్రులు. 

వసత నవరాత్రులు ఎందుకు అమ్మవారికి ఇన్స్టం అంటే దేవి భాగవతం లో " శ్రీ రామో లలితంబికా , శ్రీ కృష్ణో శ్యామలంబ " అంటారు,  అంటే శ్రీ రాముడు ఎవరో కాదు లలితా పరమేసవరే , స్వరూపం రాముడు, అవతారం లలితాంబ అని చెపుతారు. శ్రీ రాముడకి పూజ చేసిన అమ్మవారికి పూజ చేసినట్టే. అందుకనే శ్రీ రామ నవరాత్రులలో కూడా అమ్మవారికి పూజ చేస్తారు.

అమ్మవారు మనల్ని ఎలా ఏ రూపం లో అనుగ్రహిస్తుంది ? 

కాలి , చండి , బాల, లలిత , దుర్గ అనేక రూపాలలో ఉండి మనని నడిపిస్తుంది , కరుణిస్తుంది అని అనుమానం? 
ఒకటి అని కాదు అమ్మవారు సకల వ్యాప్తం అయి ఉంది . మాత్రు రుపం , శాంతి రూపం , ఆకలి రూపం లో , జాతి రూపం లో , చైతన్య స్వరూపం , నిద్ర రూపం లో , దయా రూపం లో , బుద్ది రూపం లో కూడా అమ్మవారు ఉంది మానని నడిపిస్తుంది. 

అమ్మవారిని ఏమి కూరుకోవాలి?
కొందరు పిల్లలు కావాలి అని , ఇల్లు కట్టుకోవాలి అని , పెళ్లి కావాలని రక రకాల కోరికలు కొరతమ్. కానీ ఏది కోరిన మల్లి దాని వలన కలిగే సుకం అల్పం , క్షణికం . అది తీరగానె మల్లి ఇంకో కోరిక వస్తుంది. మరి ఏమి కోరాలి ? శంకరాచార్య అంటారు " నన్ను కరుణించు , నాతో ఉండు" మోక్షం వద్దు , విద్య వద్దు , సంపదలు వద్దు , కానీ నీ నామ స్మరణ చాలు , నాతో ఉండాలి.  ఎప్పుడు నీ పాదాల చెంత భక్తీ కలిగి ఉండాలి , ఎప్పుడు కరునిస్తూ ఉండాలి , నన్ను ధర్మమయిన మార్గం లో నడిపించాలి నాయి కోరుకోవాలి. 

ఇంకా చదవండి »

పిత్రుపక్షాలు అంటే ఏమిటి ? ఎం చేయాలి ?


భాద్రపదమాసం పౌర్ణిమ తెల్లవారి మొదలుకొని భాద్రపద బహుళ అమావాస్య వరకు (పెద్దల అమావాస్య అని కూడా అంటారు) పిత్రుపక్షాలు (పక్షం అంటే 15 రోజులు). ఈ 15 రోజులు పెద్దలందరికీ శ్రాద్ధ కర్మలు చేయాలి.

మాములుగా పెద్దలు ఏ నెలలో, ఆ తిధి లో చనిపోతే మల్లి సంవత్సరం ఆ తిధి లో చేస్తారు. అది చేస్తూనే ఈ పితృ పక్షాలలో కూడా చేయాలి. మాసం అవసరం లేదు కానీ ఆ తిధి లో చేయాలి. పూర్వకాలం లో అయితే ఈ 15 రోజులు, రోజు చేసే వారు. కానీ కలమనల్ని అనుసరించి కేవలం అ తిధి రోజు చేస్తే సరిపోతుంది . పెద్దలు అమ్మ , నాన్న , అన్నయ , వదిన ఎవరి తిధి అయితే వాళ తిధి రోజు చెయలి. అందరిది కలిపి ఒకే రోజు చేయడానికి వీలులెధు. అది దోషం . మాములు గతించిన వారి తిధి లో చేసిన , మల్లి ఈ పితృ పక్షాలలో కచితంగా చేయాలి.

ఒక 80 ఎల్లా తాతగారు పోయారు , 50 ఎలా కొడుకు ఉంటాడు , తనకి 30 ఎలా కొడుకు ఉంటాడు తిన పిల్లలికి పుట్టెంటుకలు , అన్న ప్రాసన, గృహ ప్రవేశం అలాంటివి చేసుకోవచు. ఎవరు కర్మ చేసారో వాలు మాత్రమే చేయకూడదు. చనిపోయిన వ్యక్తీ కూతురు అని కార్యక్రమాలు చేసుకోవచు. పిట్ల మీద కుర్చువడం, కన్యాదానం చేసుకోవచు , పోయిన తాత గారి చెల్లెలు ఉంది తను అని సుబకర్యాలు చేసుకోవచు.

తల్లి తండ్రులు పోయిన తరువాత, ఆ సంవత్సరం కన్యాదానం చేయవచా ?
చేయవచ్చు , అల చేయటం వలన చనిపోయిన వారికీ కన్య దానం చేసిన ఫలితం లబిస్తుంది. పెళ్లి లో కూడా నాంది శ్రాద్ధం ఉంటుంది . అల చేసినప్పుడు పెద్దలు వచ్చి అసీర్వదిస్థరు.

కర్మ చేసిన వారికీ సంవత్సరం వరకు ఎటి సూతకం ఉంటుంది. వారు ఎలాంటి సుబకార్యాలు, కంకణం కట్టుకుని చేసే కార్యక్రమాలు కానీ , గుడికి వెళ్ళటం కానీ చేయకూడదు. పిన్ని బాబాయి , చిన్న నానా , పెద్ద నాన్న పోతే కర్మ చేయని వాళ్ళకి ఏటి సూతకం ఉండదు.

కర్మ చేసిన వారు దీపారాధన , నైవేద్యం పెట్టవచున?
అన్నీ కార్యక్రమాలు అయిపోయిన తరువాత 12 వ రోజు దీపం పెట్టిస్తారు. అప్పటినుంచి ఇంట్లో నిత్య పూజ చేయవచు. నిత్య చేసుకునే పూజ, జపం , పారాయణం చేసుకోవచు. కానీ బీజ అక్షరాలు తో కుంకుమ పూజ అవి చేయకూడదు .


గయా ప్రయాగలో శ్రాద్ధ చేసిన ఫలితం రావళి అంటే పిత్రుపక్షం లో వచ్చే భరణి నక్షత్రం రోజున చేయాలి. శుక్ర వారం రోజున , ఏకాదశి రోజున చేయకూడదు. సన్యసించిన వారికి మాత్రం ద్వాదశి తిధి రోజున చేయాలి.

ఇంకా చదవండి »

వరలక్ష్మీ వ్రతం కధ

శ్రావణమాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీ వ్రతంగా జరుపుకోవడం ఒక హిందూ ఆచారం. 
నమస్తేస్తు మహామామే శ్రీ పీఠే సుర పూజితే
శంఖచక్ర గదా హస్తే మహాలక్ష్మీ నమోస్తుతే

తాత్పర్యం : మహామాయారూపిణి, శ్రీపీఠవాసిని, దేవతలు నిరంతరం సేవించే లోకమాత, శంఖ, చక్ర, గదల్ని ధరించిన మహాలక్ష్మీ దేవి అష్త్టెశ్వర ప్రదాయిని. అష్ట సంపదల్ని అందించే జగన్మంగళ దాయిని. అష్త్టెశ్వరాల్నీ కలగజేసే అష్టలక్ష్మి రూపాన్నే వరలక్ష్మీ దేవిగా మనం ఆరాధిస్తాం. భక్తితో పూజించినవారికీ, కొలిచినవారికీ కొంగుబంగారమై వరాలనిచ్చే మహాలక్ష్మే వరలక్ష్మి.

పురాణ గాధ
స్కాంద పురాణంలో పరమేశ్వరుడు వరలక్ష్మీ వ్రతం గురించి పార్వతీదేవికి వివరించిన వైనం ఉంది. లోకంలో స్త్రీలు సకల ఐశ్వర్యాలనూ, పుత్రపౌత్రాదులనూ పొందేందుకు వీలుగా ఏదైనా ఓ వ్రతాన్ని సూచించమని పార్వతీదేవి ఆది దేవుణ్ని కోరుతుంది. అప్పుడు శంకరుడు, గిరిజకు వరలక్ష్మీ వ్రత మహాత్మ్యాన్ని వివరించాడని చెబుతారు. అదే సందర్భంలో శివుడు ఆమెకు చారుమతీదేవి వృత్తాంతాన్ని తెలియజేశాడంటారు. భర్త పట్ల ఆదరాన్నీ, అత్తమామల పట్ల గౌరవాన్నీ ప్రకటిస్తూ చారుమతి ఉత్తమ ఇల్లాలుగా తన బాధ్యతల్ని నిర్వహిస్తూ ఉండేది. మహాలక్షీదేవి పట్ల ఎంతో భక్తిశ్రద్ధలు కలిగిన చారుమతి, అమ్మవార్ని త్రికరణ శుద్ధిగా పూజిస్తుండేది. ఆ మహా పతివ్రత పట్ల వరలక్ష్మీదేవికి అనుగ్రహం కలిగి, స్వప్నంలో ఆమెకు సాక్షాత్కరిస్తుంది. శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారాన తనను ఆరాధిస్తే కోరిన వరాలన్నీ ఇస్తానని ఆమెకు దేవదేవి అభయమిస్తుంది. అమ్మ ఆదేశానుసారం వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించి చారుమతి సమస్త సిరి సంపదల్ని అందుకుందని ఈశ్వరుడు, గౌరికి విశదపరచాడని పురాణ కథనం. దాంతో పార్వతీ దేవి కూడా ఈ వ్రతాన్ని ఆచరించి, వరలక్ష్మి కృపకు పాత్రురాలైందని చెబుతారు.

ఎందుకు ఈ వ్రతం
అష్టలక్ష్ముల్లో వరలక్ష్మీదేవికి ఓ ప్రత్యేకత ఉందంటారు. మిగిలిన లక్ష్మీ పూజలకంటే వరలక్ష్మీ పూజ శ్రేష్ఠమని శాస్త్ర వచనం. శ్రీహరికి ఇష్టమైన, పైగా విష్ణువు జన్మనక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణ మాసంలో ఈ వ్రతాన్ని చేస్తే విశేష ఫలితాలు లభిస్తాయంటారు. సర్వమంగళ సంప్రాప్తి కోసం, సకలాభీష్టాలకోసం, నిత్య సుమంగళిగా తాము వర్ధిల్లాలని పుణ్యస్త్రీలు ఈ వ్రతం చేస్తారు. దక్షిణ భారతదేశంలో ఈ వరలక్ష్మీ వ్రతాన్ని వివిధ సంప్రదాయాల్లో ఆచరిస్తారు. ఎవరు ఏ పద్ధతులు పాటించినా శ్రీ లక్ష్మిని కొలిచే తీరు మాత్రం అందరిదీ ఒక్కటే! సకల శుభంకరమైన, సన్మంగళదాయకమైన వరలక్ష్మీదేవి పూజ జగదానందకరమైనదని భక్తులందరి ప్రగాఢ విశ్వాసం.

ఇంకా చదవండి »

మహాశివరాత్రి వ్రత కథ

ఒకనాడు కైలాసపర్వత శిఖరముపై పార్వతీపరమేశ్వరులు సుఖాసీనులై ఉండగా పార్వతి శివునితో అన్ని వ్రతములలోను ఉత్తమమగు వ్రతమును భక్తి ముక్తి ప్రదాయకమైన దానిని తెలుపమని కోరెను. అప్పుడు శివుడు శివరాత్రి వ్రతమనుదాని విశేషాలను తెలియజేస్తాడు. దీనిని మాఘబహుళచతుర్దశి నాడు ఆచరించవలెననితెలిసికానితెలియకగాని ఒక్కమారు చేసినను యముని నుండి తప్పుంచుకొని ముక్తి పొందుదురని దాని దృష్టాంతముగా ఈ క్రింది కథను వినిపించెను.

ఒకప్పుడు ఒక పర్వతప్రాంతమున హింసావృత్తిగల వ్యాధుడొకడు వుండెను. అతడు ప్రతి ఉదయం అడవికి వేటకు వెళ్ళి సాయంత్రం ఏదేని మృగమును చంపి తెచ్చుచు కుటుంబాన్ని పోషించేవాడు. కానీ ఒకనాటి ఉదయమున బయలుదేవి అడవియంతా తిరిగినా ఒక్క మృగము కూడా దొరకలేదు. చీకటిపడుతున్నా ఉత్తచేతులతో ఇంటికి వెళ్ళడానికి మనస్కరించక వెనుతిరిగెను. దారిలో అతనికొక తటాకము కనిపించెను. ఏవైనా మృగాలు నీరు త్రాగుట కోసం అచ్చటికి తప్పకుండా వస్తాయని వేచియుండి వాటిని చంపవచ్చునని ఆలోచించి దగ్గరనున్న ఒక చెట్టెక్కి తన చూపులకు అడ్డముగా నున్న ఆకులనుకాయలను విరిచి క్రింద పడవేయసాగెను. చలికి "శివ శివ" యని వణుకుచూ విల్లు ఎక్కిపెట్టి మృగాల కోసం వేచియుండెను.

మొదటిజామున ఒక పెంటిలేడి నీరు త్రాగుటకు అక్కడికి వచ్చెను. వ్యాధుడు దానిపై బాణము విడువబోగా లేడి భయపడక "వ్యాధుడా! నన్ను చంపకుము" అని మనుష్యవాక్కులతో ప్రార్ధించెను. వ్యాధుడు ఆశ్చర్యపడి మనుష్యులవలె మాట్లాడు నీ సంగతి తెలుపుమని కోరెను. దానికి జింక "నేను పూర్వజన్మమున రంభయను అప్సరసను. హిరణ్యాక్షుడను రాక్షసరాజును ప్రేమించి శివుని పూజించుట మరచితిని. దానికి రుద్రుడు కోపించి కామాతురయైన నీవునీ ప్రియుడును జింకలుగా పన్నెండేళ్లు గడిపి ఒక వ్యాధుడు బాణముతో చంపనుండగా శాపవిముక్తులౌదురని సెలవిచ్చెను. నేను గర్భిణినిఅవధ్యను కనుక నన్ను వదలుము. మరొక పెంటిజింక ఇచటికి వచ్చును. అది బాగుగా బలిసినదికావున దానిని చంపుము. లేనిచో నేను వసతికి వెళ్ళి ప్రసవించి శిశువును బంధువుల కప్పగించి తిరిగివస్తాను" అని అతన్ని వొప్పించి వెళ్ళెను.

రెండవజాము గడిచెను. మరొక పెంటిజింక కనిపించెను. వ్యాధుడు సంతోషించి విల్లెక్కుపెట్టి బాణము విడువబోగా అదిచూచిన జింక భయపడి మానవవాక్కులతో "ఓ వ్యాధుడానేను విరహముతో కృశించియున్నాను. నాలో మేదోమాంసములు లేవు. నేను మరణించినా నీ కుటుంబానికి సరిపోను. ఇక్కడికి అత్యంత స్థూలమైన మగజింక యొకటి రాగలదు. దానిని చంపుముకానిచో నేనే తిరిగివత్తును" అనెను. వ్యాధుడు దానిని కూడా విడిచిపెట్టెను.

మూడవజాము వచ్చెను. వ్యాధుడు ఆకలితో జింక కోసం వేచియుండెను. అంతలో ఒక మగజింక అక్కడికి వచ్చెను. వింటితో బాణము విడువబోగా ఆ మృగము వ్యాధుని చూచి మొదటి రెండు పెంటి జింకలు తన ప్రియురాలుల్ని తానే చంపెనా అని ప్రశ్నించెను. అందుకు వ్యాధుడు ఆశ్చర్యపడి రెండు పెంటిజింకలు మరలివచ్చుటకు ప్రతిజ్ఞచేసి వెళ్ళినవినిన్ను నాకు ఆహరముగా పంపుతాయని చెప్పాయని అన్నాడు. ఆ మాట విని "నేను ఉదయాన్నే మీ ఇంటికి వచ్చెదను నా భార్య ఋతుమతి. ఆమెతో గడిపి బంధుమిత్రుల అనుజ్ఞపొంది మరలివత్తును అని ప్రమాణములు చేసి వెళ్ళెను.

ఇట్లు నాలుగు జాములు గడిచి సూర్యోదయ సమయంలో వ్యాధుడు జింకల కొరకు ఎదురుచూచుచుండెను. కొంతసేపటికి ఆ నాలుగు జింకలును వచ్చి నన్ను మొదట చంపుమునన్నే మొదట చంపుమని అనుచు వ్యాధుని ఎదుట మోకరిల్లెను. అతడు మృగముల సత్యనిష్టకు ఆశ్చర్యపడెను. వానిని చంపుటకు అతని మనసు ఒప్పలేదు. తన హింసావృత్తిపై జుగుప్స కలిగెను.

"ఓ మృగములారా ! మీ నివాసములకు వెళ్ళుము. నాకు మాంసము అక్కరలేదు. మృగములను బెదరించుటబంధించుటచంపుట పాపము. కుటుంబము కొరకు ఇక నేనా పాపము చేయను. ధర్మములకు దయ మూలము. దమయు సత్యఫలము. నీవు నాకు గురువుఉపదేష్టవు. కుటుంబ సమేతముగా నీవు వెళ్ళుము. నేనిక సత్యధర్మము నాశ్రయించి అస్త్రములను వదలిపెట్టుదును." అని చెప్పి ధనుర్బాణములను పారవేసి మృగములకు ప్రదక్షిణ మాచరించి నమస్కరించెను.

అంతలో ఆకాశమున దేవదుందుభులు మ్రోగెను. పుష్పవృష్టి కురిసెను. దేవదూతలు మనోహరమగు విమానమును తెచ్చి యిట్లనిరి : ఓ మహానుభావా. శివరాత్రి ప్రభావమున నీ పాతకము క్షీణించినది. ఉపవాసముజాగరమును జరిపితివితెలియకయే యామయామమునను పూజించితివినీవెక్కినది బిల్వవృక్షము. దానిక్రింద స్వయంభూలింగమొకటి గుబురులో మరుగుపడి యున్నది. నీవు తెలియకయే బిల్వపత్రముల త్రుంచివేసి శివలింగాన్ని పూజించితివి. సశరీరముగా స్వర్గమునకు వెళ్ళుము. మృగరాజా! నీవు సకుటుంబముగా నక్షత్రపదము పొందుము."

ఈ కథ వినిపించిన పిదప పరమేశ్వరుడు పార్వతితో నిట్లనెను: దేవీ! ఆ మృగకుటుంబమే ఆకాశమున కనిపించు మృగశిర నక్షత్రము. మూడు నక్షత్రములలో ముందున్న రెండూ జింకపిల్లలువెనుకనున్న మూడవది మృగి. ఈ మూడింటిని మృగశీర్ష మందురు. వాని వెనుక నుండు నక్షత్రములలో ఉజ్జ్వలమైనది లుబ్ధక నక్షత్రము.

ఇంకా చదవండి »

మాఘ బహుళ సంకష్ట హర చతుర్తి

ప్రతీ నెల కూడా బహుళ చవితి రోజున గణపతిని అర్చిస్తూ ఉంటారు, అభిషేకం , హోమం చేస్తుంటారు . బహుళ చవితి కి విశేషం . బాద్ర పద మాసంలో వచ్చే సుద్ధ చవితి కి వినాయక చవితి చేస్తాము ఎందుకంటే ఆ రోజు అయన అవతరించారు అని పూజ చేస్తుంటాము . బాద్ర పద బహుళ చవితి ఎంత విశిష్టత ఉందో అంతే విశిష్టత  మాఘ బహుళ చవితి కూడా ఉంది . మాఘ మాసం లో వచ్చే సుద్ధ చవితి కి బహుళ చవితి కి విశేషం .

చవితి రోజున వినాయకుడికి పూజ ఒకలాగా ఉంటుంది . సుద్ధ చవితి కి పొద్దున్న పూజ చేస్తారు అంటే అభిషేకం , హోమం , పూజ చేస్తుంటారు కానీ పూర్ణిమ తరువాత వచ్చే బహుళ చతుర్ది మాత్రం చంద్రోదయం అయాక మాత్రమే విశేష పూజ చేయాలి. సాయంత్రమే చంద్రోదయం అయాక మాత్రమే పూజ చేయాడం విశేషం . పద్దతి కూడా సాయంత్రమే పూజ చేయాలి . పొద్దున్న నుంచి ఉపవసించి సాయంత్రం చంద్రోదయం అయ్యాక అభిషేకం చేసి , అర్చన చేసి , చంద్రుడికి , రోహిణి నక్షత్రానికి , చతుర్ది తిథి కి అర్గ్యమ్ ఇచే పద్దతి కూడా ఉంది . బాద్రపద సుద్ద చవితి రోజున గణపతి కి పూజ చేయడం వలన గణపతి అనుగ్రహం ఎలా కలుగుతుందో , గణపతి పూజ కి ఎలా విసిష్టమైనదో మాఘ సుద్ధ , బహుళ చవితి కూడా అంటే విసిష్టమయినది పురాణాలూ చెపుతునయి . 

అయితే ఆ రోజు పూజ ఎలా చేయాలి . ఏ రూపంలో గణపతిని తలుచుకోవాలి ? ఎం నైవేద్యం పెట్టాలి అని శివమహపురణం , గణపతి పురాణం లో ఉంది.

ఎవరయిన సంకష్టహర చతుర్థి ప్రారంబించాలి అని అనుకుంటే మాఘ బహుళ చవితి , శ్రావణ బహుళ చవితి కానీ ప్రారంబించాలి. ఎవరయినా కాశి క్షేత్రం లో ఉన్న తప్పకుండ మాఘ బహుళ చవితి రోజున దుండి గణపతి ని దర్శించుకోవాలి . కాశి క్షేత్రం లో ఉండి మాఘ బహుళ చవితి రోజున దుండి గణపతి ని దర్సించకపొతె తప్పు అని కూడా చెపుతారు . అక్కడ లేకపోయినా దుండి గణపతిని తలచుకుని నమస్కరించుకొవదమ్ కూడా విశేషం . 

మాఘ బహుళ చవితి రోజున ఎం చేయాలి?
ఈ రోజున తలమీద నుంచి స్నానం చేసి సంకాల్పమ్ చెప్పుకోవాలి . ఈ రోజు నుండి ఒక సంవత్సర కాలం పాటు సంకష్ట హర చతుర్ది చేస్తాను , ఏ విఘ్నాలు కలగకుండా చూదమని , మనకి ఉండే కామనలు , లేదా కోరికలు ఆటంకాలు కలుగుతునాయో , ఆ ఆటంకాలు తొలిగిపొవలి అని సంకల్పం చేసుకోవాలి . ఉదయం పూజ చేయాలి , అభిషేకం చేయాలి , హోమం చేయాలి . ఆ రోజు అంతా ఉపవసించాలి . రాత్రి మల్లి అభిషేకం చేయాలి , గణపతి కి ఎర్రని బట్టతో అలంకరించాలి , ఎర్ర చందనం/ రక్త చందనం తో  అలకరించలి . జిల్లేడు పువ్వులు , గరిక , తుమ్మి పువ్వులు , బిల్వ పత్రం తో పూజ చేయాలి . గణపతి కి ఎర్రని పూలు అంటే చాల ఇష్టం . ఎర్ర మందార పూలు , కలువలు తో మాలలు చేసి గణపతికి అలకరించలి . 

నైవేద్యం 
పాయసం , లడ్డు , ముక్యంగా మాఘ మాసం లో నువ్వులు బెల్లం తో చేసిన లడ్డులు నివేదన తప్పకుండ చేయాలి. మొదకలు (సహస్ర మొదకలు ఎవరు నివేదన చేస్తారో వారికీ సకల సంకటాలు తిసివేస్తాడు అంట ). 

గణపతి కి అర్ఘ్యం ఇచేట్టపుడు చదువుకొవలిసిన మంత్రం 


చతుర్ధి తిధి కి అర్ఘ్యం ఇచేట్టపుడు చదువుకొవలిసిన మంత్రం


చంద్రుడికి అర్ఘ్యం ఇచేట్టపుడు చదువుకొవలిసిన మంత్రం : రాగి పాత్రలో జలం తెల్లని  పువ్వులు , పసుపు , కుంకుమ , అక్షింతలు , పెరుగు వేసి అర్ఘ్యం ఇవ్వాలి . చంద్రుడికి కూడా నివేదన చేయాలి . 

అ తరువాత బ్రాహ్మణులకి లేదా పేద వారికీ భోజనం పెట్టి తరువాత గృహస్తు ఇంక ఉపవాసం ఉండలేను అనుకునే వారు భోజనం చేయాలి . లేకుంటే ఇంకా అ రాత్రి కి ఏమి తినకుండా రాత్రికి జాగరణ కూడా చేసి మరునాడు పునః పూజ చెహ్సిన తరువాతనే తినాలి . ఉండలేనివారు ఉపహారం చేసి అయిన ఉండవచ్చు . 

సాయంత్రం చంద్రుడికి , వినాయకుడికి , చతుర్ది తిధి కి అర్ఘ్యం ఇవాలి . 

మంగళవారం నాడు చవితి తిధి వస్తే అది అంగారక చతుర్ధి అని కూడా అంటారు . కుజ గ్రహం వలన బాద పడే వారు , మాంగల్య దోషాలు ఉన్న వాలు తప్ప కుండ చేయడం వలన వారికీ దోషాలు పోతాయి . మాఘ మాసంలో మంగళవారం నాడు సంకష్ట హర చతుర్ధి తిధి రావటం ఇంకా విశేషం . 

 సంకష్ట హర చతుర్తి తిధి నిర్ణయం ఎలా చేయాలి ? తిధి తగులు మిగులు వచ్చినప్పుడు , తిధి నిర్ణయం ఎలా చేయాలి ?

ధర్మసింధు గ్రంధల ప్రకారం సుద్ధ చవితి కి చేసే పూజ ప్రాతః కాల పూజ. సంకష్ట హర చతుర్తి కి మాత్రం కచితంగ చంద్రోదయానికి చతుర్ది తిధి ఉండాలి . పగలు మొత్తం చతుర్ధి తిధి ఉండి చద్రోదయానికి చతుర్ధి తిధి లేకపోతె ఆ రోజు సంకష్టహర చతుర్ధి కాదు . 

పూర్ణిమ రోజు అయితే సాయంత్రం సూర్యుడు అస్తమించే టప్పటికి చంద్రుడు కనిపిస్తాడు . బహుళ పక్షం లో చంద్రుడు కొంచం రావటం ఆలస్యం అవుతుంది , పాడ్యమి ఇంకా కొంచం ఆలస్యం , విదియ ,తదియ కి ిన ఆలస్యం , చవితి కి చంద్రోదయం సమాయం ఇంకా కొంచం ఆలస్యం అయి మనకి రోజు 8 గంటలకి వస్తుంది అనుకుంటే (క్యాలెండరు లో చూడవచు చంద్రోదయ సమయం ). అ సమయానికి చవితి తిధి ఉందా లేదా అని చూసుకుని చవితి ని పాటించాలి . చాల మంది ఉదయం అంతా చవితి తిధి ఉంది సాయంత్రం కూడా 7:45pm వరకు కూడా చవితి తిధి ఉంది కాబట్టి ఈ రిజే సంకష్టహర చతుర్ధి అంటారు , కానీ చద్రొదయనికి చవితి లేకపోతే అది సంకష్ట హర చతుర్ధి కాదు . అలాగే ఒకో సరి ఉదయం అంతా తదియ తిది ఉంది రాత్రి 7:30pm లేదా 7:50pm వరకు తదియ ఉండి తరువాత 8:00pm కి చవితి తిధి కలిస్తే ఆ రోజు చేయాలి . రేపు అంతా చవితి తిది ఉంది కదండీ రేపు రాత్రి 7:55pm వరకు కూడా ఉంది అనుకుటే రేపు చెయ్యకూడదు , ఎందుకంటే పగలు అంతా చవితి తిది ఉన్న చద్రోదయానికి పంచమి వచేస్తుంది కాబట్టి చవితి చేయకూడదు .  

అయితే ఒకో సరి ఈ రోజు చద్రొదయనికి చవితి తిధి కలిసి మరునాడు చంద్రోదయ సమయానికి కి కూడా చవితి తిధి ఉంటుంది . అంటే ఈ రోజు 8:15pm చవితి వచ్చి మరునాడు రాత్రి 9:00pm వరకు కూడా చవితి తిది ఉంటుంది . కానీ ధర్మ సింధు ఎం చెపుతుంది అంటే అల తిధి ద్వయం వచినప్పుడు పూర్వ దినమే చేయాలి మరునాడు రోజు చేయకూడదు . ఎందుకంటే తదియ తో మాత్రమే కలిసిన చవితి ని గణపతి కి పూజ చేయాలి తప్ప పంచమి తో కలిసిన తిదియ గణపతి పూజ కి నిషిద్దం, చెయ్యకూడదు . అందువలన తదియతొ కూడిన చతుర్ది మాత్రమే సంకష్ట హర చతుర్తి చేయాలి కానీ పంచమి తో కూడిన చతుర్ది చేయకూడదు . 
సంకష్ట హర చతుర్తి చేసేటప్పుడు ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి 
మనం శుక్లపక్షం లో పూజ చెస్తునామ? లేదా బహుళ పక్షం లో పూజ చెస్తునామ ? 
శుక్ల పక్షం లో పూజ చెసెవాలు , రాత్రి వరుకు ఉండనవసరం లేదు . శుక్ల పక్షం లో పూజ కూడా విశేషమే . ఉదయం పూజ చేసుకుంటే సరిపోతుంది . 

ఏదయినా కామ్యం కోసం , ఆటంకాలు తొలిగిపొవలిని కోరుకునేవారు మాత్రం బహుళ పక్షం లో వచ్చే చతుర్ధి తిధి లో పూజ చెయడం వలన సంకటాలు తొలొగిపోతాయని శాస్త్రం చెపుతుంది .

బహుళ పక్షం లో వచ్చే చతుర్ది తిధి చేసే వరన్దికి గుర్తుపెట్టుకోవలిసినది తిధి నిర్ణయం . పూర్ణ తిధి వస్తే ఎ గొడవ లేదు , కానీ ఒక వేల అల కాక తిధి ద్వయాలు ఏర్పడినప్పుడు (నక్షత్రం , గ్రహాల తో ఏ సంబంధం లేదు )  పొతే చన్ద్రొదయనికి చవితి తిధి ఉంటె చాలు . రాత్రి కి చవితి తిధి ప్రారంబం అయితే తదియ తో కలిసినది కాబట్టి ఆ రోజే ( సంకష్ట హర చతుర్తి ) చేయాలి కానీ మరునాడు చేయకూడదు . 

ఈ రోజు అంతా కూడాను కింది మంత్రం జపించటం వలన సంకటాలు అనీ తొలిగిపోతాయి . 


ఇంకా చదవండి »

మాఘమాస గౌరీవ్రత మహాత్మ్యం

మాఘమాసంలో ఉదయాన్నే నదీ స్నానం చేయటం, ఆ తర్వాత ఇష్టదైవాన్ని భక్తిగా కీర్తించటం, మాఘపురాణ పఠన శ్రవణాలనేవి ముప్ఫై రోజులపాటు జరిపే వ్రతంలో భాగాలు. ఈ వ్రత విశేషమేమిటంటే వ్రత కథలో మనిషి ఎలాంటి తప్పులు చేయకూడదో, తప్పులు చేసినందువల్ల ఎలాంటి నష్టం వాటిల్లుతుందో తెలియచెప్పటమేకాక ఆ పాపం నుంచి ఎలా విముక్తి పొందాలో వివరించటం కనిపిస్తుంది. తెలిసో తెలియకో పాపాలు చేయటం మానవ నైజం. పాపం చేశావు కనుక ఈ నరకాలు అనుభవించి తీరాల్సిందేనంటే ఇక మనిషి జీవితాంతం కుంగి కుమిలిపోతూనే ఉంటాడు. అమూల్యమైన జీవితం అలా వృథా అవుతుంది. తప్పు చేశావు, పశ్చాత్తాపం పొంది ఇక మీదట అలాంటి తప్పులు చేయకుండా జీవితమంతా మంచి వ్రతాలు చేస్తూ భక్తితో కాలం గడుపు అని అంటే ఏ మనిషైనా ఎంతో కొంత మంచిగా మారేందుకు వీలు కలుగుతుంది.

ఇలా మాఘస్నాన వ్రతం అనే సులభ సాధనంతో మానవాళికి సన్మార్గాన్ని చూపించటమే మన సనాతన సంప్రదాయంలోని రుషుల లక్ష్యంగా కనిపిస్తుంది. దానికి మాఘపురాణంలోని రెండు, మూడు అధ్యాయాలలో ఉన్న సారాంశం ఉదాహరణగా నిలుస్తుంది. రెండో అధ్యాయంలో చెయ్యకూడని పాపాలేమిటో, వాటివల్ల జన్మజన్మలకు కలిగే నష్టమేమిటో వివరంగా ఉంది. రెండో అధ్యాయం చివర, మూడో అధ్యాయంలో మాఘస్నాన ఫలితంతో ఆ పాపాలను పోగొట్టుకోవచ్చన్న సూచన కనిపిస్తుంది. ఈ సూచనను సమర్ధిస్తూ సుదేవుడు అనే ఒక వేదపండితుడి కుమార్తె కథను సాక్షాత్తూ పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించినట్లుగా ఉంది.

పూర్వం సౌరాష్ట్ర దేశంలో బృందారకం అనే ఓ గ్రామం ఉండేది. అక్కడున్న వేదవేదాంగ పండితుడైన సుదేవుడు అనే గురువు దగ్గర చాలామంది విద్య నేర్చుకుంటూ ఉండేవారు. ఆ గురువుకు గొప్ప సౌందర్యవతి అయిన ఓ కుమార్తె ఉండేది. ఆమెను తగిన వరుడుకిచ్చి వివాహం చేయాలని సుదేవుడు ప్రయత్నాలు చేస్తుండేవాడు. ఆ గురువు దగ్గర సుమిత్రుడు అనే ఒక శిష్యుడుండేవాడు. గురుపుత్రిక అధర్మ మార్గంలో సుమిత్రుడిని కోరుకుంది. 

సుమిత్రుడు గురుపుత్రిక అంటే సోదరితో సమానమని, అధర్మవర్తనం కూడదు అని చెప్పినా ఆమె వినలేదు. చివరకు సుమిత్రుడే ఆమె మార్గంలోకి వెళ్ళవలసి వచ్చింది. కొంతకాలం తర్వాత సుదేవుడు తన కుమార్తెను కాశ్మీర దేశవాసికి ఇచ్చి వివాహం చేశాడు. వివాహం అయిన కొద్ది రోజుల్లోనే ఆ కాశ్మీర దేశవాసి అకాలమరణం పొందాడు. తన కుమార్తె దురదృష్టానికి సుదేవుడు ఎంతగానో విలపించసాగాడు. అలా మరికొంత కాలం గడిచింది. ఓ రోజున దృఢ వ్రతుడు అనే ఓ యోగి సుదేవుడి ఆశ్రమం వైపు వచ్చాడు. సుదేవుడు ఆ యోగికి అతిథి పూజా సత్కారాలు చేసి తన కుమార్తెకొచ్చిన కష్టాన్ని వివరించాడు.

తాను ఏనాడూ పాపం చేయలేదని, తన కుమార్తెకు మరి అంతటి కష్టం ఎందుకొచ్చిందో తెలియటం లేదన్నాడు. యోగి దివ్య దృష్టితో చూశాడు. సుదేవుడి కుమార్తె గత జన్మలో భర్తను హింసించటం, కూడని పనులు చేయటంలాంటి పాపాలు చేసిందని, అయితే ఓ రోజున అనుకోకుండా మాఘమాసంలో సరస్వతీ నదీతీరంలో గౌరీ వ్రతం జరుగుతుండగా ఆ వ్రతాన్ని చూసిందని, ఆ కారణం చేతనే మరుసటి జన్మలో ఉత్తముడైన సుదేవుడి ఇంట జన్మించటం జరిగిందన్నాడు. అయితే పూర్వ జన్మ పాపం ఇంకా వదలకుండా వెన్నాడుతూ ఉండటం వల్లనే ఈ జన్మలో అధర్మబద్ధంగా సుమిత్రుడునే శిష్యుడి సాంగత్యం పొందిందన్నాడు. 

ఈ విషయాలన్నీ తెలుసుకొని సుదేవుడు ఎంతో బాధపడ్డాడు. ఇక మీదట ఆ పాపం అంతా పోయి తన కుమార్తె పుణ్యం పొందటానికి మార్గం ఏదైనా చెప్పమని యోగిని కోరాడు సుదేవుడు. అప్పుడు ఆ యోగి మాఘశుద్ధ తదియనాడు గౌరీవ్రతం, సుహాసినీ పూజ చేస్తే ఇక మీదట పాపం అంతా నశిస్తుందని చెప్పాడు. వెంటనే ఆ గురువు తన కుమార్తెతో గౌరీవ్రతం (కాత్యాయనీ వ్రతం) చేయించాడు. మాఘశుద్ధ తదియనాడు జరిపిన ఆ వ్రత ఫలితంగా అనంతరకాలంలో ఆమె పుణ్యఫలితంగా సుఖాలను పొందింది.

ఇలా మాఘ పురాణంలోని మూడో అధ్యాయంలో ఉన్న ఈ కథ గౌరీ కథ మహాత్మ్యంతోపాటు మాఘస్నాన పుణ్య ఫలితాలను వివరిస్తోంది. ఈ వివరణ వెనుక ఒక జన్మలో చేసిన తప్పుల పాప ఫలితాన్ని మరుసటి జన్మకు కూడా అనుభవిస్తూనే ఉండాల్సి వస్తుందని కనుక పాపాలు చేయవద్దనే సున్నితమైన హెచ్చరిక ఒదిగి ఉంది.

ఇంకా చదవండి »

పుత్రద ఏకాదశి



ఇంకా చదవండి »

గోమాత వ్రతం

గోమాత ముక్కోటిదేవతల సమూహము. గోమాత కలియుగంలో సాక్షాత్ కామధేనువు వంటిది. కామధేనువు అనగా అడిగినదల్ల లేదనకుండా ప్రసాదిన్చునది అని అర్ధం. ఈ కలియుగంలో ఒక్కమారు గోమాత వ్రతం ఆచరిన్చినట్లయితే తప్పకుండ అనుకున్నపనులన్ని సఫలికృతము అవుతాయి.

గోపంచకమును ప్రతి పూజలోను వినియోగిస్తారు. కారణమేమనగా అది వినియోగించిన ప్రతివారు, ప్రత స్తలము శుద్ధి అవుతాయి. మనమాచరించే ప్రతి పూజలో గణపతి పూజ నుండి ప్రతిష్టాంతం వరకు పంచగవ్యాలను వాడతారు.

పంచగవ్యాలు అనగా ఆవుపాలు , ఆవుపెరుగు , ఆవునెయ్యి , ఆవుముత్రము , ఆవుపేడ.ఈయొక్క ఐదింటిని పంచగవ్యాములన్డురు. వీటితో పంచగవ్యప్రాసన అనేపూజ చేసి అవి తీర్ధముగా తీసుకొనవలెను. ఈతీర్దము సంవత్సరంలో ఒక్కసారైనా తప్పకుండ తీసుకోవలెను. అదేవిధంగా ఆవుపాలు చాలా శ్రేస్థామైనవి. చిన్నపిల్లలకు ఇచ్చినట్లయితే మంచితెలివితేటలు పెరుగుతాయి . మంచివిద్యావంతులవుతారు .

మనము తెలిసి తెలియక ఆడవారు అంటూ , ముట్టు ఇంట్లో కలిపినపాపమును , పెద్దలను దూషించిన పాపమును , సర్వపాతకములను , మహాపాతకములను , భక్తిపూర్వకముగా గోమాతను ధ్యానించిన , గోవులకు గ్రాసాములిచ్చినను , గోవులకు దాణాలిచ్చినట్లయితే , పైనచేప్పబడిన పాపములనుండి విముక్తి పొంది సర్వసంపదలు చెకూరునని శాస్త్ర ప్రమాణము . 

ఏకాదశి నాడు ఉదయమునే కాలకృత్యాలు నెరవేర్చుకొని గోమాత పూజ మరియు గోసేవ ఆచరిన్చినట్లయితే కాశి నగరంలో కోటిగోవులను దానము చేసినంత ఫలితము లభిస్తుంది. 

ఇంకా చదవండి »

ఫల సప్తమి వ్రతం


CaRP*LRiV²R…V ú‡Áx¤¦¦¦øNTPÈýÁV ¿Á|msöƒ«sV: xmnsÌÁ xqsxmsò„sV¸R…Vƒ«sV xqs xmsò„sV „sxtsQ¸R…Vª«sVV ¾»½ÖÁ|msµR…ƒ«sV. C ƒy²R…Vxmsª«szqsLiÀÁƒ«sªy²R…V Fyxmsª«sVVNRPVòQ\®²… xqs*LæRiª«sVLiµR…Vƒ«sV.

ª«sWLæRibPLRi aRPVNýRP xmsLi¿RÁ„sVƒy²R…V úª«s»R½ ¬s¸R…Vª«sVª«sVVÌÁV FyÉÓÁLiÀÁ gRi²R…zms xtsQztîsQƒy²R…V Dxmsª«szqsLi¿RÁª«sÛÍÁƒ«sV. („sa][NRP xqs xmsò„sVª«sÛÍÁ®ƒs[) xqs xmsò„sVƒy²R…V ‡ÁLigSLRiV xmsµR…øª«sVVƒ«sV aRPLRiäLRiƒ«sV ‡ÁLigSLRiV»][ xmnsÌÁxmso Ëܪ«sVøƒ«sV NRPVÈÁVLiÕÁ¸R…VgRiV úËØx¤¦¦¦øßáVƒ«sNRPV lLiLi²R…V xmspÈÁÌÁLiµR…Vƒ«sV µ³R…LRiø»R½ »R½òQ*ª«sVV ®ƒsLjigji "˳؃«sVlLi[ø ú{ms¸R…V»yLi' "˳؃«sV²R…V ƒy¸R…VLiµR…V ú{ms»R½V²R…gRiVgSNRP!' @ƒ«sV¿RÁV µyƒ«s„dsV¸R…Vª«sÛÍÁƒ«sV. ¸R…V´yaRP NTPògS „súxmsoÌÁƒ«sV xmsLRiª«sWƒ«sõª«sVV»][ ˳ÏÁVÑÁLixmsÛÇÁ[zqs »yƒ«sVƒ«sÛÉýÁ[ ˳ÏÁVÑÁLiÀÁ xmnsÌÁ»yùgRiª«sVV ¿Á[¸R…Vª«sÛÍÁƒ«sV. BÈýÁV NRPXxtñsQxmsORPQ xqs xmsò„sVª«sLRiNRPV ¿Á[¸R…VV¿RÁV ª«sVLRiÌÁ A NRPXxtñsQ (ª«sWLæRibPLRi) xqs xmsò„sVƒy²R…Vƒ«sV Dxmsª«szqsLiÀÁ }¤¦¦¦ª«sVxmnsÌÁª«sVVƒ«sV xqsVª«sLñRixmsµR…øª«sVVƒ«sV aRPLRiäLS Fyú»R½ª«sVVƒ«s ª«sxqsòQû ª«sWÌÁùª«sVVÌÁƒ«sV µyƒ«s„dsV¸R…Vª«sÛÍÁƒ«sV. C „sµ³R…ª«sVVgRi xqsLiª«s»R½=LRiNSÌÁª«sVV D˳ÏÁ¸R…V xqsxmsòª«sVVÌÁLiµR…Vƒ«sV (aRPVNýRP xqs xmsò„sV»][ ALRiLiÕ³ÁLiÀÁ NRPXxtñsQ xqs xmsò„sVª«sLRiNRPV) Dxmsªyƒ«s xmspLRi*NRPª«sVVgS (lLiLi²R…V xqs xmsòª«sVVÌÁLiµR…Vƒ«sV µyƒ«sª«sVVÌÁVcƒ«s²R…Vª«sV µj…ƒ«sª«sVVÌÁÍÜ[ ¬s¸R…Vª«sVª«sVVƒ«sV FyÉÓÁLi¿RÁVÈÁ) úNRPª«sVª«sVVgS xqsWLRiù ®µ…[ª«s»yNRP ª«sVLiú»R½ª«sVVÌÁ xmshjiLi¿RÁV¿RÁV ¿Á[¸R…VV¿RÁVLi²R…ª«sÛÍÁƒ«sV. 

xmnsÌÁ»yùgRiª«sVV ¿Á[¸R…VVƒ«sxmso²R…V ª«sWLæRibPLRiª«sVV ®ªsVVµR…ÌÁV NS LjiòNRPª«sVVª«sLRiNRPV úxms¼½ ª«sWxqsª«sVVLiƒ«sLiµR…Vƒ«sV ª«sLRiVƒ«sgSc˳؃«sVMú{ms¸R…V»yLicBÛÉýÁ[c@LRiäMcLRi„sMcú‡Á¥¦¦¦øcxqsWLRiùMcaRPúNRPMcx¤¦¦¦LjiMcbPª«sMc$ª«sWƒ±sc„s˳ت«sxqsVM»R½*uíyc@LRiVßáMc@ƒ«sV ƒyª«sVª«sVVÌÁƒ«sV "ú{ms¸R…V»yLi' @ƒ«sV xmsµR…ª«sVV»][ ¿Á[Ljiè xmsÌÁVNRPª«sÌÁ¸R…VVƒ«sV. 

úxms¼½xmsORPQª«sVVƒ«sƒ«sVcxqs xmsò„sVƒy²R…V BÈýÁV µyƒ«sª«sVVƒ«sV xmnsÌÁ»yùgRiª«sVVƒ«sV ¿Á[¸R…Vª«sÌÁ¸R…VVƒ«sV.
úª«s»yLi»R½ª«sVVƒ«sLiµR…V „súxms µR…Lixms»R½VÌÁƒ«sV ª«sxqsòQû˳ÏÁWxtsQß᪫sVVÌÁ»][ xmspÑÁLiÀÁ aRPLRiäLSxmspLñRi NRPÌÁaRPª«sVVƒ«sV xqsVª«sLñRixmnsÌÁ úxms¼½ª«sVƒ«sV ªyLjiNTP µyƒ«sª«sVV C¸R…Vª«sÛÍÁƒ«sV. ""LRi„ds! ˳ÏÁNRPVòÌÁ N][LjiNRPÌÁ xqsxmnsÌÁª«sVV ¿Á[¸R…VV ¬ds µR…¸R…V¿Á[»R½ ƒyNRPVƒ«sV ÇÁƒ«søÇÁƒ«søª«sVVƒ«sLiµR…Vƒ«sV @ƒ«sLi»R½xmnsÌÁª«sVVÌÁV ÌÁÕ³ÁLi¿RÁVgSNRP!'' @¬s úFyLójiLi¿RÁV¿RÁV µyƒ«s „dsV¸R…Vª«sÌÁ¸R…VVƒ«sV.

@ƒ«sLi»R½ xmnsÌÁúxmsµR…¸R…VgRiV C xmnsÌÁ xqsxmsò„dsV úª«s»R½ª«sVV ¿Á[zqsƒ«sªy²R…V xqsLRi*Fyxmsª«sVVNRPVòQ\®²… xms„sú»R½»R½ƒ¯Liµj… xqsWLRiùÍÜ[NRPª«sVVƒ«s xmspÑÁ»R½V ²R…gRiVƒ«sV. ªy¬sNTP xqsVLSFyƒyµj… Fyxmsª«sVV ÛÍÁ[\®ªsƒ«s FsxmsöÉÓÁ\®ªsƒ«s Dƒ«sõƒ«sV @„s¸R…VV ƒ«sbPLi¿RÁVƒ«sV. @»R½¬s ®ªsƒ«sVNRPª«sVVLiµR…V BLRiVª«sµj…¹¸…VVNRP »R½LRiª«sVVÌÁ ªyLRiVƒ«sV »R½LjiLi»R½VLRiV. µk…¬s¬s ¿RÁµj…„sƒ«sc„s¬sƒ«scªyLjiNTP NRPW²R… C xmnsÌÁª«sVV ÌÁÕ³ÁLi¿RÁVƒ«sV.

Bµj… $ª«sV»R½=Qù ª«sV¥¦¦¦xmsoLSß᪫sVVƒ«s xmnsÌÁxqsxmsò„dsV úª«s»R½ NRP´R…ƒ«sª«sVƒ«sV ®²…‡Á÷µj…¸R…WLRiª«s @µ³yù¸R…Vª«sVV




ఇంకా చదవండి »

కార్తీక మాసం లో పూజ చేయడం వలన ఎలాంటి దోషాలు పోతాయి

కార్తీక మాసం లో వివిధ రకాల ఉపవాసం , నక్తం (పగలు అంతా ఉపవాసం ఉండి రాత్రి భోజనం చేయటం ) , ఎకబుక్తం (ఒక పూట మాత్రమే భోజనం చేయడం ) , నెల అంతా నిష్టగా నక్తం ఉండడం, సోమవారం మాత్రమే ఉపవాసం ఉండడం.  ప్రాతః కాలం లో దీపం పెటడం .
సకల గ్రహ బాదలు పోతాయి .

స్నానం దేపరధన చేయటం వలన సకల దోషాలు పోతాయి . కార్తిక మాసం లో వచ్చే  కృత్రిక నక్షత్రం ఆదివారం వచ్చిన రోజున సూర్యుడికి పూజ చేయడం వలన సప్త జన్మల నుంచి వచ్చే అనేక రకాల రోగాలు పోతాయి . ఆరోగ్యం భాస్కర అదిత్యయ్థ్ కృత్రిక నక్షత్రం సోమవారం వచ్చిన - శివుడికి పూజలు , అభిషేకం , అర్చన చేయటం . కరకాయ , వస్త్రాలు దానం చేయటం వలన క్షయ , కుష్టు వ్యాది నివారణ జరుగుతుంది.

కృత్రిక నక్షత్రం మంగళవారం వచ్చిన - సుబ్రహ్మణ్య పూజ చేయాలి . సుబ్రహ్మణ్య ఆలయాలో కానీ , సరస్వతి ఆలయాలో కానీ ,ఈశ్వర ఆలయాలో కానీ  మాటలు సరిగ్గా రాని వారి పేరు మీద , కుదిరితే వారితోనే కటించడం, లన వాక్క్ సిద్ధి కలుగుతుంది , మాటలు బాగా వస్తాయి , మంచి గ మాట్లాడగలుగుతారు.

కార్తీక మాసం లో మనం శివుడ్ని పూజ చేస్తాం కానీ సుబ్రహ్మణ్యుని కూడా పూజ చేయటం వలన వారికి సప్త జన్మల నుంచి వున్నా దోషాలు పోతాయి , నాగ దోషాలు పోతాయి. కృత్రిక నక్షత్రం భుదవరం వచ్చిన - అనేక జన్మల నుంచి వచ్చే పాపలు పోతాయి విష్ణు కృప వలన .

కృత్రిక నక్షత్రం గురువారం - సరస్వతి , బ్రహ్మకి పూజ.  కృత్రిక నక్షత్రం శుక్రవారం మహా గణపతి కి జిలేడుపూలతో, దూర్వలతో పూజ చేయడం వలన గణపతి అనుగ్రహం కలుగుతుంది
కృత్రిక నక్షత్రం శనివారం ఆంజనేయస్వామికి , శని కి , ఈస్వరుడికి అర్చన నవగ్రహలకి పూజ చేయాలి .

కృత్రిక నక్షత్రం వచ్చిన రోజు పిల్లలు లేని వారు ఈస్వర ప్రీత్యర్దమ్ గా బంగారు కానీ వెండి ప్రతిమలు ఎ గ్రాహం వలన దోషం కలిగిందో అ గ్రహ దేవతని బంగారు కానీ వెండి లో కానీ చేసి శివాలయంలో దానం ఇవటం వలన ఇంక పిల్లలు పుట్టారు అన్న వారికీ కూడా పిల్లలు పుడతారు అని శాస్త్రం చెప్తుంది. నది స్నానం నక్షత్రాలు ఉన్నప్పుడు చేయాలి . 

ఇంకా చదవండి »

దంపతులు విడిపోకుండాఅన్యోన్యం గ కర్తీక మాసం లో చేసే వ్రతం

దంపతులు విడిపోకుండా అన్యోన్యంగా ఉండడానికి కర్తీక మాసం లో చేసే వ్రతం కర్తీక సుద్ధ  అష్టమి (కార్తీక దంపత్యష్టమి ). దంపతులు అన్యోన్యంగా ఉండడానికి బాగావంతుడునుంచి ప్రేరణ కలగుతుంది. అష్టమి నెలకి రెండు సార్లు వస్తుంది. ఈ పేరు ఎందుకు వచ్చింది ? సుద్ధ అష్టమి , బహుళ అష్టమి సంవత్సర్నికి 24 అష్టములు వస్తాయి .

 ఈ దాంపత్య అష్టమి కి ఉన్న నియమం ఏంటి అంటే ఈ అష్టమి మొదలుకొన్ని ఈ పూజ చేయాలి . కార్తీక సుద్ధ అష్టమి రోజు ప్రారంబించి మల్లి కర్తీక సుద్ధ అష్టమి వచేవరుకు ఈ పూజ చెయాలి . ప్రతి అష్టమికి కి ఈ పూజ చేయాలి . లేదా దాంపత్య నిలబడాలి అనుకునే వాలు అయిన ప్రతి అష్టమి కి పూజ చేయాలి . రక రకాల పూలు వస్తాయి . 

ఒకో అష్టమి కి ఒకో రకం అయిన పూలు తీసుకు వచ్చి పూజ చేయాలి. అమ్మవారికి అష్టమి రోజు పూజ చేయడం వలన మన కష్టాలు తీరిపొయి విశేషమయిన ఫలితం ఇస్తుంది . ఈ దంపత్యాష్టమి కోసం అర్ధనారీశ్వరుని , లక్ష్మి నారాయణలు పూజ చేయాలి. ఒకో ఋతువులలో ఒకో రకమయిన పూలు వస్తాయి ,  ఒకో రకమయిన పూలతో పూజ చేయాలి.

 అమ్మవారి ఆలయానికి అష్టమి రోజు వెలితే 8 ప్రదక్షిణాలు చేయాలి, 8 నమస్కారాలు సమర్పించాలి , 8 పూలు సమర్పించాలి , 8 రకాల పళ్ళ రసాలతో అభిషేకం చేయాలి , 8 దీపాలు పెటడం , 8 హారతులు ఇవటం , 8 సార్లు శాస్టంగం చేయాలి .

దంపతులు ఇద్దరు కూడా అన్యోన్యంగా ఉండాలని అని అమ్మవారిని ఈశ్వరుడ్ని వేడుకోవాలి . ఇలా ఒకసారి వేడుకోవడం వలన సప్త జన్మలకి దాని వాసనలు ఉంటాయి. ఒకసారి భగవంతుడ్ని వేడుకోవడం వలన ఇజన్మలొ విడిపోకుండా ఉండడమే కాకుండా (ఆలోచనలు కూడా ఉండవు ) ఈ వాసనల వలన మరు జన్మకి మరు జన్మకి మరు జన్మకి కూడా అ దంపతులు ఇద్దరు 7(ఏడూ) 7(ఏడూ) జన్మలకి కూడా దంపతులు విడిపోవాలి అనే భావన వీరికి ఉండదు . వచ్చే జన్మలో కూడా ఈ దంపతులు కి ఈ సంస్కారం ఉంటుంది , 7(ఏడూ) 7(ఏడూ) జన్మలకి కలిసి మెలిసి ఉంటుంది . అలంటి దాంపత్యం కావాలి అనుకునే వాలు ఈ వ్రతం తప్పకుండ చేసుకోవాలి .

 ఒక్క సంవత్సర చేసిన తరువాత ఉద్యాపన ఇచ్చి 8 మంది దంపతులకి వస్త్రాలు పెట్టి , భోజనం పెట్టి , అమ్మవారికి ఈస్వరుడికి పూజ చేసి దాని సమాప్తం చేయాలి . ఇలా చేయటం వలన దంపతులు జన్మ జన్మలకి అన్యోన్యంగా ఉంటారు .

ఇంకా చదవండి »

సంకట హర చతుర్థి


సుద్ధ చవితి రోజున ఉదయం పూత పూజ చేయాలి . బహుళ చవితి అంటే పౌర్ణిమ తరువాత చవితి రోజున ఉదయం పోదున పూజ చేసిన చద్రోదయ సమయానికి విషేష పూజ చేయాలి.

సంకష్ట హర చతుర్థి చేసేవారు చవితి తిథి మాత్రమే చూసుకుని చేయకూడదు , అ తిథి ఉన్న సమయం కూడా చూసుకోవాలి . చద్రోదయ సమయానికి చవితి తిథి ఉన్నదీ మాత్రమే చేయాలి . రోజు మొత్తం చవితి తిధి ఉంటె సమస్య లేదు కానీ తగులు మిగులు (అంటే ఎ రోజు మధ్యానం లేదా రాత్రి కి చవితి తిధి ప్రారంభం అయి మరుసటి రోజు తిధి పూర్తి అయితే ) వచినప్పుడు కచితంగా తిధి సమయం చూసుకోవాలి.

ధర్మ సింధు లాంటి గ్రంధాలో మనకి చేపెటువంటి విషయం ఏంటి అంటే "తదియతో కలిసిన చవితి " చెయాలి తప్ప పంచమి తో కలిసిన చవితి చేయకూడదు. ఇలా చేయటం వలన సంకటాలు అని తొలిగి పోవు. తిధి నిర్ణయం తప్పు జరుగుతుంది . శాస్త్ర ప్రకారం చవితి చేయడం లేదు .

సంకట హర చతుర్థి కొంత మంది జన్మంతము చేస్తారు . కొంత మంది 21 సంవత్సరలు చేస్తారు . కొంతమంది ప్రత్యేకమయిన కామ్య సిద్ధికోసం మాత్రమే ఒక సంవత్సరం చేస్తారు .
ఇలా సంవత్సరం కూడా చేయలేనివారు ( ఒంట్లో బాగోదు , మధుమేహం ఉంది , రోజు తినకుండా ఉండలేము అనుకునే వాలు) శ్రావణమాసం లో వచ్చే సంకట హర చతుర్థి చేస్తే సంవత్సరం మొత్తం సంకట హర చతుర్థి చేసిన ఫలితం వస్తుంది .

జాతకం లో దోషాలు ఉంటె కేతువు బాగోలేక పోతే , రాహువు దోషాలు , వివాహ దోషాలు , సంతానం దోషాలు , ఇల్లు కట్టుకోవాలి , విద్యార్ధులు , ఏదయినా ఒక పని వెన్నకి పోతుంది అనుకునే వాలు అందరు ఈ పూజ చేయవచు.  

సంకట హర చతుర్థి పూజ చేసే విధి విధానం :
సంకటాలు ఉన్నపుడు , వినాయకుడు సంకల్పం చెప్పుకుని అ రోజు తేలవరుఝామున లేచి తలారా స్నానం చేసి దీపం పెట్టుకుని మిగిలిన పూజ కార్యక్రమాలు పూర్తి చేసుకుని సాయంకాలం మల్లి స్నానం చేసి ఇంట్లో ఒకవేళ వినాయక విగ్రహం ఉంటె అభిషేకం చేసుకోవచు (గణపతి అధర్వణ శీర్షం తో అభిషేకం చేసుకోవటం మరీ విశేషం ). 

గుడిలో పూజ చేసుకోవచు . లేదా ఇంట్లో నే గణపతి పటానికి గణపతి స్తోత్రాలు , గణపతి అధర్వణ శీర్షం చదువుకోవడం , వీలయితె గణపతి మంత్రాని "ఓం గం గణపతయే నమః" అనే నామని జపించుకోవాచు. 

చవితి రోజు చంద్రుడు కనిపించక పోతే?
గరిక , ఎర్రని గన్నేరు పూలు , ఎర్రని మంధర పూలు , ఎర్రని గులాబీలు , ఎర్రని రక్త చందనం పెట్టి గణపతి కి పూజ చేయాలి . తెల్ల జిలెడు పూలతో పూజ చేస్తే మహా విశేషం. మోదకం , లడ్లు నైవేద్యం చేసి చద్రుడికి కూడా నివేదన చేసి , చంద్రుడికి కూడా నమస్కారం పెట్టి , ఎవరికైనా నైవేద్యం లేదా భోజనం పెట్టి వాలు తినాలి . నిష్ఠ గ చేయాలి అనుకునే వారు ఇంకా అ రోజు కి ఉపహారం చేసి మర్నాడు దీపం పెట్టి అప్పుడు తినాలి . ఉండలేని వాలు ఇంకా చవితి రోజే చంద్రోదయం పూజ అయిన తరువాత తినే య వచ్చు. ఆకాశం వంక చూసి చంద్రుడిని , విగ్నేస్వరుడ్ని తలచుకుని నమస్కరించి వ్రతం నిష్క్రమించవచ్చు.

ఇంకా చదవండి »

శ్రీ సూక్త పారాయణం



శ్రావణ శుక్రవారం సకల రుఖ్వేదం లో ఉన్న శ్రీ సూక్తం మాత్రమే ఇప్పుడు జనభావులో ఉంది. జాతక ప్రకారం దోషాలు ఉన్నా లేకున్నా నిత్యం చాడువుకోవాచూ.

లగ్నం బాగోలేక పోయిన , మాంగల్య భలం బలహీనంగా ఉన్నా, కుటుంభ స్థానం బలహీనంగా ఉన్నా , ధన స్థానం బలహీనంగా ఉన్నా , సంతాన స్థానం బలహీనంగా ఉన్నా , సౌభాగ్య స్థానం బలహీనంగా ఉన్నా , కళత్ర స్థానం బలహీనంగా ఉన్నా , శుక్రుడు బలహీనంగా ఉన్నా, 11 వ స్థానం బలహీనంగా ఉన్నా శ్రీ సూక్తం ప్రత్యేక విధిన పారాయణం చేయవచు.

కామ్య నెరవేరడానికి ఇంట్లో దేవా మందిరానికి ముందు , తులసి కోటదగర ,దేవాలయంలో ,  గో శాల , నది ఒడ్డున కానీ పారాయణ చేయవచ్చు .  ముత్యాలు , కమల భిజలు , రుద్రాక్షలు , పగడాలు , తో కానీ జపమాల తో పూజ చేస్తే ఫలితం బాగుంటుంది .

ఉత్తరాయణ -శుక్ల పక్షం లో - అష్టమి /నవమి / అమావాస్య / పౌర్ణమి /శుక్రవారం రోజున పారాయణ మొదలు పెటాలి . పెద్ద పెద్ద కోరికలు తీరలి అనుకునప్పుడు శ్రీ సుక్త పారాయణం మండల (40) రోజులు లేదా , 108 రోజులు, లేదా సంవత్సర కాలం కానీ పారాయణ చేయాలి . పారాయణ అయిన తరువాత హోమమ చెయలి. 

హోమమ చేసే పద్దతి :

సహస్ర కలువలతో లేదా లక్ష కలువలు లేదా కోటి కలువలు ఆవు నేతి లో ముంచి చేయాలి. మారేడు దళాలు ఆవు నేతి లోముంచి హోమం చేయడం వలన లక్ష్మి దేవి అనుగ్రహం తో పిల్లలు పుడతారు , 7 తరాల వరుకు లక్ష్మీదేవి వారిని విడిచి పొదు .

చిన్న చిన్న కోరికలు కోసం :

తేలవరుఝామున లేచి శ్రీ సుక్త పారాయణం చేయాలి . కోరిన వారా లందరికీ భోగ భాగ్యాలు ఇవగాలిగినది శ్రీ సూక్తం 3, 5, 9 సార్లు పారాయణ చేసుకోవచు . లేదా ఒక్కసారి అయిన చదువుకోవాలి. 

నియమాలు :

వాక్కు దుర్వినియోగం చేయకూడదు, అసత్యాలు మాట్లాడకూడదు , తినేతువంటి బలహినతులు వదులుకోవాలి, శాంతంగా ఉండాలి , కోపిష్టి గ ఉండకుడదు, బ్రహ్మ చర్యం పాటించాలి.

ఇంకా చదవండి »

మార్గశిర శుద్ధ పాడ్యమి కధ


ఒక చాకలి ముసలి ఆవిడకు అయిదుగురు కోడళ్ళు ఉన్నారట .ఆమె ఆశ్వ యుజ బహుళ అమావాశ్య  నుంచి కార్తీక బహుళ అమావాశ్య వరకు తెల్ల వారు ఝామునే లేచి ,ఏటి లో చన్నీటి స్నానం చేసి దీపం పెట్టు కొనేది .ఇలా ఒక నెల గడి చిన తర్వాత కార్తీక అమావాశ్య  నాడు చిన్న కోడలు పోలిని  ఇంటికి కాపలా పెట్టి మిగిలిన కోడళ్ళను తీసుకొని నది ఒడ్డుకు వెళ్ళింది. 

చిన్న కోడలు పెరుగు చిలికి వెన్న తీసి ,కవ్వానికి అంటిన వెన్న తీసి ,పత్తి చెట్టు కింద రాలిన పత్తి తో వత్తి చేసి ,ప్రమిదలో పెట్టి ,శుభ్రం గా నూతి వద్ద స్నానం చేసి దీపం వెలిగించింది .అత్త గారు వచ్చి తిట్టు తుందనే భయం తో ఆ దీపం కనపడ కుండా దానిపై చాకలి బాన బోర్లించింది .దేవతలు ఆమె భక్తికి సంతోషించి ,దివ్య విమానాన్ని తెచ్చి ,ఆమెను బొందె తో కైలాసానికి తీసుకు వెళ్ళారు. 

వూళ్ళో వున్న వారంతా ”,చాకలి పోలి స్వర్గానికి వెడుతోంది అను కుంటు వింత గా చూశారు .విమానం బాగా క్రిందు గా పోతూ వుండటం తో ఆమె కాళ్ళు పట్టు కోని వూరి జనం కూడా ఆమెతో స్వర్గానికి   వెళ్తున్నారు .విష్ణు దూతలు ఈ పోలి అధిక భక్తీ తో జ్యోతిని వెలి గించింది .కనుక స్వర్గానికి తీసుకొని వెళ్తున్నాం .మీకు ఆ అదృష్టం లేదు అని వాళ్ళను కిందకు తోసే శారు. 

పోలి శరీరం తో స్వర్గానికి వెళ్ళిన పుణ్యాత్ము రాలు .అందుకే ఆమె ను తలచు కుంటు కార్తీక అమావాశ్య తెల్ల వారుజ్హామున నది ఒడ్డున దీపాలు వెలిగించి ఆమె ను గుర్తు చేసు కొంటు ,ఆమె కధను చెప్పు కొంటు ,నీటి లో దీపాలు వదిలి పెడ తారు స్త్రీలు అంతా .స్త్రీలు అందరు ఈ కధ చెప్పు కోని అక్షంతలు నెత్తినా వేసుకొని ఇంటికి తిరిగి వస్తారు .అరటి దొప్ప లలో ఆవు నీతి దీపాలు వెలిగించి నీటి లో వదులు తారు .అదీ పోలి స్వర్గానికి పోవటం అంటే. 

ఇందు లో రెండు ముఖ్య విషయాలున్నాయి .ఒకటి భక్తికి కులం అడ్డు రాదు .అందుకే అందరు అన్ని కులాల స్త్రీలు పోలి తల్లి ని గుర్తుంచు కోని దీపాలు పెట్టి సాగ నమ్పటం .రెండోది కార్తీక దీపానికి అంత ప్రాముఖ్యత వుంది అని తెలియ జేయటం .నిశ్చల భక్తీ తో చేసింది ఏదైనా పర మేశ్వరుడు మెచ్సుతాడు .

ఇంకా చదవండి »