-
విష్ణుషట్పదీ స్తోత్రం
నారాయణ నారాయణ జయ గోవింద హరే |నారాయణ నారాయణ జయ గోపాల హరే ||
-
శ్రీ రామ
ఆపదం అపహర్థారమ్ దాతారం సర్వ సంపదం, లోకాభి రామం శ్రీ రామం భూయో భూయో నమామ్యహమ్I
-
శ్రీ సీతామాత
త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ, హనుమాన్ యత్న మాస్తాయ దు:ఖ: క్షయ కరోభవ
-
ఓం నమ:శివాయ:
చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర పాహిమామ్ , చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర రక్షమామ్ I
-
శ్రీమాత్రే నమః
అమ్మల గన్న యమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాల పెద్దమ్మ, సురారులమ్మ కడుపారడి పుచ్చిన యమ్మ, తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ మాయమ్మ కృపాబ్ధి నిచ్చుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్
-
శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు
పురుషోవిష్ణు రిత్యుక్తః శివోనానామతః స్మృతః I అవ్యక్తం తు ఉమాదేవీ శ్రీర్వా పద్మ నిభేక్షణా I తత్ సంయోగా దహంకారః స చ సేనాపతిరుహః I
సదాచారం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
2, 4, 6, 8 వ నెల లో అబోరిషన్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉండడం వలన ఈ ఈ మాసాలలో తగు జాగ్రత్తగా ఉండాలి .
భార్య గర్భం తో ఉంటె 6వ నెల వచ్చినప్పటినుంచి భర్త గోళ్లు , జుట్టు కత్తిరించకూడదు . 6వ నెలనుంచి భార్య భర్తలు ఇరువురు నిత్య దేవతార్చన చేసుకోవచ్చు కానీ విశేష పూజలు , పీటల మీద కూర్చుని చేసేపూజలు చేయకూడదు . గృహ ప్రవేశం చేయకూడదు .6వ నెల నుంచి భర్త భార్య ఇద్దరు గుడికి వెళ్ళకూడదు. 6 నుంచి 8 నెల వరకు సౌచం ఉంటుంది . భర్త తన ఇంటి వారిది కాకుంటే మాత్రం శవం మోయకూడదు . భార్య తో గొడవపెట్టుకోకూడదు . సముద్రస్నానం , కర్మలు, పిండప్రదానం భర్త చేయకూడదు.
ఇంకా చదవండి »
సోమవారం.. గురువారం.. శనివారం.. షష్టి.. ఏకాదశి.. ముక్కోటి.. శివరాత్రి.. ఇలా హిందువులకు ఉపవాసాలకు కొదవ లేదు.
ముస్లింలు పవిత్ర రంజాన్ మాసం మొత్తం పగటి వేళ ఆహారం ముట్టకుండా రోజా పాటిస్తారు.
క్రైస్తవులు డేనియల్ ఫాస్ట్ పేరిట కొత్త సంవత్సరం ఆరంభంలోనే మూడు వారాల పాక్షిక ఉపవాస దీక్ష చెయ్యటం శతాబ్దాలుగా ఉన్నదే.
అన్ని మతాల్లో, అన్ని నాగ రికతల్లో అంతర్భాగంగా ఉన్న ఉపవాసం... ఇప్పుడు వైద్యరంగాన్నీ ఆకర్షిస్తుండటం విశేషం.
ఒక క్రమం ప్రకారం ఉపవాసం చెయ్యటం వల్ల ఆరోగ్యపరంగా గొప్ప ప్రయోజనాలున్నాయని ఇటీవలి కాలంలో వైద్యపరిశోధనా రంగం బలంగా విశ్వసించటం ఆరంభించింది.
దీనిపై ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న అధ్యయనాలూ కొత్తవిషయాలను వెలుగులోకి తెస్తున్నాయి.
ఉపవాసం.. కొత్త విషయమేం కాదు!
కానీ ఈ అనాది అలవాటుకు ఇప్పుడు శాస్త్ర పరిశోధనలూ అండగా నిలబడుతున్నాయి. అదే విశేషం!! అందుకే దీనికి సంబంధించిన వివరాలను స్థూలంగా మీ ముందుకు తెస్తోంది ఈ వారం సుఖీభవ.
ఉపవాసం ఒంటికి మంచిదనీ, లంఖణం పరమౌషధమనీ చాలాకాలంగా వింటూనే ఉన్నాం. ముప్పూటలా సుష్ఠుగా తినే వారికంటే ‘అర్థాకలితో ఉండే వారికి ఆయుర్దాయం ఎక్కువని’ చెప్పుకోవటమూ తెలిసిందే. అయితే ఆధునిక శాస్త్ర పరిశోధనలు కూడా క్రమేపీ ఈ భావనలకు బలం చేకూరుస్తుండటం తాజా విశేషం. రోజులోనో, వారంలోనో అప్పుడప్పుడు.. ఒక క్రమం ప్రకారం కొన్ని గంటల పాటు ఆహారం తీసుకోకుండా ఉపవాసం ఉండటం వల్ల (దీన్నే వైద్యపరిభాషలో ఇప్పుడు ‘ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ - ఐఎఫ్’ అంటున్నారు) శరీరంలో ఎన్నో మంచి మార్పులు చోటు చేసుకుంటున్నాయని, అలాగే జబ్బులను తెచ్చిపెట్టే దుష్ప్రభావాలూ తగ్గుతున్నాయని పరిశోధకులు ఇటీవలి కాలంలో నిర్ధారణకు వస్తున్నారు.
ముఖ్యంగా అమెరికాలోని విఖ్యాత నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (ఎన్‌ఐహెచ్) పరిశోధకులు ఈ విషయంలో కొద్ది సంవత్సరాలుగా విస్తృతంగా అధ్యయనాలు చేస్తున్నారు. విఖ్యాత జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీలో న్యూరోసైన్స్ విభాగాధిపతిగానూ, అలాగే ఎన్‌ఐహెచ్‌లోని న్యూరోసైన్స్ ల్యాబొరేటరీ విభాగాధిపతి డా॥ మార్క్ మ్యాట్‌సన్ సారధ్యంలోని పరిశోధక బృందం దీనిపై స్వయంగా జంతువులపైనా, మనుషులపైనా పరిశోధనలు, అధ్యయనాలు చెయ్యటంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న చాలా అధ్యయన పత్రాలను కూడా పరిశీలించి.. అప్పుడప్పుడు చేసే ఉపవాసాల (ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్) వల్ల శరీరంలో ఎన్నో గుణాత్మకమైన మార్పులు వస్తున్నాయని నిర్ధారణకు వచ్చారు.
ఉపవాసం చెయ్యటం బరువు ఎక్కువగా ఉన్నవారు తగ్గేందుకు దోహదం చెయ్యటమేకాదు.. ఒంట్లో గ్లూకోజు నిరోధకత తగ్గి, మధుమేహం బారినపడే అవకాశాలు తగ్గుతున్నాయని పరిశోధకులు గుర్తించారు. అలాగే అధిక రక్తపోటు, గుండె కొట్టుకునే వేగం, కొలెస్ట్రాల్ స్థాయులూ తగ్గుతున్నాయని గ్రహించారు. వీటన్నింటి ఫలితంగా గుండె జబ్బు, పక్షవాతం వంటి వ్యాధుల బారినపడే అవకాశాలూ తగ్గుతున్నాయని వీరు క్రమేపీ గుర్తిస్తున్నారు. జంతువులపై చేసిన ప్రయోగాల్లో- ఉపవాసం వల్ల వాటి ఆయుర్దాయం పెరగటమే కాకుండా నాడీమండల వ్యాధులూ, ముఖ్యంగా ఆల్జిమర్స్, పార్కిన్సన్స్ వంటి వ్యాధులు దరిజేరే అవకాశాలూ తగ్గుతున్నాయని ‘నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఏజింగ్’ పరిశోధనల్లో వెల్లడవటం విశేషం.
ఏం జరుగుతుంది?
చాలామంది ఒకపూట ఆహారం తీసుకోకపోతే డీలాపడిపోతామని భావిస్తుంటారుగానీ వాస్తవానికి మనం తీసుకునే ఆహారం ఇప్పటికిప్పుడే శక్తిగా మారిపోయి, మనకు వెంటనే అందుబాటులోకి రాదు. మనం తిన్న ఆహారం రెండుమూడు గంటల్లో జీర్ణమై, రక్తంలో కలిసి ప్రయాణించి, కాలేయంలో గానీ, కండరాల్లో గానీ కొవ్వులా నిల్వ ఉంటుంది. ఎలాగంటే ఆహారంలోని పిండి పదార్ధాలు గ్లూకోజుగా మారి, రక్తంలోకి వెళ్లి కాలేయంలో గానీ, కండరాల్లో గానీ గ్లైకోజెన్‌గా నిల్వ ఉంటాయి. అలాగే కొవ్వు పదార్ధాలు ఫ్యాటీ ఆమ్లాలుగా మారి, అంతిమంగా ట్రైగ్లిజరైడ్లగానో, కొలెస్ట్రాల్‌గానో మారతాయి. మాంసకృత్తులు అమైనో ఆమ్లాలుగా మారి, రక్తంలోకి వెళ్లి రకరకాల ప్రోటీన్లుగా మారతాయి. ఇలా మనం తీసుకున్నవన్నీ రకరకాల రూపాల్లో మారి, శరీరంలో నిల్వ ఉంటాయి. దీన్ని ‘పోస్ట్ అబ్జార్బిటివ్ ఫేజ్’ అంటారు.
ఇలా నిల్వ ఉంచుకున్న వాటినే మన శరీరం శక్తి అవసరాలకు వాడుకుంటుంంది. కాబట్టి కొన్ని గంటల పాటు మనం ఆహారం తీసుకోకుండా ఉపవాసం ఉంటే- మన శరీరం తన శక్తి అవసరాల కోసం కండరాల్లో, కాలేయంలో, కొవ్వులో అప్పటికే దాచుకున్న నిల్వలను కరిగించుకోవటం మీద ఆధారపడటం మొదలుపెడుతుంది. కాబట్టి శక్తి లభ్యతకు ఇబ్బందేమీ ఉండదు.
రెండోది- ఉపవాసం ఆరంభమై, శరీరానికి ఆహార లభ్యత ఆగిపోగానే మెదడు దాన్నొక సవాల్‌గా స్వీకరిస్తుంది. వెంటనే ఈ ఒత్తిడి పరిస్థితిని నెగ్గుకొచ్చేందుకు తక్షణ చర్యలు తీసుకునే క్రమంలో ఒంట్లో వ్యాధుల ముప్పు తగ్గించే పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని పరిశోధనల్లో గుర్తించారు. మెదడులో ప్రోటీన్ల తయారీ మెరుగై, నాడీకణాల్లో మైటోకాండ్రియా కూడా పెరుగుతూ, నాడీకణాల మధ్య సంబంధాలూ మెరుగవుతున్నాయి. దీనివల్ల మెదడు పనితీరు, విషయగ్రహణ శక్తి మెరుగవ్వటమే కాదు, పార్కిన్సన్స్, ఆల్జిమర్స్ వంటి వ్యాధుల ముప్పూ తగ్గుతోందని
డా॥ మాట్‌సన్ బృందం నిర్ధారణకు వచ్చింది.
ఉపవాసం.. ఎలా?
వైద్య పరిశోధనా రంగం ఈ ఉపవాసం (ఐఎఫ్) అనేది ఎలా చేస్తే ఫలితాలు బాగుంటున్నాయన్న దానిపై ఇంకా ఒక కచ్చితమైన నిర్ధారణకు రాలేదనే చెప్పాలి. ఆహారాన్ని కొద్దికొద్దిగా ఎక్కువ సార్లు తీసుకోవటంమంచిదన్నది ప్రామాణికమైన సిఫార్సు. అందులో తేడా ఏమీ లేదు. రోజూ అలా పాటిస్తూ, మధ్యమధ్యలో ఒక రోజు 6, 12, 24.. ఇలా కొన్ని గంటల పాటు ఆహారం మానెయ్యటం లేదా వారంలో రెండు రోజులు బాగా తగ్గించెయ్యటం వరకూ.. రకరకాలుగా అధ్యయనాలు చేస్తున్నారు. మొత్తమ్మీద వారంలో 5 రోజులు సాధారణ ఆహారం తీసుకుంటూ 2 రోజులు చాలా పరిమితంగా తీసుకునే ఉపవాస విధానం (దీన్నే ‘5:2 డైట్’ అంటున్నారు) ఎక్కువ ప్రాచుర్యంలోకి వస్తోంది. ఉపవాసం ఉంటున్న రోజుల్లో కూడా పూర్తిగా నోరు కట్టేసుకోకుండా... రోజువారీ తినేదానిలో పావు భాగం (25% లేదా సుమారుగా 600 క్యాలరీలు) మాత్రమే ఆ రోజంతా తీసుకుంటున్నారు. మొత్తమ్మీద రోజులో కొన్ని గంటల నుంచి వారంలో రెండు రోజుల వరకూ.. ఉపవాసం ఎలా చెయ్యాలన్నది ఎవరి వెసులుబాటుకు తగ్గట్టుగా వాళ్లు నిర్ణయించుకోవటం మంచిదన్నది పరిశోధకుల భావన. అయితే ఉపవాసం ఎప్పుడు చేసినా ఒకే క్రమంలో, పద్ధతి ప్రకారం చెయ్యటం మాత్రం అవసరం. ఆహారాన్ని మానెయ్యటంలో కూడా ఒక క్రమాన్ని పాటించాలన్నది అందరూ చెబుతున్న విషయం. అలాగే ఉపవాస సమయంలో ఒంట్లో నీరు తగ్గకుండా చూసుకోవటం కూడా ముఖ్యమే.
అధ్యయనాలేం చెబుతున్నాయి?
ఉపవాసం మూలంగా రక్తంలో ఆక్సీకరణ ఒత్తిడి, వాపు ప్రక్రియల సూచికలు తగ్గుతున్నట్టు.. ఇవి వృద్ధాప్యం, వృద్ధాప్యంతో ముంచుకొచ్చే సమస్యల ముప్పు తగ్గుతుందనటానికి నిదర్శనాలని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. రక్తంలో ఇన్సులిన్, గ్లూకోజు స్థాయులు.. క్యాన్సర్లను తెచ్చిపెట్టే గ్రోత్ ఫ్యాక్టర్ 1 (ఐజీఎఫ్-1) స్థాయులు తగ్గుముఖం పడుతుండటం గమనార్హం. అందువల్ల ఉపవాస పద్ధతి క్యాన్సర్ నివారణకూ మెరుగైన విధానంగా ఉపయోగపడగలదని పరిశోధకులు భావిస్తున్నారు.తేలికగా ఉపవాసం
* మొదట్లో ఆహారం ఏకబిగిన అరపూట, పూట మానేసే కంటే కొద్ది గంటల పాటు మానేస్తూ క్రమేపీ శరీరానికి అలవాటు చెయ్యటం మంచిది.
* ఉపవాసం తర్వాత తీసుకునే ఆహారం తేలికగా ఉంటే మంచిది. ఎక్కువ పండ్లు, కూరగాయలు, తేలికపాటి మాంసం వంటివి ఉండేలా చూసుకోవాలి. ఉపవాసం ముగిస్తున్నామని ఆబగా తినెయ్యకుండా.. మిగతా రోజుల్లో ఎలా తీసుకుంటారో ఆ రోజూ అలాగే తినాలి.
* పని ఎక్కువగా ఉన్న రోజున ఉపవాసం పెట్టుకుంటే మనసులో రోజంతా తిండి గురించే ఆలోచించటమన్నది తగ్గిపోతుంది.
* ఉపవాసం రోజున తేలికపాటి, ఉల్లాసభరితమైన పనులు చెయ్యటం వల్ల శరీరం, మనుసూ.. రెండూ తేలికపడతాయి.
* ఒకవేళ ఆహారం కోసం తహతహ ఆరంభమైతే కొద్దిదూరం నడకకు వెళ్లటమో.. మిత్రులతో మాటలు కలపటమో.. టీవీ చూడటమో.. ఇలా ఏదో ఒకటి చేసి తిండి మీంచి మనసు మళ్లించటం మంచిది.
* ఉపవాస సమయంలో నీరు, ద్రవాహారం మాత్రం దండిగా తీసుకోవాలి. ఒంట్లో నీరు తగ్గకూడదు. అయితే తీపి పానీయాలు, చక్కెర వేసిన కాఫీ టీలకు దూరంగా ఉండాలి.
* ఎంత ప్రయత్నించినా ఇక తినకుండా ఉండలేమని అనిపించినప్పుడు.. మొండిగా అలాగే ఉండిపోకుండా తేలికపాటి ఆహారం తీసేసుకోవటం ఉత్తమం.
* ఇలా నాలుగైదు వారాలు ప్రయత్నించే సరికి శరీరం ఉపవాసం, ఆ కొత్త దినచర్యకు అలవాటు పడుతుంది. ఆ తర్వాత ఉపవాసం ఉల్లాసంగా గడుస్తుంది.
వీరు వద్దేవద్దు చిన్నపిల్లలు, అరవై ఏళ్లు పైబడిన వృద్ధులు, గర్భిణులు, పాలిస్తున్న తల్లులు, బరువు తక్కువగా ఉన్నవాళ్లు, మధుమేహలు... వీరంతా ఉపవాసాలు చెయ్యకూడదు. అలాగే ఇతరత్రా ఆరోగ్య సమస్యలేవైనా ఉన్నవారు కూడా వైద్యులతో చర్చించిన తర్వాతే ఉపవాసం గురించి ఆలోచించాలి.
మధుమేహులకూ వద్దు! ఎందుకంటే...
మధుమేహం అనేది ఒక ప్రత్యేకమైన దేహస్థితి. మధుమేహం ఉన్నవాళ్లు అంతా సక్రమంగానే తింటున్నా కూడా వాళ్లు తీసుకున్న ఆహారం మొత్తాన్ని శరీరం పూర్తిగా వినియోగించుకునే పరిస్థితి ఉండదు. అందుకే మధుమేహాన్ని వైద్య పరిభాషలో ‘ఆగ్యుమెంటెడ్ స్టార్వేషన్’ అంటారు. పిండిపదార్ధాల వంటివన్నీ తీసుకుంటున్నా కూడా వీరిలో శరీరం- ఎలాగోలా తంటాలుపడి కొవ్వు పదార్ధాల నుంచే శక్తిని సమకూర్చుకోవాలని ప్రయత్నిస్తుంటుంది.
ఈ స్థితిలో వీరు 3 గంటల కంటే ఎక్కువ సమయం ఆహారం తీసుకోకుండా ఉంటే ‘ఆగ్యుమెంటెడ్ స్టార్వేషన్’ అనేది బాగా పెరుగుతుంది. ఇక 6 గంటలకంటే ఎక్కువ సమయం ఆహారం తీసుకోకపోతే శరీరం పూర్తిగా కొవ్వు పదార్ధాల మీదే ఆధారపడటం ఆరంభిస్తుంది.
ఈ క్రమంలో- వీరి శరీరంలో ఎసిటోన్, ఎసిటాల్డిహైడ్, బీటా హైడ్రాక్సి బ్యుటిరేట్ అనే ఆమ్ల పదార్ధాల స్థాయులు చాలా ఎక్కువైపోతాయి. వీటినే ‘కీటోన్ బోడీస్’ అంటారు. శరీరంలో వీటి స్థాయులు పెరిగితే గుండె, వూపిరితిత్తుల పని తీరు దెబ్బతింటూ, క్రమేపీ అవి విఫలమైపోతుంటాయి. అందుకే మధుమేహులకు ఏదైనా సర్జరీ వంటివి చెయ్యాల్సి వచ్చి, గంటలతరబడి ఆహారం ఇవ్వకూడని పరిస్థితి ఎదురైనా కూడా ఒకవైపు నుంచి గ్లూకోజు ఎక్కిస్తూ, మరోవైపు ఇన్సులిన్ ఇంజక్షన్లు ఇస్తారు. ఎప్పుడైనా సరే, మధుమేహులు గంటల తరబడి ఆహారానికి దూరంగా ఉండాల్సి వచ్చినప్పుడు ఇలాంటి జాగ్రత్తలన్నీ అవసరం.
కాబట్టి మధుమేహులు ఉపవాసం చెయ్యకుండా ఉండటం అవసరం. అయితే మధుమేహానికి ముందస్తు దశలో ఉన్న వారికి మాత్రం ఉపవాసం మంచే చేస్తోందని, దీనివల్ల వారు త్వరగా మధుమేహం బారినపడకుండా ఉంటున్నారని అధ్యయనాల్లో గుర్తించారు. కాబట్టి మధుమేహం లేనివారు, త్వరలో మధుమేహం వచ్చే అవకాశం ఉన్నవారు.. అప్పుడప్పుడు ఒక క్రమపద్ధతిలో ఉపవాసం చెయ్యటం మంచిదని గుర్తించాలి.
ఇంకా చదవండి »
తెలుగు లో
శ్రీ మహావిష్నుర్ఘ్న్య ప్రవర్త మమస్య ఆద్య బ్రాహ్మనః ద్వితీయ పరార్దె శ్వేత వరాహ కల్పే ,
వివస్వత మన్వంతరే , కలియుగే ప్రదమ పాదె , క్రౌంచ ద్వీపే (land of eagle) , రమనక వర్షే , ఇంద్ర ఖండే (empire of indra), రమ్యక పస్చిమదేసే , సప్త సముద్రన్తరే (w.r.t Lord Shiva on Mount Kailash in Himalayas) , సమస్త దేవతా , బ్రాహ్మణ , హరి హర్ద సన్నిధొవ్ , అస్మిన్ వర్తమాన , వ్యావహారిక చాంద్రమానేన _____________ సంవత్సరే , ఉత్తరయనే / దక్షిణాయనే, రుతోవ్ _____ (season) , _____ మాసే (month) , శుక్ల పక్షే / కృష్ణ పక్షే , శుభ తిదౌ , వాసరః వసరాస్తూ _________ , (week name) శుభ వాసరే _________ , (star) శుభ నక్షత్రే __________, శుభ యోగే, శుభ కరనే, ఏవం గుణ విశేషణ విసిష్టయం , శ్రీమాన్ (your name) _________ నామ దేయాహం శ్రీమతః _______ (wife)నామ్న్యం __________ గోత్రోద్బవస్య , మమ ఉపాత్త దురితక్షయ ద్వార , శ్రీ పరమేశ్వర ముగ్దిస్య , శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం _______________ (eg. Pratah Sandhyam, Ganapathi Pujam, Lakshmi Pujam) కరిష్యే .
IN ENGLISH
Sri maha vishnu raagnaya, pravarta manasya, aadya brahmanaha, dwiteeya parardhe, sweta varaha kalpe, vivaswata manwantare, kaliyuge, pradhama paade, KROWNCHA (land of Eagle) dweepe, Ramanaka Varshe, Indra khande (emipre of Indra), Ramyaka Paschimadese (western country), Sapta samudrantare (w.r.t Lord Shiva on Mount Kailash in Himalayas) Samastha devata, brahmana, hari harada sannidhow, asmin vartamana, vyawaharika chandra maanena _____ samvathsare, Uttara aayane (Jan 14 - July 13) or Dakshin aayane (July 14 - Jan 13), _____ ruthow (season), _____ mase (month), Sukla (1day - amavasya) or Krishna (1day - Purnima) Pakshe, ____ Tidhow (day), subha tidhow, Vasaraha vasarastu Ravi = sun, Indu = mon, Bhrugu = Fri, Stira = Sat____ vasare (week name) Subha vaasare, ____ Nakshatre (star), subha nakshatre, subha yoge, subha karane, evam guna visheshana visishtayaam, sriman __(your name) ____ naama dheyaaham, sreemataha ___(Wife name)___ naamnyam, ____ gotrodbhavasya, mama upatta duritakshaya dwara, sri parameswara mugdhisya, sri parameswara preetyardham _________ (eg. Pratah Sandhyam, Ganapathi Pujam, Lakshmi Pujam) karishyee...
as quoted by Chandra Sekhar Bodapati "
ఇంకా చదవండి »
జకారో
జన్మవిచ్ఛేదః పకారః పాపనాశనః
జన్మచ్ఛేదకరో
యస్మాత్ జపమిత్యభిదీయతే
జ
అంతే జన్మరాహిత్యము, ప అతే పాపనాశనము.
జపము అనగా పాపమును నశింపజేసి
జన్మరాహిత్యమును అనుగ్రహించునది. కావున జపమును చేయునప్పుడు
మంత్రమునందు మనస్సు నిల్పి, తద్భావమును మధ్య మధ్యలో ధ్యానించుట
వలన భావపుష్టితో జపపుష్టి కలిగి తద్ద్వారా మంత్రసిద్ధి
కలిగి సంపూర్ణ ఫలితము లభించును.
మననాత్
త్రాయతే ఇతి మంత్రః. మననము
చేస్తే తరింపజేసేది మంత్రము. అటువంటి శక్తిపూరితమైన మంత్రాన్ని జప ప్రక్రియలో సాధన
చేయటానికి కొన్ని ముఖ్యమైన విషయాలున్నాయి:
1. జపము మూడు
విధాలుగా ఉండును - 1. వాచికము 2. ఉపాంశువు 3. మానసికము. బయటకు వినిపించునట్లుగా చెప్పుచూ
చేయునది వాచికము. ఇతరులకు వినిపించకుండా పెదవులు కదులుతూ నాలుకతో జపించుటను ఉపాంశువు అంటారు. నాలుక, పెదవులు కదలకుండా లోలోపల చేసే జపమును మానసికము
అందురు. వాచికము కంటే ఉపాంశువు శ్రేష్ఠము,
దానికన్నా మానసికము మరింత శ్రేష్ఠము.
2. ప్రాతఃకాలములో చేతులు
పైకెత్తి, మధ్యాహ్న కాలమో చక్కగా ఉంచి,
సాయంకాలం క్రిందకు ఉంచి జపము చేయవలెను.
3. చందనముతో, అక్షతలతో,
పుష్పములతో, ధాన్యముతో, చేతివ్రేళ్ల గణుపులతో లేదా మట్టితో జపాన్ని
లెక్కించకూడదు. జపమాలతో, మిరియాలతో లెక్కించవచ్చు. శ్రేష్టమైనది లక్క, దర్భ, సింధూరము,
ఎండిన ఆవుపేడ మిశ్రమంతో గోళీలు తయారు చేసి లెక్కించుట.
4. జపము చేయునప్పుడు
జపమాలను బయటకు కనిపించకుండా అరచేతి
చాటున లేదా ఒక వస్త్రముతోనైనా
తప్పనిసరిగా కప్పి ఉంచవలెను. ఆ
వస్త్రము తడిగా ఉండరాదు.
5. జపమాలను అనామిక
(ఉంగరపు) వ్రేలిపైన ఉంచి బొటన వ్రేలితో
స్పర్శించుచు మధ్య వ్రేలితో పూసలను
తిప్పవలెను. చూపుడు వ్రేలును ఉపయోగించకూడదు.
6. జపము చేయునప్పుడు
కదలుట, మెదలుట, మాట్లాడుట నిషిద్ధము. తప్పనిసరిగా మాట్లాడవలసినచో భగవంతుని క్షమాపణ భావంతో స్మరించి తిరిగి జపించవలెను.
7. అజాగ్రత్తవలన జపమాల
కింద పడినచో నూట ఎనిమిది మార్లు
ప్రత్యేకముగా జపించవలెను. కాలికి తగిలిన యెడల జలముతో కడిగి
రెట్టింపు సంఖ్యతో (రెండు మాలలు) అదనముగా
జపము చేయవలెను.
8. ఒకవేళ చేతి
వ్రేళ్లతో జపము చేయవలసి వస్తే
ఉంగరపు వ్రేలు మధ్య గణుపు మీద
మొదలు పెట్టి, క్రింది గణుపు, తరువాత చిటికెన వ్రేలు మీద గణుపు, చిటికెన
వ్రేలు, ఉంగరపు వ్రేలు, మధ్య వ్రేలు, చూపుడు
వ్రేలు యొక్క మేరువులను తాకుతూ
చూపుడు వ్రేలు గణుపులతో ముగించవలెను. ఈ మర్గాన్ని విలోమములో
చేసి (చూపుడు వ్రేలు చివరి గణుపుతో మొదలు
పెట్టి అప్రదక్షిణముగా ఉంగరపు వ్రేలి మధ్య గణుపులో) ముగించవలెను.
చివరి ఎనిమిదికి ఉంగరపు వ్రేలు చివరి గణుపుతో మొదలుపెట్టి
చూపుడు వ్రేలు మధ్య గణుపుతో ముగించవలెను.
దీనిని కరమాల అందురు.(రెండవ
చిత్రాన్ని చూడండి)
9. సంధ్యోపాసనలో చేసే
గాయత్రీ మంత్ర జపానికి కరమాల
శ్రేష్ఠం. ఇతర మంత్ర జపానికి
రుద్రాక్షమాల శ్రేష్ఠం.
10. జపమును ముగించిన
పిమ్మట కూర్చున్న ప్రదేశమునందు మట్టిని తీసికొని నుదుటిపై తిలకమును ధరించవలెను. లేనిచో జపఫలితమును మహేంద్రుడు గ్రహించును.
ఇంకా చదవండి »
చాలా
సార్లు షోడశ సంస్కారములు అన్న
పదాలు పండితులు వాడటం వినే ఉంటారు.
అవి ఏమిటి? వాటి ఆంతర్యం ఏమిటి?
చేయవలసిన పద్ధతి ఏమిటి? మొదలైన వివరాలు ఈ వ్యాసంలో.
వ్యాసుల వారు తమ స్మృతిలో
పదహారు సంస్కారాలను:
ఆధానం
పుంసవనం సీమంతోన్నయనం
జాతకర్మ
నామకరణం అన్నప్రాశనం చౌలం ఉపనయనం
బ్రహ్మవ్రతం
వేదవ్రతం సమావర్తనం ఉద్వాహః
అగ్న్యాధానం
దీక్షా మహావ్రతం సన్న్యాసః
అని
పేర్కొన్నారు. ఈ సంస్కారముల వలన
కలిగెడి ఫలములన్నింటిని ప్రధానముగా మూడు భాగములుగా విభజించదగును.
ఎట్లన,
1. దోష మార్జనములు
2. అతిశయాధానము
3. హీనాంగపూర్తి
కల్మష
ప్రకృతి గల ఏ పదార్థమునైనను
శుద్ధి పరచుటకు ఈ మూడు ఉపాయములు
అవసరములగును.దీనికి సరైన ఉదాహరణ - గనిలోనుండి
తీయబడిన లోహము చాలా మలినము
కలిగి ఉండును. ఆ లోహముతో ఒక
కత్తి చేయవలెననిన దానికి ముందు "దోష మార్జనము" చేయవలెను
(అనగా దానికి ఉన్న మలినమును పోగొట్టి
శుభ్ర పరచవలెను). తరువాత ఆ లోహమును అగ్ని
యందు తగినంత కాల్చి కడ్డీగా చేసి పిమ్మట కత్తి
రూపుగా మలచవలెను. దీనికే "అతిశయాధానము" అని పేరు. ఈ
ప్రకారము సిద్ధము చేయబడిన తరువాత కట్టెతోనో, వెండితోనో, బంగారముతోనో ఆ కత్తికొక పిడిని
కూర్చుట, దానిని సింగారించుటను "హీనాంగపూర్తి" అని వ్యవహరింతురు. అలాగే,
ప్రత్తి చెట్టు వలన వచ్చిన కాయలను
తొలుత దానిని కప్పియున్న మలినమును త్రోసివేసి దానియందలి ప్రత్తిని తీసి శుభ్ర పరచుట
దోషమార్జనమనియు, దానినుండి దారము, ధోవతి, ఉత్తరీయము, చీర మొదలైనవి నేయుట
అతిశయాధానము అని ఆ చొక్కాకు
అందమైన అల్లికలు అల్లి, గుండీలు కుట్టి అలంకరించుటను హీనాంగపూర్తి యని చెప్పెదరు. పై
దృష్టాంతములను బట్టి సంస్కార విషయములందు
కొన్ని కర్మల (గర్భాధానము, జాతకర్మ, అన్నప్రాశన) వలన దోషమార్జనము, చూడాకరణము
(చౌలము) వంటి కర్మలవలన అతిశయాధానము,
వివాహము, అగ్న్యాధానము వంటి కర్మలవలన హీనాంగపూర్తి
యగుచున్నదని గ్రహించవలెను. మరి
ఈ సంస్కారముల/కర్మల వివరాలను తెలుసుకుందాము:
గర్భాదానము:
సత్సంతానమునకు
బీజముగా గర్భాదాన సంస్కారము. సంతానము మాత పితల యొక్క
ఆత్మ, హృదయము మరియు శరీరము నుండి
జనించుచున్నది గదా! అందువలన తల్లిదండ్రుల
దేహము (స్థూల, సూక్ష్మ) లోని దోషములు బిడ్డకు
సంక్రమించును. ఈ విషయానికై తల్లిదండ్రులు
తమ గర్భగ్రహణ యోగ్యతను, ఉపయుక్త కాలమును నిర్ణయించుకొని సంతానకాలమందు మనశ్శరీరాదులయందు గల పశుభావనను తొలగించుకొని
సాత్త్వికమగు దైవ భావము కలిగియుండుట
కొరకే ఈ గర్భాదాన సంస్కారము
విధింపబడినది. తల్లిదండ్రుల చిత్తవృత్తులు సంతానోత్పత్తి కాలములో ఎలా ఉంటాయో అటువంటి
లక్షణాలు కలిగిన బిడ్డలే జన్మిస్తారు. కావున తల్లిదండ్రులు గర్భాదాన
సమయమున తాము దేవతలమని, పతి
ప్రజాపతి యొక్క అంశ గలవాడనియు,
పత్ని వసుమతి రూపమనియు తలచి దేవతా చింతనము
చేయుచు గర్భాదానము చేయవలెను.
ఓం
పూషాం భగం సవితామే దదాతు
రుద్రః
కల్పయతు లలామగుం
ఓం
విష్ణుర్యోనిం కల్పయతు
త్వష్టారూపాణి
పిగుంశతు
ఆసించతు
ప్రజాపతిర్ధాతా
గర్భం
దధాతు తే
అనగా
పుష్టి కారకుడైన సూర్యుడు, రుద్రుడు యోనిని కల్పింతురు గాక. వ్యాపకుడైన విష్ణువు
గర్భగ్రహణము గావించు స్థానము ఇచ్చుగాక. దేవశిల్పియగు త్వష్ట రూపమిశ్రము చేయుగాక. ప్రజాపతి సించనము (తడువుట) చేయుగాక. సృష్టికర్త గర్భమును సంఘటింప జేయుగాక.
ఇట్లు
దంపతులు దేవ భావ యుక్తమై
రమించినచో తప్పకుండా సంతానము సులక్షణములతో ధార్మికము కలది కాగలదు. ఇందులో
అణుమాత్రము కూడా సందేహము లేదు.
పుంసవనము
ఇది
మరియు సీమంతోన్నయనం గర్భాన్ని రక్షించుకొనుటకు చేసే సంస్కారములు. కావున
ఈ రెండు గర్భా కాలమునందే
చేయవలెను. పుంసవనము గర్భము ధరించిన మూడవ మాసములో మొదటి
పదిరోజులలో చేయవలెను. ఈ కార్యక్రమములో మఱ్ఱిపండ్లను
మినుములతో, యవలతో కలిపి గర్భిణికి
వాసన చూపించెడి వ్యవస్థ యున్నది. దీనివలన యోనియందున్న దోషములు తొలగి గర్భరక్షణ శక్తి
కలుగునని సుశ్రుతము మొదలగు ఆయుర్వేద శాస్త్రములందు చెప్పబడియున్నది. మోక్షమునకు ఉపయోగపడే ఉత్తమ స్థూల శరీరమును
పొందు లక్ష్యముతోనే ఈ పుంసవన సంస్కారము
నిర్ణయించబడినది.
సీమంతోన్నయనం
ఇది
గర్భాకాలమున ఆరవనెలన గాని, ఎనిమిదవ నెలనగాని
జరుపవలెను (దేశకాలమానములు బట్టి ఇవి వేర్వేరుగా
ఉండవచ్చును). ఇందులో మేడిపండ్లు, వనస్పతి మొదలగు శుభకరమైన పదార్థములను ఉపయోగించి భర్త భార్యను మేడిచెట్టువలె
బలముగా నుండుమని, వనస్పతివలె సంతాన సంపదను పొందుమని
అర్థం వచ్చే మంత్రములను వినిపించును.
అలాగే, ప్రజాపతి అదితికి సీమంతోన్నయనము చేసినట్లు నీకు కూడా సీమంతోన్నయనము
చేసి, పుత్రపౌత్రాభివృద్ధి కలిగి, వృద్ధాప్యము వరకు దీర్ఘజీవిని చేసెదను
అని ఇంకొక మంత్రము పలుకును.
అటు తర్వాత భర్త దేవతలను ప్రార్థించి
గర్భదోషములు తొలగింజేయు, భవిష్యత్త్ సంతాన కళ్యాణమునకై గర్భపోషణ
చేసెడి నేతితో చరుపాక ప్రదర్శనము మొదలగు క్రియలను చేయును.
కాబట్టి
సీమంతమనగా మనము చేసుకునే వేడుక
గాదు. తల్లి, అత్తగారు, భర్త, శ్రేయోభిలాషులతో సంతోషముగా,
ముత్తైదువుల ఆశీర్వాదము పొందుట ఏ మహిళకైనా మంచిదే.
కానీ, దాని పేరిట పైన
చెప్పిన సీమంత ప్రక్రియను చేయకుండుట
శాస్త్ర సమ్మతము కాదు.
జాతకర్మ:
ఇది
శిశువు భూమి మీదకు వచ్చినంతనే
కావింపబడునది. ఇందు తొలుత తండ్రి
యవపు పిండి, బియ్యపు పిండి తరువాత బంగారముతో
రుద్దబడిన తేనెను, నెయ్యిను అప్పుడే పుట్టిన బిడ్డ యొక్క నాలుకకు
తాకించవలెను. ఈ సమయమున తండ్రి
- " ఈ యన్నమే ప్రజ్ఞ, ఇదియే ఆయువు, ఇదియే
అమృతము. ఇవన్నియు నీకు ప్రాప్తించును గాక.
మిత్రావరుణులు, అశ్వినీదేవతలు, బృహస్పతి నీకు మేధనొసగు గాక"
అన్న అర్థము గల మంత్రము పఠించును.
భూమిపైకి వచ్చెడి తరుణమునందు మిక్కిలి కష్టము గలుగుట వలనను, మహామాయామోహము ఆవరించుటవలనను శిశువు స్మృతి కోల్పోవును. అట్టి స్మృతిని తిరిగి
కలిగించుటకే ఈ మేధాశక్తిని కలిగించే
ప్రక్రియ చేయబడును. మొత్తం మీద ఈ జాతకర్మ
వలన ఉపపాతకములు (తల్లిదండ్రుల శరీరములనుండి ఆపాదించిన దోషములు) నశించి తీరును.
ఈ
ప్రక్రియలో వాడబడిన వస్తు గుణములు:
అన్నము
శరీరరక్షణకు మూలము. సువర్ణము వలన వాతదోషమును శాంతింపజేయును.
మూత్రమును సరాసరి వెడలించును. రక్తపోటును సరిజేయును. నెయ్యి శరీరమందు ఉష్ణమును కలిగించును, పుష్టిని కలిగించును, హాయిగా విరేచనము కలుగజేయును. తేనె ముఖమునకు కాంతిని
కలుగజేయును, పిత్తకోశ క్రియను వృద్ధి పరచును, కఫ దోషమును తొలగించును.ఇవన్నీ నూతన శిశువు ప్రాణరక్షణకు
అత్యంత అవశ్యకమే.
నామకరణము:
బిడ్ద
జన్మించి పదిరాత్రులైన తరువాత ఈ సంస్కారము జరుపబడుతుంది.
(పది దినములు ఎందుకంటే చాలా మటుకు పుట్టిన
బిడ్డల మరణాలు పదిరోజులలోపే జరుగుతాయి, కాబట్టి వాటిని అధిగమించిన బిడ్డలకు చేయవలసిన సంస్కారము). ఈ నామకరణ సంస్కారమందు
శిశువు జననకాల గ్రహ నక్షత్రములను, దేవతాదులనుద్దేశించి
పూజా జప హోమ దానములు
చేసి శిశువునకు పేరు పెట్టుట తండ్రి
విధి. ఈ సంస్కార సమయములో
మంత్రము ద్వారా శిశువు ఆత్మకు అమృతత్వము ప్రతిపాదించి బిడ్డకు దీర్ఘాయువు కలుగునట్లు ప్రార్థన జరుపబడును. నామముతో భావమునకు కల సంబంధము వలన,
తన జాతి, వర్ణమునకు చెందిన
ఉన్నతాశయ లాభమును పొందుచున్నాడు. నామము ద్వారా అమృతంబగు
బ్రహ్మముతో సంబంధము ఏర్పరుచుకొనుట, శతాయువు కొరకు ప్రార్థించుట, అంతఃకరణమునకు
బలవృద్ధి, మరియు ఆయుర్వృద్ధి కలిగించుకొనుట
ఈ సంస్కారం యొక్క ఉద్దేశం.
అన్నప్రాశనము:
పుత్రికయైన
ఐదవ నెలలో లేక ఏడవ
నెలలో, పుత్రుడైతే ఆరవ నెలలో లేదా
ఎనిమిదవ నెలలో ఈ సంస్కారమును
చేయవలెను. దీనివలన తిన దగిన ఆహారములు
నిర్దిష్టమగుట చేత అన్నమందలి సంకరదోషము
నిరాకరించబడుతున్నది. సుముహూర్తములో తండ్రి బిడ్డను తన ఒడిలో యుంచుకొని,
భార్య ఎడమ పక్క కూర్చొని
యుండగా మంత్రము పఠించుచు, హోమము తరువాత అన్నము
నోటిలో యుంచవలెను. అన్నమే సమస్త జీవరక్షణము. అన్నమునకు
పతి సూర్యదేవుడు. ఆ సూర్యుడు అన్నమును,
శుభమును బిడ్డకు ఇచ్చు గాక అనే
అర్థము కలిగిన మంత్రము పఠించబడును. ఈ సంస్కారము వలన
బిడ్డకు మాతృగర్భమున మాలిన్యము తినుటవలన కలిగిన దోషము తొలగి శరీరము
నిర్మలమగును. పరబ్రహ్మ స్వరూపమని చెప్పబడిన అన్నము ప్రాశనము చేయించుట వలన శిశువుకు బలము,
ఆయువు, అంతఃకరణ శుద్ధి స్థాపన కలిగి, బ్రహ్మ భావోద్బోధన జనించును.
కాబట్టి,
అసలైన కార్యక్రమం మంత్రోక్తంగా బిడ్డకు అన్నము పెట్టటం. మనం ఆర్భాటంగా జరుపుకునే
- బిడ్డను పడుకోబెట్టి పారాడి వస్తువును అందుకునే కార్యక్రమం ఒక వేడుక మాత్రమే.
చౌలము:
సప్తమ
సంస్కారమును చౌలము లేక చూడాకరణమని
యందురు. ఇది బిడ్డకు మూడవయేడు
వచ్చిన పిదప చేయుదురు. ఇందులో
బిడ్డ యొక్క తలవెంట్రుకలు తీసివేయుట
ప్రధాన క్రియ. శిశువునకు గర్భమునందు కలిగిన కేశములను తొలగించి చూడాకరణమొనర్చి దీనిద్వారా శిక్షయు, సంస్కారయోగ్యతయు కలిగింపబడును. కావున, బిడ్డకు అపాత్రతా దోషము నిరాకరించబడును. వృద్ధి
శ్రాద్ధము, హోమము జరిగిన పిమ్మట
సూర్యుని ప్రార్థించుచు, "సూర్యుడు దేనితో బృహస్పతికి కేశఖండనమొనర్చెనో, దేనితో వాయుదేవుడు ఇంద్రునకు కేశఖండనము చేసెనో, అట్టి బ్రహ్మరూపి యగు
కత్తి ద్వారా నేను నీకు కేశఖండనము
చేయుచున్నాను. నీకు ఆయుస్తేజోబలాభివృద్ధులు కలుగుగాక!" అన్న
అర్థము గల మంత్రములు పఠించబడును.
ఈ చూడాకరణమందు శిఖ మాత్రముంచి మిగిలిన
కేశములు తొలగించాలి. కేశములు బలమునకు మూలం. అవి పూర్తిగా
తొలగించుట వలన మనిషి బలహీనుడగును.
శిఖతో పురుషునకు బలము, వీర్యము, స్థైర్యము,
ఆధ్యాత్మికోన్నతికి చెప్పనలవి కాని సంబంధము ఉన్నందు
వలన ఈ శిఖధారణము హిందువుల
జాతీయ చిహ్నముగా పరిగణించబడినది. చూడాకరణము ఈ జాతీయ చిహ్నమునకు
మొదటి సన్నివేశమగును.
ఇంకా చదవండి »
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)










