• విష్ణుషట్పదీ స్తోత్రం

    నారాయణ నారాయణ జయ గోవింద హరే |నారాయణ నారాయణ జయ గోపాల హరే ||

  • శ్రీ రామ

    ఆపదం అపహర్థారమ్ దాతారం సర్వ సంపదం, లోకాభి రామం శ్రీ రామం భూయో భూయో నమామ్యహమ్I

  • శ్రీ సీతామాత

    త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ, హనుమాన్ యత్న మాస్తాయ దు:ఖ: క్షయ కరోభవ

  • ఓం నమ:శివాయ:

    చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర పాహిమామ్ , చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర రక్షమామ్ I

  • శ్రీమాత్రే నమః

    అమ్మల గన్న యమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాల పెద్దమ్మ, సురారులమ్మ కడుపారడి పుచ్చిన యమ్మ, తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ మాయమ్మ కృపాబ్ధి నిచ్చుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్

  • శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు

    పురుషోవిష్ణు రిత్యుక్తః శివోనానామతః స్మృతః I అవ్యక్తం తు ఉమాదేవీ శ్రీర్వా పద్మ నిభేక్షణా I తత్ సంయోగా దహంకారః స చ సేనాపతిరుహః I

మార్గశిరమాసం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

మార్గశిర మాసం లో ఆరుద్ర నక్షత్రం విశేషం ఏంటి ?

శివుడికి నాటు ఆవు నేయి తో తెల్లవారుఝామున లేదా ప్రదోష కాలం లో అభిషేకం చేయాలి. శివాలయం లో మాత్రమే అబిషేకం చేయాలి, ప్రదోష కాలం లో గుడికి వెళ్లి దీపం వెలిగించి , అభిషేకం ఎందుకు చేయాలి అనుకున్టునారో సంకల్పం చెప్పుకుని , ముందుగా పంచమ్రుతలతొ అబిషేకం చేసి ఆ తరువాత ఆవునేయి తో అబిషేకం చేయలి. 

ఆరోగ్యం కోసం అయితే మృత్యుంజయ స్తోత్రం తో 
ఐశ్వర్యం కోసం అయితే నమకం - చమకం తో 
శివపంచాక్షరి తో కూడా చేయవచు 
వ్యాది పోవటం కోసం ఆవు పాలు , నేయి తో 
10,000 సార్లు చదువుతూ పురుష సూక్తం చదువుతూ కూడా చేయవచు అని కొన్ని గ్రంధాల లో ఉంది . (శివ మహా పురాణం ) వివాహం జరగడం లేదు అంటే పాసుపత మంత్రం తో చేస్తారు కానీ నేటి తో చేయరు.  కష్టాలు వచినపుడు , ఉపద్రవాలు వచినప్పుడు అలాంటివి వచినప్పుడు మార్గశిర మాసం లో ఆరుద్ర నక్షత్రం రోజున నాటు ఆవు నేయి తో అబిషేకం చేయాలి. మూపురం తో ఉన్న ఆవు మాత్రమే మన దేశి ఆవు . ఎందుకంటే ఇప్పుడు సంకరం చేసేటపుడు కూడా వేరా జంతువూ నుంచి లేదా విదేశి దున్నపోతు నుంచి సంకరం చేయటం వలన వచ్చే సంతానం కి మూపురం ఉండదు. మూపురం లో ముక్కోటి దేవతలు ఉంటారు, మూపురం నుంచి -సూర్య కేతు నడి నుంచి సూర్య రసిమి గ్రహించి రోగ నిరోధక శక్తి ని తీసుకోవటం వలన కెరోటిన్ అనే పదార్థం తయారవుతుంది. 

కార్తిక మాసం లో 1000 దీపాలు వెలిగిస్తే సకల దోషాలు పోతాయి అంట. పుష్య మాసం లో పుష్యమి నక్షత్రం రోజు శివుడికి నీరాజనం ఇవాలి. మాఘ మసం లో మాఘ నక్షత్రం రోజు శివుడి ప్రీత్యర్ధం గ నేయి దానం చేయాలి , కంబలి దానం చేయాలి, ఇలా చేయటం వలన శివానుగ్రహం కలుగుతుంది. 

వైశాఖ మాసం లో విశాఖ నక్షత్రం రోజున పువ్వులతో శివలింగాని తాయారు చేసి , ఆవాహన చేసి అర్చన చేయటం వలన శివానుగ్రహం కలుగుతుంది అంట (శివ మహాపురణం ). 

అస్విజ మాసం లో నూకలు లేని బియం తో పాయసం చేసి శివుడికి నివేదన చేయటం వలన శివానుగ్రహం కలుగుతుంది. అ పాయసం పాత్ర తో పటు దానం చేయటం వలన దరిద్రం పోతుంది అంట. 

ఇంకా చదవండి »

మార్గశిర శుద్ధ పాడ్యమి కధ


ఒక చాకలి ముసలి ఆవిడకు అయిదుగురు కోడళ్ళు ఉన్నారట .ఆమె ఆశ్వ యుజ బహుళ అమావాశ్య  నుంచి కార్తీక బహుళ అమావాశ్య వరకు తెల్ల వారు ఝామునే లేచి ,ఏటి లో చన్నీటి స్నానం చేసి దీపం పెట్టు కొనేది .ఇలా ఒక నెల గడి చిన తర్వాత కార్తీక అమావాశ్య  నాడు చిన్న కోడలు పోలిని  ఇంటికి కాపలా పెట్టి మిగిలిన కోడళ్ళను తీసుకొని నది ఒడ్డుకు వెళ్ళింది. 

చిన్న కోడలు పెరుగు చిలికి వెన్న తీసి ,కవ్వానికి అంటిన వెన్న తీసి ,పత్తి చెట్టు కింద రాలిన పత్తి తో వత్తి చేసి ,ప్రమిదలో పెట్టి ,శుభ్రం గా నూతి వద్ద స్నానం చేసి దీపం వెలిగించింది .అత్త గారు వచ్చి తిట్టు తుందనే భయం తో ఆ దీపం కనపడ కుండా దానిపై చాకలి బాన బోర్లించింది .దేవతలు ఆమె భక్తికి సంతోషించి ,దివ్య విమానాన్ని తెచ్చి ,ఆమెను బొందె తో కైలాసానికి తీసుకు వెళ్ళారు. 

వూళ్ళో వున్న వారంతా ”,చాకలి పోలి స్వర్గానికి వెడుతోంది అను కుంటు వింత గా చూశారు .విమానం బాగా క్రిందు గా పోతూ వుండటం తో ఆమె కాళ్ళు పట్టు కోని వూరి జనం కూడా ఆమెతో స్వర్గానికి   వెళ్తున్నారు .విష్ణు దూతలు ఈ పోలి అధిక భక్తీ తో జ్యోతిని వెలి గించింది .కనుక స్వర్గానికి తీసుకొని వెళ్తున్నాం .మీకు ఆ అదృష్టం లేదు అని వాళ్ళను కిందకు తోసే శారు. 

పోలి శరీరం తో స్వర్గానికి వెళ్ళిన పుణ్యాత్ము రాలు .అందుకే ఆమె ను తలచు కుంటు కార్తీక అమావాశ్య తెల్ల వారుజ్హామున నది ఒడ్డున దీపాలు వెలిగించి ఆమె ను గుర్తు చేసు కొంటు ,ఆమె కధను చెప్పు కొంటు ,నీటి లో దీపాలు వదిలి పెడ తారు స్త్రీలు అంతా .స్త్రీలు అందరు ఈ కధ చెప్పు కోని అక్షంతలు నెత్తినా వేసుకొని ఇంటికి తిరిగి వస్తారు .అరటి దొప్ప లలో ఆవు నీతి దీపాలు వెలిగించి నీటి లో వదులు తారు .అదీ పోలి స్వర్గానికి పోవటం అంటే. 

ఇందు లో రెండు ముఖ్య విషయాలున్నాయి .ఒకటి భక్తికి కులం అడ్డు రాదు .అందుకే అందరు అన్ని కులాల స్త్రీలు పోలి తల్లి ని గుర్తుంచు కోని దీపాలు పెట్టి సాగ నమ్పటం .రెండోది కార్తీక దీపానికి అంత ప్రాముఖ్యత వుంది అని తెలియ జేయటం .నిశ్చల భక్తీ తో చేసింది ఏదైనా పర మేశ్వరుడు మెచ్సుతాడు .

ఇంకా చదవండి »

మార్గశిర మాసం ప్రతి రోజు ప్రత్యకమైన రోజు


మార్గశిర శుద్ధ పాడ్యమి నాడు గంగాసాన్నం. మార్గశిర శుద్ధ పాడ్యమి కధ
తదియనాడు ఉమామహేశ్వర వ్రతంఅనంత తృతీయ వ్రతం
చవితినాడు వరద చతుర్థినక్త చతుర్థి పేరుతో వినాయకుడిని పూజిస్తారు
పంచమినాడు నాగపంచమి వ్రతం
షష్ఠినాడు సుబ్రహ్మణ్య షష్ఠి
సప్తమి నాడు సూర్యారాధన సూర్యారాధననారాయణుడిని పూజిస్తారు
మార్గశిర శుద్ధ అష్టమిని కాలభైవాష్టమి
నవమినాడు త్రివిక్రమత్రిరాత్ర వ్రతం జరుపుతారు
దశమి రోజున పదార్థ వ్రతంధర్మవ్రతం
మార్గశిర శుద్ధ ఏకాదశి తిథిని మోక్షైకాదశిసౌఖ్యదా ఏకాదశిగా పిలుస్తారు. ధనుర్మాసం కూడా వచ్చి ఉంటే అదే ముక్కోటి (వైకుంఠ ఏకాదశిఅవుతుంది. చంద్రమానాన్ని బట్టి ఇది ఒక్కోసారి మార్గశిరంలో మరోసారి పుష్యంలో వస్తుంది.
శుద్ధ చతుర్దశి చంద్రపూజకు మహత్తరమైనదని అంటారు. గీతాజయంతి గా వ్యవహరిస్తారుఆవేళ కృష్ణుణ్ని పూజించిగీతా పారాయణ చేస్తే మంచిదని ప్రతీతి.  
ద్వాదశిని మత్స్యద్వాదశి అంటారు
మార్గశిర శుద్ధ త్రయోదశి నాడు భయపీడానివారణార్థం హనుమద్వతం త్రయోదశీ వ్రతం జరుపుతారు. 
శుద్ధ చతుర్దశి చంద్రపూజకు మహత్తరమైనదని అంటారు. 
పౌర్ణమి దత్తాత్రేయుడు అవతరించిన రోజు ఆరోజున దత్త చరిత్ర పారాయణ చేస్తారు.ఈ పున్నమికే కోరల పున్నమినరక పూర్ణిమ అని పేరు ఈ పౌర్ణమినాడు అగ్నిపురాణం దానం చేస్తే మంచిదంటారు పండితులు. 
మార్గశిర కృష్ణ పాడ్యమినాడు శిలావ్యాప్తి వ్రతం
సప్తమినాడు ఫలసప్తమీ వ్రతం. ----ఇక్కడ క్లిక్ చేయండి 
అష్టమికి అనఘాష్టమీకాలాష్టమీ వ్రతాలు
నవమినాడు రూపనవమి వ్రతం
ఏకాదశి రోజు వైతరణీ వ్రతంధనద వ్రతంసఫల ఏకాదశీ వ్రతం. 
ద్వాదశి తిథిరోజు మల్లి ద్వాదశికృష్ణ ద్వాదశీ వ్రతాలు
త్రయోదశి యమత్రయోదశి వ్రతం

గురువారం నాడు మార్గశిర లక్ష్మీవార వ్రతం
వ గురువారం - పులగం
వ గురువారం - అట్లుతిమ్మనం
వ గురువారం - అప్పాలుపరమాన్నము
వ గురువారం - చిత్రాన్నంగారెలు

అమావాస్య  వకుళామావాస్య, అమావాస్య వ్రతం - ఆవు పాలతో పరమాన్నం వండి దేవునికి నివేదన చేయడం సర్వ శుభస్కరం. బహుళ చతుర్దశినాడు బహుళమావాస్య వ్రతంతో మార్గశిరం పూర్తవుతుంది

ఇంకా చదవండి »

మార్గశిర మాసం లో ఆచరించే - పుంసవన వ్రతము

 
కశ్యపుడు దితికి చెప్పిన వ్రతం పుంసవనం
వ్రతము పేరు పుంసవనం
అనుష్ఠాన కాలము ఒక్క సంవత్సరం.

వ్రత నియమాలు 
1 ఏ జీవుల ఎడల హింసాభావముతో ఉండరాదు. 
2 గట్టిగా మాట్లాడరాదు. 
3 కోపం మానాలి. 
4 అబద్దం పలుకరాదు. 
5 గోళ్ళు, జుట్టు కత్తిరించరాదు. 
6 ఎముకలు, కపాలము మొదలైన అమంగళ వస్తువులను తాకరాదు. 
7 నదిలో కాని చెరువులో కాని స్నానం చేయాలి. కుండలలోని, నూతులలోని నీటితో స్నానం చేయరాదు. 
8 దుర్జనులతో మాట్లాడరాదు. 
9 కట్టిన బట్టలు, ముడిచిన పూలు మళ్ళీ ధరించరాదు. 
10 పంచవిధ నిషిద్ధాన్నాలు తినరాదు. పంచవిధ నిషిద్ధాన్నాలు – 1ఎంగిలి చేసిన పదార్థాలు, 2అమ్మవారికి నివేదించిన (బలి) అన్నం 3తలవెంట్రుక పడ్డ అన్నం, కుక్కు పిల్లి కాకి ముట్టిన అన్నం పురుగులు చీమలు పట్టిన అన్నం 4మాంసాహారము 5శూద్రులు తెచ్చినది. 
11 దోసిళ్ళతో నీళ్ళు తాగరాదు. 
12 ఉదయ సాయంకాల సంధ్యలలో జుట్టు విరబోసుకోరాదు. 
13 మితంగానే మాట్లాడాలి. 
14 అలంకరించుకోకుండ ఉండరాదు. 
15 బయట తిరుగరాదు. 
16 కాళ్ళు కడుక్కోకుండా నిద్రపోరాదు. 
17 తడికాళ్ళతో పడుకోరాదు. 
18 పడమట దిక్కు తల పెట్టుకొని కాని, నగ్నంగా కాని, సంధ్యాసమయాలలో కాని నిద్రించరాదు. 
19 ఎప్పుడు శుభ్రమైన బట్టలు కట్టుకొనే ఉండాలి. 
20 ఎప్పుడు శుచిగా ఉండాలి.
21 ఎప్పుడు సర్వ మంగళ చిహ్నాలతోటి ఉండాలి.

వ్రత విధానము 
నిత్యం నియమబద్దంగా ఉంటూ, రోజూ పొద్దున్నే లక్ష్మీనారాయణుల (షోడశోపచార) పూజ చేసి. హోమం చేసి, నమస్కరించి, భగవన్మంత్రం (ఓం నమో భగవతే వాసుదేవాయః) పది సార్లు పారాయణం చేసి, గంధం, పుష్పం, అక్షతలతో ముత్తైదువలను పూజించి, పతిని సేవించాలి. కొడుకు కడుపులో ఉన్నట్లు భావించాలి.

ఈ విధంగా మార్గశిర శుద్ద పాడ్యమి సంకల్పం చెప్పుకొని ప్రారంభించి, ఒక సంవత్సరం పూర్తిగా ఆచరించాలి. ఆఖరి రోజున పద్దతి ప్రకారం ఉద్యాపనము చేయాలి. వ్రతం చేస్తున్న ఏడాది కాలంలోను పొరపాటున కూడ నియమభంగం కలుగ రాదు.

ఇంకా చదవండి »