• విష్ణుషట్పదీ స్తోత్రం

    నారాయణ నారాయణ జయ గోవింద హరే |నారాయణ నారాయణ జయ గోపాల హరే ||

  • శ్రీ రామ

    ఆపదం అపహర్థారమ్ దాతారం సర్వ సంపదం, లోకాభి రామం శ్రీ రామం భూయో భూయో నమామ్యహమ్I

  • శ్రీ సీతామాత

    త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ, హనుమాన్ యత్న మాస్తాయ దు:ఖ: క్షయ కరోభవ

  • ఓం నమ:శివాయ:

    చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర పాహిమామ్ , చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర రక్షమామ్ I

  • శ్రీమాత్రే నమః

    అమ్మల గన్న యమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాల పెద్దమ్మ, సురారులమ్మ కడుపారడి పుచ్చిన యమ్మ, తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ మాయమ్మ కృపాబ్ధి నిచ్చుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్

  • శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు

    పురుషోవిష్ణు రిత్యుక్తః శివోనానామతః స్మృతః I అవ్యక్తం తు ఉమాదేవీ శ్రీర్వా పద్మ నిభేక్షణా I తత్ సంయోగా దహంకారః స చ సేనాపతిరుహః I

ఏకాదశివ్రతం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

ఏకాదశి వ్రతం అనగా



ఏకాదశి వ్రతం అనగానేమి? అసలు ఏకాదశి రోజున ఉపవాస దీక్ష ఎలా చేయాలి? ఏకాదశి రోజున, ఉపవాస దీక్షలో ఉన్నవారు, స్మరించవ లసిన ప్రత్యేకమైన మంత్రము లు ఏమైనా ఉన్నవా? ఇది ఎవరికి ఉద్దేశించబడింది?

సమాధానం:
ఉత్సవములకన్న కొంచెం కఠినమైన నియమాలతో కూడినవి వ్రతములు. వ్రతము లన్నీ అభీష్ట సిద్ధినిస్తాయి. వీటిలో ఏకాదశీ వ్రతాలు చాలా శ్రేష్ఠమైనవి. ఏకాదశీ వ్రతాలు ౧. మనలో ఉత్తమ సంస్కారా లను కలుగచేస్తాయి.
౨. కోరిన కోరికలను సిద్ధింప చేస్తాయి.
౩. ఆత్మోన్నతికి ఉపకరిస్తాయి. ౪. జన్మాంతలో విష్ణులోకానికి చేరుస్తాయి.

ఈ ఏకాదశీ వ్రతాలు ప్రతీ నెలలో రెండుసార్లు (శుక్లపక్ష ఏకాదశినాడు, కృష్ణపక్ష ఏకాదశినాడు) వంతున సంవత్సరంలో ఇరవైనాలుగు సార్లు సంభవిస్తాయి. ప్రతి ఏకాదశికి ఒకపేరు ఉన్నది. 

పన్నెండు నెలలలో చైత్రం నుంచి ఫాల్గుణం వరకూ శుక్లపక్షంలొ వచ్చే ఏకాదశుల క్రమంగా –
చైత్రం -కామదా,             వైశాఖం – మోహనీ,           జ్యెష్థం – నిర్జలా,
ఆషాఢం – శయనీ,         శ్రావణం – పుత్రదా,          భాద్రపదం – పద్మా, 
ఆశ్వియుజం – పాపాంకుశా,       కార్తికం- ప్రబోధినీ,      మార్గశ్శీర్షం- మోక్షదా,
పుష్యం – పుత్రదా,             మాఘం – జయా,          ఫాల్గుణం – ఆమలకీ

అలాగే – ప్రతినెలలలో కృష్ణపక్ష ఏకదశుల క్రమంగా –
చైత్రం -పాపమోచనీ,               వైశాఖం – వరూథినీ,             జ్యెష్థం – అపరా,
ఆషాఢం – యోగినీ,                శ్రావణం – కామికా,          భాద్రపదం -అజా, 
ఆశ్వియుజం – ఇందిరా,         కార్తికం- రమా,              మార్గశ్శీర్షం- ఉత్పన్నా,
పుష్యం – సఫలా,             మాఘం – షట్ తిలా,      ఫాల్గుణం – విజయా

ఈ ఏకాదశీ వ్రతములను ముఖ్యంగా యతీంద్రులు, వానప్రస్థులు, గృహస్థులంద రూ ఆచరించవలెనని ధర్మ శాస్త్రములు బోధిస్తున్నవి. ఆషాఢశుక్ల ఏకాదశి నుంచి కార్తికశుక్ల ఏకాదశివరకూ యతీంద్రులు, ధర్మాచార పరాయణులైన గృహస్థులు చాతుర్మాస్య దీక్షను కూడా ఆచరిస్తారు. ఈ ఏకాదశీ వ్రతాలు ముఖ్యంగా ఉపవాస దీక్షాప్రధానాలు -అందుచేతనే 

ఉపోష్యైకాదశ్యాం నిత్యం పక్షయోరుభయోరపి|
కృత్వా దానం యథాశక్తి కుర్యాచ్చ హరిపూజనమ్||

అని గరుడపురాణం చెబుతు న్నది. కనుక ఉపవాసం, దానములు, హరిపూజ ఇవి ఏకాదశీ వ్రతంలో ముఖ్య విశేషాలుగా గ్రహించదగిన వన్నమాట.

అలాగే ఉపవాస విషయంలో –

ఏకాదశీ సదోపేష్యా పక్షయో: శుక్లకృష్ణయో: అని సనత్కుమారసంహితా,

ఏకాదశ్యాముపవసేన్నకదాచిదతిక్రమేత్ – అని కణ్వస్మృతి,

ఏకాదశ్యాం న భుంజీత కదాచిదపి మానవ: – అని విష్ణుస్మృతి చెబుతున్నవి.

కనుక ఏకాదశీ వ్రతములలో ఉపవాసానికి అంత ప్రాధాన్య మున్నది. ఆశ్రమభేదంలేకుండా మానవులందరూ ఈ వ్రతాన్ని ఆచరించవలెనని విష్ణుస్మృతి చెబుతున్నది.

ఈ ఉపవాసదీక్షలో నిరాహారం గా జలం మాత్రమే తీసుకుని కొందరూ, నిర్జలంగా అంటే నీరుకూడా త్రాగకుండా కొందరూ పాటిస్తూంటారు. ఏకాదశీ తిథిలో ఇలా ఉపవాసం చేసి ద్వాదశితిథి ప్రవేశించగానే విష్ణుపూజనం చేసి విష్ణునైవేద్యాన్ని ఆహారంగా స్వీకరించాలి. అనివేదిత భోజనం చేసేవారు దొంగలతో సమానమని శాస్త్రం చెబుతున్నది. ఇది సంగ్రహంగా ఏకాదశి వ్రత పరిచయం.


ఏకాదశి తిధి రెండు రోజులు ఉన్నప్పుడు ఉపవాసం ఏరోజున చెయ్యాలి ?? చాలా సందర్బాలలో ఏకాదశి తిధి ఒక రోజు సాయంత్రమో లేక మధ్యాహ్నమో వచ్చి తరువాతి రోజు మధ్యాహ్నం వరకు వుండే సమయాలలో ఉపవాసం ఏరోజు చెయ్యాలి మొదటి రోజా లేక రెండోరోజా?

సమాధానం: ధర్మనిర్ణయచంద్రికా –

అరుణోదయవేధోత్ర వేధః సూర్యోదయే తథా |
ఉక్తాద్వౌదశమీవేధౌ వైష్ణవఃస్మార్తయోః క్రమాత్ ||

వైష్ణవులకు అరుణోదయము నకు దశమీ వేధయున్ననూ స్మార్తులకు సూర్యోదయము నకు వోధయున్ననూ అట్టి ఏకాదశి ఉపవాసమునకు పనికిరాదు.

భృగుః – సంపూర్ణైకాదశీయత్రప్రభాతే పునరేవసా |
తత్రోపోష్యద్వితీయాత్ పరతో ద్వాదశీయది ||

ఒకరోజు ఏకాదశీ పూర్తిగా నుండి మరునాడు సూర్యోదయమునకు ఏకాదశీ మిగులుండి త్రయోదశినాడు ఉదయం ద్వాదశి మిగులున్న చో ఏకాదశీమిగులున్ననాడే ఉపవాసము చేయాలి

త్రయోదశ్యాం కియన్మాత్రా ద్వాదశీనలభేద్యది |
పూర్వాకార్యా గృహస్థైస్తు యతిభిః చోత్తరా యదా ||

మొదటిరోజు ఏకాదశి పూర్తిగా నుండి మరునాడుమిగులుండి త్రయోదశి నాడు ద్వాదిశి మిగులుకాకున్న, మొదటి రోజు గృహస్థులు, రెండవరోజు సన్యాసులు ఉపవాసము ఉండవలెను. మరింత వివరములకై “ధర్మసింధు”, “ధర్మనిర్ణయచంద్రిక” లను గ్రంథములను పరిశీలించగలరు.

ఏకాదశి నాడు ఉపవాసం ఎందుకు చేయాలి:

శాస్త్రము-శాస్త్ర విజ్ఞానము

శాస్త్రము (పురాణము):
అసలు ఏకాదశి అనే పేరు ఎలా వచ్చిందంటే, మహా విష్ణువులోని స్త్రీ తేజం ‘ముర’ అను రాక్షసిని సంహరించి దేవతలను రక్షిస్తుంది. ఆ స్త్రీ మూర్తికి విష్ణువు ఏకాదశి అని పేరు పెట్టి, ఆ రోజు ఏకాదశిని పూజించిన వారు వైకుంఠము చేరేదరని వరం యిస్తాడు. మురని హరించడం వలన శ్రీ హరి ‘మురహర’ లేదా ‘మురహరి’ లేదా ‘మురారి’ అయినాడు.అంతే కాదు ఈ దినం ఉపవాసం ఉన్నవారికి పుణ్యము లభిస్తుందని హిందువుల నమ్మకము. విష్ణు పురాణం ప్రకారం వైకుంఠ ఏకాదశి నాడు ఉపవాసం చేస్తే మిగిలిన 23 ఏకాదశులు ఉపవాసం చేసినంత ఫలం. అయితే ఈ ఏకాదశే కాదు ప్రతి ఏకాదశి నాడు ఉపవాసం ఉండాలని చాల మంది భక్తుల నమ్మకం. ఈ రోజు వైష్ణవ ఆలయాలలో విష్ణు సహస్ర నామ పారాయణం, వేదాన్తిక చర్చలు, పూజలు విశేషంగా చేస్తారు.

శాస్త్ర విజ్ఞానము:
అదలా ఉంచితే చాంద్రమాన తిథుల ప్రకారం ఏకాదశి పక్షం లో 11 వ రోజు. ప్రతి నెలలో రెండు సార్లు ఏకాదశి వస్తుంది. అయితే చాల మంది గమనిం చే ఉంటారు భూమిపైన, అందు నివసించే మన మనస్సుల మీద చంద్రుని ప్రభావం ఉంది. ఏకాదశి నుండి మొదలుకొని పౌర్ణమి లేదా అమావాస్య దాటిన ఐదు రోజుల (పంచమి) వరకు క్రమంగా చంద్రుని ప్రభావము మన శరీరములోని ద్రవ పదార్థములు (ఉదా. రక్తము), మెదడు, జీర్ణ వ్యవస్థల మీద క్రమక్రమంగా అధికము అవుతుంది. ఈ ప్రభావము పౌర్ణమి నాడు అత్యధికంగా వుంటుంది. అందుకే పౌర్ణమి నాడు సముద్ర కెరటాలు మిగిలిన రోజులలో కన్నా ఉవ్వెత్తుగా లేస్తాయి. అందు వలన పౌర్ణమి నాడు సముద్ర స్నానం చేయడానికి వెళ్ళే వాళ్ళను వారిస్తారు లేదా చాల జాగ్రత్తగా ఉండాలని చెబుతారు. అంతే కాదు, కొందరు మానసిక రోగులకు పున్నమి రాత్రులలో మానసిక రుగ్మతలు విజృంభిస్తాయి. మన వాళ్ళు అంటుంటారు “వీడికి అమావాస్యకు, పున్నమికి పిచ్చి ఎక్కువ అవుతుంటుంది జాగ్రత్త” అని. నిజానికి ఇదంతా చంద్రుని ప్రభావమే అంటున్నారు శాస్త్రజ్ఞులు.

అయితే ఉపవాసానికి ఏకాదశికి ఏమిటి సంబంధం? ఏకాదశి నాడే ఎందుకు ఉపవాసం చేయాలి? వేరే రోజులలో చేయవచ్చును కదా! దీనికి శాస్త్ర విజ్ఞానము ఇంకొక విశ్లేషణ ఇస్తోంది. చంద్రుడు 24 గంటలలో 12 డిగ్రీల దూరం ప్రయాణిస్తాడు. ఈ కాలం ఒక తిథితో సమానం. సూర్యుని నుండి 180 డిగ్రీలు చలించాక పౌర్ణమి వస్తుంది, మరో 180 డిగ్రీలు తిరిగాక అమావాస్య వస్తుంది. అయితే ఏకాదశి నాడు (కృష్ణ పక్షం గాని, శుక్ల పక్షం గాని) సూర్యుడు, చంద్రుడు, భూమి ఒక నిర్నీతమైన అమరికలో ఉంటారు. ఈ ఏకాదశి రోజు చంద్రునికి భూమి మీద, ముఖ్యంగా నీటి మీద ఆకర్షణ అతి తక్కువగా ఉంటుంది. అది మన శరీరంలో ఉండే ద్రవ పదార్ధాల మీద కూడా అతి తక్కువ ప్రభావం ఉంది వాటి ప్రసరణ లేదా చలనం మంద కొడిగా ఉంటుంది. ఉదాహరణకు మన ప్రేగులలో ఆహార పదార్ధాలు కూడా అతి నెమ్మదిగా కదులుతాయి. తత్ఫలితంగా జీర్ణక్రియ మంద గించి మలబద్ధానికి దారి తీస్తుంది. మలబద్ధకం అనేది అన్ని వ్యాధులకు మూల కారణము. అందువలన ఈ రోజు (ఏకాదశి రోజు) ఆహారాన్ని తీసుకోకుండా ఉండటం వలన మరుసటి రోజుకు ఆంత్ర చలనం క్రమ పద్ధతిలోనికి వచ్చి శరీరం తేలిక పడుతుంది. ఈ రకమైన చర్య మన ఆరోగ్యానికి మంచిది. దీని కోసం ఏకాదశి నాడు కేవలం నీరు (అందులో చిటికెడు ఉప్పు, ఒక అర చెంచా నిమ్మ రసం కలిపి) రోజంతా తీసుకోవాలి. ఈ విధంగా చేయడం వలన మన జీర్ణ వ్యవస్థ నుండి మలినాలు తొలగించబడి అది చక్కబడు తుంది.

అందు వలన ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే పురాణ శాస్త్రరీత్యా పుణ్యము వస్తుంది, విజ్ఞాన శాస్త రీత్యా ఆరోగ్యకరం గా ఉంటుంది.


ముఖ్యంగా ఏకాదశి ఉపవాసం చేసేప్పుడు తినకూడనివి:
ధాన్యం సంబంధించిన అనగా వరి, గోధుమ, జొన్న, రాగులు, సజ్జలు ఇత్యాది వాటితో చేసినవి
పప్పు దినులు అంటే కంది, పెసర, మినప, శనగ, పెసర్లు, బబ్బెర, పుట్నాలు, ఓట్స్ ఇత్యాదివి తీసుకోకూడదు

ఇక తీసుకునే పదార్థాలు:
పండ్లు , సగ్గుబియ్యం (పాయసంగా కాదు లేద కూరగాయలు వేసుకుని కిచిడీ కానీ చేసుకోవచ్చు , ఆవాలు వాడకూడదు) , Quinoa, buckwheat (ఈ రెండు reliance fresh లాంటి hyper market shopsలో దొరుకుతాయి) , పాలు, మజ్జిగ , పెరుగు

ఉప్పు మాత్రం సాధారణంగా వాడేది కాక సైంధవ లవణం వాడాలి


ఏకాదశి ఉపవాసం ఆడవారికి ఎక్కువ వంట పని లేకుండా ఆ రోజు ఎక్కువ సమయం భగవద్ధ్యానం, నామ జపం మరియు పురాణ పారాయణం చేయడానికి అవకాశం కల్పించబడింది!! మామూలు రోజుల్లో ఆడవారికి వీలుపడదు కదా!! వంట పనే చాలా పెద్దపని వారికి !! ఇదండీ ఏకాదశి

ఇంకా చదవండి »

ఆస్విజ శుక్ల ఏకాదశి విశేషం ఏమిటి?

ఆస్విజ శుక్ల ఏకాదశి ని పాసాంకుస ఏకాదశి అంటారు అంటే పాశం అంకుశం అంటారు . అంటే యమ పాశం నుంచి ఈ రోజు ఏకాదశి వ్రతం చేయటం వలన మనని కాపాడుతుంది ఇది అంకుశం లాంటిది. ఈ కాలం లో అనేక రోగాలతో బాదపడుతూ ఉంటారు. ఈ నెలలో అనేక రోగాలు ప్రభాలే అవకాసం ఉంది. 

ఒక ఋతువు నుంచి ఇంకో ఋతువు కి వెళ్ళే కాలం అ సంధి కాలం లో అనేక రోగాలు ప్రబలే అవకాసం ఉంది. యమ పాశం నుంచి రక్షణ కావలి అనుకునే వారు అంతా పూజ చేయాలి. నిరాహారం గ ఉంది నారాయణ మూర్తి ని స్మరించాలి , సేవించాలి.

ఈ మాసం లో పొద్దున్న అంతా ఉపవసించి సాయంత్రం పూట తులసి దగ్గర లక్ష్మి నారాయణల కి పూజ చేయాలి అంటారు. ఈ విదంగా కర్తీక మాసం లో కదా చేయాలి , ఇప్పుడు ఏంటి అంటే ఈ వ్రాతని చేసే వారు ఈ ఏకాదశి నుంచే ప్రారంబించాలి అంటారు. ఈ తులసి కి అలికి 5 రకాలా పద్మాలు 5 ముగ్గులు, 5 రకాల వంటలు నైవేద్యం పెట్టాలి. తులసి కి నారాయనుకి దీపం పెటాలి. రాత్రి అంతా నారాయణ మూర్తి బజన చేయాలి. నారాయణనుని అనుగ్రహం పొందాలి. మరుసటి రోజు ద్వాదశి ఘడియలలో పారణ చేయాలి.

ఆస్విజ శుక్ల ఏకాదశి, ఆస్విజ బహుళ ఏకాదశి, కార్తిక సుద్ద ఏకాదశి ఈ 3 ఏకాదశి లో ఈ వ్రతం నియమాలు ఇలాగే చేయాలి అని ప్రత్యేకం గ కనిపిస్తుంది.

దీపావలి తెలవారి నుంచి కార్తిక మాసం ప్రారంభం కాబట్టి నది స్నానం చేయాలి అనుకుంటూ ఉంటారు , కానీ శాస్త్రం ఎం చెపుతుంది , ధర్మ సింధు ఎం చెపుతుంది: కార్తీక స్నానం అని పేరు ఉన్న దీన్ని ఆస్విజ శుక్ల దశమి(విజయ దశమి ) కానీ , ఏకాదశి కానీ లేదా ఆస్విజ సుద్ద పౌర్ణిమ రోజు కానీ ప్రారంబించాలి అని చెపుతునారు.

కార్తీక స్నానం ప్రత్యేకం ఏమిటి ?

సూర్యోదయం ముందు గా 2 ఘడియల ముందు గా అంటే 48 నిముషాలు ముందు గా , నది లో
స్నానం చేయాలి . నాభి మునుగే వరకు మునిగి స్నానం చేయాలి. ఇంట్లో స్నానం చేసి పూజ చేసుకుని అప్పుడు నది లో స్నానం చేయటానికి వెళ్ళాలి. నదికి స్నానం చేయకుండా వెళ్ళకూడదు. అక్కడ స్నానం చేసి సూర్యుడికి , అమ్మవారికి , గణపతి , నారాయణకి నమస్కరించి అర్ఘ్యప్రదానం చేయటం , తెలిసి తెలియక చేసిన పాపలు పోవాలి అని నమస్కరించుకోవాలి. నది తీరాన లేని వాలు ఇంట్లో అయిన నక్షత్రం ఉండగా స్నానం చేసి దీపం పెటాలి. తులసి దగ్గర కూడా దీపం పెట్టాలి.

నియమాలు కూడా చాలా ఉనాయి, చాతుర్మాస దీక్షలొ ఎలా నియమాలు పటిస్తమో అలాగే ఇక్కడ కూడా బుసయనం చేయటం , ఏక బుక్తం , బ్రహ్మచర్యం చేయటం , దేవత ఆరాధనా , మొతం దీక్షలొ నక్తం ఉండడం (పగలు అంతా ఉపవసించి , సాయంత్రం ప్రదోష కాలం లో శివారాదన చేసి భోజనం చేస్తారు ). నారాయణ మూర్తి కి సత్యనారాయణ వ్రతం చేసుకోవటం , లేదా శివరాదన విశేషం గ చేసుకోవాలి.


ఇంకా చదవండి »

జేష్ఠ బహుళ ఏకాదశి వ్రతం చేయటం వలన ఎలాంటి ఫలితాలు కలుగుతాయి ?



సంవత్సరం లో 12 నెలలు , ప్రతి నెల 2 పక్షాలు. ప్రతి పక్షానికి 2 ఎకదసులు అంటే 24 ఎకదసులు వస్తయి. ఒక వేల అధిక మాసం వస్తే అ సంవత్సరం వస్తే అ సంవత్సరం 26 ఏకాదశి వస్తాయి. ఎవరయినా ఏకాదశి వ్రతం చేస్తే వారిని అడ్డగించిన వారికీ పాపం వస్తుంది. ఏకాదశి వ్రతం చేసే వారికీ సుదర్శన చక్రం కావాలి కాస్తుంది, రక్షణ చేస్తుంది. 

శ్రవణ మాసం - పుత్రద ఏకాదశి 
భాద్రపద మాసం - పితృదేవతల ఏకాదశి 
కర్తీక మాసం , ఆస్విజ ఏకాదశి , ఇలా అనేక రకాల ఎకదసులు ఉన్నాయి. 

జేష్ఠ బహుళ ఏకాదశి వ్రతం - యోగిన్యై ఏకాదశి అని పేరు కూడా ఉంది. 
కధ - 
కుబేరుడు నిత్య శివ పూజ చేసేవాడు. తెల్లవారుజామున తోటమాలి అ తోట లో ఉన్న పువ్వులు అనీ గుచ్చీ తీసుకొచ్చి ప్రాతః కాలంలో అందించేవాడు. దేవతలు చేసే పూజ బ్రాహ్మి ముహూర్తం లో పూజ చేస్సేవాడు. ఒక రోజు అ తోటమాలి బార్య లోలుడయి, పూజ కి పువ్వులు  ఇవ్వలేదు. కుబేరుడు పువ్వులు ఎందుకు ఇవ్వలేదుఅని విచారణ చేయగా విషయం తెలిసింది. కోపం తో శివ పూజకి పువ్వులు ఇవ్వకుండా బార్య లోలుడవై ఉన్నావు కాబట్టి కుష్టి వ్యాది వస్తుంది అని సేపించాడు. దానితో కొంత కాలం అ తోట మాలి కుష్టు వ్యాది తో బాద పడి కొంత కాలానికి శాప విమోచనం అడిగాడు. అప్పుడు కుబేరుడు జేష్ఠ బహుళ ఏకాదశి వ్రతం చేయమన్నాడు. అల చేయటం వలన శాప విమోచనం జరుగుతుంది అని చెప్తాడు. తరువాత అ తోట మాలి తన బార్య తో కలిసి శాస్త్రోక్తం గా ఏకాదశి వ్రతం ఒక సంవత్సర కాలం చేస్తాడు. దానివలన శాప విమోచనం జరుగుతుంది. శాప విమోచనం జరిగిన తరువాత తిరిగి మల్లి కుబేరుడి పూజ కి పువ్వులు అందిస్తాడు. 

ఒక వేల ఎవరయినా పెద్దలతో, గురువులతో తిట్లు తిని ఉంటే లేదా బ్రాహ్మి ముహూర్తం లో సంసార సుకం పొంది ఉంటే , ఎప్పుడయినా శివ పూజ ని నిర్లక్ష్యం చేసి ఉంటె , ఎవరయినా కుష్టు వ్యాధి తో కాని లేదా ఏదయినా ఒక వ్యాది తో పాదపడుతుంటే వారు అందరు కూడా ఈ ఏకాదశి వ్రాతని ఒక సంవత్సర కాలం చేయటం వలన శాప విమోచనం జరిగి , రోగ నివారణ జరుగుతుంది (లేదా ఒక డాక్టర్ ని కలిసే అవకాసం కలుగుతుంది ). 




ఇంకా చదవండి »

ఏకాదశి వ్రతం పాటించనివారు / చేయని వారు ఏ నియమాలు పాటించాలి?


పై మంత్రం చదువుకుంటే నిగ్రహ శక్తి పెరిగి అ శ్రిమనారాయణ మీద మనసు నిలబడుతుంది. 

ఏకాదశి వ్రతం చేయాలి అనుకునే వారు పాటించవలిసిన నియమాలు - 

ఏకాదశి వ్రతం చేయాలనుకునే వారు ముందు రోజు (దసిమి) తలస్నానం చేసి నిత్యార్చన అయిన తరువాత విష్ణుమూర్తి ని స్మరిస్తూ " ఎ ఏకాదశి ని ప్రారంబిస్తునారో - దేనికోసం చేస్తునారో (కోరికని చెప్పుకుని ) " అనుగ్రహించమని కోరి నమస్కరించుకోవాలి. ఏకాదశి వ్రతం చేయాలి అనుకునేవారికి దశిమి రోజు నుంచే నియమాలు పాటించాలి. దశిమి రోజున అన్య పదార్దాలు తినకూడదు, మద్యానం మాత్రమే భోజనం చేయాలి, సాయంత్రం భోజనం చేయకూడదు, మంసహరాలు , మద్యం నిషేధం , బ్రహ్మచర్యం పాటించాలి.

ఈరోజు పూర్తిగా ఉపవసించాలి; తులసి తీర్థం తప్ప ఏదీ తీసుకోకూడదు. ఈనాడు ఉపవసించినవారు పాప విముక్తులవుతారంటారు. ఉపవాసం వల్ల జీర్ణాశయానికి విశ్రాంతి లభించడం ఆరోగ్యప్రదం. ఆధ్యాత్మిక సాధకుల ఆరోగ్య సుస్థిరతకు ఉపవాసమొక దివ్యాస్త్రం. ఔషధం సేవించేటప్పుడు అనుపానంగా చేయవలసిన పథ్యమే ఉపవాసం. 'లంకణం పరమౌషధ'మనే నానుడి తెలిసిందే. ఉప అంటే దగ్గరగా, వాసం అంటే ఉండటం; దైవానికి దగ్గరవాలనేదే ఉపవాసంలోని ఆశయం. పూజ, జపం, ధ్యానం లేదా ఉపాసన మొదలైన సాధనల ద్వారా మనసును మాధవుడిపై లగ్నం చేయాలి.

ఇక ఏకాదశి రోజు నది దగ్గరగా ఉంటె తెల్లవారుజామున నది స్నానం చేయటం లేదా ఇంట్లో స్నానం చేయటం, నిత్య ఆర్చన చేయటం. సాయంత్రం మల్లి నిత్య అర్చన చేయటం కుదిరితే సత్యనారయణ పూజ చేయటం , ప్రసాదం మాత్రం తినకండి కళ్ళకి అద్దుకుని పక్కన పెట్టి ద్వాదశి రోజున తినాలి. ఏకాదశి రోజున రామ / నారాయణ నామ స్మరణ చేయటం రామాయణం లేదా భాగవతం లేదా విష్ణు పురాణం కానీ పారాయణం చేసుకోవాలి.


సామూహికంగా జాగరణ చేయటం , మరునాడు తెల్లవారుజామున పూజ చేసుకుని లక్ష్మి నారాయనులకు తులసి దళాతో అర్చన చేయటం. పండితులకి స్వయం పాకం ఇవ్వటం/ అన్న సత్రాలలో అన్న దానం ఏర్పాటు చేసి , క్షీరన్నమ్ నివేదన్ చేసి . ద్వాదశి గడియలు పోకుండా పారణ చేయలి. ద్వాదశి రోజున కూడా నియమాలు పాటించాలి , అన్య పడద్ర్దాలు తినకూడదు , రామ నమ జపం చేసుకుంటూ ఉండాలి, పారాయణ చేసుకోవాలి. కృష్ణ పక్షం , బహుళ పక్షం లో వచే రెండు ఏకాదసులు పాటించాలి ఒక సంవత్సర కాలం. అప్పుడు విష్ణు మూర్తి క్రుపకి పాత్రులు అవుతారు.   

సర్వ జనులూ పాటించాల్సిన నియమాలు ఏమిటి -
 ఏకాదశి వ్రతం చేయని వారు బ్రహ్మచర్యం పాటించాలి, మద్య మాంసాలు ముట్ట కూడదు. ఏకాదశి రోజున ఎవరు కోరికలకి లోనవుతారో వారు అంత దరిద్రులవుతారు, అది మహా దోషం కింద చెపుతారు. అ ఫలితంగా పుట్టే పిల్లలు కూడా దరిద్రులు అవుతారంట.


పెళ్లి అయిన తరువాత 16 రోజుల లోపు ఏర్పాటు చేసే వేడుక , ఒక వేల ఆ 16 రోజులలో ఏకాదశి ఉంటె చేయకూడదు. అది మహా దోషం. ఎలాంటి వారు అయిన ఈ నియమాలు పాటించాలి. బ్రహ్మచర్యం కటినంగా అందరూ / సర్వ జనులు పాటించాలి.

ఇంకా చదవండి »

పుష్య సుద్ధ ఏకాదశి రోజున షట్తిల ఏకాదశి వ్రతం ఎలా చేయాలి?

శ్రవణ సుద్ధ ఏకాదశి రోజు , పుష్య సుద్ధ ఏకాదశి రోజు పుత్రాద ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి రోజున ఏకాదశి వ్రతం చేయటమ వలన సంతానం కలుగుతుంది అని ప్రామాణిక గ్రంధాలలో కనిపిస్తుంది. 

పుష్య  లోవచ్చే పుష్య బహుళ ఏకాదశికి మోక్షం ఇస్తూనే షత్తిల  ఉంది. ఈ రోజు తలస్నానం చేసేటప్పుడే నువ్వుల పిండి ని ఒంటికి రాసుకుని  స్నానం చేయాలి. స్నానం తరువాత తిల తర్పణం వదలాలి. తెల్ల నువ్వులతో దేవతలకి , నల్ల నువ్వులతో పితృ దేవతలకి తర్పణం వదలాలి. నువ్వులు నీలలొ వేసుకుని ఆ నీరు తాగాలి. ఒక రాగి లేదా కంచు పాత్రలో నువ్వులు పోసి దానం చేయాలి. ఏకాదశి రోజున దాన్యం తినకూడదు అంటారు కదా మరి నువ్వులు ఎలా తినడం అని అనుమానం వస్తుంది. నువ్వులు దేవుడికి నివేదన చేసి , అందరికి నువ్వుల ప్రసాదం పెట్టి ఏకాదశి వ్రతం  కళ్ళకి అద్దుకుని పక్కన పెట్టి ద్వాదశి రోజున పారణ తరువాత దానిని తినాలి. 

ఇంకా చదవండి »

విజయ ఏకాదశి కధ


యుదీశ్తర మహారాజు శ్రీ కృష్ణ భగవానుని తో ఇలా అనాడు , " ఓ వాసుదేవ ,ఈ మాఘ మాసం కృష్ణ పక్షం లో వచేటువంటి ఏకాదశి మహత్యాని వివరించ మని కోరగా "

శ్రీ కృష్ణ పరమాత్మ :
ఓ యుదిశ్తర , ఈ మాఘ మాసం లో వచేటువంటి ఏకాదశి పేరు "విజయ ఏకాదశి". ఈ ఏకాదశి ని ఎవరు భక్తీ శ్రద్దలతో ఆచరిస్తారో వారిని విజయం వరిస్తుంది , మరి వారి పాపాలు కూడా తొలిగిపోతాయి . 

ఒకానోకసారి నారద ముని బ్రహ్మ దేవుడి దగరికి వెళ్లి తనకి ఈ విజయ ఏకాదశి యొక్క విశిష్టతను తెలుప మని కోరెను , అప్పుడు బ్రహ్మ ఇవిధంగా చెపనరబించెను :

ఓ నారద మహా ముని ఇంతకు ముందు ఎవరికీ దీని వ్రత మహత్యం గురించి చెప్ప లేదు , నువ్వు అడిగినవు కావున నీకు తెలియ చేసెదను వినుము . ఈ ఏకాదశి వ్రతం అన్ని పాపాలను హరిస్తుంది . ఈ పేరు లో చెప్పిన విదం గానే ఈ ఏకాదశి వ్రతం అనీ విజయాలను చేకూరుస్తుంది సందేహమే లేదు. 

శ్రీ రామ చంద్రుడు పదునాలుగు సంవత్సరములు అరణ్యవాసం చేయునప్పుడు , సీత , లక్ష్మనుని తో కలిసి పంచవటి లో నివసించేవాడు . రావణడు సీత దేవి ని అపహరించినప్పుదు శ్రీ రాముడు దిగులుతో అనీ కొలుపొయినవాడి లగుండెను సీతా దేవి ని వెతికే క్రమంలో జటాయువు మరనిన్చబోతుండగా చూసి ఏమయినది వివరం అడుగగా , జటాయువు సీతమ్మ ని రావణాసురుడు ఎలా అపహరించాడో , సితామాతని కాపాడబోయి రావణుడు చేతిలో రెక్కలు తెగి పడిన విషయం వివరింఛి మరనిస్తాడు . శ్రీ రాముడు తన సీతా కోసం జటాయువు చేసిన ప్రాణ త్యాగానికి జటాయువి కి వైకుంట లోక ప్రాప్తి ప్రసాదిస్తాడు . సీతా దేవిని వెతికే క్రమం లో కబందుడిని సంహరిస్తాడు . 

అటు తరువాత శ్రీ రాముడు సుగ్రీవుడు స్నేహితులవుతారు . సుగ్రీవుదు వానర సేనకు రాజు అగుట చేత సీతమ్మవారిని వెతకడానికి పెద్ద వానర సేనని తాయారు చేసి హనుమంతుని అమ్మవారిని వెతకటానికి లంకకి వెళ్లి వెతకమని ఆగ్న్య . హనుమ లంక లో సిత్తమ్మని  అశోకవనం లో చూసి శ్రీ రాముని ముద్రికని చూపి, అయన గుణగణాలను కొనియాడి , హితవు పలికి సీతా దెగ్గర ఉంగరం తెసుకుని తిరిగి శ్రీ రాముని వాడకు వచ్చి వివరించెను . శ్రీ రాముడు సుగ్రీవుని సహాయం తో లంకా నగరాని చేరుకునే సముద్రానికి చేరుకొని ఆ సముద్రాని దాటడం అంత సులువు కాదని గ్రహించి , లక్ష్మణునితో ఎలా అన్నాడు , ఓ సుమిత్ర కుమారా ఈ సముద్రముని దాటడం అంత సులువు కాదె ఇప్పుడు మనం ఏమి చెయవలను 

అందరిలోకి మంచివడివైన శ్రీ రామ , బలదలబ్య అనే ఒక గొప్ప ఋషి ఇక్కడికి దగరలోనే ఉన్నారు అ ఉత్తముడిని అడిగి మన కర్తవ్యమ్ ఏమిటో కనుకుందాం . అయన మాత్రమే మనకి ఈ సమయం లో సహాయపడగలరు నాయి సెలవిచ్చి అయన దగ్గరకి బయల్దేరారు . 

బలదలబ్య ఋషి ని చేరుతూనే నమస్కరించి కుసలములు అడిగి వారు వచ్చిన పనిని వివరించారు . 

బలదలబ్య 
శ్రీ రామ నేను నీకు ఒక ఉపవాస దీక్షను వివరిస్తాను శ్రద్ధగా వినుము , దీని ఆచరించడం ద్వార నీకు తప్పకుండ విజయం లబిస్తుంది

ఏకాదశి ముందు రోజు ఒక వెండి, ఇత్తడి , లేదా, బంగారం ఏది లేకపోతె మట్టి కుండ ఒకటి తీసుకుని అందులో నీలు పోసి నవధాన్యాలు , పసుపు కుంకుమ వేసి , కుండకి తోరణాలు కట్టి అందంగా అలకరించలి . దీనినీ శ్రీమన్నరాయణ దగ్గర పెట్టాలి . మరునాడు ఏకాదశి ఉదయమే స్నానం చేసి భక్తీ శ్రద్ధలతో శ్రీమన్నరాయణు కి పూజ చేసి , ఈ కుండకి కి పసుపు కుంకుమ , గంధం , అక్షింతలు , వేసి నమస్కరించి ఉపవసింఛి రాత్రి కి జాగరణ చేయాలి . మరునాడు ద్వాదశి తిథి రాగానే మల్లి అ కుండకి పూజ చేసి ఏదయినా ఒక నది లో కలిపేయాలి . తరువాత ఉత్తముడయిన బ్రాహ్మణునికి భోజనం పెట్టి నువ్వు భోజనం చేయాలి . ఈ విధం నువ్వు ని సేన ఉపవాసం చేస్తే తప్పకుండ విజయం లబిస్తుంది అని చెప్పను . 

శ్రీ రామచంద్రుడు బలదలబ్య ఋషి చెప్పినట్టుగానే వ్రతం పాటించి లంక మీద విజయం సాదించాడు . ఈ వ్రతం ఎవరు అయితే ఆచరిస్తారో వారికీ వైకుంట ప్రాప్తి కూడా కలుగుతుంది . 

ఓ నారద ఈ విధం గ ఎవరు ఈ ఏకాదశి వ్రతం నమ్మకం తో భక్తీ శ్రద్ధలతో ఆచరిస్తారో వారి అతి చెండాలమయిన పాపాలు అయిన హరించిపొయి విజయం లబిస్తుంది మరియు వైకుంట లోక ప్రాప్తి లబిస్తుంది . 

అని శ్రీ కృష్ణ పరమాత్మ వివరించి, యుధిష్టిర ఎవరు ఈ ఉపవాస దీక్ష చేస్తారో , ఈ కధ ను వింటారో వారికీ అశ్వమేధ యాగం చేసిన ఫలితం లబిస్తుంది అని చెప్పేను . 

ఇంకా చదవండి »

భీష్మ ఏకాదశి- శ్రీ విష్ణు సహస్ర నామ జయంతి

శ్రీ విష్ణు సహస్రనామం భీష్మపితామహుడు పాండవులకు చేసిన మహోపదేశం. భారత సంగ్రామం పూర్తి అయిన తర్వాత భీష్మపితామహుడు అంపశయ్యపైనే ఉండి పొయ్యాడు. ఎక్కడి వాళ్ళు వారి వారి రాజ్యాలకు వెళ్ళి పోయారు. సుమారు నెల రోజులు గడిచాయి, పాండవులు శ్రీకృష్ణుడు సల్లాపాలు ఆడుకొనే ఒక సమయంలో ఒక నాడు హటాత్తుగా శ్రీకృష్ణుడు పాండవులతో మాట్లాడుతూ ఆగిపోయాడు. పాండవులకు గాబరా వేసింది. ఏమైంది అని శ్రీకృష్ణుడిని అడిగారు. శ్రీకృష్ణుడు వారికి సమాధానం చెబుతూ "మాంధ్యాతి భగవాన్ భీష్మః తపోమే తద్గతం మనః" కురుక్షేత్రంలో అంపశయ్యపై పవళించి ఉన్న భీష్మపితామహుడు నన్ను స్మరించుకుంటున్నాడు. అందుకే నామనస్సు అక్కడికి వెళ్ళి పోయింది. 'హే పాండవులారా! బయలుదేరండి, భీష్ముడి దగ్గరికి. ఎందుకంటే భీష్ముడు ఆస్తికాగ్రేసరుడు, ధర్మాలను అవపోశణం పట్టినవాడు. శాస్త్రాలను  పూర్తిగా ఆకలింపు చేసిన మహనీయుడు. 

మానవాళి తరించడానికి కావల్సిన మార్గాలను స్పష్టంగా తెలిసిన మహనీయుడు. సులభంగా జీవకోటిని తరింపజేయడం ఎట్లానో అవగతం చేసుకొన్న మహనీయుడు. ధర్మ విషయంలో ఏ సంశయాలు ఉన్నా ప్రామాణికంగా తీర్చగలిగిన ఏకైక మహానుభావుడు. ఆయన దేహం నుండి నిష్క్రమించే సమయం ఆసన్నమవుతుంది. ఆయన అస్తమిస్తే లోకంలో ధర్మ సంశయాలని తీర్చే వ్యక్తులు ఎవ్వరూ ఉండరు. అందుకే సూక్శ్మ విషయాలను తెలుసుకుందురు రండి' అని భీష్మ పితామహుడి వద్దకు తీసుకు వచ్చాడు.  

భీష్ముడు సుమారు నెలన్నర నుండి భాణాలపైనే పడి ఉన్నాడు. దేహం నిండా బాణాలు, శక్తి పూర్తిగా క్షీణించిపోయింది, అసలే మాఘమాసం ఎండకు ఎండుతూ, మంచుకు తడుస్తూ, నీరు లేదు, ఆహారం లేదు. స్వచ్చంద మరణం తెచ్చుకోగలడు, కాని ఆయన ఇన్ని భాదలు భరిస్తూ ఉండిపొయ్యాడు. ఉత్తరాయణం వరకు ఉండాలి అని అనుకున్నాడు. ఒక ఏకాదశి నాడు దేహం నుండి నిష్క్రమించాలని భగవంతుడిని తలచుకుంటున్నాడు. మనస్సులో శ్రీకృష్ణుడిని సాక్షాత్కరించు కోగలిగేవాడు ఆయన.  తన హృదయ మందిరంలోనే శ్రీకృష్ణుడితో మాట్లాడగలిగే వాడు ఆయన. అంత జ్ఞానులైన మహనీయులకు ఈరోజు ఆరోజు అనే నియమం ఉండదు అని ఉపనిషత్తు చెబుతుంది. మరి అట్లాంటి వారు ఏ రోజు నిష్క్రమించినా పరమపదం లభిస్తుంది.ఎవరు కర్మ చేస్తారు అనే నియమం కూడా లేదు. భీష్ముడు తనకి "మాతా పితా బ్రాతా నివాసః శరణం సుహ్రుత్ గతిః గమ్యం సర్వం నారాయణః" అని అనుకున్న మహనీయుడు. ఆయనకు సర్వం శ్రీకృష్ణుడే అని విశ్వసించేవాడు. అందుకు ఆయన ఏనాడు మరణించినా భగవంతుడి సాయిజ్యం కలగక మానదు.

మరి అన్ని రోజులు అంపశయ్య పై ఎందుకు ఉండి పొయ్యాడు ?

ఆయనకు తను చేసిన దోషం ఒకటి స్పష్టంగా జ్ఞాపకం ఉంది. చేసిన ప్రతి దోషం శరీరం పైనే రాసి ఉంటుందట! అది తొలగితే తప్ప సద్గతి ఏర్పడదట దోషం చేసాడాయన ? ద్రౌపతికి సభామధ్యంలో అవమానం జరుగుతుంటే ఏం చేయలేక పోయాడు. భగవత్ భక్తురాలికి అవమానం జరుగుతుంటే చూస్తు కూర్చుండి పోయాడు. ద్రౌపతికి శ్రీకృష్ణుడంటే అత్యంత ప్రేమ. తన గురువు వసిష్ఠులవారు చెప్పారట "మహత్యాపది సంప్రాప్తే స్మత్తవ్యః భగవాన్ హరిః" హే ద్రౌపతి! ఇత్రులు ఎవ్వరు తొలగించని ఆపద వచ్చినప్పుడు శ్రీహరిని స్మరించుకో అని. ఆనాడు సభామధ్యంలో తన అయిదుగురు అతి పరాక్రమమైన భర్తలు ఏం చెయ్యలేక పోయారు. వారు కౌరవులకి బానిసలై పోయారు. కౌరవులను ఎదురించడానికి వీలులేకుండా పోయ్యింది. వారు కేవలం సామాన్య ధర్మాన్నే పాటించారు, కాని సాటి మనిషిగా ఆమెను కాపాడాలనే విశేష ధర్మాన్ని ప్రక్కన పెట్టారు. శ్రీకృష్ణుడు తన భక్తులకి జరిగే అవమానాన్ని సహించలేడు. అలా చేసినందుకు మొత్తం వంద మంది కౌరవులను మట్టు పెట్టాడు. దోషంతో పాండవులకూ అదే గతి పట్టేది. కానీ అలా చేస్తే చివర తను ఎవరిని రక్షించాలని అనుకునాడో ద్రౌపతికే నష్టం జరుగుతుందని వారిని అట్టే ఉంచాడు. విషయం భగవంతుడే అర్జునుడితో చెప్పాడు. ఎప్పుడైతే ద్రౌపతికి అవమానం చేసారో వారందరిని అప్పుడే తీసి పాడేసాను, ఇప్పుడు వారు కేవలం కాలిపోయిన కాగితం వలె ఉన్నారే తప్ప, వారిని నేను ఎప్పుడో ఏరిపారేసాను, నీకు గౌరవం కట్టబెట్టాలని యుద్దం చేయమని చెబుతున్న అని శ్రీకృష్ణుడు అర్జునుడితో అన్నాడు. 

బీష్మ పితామహుడు ఆనాడు ధర్మరాజుకు తలెత్తిన సందేహాలను తీరుస్తుంటే, ప్రక్కనే ఉన్న ద్రౌపతి నవ్వుతూ 'తాతా! ఆనాడు నాకు అవమానం జరుగుంటే ఏమైయ్యాయీ ధర్మాలు' అని అడిగిందట. అందుకు భీష్ముడు 'అవును ద్రౌపతి! నా దేహం దుర్యోదనుడి ఉప్పు తిన్నది, నా ఆధీనంలో లేదు. నాకు తెలుసు నీకు అవమానం జరుగుతుందని, కానీ నా దేహం నా మాట వినలేదు. అంతటి ఘోర పాపం చేసాను కనక, పాప ప్రక్షాళన కోసం ఇన్నాల్లూ అంపశయ్యపై పడి ఉన్నాను'అని చెప్పాడు. హస్తిన సింహాసనాన్ని కాపాడుతాను అని తాను తన తండ్రికి ఇచ్చిన వాగ్దానానికి కట్టుబడి ఉండిపోయాడు భీష్ముడు. కానీ, పరిస్థితుల ప్రభావంచే విశేష ధర్మాన్ని ప్రక్కన పెట్టాడు. ' హే ద్రౌపతీ! కృష్ణ భక్తిలో ఎట్లాంటి కల్మషం లేదు, కానీ శరీరం దుష్టమైపోయింది. దాన్ని పరిశుద్దం చేసుకోవాలనే అంపశయ్యపై పడి ఉన్నాను, అందుకు నాడు నేను ధర్మాలను చెప్పవచ్చును' అని పాండవులకు ఎన్నో నీతులను భోదించాడు. 


శ్రీకృష్ణుడు భీష్మపితామహుడికి దేహబాదలు కలగకుండా వరం ఇచ్చి చెప్పించాడు. నాకెందుకు శక్తినిచ్చి చెప్పిస్తున్నావు, నీవే చెప్పచ్చుకదా అని భీష్ముడు అడిగాడు. అందుకు కృష్ణుడు నేను చెప్పొచ్చుకానీ, నీలాంటి అనుభవజ్ఞుడు చెబితే వచ్చే స్పష్టత నేను చెబితే ఉండదు. నేను చెబితే అది తత్వం, నీవు చెబితే అది తత్వ ద్రష్టం. తత్వాన్ని చూసినవాడు తత్వాన్ని చెప్పాలే తప్ప తత్వం తన గురించి తాను చెప్పుకోదు. నేల నేను ఇంత సారం అని చెప్పగలదా! నేలలో పండిన మ్రొక్క చెబుతుంది, నేల ఎంత సారమో. అలాగే నీవు అనుభవజ్ఞుడవి, నీవు ఉపదేశంచేస్తే అది లోకానికి శ్రేయస్సు.

భగవంతుడు సముద్రం లాంటి వాడు, నీరు ఉంటుంది కానీ పాన యోగ్యం కాదు.అదే నీటిని మెఘ వర్షిస్తే పానయోగ్యం. అందుకే భగవత్ జ్ఞానం నేరుగా కాకుండా భగవత్ తత్వం తెలిసిన భీష్ముడి ద్వారా అది అందితే లోకానికి హితకరం. అట్లా శ్రీకృష్ణుడు వరం ఇచ్చి, భీష్ముడి ద్వారా ధర్మ సారాన్ని పాండవులకు ఉపదేశం చేయించాడు. భగవద్గీత శ్రీకృష్ణుడు నేరుగా చెప్పాడు, శ్రీవిష్ణు సహస్రనామాల్ని భీష్ముడి ద్వారా చెప్పించాడు. అందుకే శ్రీవిష్ణు సహస్రనామాల వల్ల సులభంగా తరించ వీలు కలదు.


ఇంకా చదవండి »