• విష్ణుషట్పదీ స్తోత్రం

    నారాయణ నారాయణ జయ గోవింద హరే |నారాయణ నారాయణ జయ గోపాల హరే ||

  • శ్రీ రామ

    ఆపదం అపహర్థారమ్ దాతారం సర్వ సంపదం, లోకాభి రామం శ్రీ రామం భూయో భూయో నమామ్యహమ్I

  • శ్రీ సీతామాత

    త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ, హనుమాన్ యత్న మాస్తాయ దు:ఖ: క్షయ కరోభవ

  • ఓం నమ:శివాయ:

    చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర పాహిమామ్ , చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర రక్షమామ్ I

  • శ్రీమాత్రే నమః

    అమ్మల గన్న యమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాల పెద్దమ్మ, సురారులమ్మ కడుపారడి పుచ్చిన యమ్మ, తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ మాయమ్మ కృపాబ్ధి నిచ్చుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్

  • శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు

    పురుషోవిష్ణు రిత్యుక్తః శివోనానామతః స్మృతః I అవ్యక్తం తు ఉమాదేవీ శ్రీర్వా పద్మ నిభేక్షణా I తత్ సంయోగా దహంకారః స చ సేనాపతిరుహః I

శ్లోకం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

శ్రీకాళహస్తీశ్వర శతకము


.
జలజశ్రీ గల మంచినీళ్లు గలవే చట్రాతిలో , బాపురే
వెలివాడ న్మరిబాపనిల్లు గలదా వేసాలుగా కక్కటా
నలి నారెండు గుణంబు లెంచి మదిలో నన్నేమి రోయంగ ఏ
చెలువంబైన గుణంబు లెంచుకొనవే శ్రీ కాళహస్తీశ్వరా !
.
శ్రీ కాళహస్తీశ్వరా !
ఎక్కడైనా బండరాతి లోపల పద్మాలతో కూడూన మంచినీరు ఉంటాయా !
వెలివాడ లో ఎక్కడైన విప్రగృహం ఉంటుందా ! ఇవి ఉండవనే విషయం నీకు తెలిసి కూడ వేషాలు కాకపోతే నాలో మంచి గుణాలు కన్పించడం లేదని నీవు నన్ను దూరంగా ఉంచడం ఆశ్చర్యంగా ఉంది .

ఏమైనా సరే నాలో ఉన్న గుణాలలో నీకు నచ్చిన దాన్ని ఎన్నుకొని నన్ను రక్షించవలసినది కాని విడిచి పెట్టవద్దని కవి అభ్యర్ధన.
తనకు మోక్షాన్ని పొందే అర్హత ఏ ఒక్కటి లేకపోయినా ,ఉన్న గుణాల్లో శంకరునికి నచ్చిన గుణాన్ని తీసుకొని తనకు మోక్షమివ్వమని కవి ప్రార్ధన . అంటే కవి దృష్టి లో తన వద్ద నున్న ఏకైక గుణం కవిత్వమే. దాన్ని ఏనాడో మహాదేవునకు అంకితం చేశాడు. కాబట్టి తాను కైలాస వాసానికి అర్హుడననే కవి వాదన. 

ఇంకా చదవండి »

అప్రియము కలిగించేది సత్యమైనా సరే చెప్ప కూడదు

నేను కళ్ళారా చూచింది చెపితే నాన్న కొడతాడు. చెప్పకపోతే అమ్మ కొడుతుంది. మరెలా? అని ఇంటిలో పిల్లడు సంకట స్థితిలో పడినట్లే మనం కూడా ఒక్కొక్క సారి ఈ విషయం చెప్పాలా వద్దా? చెపితే కుటుంబాలు విడిపోతాయేమో? చెప్పకపోతే అన్యాయం జరిగిపోతుందేమో? అని అప్పుడప్పుడు సంకట స్థితిలో పడిపోతుంటాం. మనం ఏది చెయ్యాలి, ఎలా చెయ్యాలి అనే విషయాన్ని సూచిస్తున్న ఈ క్రింది శ్లోకాన్ని పరిశీలిద్దామా?

శ్లోకము:
సత్యం భ్రూయాత్, ప్రియం భ్రూయాత్              
నభ్రూయాత్ సత్యమప్రియం
ప్రియోపి నానృతం భ్రూయాత్
ఏష ధర్మస్సనాతనః.

తేటగీతి:
సత్యమును పల్క వచ్చును సరస మతిని.
ప్రియము పల్కగ వచ్చును ప్రీతి తోడ.
బాధ కలిగించు సత్యము పలుక తగదు.
ప్రియము గొలుప నసత్యము ప్రేల రాదు.

ఆహా ఎంత చక్కగా చెప్పబడింది. మనము చక్కగా సత్యమును పలుక వచ్చునట. ఆందరికీ ప్రియము గొలుపు విధముగానూ మాటాడ వచ్చునట. ఐతే మనము పలికేది సత్యమైనప్పటికీ అది ఎవరికయినా బాధ కలిగించేదయినట్లయితే అటువంటి సత్యమును పలుక కూడదట. ఇతరులకు ప్రీతి కలిగించుటకొరకని అసత్యమును మాత్రము పలుక రాదట. ఎంత చక్కగా వుంది దీనిలోని భావన. దీనిని బట్టి మనకర్థమయింది కదా ఎప్పుడు, ఎలా మాటాడాలో. అలాగే చేద్దామా మరి?

ఇంకా చదవండి »

ప్రకృతి నుండి నేర్చుకో వలసిన కృతజ్ఞతా గుణం

ఈ నాడు మనం ఎందరినో చూస్తున్నాం. నేను వాడికెంత ఉపకారం చేశానో. వాడికస్సలు విశ్వాసం లేదు. అంటూ వాపోతుంటారు. అలా జీవితంలో ప్రతీ ఒక్కడూ ఎప్పుడో ఒకప్పుడు మదన పడడం మనం చూచినప్పుడు మనకి కూడా అయ్యో పాపం అనిపిస్తుంది.

మనం వీలయితే ఇతరులకు ఉపకారంచెయ్యాలి. అది మానవుడై పుట్టిన వాని కనీస ధర్మంగా సహృదయులు భావిస్తారు. ఐతే అది మానవ ధర్మం మాత్రమే. మానవ కనీస కర్తవ్యం ఒకటుంది. అది ఏమిటంటే ఎవరయినా తనకు ఏమాత్రం చిన్న ఉపకారం చేసినా దానిని జీవితాంతం మరిచిపోకూడదు. అంతే కాదు. వీలున్నప్పుడల్లా వారికి ధర్మ బద్ధంగా ప్రత్యుపకారం చేస్తూనే ఉండాలి. ఈ విషంలో ఒక చక్కని శ్లోకముంది. చూద్దామా!

శ్లోకము:-

ప్రథమ వయసి పీతం తోయమల్పం స్మరంతః
శిరసి నిహిత భారా నారికేళా నరాణాం.
సలిలమమృత కల్పం దద్యు రాజీవితాంతం
నహి కృతముపకారం సాధవో విస్మరంతి.

తేటగీతి:-
చిన్న తనమున త్రాగిన చిన్న పాటి
నీటి విషయము మరువకేనాటివరకు
బ్రతుకునన్నాళ్ళు మ్రోయుచు, ఫలములిచ్చు
మేలు మఱువక సతతము మేలు చేయు.

ఉత్పలమాల:-
కొబ్బరి చెట్టు, చిన్నపుడు గోముగ నీటిని పోసి పెంచె నా
డబ్బురమంచు, పొంగి మది, హాయి నొసంగు జలంబులిచ్చు తా
నిబ్బరమున్ ఫలంబులను నిత్యముమోయుచు. మానవాళికిన్.
అబ్బు కృతజ్ఞతన్ సతము హాయినొసంగుట. సజ్జనాళికిన్.

భావము:-
కొబ్బరి మొక్కను నాటి మనము నీరు పోసి పెంచినందుకు ఆ కొబ్బరి మొక్క చెట్టయి , చిన్నతనములో తనకు తీయని నీరు పోసి పెంచినారు అనే కృతజ్ఞతా భావంతో తాను బ్రతికున్నన్నాళ్ళూ బరువయిన తీయని నీటితో కూడిన కొబ్బరి కాయలను తలపై పెట్టుకొని మ్రోయుచూ మానవాళికి తాను పొందిన ఉపకారానికి ప్రత్యుపకారంగా అందజేస్తుంది. ఎవరయినా ఏ చిన్నపాటి మేలు తనకు చేసినా బ్రతికున్నన్నాళ్ళూ కృతజ్ఞతా భావం కలిగి ప్రత్యుపకారం చేయడమన్నది సజ్జనాళికి అబ్బును కదా!

కృతజ్ఞత, ప్రత్యుపకార బుద్ధి, అందరిలోనూ ఉన్ననాడు ఎవరికీ ఎట్టి బాధా కలిగించకుండా మనం కూడా సంతోషంగా హాయిగా బ్రతుక వచ్చును కదా! మరి మనం కూడా మనలోని సద్ గుణాల్ని పెంచుకోవాలి కదా ... 

ఇంకా చదవండి »

కలిదోషనివారణకు ప్రతినిత్యం పఠించవలసిన శ్లోకములు.

 
ఇవి మీకు తెలిసినవే కావచ్చు... మీ పిల్లలకు తెలియజేసి వారిచేత కంఠస్థం చేయించండి.

(1) కర్కోటకస్య నాగస్య దమయంత్యా నలస్య చ; ఋతుపర్ణస్య రాజర్షే: కీర్తనం కలినాశనం.
(2) శివ శంకర రుద్రేశ నీలకంఠ త్రిలోచన; ఇతీరయంతి యే నిత్యం న హి తాన్ బాధతే కలి:
(3) రామనాథ మహాదేవ మాం రక్ష కరుణానిధే; ఇతి య: సతతం బ్రూయాత్ కలినాసౌ న బాధ్యతే

ఇంకా చదవండి »

కు౦తీదేవి చేసిన కృష్ణస్తుతి

పోతన భాగవతం - అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రం నుండి ఉత్తరా గర్భాన్ని రక్షించిన సందర్భంగా కుంతీదేవి - ప్రథమ స్కంధం -186పద్యం

పురుషుండాడ్యుడు ప్రకృతికి
బరు డవ్యయు డఖిల భూత బహిరంతర్భా
సురుడును లోక నియంతయు
పరమేశ్వరుడైన నీకు బ్రణతులగు హరీ!!

ప్రథమశ్చ ద్వితీయశ్చ చరణౌ ద్వౌ ప్రకీర్తితౌ!
తృతీయశ్చ చతుర్థశ్చ ద్వావూరూ సముదీరితౌ!!
పంచమౌ నాభిదేశశ్చ షష్టో (shashto) హృదయ ముచ్యతే!
సప్తమ శ్చాష్టమశ్చైవ బాహూ ద్వౌ పరికీర్తితౌ!!
నవమః కంఠదేశః స్యాత్ దశమో ముఖమేవ చ!
ఏకాదశో లలాటం చ ద్వాదశస్తు శిఖోచ్యతే!
ఏవం సర్వం భాగవతం శ్రీహరేరంగ ముచ్యతే!!

భాగవతం లోని ప్రథమ ద్వితీయ స్కందాలు భగవంతుని చరణాలనీ, తృతీయ చతుర్థ స్కందాలు ఊరువులనీ, పంచమ స్కంధం నాభిప్రదేశమనీ, షష్ఠ స్కంధం హృదయమనీ, సప్తమ అష్టమ స్కంధాలు బాహువులనీ నవమ స్కంధం కంఠమనీ,దశమ స్కంధం ముఖమనీ, ఏకాదశం లలాటమనీ, ద్వాదశం శిఖ అనీ వివరించబడింది. ఇందులో దశమ స్కంధం భగవంతుని ముఖమని చెప్పడం వల్ల దాని ప్రాధాన్యం ఎంతటిదో అభివ్యక్త మవుతున్నది.

దశావతారాలలో శ్రీ కృష్ణావతారానికి ఒక ప్రత్యేక ప్రాధాన్యం ఉన్నట్లే భాగవతం లోని పన్నెండు స్కంధాలలోను దశమస్కందానికి ఒక విశిష్ట స్థానం ఉన్నది. సమగ్రంగా సర్వాంగ సుందరంగా శ్రీకృష్ణ చరిత్రం అభివర్ణింపబడిన దశమ స్కంధం "శ్రీకృష్ణ లీలాసర్వస్వం" అనటంలో అతిశయోక్తి అణుమాత్రం లేదు.

ఇంకా చదవండి »

శ్రీ కృష్ణ కర్ణామృతం శ్లోకం

చిన్తామణి ర్జయతి సోమగిరి ర్గురు ర్మే
శిక్షాగురుశ్చ భగవాన్ శిఖి పింఛమౌళిః
యత్పాదకల్పతరుపల్లవశేఖరేషు
లీలాస్వయంవరరసం లభతే జయశ్రీః


శ్రీకృష్ణకర్ణామృత కావ్య రచనలో, ముందుగా నాకు మార్గదర్శి అయిన చింతామణికీ, నాకు దీక్షాగురువైన సోమగిరికీ నమస్కరిస్తున్నాను. కల్పవృక్షం తన చిగురాకుల కొనలవద్ద శ్రీ లక్ష్మిని అలంకరించుకుని విలాసముగా కనిపిస్తుంది. ఆ కల్పవృక్షం లాంటి పాదాలతో విరాజిల్లుతూ నెమలిపింఛము ధరించి ఉన్న నా శిక్షాగురువైన శ్రీ కృష్ణుడికికూడా ఈ సందర్భముగా నమస్కరిస్తున్నాను. 

ఇంకా చదవండి »