• విష్ణుషట్పదీ స్తోత్రం

    నారాయణ నారాయణ జయ గోవింద హరే |నారాయణ నారాయణ జయ గోపాల హరే ||

  • శ్రీ రామ

    ఆపదం అపహర్థారమ్ దాతారం సర్వ సంపదం, లోకాభి రామం శ్రీ రామం భూయో భూయో నమామ్యహమ్I

  • శ్రీ సీతామాత

    త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ, హనుమాన్ యత్న మాస్తాయ దు:ఖ: క్షయ కరోభవ

  • ఓం నమ:శివాయ:

    చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర పాహిమామ్ , చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర రక్షమామ్ I

  • శ్రీమాత్రే నమః

    అమ్మల గన్న యమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాల పెద్దమ్మ, సురారులమ్మ కడుపారడి పుచ్చిన యమ్మ, తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ మాయమ్మ కృపాబ్ధి నిచ్చుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్

  • శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు

    పురుషోవిష్ణు రిత్యుక్తః శివోనానామతః స్మృతః I అవ్యక్తం తు ఉమాదేవీ శ్రీర్వా పద్మ నిభేక్షణా I తత్ సంయోగా దహంకారః స చ సేనాపతిరుహః I

భక్తి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

ప్రార్ధన



ఇంకా చదవండి »

అర్చన పద్దతి



ఇంకా చదవండి »

మంత్ర జపం ఎందుకు



ఇంకా చదవండి »

ఆద్యాత్మిక సాధన మార్గం లో ఉన్నతమైనది,సులువైనది, ఎ విదముగా పొందగలిగినది నమస్తే,




చాలా గడ్డు ప్రశ్నే వేశారు! మొత్తం ఆధ్యాత్మిక జీవన లక్ష్యాలను, మార్గాలను గురించిన ప్రశ్నలను ఒక్క ప్రశ్నలొ ఇమడ్చారు. 

గురువుగారి మరియు ఇతర పెద్దల సాంగత్యం వలన, వారు చెప్పిన ఎన్నో విషయాలలోని నాకర్థమైన కొంతదాన్ని ఇక్కడ పొందుపరుస్తున్నాను.

అన్నిటికన్నా ఉత్తమమైన మానవ జన్మ పొందడము సామాన్యము కాదు, మానవ జన్మ దుర్లభమని మన శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. కాని మానవ జన్మ మన పూర్వ జన్మలలో చేసిన పాప పుణ్యఫలము, కాని అదే ఆ అన్ని జన్మలకీ ఫలము కాదు. ఇది ఎలా ఉంటుందంటే, మౌఖిక, పరీక్షలు, నెలవారి పరీక్షలు, త్రైమాసిక పరీక్షలు వగైరాలు దాటి చిట్ట చివరి పరీక్షకు అర్హత సంపాదించినట్టు, అన్ని జన్మలూ దాటి జీవుడు ఈ మానవ జన్మ పొందుతాడు. 

అసలు సమస్య అంతా ఇక్కడే! ఇక్కడిదాకా వచ్చాకే! అఙ్ఞానం వల్ల అసలు ఈ జన్మలోకి ఎందుకు వచ్చాడో మర్చిపోయి ఇతర విషయాలపై ఆసక్తి పెంచుకుంటాడు. అసలు పరీక్షగురించి (జన్మ ప్రయోజనాన్ని) మర్చిపోతాడు. దీంట్లో ఉత్తీర్ణుడు కాకపోతే మళ్ళీ అదే తరగతి మళ్ళీ మౌఖిక, పరీక్షలు, నెలవారి పరీక్షలు, త్రైమాసిక పరీక్షలు వగైరాలు అన్నీ మొదలు.

ఉత్తీర్ణతపొందడమంటే.. పండిపోవడం.. అదే ఇంకో జన్మ లేకుండా చేసుకోవడం.. అదే పునరావృత్తిరహిత శాశ్వత శివ సాయుజ్య స్థితి కి చేరుకోవడం. 

ఇదే ఆధ్యాత్మిక సాధనలో చిట్ట చివరి ప్రయోజనం. అది ఎలా అంటే, భక్తి చే ఙ్ఞానమును పొంది
వైరాగ్యముపెంపుచేసుకొని అసలువస్తువును తెలుసుకోవటమే పునరావృత్తిరహిత శాశ్వత శివ సాయుజ్య స్థితి. అసలు వస్తువైన ఆత్మ యొక్క యెరుక తెలుసుకొని ఆత్మానుభవమును పొంది అంతటా ఉన్నది ఆ ఆత్మయే అని ఆత్వ ద్వారా ఆ పరమాత్మలో లీనమైపోవడమే ఈ జన్మ ప్రయోజనం అదే ఉన్నతమైనది. అదికాక ఇంకొక ప్రయోజనం ఆధ్యాత్మిక సాధన మార్గంలో ఉన్నది అని నేను అనుక్కోవట్లేదు ( గురువుగారు కూడా ఎప్పుడు ఇదే చెపుతారు). 

అది సాధించే నేపధ్యంలో అనుషంగిక ప్రయోజనాలు ఏవైనా చేకూరవచ్చుగాక (ఉదా: ధనం, ఐశ్వర్యం, పేరు ప్రతిష్టలు, కుటుంబ వృద్ధి, పిల్లలు పెళ్ళిళ్ళు వంటివి, అంతకన్నా అష్టసిద్ధుల వంటివి పొందవచ్చునేమో), కాని వాటితో తన్మయత్వం చెందక చిట్టచివరి ప్రయోజనమైన
ఆత్మానుభవమును పొందటమే ఉన్నతమైన లక్ష్యం.

ఇదిపొందటానికి సులువైన మార్గం వైదికధర్మావలంబనమే, నీ ధర్మంలో నువ్వు ఉంటూ నీ కర్తవ్యాలని నెరవేర్చటమే సులువైనది. అందునా గృహస్థు సంసారంలో ఉంటూ తన ధర్మాన్ని తాను ఆచరించి భగవత్కైంకర్యం చేస్తూ ఉండాలి. భక్తితో కూడిన కర్మాచరణముచే ఙ్ఞానసముపార్జవైపు అడుగులిడి వైరాగ్యమును పెంపొందించుకుంటూ తుట్టతుద జీవిత లక్ష్యాన్ని చేరుకోవాలి.

ఇంకా విపులంగా చెప్పాలంటే, ఏది చేసినా భక్తితో భగవంతునికి సమర్పణ భావంతో మెలగటం. అలా చేయగా చేయగా ఒకనాడు ఆ భగవంతుడే చిట్ట చివరి లక్ష్యానికి చేరుకోవడానికి కావల్సిన సంబారములను చేకూర్చడానికి తానే ఒక మహానుభావుని రూపంలో కావలసిన ఉపదేశం చేస్తాడు ( ఉపదేశం అనేది, బోధ కావచ్చు, మరింకేదైనా కావచ్చు అది ఇలాగే ఉండాలని, ఒక పద్ధతిలోనే ఉండాలని చెప్పటం కష్టమే).

గురువుగారు లలితా సహస్ర వ్యాఖ్యానాంతర్గతంగా ఒక సుత్రాన్ని తెలిపారు. నీవు ఏదైనా పని చేసేటప్పుడు నీకు నువ్వు ఒక ప్రశ్న వేసుకో................. నీవు చేసే పనిని నీ గురువు ఇంకా భగవంతుడు ఆమోదిస్తారా అని వివేచన చేస్కో. దానిద్వారా నీ ప్రతి కర్మాచరణమును సంస్కరించుకో, అదే నిన్ను మెల్లి మెల్లిగా నువ్వు చేరుకోవలసిన స్థితికి తీసుకెళ్తుంది.

అడ్డ దార్లను, ఇతర మైన మార్గాలను పెద్దలు ఎవరూ ఇష్టపడరు, అవి మనకి సమాజానికి అంత శ్రేయస్కరంకూడా కావు. నేను విన్నవి చదివినవి నాకు అర్థం అయ్యినంతవరకూ ఇక్కడ వ్రాసాను, తప్పులు ఉంటే పెద్దలు దిద్దగలరు.


ఇంకా చదవండి »

నామము గొప్పదా - రూపం గొప్పదా

రూపం నామమునకు ఆధీనం. నామం లేక రూపం యొక్క జ్ఞానం కలుగదు. రూపంగల పదార్ధం చేతిలో వున్నను నామం తెలుసుకొనని యెడల పదార్ధం గుర్తెరుంగం. నామమును ధ్యానిస్తే రూపం స్వయముగా హృదయంలో వ్యక్తమగును. మనస్సునకు ఆనందం కలుగును. సగుణ, నిర్గుణ బ్రహ్మములకు నామమే సాక్షి. రెండింటిని తెలుసుకొనుటకు నామమే ప్రధానము.వానిని చేరుటకు నామం మార్గం చూపును

(మహాభక్తవిజయంబ్రహ్మం సగుణమనియు, నిర్గుణమనియు చెప్పవచ్చును. సగుణ నిర్గుణములకంటే నామమే శ్రేష్టం. ఎందుకంటే - నామం యొక్క ప్రభావంవలన సగుణ నిర్గుణములు రెండును స్వాదీనమగును. అగ్ని దారువులో కలదు, అగ్నియే ప్రకటమై ప్రజ్వరిల్లును. మొదటిది అవ్యక్తం, రెండవది వ్యక్తం. అటులనే నిర్గుణబ్రహ్మం  అవ్యక్తం, సగుణబ్రహ్మం వ్యక్తం. రెండును అగమ్యములు. నామం మాత్రం గమ్యం. అందుచేత బ్రహ్మం కంటెను, రాముని కంటెను నామం శ్రేష్టమైనదని చెప్పుదురు. సచ్చిదానంద స్వరూపుడైన పరబ్రహ్మం జీవుని హృదయములలో ప్రకాశిస్తున్ననను లోకములో సమస్తజీవులను అది గ్రహించలేక దుఃఖితులై అగచాట్లు పడుచున్నారు

కారణంచే బ్రహ్మం రూపమును ధరించి పేరు పెట్టుకొని లోకమునకు వ్యక్తమగుచున్నాడు. సగుణబ్రహ్మమునకు నామం లేనిచో స్మరించలేముకాబట్టి సగుణనిర్గుణబ్రహ్మములకంటే నామం యొక్క ప్రభావము శ్రేష్టమైయున్నది. సగుణబ్రహ్మం మాధుర్యమూర్తి, నామం మాధుర్య మహిమాశక్తి దీప్తి. రాముని వలన తరించినవారు కొందరే, రామనామం వలన తరించువారు అనంతమంది.
రామనామ్ మణిదీప్ ధయ జొహ్ రే హరంద్వార్
తులసి భీతర్ ఛాహే రహు జాం బహం ఉజ ఆర్ (తులసీదాసు)
(నీకు లోపల బయట వెలుగు కావాలని కోరుకుంటే, జిహ్వ అనే ద్వారం దగ్గర రామనామం అనే దీపాన్ని వెలిగించండి)

రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే / రఘునాధాయ నాధాయ సీతాయాః పతయే నమః //

శ్రీరామున్ని కౌసల్యాదేవి రామా అనియు, దశరధుడు రామభద్ర యనియు, వసిష్టమహర్షి రామచంద్ర యనియు, రాజులు రఘునాధ యనియు, సీతాదేవి నాధ యనియు, భక్తులు సీతాపతి యనియు, సంబోధింతురు. అట్టి సీతారామునకు నమస్కారం.

ఇంకా చదవండి »

యమునమ్మకు పుష్కరాల

దేశం నలుమూలనుంచీ లక్షలాది భారతీయులు శ్రద్ధావిశ్వాసాలతో యమునా జలాలను ఆరాధిస్తారు. ఈ నేపథ్యంలో సరియైన రీతిలో పరిశీలిస్తే మన పూర్వీకుల ఔన్నత్యం అవగతమవుతుంది. పరమేశ్వరుడు ఎక్కడో అతీతంగా లేడనీ, ప్రకృతిలో ప్రత్యణువులో ప్రకాశిస్తున్నాడనీ, ఆ సత్యాన్ని ఆవిష్కరించుకొని నిరంతరం ఆనందంగా, ప్రేమగా, స్వేచ్ఛగా, స్వచ్ఛంగా బతకమని బోధించడమే సనాతన మతసారం.

ఏడాదికో నదికి పుష్కరం. ఆ సమయంలో బృహస్పతి గ్రహ ప్రభాం, పవిత్ర పుష్కరుని దివ్యత్వం ఆయా నదులలో ప్రవేశిస్తుందని మన శాస్త్రాల మాట. ఏ రాజకీయ సిద్ధాంతాలు, సంఘసేవోద్యమాలు చేయలేని పనిని మన సనాతన సంస్కృతి సాధిస్తోమ్ది.

"ఈ దేశమంతా నాది" అనే భావన సనాతన ధర్మంవల్ల కలుగుతోంది. దేశమంతా ప్రవహించే నదులనీ, పుణ్యతీర్థాలనీ స్మరించుకుంటాం. పుష్కరాలు, కుంభమేళాలు వంటి పుణ్యకాలాల్లో, పండుగల్లో దేశమంతా ఒక నదీతీరానికో, ఒక దివ్యక్షేత్రానికో చేరి జనశక్తిని ప్రకటిస్తుంది. ఈ సమాగమంలో భాషల ఎల్లలు, ప్రాంతాల హద్దులు పనిచేయవు. పైగా - భిన్నప్రాంతాల సంస్కృతుల పరస్పరావగాహన, సామరస్య స్ఫురణ వెల్లివిరుస్తుంది. అన్ని భాగాలలోని కళలను, ఆచార వ్యవహారాలను ఒరికొకరు అందిపుచ్చుకుంటారు. తమ పూర్వీకులను తలంచుకొని వివిధ ధార్మిక కర్మలను ఆచరించడం కూడా మనిషికి పూర్వతరాల పట్ల వున్న కృతజ్ఞతనీ ధార్మికతనీ స్ఫురింపజేస్తుంది. ఈ విధంగా జాతీయ సమైక్యతను సాధిమ్చడంలో సనాతన ధర్మం బలవత్తర పాత్రను పోషిస్తోంది.

ఈ దేశపు నదులన్నింటికీ పురాణ కథలున్నాయి. వాటితో ఈ దేశవాసుల మనసులు మధురానుబంధంతో పెనవేసుకుపోయాయి. ఇవి కేవలం నీటి ప్రవాహాలు కావు. జీవ స్వరూపాలు. వీటికి ఆత్మ వుంది. అది మన ఆత్మలను పలకరిస్తుంది. మన పలకరింతలకు పులకరిస్తుంది. మనల్ని పోషిస్తుంది. లాలిస్తుంది. ఈ ప్రాణ బంధాన్ని మరింత అవగాహన చేసుకొనే ధార్మికతను ప్రబోధిస్తే, ఈ మాతృమూర్తుల పట్ల ప్రజల బాధతను తెలియజేసిన వారమవుతాం.

దేవతా మూర్తుల్నీ, అమ్మనీ ఎంత ప్రేమగా, భద్రంగా పవిత్రంగా చూడాలో అలాగే ఈ నదులపట్ల బాధ్యతతో, గౌరవంతో, పవిత్రతతో ప్రవర్తించాలనే స్పృహ ప్రతివారికీ కలగాలి, కలిగించాలి. అప్పుడే నిజమైన పుష్కర స్నానఫలం లభిస్తుంది. ఈ దేశపు అత్యధిక ప్రజావాహిని ఈ జలవాహినులలో కలసి జలకమాడి పూజించే ఈ పర్వాలను మతపరమైన క్రియలుగా భావించడం పరమ మూర్ఖత్వం. ఈ దేశప్రజలు అనాదిగా ఈ నేలతో, ఈ నీటిలో పెట్టుకున్న సనాతన బామ్ధవ్యానికి చిహ్నాలివి. అంటే - ఇవి ఈ దేశపు మట్టిలో పుట్టిన సంస్కృతికి ఆలవాలాలు. సంస్కారానికి సంకేతాలు. ఈ అవగాహన పాలకులకీ, ప్రజలకీ అవసరం. ప్రజలంతా పాల్గొనే ఈ చోట ఇంతటి అవగాహన, విశాల దృక్పథం కలిగించడంలో వివేకవంతులు తగిన బాధ్యత వహించాలి. ప్రతినది ఒడ్డునా మహా సామ్రాజ్యాలు, ఎన్నో నాగరికతలు, కళా సంస్కృతులు విలసిల్లిన ఘన చరిత్రలున్నాయి.

ఆ చరిత్రలు మిగిల్చిన అద్భుత వారసత్వ సంపదలున్నాయి. వాటిని స్మరించడానికి, కరదీపికలుగా గ్రహించడానికి, తరువాతి తరాలకు అందించడానికి ఇంత చక్కని పర్వ వేళలను ఏర్పరచారేమో మహర్షులు. ఒక్క మంచి పనితో, వేలాది సత్ప్రయోజనాలను సాధింపజేసే ఇలాంటి ఉత్సవాలు, వేడుకలు ప్రజలందరి హృదయాలను ఒకే సూత్రంతో ఏకీకృతం చేసే అద్భుత సాధనాలు.

ఇంకా చదవండి »

సాధన - సాధ్యము

సాధ్యము, సాధన ఇక్కడ వస్తున్నది. పరాభక్తికి మాత్రమే శివతత్త్వం దొరుకుతుంది. పరాభక్తి అనగా సర్వోత్కృష్టమైన భక్తి. అది తప్ప అనన్య భక్తి. అప్పుడు దానిపేరే అనన్య భక్తి అయింది. అనన్యమైన పరాభక్తికి అది దొరుకుతుంది. మరొక మార్గం ద్వారా దొరకదు. అందుకు దేవతలు, యోగులు ఆ పరతత్త్వాన్ని చూడాలనుకుంటారు. చూడాలనుకోవడం అంటే పొందాలనుకోవడం, అనుభవించాలనుకోవడం, లీనమవ్వాలనుకోవడం. అందుకు ఒక్కటే మార్గం. ఆ శివునియందు భక్తి ఉన్నచో అజ్ఞానబంధనములనుంచి, కర్మ బంధనములుంచి విడివడతాడు. పరాభక్తి అంత తేలికగా లభించదు. నారదులు "ప్రకాశతే క్వాపి పాత్రే" అన్నారు. కొందరియందే అది ప్రకాశిస్తుంది. అందరియందు దొరకదు. శాస్త్రములు దొరకవచ్చు, నియమాలు చెప్పవచ్చు. కానీ భక్తి మాత్రం అంత తేలికగా దొరకదు. పరాభక్తి వీటన్నింటికీ అతీతమైనది. 

సాధ్యం - సాధించవలసినది, సాధకుడు - సాధించు వాడు, సాధన _ దేనిద్వారా సాధిస్తాడో అది. సాధకుడు అనిత్యముల పట్ల నిస్పృహుడై ఉంటాడు. నిస్పృహ అంటే పట్టకపోవడం. పరపదములు తప్ప లోకములో అన్నీ అనిత్యములే. గడ్డిపోచ నుంచి బ్రహ్మలోకం వరకు అనీ అనిత్యములే. పరమేశ పదార్పణంతో కర్మ చేస్తాడు. అనిత్యమైన ఫలాకాంక్షతో చేయడు. ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తాడు. అలా చేసినప్పుడు సాధనా స్థాయినిబట్టి క్రమక్రమంగా శివునిలోకి వెళ్తాడు. అనగా సాలోక్యాది క్రమము. సాలోక్య, సామీప్య, సారూప్య, సాయుజ్య - ఇది పూర్తి లీనావస్థ. అందుకని ప్రతివాడు వారి మనఃస్థితిని అనుసరించి శివపదాన్ని పొందడానికి క్షణం వృథా చేయకుండా సాధన ప్రారంభించాలి. సాధనలు చాలా ఉన్నాయి. వాటి సారం చెప్తున్నాను వినండి అన్నాడు బ్రహ్మదేవుడు.

సారం తీస్తే సాధనలు మూడు. ౧. శ్రోత్రములతో వినడం, ౨. విన్నదానిని కీర్తించడం. అది నామం కావచ్చు, గుణం కావచ్చు, ఆ శివుడు మహేశ్వరుడు, సర్వేశ్వరుడు, పశుపతి అన్నారనుకోండి అది కీర్తనే. ఆయన దివ్యత్వాన్ని గానం చేయడం. ౩. మనస్సుతో మననం చేయడం. ఈ మూడూ జీవితాంతం చేయమన్నాడు. ఈమూడూ నిరంతరం చేస్తే మహాసాధన. శివపురాణం చెప్పిన వేదవ్యాసుడు కదిలిస్తే వేదం, వేదాంతం. ప్రతిశ్లోకంలోనూ వేదాంత వాక్యం, వేదవాక్యం ఉన్నది. 

శివపురాణం వేదసమ్మితం అనడంలో ఇంత విశేషం ఉన్నది. “ఆత్మావా అరే ద్రష్టవ్యో, శ్రోతవ్యో, మంతవ్యః" - అనే మంత్రం మనకి ఉపనిషత్తులో ఉన్నది. శ్రోతవ్యః, మంతవ్యః, నిధి ధ్యాసితవ్యః - ఆత్మతత్త్వం మాత్రమే వినవలసినది(శ్రవణం), మననం చేయవలసినది(మననం), కీర్తించవలసినది(కీర్తనం). అందుకే శ్రీనాథ మహాకవి కాశీఖండంలో ఇలా అన్నారు -
"మరియాతడు సదానిది ధ్యాసితవ్యుండు, మంతవ్యుడాతండు, శ్రోతవ్యుడాతండు, ద్రష్టవ్యుడాతండు, జన్మస్థితి ధ్వంసనంబుల్ తిరోభావ మోక్షంబులున్ కృత్యముల్గాగనాతండు, లోకంబులంబట్టి పాలార్చు, రుద్రుండు"

ఆయనయే చూడవలసిన వాడు, వినవలసిన వాడు. ఆయనది తప్ప ఇంకొకటి విన్నావు అంటే వినకూడనిది విన్నావు అని అర్థం. అనవలసింది అన్నప్పుడు వాక్కు సార్థక్యం. ఈ మూడూ ఎల్లవేళలా చేస్తే మనల్ని పరమాత్మ వైపు తిప్పుతాయి. లోకంతో కానీ, భగవంతునితో కానీ Attachment పెట్టుకోవాలంటే మన దగ్గరున్న మూడే - త్రికరణములు. మూడు కరణములలో ప్రసరించే నువ్వు ఈశ్వరునితో అనుసంధానం అయితే నువ్వూ శివోహం అవుతావు. అందుకు శ్రవణ, మనన, కీర్తనములకు వ్యాసదేవుడు పెట్టిన పేరు మహాసాధనం.

సృష్టిలో ప్రత్యక్షమైన వస్తువుయందు (ఇంద్రియానికి అనుభవానికి వచ్చేది) ప్రవర్తించడానికి కంటితో చూసి యేమి చేయాలో ప్రయత్నిస్తాం. అప్రత్యక్ష విషయానికి ప్రమాణం శాస్త్రమే. వినడం చేతనే శాస్త్రం తెలుస్తుంది. అందువల్లనే మొట్టమొదటి సాధనం శ్రవణం ఎందుకు చెప్పారంటే ముందుగా శివుడు శాస్త్రముల ద్వారానే పరిచయం అవుతాడు. ఆ తరువాత దానియందు నువ్వు ప్రవర్తిస్తావు. శ్రవణం నుంచి కీర్తనలోకి, మననం లోనికి వెళ్తున్నావు. 

ఈ మూడూ సాధించే వాడే శివయోగి అనబడతాడు. ఈ సాధన చేయగా చేయగా అవయవాలలో రోగాలు పోతాయి క్రమంగా. నిరంతర శివసాధన చేసే వారికి శరీరంలో రుగ్మతలు పోతాయి. వారి అణువణువులో శివుడు చేరతాడు. వారి అంతః కరణంలో, శరీరం శివునిలో లీనమౌతుంది. ఆ తరువాత లౌకికానందాలు పోతాయి. అనగా లౌకిక విషయములలో ఆనందించడం అనే దౌర్భాగ్యం పోతుంది. జీవితంలో జరిగే సుఖదుఃఖములకు కదలని స్థితి వస్తుంది. క్రమంగా శివసాయుజం పొందుతావు. సాధన బలవత్తరమైతే ఇహంలో ఒక ఫలం కనిపిస్తోంది. తరువాత అది శివులోనికి తీసుకు వెళ్తుంది.

ఇంకా చదవండి »

మడి అంటే ఏమిటి ?

ముందు రోజు సాయంత్రము, కట్టుకోవలసిన బట్టలను తడిపి, పిండి, తడి బట్ట కట్టుకొని దండేముల మీద గానీ, లేక బయట ఆరు బయలులో గానీ ఎవరూ తాక కుండా ఆర వేయవలెను. ప్రక్క రోజు మరలా తడి గుడ్డ తోఆరిన మడి బట్టలను తెచ్చుకొని గోచీ పోసి కట్టు కోన వలెను. మడి కట్టుకొన్న తరువాత ఇక ఎలాంటి మైల వస్తువులను తాక కూడదు, తాకితే మరలా స్నానము చేసి మరలా వేరే మడి బట్ట కట్టుకొని వంట చేయ వలను. మడితో నే భగవంతునికి నైవేద్యము పెట్టి, ఆ మడి తోనే భోజనము చేయాలి. ఆ తరువాత మడి వదలి మైల తాకుతారు. మడి బట్ట లేనప్పుడు ధావళి కట్టుకోవచ్చు. లేదా పట్టు బట్ట కట్టుకోవడము మూడో పద్ధతి.

పట్టు బట్టతో గాని, ధావళి తో గాని భోజనము చేయకూడదు, ఒక వేళ చేస్తే మరలా తడిపి మడిగా ఆరవేసి కట్టుకోవలెను. పట్టు బట్ట (ఒరిజినల్) ను కట్టుకొని వంట వండి, నైవేద్యము అయిన తరువాత మరలా జాగ్రత్తగా ఎవ్వరూ తాక కుండా పెట్టుకొని, మరలా ప్రక్క రోజు వాడు కొనవచ్చు. అయితే అమావాస్య అమావాస్య కు తడిపి ఆరవేయవలెను, లేక పోతే పట్టుగుడ్డలు మడికి పనికి రావు. ధావళి తో చేస్తే చాలా శ్రేష్టము. ధావలితో వున్నప్పుడు పొరబాటున మైల వస్తువులను తాకినా దోషము వుండదు. ధావళి కట్టుకొని సంధ్య వార్చడము పట్టు బట్ట కంటే శ్రేష్టము. పట్టు బట్టలో కొంత దోషము వున్నది, అదే జీవ హింస, కావున కొంతమంది దానిని త్యజిస్తారు.

కావున శ్రేష్టము నూలు గుడ్డ లేక ధావళి. పంచను లుంగి లాగ కట్టుకొని మగ వాళ్ళు గానీ, చీరను లుంగి లాగ, లో పావడా తో ఆడ వాళ్ళు గాని కట్టుకొని దైవ కార్యములు చేయకూడదు. కారణము జననే౦ద్రియములు ఆచ్ఛాదనం లేకుండా వుండ కూడదు. ఇది శాస్త్రము. కావున మగ వాళ్ళు గానీ, ఆడవాళ్ళూ గానీ గోచీ పోసి పంచ, చీర కట్ట వలెను. మగ వాళ్ళు గోచీ పోసి ధోవతి కట్టి దైవ కార్యములలో పాల్గొన వలెను.


మడి తో పచ్చళ్ళు, మడితో వడియాలు, మడితో పాలు, పెరుగు, నెయ్యి వుంచడం ఇవన్నీ చాలా వరకు పోయినాయి. కొద్ది కొద్దిగా నైనా మరలా ఆచరణలోకి తీసుకొచ్చే ప్రయత్నము చేదాము అందరము. మనము ఆచరించి, అందరికీ చూపించి ఆదర్శకులము అవుతాము. మనల్ని మనము కాపాడుకొందాము. ఒక్క సారి మడి కట్టి చూడండి దాని లోని ఆనందము, స్వచ్ఛత, పరిశుభ్రత, దైవతం అనుభవము లోకి వస్తాయి. 
శుభం భూయాత్.

ఇంకా చదవండి »

గోమాత వ్రతం

గోమాత ముక్కోటిదేవతల సమూహము. గోమాత కలియుగంలో సాక్షాత్ కామధేనువు వంటిది. కామధేనువు అనగా అడిగినదల్ల లేదనకుండా ప్రసాదిన్చునది అని అర్ధం. ఈ కలియుగంలో ఒక్కమారు గోమాత వ్రతం ఆచరిన్చినట్లయితే తప్పకుండ అనుకున్నపనులన్ని సఫలికృతము అవుతాయి.

గోపంచకమును ప్రతి పూజలోను వినియోగిస్తారు. కారణమేమనగా అది వినియోగించిన ప్రతివారు, ప్రత స్తలము శుద్ధి అవుతాయి. మనమాచరించే ప్రతి పూజలో గణపతి పూజ నుండి ప్రతిష్టాంతం వరకు పంచగవ్యాలను వాడతారు.

పంచగవ్యాలు అనగా ఆవుపాలు , ఆవుపెరుగు , ఆవునెయ్యి , ఆవుముత్రము , ఆవుపేడ.ఈయొక్క ఐదింటిని పంచగవ్యాములన్డురు. వీటితో పంచగవ్యప్రాసన అనేపూజ చేసి అవి తీర్ధముగా తీసుకొనవలెను. ఈతీర్దము సంవత్సరంలో ఒక్కసారైనా తప్పకుండ తీసుకోవలెను. అదేవిధంగా ఆవుపాలు చాలా శ్రేస్థామైనవి. చిన్నపిల్లలకు ఇచ్చినట్లయితే మంచితెలివితేటలు పెరుగుతాయి . మంచివిద్యావంతులవుతారు .

మనము తెలిసి తెలియక ఆడవారు అంటూ , ముట్టు ఇంట్లో కలిపినపాపమును , పెద్దలను దూషించిన పాపమును , సర్వపాతకములను , మహాపాతకములను , భక్తిపూర్వకముగా గోమాతను ధ్యానించిన , గోవులకు గ్రాసాములిచ్చినను , గోవులకు దాణాలిచ్చినట్లయితే , పైనచేప్పబడిన పాపములనుండి విముక్తి పొంది సర్వసంపదలు చెకూరునని శాస్త్ర ప్రమాణము . 

ఏకాదశి నాడు ఉదయమునే కాలకృత్యాలు నెరవేర్చుకొని గోమాత పూజ మరియు గోసేవ ఆచరిన్చినట్లయితే కాశి నగరంలో కోటిగోవులను దానము చేసినంత ఫలితము లభిస్తుంది. 

ఇంకా చదవండి »

అరుణాచల మహిమ





ఇంకా చదవండి »

అభిషేకం చేయాలి? వాటి ఫలితాలు ఏమిటి ?


  
ఆలయాల్లోని విగ్రహాలకు అభిషేకాలు చేస్తారు. అభిషేకాల ద్వారా ఆలయాల్లో శుద్ధి చేయడం పరిపాటి. అభిషేకాలకు పలు వస్తువులు, పదార్థాలను ఉపయోగిస్తారు.

ఆలయాల్లో జరిగే అభిషేకాలకు వస్తువుల్ని, వివిధ పదార్థాలను సమర్పించుకునే వారికి సకల సంపదలు చేకూరుతాయని విశ్వాసం. ఆలయాల్లో జరిగే అభిషేకాల ద్వారా లభించే ఫలితాలేంటో పరిశీలిస్తే..

నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే సుఖసంతోషాలు చేకూరుతాయి. 
ఆవుపాలతో అభిషేకం చేయిస్తే ఆయుర్దాయం పెరుగుతుంది. 
ఆపు పెరుగుతో అభిషేకం చేయిస్తే సంతాన వృద్ధి చేకూరుతుంది. 
పంచదారతో అభిషేకం చేయిస్తే శత్రువులు నశిస్తారు. 
విభూతితో అభిషేకం చేయిస్తే భోగభాగ్యాలు, మోక్షం సిద్ధిస్తుంది 
శంఖంతో ద్వారా నీటితో అభిషేకం చేయిస్తే శత్రు భయం ఉండదు. 
చందనం, పనీర్‌లను కలిపి అభిషేకం చేస్తే సిరిసంపదలు వెల్లివిరుస్తాయి. 
కలశ జలంతో అభిషేకం చేస్తే కార్యానుసిద్ధి చేకూరుతుంది. 
మామిడి పండుతో అభిషేకం చేయిస్తే అనుకున్న కార్యాల్లో విజయం
సొంతమవుతుంది. స్వర్ణాభిషేకం చేయిస్తే లాభాలు చేకూరుతాయి.

పంచామృతం (కలకండ, పంచదార, నెయ్యి, పండ్లు, తేనె)తో అభిషేకం చేయిస్తే అష్టైశ్వర్యాలు లభిస్తాయి.
కొబ్బరి బొండాంతో అభిషేకం చేస్తే కుటుంబంలో కలహాలుండవు.
చందనంతో అభిషేకం ద్వారా ఐశ్వర్యం చేకూరుతుంది
పచ్చిబియ్యం పిండితో అభిషేకం చేస్తే అప్పుల బాధ తీరిపోతుంది.
చక్కెర రసంతో అభిషేకం చేయిస్తే ఆరోగ్యం చేకూరుతుంది.
తేనెతో అభిషేకం సుఖసంతోషాలను ప్రసాదిస్తుంది.
అరటి పండుతో అభిషేకం సుఖమయ జీవితాన్ని ప్రసాదిస్తుంది.
అన్నంతో అభిషేకం చేస్తే రాజభోగాలు చేకూరుతాయి.
సుగంధ ద్రవ్యాలతో అభిషేకం సర్వసంతోషాలను ప్రసాదిస్తుంది.
నిమ్మరసంతో అభిషేకం చేస్తే పగ తీరుతుంది.
ఏ రోజున ఏ దేవుడికి అభిషేకం చేయాలి?
వినాయకుడు - ఆదివారం
పరమేశ్వరుడు, భీమలింగేశ్వరుడు - సోమవారం
సుబ్రహ్మణ్య స్వామి - మంగళవారం
విష్ణుమూర్తి - బుధవారం గురు భగవానుడు.
సాయి నాథునికి - గురువారం
అమ్మవారికి - శుక్రవారం
శ్రీ కృష్ణుడికి - శనివారం
నవగ్రహాలకు - ఆదివారం
దుర్గాదేవికి - మంగళవారం

అభిషేకాలు చేయించాలని పురోహితులు చెబుతున్నారు.

ఇంకా చదవండి »

గురు మంత్రం




ఇంకా చదవండి »

వృక్షాలలో విశేషమైనది రావిచెట్టు


 

వదకాలం నుంచి వృక్షారాధనకు భారతీయ సంస్క్కృతిలో అధిక ప్రాధాన్యత ఉంది. రావిచెట్ట్టుకు మరింత ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. రావిచెట్టు మాధవునకు ప్రియమైనది. మాధవ స్వరూపంగా కూడా రావిచెట్టును భావిస్తారు. ప్రాత: స్నానానంతరం రావిచెట్టుకు నీరు పోసి, పూజించి ప్రదక్షిణలు చేయడం వల్ల సమస్త దేవతల అనుగ్రహం కలుగుతుందని పలుతంత్రాలలో పేర్కొనడం జరిగింది. సత్సంతానం కోసం అశ్వత్థ సమిథలతో హోమం చేయ్యాలని వసిష్ఠ హవన పద్ధతిలో చెప్పారు. అశ్వత్థ సమిధలతో హవనం చేయడం వల్ల అన్నిరోగాలూ నయమవు తాయని దేవీ భాగవతం చెబుతోంది.

అపశకునాలు ఎదురయినప్పుడూ, దురాక్రమణలు జరిగినపుడు, మశూచివంటివి ప్రబలినపుడు, ఆపదలు చుట్టుముట్టినపుడూ చెడును ఉపశమింప చేసేందుకు అశ్వత్థ పూజ చేయాలని వ్రతార్కం తెలియజేస్తూ పూజావిధానాన్ని ఎరుకపరిచింది. మణులు శిరోభూషణంగా ఉండే సర్పాలు రావిచెట్టుపైనే ఉంటాయి.

శత్రుబాధలు కలవారు 41 దినాలు రావిచెట్టు కింద కూర్చుని హనుత్సహస్ర నామ స్తోత్రం పారాయణ చేస్తే శత్రుభయం తొలగిపోతుందంటారు. హనుమంతుని స్మరిస్తూ రావిచెట్టుకు 108 ప్రదక్షిణలు చేయడం వల్ల సంకటాలు, బాధల నుంచి విముక్తి లభిస్తుందని తులసీదాసు చెప్పిన సూక్తి. హనుమన్మంత్రాన్ని రావిచెట్టుకిందనే జపించాలనే నియమం ఉంది. నవగ్ర పూజల గురించి వింధ్యాచలం లోని భైరవకుండానికి చెందిన అక్షోభానంద సరస్వతీ మహారాజ్‌ చెబుతూ పూజ ముగిసిన అనంతరం పూజాసామాగ్రినంతటినీ ఒక కుండలో ఉంచి మూతపెట్టి రావిచెట్టు కింద పాతిపెడితే సమస్త గ్రహపీీడలూ తొలగిపోతాయన్నారు.

జపమాలను సంస్కరించేటప్పుడు తొమ్మిది రావి ఆకులతో విస్తరికుట్టి మధ్య ఆకులో జపమాలను ఉంచి మిగిలిన ఆకులను అష్టదళ కమలమువలె ఉంచి మధ్యనుండే జపమాలను పంచగవ్యంతో సంస్కరించి శుద్ధిచేయాలని మాలా సంస్కార నిధి అనే గ్రంథం తెలియ చేస్తోంది. ఏదైనా దీక్షారంభంలో చేసే కలశారాధన, కలశస్థాపనాది కార్యాల్లో పాలు ఉండెె (క్షీర వృక్ష శాఖలు) చెట్ల కొమ్మలు సమర్పించాలని, కలశంలో ఆ చెట్ల పెచ్చు, వేయాలని చెప్పబడింది. భూత, ప్రేతాలు ఆవహించినపుడు రావి ఆకులు వేసిన నీటితో స్నానం చెయ్యాలని చెబుతారు. పతి సౌఖ్యాన్ని, సమస్త సౌభాగ్యాలను కోరుకొనే స్త్రీలు సోమ వతీ అమావాస్య వ్రతం చేయాలని చెబుతారు.


ఈ వ్రతాన్ని హేమాద్రి వర్షక్రియ కౌముది వ్రతార్కం, తదితర గ్రంథాలు ఎరుక పరిచాయి. మాఘమాసంలో అమావాస్య తిధి సోమవారం నాడు వచ్చిటనట్టయితే ఆ రోజు అశ్వత్థ మూలంలో విష్ణువును పూజించి రావిచెట్టుకు 108 సార్లు ప్రదక్షిణలు చేసి దాన ధర్మాలు చేయడంవల్ల మంచి జరుగుతుంది. రాహు మహాదశలో, శని అంతర్దశలో కష్టనష్టములు పీడలు, శత్రుభీతి, వంటి అనిష్టాలు సంభవించినప్పుడూ రావిచెట్టును పూజించి ప్రదక్షిణలు చేస్తే అన్ని కష్టాలు తొలగిపోతాయి. వృక్షాలలోకెల్ల విశేషమైన అశ్వత్థ వృక్షం నేను అని శ్రీకృష్ణపరమాత్ముడు గీతలో అర్జునునికి చెప్పడం జరిగింది.

ఇంకా చదవండి »