• విష్ణుషట్పదీ స్తోత్రం

    నారాయణ నారాయణ జయ గోవింద హరే |నారాయణ నారాయణ జయ గోపాల హరే ||

  • శ్రీ రామ

    ఆపదం అపహర్థారమ్ దాతారం సర్వ సంపదం, లోకాభి రామం శ్రీ రామం భూయో భూయో నమామ్యహమ్I

  • శ్రీ సీతామాత

    త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ, హనుమాన్ యత్న మాస్తాయ దు:ఖ: క్షయ కరోభవ

  • ఓం నమ:శివాయ:

    చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర పాహిమామ్ , చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర రక్షమామ్ I

  • శ్రీమాత్రే నమః

    అమ్మల గన్న యమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాల పెద్దమ్మ, సురారులమ్మ కడుపారడి పుచ్చిన యమ్మ, తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ మాయమ్మ కృపాబ్ధి నిచ్చుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్

  • శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు

    పురుషోవిష్ణు రిత్యుక్తః శివోనానామతః స్మృతః I అవ్యక్తం తు ఉమాదేవీ శ్రీర్వా పద్మ నిభేక్షణా I తత్ సంయోగా దహంకారః స చ సేనాపతిరుహః I

మంత్రం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

శివపూజ విజయం కొరకు



ఇంకా చదవండి »

దంపతులు అనురాగంగా ఉండడానికి


భర్త విడాకులు కావాలి అని కానీ , వేధిస్తున్న , మనస్థాపం తో ఉన్న , కలహాలు పడుతున్న , భార్య ఈ శ్లోకం లక్ష కి తక్కువ కాకుండా చదువుకుంటే ఇద్దరు మల్లి కలవటానికి , అన్యోన్యంగా గాఉండడానికి , సౌమ్యం గ ఉంటారు .

ఇంకా చదవండి »

శ్రీ హనుమచ్ఛంత్రుజయ మంత్రం



ఇంకా చదవండి »

గర్భరక్ష కోసం

గర్భం దాల్చిన తరువాత రోజు పొట్ట మీద రెండు చేతులు వేసి కింది మంత్రం నిత్యం చదువుకోవడం వలన ఆరోగ్యవంతులైన పిల్లలు పుడతారు . తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉంటారు.


ఈ మంత్రాలు చదువుకుంటూ pregnency confirm అయినప్పటి నుంచి ఈ స్తోత్రాలు చదువుకోవాలి .

నారాయణ కవచం
షష్ఠి స్తోత్రం
లలిత సహస్రనామం 

ఇంకా చదవండి »

పిల్లలకి చదువు బాగా రావటానికి

పిల్లలకి చదువు ప్రారంభం చేసేటప్పుడు , ప్రతిసారి చదుకునేటప్పుడు , ప్రతి పరీక్షా వ్రాసేముందు ఈ మంత్రం చదువుకుంటే పరియక్షలో ఉత్తీర్ణత చదువులో వృద్ధి కలుగుతుంది. 



ఇంకా చదవండి »

లక్ష్మీ పంచకం

కింద ఉన్న ఐదు శ్లోకాలనూ లక్ష్మీ పంచకం అంటారు. దీన్ని ప్రతీ పూర్ణిమ నాడూ చదువుకుంటే పరమాత్మ యందు భక్తి పెరిగి సంసారములో కోరిక కోరకుండా ఉంటారు  

తద్భగవతో మాయామయం రూపం పరమసమాధియోగేన రమా దేవీ సంవత్సరస్య రాత్రిషు ప్రజాపతేర్దుహితృభిరుపేతాహఃసుతద్భర్తృభిరుపాస్తే ఇదం చోదాహరతి  కామదేవున్ని లక్ష్మీ దేవి ప్రజాపతులల్తో కలిసి వారి పుత్రికలతో కలసి ఆరాధిస్తుంది. పగలు అంటే ప్రజాపతుల పుత్రులూ రాత్రి అంటే వారి పుత్రికలు. వీరితో కలిసి కామదేవున్ని ఆరాధిస్తుంది  

ఓం హ్రాం హ్రీం హ్రూం ఓం నమో భగవతే హృషీకేశాయ సర్వగుణవిశేషైర్విలక్షితాత్మనే 
ఆకూతీనాం చిత్తీనాం చేతసాం విశేషాణాం చాధిపతయే షోడశకలాయ చ్ఛన్దోమయాయాన్నమయాయామృతమయాయ సర్వమయాయ 

సహసే ఓజసే బలాయ కాన్తాయ కామాయ నమస్తే ఉభయత్ర భూయాత్ 

ఈ కామదేవుడే హృషీకేశుడుకోరిక ఇంద్రియములు మన చేతిలో లేకుండుటచే కలుగుతుంది. ఆ ఇంద్రియ ప్రవృత్తిని నియంత్రించగలిగే వాడు పరమాత్మఅందుకే స్వామి హృషీకేశుడుప్రకృతి గుణాల కంటే ఆత్మ గుణాల కంటే పరమాత్మ విలక్షణుడుఆకూతి (కర్మేంద్రియాలకూజ్ఞ్యానేంద్రియాలకూ మనసు యొక్క ప్రవృత్తికీ ఆయనే అధిపతి

షోడశకలాయ - ఐదు జ్ఞ్యాన ఐదు కర్మ పంచభూతములకూ మనసుకూ అధిపతిఆయనే చందోమయుడు అమృతమయుడు అన్నమయుడుసర్వమయుడుబలమూ (ధారణ సామర్ధ్యంఓజః (ప్రవృత్తి సామర్ధ్యంసహః (శత్రువులను ఓడించే సామర్ధ్యంకలవాడుఅతనే కాంతుడూ కాముడుఇహలోకములో సుందరుడూ,పరలోకములో కోరికలను తీర్చేవాడు

ఈ లోకములో మనం చూసే సౌందర్యమంతా పరలోక సుఖాదాయకం కావాలిపరలోకములో సుఖం కలిగించేదిగా ఉండాలిఈయన కామస్పతి - సకల కోరికలకూ అధినాధుడుఆయనకు ఆనందం కలిగించే ప్రవృత్తి మనం అలవరచుకుంటే ఇహలోకములో ప్రతీ ప్రవృత్తీ మనకు సంతోషాన్నిస్తుంది. 

 స్త్రియో వ్రతైస్త్వా హృషీకేశ్వరం స్వతో హ్యారాధ్య లోకే పతిమాశాసతేऽన్యమ్ 
తాసాంతే వై పరిపాన్త్యపత్యం ప్రియం ధనాయూంషి యతోऽస్వతన్త్రాః  

యువతులు సౌందర్యవతులు తాము కోరుకున్న భర్త రావడానికి నిన్ను ఆరాధిస్తారు. కానీ వారు అనుకూలవంతులైన పుత్రులని కోరరు. భర్త మంచివాడే అయినా కొడుకు మంచివాడు కాకపోవడముతోసంతానం వారిని కాపాడరు. ఆ సంతానం తల్లి తండ్రులను కాపాడరు గానీ తల్లి తండుర్లు సంపాదించిన ఆస్తులను మాత్రం బాగా కాపాడతారు. భర్తను కోరే ఆడవారు ఇలాంటి సంతానం కలుగుతుందనో కలవచ్చనో ఆలోచించరు. 

 వై పతిః స్యాదకుతోభయః స్వయం సమన్తతః పాతి భయాతురం జనమ్
 ఏక ఏవేతరథా మిథో భయం నైవాత్మలాభాదధి మన్యతే పరమ్  

మాకర్థమయ్యింది ఒకటే. ఎవడు పతి? తాను వేటి వలనా భయము పొందని వాడు భర్త. వాడికి భయం లేకుంటేనే మనము భయపడకుండా కాపాడతాడు. తనకు భయములేని వాడై, భయం ఉన్నవారిని ఎవడు కాపాడతాడో అతనే భర్త. తనను చూచి తానే భయపడే వాడు భర్త ఎలా అవుతాడు. ఆత్మలాభము కంటే ఇంకో ఫలం ఉన్నదని భావించేవాడేవడూ భర్తకాడు. ఆత్మలాభం కంటే భిన్నమైనదాన్ని ఫలముగా తలచేవాడెవడూ భర్త కాదు. పరమాత్మ ప్రాప్తే మనకు ఫలము. దాని కన్నా భిన్నమైనదాన్ని కోరేవారు భర్తా కాదు, భార్యా కాదు, పిల్లలూ కాదు. 

యా తస్య తే పాదసరోరుహార్హణం నికామయేత్సాఖిలకామలమ్పటా
తదేవ రాసీప్సితమీప్సితోऽర్చితో యద్భగ్నయాచ్ఞా భగవన్ప్రతప్యతే 

 పరమాత్మనే ఎందుకారాధించాలంటే, అందరికంటే భగవంతుడు ఉత్తముడు, అడిగిన దాన్నిస్తాడు. అనేక కోరికలతో నిండి ఉన్న మనసు గానీ బుద్ధి కానీ, తాను కోరే కోరికల వలన అనర్థమును పొందకుండా ఉండాలంటే నీ పాదపద్మములనే ఆరాధించాలి. కోరికలు భగవంతుని మీద భక్తిని పెంచే కోరికలు కావాలి. నీవు పూజించబడి కోరబడి భక్తులు ఏమడుగుతారో అది ఇస్తావు. కోరి ఆరాధించినపుడు ఆరాధించిన వాడుకోరిక కోరతాడో అది ఇస్తావు. కోరిక తీరకుంటే భక్తులు బాధపడతారని కోరికలను తీరుస్తూ ఉంటావు. 

మత్ప్రాప్తయేऽజేశసురాసురాదయస్తప్యన్త ఉగ్రం తప ఐన్ద్రియే ధియః
ఋతే భవత్పాదపరాయణాన్న మాం విన్దన్త్యహం త్వద్ధృదయా యతోऽజిత 

మానవులే కాదూ ఇంద్రాదులు కూడా ఇంద్రియముల యందే మనసు పెట్టుకుని నశ్వరమైన వాటిని పొందడానికి ఘోరమైన తపస్సు చేస్తారు. బ్రహ్మ రుద్ర దేవతలూ రాక్షసులూ అందరూ ఇలాగే చేసారు. అలా కోరని వారు ఒక్కరు మాత్రమే, నీ పాద భక్తులు మాత్రమే. కొందరు నేను నా హృదయాన్ని నీ మీద ఉంచిన సంగతి తెలియక నన్ను మాత్రమే కోరతారు. నా హృదయం నీలో ఉంటుంది. అది తెలియని వారు నిన్ను కోరక నన్ను కోరతారు. 

 త్వం మమాప్యచ్యుత శీర్ష్ణి వన్దితం కరామ్బుజం యత్త్వదధాయి సాత్వతామ్
 బిభర్షి మాం లక్ష్మ వరేణ్య మాయయాఈశ్వరస్యేహితమూహితుం విభురితి 

 నన్ను కోరేవారందరూ, నీతో బాటుగా నన్ను కోరేవారిగా వారిని తయారు చేయి. లేదా నన్ను నీతో విడిపోకుండా ఉండే వరమునియ్యి. భక్తులు కోరిక కాదనకుండా నేనైనా నిన్ను విడిచిపెట్టి వెళతానేమో గానీ, నీవు మాత్రం నన్ను విడిచి ఎక్కడికీ వెళ్ళవు. నన్ను పుట్టుమచ్చగా చేసుకుని నీ హృదయములో ఉంచుకున్నావు.  

నీవు నీ భక్తుల యొక్క శిరస్సు మీదకరాంభుజమును ఉంచుతావోకరాంభుజమునే నా శిరస్సు మీద ఉంచి నీ నుండి నాకు ఎడబాటు రాకుండా వరమివ్వు. ఆనాడు నీవు పుట్టుమచ్చగా చేసుకున్నప్పుడు "నేనే ఉండగా వేరే గుర్తు ఎందుకు" అనుకున్నాను. కానీ భక్తులు ఇలా నన్ను వేరు చేస్తారని తెలియదు. నీవేమనుకుంటున్నావో ఎవరికి తెలుసు. నీ సంకల్పాన్ని ఎవరు ఊహించగలరు. 

ఇంకా చదవండి »