• విష్ణుషట్పదీ స్తోత్రం

    నారాయణ నారాయణ జయ గోవింద హరే |నారాయణ నారాయణ జయ గోపాల హరే ||

  • శ్రీ రామ

    ఆపదం అపహర్థారమ్ దాతారం సర్వ సంపదం, లోకాభి రామం శ్రీ రామం భూయో భూయో నమామ్యహమ్I

  • శ్రీ సీతామాత

    త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ, హనుమాన్ యత్న మాస్తాయ దు:ఖ: క్షయ కరోభవ

  • ఓం నమ:శివాయ:

    చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర పాహిమామ్ , చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర రక్షమామ్ I

  • శ్రీమాత్రే నమః

    అమ్మల గన్న యమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాల పెద్దమ్మ, సురారులమ్మ కడుపారడి పుచ్చిన యమ్మ, తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ మాయమ్మ కృపాబ్ధి నిచ్చుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్

  • శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు

    పురుషోవిష్ణు రిత్యుక్తః శివోనానామతః స్మృతః I అవ్యక్తం తు ఉమాదేవీ శ్రీర్వా పద్మ నిభేక్షణా I తత్ సంయోగా దహంకారః స చ సేనాపతిరుహః I

ధర్మం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

ఆవు నెయ్యి గురించిన చిన్న విశేషాన్ని గురించిన వివరం..


గోమాత నామావళిలో హవ్య కవ్య ప్రదాయిని అన్న నామమున్నది. గోఘృతం లేదా ఆవు నెయ్యితోనే దేవతలకు హవిస్సులర్పిస్తాము అలానే పితృదేవతలకు కవ్యమూ.. ఇది అందరకూ తెలిసినదే, ఐతే నిత్యమూ యజ్ఞ యాగాదులు జరిగేచోట, ఆవు నెయ్యి ఇతర సమిధలతో కాలి ఆవిరి అయ్యిన చోట రేడియోధార్మిక పదార్థాల యొక్క విషపు గాలులయొక్క ప్రభావం నామమాత్రం లేదా అసలు ఉండదని రష్యన్ శాస్త్రజ్ఙ్యులు డా శిరోవిచ్ తమ పరిశోధనలో తెలిపి నిరూపించారు. మనవాళ్ళు చెప్తే నమ్మని మన వారు ఇతరులు చెప్పినా కొన్ని సార్లు సనాతన ధర్మ గొప్పదనాన్ని ఒప్పుకోలేరు. 

ఈ విషయం 1980వ దశకంలో జరిగిన అత్యంత ఘోర ప్రమాదమైన భోపాల్ గ్యాస్ విషవాయువులు, రేడియోధార్మికశక్తిల వలన ఆ ప్రాంత చుట్టూ ఐదారు మైళ్ళ వరకూ అత్యంత ఉపద్రవంతో కూడిన వ్యాధులు సోకాయి, ఎందరో చనిపోయారు, కొందరికి చర్మం కాలిపోయింది, ఇప్పటికీ ఆ ప్రాంతం వారిలో కొంతమందికి ఆ రసాయనాల వల్ల కలిగిన రోగాలను పోగొట్టుకోలేని స్థితిలో ఉన్నారు. ఇంత అత్యంత దారుణ బాధాకరవిపత్కర పరిస్థితులలో ఈ ప్రమాదం సంభవించిన కర్మాగారానికి ఒక మైలులోపు ఉన్న రెండు కుటుంబాలకు మాత్రం ఎటువంటి హానీ జరగలేదు, ఎవరి ప్రాణాలకీ ముప్పు కలగలేదు, కనీసం ఎవరూ అనారోగ్యం పాలు కాలేదు. కారణం ఈ రెండు కుటుంబాలు నిత్యాగ్నిహోత్రీకులు అగ్నిహోత్రంలో రోజూ ఆజ్యంవేసి హవిస్సులర్పిస్తారు. వారి పేర్లు వివరాలతో సహా ఆంగ్ల దిన పత్రిక "ద హిందూ" 4-May-1985 నాడు "Vedic way to Beat Pollution" అన్న శీర్షికన ఈ కథనాన్ని ప్రచురించింది. 

ఆ ఇద్దరు ఇంటి యజమానులు శ్రీ సోహన్ లాల్ ఎస్.ఖుశ్వాహ, శ్రీ ఎమ్ ఎల్ రాథోర్ గార్ల పేర్లను ప్రస్తావిస్తూ ఆ ఆర్టికల్ ప్రచురించబడింది. సనాతన ధర్మంలో ఏ కార్యం చేసినా ప్రకృతి ప్రసాదాన్ని చెడగొట్టుకునేలా ఉండవు అన్నీ ప్రకృతికి అనుగుణంగానే చేయబడతాయి, ప్రకృతియొక్క అనుగ్రహంకోసమే చేయబడతాయి, యజ్ఙ యాగాదులు కాలుష్యాన్ని పెంపొందించవు, పైగా అవి వాతావరణంలో ఉన్న కాలుష్యాన్ని తగ్గిస్తాయి అని మన పూర్వీకులు 
చెప్పినదే పాశ్చాత్య ఇతర దేశాల శాస్త్రవేత్తలూ తమ పరిశోధనలచేత నిర్ధారించారు. ఐనప్పటికీ వీటిమీద అధ్యయనం చేసే వైపుగా కానీ, చక్కని ప్రచారం కల్పించడం కానీ మనవారికి చేయడం చేతకాదు. ఏది ఏమైనప్పటికీ... మన సనాతన ధర్మపు విలువలను నిత్య విధులను పట్టుకుని 
నిత్యాగ్నిహోత్రీకులై భోపాల్ గ్యాస వంటి దురదృష్టకర ప్రమాదాన్ని తేలికగా ఎదుర్కుని మన వైదిక సంస్కృతి గొప్పదనాన్ని చాటిని ఆ ఇద్దరు కుటుంబీకులకు వారి వంశానికి ఆ పరాదేవత గోమాత అనుగ్రహం ఎప్పటికీ ఉంటుంది అని ఆశిస్తూ . 

ఇంకా చదవండి »

పెద్దల ముందు ఒద్దికగా ఉండాలి

మన పురాణాలు భక్తి, ముక్తి మార్గాల్ని మాత్రమే ప్రబోధించి వూరుకోలేదు. ఎవరు ఎక్కడ ఎలా ప్రవర్తించాలో చక్కగా వివరించాయి. ప్రధానంగా యువత పెద్దల సమక్షంలో ఎలా ప్రవర్తించాలనే విషయంపై ఎన్నో పురాణ కథలున్నాయి. అలాంటి వాటిలో బ్రహ్మవైవర్త పురాణం శ్రీ కృష్ణ జన్మఖండం ఇరవై మూడో అధ్యాయంలో ఉన్న కథ ఒకటి. కథ ఇలా కనిపిస్తుంది.


ధేనుకాసురుడు అనే గాడిద కృష్ణుడిని సంహరించటానికి వచ్చింది. గాడిద పూర్వ జన్మలో గొప్ప ఇంట్లోని వ్యక్తే. పాపం చేసినందువల్ల అలా గాడిదగా జన్మించాల్సి వచ్చింది. అంతటి ఘోరపాపం ఏమిటి? అని నారదుడు నారాయణ రుషిని అడిగాడు. అప్పుడు నారాయణ రుషి తాను గంధమాదన పర్వతం మీద ఉన్నప్పుడు స్వయంగా ధర్మదేవుడు చెప్పిన విషయాలన్నీ వివరించాడు. గాడిదగా జన్మించింది ఎవరో, ఎందుకు జన్మించాల్సి వచ్చిందో తెలియచెప్పాడు. పూర్వం పద్మకల్పంలో బలి చక్రవర్తి కుమారుడైన సాహసికుడు అనే యువకుడు ఉండేవాడు. సాహసికుడు అన్నీ మంచి లక్షణాలతోనే ఉన్నా ఒకసారి అనుకోకుండా తప్పుచేశాడు. గంధమాదన పర్వతం మీద విహరిస్తున్న సమయంలో అతడికి అప్సరసల్లో ఒకరైన తిలోత్తమ కనిపించింది. ఇద్దరూ ఒకరి అందానికి మరొకరు ఆకర్షితులయ్యారు. అదే పర్వతం మీద దూర్వాస మహర్షి శ్రీకృష్ణుడిని గురించి తీవ్రమైన తపస్సు చేస్తున్నాడు.

తిలోత్తమాసాహసికులు గంధమాదన పర్వతం మీద యథేచ్చగా మదనకేళిలో తేలియాడసాగారు. మితిమీరిన మోహావేశంలో ఉన్న ఇద్దరూ దూర్వాస మహర్షిని గమనించలేదు. కామం కన్నుగప్పిన తిలోత్తమ, సాహసికులు మహర్షి ఎదుటే ఆయన తపస్సు భగ్నమయ్యేలా ప్రవర్తించారు. తపోభంగమైన మహర్షి కళ్ళు తెరిచి చూశాడు.

ఎదుట నిర్లజ్జగా వ్యవహరిస్తున్న ఇద్దరూ కనిపించారు. వెంటనే కోపోద్రిక్తుడయ్యాడు దూర్వాసుడు. దేవతలు, మనుషులు, దైత్యులు, గంధర్వులు ఇలాంటి వారంతా శృంగార సమయాల్లో లజ్జను అనుభవిస్తుంటారని, కేవలం పశువులు మాత్రమే నిర్లజ్జగా వ్యవహరిస్తాయని, పశుజాతికి చెందిన గాడిద మరీ లజ్జావిహీనంగా ప్రవర్తిస్తుందని, పనే చేసిన సాహసికుడు మరుజన్మలో గాడిదగానే జన్మిస్తాడని శపించాడు. అప్సరసల్లో ఒకరై ఉండీ దైత్యుడితో సంబంధం కలిగిన కారణంగా తిలోత్తమ మరుసటి జన్మలో దానవ స్త్రీగా జన్మిస్తుందని శపించాడు. మహర్షి శాపాన్ని విన్న తర్వాత ఇద్దరూ తాము చేసిన తప్పేమిటో గ్రహించి పశ్చాత్తాప హృదయులై మహర్షి పాదాలపై పడి క్షమించాలని పరిపరివిధాలా వేడుకొన్నారు

ప్రార్థనలకు దూర్వాస మహర్షి శాంతుడయ్యాడు. తన శాపం తప్పదని, అయినా బలి చక్రవర్తి అంతటి వాడి కుమారుడు కాబట్టి సాహసికుడు వరాహకల్పంలో బృందావనం చెంత తాటి తోటలో శ్రీకృష్ణుడిని దర్శించి, ఆయనకు విరోధిగా కనిపించి, ఆయన చేతి సుదర్శన చక్రం వల్ల మరణం పొందుతాడని వివరించాడు. అప్పుడు గాడిద రూపం పోయి శ్రీకృష్ణుడిలో లీనమయ్యే అదృష్టాన్ని పొందుతాడని అన్నాడు. తిలోత్తమ బాణాసురుడికి ఉష అనే పేరుతో కుమార్తెగా జన్మించి కృష్ణుడి మనుమడైన అనిరుద్ధుడిని వివాహమాడి తర్వాత స్వర్గలోకానికి చేరగలదని అన్నాడు. కథా సందర్భంలో యువతకు చక్కటి సందేశం ఉన్నట్లు కనిపిస్తోంది. నేడూ కారణాంతరాలవల్లో, తెలిసో తెలియకో పెద్దల ముందు యువత తప్పుగా ప్రవర్తించడం తరచూ కనిపిస్తోంది. అలాకాక పెద్దల ముందు సరైన మార్గంలో ప్రవర్తించడం ఎంతైనా అవసరం. నిర్లజ్జ, అతివినయం, అవిధేయతలు ప్రమాద హేతువులే మరి.
                                                                                   డాక్టర్యల్లాప్రగడ మల్లికార్జునరావు (ఈనాడు)

ఇంకా చదవండి »

మంత్రం జపం




ఇంకా చదవండి »

తిధి - అధిపతులు




ఇంకా చదవండి »

Give Away



ఇంకా చదవండి »

జపవిధానము


జకారో జన్మవిచ్ఛేదః పకారః పాపనాశనః
జన్మచ్ఛేదకరో యస్మాత్ జపమిత్యభిదీయతే

అంతే జన్మరాహిత్యము, అతే పాపనాశనము. జపము అనగా పాపమును నశింపజేసి జన్మరాహిత్యమును అనుగ్రహించునది. కావున జపమును చేయునప్పుడు మంత్రమునందు మనస్సు నిల్పి, తద్భావమును మధ్య మధ్యలో ధ్యానించుట వలన భావపుష్టితో జపపుష్టి కలిగి తద్ద్వారా మంత్రసిద్ధి కలిగి సంపూర్ణ ఫలితము లభించును.

మననాత్ త్రాయతే ఇతి మంత్రః. మననము చేస్తే తరింపజేసేది మంత్రము. అటువంటి శక్తిపూరితమైన మంత్రాన్ని జప ప్రక్రియలో సాధన చేయటానికి కొన్ని ముఖ్యమైన విషయాలున్నాయి:

1. జపము మూడు విధాలుగా ఉండును - 1. వాచికము 2. ఉపాంశువు 3. మానసికము. బయటకు వినిపించునట్లుగా చెప్పుచూ చేయునది వాచికము. ఇతరులకు వినిపించకుండా పెదవులు కదులుతూ నాలుకతో జపించుటను ఉపాంశువు అంటారు. నాలుక, పెదవులు కదలకుండా లోలోపల చేసే జపమును మానసికము అందురు. వాచికము కంటే ఉపాంశువు శ్రేష్ఠము, దానికన్నా మానసికము మరింత శ్రేష్ఠము.

2. ప్రాతఃకాలములో చేతులు పైకెత్తి, మధ్యాహ్న కాలమో చక్కగా ఉంచి, సాయంకాలం క్రిందకు ఉంచి జపము చేయవలెను.

3. చందనముతో, అక్షతలతో, పుష్పములతో, ధాన్యముతో, చేతివ్రేళ్ల గణుపులతో లేదా మట్టితో జపాన్ని లెక్కించకూడదు. జపమాలతో, మిరియాలతో లెక్కించవచ్చు. శ్రేష్టమైనది లక్క, దర్భ, సింధూరము, ఎండిన ఆవుపేడ మిశ్రమంతో గోళీలు తయారు చేసి లెక్కించుట.

4. జపము చేయునప్పుడు జపమాలను బయటకు కనిపించకుండా అరచేతి చాటున లేదా ఒక వస్త్రముతోనైనా తప్పనిసరిగా కప్పి ఉంచవలెను. వస్త్రము తడిగా ఉండరాదు.

5. జపమాలను అనామిక (ఉంగరపు) వ్రేలిపైన ఉంచి బొటన వ్రేలితో స్పర్శించుచు మధ్య వ్రేలితో పూసలను తిప్పవలెను. చూపుడు వ్రేలును ఉపయోగించకూడదు.

6. జపము చేయునప్పుడు కదలుట, మెదలుట, మాట్లాడుట నిషిద్ధము. తప్పనిసరిగా మాట్లాడవలసినచో భగవంతుని క్షమాపణ భావంతో స్మరించి తిరిగి జపించవలెను.

7. అజాగ్రత్తవలన జపమాల కింద పడినచో నూట ఎనిమిది మార్లు ప్రత్యేకముగా జపించవలెను. కాలికి తగిలిన యెడల జలముతో కడిగి రెట్టింపు సంఖ్యతో (రెండు మాలలు) అదనముగా జపము చేయవలెను.

8. ఒకవేళ చేతి వ్రేళ్లతో జపము చేయవలసి వస్తే ఉంగరపు వ్రేలు మధ్య గణుపు మీద మొదలు పెట్టి, క్రింది గణుపు, తరువాత చిటికెన వ్రేలు మీద గణుపు, చిటికెన వ్రేలు, ఉంగరపు వ్రేలు, మధ్య వ్రేలు, చూపుడు వ్రేలు యొక్క మేరువులను తాకుతూ చూపుడు వ్రేలు గణుపులతో ముగించవలెను. మర్గాన్ని విలోమములో చేసి (చూపుడు వ్రేలు చివరి గణుపుతో మొదలు పెట్టి అప్రదక్షిణముగా ఉంగరపు వ్రేలి మధ్య గణుపులో) ముగించవలెను. చివరి ఎనిమిదికి ఉంగరపు వ్రేలు చివరి గణుపుతో మొదలుపెట్టి చూపుడు వ్రేలు మధ్య గణుపుతో ముగించవలెను. దీనిని కరమాల అందురు.(రెండవ చిత్రాన్ని చూడండి)

9. సంధ్యోపాసనలో చేసే గాయత్రీ మంత్ర జపానికి కరమాల శ్రేష్ఠం. ఇతర మంత్ర జపానికి రుద్రాక్షమాల శ్రేష్ఠం.


10. జపమును ముగించిన పిమ్మట కూర్చున్న ప్రదేశమునందు మట్టిని తీసికొని నుదుటిపై తిలకమును ధరించవలెను. లేనిచో జపఫలితమును మహేంద్రుడు గ్రహించును.

ఇంకా చదవండి »

షోడశ సంస్కారములు

చాలా సార్లు షోడశ సంస్కారములు అన్న పదాలు పండితులు వాడటం వినే ఉంటారు. అవి ఏమిటి? వాటి ఆంతర్యం ఏమిటి? చేయవలసిన పద్ధతి ఏమిటి? మొదలైన వివరాలు వ్యాసంలోవ్యాసుల వారు తమ స్మృతిలో పదహారు సంస్కారాలను:
ఆధానం పుంసవనం సీమంతోన్నయనం
జాతకర్మ నామకరణం అన్నప్రాశనం చౌలం ఉపనయనం
బ్రహ్మవ్రతం వేదవ్రతం సమావర్తనం ఉద్వాహః
అగ్న్యాధానం దీక్షా మహావ్రతం సన్న్యాసః

అని పేర్కొన్నారు. సంస్కారముల వలన కలిగెడి ఫలములన్నింటిని ప్రధానముగా మూడు భాగములుగా విభజించదగును. ఎట్లన,

1. దోష మార్జనములు
2. అతిశయాధానము
3. హీనాంగపూర్తి

కల్మష ప్రకృతి గల పదార్థమునైనను శుద్ధి పరచుటకు మూడు ఉపాయములు అవసరములగును.దీనికి సరైన ఉదాహరణ - గనిలోనుండి తీయబడిన లోహము చాలా మలినము కలిగి ఉండును. లోహముతో ఒక కత్తి చేయవలెననిన దానికి ముందు "దోష మార్జనము" చేయవలెను (అనగా దానికి ఉన్న మలినమును పోగొట్టి శుభ్ర పరచవలెను). తరువాత లోహమును అగ్ని యందు తగినంత కాల్చి కడ్డీగా చేసి పిమ్మట కత్తి రూపుగా మలచవలెను. దీనికే "అతిశయాధానము" అని పేరు. ప్రకారము సిద్ధము చేయబడిన తరువాత కట్టెతోనో, వెండితోనో, బంగారముతోనో కత్తికొక పిడిని కూర్చుట, దానిని సింగారించుటను "హీనాంగపూర్తి" అని వ్యవహరింతురు. అలాగే, ప్రత్తి చెట్టు వలన వచ్చిన కాయలను తొలుత దానిని కప్పియున్న మలినమును త్రోసివేసి దానియందలి ప్రత్తిని తీసి శుభ్ర పరచుట దోషమార్జనమనియు, దానినుండి దారము, ధోవతి, ఉత్తరీయము, చీర మొదలైనవి నేయుట అతిశయాధానము అని చొక్కాకు అందమైన అల్లికలు అల్లి, గుండీలు కుట్టి అలంకరించుటను హీనాంగపూర్తి యని చెప్పెదరు. పై దృష్టాంతములను బట్టి సంస్కార విషయములందు కొన్ని కర్మల (గర్భాధానము, జాతకర్మ, అన్నప్రాశన) వలన దోషమార్జనము, చూడాకరణము (చౌలము) వంటి కర్మలవలన అతిశయాధానము, వివాహము, అగ్న్యాధానము వంటి కర్మలవలన హీనాంగపూర్తి యగుచున్నదని గ్రహించవలెనుమరి సంస్కారముల/కర్మల వివరాలను తెలుసుకుందాము:

గర్భాదానము: 
సత్సంతానమునకు బీజముగా గర్భాదాన సంస్కారము. సంతానము మాత పితల యొక్క ఆత్మ, హృదయము మరియు శరీరము నుండి జనించుచున్నది గదా! అందువలన తల్లిదండ్రుల దేహము (స్థూల, సూక్ష్మ) లోని దోషములు బిడ్డకు సంక్రమించును. విషయానికై తల్లిదండ్రులు తమ గర్భగ్రహణ యోగ్యతను, ఉపయుక్త కాలమును నిర్ణయించుకొని సంతానకాలమందు మనశ్శరీరాదులయందు గల పశుభావనను తొలగించుకొని సాత్త్వికమగు దైవ భావము కలిగియుండుట కొరకే గర్భాదాన సంస్కారము విధింపబడినది. తల్లిదండ్రుల చిత్తవృత్తులు సంతానోత్పత్తి కాలములో ఎలా ఉంటాయో అటువంటి లక్షణాలు కలిగిన బిడ్డలే జన్మిస్తారు. కావున తల్లిదండ్రులు గర్భాదాన సమయమున తాము దేవతలమని, పతి ప్రజాపతి యొక్క అంశ గలవాడనియు, పత్ని వసుమతి రూపమనియు తలచి దేవతా చింతనము చేయుచు గర్భాదానము చేయవలెను.

ఓం పూషాం భగం సవితామే దదాతు
రుద్రః కల్పయతు లలామగుం
ఓం విష్ణుర్యోనిం కల్పయతు
త్వష్టారూపాణి పిగుంశతు
ఆసించతు ప్రజాపతిర్ధాతా
గర్భం దధాతు తే

అనగా పుష్టి కారకుడైన సూర్యుడు, రుద్రుడు యోనిని కల్పింతురు గాక. వ్యాపకుడైన విష్ణువు గర్భగ్రహణము గావించు స్థానము ఇచ్చుగాక. దేవశిల్పియగు త్వష్ట రూపమిశ్రము చేయుగాక. ప్రజాపతి సించనము (తడువుట) చేయుగాక. సృష్టికర్త గర్భమును సంఘటింప జేయుగాక.

ఇట్లు దంపతులు దేవ భావ యుక్తమై రమించినచో తప్పకుండా సంతానము సులక్షణములతో ధార్మికము కలది కాగలదు. ఇందులో అణుమాత్రము కూడా సందేహము లేదు.

పుంసవనము
ఇది మరియు సీమంతోన్నయనం గర్భాన్ని రక్షించుకొనుటకు చేసే సంస్కారములు. కావున రెండు గర్భా కాలమునందే చేయవలెను. పుంసవనము గర్భము ధరించిన మూడవ మాసములో మొదటి పదిరోజులలో చేయవలెను. కార్యక్రమములో మఱ్ఱిపండ్లను మినుములతో, యవలతో కలిపి గర్భిణికి వాసన చూపించెడి వ్యవస్థ యున్నది. దీనివలన యోనియందున్న దోషములు తొలగి గర్భరక్షణ శక్తి కలుగునని సుశ్రుతము మొదలగు ఆయుర్వేద శాస్త్రములందు చెప్పబడియున్నది. మోక్షమునకు ఉపయోగపడే ఉత్తమ స్థూల శరీరమును పొందు లక్ష్యముతోనే పుంసవన సంస్కారము నిర్ణయించబడినది.

సీమంతోన్నయనం 
ఇది గర్భాకాలమున ఆరవనెలన గాని, ఎనిమిదవ నెలనగాని జరుపవలెను (దేశకాలమానములు బట్టి ఇవి వేర్వేరుగా ఉండవచ్చును). ఇందులో మేడిపండ్లు, వనస్పతి మొదలగు శుభకరమైన పదార్థములను ఉపయోగించి భర్త భార్యను మేడిచెట్టువలె బలముగా నుండుమని, వనస్పతివలె సంతాన సంపదను పొందుమని అర్థం వచ్చే మంత్రములను వినిపించును. అలాగే, ప్రజాపతి అదితికి సీమంతోన్నయనము చేసినట్లు నీకు కూడా సీమంతోన్నయనము చేసి, పుత్రపౌత్రాభివృద్ధి కలిగి, వృద్ధాప్యము వరకు దీర్ఘజీవిని చేసెదను అని ఇంకొక మంత్రము పలుకును. అటు తర్వాత భర్త దేవతలను ప్రార్థించి గర్భదోషములు తొలగింజేయు, భవిష్యత్త్ సంతాన కళ్యాణమునకై గర్భపోషణ చేసెడి నేతితో చరుపాక ప్రదర్శనము మొదలగు క్రియలను చేయును.

కాబట్టి సీమంతమనగా మనము చేసుకునే వేడుక గాదు. తల్లి, అత్తగారు, భర్త, శ్రేయోభిలాషులతో సంతోషముగా, ముత్తైదువుల ఆశీర్వాదము పొందుట మహిళకైనా మంచిదే. కానీ, దాని పేరిట పైన చెప్పిన సీమంత ప్రక్రియను చేయకుండుట శాస్త్ర సమ్మతము కాదు

జాతకర్మ: 
ఇది శిశువు భూమి మీదకు వచ్చినంతనే కావింపబడునది. ఇందు తొలుత తండ్రి యవపు పిండి, బియ్యపు పిండి తరువాత బంగారముతో రుద్దబడిన తేనెను, నెయ్యిను అప్పుడే పుట్టిన బిడ్డ యొక్క నాలుకకు తాకించవలెను. సమయమున తండ్రి - " యన్నమే ప్రజ్ఞ, ఇదియే ఆయువు, ఇదియే అమృతము. ఇవన్నియు నీకు ప్రాప్తించును గాక. మిత్రావరుణులు, అశ్వినీదేవతలు, బృహస్పతి నీకు మేధనొసగు గాక" అన్న అర్థము గల మంత్రము పఠించును. భూమిపైకి వచ్చెడి తరుణమునందు మిక్కిలి కష్టము గలుగుట వలనను, మహామాయామోహము ఆవరించుటవలనను శిశువు స్మృతి కోల్పోవును. అట్టి స్మృతిని తిరిగి కలిగించుటకే మేధాశక్తిని కలిగించే ప్రక్రియ చేయబడును. మొత్తం మీద జాతకర్మ వలన ఉపపాతకములు (తల్లిదండ్రుల శరీరములనుండి ఆపాదించిన దోషములు) నశించి తీరును.

ప్రక్రియలో వాడబడిన వస్తు గుణములు:
అన్నము శరీరరక్షణకు మూలము. సువర్ణము వలన వాతదోషమును శాంతింపజేయును. మూత్రమును సరాసరి వెడలించును. రక్తపోటును సరిజేయును. నెయ్యి శరీరమందు ఉష్ణమును కలిగించును, పుష్టిని కలిగించును, హాయిగా విరేచనము కలుగజేయును. తేనె ముఖమునకు కాంతిని కలుగజేయును, పిత్తకోశ క్రియను వృద్ధి పరచును, కఫ దోషమును తొలగించును.ఇవన్నీ నూతన శిశువు ప్రాణరక్షణకు అత్యంత అవశ్యకమే

నామకరణము: 
బిడ్ద జన్మించి పదిరాత్రులైన తరువాత సంస్కారము జరుపబడుతుంది. (పది దినములు ఎందుకంటే చాలా మటుకు పుట్టిన బిడ్డల మరణాలు పదిరోజులలోపే జరుగుతాయి, కాబట్టి వాటిని అధిగమించిన బిడ్డలకు చేయవలసిన సంస్కారము). నామకరణ సంస్కారమందు శిశువు జననకాల గ్రహ నక్షత్రములను, దేవతాదులనుద్దేశించి పూజా జప హోమ దానములు చేసి శిశువునకు పేరు పెట్టుట తండ్రి విధి. సంస్కార సమయములో మంత్రము ద్వారా శిశువు ఆత్మకు అమృతత్వము ప్రతిపాదించి బిడ్డకు దీర్ఘాయువు కలుగునట్లు ప్రార్థన జరుపబడును. నామముతో భావమునకు కల సంబంధము వలన, తన జాతి, వర్ణమునకు చెందిన ఉన్నతాశయ లాభమును పొందుచున్నాడు. నామము ద్వారా అమృతంబగు బ్రహ్మముతో సంబంధము ఏర్పరుచుకొనుట, శతాయువు కొరకు ప్రార్థించుట, అంతఃకరణమునకు బలవృద్ధి, మరియు ఆయుర్వృద్ధి కలిగించుకొనుట సంస్కారం యొక్క ఉద్దేశం.

అన్నప్రాశనము: 
పుత్రికయైన ఐదవ నెలలో లేక ఏడవ నెలలో, పుత్రుడైతే ఆరవ నెలలో లేదా ఎనిమిదవ నెలలో సంస్కారమును చేయవలెను. దీనివలన తిన దగిన ఆహారములు నిర్దిష్టమగుట చేత అన్నమందలి సంకరదోషము నిరాకరించబడుతున్నది. సుముహూర్తములో తండ్రి బిడ్డను తన ఒడిలో యుంచుకొని, భార్య ఎడమ పక్క కూర్చొని యుండగా మంత్రము పఠించుచు, హోమము తరువాత అన్నము నోటిలో యుంచవలెను. అన్నమే సమస్త జీవరక్షణము. అన్నమునకు పతి సూర్యదేవుడు. సూర్యుడు అన్నమును, శుభమును బిడ్డకు ఇచ్చు గాక అనే అర్థము కలిగిన మంత్రము పఠించబడును. సంస్కారము వలన బిడ్డకు మాతృగర్భమున మాలిన్యము తినుటవలన కలిగిన దోషము తొలగి శరీరము నిర్మలమగును. పరబ్రహ్మ స్వరూపమని చెప్పబడిన అన్నము ప్రాశనము చేయించుట వలన శిశువుకు బలము, ఆయువు, అంతఃకరణ శుద్ధి స్థాపన కలిగి, బ్రహ్మ భావోద్బోధన జనించును.

కాబట్టి, అసలైన కార్యక్రమం మంత్రోక్తంగా బిడ్డకు అన్నము పెట్టటం. మనం ఆర్భాటంగా జరుపుకునే - బిడ్డను పడుకోబెట్టి పారాడి వస్తువును అందుకునే కార్యక్రమం ఒక వేడుక మాత్రమే.

చౌలము: 

సప్తమ సంస్కారమును చౌలము లేక చూడాకరణమని యందురు. ఇది బిడ్డకు మూడవయేడు వచ్చిన పిదప చేయుదురు. ఇందులో బిడ్డ యొక్క తలవెంట్రుకలు తీసివేయుట ప్రధాన క్రియ. శిశువునకు గర్భమునందు కలిగిన కేశములను తొలగించి చూడాకరణమొనర్చి దీనిద్వారా శిక్షయు, సంస్కారయోగ్యతయు కలిగింపబడును. కావున, బిడ్డకు అపాత్రతా దోషము నిరాకరించబడును. వృద్ధి శ్రాద్ధము, హోమము జరిగిన పిమ్మట సూర్యుని ప్రార్థించుచు, "సూర్యుడు దేనితో బృహస్పతికి కేశఖండనమొనర్చెనో, దేనితో వాయుదేవుడు ఇంద్రునకు కేశఖండనము చేసెనో, అట్టి బ్రహ్మరూపి యగు కత్తి ద్వారా నేను నీకు కేశఖండనము చేయుచున్నాను. నీకు ఆయుస్తేజోబలాభివృద్ధులు కలుగుగాక!" అన్న అర్థము గల మంత్రములు పఠించబడును. చూడాకరణమందు శిఖ మాత్రముంచి మిగిలిన కేశములు తొలగించాలి. కేశములు బలమునకు మూలం. అవి పూర్తిగా తొలగించుట వలన మనిషి బలహీనుడగును. శిఖతో పురుషునకు బలము, వీర్యము, స్థైర్యము, ఆధ్యాత్మికోన్నతికి చెప్పనలవి కాని సంబంధము ఉన్నందు వలన శిఖధారణము హిందువుల జాతీయ చిహ్నముగా పరిగణించబడినది. చూడాకరణము జాతీయ చిహ్నమునకు మొదటి సన్నివేశమగును.

ఇంకా చదవండి »