• విష్ణుషట్పదీ స్తోత్రం

    నారాయణ నారాయణ జయ గోవింద హరే |నారాయణ నారాయణ జయ గోపాల హరే ||

  • శ్రీ రామ

    ఆపదం అపహర్థారమ్ దాతారం సర్వ సంపదం, లోకాభి రామం శ్రీ రామం భూయో భూయో నమామ్యహమ్I

  • శ్రీ సీతామాత

    త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ, హనుమాన్ యత్న మాస్తాయ దు:ఖ: క్షయ కరోభవ

  • ఓం నమ:శివాయ:

    చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర పాహిమామ్ , చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర రక్షమామ్ I

  • శ్రీమాత్రే నమః

    అమ్మల గన్న యమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాల పెద్దమ్మ, సురారులమ్మ కడుపారడి పుచ్చిన యమ్మ, తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ మాయమ్మ కృపాబ్ధి నిచ్చుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్

  • శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు

    పురుషోవిష్ణు రిత్యుక్తః శివోనానామతః స్మృతః I అవ్యక్తం తు ఉమాదేవీ శ్రీర్వా పద్మ నిభేక్షణా I తత్ సంయోగా దహంకారః స చ సేనాపతిరుహః I

దేవాలయాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

ఆనంద వల్లి - కోటప్పకొండ

ఎల్లమందకు దగ్గరలో నందిపాడు అనే ఒక ఊరిలో మరొక గోపకాంత ఉన్నది. వీరి కులవృత్తి గోవులను కాచుకోవడం. ఆమె చిన్నప్పటి నుంచి ఈ క్షేత్రంలో తిరగడం వల్ల శివుడిపై మమకారం. వాళ్ళ అమ్మా నాన్న చేసిన మంచి పని ఏమిటంటే ప్రొద్దున్నే పాలు పితికి ఈ పాలు తీసుకెళ్ళి శివుడికి ఇచ్చి రావే అనే వాళ్ళుట. ఆ పాలతో శివాలయంలో శివుడికి అభిషేకం చేసుకొని వచ్చేది ఆమె. ఇది ఆవిడ పని. అలా చేయగా చేయగా ఆయన మీద ప్రేమ పెరిగిపోయింది. శివుడు తప్ప మరొకటి లేదు అనే స్థితికి ఆవిడ వెళ్ళిపోయింది. క్రమంగా ఆమెకు యుక్త వయస్సు వచ్చింది. ఆమె పేరు ఆనంద వల్లి. చక్కని భక్తి ప్రపత్తులు, వినయ సంపద, సౌందర్యము, అన్నీ కలిగిన పిల్ల. పైగా సామాన్య కుటుంబంలో అంత శోభాయమానంగా ఉంటూ అంత సంస్కారంగా ఉన్న వాళ్లు అరుదు. 

అందుకు తల్లిదండ్రులకు మరింత మురిపెం. ఊళ్ళో ఎవరు చూసినా ఈమె సంస్కారానికి సంతోషించి దీవించేవారట. ఇలా చేస్తూ ఉండగా శివుడికి ఎంత ప్రేమ పుట్టేసిందో! ఊళ్ళో వాళ్ళు అమ్మాయికి పెళ్లి చేయరా అంటే అమ్మా నీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం అన్నారు తల్లిదండ్రులు. అప్పుడు ఆమె నేను ఎవరినీ నావాడు అనుకోలేదు. ఆయనే నావాడు అనుకుంది పరమశివుని. అలాగని ఆయననే పెళ్లి చేసుకుంటాను వంటి భావాలు కూడా లేవు. ఆయన ఎప్పుడూ కావాలి ఇదొక్కటే. అయితే అమ్మా! పెళ్లి చేసుకున్నంత మాత్రాన నీ భక్తికి అవరోధం ఏమిటి చెప్పు. పెద్దలం చెప్తున్నాం. అయిన సంబంధం ఒకటి ఉన్నది. మేనత్త కొడుకు ఉన్నాడు. పేరు సుందరయ్య. నీకిచ్చి వివాహం చేస్తాం. అని నిర్ణయించారు, పెళ్లి అయిపొయింది. పేర్లు కూడా ఎలా కలిశాయో చూడండి - ఈయన అందం, ఆవిడ ఆనందం. వాడూ చాలా యోగ్యుడే. ఇద్దరూ వచ్చి క్షీరాభిషేకం చేసి ఇద్దరూ కలిసి వెళ్లి ఆవులను కాచుకోనేవారట. కొన్నాళ్ళకి ఈమె గర్భవతి అయింది. అయినా దీక్ష మానలేదు. కొంతకాలానికి నిండు చూలాలు అయింది. ఆ సమయంలో కొండ ఎక్కడం చాలా బాధ వేసిందిట. ఆ పాలు పట్టుకొని గట్టుమీద ఆమె సేద తీరుతూ ఉంటే కాకి వచ్చి పాలకుండని కాలితో తన్నింది. వెంటనే దిక్కుమాలిన కాకి పాలను పారపోసింది అనుకోని ఈ చోటుకి కాకి అనేది రాకూడదు అనుకుందిట. అది శాపమైపోయింది. ఇప్పటికీ ఆ చోటులో ఒక్క కాకీ కనపడదు. కథకీ, దీనికీ ప్రబల సాక్ష్యం. ఇలాంటివి బోలెడు భారతదేశంలో. ఋషి వాక్కులా అయిపొయింది. అందుకే భక్తి ఎంత బలాన్ని అయినా ఇస్తుంది.ఎవరు సర్వ సమర్థుడో వాడిని మనస్సులో పెట్టుకున్న వాడు ఆడిన మాట కూడా సర్వ సమర్థమ్ అవుతుంది. ఎవడు సత్య స్వరూపుడో వాడిని మనస్సులో పెట్టుకున్న వాడు ఆడిన మాట కూడా సత్యం అయిపోతుంది. వాసన కలిగిన కర్పూరాన్ని చేతితో పట్టుకుంటే మన చెయ్యి కూడా కర్పూరపు వాసనే వస్తుంది. మనలో భగవంతుణ్ణి పెట్టుకుంటే మననుంచి భగవంతుని ప్రకాశమే వస్తుంది. సహజం కదా! అలా అని గర్వించలేదు ఆ తల్లి. రేపో మాపో ప్రసవిస్తాను అని అంటున్నారు. నాకు ఓపిక లేదు. నువ్వే కిందికి రాకూడదూ! అన్నదిట. 

మా శివుడు మాశివుడు అని చూసింది. అలా ఎలా ప్రేమగా ఎవరు చూస్తారో వాడు దేనిలో చూస్తాడో దానిలో కూర్చుంటాడు ఆయన. నువ్వు పిలిస్తే రానా? ఇంతకాలం నువ్వు పిలవలేదు, నువ్వు వెళ్తూ ఉండు నీ వెనక వస్తాను, అయితే ఎప్పుడూ వెనక్కి తిరిగి చూడకు సుమా! అన్నాడు. వెనక్కి తిరిగి చూడడమంటే డౌటేగా. ఇలాంటివి ఎన్నో భారతదేశంలో అయితే ఒకరిని చూసి ఒకరు కాపీ కొట్టారు అనుకోవద్దు. ఎన్నో బ్రతుకులు ఉంటాయి ఒకే లాంటివి. ఒకేలాంటివి చాలామందికి జరుగుతూ ఉంటాయి.వెనక్కి తిరిగి చూడకు అని అనడంలో అంతరార్థం మన మానాన భగవంతుడు ఉన్నాడు అనే ధైర్యంతో వెళుతూ నిజంగా ఉన్నాడో లేడో అని డౌట్ పడకు. అదీ ఇందులోని భావం. సందేహించకు భగవంతుడి గురించి ఎప్పుడూ కూడా. నువ్వు అనుకుంటావు ఇలా ఉంటే బాగుంటుంది అని. ఇంకా బాగుండలేదు అంటే ఆయన ఉన్నాడో లేడో అని డౌట్. కొంత దూరం వెళ్ళేసరికి సందడి ఎక్కువ కనిపిస్తోందిట. మరి ఆయన వస్తే సందడి ఉండక ఏం అవుతుంది? మన ఊర్లో ఉన్న వార్డు మెంబరు బయలుదేరితేనే వాడి వెనకాల పొలోమని పటాలం బయలుదేరుతుందే! అలాంటిది జగదీశ్వరుడు. ఆయన బయలుదేరితే పటాలం బయలుదేరదూహరి అరవింద సూతి మునులష్ట దిశాపతులాదిగా వియచ్చరులిరువంకలన్ గొలువహరి అరవింద సూతి మునులష్ట దిశాపతులాదిగా - ఆయన కదిలితే అందరూ కడులుతారుట. అందుకే కృష్ణుడు చెప్తున్నాడు బ్రహ్మ వైవర్త పురాణంలో. ఏమని అంటే ఎవరు మహాదేవ! మహాదేవ! మహాదేవ! అని అంటారో వారి వెనకాల శివుడు పరుగెడతాడట. ఎలా అంటే దూడ వెంట ఆవు వలె అన్నారు. "వత్సం గౌరివ గౌరీశో ధావంత మనుధావతి". ఆయన పరుగెడుతూ ఉంటాడు ఎలాగూ గౌరీ సమేతుడై. 

ఎందుకంటే ఆవిడని వదిలిపెట్టి ఆవిడ ఉండదు. "తన వెంటన్ సిరి, లచ్చి వెంట నవరోధవ్రాతమున్" - హరి కదిలితే సిరి కదిలింది, శివుడు కదిలితే గౌరీ కదిలింది. ఎప్పుడైతే పార్వతీ పరమేశ్వరులు కదిల్తే వాళ్ళని వదలలేక లక్ష్మీ సమేతుడనై నేను కదులుతాను అని కృష్ణుడు చెప్తున్నాడు నారదుడితో ఈమాట బ్రహ్మ వైవర్త పురాణంలో. మేమిద్దరం కదిలితే మమ్మల్ని వదలలేక దేవతలంతా కదిలిపోతారు. కనుక మహాదేవ! అనే వాడి వెనకాల ఇంత బలం, బలగం ఉంటుంది. మరి ఆయన వస్తుంటే ఎంత ఆచి తూచి అడుగులు వేస్తున్నా సందడి వినపడుతోంది. ఆ సందడికి ఆశ్చర్య చకితురాలై ఆమె వెనక్కి తిరిగి చూసిందిట.నేను మాటకి కట్టుబడతా. మరింక కిందికి దిగను. ఇక్కడే ఉండి పోతాను అన్నాడు శివుడు. నువ్వు కిందికి దిగకపోతే నేనూ దిగను అని ఆవిడ పట్టుబట్టింది. నువ్వు ఎక్కడుంటే నా బ్రతుకు అక్కడే. 

కొంతమంది ఈ ప్రపంచం అంతా వేస్ట్ అని కన్ఫర్మ్ చేసుకొని భగవంతుడే గొప్పవాడు అని అటు వెళ్తారు. అయితే ఇది వేస్ట్ అని తేలేలోపల బ్రతుకు అయిపోతుంది. వీళ్ళకి ఏ జన్మ సంస్కారాల వల్లో ఆయన పట్టేస్తాడు. ఆయన పట్టేస్తే మరి ఇటు చూపు రాదు. నిరంతరం సూర్యుడిని చూసే వారికి దీపం వెలిగించుకోవాలి అని బుద్ధి పుట్టదు. వాడు చూస్తున్నది మహాకాంతిని. వాళ్ళయొక్క స్థితి ఇలా ఉంటుంది. ఇలా పరమాత్మను చూస్తూ పరవశించి పోతూ ఉంటారు. ఇప్పడు ఆవిడ అక్కడ కూర్చుందిట. ఆ స్థితి ఎలాంటిది అంటే నెలలునిండి పోయాయి. అక్కడే ప్రసవించింది. అప్పటికైనా పిల్లవాడిని చూసుకొని వెళ్ళచ్చుగా. అప్పటికీ కదలలేదట ఆవిడ. అప్పుడు పరమాత్మ అమ్మా! రా అన్నాడు. శివజ్యోతిలో పుట్టిన బిడ్డతో సహా లీనమైపోయింది ఆ తల్లి. అలా లీనం చేసుకున్నాడు ఆ పరమాత్మ. ఒకప్పుడు సాలంకయ్య ఇంటికి వచ్చి భోజనం చేసి ఆయనను అనుగ్రహించి వెలిసి ఇక్కడ ఉండిపోయాను. నీకోసం ఇప్పుడు కొంచెం క్రిందికి దిగి ఉన్నాను. 

అయితే నన్ను చూడాలంటే ముందు నిన్ను చూస్తే గానీ నన్ను చూసి ప్రయోజనం లేదు. కనుక అందరూ నిన్ను చూసేలా చేయాలి అన్నాడు. ఈ వార్త ఆనోటా ఈనోటా పాకి ఇప్పటికీ ఆ తల్లి పేరున ఒక ఆలయం ఉంది. ఆనందవల్లి ఆలయం. ఆ తల్లికి నమస్కారం చేసుకొని తర్వాత శివుడిని చూడాలిట. ఇంతవరకు చెప్పుకున్న శివక్షేత్రం నరసరావు పేట దగ్గరున్న కోటప్పకొండ. దీనిని బట్టి చూస్తే ఒక్క క్షేత్రాన్ని కదిలిస్తే ఎన్ని కథలు మనకి. అందుకే మన ధర్మం పుస్తకాలలో కూర్చోలేదు. మన క్షేత్రాలలో పండింది. దేవుడిని తీసుకొచ్చి కూర్చోబెట్టాం మనం. కనుక భగవంతుడు గొప్పవాడు అని పుస్తకాలు చూసి చెప్పక్కరలేదు. భక్తుల కథలు చూసి చెప్పుకోవచ్చు. వాటికి తార్కాణంగా క్షేత్రాలున్నాయి. మహాక్షేత్రం ఇది. దాని పేరు త్రికూటాద్రి. బ్రహ్మవిష్ణు రుద్రాత్మకుడైన పరమాత్ముడున్నాడు. వీరిని అనుగ్రహించినటువంటి ఆ దైవం దక్షిణామూర్తి. దక్షిణామూర్తి అంటే మోక్ష ప్రదాత. నేరుగా మోక్షాన్నిస్తాడు. లయం చేసుకున్నాడు. నేరుగా లాక్కునే మూర్తులలో దక్షిణామూర్తి, నటరాజు వీళ్ళిద్దరుంటారు. దక్షిణామూర్తి క్షేత్రాలలో ఇటువంటి ప్రత్యేకత ఉన్నది.

ఇంకా చదవండి »

భద్రాద్రి రాముడు

ఈ శ్రీరామ నవమికి సరిగ్గా 360 సంవత్సరాల క్రితం ఇదే నందన నామ సంవత్సర చైత్ర శుద్ధ నవమి ఆదివారం నాడే రామదాసు ఈ ఆలయానికి దేవ, బ్రాహ్మణ వత్తులు నిలిపి, శ్రీహరి సన్నిధిన జరిగే ఉత్సవ ప్రకరణముల వివరణములతో దేవాలయ ఆవరణలో రామస్తంభం అనే పేర శిలాశాసనాన్ని వేయించాడు. అయితే, క్రీ.శ.1769లో ధంసా అనే బిరుదున్న ముస్లిం నాయకుడు తన సేనలతో భద్రాచల రామాలయాన్ని ధ్వంసం చేసి దోచుకున్నాడు. రామస్తంభ శాసనాన్ని కూడా ఎవరో విరగ్గొట్టారు. అదే శాసనాన్ని 180 సంవత్సరాల తర్వాత నాటి నిజాం నవాబు ప్రధాని చందూలాల్ ప్రోద్బలంతో ఇప్పటికి (సరిగ్గా 180 సంవత్సరాల కిందట) మళ్లీ రాజా తూము లక్ష్మీనరసింహదాసు, వరద రామదాసు నకీ.శ.1832లో) చెక్కించి నిలిపారు. ఆ శాసనాన్ని భక్తులు ఇప్పుడు భద్రాచలం ఆలయ ఆవరణలోనే ప్రధానాలయం వెనుక చూడవచ్చు. భక్తులు సులభంగా అర్థం చేసుకోవడానికి వీలుగా ఆ శాసన పాఠాన్ని యధాతథంగా ఇప్పుడు మనకు అర్థమయ్యే అక్షరాలలో అందిస్తున్నాను. 

స్వస్తిశ్రీ విజయాభ్యుదయ శాలివాహన శక వర్షంబులు 1574 అగు నేటి వర్తమాన వ్యావహారిక చాంద్రమాన నందన నామ సంవత్సర చైత్ర శుద్ధ భానువారం శ్రీ భద్రాచల సీతారామచంద్ర మహా ప్రభువు వారి సన్నిధాన శ్రీరామదాసు గారు శ్రీ తానీషా గారి అనుమతం వెంబడిన జరిగించిన దేవ బ్రాహ్మణ వత్తులు శ్రీవారి సన్నిధాన జర్గే ఉత్సవ ప్రకరణములు రాసివున్న శాసనం ధంసా ప్రపంచంలో శ్రీవారు పోలవరం వలస వేంచేసినప్పుడు వక దుర్మార్గుడు శాసనం చెక్కి వేసినందున సర్వజనులకు తెలిసి సంతోషించేటందుకు లేకపోగా దుర్మార్గుడు పుత్ర మిత్ర కళత్రాదులతోటి నశించిపోయినాడు.


తదనంతరం శాలివాహన శక వర్షంబులు అగు నేటి 1754 నందన నామ సంవత్సర చైత్ర శు 9 ఇందువారం భద్రగిరి రామదాసు అనే రామదాసు హంశను జన్మించిన భక్తుడు కంచీ నగరం నుంచి శ్రీ భద్రాద్రికి వచ్చి తనకు తన భార్యకు గల సకల ఆభరణములు ధనము శ్రీవారికి అర్పణ చేసి ఆయన తల్లి అయిన రంగమ్మ అనే మభాగ్యవతి అనుమతం వెంబడి ఆత్మ కుటుంబంతో కూడా హరిదాసులై స్త్రీలు సమ్మార్జన కయింకర్యమున్నూ పురుషుడు భజెన మొదలయిన సేవాదులున్నూ జర్గిస్తుండగా శ్రీవారు నాసరుద్దవులా వారి నవాబుగిరిలో చందూలాల్ అనే భగవదంశ సంభూతుడ్కి స్వప్నమందు దర్శనం కపచేసి వరద మొహరుతోటి వరద రామదాసు అనిన్ని హసనబాదు పరగణా శ్రీవారి మొహరుతోటి వరద రామదాసు దస్కతుతోటి అమలు జరిగించవలసిందనిన్ని, అదివరకు దుర్మార్గులు ప్రపంచ పరిపాలన చేసులచాతను దేవ బ్రాహ్మణ వత్తులు నిరాటంకంగా జరగటం లేనందున అవి విమర్శగా జరిగించవలసినదనిన్ని ఆజ్ఞ యిచ్చినందున చందూలాల్ అనే భగవదంశ సంభూతుడు అతి భక్తియుక్తుడై భగవదాజ్ఞ ప్రకారం దేవ బ్రాహ్మణుల ఆగ్రహారాలు, వత్తులు రుస్ములు మొదలయినవిగాను అమాని గ్రామాదులు 55 సరబస్తాలు 11 సాయరున్ను శివాయ బాపతులతో కూడ 71 డెబ్బయి వక్క వెయ్యి చలామణీ రూపాయీల్కు హసనాబాదా పరగణా రకం మేరుపరిశి అంద్కుగా 32 వేలు సర్కారుకు నగదు చెల్లించె లాగున్నూ 100 జనం శిబ్బంది తోపు శ్రీవారి సన్నిధిలో తయినాతీ వుండేలాగున్నూ వారికి 8000 రూపాయలు ప్రతి సంవత్సరం జీతాలు యిచ్చే లాగునను 18500 శ్రీవారి కైంకర్యము క్రింద జరిగేటట్టున్ను, 12500 సాదరు శిబ్బంది దరబారు వ్యయం నిమిత్తం గాను నిర్ణయం చేసి అమలు వరద రామదాసు పరం చేసినారు. గనుక భవదనుగ్రహపాత్రుడైన రాజా తూము లక్ష్మీ నరసింహ దాసున్ను, వరద రామదాసున్ను శ్రీహరి ప్రేరణ వెంబడి హసనాబాదా పరగణాలో వుండే దేవ బ్రాహ్మణ వత్తులు అగ్రహారములు విమర్శించి సర్వదుంబాలా జర్గలందులకు యేరుపాటు చేశిన వివరం.

ఇంకా చదవండి »

దేవాలయం అంటే -2

ఇసుకతో కూడుకొన్న భూమి అనువైనదిబురదగానున్న భూమినిస్మశాన భూమిని పరిత్యజించాలి. దేవాలయ నిర్మాణానికి ఉపకరించే రాయి. రప్పశిలలోహం ఇత్యాదులు మనుష్యరూపాన్ని నిర్మించే అస్తిపంజరాన్ని పోలి ఉంటాయి. ఈ శరీరానికెలా అలంకార ప్రాయంగా వస్థాభరణాలు అవసరమోఆలయానికివిగ్రహానికి కూడ అలంకార ప్రాయమైన రచన అంతే అవసరం.ఆలయానికి అనువైన ప్రదేశాన్ని ఎంపిక చేసుకొన్న తర్వాత ఆలయ నిర్మాణం ఆరంభమవుతుంది. దేవాలయ నిర్మాణంలో అతి ముఖ్యమైన అంశం వాస్తు పురుష మండలాన్ని రచించడం. 

వాస్తు పురుషుడి చిత్రాన్ని వ్రాసి పూజించడంవల్లఆ పురుషుడు మరియు అతనితో ఉన్న దేవతలు అక్కడె నెలకొని ఆలయ నిర్మాణ కార్యాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తారట. భూమిని 81 లేక 64 చతురస్రాకార విభాగాలుగా విభజించి మధ్యలో స్తంభాన్ని కానిఅగ్నిని కాని స్తాపించిపూజ చేస్తారు. మధ్యలో ఉన్న ఈ చదరాన్ని బ్రహ్మస్థాన మంటారు. ఒక్కొక్క చతురస్రాకార విభాగంలోను ఒక్కొక్క దేవతను ఆవాహన చేస్తారు. మధ్యనున్న చద రమే వాస్తు యొక్క కేంద్ర స్థానం. ఇక్కడే వాస్తు పురుషుడుంటాడు. వాస్తుపురుషమండలాన్ని స్థాపించిన తర్వాత గర్భన్యాస” మనే విధిని మానవుల్లో గర్భాదానా” నికి  సమానంగా పూర్వులు విధించారు. 

భూమాత – అనుగ్రహం కోసం ఈ కర్మను ఆచరిస్తారు. గర్భగృహ ద్వారం వచ్చే ప్రదేశానికి వెనుక నిర్దిష్టస్థానంలో 25 చతురస్రాకార పల్లలు (తగ్గులు) ఉన్న రాగిపాత్రలో వివిధ శాస్త్ర సమ్మతాలైన వస్తువులను నేలలో పుడ్చడమే గర్భన్యాస కర్మం. నిర్మాణానికి ఉపయోగపడే వస్తోపకరణాలకు పూజ జరిగిన అనంతరం నిర్మాణ కార్యక్రమం సాగుతుంది.దేవాలయ ప్రధాన భగాలుదేవాలయంలో ప్రధాన భాగం చతురస్రాకారంలో ఉన్న గర్భ గృహం” లేదా గర్భగుడి” ఇది దేవాలయానికి హృదయంలాంటిది. 

మనుష్య శరీరంలో ఆత్మ దాగి ఉన్నట్టుగాదేవాలయంలో భగవంతుదు కూడ మానవుడికి అత్యంత సులభంగా దృగ్గోచరం కాకుండేతట్టుగా గర్భగృహం” లో ఆవాసస్థానం పొంది ఉన్నాడు. ఇదే మూలవిగ్రహం” లేదా మూలబేరం” అనబడుతోంది. గర్భగృహంలో ప్రవేశద్వారం తప్పితే మరి ఎలాంటి కిటికీలు కానీ ఉండవు. సాధారాణంగా చీకటి అలుముకొని ఉంటుంది. ఈ చీకటి భక్తుణ్ణి విగ్రహం మీదికి దృష్టిని కేంద్రికరింపచేస్తుంది. 

ఈ లోకాన్ని  మరచి తన్మయత్వాన్ని పొందుతాడు భక్తుడు. తనకు తెలీయనటువంటి అనుభూతిని పొందుతాడు. భక్తుడికి భగవదాకర్హణసంపర్కంఆశీస్సులు ఇక్కడే లభిస్తాయి. భక్తుడు తనలో దైవాన్నిసత్యాన్ని చూస్తాడు.గర్భగృహం పైభాగంలో గోపురం ఉంటుంది. దీన్నే విమానం అంటారు.. ఇదే దేవాలయ వైభవానికి నిదర్శనం. ఇది సాధారణంగా పోతపోసిన విగ్ర్హాలతో అలంకరించబడిఉంటుంది. విమానంమీద శిఖరం ఉంటుంది. శిఖ వున్నది శిఖరం. దాని మీద కలశం వుంటుంది. గర్భగృహంచుట్టు భక్తులు గుడి తిరగడానికి ప్రదక్షిణాపథం” ఉంటుంది. వేసర పద్ధతిలో నిర్మించబడ్డ ఆలయాల్లో ఇది సాధారణంగా ఉండదని అంటారు.గర్భగృహం ముందు భాగంలో ముఖమంటపం” వుంటుంది. దీన్నే అర్ధమంటపం” అని శుకనాసి” అనీ అంటారు. ఇది చతుస్రాకారంలో కానీదీర్ఘ చతుస్రాకారంలో కానీ ఉండి ప్రక్కలలో గోపురం కానీశిఖరం కానీ కలిగి ఉంటుంది. గర్భగృహం ముఖమంటపాలను మహామంటపానికి (హాలు) కలిపే చిన్నమార్గాన్ని అంతరాలం” అంటారు. కొన్ని ఆలయాల్లో ముఖమంటంపమే అంతరాళంగా ఉంతుంది. 

మహామంటపాన్ని నృత్తమంటపం” లేదా నవరంగ” అని కూడ అంటారు. అర్థ మంటపం ప్రవేశ ద్వారాల్లో ఇరువైపులా ద్వారపాలకులు ఉంటారు. గర్భగృహం లేదా అంతరాళం లేదా మంటపం ముందుభాగంలో ద్వజస్తంభం ఉంటుంది. దానిమీద వున్న లాంఛనం మూలదేవత వాహనం.ద్వజస్తంభం సమీపంలో దేవుడి పాదచిహ్నం లేదా పద్మం వున్నబలిపీఠం ఉంటుంది. బలిపీఠమ్మీద పరివార దేవతలకు బలి అన్నం పెడతారు. బలిపీఠానికి ఎదురుగా దీపస్తంభం వుంటుంది.సాధారణంగాదేవాలయం ప్రాకారపు గోడలతో చుట్టబడి ఉంటుంది. దీనికి ప్రధానద్వారంతక్కిన మూడు ద్వారాలు ఉంటాయి.

ఈ ద్వరాలమీద ఆకాశాననంటే గోపురాలు ఆకర్షణీయంగా ఉంటాయి. ముఖ్యంగా ప్రాకారం మహద్వారం మీదన్న గోపురాలు అనేక అంతస్తులను కలిగి కళాత్మకంగా ఉంటాయి. కొన్ని దేవాలాయలో 23ప్రాకారాలు కూడా ఉంటాయి. ప్రాకారం లోపల ప్రధానాలయంతో పాటు మరికొన్ని చిన్న చిన్న మందిరాలు కూడ ఉంటాయి. కళ్యాణమంటపంయోగశాలపాకశాలస్వామిపుష్కరిణిఉత్సవమూర్తుల నుంచే గది ఇత్యాదులు సర్వసాధారణంగా ఉంటాయి.సాధారణంగా శివాలయం పట్టణానికి ఈశాన్య దిశలోనువిష్ణ్యాలయం పశ్చిమదిశలోనుసూర్యదేవాలయం తూర్పు దిక్కులోనుదుర్గ ఆలయాలు ఉత్తరదిశలోనుబ్రహ్మాలయం పట్టణ మధ్యభాగంలోను ఉండాలట.సామాన్యంగా శివాలయాల్లో లింగమే మూలబేరంగా ఉంటుది. లింగం ఎత్తునుబట్టి శివాలయాలు ఉత్తమోత్తమఉత్తమమధ్యమ మున్నగు విధాలుగా వర్గీకరించబడతాయి. 

గర్భగుడిలో లింగంతోపాటు ఇచ్చమరియు క్రియా అనే శక్తులు ఉంటాయి. ప్రవేశా ద్వారానికి ఇరువైపులా ద్వారపాలకులు ఉంటారు. వినాయకుడుదక్షిణామూర్తివిష్ణువు లేదా ఆర్థనారీశ్వరుడులింగోద్భవబ్రహ్మదుర్గ మరియు చండీశ్వరాలయాలు సాధారణంగా ప్రధాన ఆలయం చుట్టూ ఉంటాయి. రెండవ ప్రాకరంలో సూర్యవినాయకసుబ్రహ్మణ్యగజలక్ష్మి మరియు భారతదేశం అంతటా ఇదంతా ఒకే లాగ ఉండదు. శైవాలయాల్లో గర్భగుడికి ముందు నంది విగ్రహం ఉంటుంది వైష్ణవాలయల్లో గర్భ గుడికి ముందు బలిపీఠంధ్వజస్థంభాలు కలిగిన గరుడ విగ్రహం ఉంటుంది. తక్కిన చిన్నచిన్న దేవుళ్ళ విగ్రహాలుఆలయాలు కూడా ఆలయప్రాంగణంలో ఉంటాయి. ప్రవేశ ద్వారానికి ఇరువైపులా ద్వారపాలకులు ఉంటారు. భక్తులు స్నానం చేయడానికి తీర్థం” లేదా పుష్కరిణి” ఆలయ సమీపంలో ఉంటుంది. ప్రసిధ్ధ పుణ్యక్షేత్రాలుదేవాలయాల చెంత పుణ్యతీర్థాలు” ఉంటాయి. 

దైవానికి కాక జలానికి ప్రాధాన్యం ఉన్న ప్రదేశాలను సాధారంగా పుణ్యతీర్థా” అంటారు.ప్రాచీన కాలంనుంచీ ఆంధ్రదేశం శిల్పకళకుచిత్రకళకువాస్తుకళకుపుణ్యక్షేత్రాలకుఇలా మన ఔన్నత్యాన్ని తెలుసుకోవడానికి నేడు మనకు ఉన్న పుణ్యక్షేత్రాలు – దేవస్థానాలు కూడ ఒక సాధనంగా ఉపకరిస్తున్నాయి. శిధిలప్రాయమయిన దేవలయాల్లో కూడ నేటికి పుజా పునస్కారాలు జరుగుతునే ఉన్నాయి. భగవంతుడి మీద ఉన్న భక్తి విశ్వాసాలు దీనికి ప్రత్యక్ష కారణాలైతేనాటి విగ్రహ శిల్పసౌందర్యాన్నీదేవాలయ నిర్మాణాన్ని మట్టిపాలు చేసుకోలేకనాటి ఆంద్రమహా వైభవాన్ని గుర్తుచేసుకొని వాటిని పునరుద్ధరించాలనే మహదాకాంక్ష ప్రరోక్ష కారాణంగా కనిపిస్తుంది.ఎన్నో దేవాలయాలు పరమత ద్వేషం వల్ల మట్టిపాలయ్యాయి. పోయినవి పోగా ఉన్న వాటినైనా నిలుపుకొని వాటిని పునరుద్ధరించాల్సిన అవసరం ఎంతైనా వుంది. అది మనందరి కర్తవ్యం.నేడున్న దేవాలయాలను దర్శంచి  మనంతా గర్వపడాలి. వీటి సందర్శనం పూర్వ జన్మ సుకృతమనే చెప్పాలి. అదొక మహాభాగ్యం అట్టి మహాద్భాగ్యం కోసమే మనం తీర్థయాత్రలు” చేయాలి. ఇది ప్రతియొక్కరి ధర్మమని హిందువుల విశ్వాసం.తీర్థ యాత్రలవల్ల ఆయాప్రాంతాలఅయా ప్రాంతాల జనుల పరిచయం ఏర్పడుతుంది. తద్వారా భావసమైక్యతదేశ సమైక్యత ఏర్పడుతుంది.

ఇంకా చదవండి »

దేవాలయం అంటే -1

హిందూధర్మంలో దేవాలయాలకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. అసలు ఈ దేవాలయమంటె ఏమిటి? ఈ దేవలయాలు ఎందుకు? అన్న ప్రశ్నలు తలెత్తినప్పుడు, ‘దేవానాం దేవస్యవా ఆలయా' అని సమధానమిచ్చారు మన ఋషిపుంగవులు. దేవాలయం ప్రార్థన కోసం, పూజ కోసం, దేవతావిగ్రహాలను, ఇతర ఆరాధ్య వస్తువులను ప్రతిష్టించి, వాటి రక్షణకోసం కట్టించిన కట్టడమే దేవాలయమని అన్నారు. అందుకే మనవాళ్ళూ దేవలయాన్ని సప్తసంతానాలలో ఒకటిగా పేర్కొన్నారు. 

కొడుకు లేక కూతురు, తటాకం, కావ్యం, విధానం, ఆలయం, వనం, భూదేవస్థాపనం అనేవి సప్తసంతానాలుగా చెప్పబడ్డాయి. దేవాలయన్ని దేవగృహం, దేవగార, దేవాయతనం, దేవకులం, మందిరం, భవనం, స్థానం, దేవస్థానం, వెష్మం, కీర్తనం, హర్మ్యం, విహారం అని, విమానం, ప్రాసాదం అని పిలవడం జరుగుతోంది.మన సంస్కృతి, కళలు, శిల్పం, వాస్తు, వేదాంతం పురాణం మొదలైఅన వాటి సంగమ స్థానం హిందు దేవాలయం.పరిపూర్ణమైన, సుందరమైన ఆలయమంటె మానవశరీరం. 
ఇక్కడ తత్” (ఆత్మ) ఇల్లు చేసుకొని జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, పంచభూతాలు, పంచప్రాణాలు, పంచవిషయాలు అంతరంగ వృత్తులు (అంత: కరణ, మనస్సు, చిత్త, బుద్ధి, అహంకారాలు) తమ క్రియలను నిర్వహించడానికి అవకాశాన్ని కల్పించి ఇచ్చింది.దేహమే దేవాలయం. దేహంలో ఉన్న జీవమే పరమత్మ. జీవాత్మ పరమాత్మకంటె వేరన్న అజ్ఞానమే నిర్మాల్యం; నేనే అతనని పూజించలి అని అగమాలు ఘోషిస్తాయి. దేవాలయం ఒక దేహం లాంటిది. శిఖరం శిరస్సు; గర్భగృహం మెడ, ముందరి మంటపం ఉదరం; ప్రాకారపు గోడలు కాళ్ళూ; గోపురం పాదాలు; ధ్వజ స్తంభమే జీవితం. ఇలా ఆలయం భగవన్మూర్తిగా భావింపబడుతోంది. అందువల్లనే దేవలయాన్ని పవిత్రంగా భావిస్తున్నాము. ఆ స్థలాన్ని పుణ్యక్షేత్రంగా పరిగణిస్తున్నము. అక్కడే మనం విశ్వసిస్తున్నాము. 

దేవాలయ ప్రాచీనతభగవంతుడు లేకుండా మానవుడు జీవించలేడననీ, శివుని అజ్ఞ లేనిదే చీమైనాకుట్టందనీ, అందుకనే భగవన్మూర్తిని ఒకచోట ప్రతిష్ఠించి ఆరాధిస్తున్నాము. భగవత్సాక్షాత్కారం కోసమే ప్రతి హిందువు తపన పడతాడు. ప్రయత్నిస్తాడు. అదే పవిత్ర స్థలం. అదే దేవాలయం. ఇది భౌతిక శరీరం (ఫిజికల్ బాడీ) మానసిక శరీరం (సైకిక్ బాడీ), తైజసిక శరీరాలను (సూపర్ కాన్ షియస్ బాడీ) ప్రతిబింబిచే ఒక ప్రతీక. అందువల్లనే దేవాలయం భగవంతుడికి మానవుడికి ఉన్న ఒక కొక్కీ (లింక్) అని విజ్ఞుల  అభిప్రాయం. దేవాలయ నిర్మాణం ఎప్పుడు, ఎక్కడ ఆరంభింపబడిందో చెప్పడం కష్టం. వేదకాలాల్లో దేవాలయాలు లేవనీ, విగ్రహారాధనా పద్ధతి, దేవాలయాల నిర్మాణం వెదకాలపు చివరిదశలో, రామాయణ, మహాభారత కాలల్లో ఆరంభమైందనీ, వేదకాలపు యాగశాలలే కాలక్రంగా దేవాలయాలుగా రూపొందాయని పలువురి అభిప్రాయం.

దేవాలయాలు వైదికయుగంలో నిర్మితములైనట్లు కనబడదు. దేవతా స్వరూపము, దేవతల వాహనములుప్రతిమా వర్ణనము మొదలైన విషయములకు సంబంధించిన వాక్యములు వేదములందు కొన్ని గలపు గాని, విగ్రహారాధన ఆచరణ లోనికి వచ్చిన తర్వాత గాని, దేవాలయ నిర్మాణమునకు అవకాశముండదు. విగ్రహారాధన ఏర్పడిన వెంటనే దేవాలయ నిర్మాణము సైతము ప్రారంభింపబడినది. బ్రహ్మస్వరూపమైన ఆత్మకు దేహము నిలయమైనట్లుగా, దేవతా విగ్రహానికి దేవాలయం నిలయముగా భావించి, దేవాలయ నిర్మాణము శరీర నిర్మణము ననుసరించి కావించినారు.దేవాలయ వాస్తుదేవాలయాలను మనం రెండువర్గాలుగా విభజించుకోవచ్చు. 1.గ్రామదేవతాలయలు 2.శిష్టదేవతాలయాలు. 

మొదటివర్గం గ్రామరక్షణ కోసం తరతరాలుగా గ్రామసంస్కృతిలో నిలద్రొక్కుకున్న ఎల్లమ్మ, మారమ్మ, పోచమ్మ, మైసమ్మ మొదలైన దేవతల చిన్న చిన్న గుడులు. గ్రామదేవతలలో అధికం స్త్రిలే . ఒక విధంగా వీరు శక్తిదేవతలు. ఈ దేవలయాల్లో చెప్పుకోదగ్గ వాస్తుశిల్పం కనపడదు. ఆలయాలు సాధారనంగా ఉంటాయి. 

ఇక రెండవవర్గం బ్రహ్మ, విష్ణు, శివ, విఘ్నేశ్వర మొదలైన శిష్టదేవతలు లేక నాగరీక దేవతల ఆలయాలు, ఈ దేవతలను పూజించేవాళ్ళు సామన్యంగా బ్రహ్మణులు. అగమాలలో చెప్పిన రీతిగా ఈ దేవతలకు షోడశోపచారాలు, చతుష్పష్టి ఉపచారాలు జరుగుతాయి.శిష్టదేవాలయాలు వాస్తు శాస్త్రానుగుణంగా నిర్మించబడ్డాయి. గృహ, గ్రామ, నగర, దేవాయతన, ప్రాసాద, దుర్గ, ఆరామ, తటాక, సేతుబంధ ఇత్యాది నిర్మాణ లక్షణాలను తెలిపే శిల్పశాస్త్రమే వాస్తుశాస్త్రం. ఈ వాస్తు సంప్రదాయం ఆగమాల మీద ఆధార పడింది, ఆగమాలలో దేవాలయ నిర్మాణం, ఉత్సవాలు పేర్కొనబడ్డాయి, కామిక, కారణ ఆగమాలలో నియమ నిబంధనలు చెప్పబడ్డాయి. 

వాస్తుశాస్త్రం త్రిమూర్తుల నుండి ఇంద్ర, బృహస్పతి, నారదులకు అనుగ్రహింపబడిందనీ, వాళ్ళ ద్వారా అనేక ఋషులకు సంక్రమించిదని అంటారు. పురాతన పట్టణాలు, కట్టడాలు వాస్తు శాస్త్రానుగుణంగా నిర్మింప బడుతుండేవి.వేదకాలంలో యజ్ఞాలకోసం శాలలను, వేదికలను, ఇటుక, కొయ్య, వెదురులతో నిర్మించేవారు. ఇవన్నీ శిల్పసూత్రాన్ని అనుసరించే నిర్మింపబడుతుండెవి. అవే భారతఖండ వాస్తువిద్యకు మూలరూపాలని కొంతమంది అభిప్రాయం. ఆర్యులు ఆర్యావర్తం ప్రవేశించడానికి మిందే ఈ దేశంలో నెలకొన్న ద్రావిడులు అనేక శతాబ్దాలుగా తమదే అయిన ఒక సంస్కృతిని పెంపొందించుకొంటూ వచ్చారనీ, ఆర్యులు వాళ్ళనుంచి వాస్తువిద్యను నేర్చుకొన్నారనీ కొంతమంది అభిప్రాయం. 

మొదట్లోవెదురుచే నిర్మింపబడి, అనంతరం కొయ్యలతో కట్టడాలు నిర్మంపబడి ఉందవచ్చు. ఆ తర్వాత మన్ను, ఇటుకలతో నిర్మింపబడి క్రీ.శ 4వ శతాబ్ది తర్వాత విడివిడి రాళ్ళతో గృహాలు, దేవాలయాలు నిర్మింపబడడం మొదలయ్యాయి. ఇటుకలు, రాళ్ల పురాతన కట్టడ అవశేషాలు ఇప్పటికీ నిలిచి ఉన్నాయి. వాస్తుకళ క్రమేపి ఏ విధంగా వృద్ధి చెందిందో ఇవి చూపెడతాయి.ఆధునిక విద్వాంసులు ఉత్తర హిందూస్థానపు దేవాలయ రీతిని ఇండోఆర్యన్శైలి అనీ, దక్షిణ హిందూస్థానపు రీతిని ద్రావిడశైలిఅని అంటారు. వాస్తు శైలి దృష్టిచే ద్రావిడ వాస్తురీతి వికాసాన్ని ఐదు కాలాలుగా విభజించడం జరిగింది.1. పల్లవుల కాలం క్రీ.శ. 600-9002. చోళుల కాలం క్రీ.శ. 900-11503. పాండ్యుల కాలం క్రీ.శ. 1150-13504. విజయనగర కాలం క్రీ.శ.1350-15655. ఆధునిక కాలం క్రీ.శ. 1600 – ….. (నాయక) పైన పేర్కొనబడ్డ ఐదు ప్రధాన రాజవంశాలు దక్షిణ దేవాలయ వాస్తు పరిణామానికి తోడ్పడ్దాయి.భారతదేశంలోని దేవాలయాలను, వాటి రచనా శైలికి అనుగుణంగా మూడు విధాలుగా వర్గ్రీకరించారు. 

1.గర్భగృహం మీదున్న గోపురం ఎత్తుగా ఉంది. వక్రరేఖాకృతిలో ఉన్న నాగరశైలి. ఇటువంటి దేవాలయాలు క్రింద నుండి శిఖరం దాకా చతురస్రాకారంలో ఉంటాయి. ఇది ఉత్త్ర భారదేశంలోని దేవలయాల్లో గమనింపవచ్చు. 

2. గర్భగృహమ్మీది గోపురం భిన్నాగ్ర పిరమిడ్ లో ఉన్నది. ద్రావిడశైలి ఈ లక్షణం పల్లవులు, చోళులకు చెందిన దక్షిణ భారత దేవాలయాల్లో కనిపిస్తుంది. 

3. ఈ రెండు లక్షణాలను లోనున్నది వేసరశైలి.ఉత్తర హిందూ దేవాలయ వాస్తు సంప్రదాయంలోని ఆలయాలు లంబప్రవృద్ధి దేవాలయాలు, ఆలయ శిఖరాలు చాల ఎత్తులో నిర్మింపబడి ఉంటాయి. దక్షిణ హిందూ దేవాలయ వాస్తు సంప్రదాయంలోని ఆలయాలు ప్రస్తవిస్తరణ దేవాలయాలు. వీటినే ద్రావిడ పద్ధతికి చైందిన దేవాలయాలుగా పరిగణిస్తున్నాము. ఈ పద్ధతికి చైందిన ఆలయాలలో విస్తీర్ణ మెక్కువగా కనిపిస్తుంది. దీనికి ఉదాహరణలుగా శ్రీకాళహస్తి, మధుర దేవాలయాలను తీసుకోవచ్చు. సహస్ర స్తంభ మండపాలు, అనేక ప్రాకారాలు, దాదాపు 200 అడుగుల ఎత్తుండే గోపురాలు, 15-20 ఎకరాల విస్తీర్ణం ఆక్రమించిన అంగణాలు, విశాల కల్యాణ మంటపాలు ఇత్యాది ఈ ఆలయ లక్షణాలుగా కనిపిస్తాయి. 

ఆంధ్రదేశంలో చాళుక్యులు, కాకతీయులు, విజయనగర రాజ వంశాలవారు దేవాలయ నిర్మాణానికి విశేష కృషి గావించారు. వీరి వాస్తుశిల్పం, దేవాలయ నిర్మాణం, వీటికి నిదర్శనం నేటికి చెక్కు చెదరక నిలిచి ఉన్న దెవాలయాలు.దేవాలయ నిర్మాణందేవాలయ నిర్మాణంలో మొట్టమొదటి అంశం ఆలయ నిర్మాణానికి భూమిని ఎన్నుకోవడం ఉంది. పవిత్రములైన దేవాలయాలు సాధారణంగా నదీతీరాల్లోకాని, నీటి బుగ్గలు ఉన్న పర్వతాగ్రాల మీద కానీ కట్టబడి వుండడాన్ని మనం గమనించవచ్చు. పుణ్యక్షేత్ర సమీపంలోను, నదీ తీరంలోను సముద్రతీరంలోను, నదీసంగమస్థానంలోను, పర్వతాగ్రంలోను, పర్వతపార్శ్వంలోను, వనంలోను, ఉపవనంలోను, ఉద్యానవనంలోను, సిధ్ధదుల ఆశ్రమంలోను, గొప్ప గ్రామంలోను, పురంలోను, పట్టణంలోను, రమ్య ప్రదేశాలలోను, దేవాలయాలను కట్టాడానుకి సంకల్పించాలట. ఈ ప్రదేశాలన్నీ ప్రకృతి పరిసరాలు, దేవాలయ నిర్మాణానికి అనువైన  ప్రదేశాలు. అందు వల్లనే బృహత్సంహీత ఇలా చెప్తుంది. నదీ, శైల, నిర్ఘర, ప్రదేశాలలోని వనాల్లోను, పట్టన ఉద్యానవనాల్లోను, దేవతలు విహరిస్తారు. ఇవి భగవంతుడి వాసస్థానలే కాకుండా శుభం, శాంతిని కలిగించే ప్రదేశాలు.అలాగే శిల్పప్రకాశఇలా పేర్కోన్నది.- నదీ రహితమైన భూమి, పాషాణంతో కూడుకొన్న నేల దేవాలయ నిర్మాణానికి పనికిరావు. 

ఇంకా చదవండి »