• విష్ణుషట్పదీ స్తోత్రం

    నారాయణ నారాయణ జయ గోవింద హరే |నారాయణ నారాయణ జయ గోపాల హరే ||

  • శ్రీ రామ

    ఆపదం అపహర్థారమ్ దాతారం సర్వ సంపదం, లోకాభి రామం శ్రీ రామం భూయో భూయో నమామ్యహమ్I

  • శ్రీ సీతామాత

    త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ, హనుమాన్ యత్న మాస్తాయ దు:ఖ: క్షయ కరోభవ

  • ఓం నమ:శివాయ:

    చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర పాహిమామ్ , చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర రక్షమామ్ I

  • శ్రీమాత్రే నమః

    అమ్మల గన్న యమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాల పెద్దమ్మ, సురారులమ్మ కడుపారడి పుచ్చిన యమ్మ, తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ మాయమ్మ కృపాబ్ధి నిచ్చుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్

  • శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు

    పురుషోవిష్ణు రిత్యుక్తః శివోనానామతః స్మృతః I అవ్యక్తం తు ఉమాదేవీ శ్రీర్వా పద్మ నిభేక్షణా I తత్ సంయోగా దహంకారః స చ సేనాపతిరుహః I

బాద్రపదమాసం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

మహాలయపక్షం ప్రారంభం. (సోమవారం, 28.09.15)

భాద్రపదమాసములో కృష్ణపక్షమును మహాలయ పక్షము అందురు. మహాలయము అనగా గొప్ప వినాశము లేక మరణము. పక్షమున అన్ని వర్గముల వారు తమ పెద్దలు మరణించిన తిథిని బట్టి ఆయా తిథులలో తర్పణ శ్రాద్ధకర్మలు చేయుదురు. అందువలన దీనిని 'పితృపక్షము' అని కూడా అంటారు. ఉత్తరాయణము దేవతల కాలము గనుక ఉత్తమకాలమని, దక్షిణాయణము పితృకాలము గనుక అశుభకాలమని మన పూర్వుల విశ్వాసము. మహాలయ పక్షములో ప్రతి దినమును గాని, ఒకనాడు గాని శ్రాద్ధము చేయవలెను. అట్లు చేసినవారి పితరులు సంవత్సరము వరకును సంతృప్తులగుదురని స్కాంద పురాణము నాగర ఖండమున కలదు.  

పక్షము అనగా 15 రోజులకు (లేదా ఖచ్చితంగా 14 రాత్రులకు) సమానమైన ఒక కాలమానము. ప్రతి నెలలో రెండు పక్షాలుంటాయి:

1. శుక్ల పక్షం (అమావాస్య నుంచి పున్నమి వరకు): రోజు రోజుకూ చంద్రుడి తో బాటే వెన్నెల పెరిగి రాత్రుళ్ళు తెల్లగా, కాంతివంతంగా అవుతాయి. (శుక్ల అంటే తెల్లని అని అర్థం).

2. కృష్ణ పక్షం (పున్నమి నుంచి అమావాస్య వరకు): రోజు రోజుకూ చంద్రుడి తో బాటే వెన్నెల తరిగి రాత్రుళ్ళు నల్లగా చీకటితో నిండుతాయి. (కృష్ణ అంటే నల్లని అని అర్థం).

తిధి
వేద సమయానుసారము ఒక చాంద్రమాన రోజును తిధి అంటారు లేదా శాస్త్రీయముగా సూర్యుడు మరియు చంద్రున్ని కలుపుతూ ఉన్న ఆక్షాంశ కోణము 12 డిగ్రీలు పెరగడానికి పట్టే కాలాన్ని తిధి అనవచ్చు. తిధులు రోజులోని వేళలలో అయినా మొదలయ్యి, అంతమయ్యే అవకాశము ఉన్నది. ఒక్కొక్క తిధి దాదాపు 19 నుండి 26 గంటల సమయము ఉంటుంది. ప్రతి చాంద్రమాసములో 30 తిధులు ఉంటాయి.
 
పక్షంలోని తిథులు

1. పాడ్యమి (అధి దేవత - అగ్ని)
2. విదియ (అధి దేవత - బ్రహ్మ)
3. తదియ (అధి దేవత - గౌరి)
4. చవితి (అధి దేవత - వినాయకుడు)
5. పంచమి (అధి దేవత - సర్పము)
6. షష్టి (అధి దేవత - కుమార స్వామి)
7. సప్తమి (అధి దేవత - సూర్యుడు)
8. అష్టమి (అధి దేవత - శివుడు)
9. నవమి (అధి దేవత - దుర్గా దేవి)
10. దశమి (అధి దేవత - యముడు)
11. ఏకాదశి (అధి దేవత - శివుడు)
12. ద్వాదశి (అధి దేవత - విష్ణువు)
13. త్రయోదశి (అధి దేవత - మన్మధుడు)
14. చతుర్దశి (అధి దేవత - శివుడు)

15. పున్నమి/పూర్ణిమ/పౌర్ణమి లేక అమావాస్య (అధి దేవత - చంద్రుడు)

ఇంకా చదవండి »

పిత్రుపక్షాలు అంటే ఏమిటి ? ఎం చేయాలి ?


భాద్రపదమాసం పౌర్ణిమ తెల్లవారి మొదలుకొని భాద్రపద బహుళ అమావాస్య వరకు (పెద్దల అమావాస్య అని కూడా అంటారు) పిత్రుపక్షాలు (పక్షం అంటే 15 రోజులు). ఈ 15 రోజులు పెద్దలందరికీ శ్రాద్ధ కర్మలు చేయాలి.

మాములుగా పెద్దలు ఏ నెలలో, ఆ తిధి లో చనిపోతే మల్లి సంవత్సరం ఆ తిధి లో చేస్తారు. అది చేస్తూనే ఈ పితృ పక్షాలలో కూడా చేయాలి. మాసం అవసరం లేదు కానీ ఆ తిధి లో చేయాలి. పూర్వకాలం లో అయితే ఈ 15 రోజులు, రోజు చేసే వారు. కానీ కలమనల్ని అనుసరించి కేవలం అ తిధి రోజు చేస్తే సరిపోతుంది . పెద్దలు అమ్మ , నాన్న , అన్నయ , వదిన ఎవరి తిధి అయితే వాళ తిధి రోజు చెయలి. అందరిది కలిపి ఒకే రోజు చేయడానికి వీలులెధు. అది దోషం . మాములు గతించిన వారి తిధి లో చేసిన , మల్లి ఈ పితృ పక్షాలలో కచితంగా చేయాలి.

ఒక 80 ఎల్లా తాతగారు పోయారు , 50 ఎలా కొడుకు ఉంటాడు , తనకి 30 ఎలా కొడుకు ఉంటాడు తిన పిల్లలికి పుట్టెంటుకలు , అన్న ప్రాసన, గృహ ప్రవేశం అలాంటివి చేసుకోవచు. ఎవరు కర్మ చేసారో వాలు మాత్రమే చేయకూడదు. చనిపోయిన వ్యక్తీ కూతురు అని కార్యక్రమాలు చేసుకోవచు. పిట్ల మీద కుర్చువడం, కన్యాదానం చేసుకోవచు , పోయిన తాత గారి చెల్లెలు ఉంది తను అని సుబకర్యాలు చేసుకోవచు.

తల్లి తండ్రులు పోయిన తరువాత, ఆ సంవత్సరం కన్యాదానం చేయవచా ?
చేయవచ్చు , అల చేయటం వలన చనిపోయిన వారికీ కన్య దానం చేసిన ఫలితం లబిస్తుంది. పెళ్లి లో కూడా నాంది శ్రాద్ధం ఉంటుంది . అల చేసినప్పుడు పెద్దలు వచ్చి అసీర్వదిస్థరు.

కర్మ చేసిన వారికీ సంవత్సరం వరకు ఎటి సూతకం ఉంటుంది. వారు ఎలాంటి సుబకార్యాలు, కంకణం కట్టుకుని చేసే కార్యక్రమాలు కానీ , గుడికి వెళ్ళటం కానీ చేయకూడదు. పిన్ని బాబాయి , చిన్న నానా , పెద్ద నాన్న పోతే కర్మ చేయని వాళ్ళకి ఏటి సూతకం ఉండదు.

కర్మ చేసిన వారు దీపారాధన , నైవేద్యం పెట్టవచున?
అన్నీ కార్యక్రమాలు అయిపోయిన తరువాత 12 వ రోజు దీపం పెట్టిస్తారు. అప్పటినుంచి ఇంట్లో నిత్య పూజ చేయవచు. నిత్య చేసుకునే పూజ, జపం , పారాయణం చేసుకోవచు. కానీ బీజ అక్షరాలు తో కుంకుమ పూజ అవి చేయకూడదు .


గయా ప్రయాగలో శ్రాద్ధ చేసిన ఫలితం రావళి అంటే పిత్రుపక్షం లో వచ్చే భరణి నక్షత్రం రోజున చేయాలి. శుక్ర వారం రోజున , ఏకాదశి రోజున చేయకూడదు. సన్యసించిన వారికి మాత్రం ద్వాదశి తిధి రోజున చేయాలి.

ఇంకా చదవండి »