• విష్ణుషట్పదీ స్తోత్రం

    నారాయణ నారాయణ జయ గోవింద హరే |నారాయణ నారాయణ జయ గోపాల హరే ||

  • శ్రీ రామ

    ఆపదం అపహర్థారమ్ దాతారం సర్వ సంపదం, లోకాభి రామం శ్రీ రామం భూయో భూయో నమామ్యహమ్I

  • శ్రీ సీతామాత

    త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ, హనుమాన్ యత్న మాస్తాయ దు:ఖ: క్షయ కరోభవ

  • ఓం నమ:శివాయ:

    చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర పాహిమామ్ , చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర రక్షమామ్ I

  • శ్రీమాత్రే నమః

    అమ్మల గన్న యమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాల పెద్దమ్మ, సురారులమ్మ కడుపారడి పుచ్చిన యమ్మ, తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ మాయమ్మ కృపాబ్ధి నిచ్చుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్

  • శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు

    పురుషోవిష్ణు రిత్యుక్తః శివోనానామతః స్మృతః I అవ్యక్తం తు ఉమాదేవీ శ్రీర్వా పద్మ నిభేక్షణా I తత్ సంయోగా దహంకారః స చ సేనాపతిరుహః I

వాగేయకారులు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

ఏ తీరున నను దయ జూచెదవో



ఏ తీరున నను దయ జూచెదవో యినవంశోత్తమ రామా,
నా తరమా భవసాగర మీదగ నళినదళేక్షణ రామా
.
ఏ తీరుగ నను దయ జూచెదవో
(రాగం: మాయామాళవ గౌళ, తాళం: ఆది)
ఏ తీరుగ నను దయ జూచెదవో ఇన వంశోత్తమ రామా
నా తరమా భవ సాగర మీదను నళినదళేక్షణ రామా |ఏ తీరుగ...|
శ్రీ రఘు నందన సీతా రమణా శ్రితజన పోషక రామా
కారుణ్యాలయ భక్త వరద నిను కన్నది కానుపు రామా |ఏ తీరుగ...|
క్రూర కర్మములు నేరక చేసితి నేరములెంచకు రామా
దారిద్ర్యము పరిహారము సేయవె దైవ శిఖామణి రామా |ఏ తీరుగ...|
వాసవనుత రామదాస పోషక వందనమయోధ్య రామా
దాసార్చిత మాకభయమొసంగవె దాశరథీ రఘు రామా |ఏ తీరుగ...|


ఇంకా చదవండి »

అక్క మహదేవి

భక్తులు పూర్తిగా భిన్నమైన మనుష్యులు. వారు ఈ లోకానికి చెందినవారు కాదు. వారు ఈ లోకంలో ఒక పాదాన్ని మాత్రమే ఉంచి ఉంటారు. వారు జీవించే విధానం, వారి జీవన శక్తి పూర్తిగా పరలోకానికి చెందినవై ఉంటాయి.

అక్క మహదేవి శివ భక్తురాలు. శివుడే తన భర్తగా భావించేది. చిన్నతనం నుండి తనని తాను పూర్తిగా శివునికి అంకితమిచ్చింది అక్క మహదేవి శివ భక్తురాలు.

శివుడే తన భర్తగా భావించేది. చిన్నతనం నుండి తనని తాను పూర్తిగా శివునికి అంకిత మిచ్చింది. యుక్త వయస్సులో ఉన్న ”అక్క”ను ఒక రోజు ఒక రాజు చూశాడు. ఆమె చాలా అందంగా ఉండటం వల్ల పెళ్ళి చేసుకొవాలని భావించాడు. కాని అక్క అంగీకరించక పోవటం వలన, ఆ రాజు ”నీవు వివాహానికి అంగీకరించనిచో నీ తల్లి తండ్రులను చంపుతానని బెదిరించాడు”. అందువలన ఆమె రాజుని పెండ్లి చేసుకున్నా, అతనిని దూరంగా ఉంచేది. రాజు ఆమెను లోబరుచుకోవాలని చాలా ప్రయత్నాలు చేసినా, ఆమె, ”నేను శివుడిని ఎప్పుడో పెండ్లాడాను, నిన్ను కాదు” అని తప్పించుకునేది. కొంతకాలానికి రాజుకి సహనం నశించింది. 

ఆమెను వశపరుచుకోటానికి ప్రయత్నించినా, ఆమె అతనిని తిరస్కరించి, ”నాకు వేరే చోట మరో భర్త ఉన్నాడు, అతను నా దగ్గరకు వస్తూ ఉంటాడు. నేను అతనితోనే ఉంటాను, నీతో ఉండలేను” అని చెప్పేది. ఇది రాజు సహించ లేక, ”ఇలాంటి భార్యతో ఉండి ఏం ప్రయోజనం? కనిపించని వేరే అతనిని పెళ్ళి చేసుకున్న భార్యతో ఎలా ఉండటం?” అని అనుకొన్నాడు. ఆ రోజుల్లో విడాకులు లాంటివి లేవు. అతనికి ఏమి చెయ్యాలో తోచలేదు. అందువలన ఆమెను రాజ సభకి తీసుకుని వచ్చి, సభను నిర్ణయించమన్నాడు. సభలో ఆమెను ప్రశ్నించగా, ఆమె వేరొకచోట ఉన్న తన భర్త గురించి మాత్రమే మాట్లాడింది. ఆమెకు ఇది 100% ఫూర్తి వాస్తవం, ఇదంతా భ్రమ కాదు.

ఆ రోజుల్లో, భారతదేశంలో ఒక స్త్రీ కి, తన భర్తను, ఇంటినీ వదిలి వెళ్ళాలనే ఆలోచనకు తావు ఇవ్వడమే చాలా కష్టం. కాని ఆమె అలా చేసింది సభలో ఉన్న ప్రజలందరి ముందు, ఆమె తన భర్త మరొక చోట ఉన్నాడని చెప్పటంతో, రాజు చాలా కోపగించుకున్నాడు. 800 సంవత్సరాల క్రితం, భారతదేశంలో ఉన్న రాజుకి ఈ విషయాన్ని తేలికగా అంగీకరించటం అసాధ్యం. 

ఆమె మనసులో ఏముందో కాని, సాంఘికంగా అది చిన్న విషయం కాదు. అప్పుడు రాజు ”నీవు ఇంతకు ముందే వేరొకరిని పెండ్లాడినచో, నాతో ఏమి పని? వెళ్ళిపో!” అన్నాడు. “సరే!” అని ఆమె బయటకు నడవటం మొదలు పెట్టింది . ఆ రోజుల్లో, భారతదేశంలో ఒక స్త్రీ కి, తన భర్తను, ఇంటినీ వదిలి వెళ్ళాలనే ఆలోచనకు తావు ఇవ్వడమే చాలా కష్టం. కాని ఆమె అలా చేసింది. ఆమె అలా ప్రశాంతతతో, తేలికగా తనను వదిలి వెళ్ళగలగడం చూసిన రాజు తనలోని కోపం వల్ల హీనంగా, “నీవు ధరించిన వస్త్రాలు, నగలు నావే. వాటిని కూడా విడిచి వెళ్ళు” అన్నాడు. నిండు సభలో, 17, 18 సం.ల యుక్త వయస్సులో ఉన్న ఆమె, అన్నింటిని విసర్జించి, నగ్నంగా బయటకు వెళ్ళింది.

ఆ రోజు నుండి ఆమె బట్టలు ధరించటానికి నిరాకరించినది. దీనివలన సమస్యలు రావచ్చని, చాలామంది ఆమెను బట్టలు ధరించమని నచ్చచెప్పినా, జీవితాంతం ఆమె వివస్త్రగానే జీవించి, ఒక ఋషిగా గుర్తింబడింది. ఆమె చిన్నతనంలోనే మరణించినా, ఆ కొద్ది కాలంలోనే తన భక్తితో శివుని మీద కొన్ని వందల అద్భుత పద్యాలను రచించింది.

ఆమె భక్తి ఎలాంటిదంటే, ప్రతిరోజూ శివుడిని “శివా! నాకు ఎలాంటి ఆహారం అందకుండా చేయి. నేను ఆహారం తీసుకుంటే, నా శరీరం తృప్తి చెందుతుంది. నా వేదన ఏమిటో నా ఈ శరీరానికి తెలియదు. నేను నీలో ఐక్యం అవ్వాలని పడే ఈ తపన నా శరీరాన్ని కూడా పడనీ. అందువలన, ఏ ఆహారం నా వద్దకు రానీకు. ఎప్పుడైనా ఒకవేళ నా చేతిలోకి ఆహారం వస్తే, అది నా నోటిలోకి చేరేలోపే దానిని మట్టిలో పడవేయి. ఆ మట్టిలో పడినదానిని అవివేకినైనా నేను తీసుకునేలోపే, ఒక శునకము వచ్చి తీసుకు పోయేట్లు చేయి” అని అర్ధించేది. ఇదీ ఆమె ప్రతిరోజూ చేసే ప్రార్ధన!

ఇంకా చదవండి »

పురందర దాసు

పరమాత్ముడు తలచుకుంటే పరమ లోభితో మహా దానాలు చేయించగలడు ... పరమ నాస్తికుడితో మహా యాగాలు చేయించగలడు. మహా భక్తుడైన 'పురందర దాసు' జీవితం కూడా ఇందుకు ఉదాహరణగా కనిపిస్తుంది. పురందరదాసు పూర్వనామం శ్రీనివాసుడు క్రీ.శ.15 వ శతాబ్దంలో ఆయన కర్ణాటక రాష్ట్రం హంపి సమీపంలోని 'పురందర గడ'లో కమలాంబ - వరదప్ప దంపతులకు జన్మించాడు. శ్రీమంతుల కుటుంబానికి చెందిన పురందర దాసు సంస్కృత - ఆంధ్ర భాషల్లో పాండిత్యాన్ని గడించాడు. యవ్వనంలోకి అడుగుపెట్టిన ఆయనకి సరస్వతీ బాయితో వివాహం జరిగింది.

భగవంతుడు ఆయనకి ఏ లోటూ లేకుండా చూస్తున్నప్పటికీ, ఆయన మాత్రం ఎవరికీ ఎటువంటి సహాయం చేసేవాడు కాదు. అలాంటి పరిస్థితుల్లో తనది కానిది తనకి తెలియనిది ఏదీ లేదంటూ పాండురంగడు ఒక లీలా విశేషాన్ని చూపుతాడు. దాంతో ధనం పట్ల అతనికి గల కోరిక, వ్యామోహం ఆవిరైపోతాయి. పురందరదాసు తన దగ్గర గల ధనాన్ని పేదలకు పంచి ఆయన భక్తుడిగా మారిపోతాడు. వ్యాసరాయల వారి చెంత మంత్రోపదేశం పొంది, అనుక్షణం పాండురంగడి నామస్మరణ చేయడం మొదలుపెట్టాడు. ఈ నేపథ్యంలో ఆయన ఆ పాండురంగడి పై నాలుగు లక్షల డెబ్భై అయిదు వేల కృతులు రచించాడు.

ఒకసారి ఓ రాత్రివేళ పురందరదాసుకి బాగా దాహం వేసింది. మంచినీళ్ల కోసం అప్పన్నను పిలిచాడు. చాలాసార్లు పిలిచాక అప్పన్న మంచినీళ్ళు తెచ్చి ఇచ్చాడు. ఆలస్యంగా తెచ్చినందుకు కోపంతో అతని చెంపపై పురందరదాసు ఒక దెబ్బ కొట్టాడు. మరునాడు ఉదయం ఆయన గుడిలోకి వెళ్లే సరికి పాండురంగడి విగ్రహం ముఖంలో అతనికి స్పష్టంగా మార్పు కనిపించింది. ఒక చెంప వాచి ఆ వైపు కంటి నుంచి నీరుకారుతుండటం చూసి ఆలోచనలో పడ్డాడు.


అప్పన్నను పిలిచి రాత్రి తాను మంచినీళ్లు అడగడం అతని చెంపపై కొట్టడం గురించి ప్రస్తావించాడు. తనకేమీ తెలియదని అతను చెప్పడంతో, ఆ రూపంలో వచ్చింది ఆ పాండురంగడేనని అతనికి అర్థమైపోయింది. దాంతో తనని మన్నించమంటూ స్వామి పాదాలపై సాష్టాంగపడి నమస్కరించాడు. అందరూ చూస్తుండగానే స్వామి కంటినీరు ఆగిపోయింది. దాంతో మహాభక్తుడైన పురందరుడికి అక్కడి ప్రజలు బ్రహ్మరథం పట్టారు.

ఇంకా చదవండి »

ముత్తుస్వామి దీక్షితులు

ముత్తుస్వామి దీక్షితర్ కర్ణాటక సంగీతత్రయంలో ఒకరైన వాగ్గేయకారుడు. రామ స్వామి దీక్షితర్, సుబ్బలక్ష్మి అంబాళ్ పుణ్యదంపతుల సంతానంగా 1775లో పుట్టాడు. భక్తిశ్రద్ధలుగల వ్యక్తి గుణగణాలను తన బాల్యంలోనే ఇతడు ప్రదర్శించాడు. తన తండ్రి వద్ద తెలుగు, సంస్కృతంతో పాటు శాస్త్రీయ సంగీతాన్ని కూడా ఈయన అభ్యసించాడు. సంగీతంపై వెలువడిన "వెంకటాముఖి" సుప్రసిద్ధ గ్రంధం "చతుర్‌దండి ప్రకాశికై"ను అధ్యయనం చేశాడు. వాతాపి గణపతిం భజే అన్న కీర్తన విననివారుండరంటే అది అతిశయోక్తి కాదేమో. అది ఆయన రచించినదే.

చిదంబరనాధ యోగి ముత్తుస్వామి దీక్షితర్‌ను కాశీకి తీసుకెళ్ళాడు. అక్కడ ఇతడిని ఉపాసనా మార్గంలో అతడు ప్రవేశపెట్టాడు. వారణాసిలో ఉన్నప్పుడు ముత్తుస్వామి ఉత్తరదేశపు సంగీతమైన హిందూస్తానీ కూడా నేర్చుకున్నాడు. "శ్రీనాధాధి గరుగుహోజయతి" అనే మాటలతో ప్రారంభమయ్యే తొలి కీర్తనను ఇతడు రచించి రాగం కూర్చాడు. తురుత్తణిలో వెలసిన శివుడి కుమారుడైన మురుగ భగవానుడి భక్తిపారవశ్యంలో లీనమైనప్పుడు పై సంకీర్తనను అతడు రచించాడు. ఆధ్యాత్మిక వెలుగులో ఇతడి సృజనాత్మకత ప్రతిభ ప్రకాశించింది. తన శిష్యులను ఎంతో జాగ్రత్తగా ఎన్నుకున్న వారికి తన కృతులను ఆలాపించడం బోధించాడు.

తన తమ్ముడు చిన్నస్వామి చనిపోయినప్పుడు ఆ దుఖంలో ఉన్నప్పుడు మధురై మీనాక్షి అమ్మన్ ఆలయాన్ని దర్శించాడు. అక్కడే అతడు "మీనాక్షి మేముదం దేహి, మామన మీనాక్షి" అన్న కీర్తనలను వరుసగా పూర్వీ కళ్యాణి, వరాళి రాగాలలో ఆలపించాడు. ధ్యాన యోగం, జ్యోతిష శాస్త్రం, మంత్ర యోగం, పురాణాల సారం మొదలైనవి దీక్షితర్ కృతులలోని ప్రత్యేకతలు. అంబాళ్‌పై అతడు రాసిన నవవర్ణ కీర్తనలు నవ గ్రహాలపైన రాసిన నవగ్రహ కీర్తనలు ఆయన రచనా గొప్పతనానికి ఉజ్వల ఉదాహరణలు. శక్తి ఉపాసనలోని సూక్ష్మాలను వివరిస్తూ శ్రీ విద్యా తత్వ రహస్యంపై ఇతడు ఎన్నో కీర్తనలను రచించాడు. "శివ పాహి ఓం శివే" అన్న మంత్రాన్ని ఉచ్చరిస్తున్నవేళ 1835లో తనువు చాలించాడు.

అటువంటి అత్యద్భుతమైన కృతులను రచించిన ముత్తుస్వామి దీక్షితులు సంగీతత్రయంలో త్యాగరాజు తర్వాత రెండవవారిగా పరిగణింపబడతారు. రామస్వామి దీక్షితులు వీరి తండ్రి. వీరు సంగీత, వ్యాకరణ, జ్యోతిష, వాస్తు, మాంత్రిక, వైద్య విద్యలలో ఆరితేరిన వ్యక్తి. గురుగుహ ముద్రతో వున్న వీరి కృతులన్నీ సంస్కృతంలోనే వున్నవి. హిందూస్థానీ సంగీతంనుండి వీరు కర్ణాటక సంప్రదాయానికి వీరు తెచ్చిన రాగాలు సారంగ, ద్విజావంతి మొదలైనవి. వీరు అనేక క్షేత్రములు తిరిగి ఆయా ప్రదేశములలో వున్నట్టి దేవస్థానములను సందర్శించి దేవతలపై కృతులు జేసారు. ఆయన రచించిన కృతులలో కమలాంబా నవావర్ణ కృతులు, నవగ్రహ కీర్తనలు ప్రత్యేక స్థానాన్ని కలిగి వున్నాయి. వీరి యితర ప్రముఖ రచనలు: వాతాపి గణపతిం భజే, మహా గణపతిం, శ్రీనాథాది గురుగుహో, అక్షయలింగ విభో, బాలగోపాల, అఖిలాండేశ్వరి, రామచంద్రం భావయామి, చేత: శ్రీబాలకృష్ణం, శ్రీ వరలక్ష్మి, సిద్ధి వినాయకం, త్యాగరాజ యోగవైభవం, హిరణ్మయీం, అన్నపూర్ణే, అరుణాచలనాథం, ఆనందామృతకర్షిణి, మామవ మీనాక్షి, మీనాక్షి మే ముదం దేహి, నీలకంఠం భజే, స్వామినాథ, శ్రీ సుబ్రహ్మణ్యాయ, పరిమళ రంగనాథం, మొదలైనవి.

ఇంకా చదవండి »