• విష్ణుషట్పదీ స్తోత్రం

    నారాయణ నారాయణ జయ గోవింద హరే |నారాయణ నారాయణ జయ గోపాల హరే ||

  • శ్రీ రామ

    ఆపదం అపహర్థారమ్ దాతారం సర్వ సంపదం, లోకాభి రామం శ్రీ రామం భూయో భూయో నమామ్యహమ్I

  • శ్రీ సీతామాత

    త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ, హనుమాన్ యత్న మాస్తాయ దు:ఖ: క్షయ కరోభవ

  • ఓం నమ:శివాయ:

    చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర పాహిమామ్ , చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర రక్షమామ్ I

  • శ్రీమాత్రే నమః

    అమ్మల గన్న యమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాల పెద్దమ్మ, సురారులమ్మ కడుపారడి పుచ్చిన యమ్మ, తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ మాయమ్మ కృపాబ్ధి నిచ్చుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్

  • శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు

    పురుషోవిష్ణు రిత్యుక్తః శివోనానామతః స్మృతః I అవ్యక్తం తు ఉమాదేవీ శ్రీర్వా పద్మ నిభేక్షణా I తత్ సంయోగా దహంకారః స చ సేనాపతిరుహః I

చైత్రమాసం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

ఉగాది



తెలుగు వారు జరుపుకొనే పండగ లలో ముఖ్యమైనది . ఉగాది నుండే తెలుగు సంవత్సరము మొదలవుతుంది . ఈ రోజు కొత్త పనులు ప్రారంభించడం పరిపాటి . ఇది ఇంగ్లీష్ డేట్స్ ప్రకారము రాదు . చైత్ర శుద్ధ పాడ్యమి నాడు ఉగాది పండుగను జరుపు కొంటాము .

సంవత్సర కాలగణనలో ప్రపంచంలోని నాగరిక దేశాలన్నీ వారి వారి పద్ధతుల్ని ఏర్పరచుకున్నాయి. భారతదేశంలో ప్రధానంగా ఒకే సనాతన సంస్కృతి ఉన్నప్పటికీ, ఆచారవ్యవహారాల్లో సంప్రదాయాల్లో కొద్దిపాటి భేదాలు కనిపిస్తుంటాయి. ఉత్తర దక్షిణ భారతదేశంలో కొన్ని వైవిధ్యాలున్నా- ప్రధాన జ్యోతిశ్శాస్త్రం, గణనసూత్రం ఒక్కటే.

ఉత్తరాదిలో బార్హస్పత్యమానం, దక్షిణాదిన సౌర, చాంద్రమానాలు వ్యాప్తిలో ఉన్నాయి. తెలుగు, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతీయులు చాంద్రమానాన్ని అవలంబిస్తారు.

చంద్రమానం ప్రకారం చైత్రంతో ప్రారంభమై, ఫాల్గుణంతో పూర్తయ్యే సంవత్సరానికి ఈరోజు (చైత్రశుద్ధ పాడ్యమి) ఆది. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో సంచరించే స్థితిని బట్టి దీన్ని చాంద్రమానం అంటారు. 'ఉగం' అంటే 'నక్షత్ర గమనం' అనే అర్థం ప్రకారం ఏడాదిని 'ఉగం'గానూ, దాని తొలిదినాన్ని 'ఉగాది'గానూ వ్యవహరిస్తారు. అదేవిధంగా రెండు అయనాలు ఉన్న సంవత్సరాన్ని 'యుగం' అంటే, మొదటిరోజున 'యుగాది' అనవచ్చు. దాన్ని 'కల్వాది'గా కూడా కొన్ని శాస్త్రాలు పేర్కొన్నాయి. ఈ తిథినాడే బ్రహ్మ సృష్టిని ప్రారంభించాడని వాటి కంఠోక్తి. వసంత రుతువులో 'తొలి'తనం, శిశిరంలో 'చివరి' లక్షణం ప్రకృతిలో ప్రత్యక్షమయ్యే గమనం. ఈ రెంటి నడుమ ఏడాదికాలాన్ని పరిగణించడం చక్కని ప్రాకృతిక సమన్వయం. అరవై సంవత్సరాల పేర్లు సూర్య విజ్ఞానాన్ని సూచిస్తున్నవే.

ఉగాది కథ తెలుసుకుందామా?

ఆంగ్లంలో నెలల పేర్లు చెప్పమంటే జనవరి నుంచి డిసెంబర్‌ వరకు చెబుతారు. అలాగే తెలుగు నెలలు వేరే ఉన్నాయని తెలుసుగా? వాటిని చైత్రం నుంచి ఫాల్గుణం వరకు చెప్పాలి. కాలాన్ని కొలవడంలో వేర్వేరు పద్ధతులను ఉపయోగించడం వల్లనే ఈ తేడాలు ఉంటాయి. సూర్యుని గమనం ఆధారంగా సౌరమానం, చంద్రుడి గమనం ఆధారంగా చాంద్రమానం వాడుకలో ఉన్నాయి. చాంద్రమానం ప్రకారం తెలుగు నెలల్లో చివరిదైన ఫాల్గుణ మాసం పూర్తయ్యాక తిరిగి చైత్రమాసం మొదలవుతుంది. ఆ తొలిరోజునే 'ఉగాది'గా పరిగణిస్తారు. అంటే ఆంగ్ల క్యాలెండర్‌ ప్రకారం కొత్త ఏడాది జనవరి 1తో మొదలైతే, మన తెలుగు క్యాలెండర్‌ ప్రకారం కొత్త ఏడాది ఉగాదితో ఆరంభమవుతుందన్నమాట.

పురాణాల ప్రకారం చూస్తే బ్రహ్మదేవుడు ఇదే రోజున విశ్వాన్ని సృష్టించాడని నమ్ముతారు. యుగానికి ఆది యుగాది అయితే, వాడుకలో అదే ఉగాదిగా మారిందని చెపుతారు. ఈ రోజుతోనే వసంత రుతువు మొదలవుతుంది.

ఉగాది పుట్టుక వెనుక మరో ఆసక్తికరమైన పురాణ కథ కూడా ఉంది. విష్ణుమూర్తి నాభిలోంచి పెరిగిన కమలం నుంచి బ్రహ్మ పుట్టాడు. సృష్టిబాధ్యత స్వీకరించిన బ్రహ్మ తనతో పాటు నిత్యం ఉండమని విష్ణువును కోరాడు. అప్పుడు విష్ణువు పాలకడలిలో శేషతల్పంపై పడుకున్నట్టున్న తన విగ్రహాన్ని బ్రహ్మకు ఇస్తాడు. ఇదే మొదటి దేవుని విగ్రహమని అంటారు. దాన్ని ఆరాధిస్తూ సృష్టి పూర్తి చేసిన బ్రహ్మ, ఆతర్వాత దాన్ని సూర్యుని కోరిక మేరకు అతనికి ఇచ్చాడు. సూర్యుడు తన కొడుకైన మనువుకు, మనువు తన కొడుకైన ఇక్ష్వాకుడికి ఇచ్చారు. అదే వంశంలో పుట్టిన శ్రీరాముడు కూడా ఈ విగ్రహాన్ని ఆరాధించాడు. ఆపై విభీషణుడి కోరికపై రాముడు దాన్ని ఇచ్చాడు. అయితే లంకకు తీసుకెళ్లే దారిలో విభీషణుడు దాన్ని పొరపాటున నేలపై ఉంచడంతో అది అక్కడే పాతుకుపోతుంది. ఆ ప్రదేశమే తమిళనాడులోని శ్రీరంగం అనీ, ఆ విగ్రహమే శ్రీరంగనాథస్వామి అని చెబుతారు. ఆ సంఘటన కూడా ఉగాదినాడే సంభవించిందంటారు.

* ఉగాదిని మనతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, మణిపూర్‌, సింధీ ప్రజలు చేసుకుంటారు. మహారాష్ట్రలో ఉగాదిని గుడిపడ్వా అని, మణిపూర్‌లో సాజిబు చేరోబా అని, సింధీ ప్రజలు చేత చాంద్‌ అని పిలుస్తారు. కర్ణాటకలో ఉగాది పచ్చడిని బేవు-బెల్లా అంటారు.

* ఉగాది రోజు అమ్మ ఆరు రుచులతో కూడిన పచ్చడి చేస్తుంది కదా? దానర్థం ఏమటంటే జీవితంలో సుఖ, సంతోషాలు, కష్టనష్టాలను సమానంగా స్వీకరించాలనేదే! ఆరు రుచుల్లో తీపి సంతోషానికి, చేదు బాధకి, కారం కోపానికి, ఉప్పు భయానికి, పులుపు చిరాకుకు, వగరు ఆశ్చర్యానికి గుర్తుగా భావిస్తారు.

ఇంకా చదవండి »

చైత్ర శుద్ధ అష్టమి - అశోకాష్టమి (march - April ) సంతానప్రాప్తి కోసం



అశోకాష్టమి రోజు ఏమి చేయాలి ?
అశో + కాష్టమి - శోకం పోవటం కోసం , శోకం కలుగకుండా ఉండడం కోసం  అశోక పుష్పాలతో శివుడికి పూజ చేయటం వలన సుఖ సంతోషాలతో వర్దిలుతారు. ఎవరయినా సరే ఈ ఎలాంటి దుఖం పోవటం కోసం అయిన సరే అష్టమి రోజు ఈశ్వరుడికి అశోక పుష్పాలతో పూజ చేయాలి.

కధ :
పూర్వం ఒక మునికి ఒక కూతురు ఉండేది . తనకి పెళ్లి చేసి అత్తవారింటికి పంపించాడు . తన దివ్య ద్రుష్టి తో చూసి రధం లో వెళ్ళేటప్పుడు అశోక వృక్ష విత్తనాలు ఇచ్చి దారిలో రెండు ప్రక్కల జల్లుతూ వెళ్ళమని చెపాడు . తనుకూడా అలాగే చేసింది . తను గర్బవతి అయింది కానీ గర్బ స్రవం జరుగుతూ ఉంది. అల 5 సార్లు జరిగింది దాని వలన వేదన కలుగుతుంది. నా కష్టం ఎవరితో చెప్పుకోవాలి అని అలోచించి తన త్నాద్రి తో చెప్పుకోవాలి అని అలోచించి ఇంటికి తిరిగి వస్తుడగా తను జల్లిన అశోక విత్తనాలు పెద్ద వృక్షాలు గ తయారు అయాయి. చాల సంతోసించింది , తండ్రి దగరకి వచ్చి తన కష్టం చెప్పుకుంది. తండ్రి చైత్ర శుద్ధ అష్టమి నాడు అశోక పువ్వులతో చిగురులతో పరమేశ్వరుడికి పూజ చేయించాడు . భుదవారం రోజున పునర్వసు నక్షత్రం వచ్చిన రోజు మధ్యానం ఈస్వరుడికి పూజ చేసి తరువాత అ ప్రసాదం గా పిల్లలు లేని ఆడవాలు 8 ఈ అశోక పువ్వులను నిలలో కలిపి లేదా మాములుగానే గానే  తినాలి. ఇలా చేయటం వలన సంతానం కలుగుతుంది అని తెలుస్తుంది. అశోక పువ్వుల వలన అండ వృద్ధి బాగా జరుగుతుంది, పటిష్టం చేస్తుంది . 

ఇంకా చదవండి »

ప్రతి మాసంలో వచ్చే అమావాస్యరోజున హనుమంతున్ని పూజిస్తే?


ప్రతి మాసంలో వచ్చే అమావాస్య రోజున హనుమంతునిని ప్రార్థిస్తే ... సకల సంపదలు చేకూరుతాయని పండితులు అంటున్నారు. రుద్రాంశ సంభూతుడైన ఆంజనేయుడిని సింధూరంతో అర్చించడం ద్వారా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని ప్రతీతి. ముఖ్యంగా హనుమంతుని జయంతిని చైత్ర శుద్ధ పౌర్ణమి నాడు వైభవంగా జరుపుకుంటారు. శ్రీరామనవమితో పాటు కొందరు హనుమంత జయంతిని జరుపుకుంటారు. ఈ పండుగను జరుపుకోలేని వారు ప్రతి మాసంలో వచ్చే అమావాస్య రోజున నిష్టతో ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించుకోవడం ద్వారా అనుకున్న కార్యాలను దిగ్విజయంగా పూర్తవుతాయని విశ్వాసం. అందుచేత అమావాస్య సాయంత్రం పూట మహిళలు, పురుషులు ఆంజనేయ స్వామికి నేతితో దీపమెలిగించి.. హనుమంతుడి ఆలయాన్ని 18 సార్లు ప్రదక్షిణ చేయడం ద్వారా మనోధైర్యం, సకలసంపదలు, ఉన్నత పదవులు లభిస్తాయని పండితులు అంటున్నారు.
అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యమ్ తవకిన్ వధ
రామదూత కృపా సింథో మత్‌కార్యమ్ సాధయ ప్రభో”
అనే మంత్రాన్ని 9 సార్లు పఠించి కర్పూర హారతులు సమర్పించుకున్న వారికి ఈతిబాధలు, గ్రహదోషాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.

ఇంకా చదవండి »

అసలు ఉత్తరాయణం, దక్షిణాయణం అంటే ఏంటి?


Sri Krishna by VISHNU108
సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు అప్పటి నుండి ప్రారంభం అవుతుంది ఉత్తరాయణం! దీన్ని మనం చాల తేలికగా కనిపెట్టవచ్చు! సూర్యుడు ఉత్తరం వైపు నుండి ఉదయిస్తాడు! అంటే తూర్పు వైపు మీరు నుంచుంటే ఎండ వల్ల మీ నీడ మీ కుడివైపు పడుతుంది! గమనించండి!

సూర్యుడు కర్కాటక రాశి లో ప్రవేసిస్తాడు! దక్షిణాయణం అంటే దక్షిణం వైపునుండి ఉదయిస్తాడు! ఇప్పుడు మీ నీడ ఎడమ వైపు పడుతుంది! ఇది దక్షిణాయణం!

ఈ దక్షిణాయనం లో దేవతలు నిద్రిస్తారు! ఆ సమయంలో మనకి పండగలు ఎక్కువగా వస్తాయి ఎందుకంటే మనం చేసే పూజలు దేవతలకి శక్తులు ఇస్తాయి (మనం అలసిపోయి పడుకుంటే విశ్వ శక్తి మనలో ప్రవేశించి ఎంత శక్తిని ఇస్తుందో మనం చేసే పూజలు వారికీ అలా శక్తిని ఇస్తాయి)! ఉత్తరాయణంలో దేవతలు మేల్కొంటారు! ఆ సమయంలో దేవతలు మనకి అన్ని విధాలుగా ఆయురారోగ్యాలు ప్రసాదిస్తారు!
మన సంవత్సరం దేవతలకిఒక్క రోజు! ఉత్తరాయణం పగలు! దక్షిణాయనం రాత్రి!

ఇంకా చదవండి »