• విష్ణుషట్పదీ స్తోత్రం

    నారాయణ నారాయణ జయ గోవింద హరే |నారాయణ నారాయణ జయ గోపాల హరే ||

  • శ్రీ రామ

    ఆపదం అపహర్థారమ్ దాతారం సర్వ సంపదం, లోకాభి రామం శ్రీ రామం భూయో భూయో నమామ్యహమ్I

  • శ్రీ సీతామాత

    త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ, హనుమాన్ యత్న మాస్తాయ దు:ఖ: క్షయ కరోభవ

  • ఓం నమ:శివాయ:

    చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర పాహిమామ్ , చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర రక్షమామ్ I

  • శ్రీమాత్రే నమః

    అమ్మల గన్న యమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాల పెద్దమ్మ, సురారులమ్మ కడుపారడి పుచ్చిన యమ్మ, తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ మాయమ్మ కృపాబ్ధి నిచ్చుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్

  • శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు

    పురుషోవిష్ణు రిత్యుక్తః శివోనానామతః స్మృతః I అవ్యక్తం తు ఉమాదేవీ శ్రీర్వా పద్మ నిభేక్షణా I తత్ సంయోగా దహంకారః స చ సేనాపతిరుహః I

పుష్యమాసం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

సంక్రాంతి పుణ్యకాలము అంటే

ప్రాచీనకాలములో శాస్త్ర అవగాహన అంతగాలేనికారణం గా సూర్యగ్రహాన్ని దేవునిగా బావించేవారు . సూర్యభవానుడు వేరు సూర్య గ్రహం వేరు .ఆది- అంతములేని ఈ విశ్వములో కోటానుకోట్ల గ్రహాలలో సూర్యగ్రహము భూమికి దగ్గరగా ఉన్న పెద్ద గ్రహాలలో ఒకటి . సూర్యభగవానుడు అదితి - కస్యపుమహామునుల బిడ్డలలో ఒకడు ... సూర్య్తతేజస్సు కలిగిన ఒక దేవతామూర్తి . సూర్యునిచుట్టూ భూమి .. భూమిచుట్టూ చంద్రుడు ఒక నిర్ధిస్ట కక్ష్యలో తిరిగే గమన్నాన్ని బట్టి మన పూర్వీకులు కాలాన్ని లెక్కించే కొలమానాన్ని అనేకులు అనేక రకాలుగా తయారుచేసి నిర్ణయించారు . అందులో ముఖ్యమైనవి హిందువులు పాటించేచి సూర్యగమన్నాన్ని బట్టి సూర్య మానము , చంద్రునిగమనాన్ని బట్టి చంచ్రమానము . ఈ రెండింటి ప్రకారమే ఈ సంక్రాంతి పుణ్యకాలము నిర్ణయిస్తారు. 

భూమిపై మారే వాతావరణ మార్పులు బట్టి , సూర్య కాంతి తీవ్రతను బట్టి , మన ప్రాచీన మునులు సంవత్సరకాలాన్ని సూర్యుడు గతి (మార్గము )మారే 12 రాశులుగా విభజించారు . దీనిప్రకారము సూర్యుడు ఒక్కొక్క నెల ఒక్కొక్క రాశిలో ప్రవేశిస్తాడు . ఇలా ప్రవేశించడాన్ని " సంక్రమణం " అంటారు . దానినే కొందరు సంక్రాంతి అంటారు .సూర్యుడు మకరరాశలలో ప్రవేశిస్తాడు .కావున ఈ సంకాంతిని " మకర సంక్రాంతి" అంటారు.

రాశులు : 12

1.మేషము 2.వృషభము 3.మిధునము 4.కర్కాటకము 5.సింహము 6.కన్య 7.తుల 8.వృశ్చికము 9.ధనుస్సు 10.మకరము 11.కుంభము 12.మీనము .

మన పూర్వీకులు సూర్యుని సంచారాన్ని రెండు భాగాలుగా విభజించారు . సూర్యుడు భూమధ్యరేకకు ఉత్తరదిశలొ ఉన్నట్లు కనిపించునప్పుడు --ఉత్తరాయణం అని , సూర్యుడు భూమధ్యరేఖకు దక్షిణముగా సంచరించునట్లు కనిపించినప్పుడు -- దక్షిణాయణము అని పిలిచారు . (సంవస్తరాన్ని రెండు ఆయణములు గా విభజించారు) . ఏడాదిలో 6 నెలలు ఉత్తరాయణం అయితే 6 నెలలు దక్షిణాయణం . ఖగోళ శాస్త్రం ప్రకారము ప్రతిసంవత్సరము జూలై 16 నుండి జనవరి 14 వరకు ఉండే కాలాన్ని ఉత్తరాయణం అని , జనవరి 15 నుండి జూలై 15 వరకు దక్షిణాయణం అని అంటారు . ఇంతటి మార్పుకు సంబంధించిన రహస్యాన్ని లోకం లోని అతిసామాన్యులకు అర్ధమయ్యేలా వివరించేందుకు పండగను చేసుకునే అలవాటును ప్రచారం లోనికి తెచ్చారు .సూర్యుడు దక్షిణాయణం నుండి ఉత్తరాయణము లో ప్రవేశించు గడియలనే పుణ్యకాలం అంటారు .మన జ్యోతిష్య్ శాస్త్రం ప్రకారము దక్షిణాయణం లో దేవతలు నిద్రించి ఉత్తరాయణమ్లో మేల్కొంటారని పురాణాలు తెలియజేయుచు్న్నాయి.ఉత్తరాయణం లో స్వర్గ ద్వారాలు తెరచుకుంటాయని , ఈ కాలలములో మరణించినవారికి వైంకుఠ ప్రాప్తి కలుగుతుందని బ్రహ్మ సూత్రాలు చెబుతున్నాయి . ఈ మకర సంక్రమణము పుష్య మాసం నుండి వస్తుంది. దక్షిణాయణము లో చనిపోయిన మన ఆత్మీయులు మనమిచ్చే తర్పణాలు మూలముగా ఉత్తరాయణ ప్రారంభం కాగానే తెరి్చియున్న ద్వారాలు గుండా వైకుంఠం చేరుకుంటారని (వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని ) నమ్మకం . అందుకే పెద్దలకు పూజలు , కొత్తబట్టలు , నైవేద్యాలు పెడతారు ... పూజలు జరుపుతారు . అంతా నమ్మకమే. . . ఆ నమ్మకాన్ని వమ్ము చేయకూడదు .

చంద్రమానము ప్రకారము -- చంద్ర గ్రహము ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటాదో ఆ నెలని ఆ నక్షత్రం పేరుతో పిలుస్తారు. తెలుగు నెలలు (తెలుగు మాసములు) :తెలుగు నెలలు పన్నెండు. ప్రతి నెల శుక్ల పక్ష పాడ్యమి (అమావాస్య తర్వాత వచ్చే తిథి) తో మొదలై అమావాస్యతో ముగుస్తుంది.

ప్రతి నెలలో రెండు పక్షాలు ఉంటాయి:

1. శుక్ల పక్షం లేదా శుద్ధ పక్షం (ప్రతి నెల మొదటి తిథి పాడ్యమి నుంచి పున్నమి వరకు): రోజు రోజుకూ చంద్రుడి తో పాటు వెన్నెల పెరిగి రాత్రుళ్ళు తెల్లగా, కాంతివంతంగా అవుతాయి. (శుక్ల అంటే తెల్లని అని అర్థం).

2. కృష్ణ పక్షం లేదా బహుళ పక్షం (ప్రతి నెల పున్నమి తరువాత వచ్చే పాడ్యమి తిథి నుంచి అమావాస్య వరకు): రోజు రోజుకూ చంద్రుడి తో పాటు వెన్నెల తరిగి రాత్రుళ్ళు నల్లగా చీకటితో నిండుతాయి. (కృష్ణ అంటే నల్లని అని అర్థం).

తెలుగు నెలలు

1. చైత్రము
2. వైశాఖము
3. జ్యేష్ఠము
4. ఆషాఢము
5. శ్రావణము
6. భాద్రపదము
7. ఆశ్వయుజము
8. కార్తీకము
9. మార్గశిరము
10. పుష్యము
11. మాఘము
12. ఫాల్గుణము

ఈ నెలల పేర్లు ఒక్కో నక్షత్రం పేరు మీద ఒక్కొక్క నెల ఏర్పడినట్లు సులభంగా గుర్తించవచ్చు.

* పౌర్ణమి రోజున చిత్తా నక్షత్రం (అనగా చంద్రుడు చిత్తా నక్షత్రం తో కలిసిన రోజు)అయితే ఆ నెల చైత్రము .
* పౌర్ణమి రోజున విశాఖ నక్షత్రం (అనగా చంద్రుడు విశాఖ నక్షత్రం తో కలిసిన రోజు)అయితే ఆ నెల వైశాఖము.
* పౌర్ణమి రోజున జ్యేష్ఠ నక్షత్రం (అనగా చంద్రుడు జ్యేష్ఠా నక్షత్రం తో కలిసిన రోజు)అయితే ఆ నెల జ్యేష్ఠము .
* పౌర్ణమి రోజున పూర్వాషాఢ నక్షత్రం (అనగా చంద్రుడు పూర్వాషాఢా నక్షత్రం తో కలిసిన రోజు)అయితే ఆ నెల ఆషాఢము.
* పౌర్ణమి రోజున శ్రవణం నక్షత్రం (అనగా చంద్రుడు శ్రవణం నక్షత్రం తో కలిసిన రోజు)అయితే ఆ నెల శ్రావణము .
* పౌర్ణమి రోజున పూర్వాభాద్ర్హ నక్షత్రం (అనగా చంద్రుడు పూర్వాభాద్రా నక్షత్రం తో కలిసిన రోజు)అయితే ఆ నెల భాద్రపదము.
* పౌర్ణమి రోజున అశ్వని నక్షత్రం (అనగా చంద్రుడు అశ్వనీ నక్షత్రం తో కలిసిన రోజు)అయితే ఆ నెల ఆశ్వయుజము.
* పౌర్ణమి రోజున కృత్తిక నక్షత్రం (అనగా చంద్రుడు కృత్తికా నక్షత్రం తో కలిసిన రోజు)అయితే ఆ నెల కార్తీకము.
* పౌర్ణమి రోజున మృగశిర నక్షత్రం (అనగా చంద్రుడు మృగశిరా నక్షత్రం తో కలిసిన రోజు)అయితే ఆ నెల మార్గశిరము .
* పౌర్ణమి రోజున పుష్యమి నక్షత్రం (అనగా చంద్రుడు పుష్యమీ నక్షత్రం తో కలిసిన రోజు)అయితే ఆ నెల పుష్యము.
* పౌర్ణమి రోజున మఖ నక్షత్రం (అనగా చంద్రుడు మఖా నక్షత్రం తో కలిసిన రోజు)అయితే ఆ నెల మాఘము.

* పౌర్ణమి రోజున ఉత్తరఫల్గుణి (ఉత్తర) నక్షత్రం (అనగా చంద్రుడు ఉత్తరఫల్గుణీ నక్షత్రం తో కలిసిన రోజు)అయితే ఆ నెల ఫాల్గుణము.

ఇంకా చదవండి »

బోగి పండ్లు

రేగు పళ్ళని సంస్కృతంలో బదరీ ఫలాలంటారు. పూర్వం నర నారాయణులు బదరీ వనంలో తపస్సు చేశారు. అక్కడ తపస్సు చేసుకుంటూ వాళ్ళు రోజూ చుట్టుపక్కలవున్న చెట్లనుంచి ఒక్క రేగు పండుని ఆహారంగా తీసుకునే వాళ్లు. సాక్షాత్తూ నారాయణుడు అక్కడ తిరుగుతూ, రేగు పళ్ళని తింటూ, ఆ ప్రదేశాల్నీ, వృక్షాలనీ, వనాన్నీ స్పృశించి ఆశీర్వదించారు. ఆ ప్రదేశమే బదరీ క్షేత్రం.

బదరీ ఫలాలు నారాయణుడిచే స్పృశించబడి సాక్షాత్తూ ఆ దేవ దేవుని ఆశీస్సులు పొందాయి కనుక ఆ పళ్ళను ఎవరు వాడినా సిరిసంపదలు, భోగ భాగ్యాలతో తులతూగుతారంటారు. భోగినాడు పెద్దవారు పిల్లలకి భోగి పళ్ళుపోసి ఆశీర్వదిస్తారు. వారి ఆశీర్వచనాలతోబాటు ఆ నారాయణుడి ఆశీస్సులు కూడా వారికి అందుతాయనే నమ్మకంతో.

రేగి పండు భారత ఇతిహాసంలో.... భారత నాగరికతలో..... పూజలలోను పాలు పంచుకున్న అతి కొద్ది పండ్లలో రేగి పండు ఒకటి. రేగి పండును బదరీ ఫలం అంటారు. రామాయణంలో శబరి శ్రీరామునికి తినిపించింది ఈ ఫలాలనే. సంక్రాంతి నాడు బోగి పండ్లు పోయాలి అని అంటుంటారు అవి కూడ రేగి పండ్లే.

సంక్రాంతి పండుగకు వచ్చే ముందురోజున "భోగి" పండుగ జరుపుకుంటాం. సూర్యుడు ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి ప్రవేశించే ముందు రోజునే భోగి అంటారు. పంట మంచి దిగుబడి సాధించిన రైతుల ఇళ్లల్లో ధన, ధాన్యలక్ష్మిలు కొలువై ఉంటారు కనుక వారు ఈ పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు.

మూడు రోజులపాటు జరిగే ఈ పండుగను భోగి, సంక్రాంతి, కనుమ పేర్లతో వైభవంగా నిర్వహిస్తారు. భోగిరోజున తెల్లవారకముందే గ్రామంలోని నాలుగు వీధుల కూడలిలో భోగిమంటలు వెలిగిస్తారు. ఇంట్లో పేరుకుపోయిన పాత పుల్లలు, చెక్కముక్కలన్నీ తీసుకొచ్చి ఈ మంటల్లో వేస్తారు.

భోగి మంటల పరమార్థం ఏమిటంటే.. ఆ మంటల ద్వారా చలిని పారద్రోలటమేగాకుండా. ఆ రోజు నుంచి జీవితాన్ని కొత్తవాటితో ప్రారంభించాలని అర్థం చేసుకోవాలి. అలాగే మనసులో పేరుకుపోయిన చెడును కూడా విడిచిపెట్టాలని, అందులోని ఏకీకరణ భావాన్ని కూడా వారు అర్థం చేసుకోమని సూచిస్తుంటారు.

ఇక భోగి రోజు సాయంత్రంపూట అందరి ఇళ్లలోనూ ఏర్పాటుచేసే బొమ్మల కొలువంటే పిల్లలకు భలే సరదా. ఈ బొమ్మల కొలువుల్లో పిల్లలు వారి దగ్గర ఉండే అన్నిరకాల ఆట వస్తువులను ఉంచి సంతోషిస్తారు. అలాగే ఈ సందర్భంగా తల్లులు పేరంటాన్ని ఏర్పాటు చేసి ఇరుగుపొరుగు మహిళలకు పసుపు కుంకుమలు అందిస్తారు.

దీనికి ప్రతిగా వారంతా రేగిపళ్లు, పువ్వులు, రాగి నాణాలను చిన్నారుల తలలపై ధారగా పోస్తారు. ఆ తర్వాత వారిని మనస్ఫూర్తిగా దీవించి వెళతారు. రైతుల ఇళ్లల్లో ధాన్యలక్ష్మి సమృద్ధిగా ఉంటుంది కాబట్టి, ఈ మూడురోజులపాటు కొత్తబట్టలను కొనుక్కుని కట్టుకోవటంతోపాటు, అనేక పిండివంటలతో విందు చేసుకుంటారు.

బోగిపళ్ళు: బోగి పండ్లు అంటే రేగుపండ్లు. ఇది సూర్యునికి ప్రీతిపాత్రమైన పండుగ. సూర్యుని రూపం, రంగు, పేరు కలిగిన రేగుపండ్లతో నాణేలను కలిపి పిల్లల తలపై పోస్తారు. సూర్య భగవానుని అనుగ్రహం పిల్లలపై ప్రసరించి ఆరోగ్యం కలగాలనే సంకేతంతో బోగిపండ్లు పోస్తారు

ఇంకా చదవండి »

శని త్రయోదశి


జ్యోతిష్య శాస్త్రరీత్యా శని శనివారానికి అధిపతి. ఏ వ్యక్తికైనా పూర్వజన్మ సుకృత, దుష్కృత ఫలితాలను ప్రదానం చేసే అధికారం శనిది. ఆధ్యాత్మిక జ్యోతిష్యంలో శనిని పూర్వజన్మలోని సంచిత కర్మలకు అధిష్టాతగా చెప్పబడింది. శని దశల్లో వ్యక్తికి పూర్వజన్మలోని దుష్కర్మలకు సైతం దండన లభిస్తుంది. బౌతిక దృష్టిలో శని క్రూరుడుగా కనపడినా వాస్తవానికి అగ్ని పరీక్షకు గురి చేసి వ్యక్తిని సత్కర్మల వైపు మళ్ళిస్తాడు.. ఈశ్వర శాసనంలో శని దండనాధికారి. శని మనం చేసిన దుష్కర్మాలకే దండన విధిస్తాడు నిష్పక్షపాతంగా ఉన్న న్యాయాధిపతిలా శని దండన విధిస్తాడు.

శనివారానికి స్థితి కారకుడైన శ్రీమన్నారాయణుడు అధిపతి, త్రయోదశికి అధిపతి కామదేవుడు. అంటే శివుడు. అలా శివకేశవుల క్రియలకు శని అధిపతి అయ్యాడు. అందుకే శనిత్రయోదశి శనికి ఇష్టమైన రోజు. త్రయోదశి తిథి శివుడికి ఎంతో ప్రీతికరమైనది. క్షీరసాగర మదనం జరిగి అమృతం ఉద్భవించిన తరువాత, హాలాహలాన్ని దిగమింగి తన కంఠంలో దాచుకొని లోకాలను కాపాడిన శివుడికి కృతఙ్ఞతలు చెప్పడానికి దేవతలందరూ ఆయన వద్దకు వెళ్ళినది ఈ త్రయోదశి తిథి నాడే అని పురాణాల ద్వారా తెలుస్తుంది. ఆ సమయంలో శివుడు, మన గణాల ప్రకారం 2 గంటల 24 నిమిషాల పాటు ఆనంద తాండవం చేసాడట. ఆ శివ తాండవాన్ని దేవతలందరూ పరవశించి చూస్తూ ఆనందించారని చెప్పబడింది. ఆ తాండవం చేసిన సమయమే ప్రదోషం. ప్రదోషమంటే మునిమాపు వేళ దోషం అంటే రాత్రి అని అర్ధం చంద్రున్ని దోషాకరుడు అని అంటారు, రాత్రికి కారణమయ్యేవాడనే అర్ధం ప్రదోషమంటే దోష ప్రారంభకాలం అంటే రాత్రి ప్రారంభ సమయం.

శనికి ప్రదోష పూజలు
ప్రదోష కాలంలో చేసే పూజాపునస్కారాలు దానధర్మాలు మామూలు సమయంలో చేసే వాటికంటే అధిక శుభఫలితాలనిస్తాయి, అలాగే ఈ సమయం లో చేసే పాపాలు కూడా అధిక చెడు ఫలితాలనిస్తాయి. శని త్రయోదశి ప్రదోష సమయాన శివుడికి అభిషేకం చేయడం చాల విశేషంగా లాభిస్తుంది. ఈ సమయంలో శివుడికి చేసే పూజలు అత్యంత ఫలితాలనిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. జాతక రీత్యా శని బాగాలేని వారు, శని దశ అంతర్దశలు జరుగుతున్నవారు. ఏలిననాటి శని, అష్టమ శని, అర్దాష్టమ శని వలన పీడింప బడుతున్నారో అటువంటి వారు ఈ రోజు శని పరిహారాలు అంటే నువ్వుల నూనెతో శనికి అభిషేకం చేయడం, ఉపవాసం ఉండడం, రావి చెట్టుకి ప్రదక్షిణాలు చేసి ఆవ నూనెతో దీపం పెట్టడం, నువ్వుల నూనెలో ముఖం చూసుకొని ఆ నూనెని దానం చేయడం. నల్ల కాకి కి అన్నం పెట్టడం, నల్ల కుక్కకి అన్నం పెట్టడం, నల్లని గొడుగు, నల్లని వస్త్రాలు, తోలు వస్తువులు, నవధాన్యాలు, ఇనుము దానం చేయడం మంచిది. ఈ విధం గా శని ని పూజించి ఆరాదిస్తే బద్ధకం, చెడు ఆలోచనలు, రోగాలు, అపమౄఎత్యు దోషము, దార్రిద్యం తొలగుతాయి. వౄఎత్తిపరమైన సమస్యలు, వివాహంలో ఆటంకాలు, శత్రు భయం, కోర్టు సమస్యలలో ఉన్న వారి సమస్యలు కూడా తొలగుతాయి.

దేవతలకు సైతం భయం
శని అనే మాట వినగానే అందరిలోనూ అలజడి మొదలవుతుంది. సాధారణ మానవులే కాదు, దేవతలు సైతం ఆయనంటే భయపడుతుంటారు ... ఆయన బారిన పడుతుంటారు. శనికి శనివారమంటే ఎందుకు ఇష్టమో ... శని త్రయోదశి రోజునే ఆయనను ఎందుకు పూజించాలనే సందేహం కొంతమందికి కలుగుతూ వుంటుంది.
సూర్యుడు - సంజ్ఞాదేవి దంపతులకు వైవస్వతుడు - యమధర్మరాజు జన్మించారు. ఆ తరువాత సూర్యుడి వేడి భరించలేని సంజ్ఞాదేవి, తన నీడకి ప్రాణం పోసి పుట్టినింటికి వెళ్లిపోయింది. ఆ నీడయే ఛాయాదేవి. సూర్యుడి వలన ఆమె సావర్ణి మనువుకు ... శనీశ్వరుడికి జన్మనిచ్చింది. వైశాఖ మాసంలో త్రయోదశిన శని జన్మించాడు. ఆయన పుట్టిన రోజు ... శనివారంగా ప్రసిద్ధి చెం దింది.

నల్లని పదార్థాల తో
ఈ కారణం గానే శని వారంతో కూడిన త్రయోదశి రోజున శనికి పూజలు చేస్తుంటారు. ఈ రోజు ఉదయాన్నే తలస్నానం చేసి శనిదేవుడికి నువ్వుల నూనెతో దీపం పెట్టి, నువ్వుల నూనెతోనే ఆయనకి అభిషేకం చేయాలి. నువ్వుల నూనెతో చేసిన వంటకాలనే శనికి నైవేద్యంగా సమర్పించాలి. నువ్వులను ... నల్లని వస్త్రాలను బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి. శని వాహనమైన కాకికి ఆహారాన్ని ఏర్పాటు చేయాలి. ఈ విధంగా చేయడం వలన దోషాలు తొలగిపోతాయని శాస్త్రం చెబుతోంది. ఇక ఏలినాటి శనితో బాధపడుతున్న వారు వరుసగా 13 శనివారాలు శనిదేవుడిని పూజించడం వలన, ప్రతి శనివారం హనుమంతుడికి సిందూ రాభిషేకం చేయించ డం వలన మంచి ఫలితం ఉంటుందని శాస్త్రం తెలియజేస్తోంది.

భారతీయ ఖగోళశాస్త్రం ప్రకారం నక్షత్ర, గ్రహకూటములు ఓ వ్యక్తి పుట్టుక మొదలు అతని జీవిత పర్యంతం ప్రభావి తం చేస్తాయి. గ్రహాల స్థితిని అనుసరించి అతని భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఈ గ్రహాలన్నింటికన్నా శని గ్రహం ప్రభావం మానవులపై ఎక్కువగా ఉంటుంది.

పీడించే దేవుడు కాదు
విశ్వాన్ని గ్రహాలు ప్రభావితం చేస్తున్నా... శనీశ్వరుడి ప్రభావం చాలా తీవ్రమై నదని చెప్పవచ్చు. మానవులకు ఎదురయ్యే కష్టసుఖాలకు, వారి వారి కర్మల అనుసారంగా ఫలితంగా ప్రసాదించేది శని దేవతనే! సాధార ణంగా శనిదేవతపై అనేకమందిలో చాలా రకాలైన అపోహలున్నాయి. శనీశ్వరుడి పేరు చెప్పగానే ఉలిక్కిపడతాం. నామాన్ని ఉచ్ఛరించడానికి సైతం వెనకాడతాం. ఆయనకు ఆగ్రహం కలిగే పనుల్ని చేయరాదని తీర్మానించుకుంటాం. శనీశ్వరుడిని ఆహ్వానించినట్టవుతుందని తైల పదార్థాలు వేటినీ చేతులతో అందుకోం. ఆయన దృష్టి మనపైకి సోకరాదని పదే పదే కోరుకుంటాం. కొన్ని ప్రాంతాలవారైతే శనివారంనాడు తిలా సంబంధిత వస్తువులేవీ కొనరు, తినరు. అంత భయం ఆయనంటే. శనీశ్వరుడు కేవలం క్రూరత్వానికి, పీడించడానికి మాత్రమే ఉద్దేశించబడలేదు.

గ్రహరూపంలో ఉండే భగవంతుడు
సృష్టి, స్థితి, లయ కారకులు త్రిమూర్తులు. మనం చేసిన కర్మల ఫలితాలనివ్వడానికి భగవంతుడే గ్రహాల రూపంలో అవతరించాడు. ఒక్కో గ్రహానికి ఒక్కో దేవత మూల పురుషుడు. సూర్యుడు, చంద్రుడు, మార్స్, మెర్క్యు రీ,బౄఎహస్పతి, వీనస్, శని గ్రహాలకు వరుసగా శ్రీరాము డు, శ్రీకౄఎష్ణుడు, నరసింహస్వామి, బుద్ధుడు, వామనుడు, పరశురాముడు, కూర్మావతార విష్ణువు, వరాహస్వామి, మత్స్యావతార స్వామి ఆవహించి ఉన్నారు. అందువల్ల గ్రహాలు దైవాంశసంభూతులని అర్థంచేసుకోవాలి. గ్రహకూటములు రాజ్యాలను కూల్చడానికే కాక మొత్తం ప్రపంచం ఉనికికే మూలం.

పూర్వజన్మ కర్మ ఫలం
ఓ వ్యక్తి పూర్వ జన్మలో చేసిన కర్మల ఫలితాలనే ఈ జన్మలో అనుభవిస్తాడు. అందుకే ప్రతి వ్యక్తీ తన మహర్దశ, అంతర్దశలను తెలుసుకోవలసిన అవసరం ఉంది. జీవితంలో ఎదు రయ్యే చేదు అనుభవాలనుంచి తప్పించుకోవడానికి ఇది చాలా అవసరం. శని మంచి దృష్ట్టితో ఉంటే జీవి తం నందనవనమవుతుంది. అదే శనిదేవుడు వక్రదౄఎష్టి పడిందంటే అంతే సంగతులు. ఆయన అనుగ్రహముంటే రాజ్యాలేలే చక్రవర్తులవుతారు. ఆయన గనుక పట్టుకు న్నాడంటే అమీరులయినా బికారులవడం ఖాయం. అయితే, ఇక్కడ గుర్తుంచుకోవలసిన అంశం. చెడు కార్యాల్లో నిమగ్నమైనవారినే శనీశ్వరుడు పీడిస్తాడు.


ఫలితం అనుభవించాల్సిందే: ఎంత దైవాంశసం భూతులైనా వారి వారి కర్మలననుసరించి ఫలితాలను అనుభవించి తీరాలి. చెడుకార్యాలకు పాల్పడినవారిని శనిదేవుడు తప్పనిసరిగా శిక్ష విధిస్తాడు. పురాణాల ప్రకారం సూర్యభగవానుడు కర్మలకు సాక్షి అయితే, శనిదేవుడు వాటి ఫలితాలను నిర్దేశిస్తాడు. ఆయా ఫలితాలను మాతౄఎగర్భంనుంచి వెలువడిన మరుక్షణం నుంచీ అనుభవించడం మొదలవుతుంది. మంచి కార్యాలు చేసినవారికి శనిదేవుడు చల్లగా చూసి అద్భుతమైన జీవితం ప్రసాదిస్తాడు. ఇది అర్థం చేసుకోనివారు శని భగవానుని క్రూరాత్మునిగా భావిస్తారు. ఇది కేవలం మూర్ఖత్వం. శని దేవుడికి భయపడడం అవివేకం. ఆయన మానవ కర్మలకు ఫలితాలనిచ్చే దైవం. అలుపు సొలుపూ లేకుండా బిజీగా ఉండే లైఫ్‌లో కొంచెం సమయాన్ని సత్కార్యాలకు కేటాయించాలి. నిజాయితీగా జీవించాలి.

ఇంకా చదవండి »

పుష్యమాసం

మార్గశిర మాసం పుష్య మాసం చాంద్రమాన ప్రతీకలు! చంద్రుడు ప్రతిరోజూ ఒక నక్షత్రంతో కలిసి ఉదయిస్తున్నాడు. ఇలా చంద్రుడు పౌర్ణమి రోజున పుష్యమీ నక్షత్రంతో కలిసి ఉదయించే మాసం పౌష్యం!
పుష్యమాసం శూన్య మాసమనీ, నిష్ఫల మాసమనీ నిండా ఉన్నప్పటికీ సూర్యుడు ధనుస్సు రాశిలో ఉదయించే సమయంలోని పుష్యమాసం పండుగానేల అన్నది మన సంప్రదాయం! మార్గశిర, పుష్యమాసాలతో కూడి ఉన్నది 'ధనుర్మాసం'! చంద్రుడు రోజు ఒక నక్షత్రంతో కలిసి ఉదయిస్తాడు. సూర్యుడు పదమూడు రోజులు ఒకే నక్షత్రంలోనే ఉదయిస్తాడు. రెండుంబావు నక్షత్రాలు ఒక రాశి.

అందువల్ల సూర్యుడు నెలరోజుల పాటు ఒక రాశితో కలిసి ఉదయిస్తున్నాడు. ధనుస్సులో సూర్యుడు కలసి ఉదయించడం మొదలైన రోజు ధనుస్సంక్రాంతి. ఆ రోజు నుండి సూర్యుడు 'మకరం'టో కలసి ఉడాయించడం ఆరంభమయ్యే వరకు ధనుర్మాసం!!  ది సౌరమాసం - సూర్యునికి సంబంధించినది సౌరం. చంద్రునికి సంబంధించినది చాంద్రమాసం. సంక్రాంతి నుండి సంక్రాతి వరకు సూర్యుని నెల. అమావాస్య తరువాతి పాడ్యమి నుండి అమావాస్య వరకు చంద్రుని నెల పాటించడం దక్షిణ భారతంలోని సంప్రదాయం. అందువల్ల ధనుర్మాసంలో కొంత మార్గశిరం కొంత పుణ్యం కలిసి ఉంటాయి. నిరయణ పద్ధతిలో ఈ ఏడు ధనుర్మాసం మార్గశిర బహుళ నవమి మంగళవారం - డిశంబర్ 16 వ తేదీ నాడు ఆరంభమైంది. ధనుర్మాసం 'పండుగ నెల'. 

ఇంకా చదవండి »

ఆదివారం పుష్య అమావాస్య : పుణ్య తీర్థాల్లో పితృదేవతలకు అర్ఘ్యమివ్వండి

" The lingering moon caught Cinder’s attention, and a shock of goose bumps covered her arms. The moon had always given her a sense of paranoia, like the people who lived up there could be watching her, and if she stared for too long, she might draw their attention. "
మనదేశంలో గంగ, యమునా వంటి పుణ్య నదులు అనేకాలున్నాయి. రామేశ్వరం, కన్యాకుమారి వంటి ప్రాంతాల్లో పుణ్య సముద్ర తీర్థాలు కూడా ఉన్నాయి. అమావాస్య రోజుల్లో ఇలాంటి పుణ్య నదుల్లో, పుణ్య తీర్థాల్లో స్నానమాచరించి, పితృదేవతలకు తర్పణాలు ఇవ్వాలని నిపుణులు అంటున్నారు. అది ఎందుకో తెలుసా..

ముఖ్యంగా పితృదేవతలకు మహాలయ అమావాస్య, పుష్య అమావాస్య, ఆషాఢ అమావాస్య నాడు పూజలు, తర్పణాలిస్తే మంచి జరుగుతుంది. మనకు ఒక ఏడాది దేవతలకు ఒక రోజుగా పరిగణించబడుతోంది. ఇందులో ఆషాఢం నుంచి పుష్యమి వరకు దేవతలు రాత్రి సమయం.

ఈ సమయంలో దేవతలు విశ్రాంతి తీసుకుంటారని, ఆ సమయంలో మనల్ని పితృదేవతలు రక్షిస్తారని పండితులు అంటున్నారు. అలాగే పుష్యమి నుంచి ఆషాఢం వరకు దేవతలకు పగలు. అందుచేత ఆషాఢ అమావాస్య రోజున పితృదేవతలకు స్వాగతం పలికి, పుష్య అమావాస్య రోజున వీడ్కోలు ఇచ్చి పంపాలి.

అయితే పితృదేవతలు ఆడంబర పూజలు అవసరం లేదు. పితృదేవతలను పుణ్య తీర్థాల్లో అర్ఘ్యమివ్వాలి. ఎందుకంటే.. శ్రీహరి, లక్ష్మీదేవి సీతారాములుగా కాలిడిన రామేశ్వరం పుణ్యతీర్థమైంది. పార్వతీదేవి కన్యకాదేవిగా అవతరించిన ప్రదేశం కన్యాకుమారి. ఇలాంటి పుణ్యస్థలాల్లో పితృదేవతలకు అర్ఘ్యమివ్వడం ద్వారా మన పాపాలు మాత్రమే తొలగిపోవడం కాకుండా.. వంశానికే మంచి జరుగుతుంది.

అలాగే అమావాస్య రోజు అన్న, వస్త్ర, బియ్యం, కాయగూరలు దానం చేయాలి. ఇలా చేస్తే సిరిసంపదలు, సుఖసంతోషాలు చేకూరుతాయి. అలాగే పూర్తి అమావాస్యలో శుభకార్యాలు చేస్తే పితృదేవతల ఆశీర్వాదం లభిస్తుందని పండితులు అంటున్నారు. అందుచేత పుష్య అమావాస్య (ఫిబ్రవరి 10)నాడు పుణ్య తీర్థాల్లో పితృదేవతలకు అర్ఘ్యమిచ్చి వారి అనుగ్రహం పొందండి.

ఇంకా చదవండి »

పుష్య మాసం




ఈ మాసంలో చంద్రుడు పుష్యమి నక్షత్రానికి సమీపంలో ఉంటాడు కాబట్టి "పుష్య మాసంగా" వ్యవహరిస్తారు. ఈ మాసంలో "శ్రీ మహావిష్ణువును, శివుని, సూర్య నారాయణ మూర్తిని" ఆరాధిస్తారు. పుష్య శుద్ధ విదియ లగాయతు పంచమి వరకు శ్రీ మహావిష్ణువును తులసిదళాలతో పూజించడం "సౌందర్య" ప్రదాయినిగా
చెప్పబడింది. అలాగే, ఈ మాసంలో "ఆదివారాలు" సూర్య భగవానుని జిల్లేడు పూలతోను, "సోమవారాలు" పరమశివుని మారేడు దళాలతో అర్చించడము, అత్యంత విశేష ఫలితాన్ని ప్రసాదిస్తుంది.

ఇంకొక విశేషం ఏమిటంటే, "పుష్యమి" శనేశ్వరుని జన్మ నక్షత్రం కాబట్టి, ఈ మాసం అంతా, ప్రతి రోజు, సూర్యోదయాత్ పూర్వమే తల స్నానం చేసి, శనీశ్చరుని భక్తీ శ్రద్ధలతో పూజించి, పౌర్ణిమ నాడు శనీశ్చరునికి తైల అభిషేకం జరిపించి, నువ్వులు దానం ఇచ్చిన వారికి శని ప్రసన్నుడై సర్వ శుభములు ప్రసాదిస్తాడని పురాణ వాక్కు. ఈ విధంగా ఆచరించేవారుశనీశ్చరునికి ప్రీతి కాబట్టి, నువ్వులు, బెల్లం వారి ఆహారంలో భాగంగా చేసుకోవడం పరిపాటి. ముఖ్యంగా జాతక రీత్యా "ఏలినాటి శని" మరియు "అష్టమశని" ఉన్నవారు పై విధిని ఆచరించడం ద్వారా చాల ఉపశాంతి పొందుతారు.ఈ మాసంలో "వస్త్ర దానం" విశేష ఫలితాన్ని ఇస్తుంది.

ఈ మాసంలో సుర్యారాధన విశేషంగా చెప్పబడింది కనుక, ఈ మాసం అంతా సర్వ దేవతామయుడు, సర్వ వేద మూర్తి, ప్రత్యక్ష దైవము అయిన శ్రీ సూర్య భగవానుని
నియమంగా ఆరాధిస్తూ, ప్రతి రోజు స్నానానంతరం సూర్యోదయ సమయంలలో (సూర్య భగవానుని ప్రత్యక్షంగా చూస్తూ) ఆదిత్య హృదయ పారాయణ చేయడంవాళ్ళ చక్కని ఆరోగ్యం, ఇస్వర్యం, పొందుతారు అని పెద్దల మాట. ఈ నియమం పాటించేటప్పుడు కత్తితో / కత్తిపీటతో / మిక్సీ తో తరగబడిన కూరగాయలు, నిషిద్ధ ఆహారములు తినకూడదు.

పుష్య బహుళ అమావాస్య (30 January, 2014) నే చొల్లంగి అమావాస్య లేదా మౌన అమావాస్య అని అంటారు. "చొల్లంగి" అనేది తూర్పు గోదావరి జిల్లలో చిన్న గ్రామం. ఇక్కడే గోదావరి ఏడవ పాయ, సముద్రంలో కలుస్తుంది. అందుకే, ఇక్కడ భక్తులు ఆనాడు, పుణ్య స్నానాలు ఆచరిస్తారు. సప్త సాగర యాత్ర చేసే యాత్రీకులు, చొల్లంగి వద్ద నున్న గోదావరి నదిలో స్నానం చేయడం తో వారి యాత్రను ముగిస్తారు. మౌని అమావాస్య- మౌన వ్రతం ఆచరించడం కూడా చెప్పబడి ఉంది. 

ఇంకా చదవండి »

పుష్య మాసం - నువ్వులు , బెల్లం ప్రాముఖ్యత

పుష్యమాసం శని మాసం. ఈ మాసం లో శని ప్రభావం అధికంగా ఉంటుంది. జ్యోతిశాస్త్రం ప్రకారం శని మన శరీర జీవ నాడి కారకుడై ఉంటాడు. ఈ జీవ నాడి యొక్క ఒక శాఖ హృదయ స్పందనను ,రక్త ప్రసరణను నిర్ణయిస్తుంది. ధనుర్మాసం అయిపోయేటప్పటికి ,శరీరంలోని కొవ్వు పదార్ధం తగ్గడం వల్ల , మకర మాసం మొదలు అయ్యే సమయానికే ఈ కొవ్వు పదార్ధపు కొరతను తీర్చాలని చెప్పబడింది. ఇందు వల్ల రవి ప్రభావం (ఎండ వేడిని) ఎదుర్కోవటానికి శరీరంలోని ముఖ్య జీవనాడి ఆరోగ్యంగా పని చెయ్యడం వల్ల, హృదయ స్పందన సక్రంగా ఉండేటట్లు చెయ్యగల "నువ్వులు -బెల్లం " తినాలి అనే నియమం పెట్టారు.

పుష్యమి నక్షత్రం శని నక్షత్రం ఈ నక్షత్రానికి బృహస్పతి అధిదేవత . శనికి అధి దేవత యముడు. "యమం " అంటే "సం యమం" అని అర్ధం, అంటే ఆధీనంలో ఉంచుకోవటం. అంటే శరీరాన్ని ఆరోగ్యపు ఆధీనంలో ఉంచుకోవటం ఈ జీవ నాడి మూలంగ మాత్రమే సాధ్యమవుతుంది. జీవనాడి యొక్క ఈ క్రియకు కొవ్వు పదార్ధం తక్కువ అయితే శ్క్తి లేకపోవడం, అనారోగ్యం మొదలు అయినవి కలుగుతాయి. వీటిని నివారించే శక్తి కేవలం నువ్వులు బెల్లానికి మాత్రమే ఉంది.

శని ధర్మ దర్శి. న్యాయం,సత్యం,ధర్మాలను ఎత్తి చూపించేవాడు. సర్వ ప్రాణుల సమస్త విశ్వ ప్రేమను,పవిత్రతను ఉద్ధరిచేవాడు అతడే . మానవుడు ఈ నెలలో నువ్వులు సేవించి,నియమ నిష్ఠులు పాటించినట్లు అయితే శనికి పైన చెప్పిన గుణాలు అన్నీ పొందవచ్చు. ఎప్పుడూ మనిషి వీటిని పొదుతాడోఅప్పుడతడు బృహస్పతి వంటి వాడు అవుతాడు. అందువల్ల,పుష్యమి నక్షత్రానికి బృహస్పతిని అధి దేవతగా చెప్తారు.

అంతే గాక గరుడ పురాణంలో నాభిస్థానం శని స్థనం అని నిరూపితమైంది. పరమాత్ముని నాభీ కమలం నుండే సృష్టికర్త అయిన బ్రహ్మ జన్మించాడు. ఎప్పుడు శరీరంలోని ఈ నాభి ప్రదేఅశాన్ని శని ప్రదేఅసమని చెప్పారో, అప్పుడే ఈ ప్రదేఅశనికి ఇవ్వభదిన ప్రాముఖ్య మంతటికి శని ప్రభావమే కారణం అని చెప్పినట్లు మనం గ్రహించాలి.

ఇంకా చదవండి »

సంక్రాంతి - ఉత్తరాయణ పుణ్యకాలం

సంక్రాంతి పర్వదినాన సూర్యుడు మకర రాశి అధిపతి, తన కుమారుడు అయిన శనీస్చరుని ఇంట ప్రవేశిస్తాడు. పురాణ కథనానుసారం, ఇరువురూ బద్ధ విరోధులే అయినా మకర సంక్రాంతి రోజున సూర్యభగవానుడు విధిగా తన కుమారుడు శనితో సమావేశమవుతాడు. ఒక నెల రోజులు కొడుకు ఇంటనే గడుపుతాడు. ఈ విధంగా ఈ పర్వదినం తండ్రీ కొడుకుల అనుబంధానికి కూడా ఒక సంకేతం అని చెప్పవచ్చు.

ఉత్తరాయణ పుణ్యకాలం దేవతలకు పగలుగా - దక్షిణాయనం రాత్రిగా భావించడంతో దేవతలు పగలులో సంక్రమించే మకర సంక్రాంతిని ఒక మహాపర్వదినంగా భావస్తారు. ఉత్తరాఁణ పుణ్యకాలాన్ని దేవమానంగా, దక్షిణాయనాన్ని పితృయానంగా భావించడం అనాదిగా వస్తున్న సంప్రదాయం.

ఇక సంక్రాంతి పర్వదినంలోనే శ్రీహరి రాక్షసుల్ని సంహ రించి వారి తలలు నరికి మందర పర్వతం కింద పాతిపెట్టి, దేవతలకు సుఖశాంతు లు ప్రసాదించాడనీ అందుకే ఈ పండుగని అశుభాల్లోంచి శుభాల్లోకి ప్రవేశించే సింహద్వా రంగా భావించి పవిత్రంగా ఈ పండుగని జరుపుకుంటారు.

కపిల మహాముని ఆశ్రమ ప్రాంగణంలో భస్మమైన 60000 మంది సాగర మహారాజు కుమారులకు సద్గతులు కల్పించడానికి భగరధ మహారాజు కఠోర తపస్సు చేసి గంగానదిని భూమికి అవతరింపచేసాడు. కపిల ముని ఆశ్రమమే నేటి గంగాసాగర్‌ అని భక్తుల విశ్వాసం. సంక్రాంతి పర్వదినం నాడే భగీరధుడు ఆ 60 వేల మందికీ పరమ పవిత్ర గంగాజలంతో తర్పణలు అర్పించి వాళ్ళని శాపవిముక్తుల్ని చేసాడని ప్రతీతి. భగీరథుని కోరిక ప్రకారం పూర్వజుల శాప విముక్తికి గంగా భవాని పాలాళ లోకంలో ప్రవేశించి చివరికి సముద్రంలో కలుస్తుంది. ఏటా మకర సంక్రాంతి పర్వరినాన గంగానది పాతాళలోకంలో ప్రవేశించి చివరికి బంగాళా ఖాతంలో కలుస్తుంది. ఏటా మకర సంక్రాంతి పర్వదినాన గంగానది బంగాళా ఖాతంలో కలసిన పవిత్ర సమయంలో లక్షలాది భక్తులు గంగా నదిలో తమ పితృదేవతలకి తర్పణలిస్తారు.

మహాభారత యుద్ధంలో స్వచ్ఛంద మరణ శక్తిని కలిగిన భీష్మాచార్యుడు యుద్ధరంగంలో నేలకొరిగి తన భౌతిక శరీరం త్యజించడానికి సంకల్పించి అంపశయ్య మీద పవళిచి, చివరికి మకర సంక్రాంతితో మొదలయ్యే ఉత్తరాయణ పుణ్యకాలంలోనే దేహత్యాగం చేసాడు. అందుచే మకర సంక్రాంతి మొదలయ్యే ఉత్తరాయణ పుణ్యకాలంలో మరణించినవారికి పునర్జన్మ ఉండదని ప్రగాఢ విశ్వాసం.

సిక్కులు మకర సంక్రాంతిని మాఘిగా జరుపుకుంటారు. మకర సంక్రాంతినాడే వారిగురు పరంపరలో 10వ గురువైన గురుగోవింద్‌ సింగ్‌ 40మంది సిక్కులు రాసిన బేదాయలను చింపివేసి వారికి ముక్తిని కలిగించాడు. ఆ తరువాత 40 మంది సిక్కులూ 40 ముక్తులుగా సుప్రసిద్ధులయ్యారు. అందువలన ఈ పర్వదినాన్ని సిక్కు మతస్తులు మరింత ఘనంగా జరుపుకుంటారు.

ఇంకా చదవండి »