పుష్యమాసం
మార్గశిర
మాసం పుష్య మాసం చాంద్రమాన ప్రతీకలు! చంద్రుడు ప్రతిరోజూ ఒక నక్షత్రంతో కలిసి
ఉదయిస్తున్నాడు. ఇలా చంద్రుడు పౌర్ణమి రోజున పుష్యమీ నక్షత్రంతో కలిసి ఉదయించే
మాసం పౌష్యం!
పుష్యమాసం
శూన్య మాసమనీ, నిష్ఫల మాసమనీ నిండా ఉన్నప్పటికీ సూర్యుడు
ధనుస్సు రాశిలో ఉదయించే సమయంలోని పుష్యమాసం పండుగానేల అన్నది మన సంప్రదాయం!
మార్గశిర, పుష్యమాసాలతో కూడి ఉన్నది 'ధనుర్మాసం'!
చంద్రుడు రోజు ఒక నక్షత్రంతో కలిసి ఉదయిస్తాడు. సూర్యుడు పదమూడు
రోజులు ఒకే నక్షత్రంలోనే ఉదయిస్తాడు. రెండుంబావు నక్షత్రాలు ఒక రాశి.
అందువల్ల
సూర్యుడు నెలరోజుల పాటు ఒక రాశితో కలిసి ఉదయిస్తున్నాడు. ధనుస్సులో సూర్యుడు కలసి
ఉదయించడం మొదలైన రోజు ధనుస్సంక్రాంతి. ఆ రోజు నుండి సూర్యుడు 'మకరం'టో
కలసి ఉడాయించడం ఆరంభమయ్యే వరకు ధనుర్మాసం!! ది
సౌరమాసం - సూర్యునికి సంబంధించినది సౌరం. చంద్రునికి సంబంధించినది చాంద్రమాసం.
సంక్రాంతి నుండి సంక్రాతి వరకు సూర్యుని నెల. అమావాస్య తరువాతి పాడ్యమి నుండి
అమావాస్య వరకు చంద్రుని నెల పాటించడం దక్షిణ భారతంలోని సంప్రదాయం. అందువల్ల
ధనుర్మాసంలో కొంత మార్గశిరం కొంత పుణ్యం కలిసి ఉంటాయి. నిరయణ పద్ధతిలో ఈ ఏడు
ధనుర్మాసం మార్గశిర బహుళ నవమి మంగళవారం - డిశంబర్ 16 వ తేదీ
నాడు ఆరంభమైంది. ధనుర్మాసం 'పండుగ నెల'.