తిరుప్పావై


తిరుప్పావై – ఒక అద్భుత వేదాంత గ్రంధం. భగవంతుని సులభంగా అందించగలిగే సాధనా మార్గమిది. తిరు అంటే శ్రీ అని అర్థం. పావై అంటే పాటలు లేక వ్రతం అని అర్థం. కలియుగంలో మానవ కన్యగా జన్మించి గోదాదేవిగా పేరుమోసిన ఆండాళ్ భగవంతుడినే తన భర్తగా భావించిఆయనను చేపట్టడానికి సంకల్పించిన వ్రతమే తిరుప్పావై వ్రతము.

తిరుప్పావై లో 30 పాశురములు ఉంటాయి. పాశురము అంటే ఛందోబద్ధంగా ఉన్న పాటలని అర్ధం. ఆండాళ్ లోని ఈ భక్తి పారవశ్యాన్నే శ్రీకృష్ణ దేవరాయలు ఆముక్తమాల్యద అనే గ్రంథంగా మనకు అందించారుతిరుప్పావై వ్రతానికి కొన్ని విధివిధానాలున్నాయి. వేకువజామున నిద్రలేచి స్నానం చేయడంస్వామి కీర్తనలనుప్రతిరోజూ క్రమం తప్పకుండా తిరుప్పావై పాశురములను పాడడంపేదలకు దానములుపండితులకు సన్మానము చేయడంస్వామికిఆండాళ్ కు ఇష్టమైన పుష్ప కైంకర్యము చేయడంప్రతిరోజూ స్వామివారికి పొంగలి నివేదించడం మొదలైనవి పాటించాలి.

ఆండాళ్ అసలు పేరు కోదై. కోదై అంటే మాలిక. ఆ పేరు పెట్టగాఅది క్రమంగా గోదాగా మారింది.. అటువంటి గోదాదేవి రచించిన 30 పాశురాలు స్థూలంగా మంచిని ప్రబోధిస్తాయి. మంచిగా జీవించమనితోటివారికి సాయపడమనిభగవదారాధన తప్పనిసరిగా చేయమని ఈ ప్రబోధాలు సూచిస్తాయి.

తమకు మంచి భర్త లభించాలని కోరుకుంటూ కన్నెపిల్లలు చేసే వ్రతాలలో తిరుప్పావై వ్రతం ఒకటి....ద్వాపర యుగంలో శ్రీకృష్ణుని భర్తగా కోరుకుంటూ గోపికలు ఇదే వ్రతాన్ని ఆచరించారన్నది ఆండాళ్ నమ్మిక.. ఆండాళ్ తన చెలులతో కలిసిశ్రీకృష్ణుడిని భర్తగా పొందడానికై తిరుప్పావై పాశురాలను గానం చేస్తూముప్ఫై రోజులు కఠిన వ్రతమాచరిస్తుంది. మొదటి అయిదు పాశురాలు ఉపోద్ఘాతంతిరుప్పావై యొక్క ముఖ్యోద్దేశ్యాన్ని తెలియ జేస్తాయి." చిత్తశుద్ధితో భగవంతుని ప్రార్థిస్తే వానలు కురుస్తాయిపంటలు పండుతాయిదేశం సుభిక్షంగా ఉంటుంది. శ్రీకృష్ణుడిని పూవులతో పూజిస్తేపాపాలు నశిస్తాయి. " అని గోదాదేవి విన్నవిస్తుంది. తరువాతి పది పాశురాల్లోగోదాదేవి చెలులతో కలిసి పూలను సేకరిస్తూ పల్లె వాతావరణాన్ని వర్ణించే అంశాలు ఉంటాయి. పక్షుల కిలకిలారావములురంగురంగుల పూలువెన్నను చిలకడంలోని సంగీత ధ్వనులుఆలమందల మెడలోని చిరుగంటల సవ్వడిదేవాలయంలో వినిపించే శంఖారావంమొదలైన వాటి వర్ణనలు ఉంటాయి.


ఉదయాన్నే గోదాదేవి ఒక్కొక్కరింటికి వెళ్ళితన చెలులను తట్టి లేపుతూవారిని నదిలో స్నానానికి సిద్ధం చేస్తుంది. విష్ణువు యొక్క అవతారాలను పొగుడుతుంది. తరువాతి ఐదు పాశురాలు గోదాదేవి తన చెలులతో కలిసి చేసిన దేవాలయ సందర్శనను వివరిస్తాయి. భగవంతుడిని నిద్ర మేల్కొలపడానికి ఆండాళ్ సుప్రభాతాన్ని ఆలపిస్తుంది. గోదాదేవి మరియు ఆమె చెలులు దేవాలయ పరిరక్షకుల్ని సమ్మతింపజేసిగుడిలోకి వెళ్ళి శ్రీకృష్ణుడి తల్లిదండ్రులను కీర్తిస్తూబలరామ కృష్ణులను మేల్కొలపమంటూ వారిని వేడుకుంటారు. తరువాత వారు కృష్ణుడి అష్టమహిషులలో ఒకరైన నీళాదేవిని దర్శించిప్రార్థిస్తారు. చివరి తొమ్మిది పాశురాలు భగవద్విభూతిని వర్ణిస్తాయి. చిట్టచివరి పాశురంలో గోదాదేవితను విష్ణుచిత్తుని కుమార్తె ననీఈ ముప్ఫై పాశురాలు తాను రచించి పాడాననీఎవరైతే వీటిని భక్తితో గానం చేస్తారో వారికి భగవత్కృప తప్పక కలిగి తీరుతుందనీ ఉద్ఘాటిస్తుంది.

పాశురం సంపుటి 


పాశురం -1                        పాశురం -11                       పాశురం -21
పాశురం -2                          పాశురం -12                        పాశురం -22
పాశురం -3                          పాశురం -13                        పాశురం -23
పాశురం -4                          పాశురం -14                        పాశురం -24
పాశురం -5                          పాశురం -15                        పాశురం -25
పాశురం -                         పాశురం -16                        పాశురం -26
పాశురం -                         పాశురం -17                        పాశురం -27
పాశురం -8                          పాశురం -18                        పాశురం -28
పాశురం -9                          పాశురం -19                        పాశురం -29
పాశురం -10                        పాశురం -20                        పాశురం -30