• విష్ణుషట్పదీ స్తోత్రం

    నారాయణ నారాయణ జయ గోవింద హరే |నారాయణ నారాయణ జయ గోపాల హరే ||

  • శ్రీ రామ

    ఆపదం అపహర్థారమ్ దాతారం సర్వ సంపదం, లోకాభి రామం శ్రీ రామం భూయో భూయో నమామ్యహమ్I

  • శ్రీ సీతామాత

    త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ, హనుమాన్ యత్న మాస్తాయ దు:ఖ: క్షయ కరోభవ

  • ఓం నమ:శివాయ:

    చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర పాహిమామ్ , చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర రక్షమామ్ I

  • శ్రీమాత్రే నమః

    అమ్మల గన్న యమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాల పెద్దమ్మ, సురారులమ్మ కడుపారడి పుచ్చిన యమ్మ, తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ మాయమ్మ కృపాబ్ధి నిచ్చుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్

  • శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు

    పురుషోవిష్ణు రిత్యుక్తః శివోనానామతః స్మృతః I అవ్యక్తం తు ఉమాదేవీ శ్రీర్వా పద్మ నిభేక్షణా I తత్ సంయోగా దహంకారః స చ సేనాపతిరుహః I

తెలుగు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

సామెతలు



ఇంకా చదవండి »

భారత కాసులు



ఇంకా చదవండి »

కోపం సమాధానం



ఇంకా చదవండి »

మంచి మాట



ఇంకా చదవండి »

కృష్ణుడి సంతానం కొన్ని పేర్లు



ఇంకా చదవండి »

భారతీయ సమాధానం



ఇంకా చదవండి »

64 కళలు


ఇంకా చదవండి »

సృష్టి విధానం

మూల ప్రకృతి అనేది బిందు రూపములో ఉంటుంది. ఇది మహా సూక్ష్మం. స్వరూప స్వభావమేదీ తెలియదుతరువాత ఉండీ ఉండనట్లు ఉండేది అవ్యక్తము. తరువాత "ఇది లేకపోతేపని జరగదు " అని అనిపిస్తుంది

తరువాత పరమాత్మ గుణములు కూర్చుటతో ఒక స్వభావానికి వస్తుంది. ఇది ప్రకృతి. అపుడుగుణమయి అయిన ప్రకృతిలోకి పరమాత్మ ప్రవేశించి క్షోభింపచేస్తాడు. "దారాలను ముట్టుకోకుండా వస్త్రాన్ని ముట్టుకున్నట్టు" పరమాత్మ గుణత్రయముతో ఉన్న ప్రకృతిలోగుణాలని తాకకుండా ప్రవేశిస్తాడు

అహంకార సృష్టి ఏర్పడే వరకూ ప్రకృతిలో గుణములు బయటకి తెలియబడవు. ప్రకృతిని క్షోభింపచేసిన తరువాత, ప్రకృతిని నుండి మహత్ తత్వం ఆవిర్భవిస్తే. వాటి నుండి అహంకారం వస్తే, ఆ అహంకారములో త్రిగుణాలు ఆవిష్కరింపబడతాయి. అహంకారములోకి ప్రకృతి తత్వములో ఉన్న గుణాలు ప్రవేశింపచేస్తాడు. ఇటువంటి పరమాశ్చర్య కరములైన కర్మలు పరమాత్మ చేస్తాడు. ఇది నిర్విశేషం. పృధివ్యాదులు లేనిది, గుణవ్యతికరము లేనిది. 

అన్నిటికీ కారణమైనమూల ప్రకృతిని అనాయాసముగా లీలగా సృష్టించాడు.  సకల చరాచర జగత్తుపద్మములో నిలిచి ఉంది. ఒకటిగా ఉన్న పద్మము, ఏమీ కనపడని స్థితి, అందులో తాను ప్రవేశించి, అందులో దాగి ఉన్న అన్ని లోకములనూ, పరమాత్మ తన సంకల్పముతో, ఎవరికీ కనపడని కాలముతో వేరు వేరు చేసాడు. ప్రతీ వస్తువులోనూ పరమాత్మ ప్రవేశించి ఉన్నాడు. పురుషరూపములో లోపలా, కాల రూపములో బయట. లోపల ఉన్నవాడు సంకల్ప వికల్పాలు కలిగిస్తాడు. బయట ఉన్న వాడుసంకల్పము కలిగేట్టు ప్రోత్సహిస్తాడు (శాసిస్తాడు).  మనకు ఇప్పుడు ఏది ఎలా కనపడుతున్నదో ఇలాంటిదే అంతకు ముందు ఉన్నాది, ఇకముందు కూడా ఉంటుంది. 

సృష్టి తొమ్మిది రకాల సృష్టి. ప్రాకృత సృష్టి ఆరు. వైకృత సృష్టి మూడు. బ్రహ్మ కంటే ముందు ఉన్న సృష్టి ప్రాకృత సృష్టి. బ్రహ్మగారు చేసింది వైకృత సృష్టి 

1. మొదటి సృష్టి మహత్ తత్వం

2. అహంకార తత్వం సృష్టి గానీ ప్రళయం గానీ కావాలంటే కావలసినవి కాలమూ గుణమూ ద్రవ్యమూ. ప్రకృతి నుండి మొదలు ఏర్పడినది మహత్ తత్వం. ఇది గుణ వైశమ్యం. ప్రకృతిలో మూడు గుణాలూ ఉన్నా, అన్నీ సమానముగా ఉంటాయి. గుణ వైషమ్యం ఉండదు. సృష్టి కావాలంటే గుణ వైషమ్యం ఉండాలి. అందువలన మహత్ తత్వము వచ్చింది. ఆ మహత్ నుంచి అహంకారము వచ్చింది. ఈ అహంకారము నుండే ద్రవ్య (భూతములు) జ్ఞ్యాన (జ్ఞ్యానేంద్రియాలు) కర్మ (కర్మేంద్రియాలు) 

3. మూడవ సృష్టి తన్మాత్ర సృష్టి. ఇక తన్మాత్ర సృష్టి. తన్మాత్ర అంటే శబ్ద స్పర్శ రూప రస గంధముల సూక్ష్మావస్థలు. వీటి నుండే పంచభూతాలు ఏర్పడతాయి.  

4. నాలుగవ సృష్టి ఇంద్రియములు. జ్ఞ్యాన కర్మేంద్రియాలు

5. ఐదవది దేవ సృష్టి (మనః సృష్టి). ఇంతవరకూ ఏర్పడిన జ్ఞ్యాన కర్మేంద్రియాలకు అధిష్ఠాన దేవతలు ఏర్పడతారు. దేవతలు ఇంద్రియాలను నడిపిస్తుంటారు. కన్ను వేరు, కన్నులో ఉండే చూచే శక్తి ఇంద్రియం వేరు, దాన్ని నడిపించే (చూపించే) శక్తి దేవత. 

6. ఆరవది అజ్ఞ్యానం. ఇది తమస్సు, చీకటి. ఇది అబుద్ధికృతం (బుద్ధి లేనందువలన ఏర్పడేది). ఈ ఆరు ప్రాకృత సృష్టి.   ఇపుడు వైకృత సృష్టి 

7. భగవంతుడు రజో గుణం స్వీకరించుట వలన సృష్టి జరుగ్తుంది. పరమాత్మ యొక్క సంకల్పము యొక్క లీల. ఇక ఏడవది ముఖ్య సర్గ. ఇది చేసినది బ్రహ్మ. ఇంతకుముందు చేసిన సృష్టి అంతా పరమాత్మ చేసినది. ముఖ్య సృష్టి ఆరు రకములు. దీనికే స్థావర సృష్టి అని పేరు. ముందు ఆహారం సృష్టించబడిన తరువాతే జీవు ఏర్పడతాడు (ఉదా: గర్భవతి అయిన తరువాత పిల్లవాడు పుట్టకముందే పాలు ఏర్పడతాయి). 

ఆరు రకాల ముఖ్య సృష్టి - వనస్పతి (తైలమును ప్రసాదించేవి), ఔషధి (పైరులు, వరి, జొన్న..ఒకే పంటనిచ్చేవి ), లత, త్వక్ సార (అరటి మొదలైన చర్మ ప్రధానమైనవి), వీరుధ్ (పొదలూ తీగలూ, కందములూ), ధ్రుమాః. ఇవన్నీ క్రిందనుంచి పైకొచ్చేవి. తమః ప్రాయ: అజ్ఞ్యానం వీటికి ప్రధానం. ఇవి అంతః స్పర్శ. మనం స్పృశిస్తే వాటికి జరిగే అనుభూతి బయటకి కనపడదు. అనుభూతిని వ్యక్తీకరింపచేయలేవు. ఇవి విశేషణ కలవి ( స్పందన కలవి)  

8. జంతువులు ఎనిమిదవ సృష్టి. ఇది ఇరవై ఎనిమిది రకాలుగా ఉంటుంది. జ్ఞ్యానము ఏమీ లేని సృష్టి. వాసన చూసి గుర్తుపట్టేవి. వీటి హృదయములో ఏవి తెలీదు (పగ, ద్వేషం లాంటివి).  

 9. తరువాత నిలువుగా ఉండేవారు, మానవులు. మానవులు రజో గుణం ఎక్కువగా ఉన్నవారు. కోరికలే వీరికి ప్రాణము. ఎప్పుడూ పని చేస్తూ ఉంటారు. దుఃఖాన్ని సుఃఖం అని అనుకుంటూ ఉంటారు. ఇదే సృష్టిలో నరులూ దేవతలూ ఉంటారు. వీటిలోనే కౌమారులు (సనకాదులు) కూడా ఉన్నారు. ఈ కుమారులు ప్రతీ సృష్టిలోనూ ఉన్నారు కాబట్టి ప్రాకృతులు అవుతారు. బ్రహ్మగారు సృష్టిస్తున్నారు కాబట్టి వైకారికులు కూడా అవుతారు. కుమార సృష్టి ఉభయాత్మకః. దేవతలు పది రకాల సృష్టి. భూత ప్రేత పిశాచాలు కూడా దేవతా సృష్టే. వారిలో తమో గుణం అధికం. ఇవన్నీ బ్రహ్మగారు చేసినవి. 

ఇంకా చదవండి »