• విష్ణుషట్పదీ స్తోత్రం

    నారాయణ నారాయణ జయ గోవింద హరే |నారాయణ నారాయణ జయ గోపాల హరే ||

  • శ్రీ రామ

    ఆపదం అపహర్థారమ్ దాతారం సర్వ సంపదం, లోకాభి రామం శ్రీ రామం భూయో భూయో నమామ్యహమ్I

  • శ్రీ సీతామాత

    త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ, హనుమాన్ యత్న మాస్తాయ దు:ఖ: క్షయ కరోభవ

  • ఓం నమ:శివాయ:

    చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర పాహిమామ్ , చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర రక్షమామ్ I

  • శ్రీమాత్రే నమః

    అమ్మల గన్న యమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాల పెద్దమ్మ, సురారులమ్మ కడుపారడి పుచ్చిన యమ్మ, తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ మాయమ్మ కృపాబ్ధి నిచ్చుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్

  • శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు

    పురుషోవిష్ణు రిత్యుక్తః శివోనానామతః స్మృతః I అవ్యక్తం తు ఉమాదేవీ శ్రీర్వా పద్మ నిభేక్షణా I తత్ సంయోగా దహంకారః స చ సేనాపతిరుహః I

కార్తికమాసం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

కార్తిక మాసం లో ఉసిరి (ధాత్రి )చెట్టు కి , తులసి కి పూజ ఎలా చేయాలి ?

తులసి ని , ఉసిరి నిడన సివాకేసవులు ఆశ్రయించి ఉంటారు కాబట్టి అక్కడ తప్పనిసరిగా పూజ చేయాలి. 
తులసి ధాత్రి సహిత కార్తిక దామోదరాయ నమః అని పూజ చేయాలి. 

ఉసిరి చెట్టు కి పూజ ఎలా చేయాలి ?
కార్తిక మాసం లో ప్రతి రోజు / సుద్ధ చతుర్దశి రోజు / చెట్టు చుట్టూ సుబ్రం చేసి 8 వైపులా అష్టదల పద్మం వేసి గొపాదుక ముద్రలు వేసి , శంక చక్రాలు పెట్టాలి , 8 వైపులా దీపలు పెట్టాలి . పద్మ పురానమ ప్రకారం గ అయితే 108 ప్రదక్షిణాలు చేయమని ఉంటుంది , కనీసమ్ 8 ప్రదక్షిణాలు అయిన చేయాలి అని ఉంటుంది . చుట్టూ తోరబంధానం చేయమని చెపుతారు . చెట్టు కి తోరం కతేటప్పుడు కింది శ్లోకం చదువుకోవాలి . ఉసిరి చెట్టు నీడలో దీపమ్ పెటండి , కానీ కొమ్మలు కాలే లాగ కాకుండా దూరం గ పెట్టండి. 




ఉసిరి చెట్టు కింద ఎఎ దానాలు చేయాలి ?
అన్న దానం / సాలగ్రామ / గ్రంధాలు  / పసుపు కుంకుమ / దీపమ్ / వస్త్రం . కార్తిక మాసం లో ఎ దానాలు చేయవచో అనీ దానాలు ఉసిరి చెట్టు కింద చేయవచు . 

ఉసిరి చెట్టు కింద ప్రవచనాలు చెప్పిస్తే చాల మంచిది . అమ్మవారి గురించి , విష్ణు నామం , విష్ణు సహస్రనామ , శివ నామం భాగవతం , భగవధ్గీత ఏదయినా ప్రవచనం చెయించవచు. 

ఇంకా చదవండి »

పుట్టలో పాలు పోయామని శాస్త్రం లో ఉనాద ?


మనకి పూర్వ కాలం నుండి ఆనవాయతి గ ఉంది కానీ , ప్రామానికమయిన గ్రంధాలూ లో అయితే పుట్టలో పాలు పోయామని లేదు . ధర్మ సింధు లాంటి గ్రంధాలలో నాగుల చవితి రోజున ఎఎ పూజ చేయాలి , ఎలాంటి స్తోత్రం చదవాలి అనేవి ఉంటాయి. 

పూర్వం ఆవు పేడ తీసుకుని వచ్చి సింహ ద్వారానికి ఇరువైపులా నాగు పావు బొమ్మలు గీసి వాటికి పాలు పోసే వారు . ఒకవేళ అల వీలు కాక పోతే పూజ మందిరం లో అటు పక్కన ఇట్టు పక్కన అల నాగు పాము వేసుకోవచు. ఒక వేల అదీ వీలు కాలేదు దేవుడి ఎదురుగుండా పీట మీద పసుపు తో ప్రతిమ వేసి పూజ చేసి , అర్చన చేయవచ్చు .  

పూర్వకాలం నుండి నాగ పడగలు వెండి , బంగారం , రాగి , ఇత్తడి లో పూజలు చేసే సాంప్రదాయం కొంత మంది ఇళ్ళలో ఉంటుంది, అలంటి ప్రతిమకి అయిన పాలు పోయవచు. లేదా పారే నది లో నుంచి బంక మట్టి తీసుకుని వచ్చి నవ నాగులు చేసి ప్రాణ ప్రతిష్ట చేసి కింద పేర్లు చదువుతూ పాలు పోసి తరువాత ఉద్వాసన చేయాలి . బంక మట్టి దొరకదు అనుకున్నపుడు గోధుమ పిండి తో కానీ , పసుపు కాని , బియ్యం పిండి , మినప పిండి తో కానీ చేసుకోవచు . నిమజననికి కుదరదు అనుకుంట పీట మీద పసుపు తో ముగ్గు లాగా వేసి పూజ చేయవచు. ఒక వేల ఇంట్లో కుదరదు అనుకుంటే గుడికి వెళ్లి ప్రాణ ప్రతిష్ట చేసి నవ నాగులు ఉంటాయి , వాటికి తెల్లవారుఝామునే చుట్టూ సుబ్రం చేసి పసుపు రాసి బొట్టు , పువ్వులు పెట్టి అభిషేకం చేసి అలంకరించి దూప , దీప నైవేద్యాలు సంర్పించవాచు . కానీ ఎక్కడ కూడా పుట్టలో పాలు పోయామని లేదు . 


కుష్టు వ్యాది కి మందు గా పాము విషాని చాల మైక్రో లెవెల్ లో వాడతారంట . పుట్టలో పాలు పోయడానికి వెళ్లి నప్పుడు పాము విషం ఏమన ఒకవేళ అ పుట్ట మీద పది ఉంటె ఇలా పోయటానికి వెళ్ళినప్పుడు అ వాసన వలన కూడా రోగం తాగవచ్చు అని మన పూర్వికులు అల సంప్రదాయం గ పెట్టి ఉంటారు. పుట్ట మట్టి ని తీసుకుని వచ్చి చెవి పక్కన పెట్టుకోవటం , కంటి పక్కన పెడితే కంటి దోషాలు పోతాయని కూడా పెద్దలు అనేవారు , చేసేవారు . కానీ కృత్రిమం గ పుట్ట లో పాలు పోయడం ద్వార వచ్చే ప్రయోజనం ఏమి ఉండదు. 

ఇంకా చదవండి »

కార్తీక మాసం విశిస్టత

శివ దేవునికి ఎక్కువ ప్రీతిపాత్రమైన మాసం కార్తీక మాసం. ప్రతి ఏటా దీపావళి వెళ్ళిన మరుసటి రోజు నుంచి అతి పవిత్రమైన కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఈ మాసంలో భక్తులంతా నిత్యం భోళాశంకరుని నామాన్ని స్మరిస్తూ ఉంటారు. పురాణ కాలంనుంచీ ఈ మాసం ఓ ప్రత్యేకతను సంతరించుకుంది.

హరిహరాదులకు ప్రీతిపాత్రమైన ఈ మాసంలో భక్తకోటి యావత్తూ కఠిన నిష్ఠతో చేపట్టే నోములకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ మాసంలో పాఢ్యమి, చవితి, పౌర్ణమి, చతుర్దశి, ఏకాదశి, ద్వాదశి తిధుల్లో శివ పార్వతుల అనుగ్రహం కోసం మహిళలు పూజలు చేస్తుంటారు. పట్టణాల్లోనే కాకుండా గ్రామాల్లో సైతం మహిళలు ఈ మాసంలో విశేష పూజలు జరుపుకుంటారు.

హరిహరాదులకు ప్రీతికరంకార్తీక మాసం

మన భారతీయ సంసృ్కతిలో కార్తీకమాసం వచ్చింది అంటే ఆ నెల రోజులు పండుగదినాలే! అందులోను కార్తీకమాసం ఈశ్వరారాధనకు చాలా ముఖ్యమైనది. దేశం నలుమూలలా ఉన్న వివిధ ఆలయాలలో రుద్రాభిషేకాలు, రుద్రపూజ, లక్ష బిల్వదళాలతో పూజలు, అమ్మవారికి లక్షకుంకుమార్చనలు, విశేషంగా జరుపుతూ ఉంటారు. అలా విశేషార్చనలు జరిపే భక్తులకు సదాశివుడు ప్రసన్నుడై కొంగుబంగారంలా సంతోషం కలిగిస్తాడు. కావున ఆ స్వామికి ‘‘ఆశుతోషుడు’’ అను బిరుదు కలిగింది.

‘‘హరిః ఓం నమస్తే అస్తు భగవన్విశ్వేశ్వరాయ మహాదేవాయ త్య్రంబకాయ
త్రిపురాంతకాయ త్రికాలాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ

మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః అంటూ! ప్రతి ఈశ్వ రాలయంలో ఆ రుద్ర నమకం మంత్ర భాగము మారుమోగిపోతూ, ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. హిందు వుల గృహాలలో ‘‘ఆదిత్యమంబికా విష్ణూగణనాథం మహేశ్వరం’’ అనే పంచాయతన దేవతలను విశ ేషంగా ఆరాధిస్తారు.

ఈ కార్తీక మాసమహాత్మ్యమును గూర్చి పూర్వం నైమిశారణ్య ఆశ్రమములో శౌనకాది మహామునులకందరకు సూతమహాముని ఎన్నో విష్ణు భక్తుల చరిత్రములు, విష్ణు మహిమలను వినిపించు సమయాన, ఓ సూతముని శ్రేష్ఠా! కలియుగముందు ప్రజలు సంసార సాగరమునుండి తరింపలేక, అరిషడ్వర్గములకు దాసులై! సుఖమగు మోక్షమార్గము తెలియక ఎన్నో ఈతిబాధలు అనుభవిస్తున్న ఈ మానవులకు ధర్మములన్నింటిలో ఉత్తమ ధర్మమేది? దేవతలు అందరిలోనూ ముక్తి నొసంగు ఉత్తమదైవమెవరు? మానవునికి ఆవరించియున్న ఈ అజ్ఞానమును రూపుమాపి పుణ్యఫల మిచ్చు కార్యమేది? ప్రతిక్షణము మృత్యువుచే వెంబడించబడు ఈ మాన వులకు మోక్షము కలిగించు చక్కని ఉపాయము చెప్పమని కోరినారు.

ఆ ప్రశ్నలను ఆలకించిన సూతముని, ఓ ముని పుంగవులారా! క్షణికకమైన సుఖభోగాల కోసం పరితపించుచూ! మందబుద్ధులగుచున్న మానవులకు ‘‘ఈ కార్తీకమాస వ్రతము’’ హరిహరాదులకు అత్యంత ప్రీతికరమైనది. దీనిని ఆచరించుట వల్ల సకల పాపాములు హరింపబడి మరు జన్మలేక పరంధామము పొందగలరు. పుణ్యాత్ములకు మాత్రమే ఈ కార్తీకమాస వ్రతమాచరించాలని కోరికను కలుగచేస్తాడు ఆ పరమాత్మ! దుష్టులకు దుర్మా ర్గులకు వారి కర్మలు పరిపక్వమయ్యేవరకు ఏవగింపు కలిగిస్తాడు.

ఈ మాసమందు వచ్చు సోమవారములు చవితి ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి, అత్యంత పుణ్యప్రదమైనవి. నెల అంతా సాధ్యపడని భక్తులు కనీసం ఆయా దినములలో పవిత్రపుణ్య నదీ స్నానమాచరించి, ఉపవాస దీక్షలు చేస్తూ మహాన్యాస పూర్వక మహా రుద్రాభిషేకములు, లక్ష బిల్వార్చనలు, లక్ష కుంకుమార్చనలు, లలిత, విష్ణు సహస్రనామ పారాయణలు, ప్రతి నిత్యము ఉభయ సంధ్యలలో దీపారాధన చేయువార్కి విశేష పుణ్య ఫలం లభిస్తుంది. ఈ కార్తీకమాస ముప్పది దినములు ఆచరించిన వార్కి అనంతకోటి పుణ్యఫలం లభిస్తుందని చెప్పబడినది.

ఇందు అత్యంత మహిమాన్వితమైన కాలం ప్రదోషకాలం. సూర్యాస్తమయమయ్యాక మూడు గడియలు (ఒక గంట) ప్రదోషోరజనీముఖమ్‌. రాత్రికి ఆరంభ కాలమే ఈ ప్రదోష సమయం. ఇలా ప్రతి నిత్యము వచ్చు ప్రదోషాన్ని నిత్య ప్రదోషంగా చెప్తారు. ఈ ప్రదోషం నాలుగు విధాలుగా మహాత్ములు వివరిస్తూ ఉంటారు. 1. నిత్య ప్రదోషం. 2. పక్ష ప్రదోషం 3. మాస ప్రదోషం 4. మహాప్రదోషం అని చెప్తారు.

కొందరు నిష్టాపరులు ఈ కార్తీకమాసమంతా పుణ్యనదీస్నానమాచరిస్తూ ప్రతి నిత్యము హరిహరాదులను పూజిస్తూ పగలు అపక్వాహారం అంటే వండని ఆహారం. పాలు, పండ్లు స్వీకరించి సాయంత్రం భక్తితో కార్తీక దీపారా ధనలు, పూజలు కావించి, నివేదించిన అన్నాన్ని రా త్రి భుజిస్తూ ఉంటారు. ఇలా ఈ కార్తీక నక్తవ్రతాన్ని నిత్యం ఆచరిస్తారు.ఇక ప్రదోషకాలంలో పరమేశ్వరుడు ఏక కాలంలో రెండు రూపాల్ని ప్రదర్శిస్తూ ఎడమ భాగాన పార్వతి, రెండవ భాగమున పరమేశ్వరరూపంగా ‘‘అర్థనారీశ్వ రుడుగా’’ దర్శనమిచ్చే కాలం ఈ ప్రదోషకాలం అని చెప్పబడినది. ఆ ప్రదోష సమయాల్లో ఆ తల్లి ‘‘అధ్యక్షురాలు’’గా అధిరోహించియుండగా! పరమే శ్వరుడు పరవశించి తాండవం చేస్తూ ఉంటాడు. ఆ నృత్యాన్ని దర్శించటానికి దేవతలందరూ అక్కడ కొలువుతీరి ఉంటారుట! ఆ సమయంలో ఆ తాండవ నృత్యానికి అనుగుణంగా సరస్వతి దేవి వీణవాయి స్తూ ఉంటే బ్రహ్మ తాళం వేస్తాడట. శ్రీ మహాలక్ష్మీ గానం చేస్తూ ఉంటే! శ్రీ హరి మృదంగం వాయిస్తా డుట. ఇంద్రుడు వేణునాదంతో పులకింపచేస్తూ ఉంటాడు! అట్టి ప్రదోష సమయాల్లో దేవగంధర్వ మహర్షి సిద్ధులందరూ పరమాత్మ స్వరూపాన్ని కొలుస్తూ ఉంటారుట.

కనుక ప్రదోష సమయాల్లో శివుని ఆరాధిస్తే! శివుని ఆశీస్సులతోపాటు మిగతా దేవతల ఆశీస్సులు కూడా ఏకకాలంలో మనం పొందగలుగుతామని చెప్పబడినది. ఇంకా మనకు ఆ అర్థనారీశ్వర స్వరూపాన్ని ధ్యానిస్తే! రెండు ప్రయోజనాలు లభిస్తాయట. కామం! అంటే కోర్కెలను నియంత్రించే శక్తి మరియు కాలాన్ని అంటే మరణాన్ని జయించే శక్తిని ప్రసా దిస్తాడుట! ఇంకా ఈ ప్రదోష దర్శనం సర్వశుభాలను కలుగచేసి, సర్వదారిద్య్ర బాధలను తొలగించి సర్వసంపత్తులు అనుగ్రిహ స్తుంది అని చెప్పబడినది.

ఈ కార్తీకమాసంలో అత్యంత విశేషమైనది. ఉత్థానైకాదశి అంటే శ్రీ మహావిష్ణూవు పాలకడలిలో ఆదిశేషుని పాన్పుపైన ఆషాడ శుద్ధ ఏకాదశినాడు తనయోగనిద్రను ప్రారంభించి తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు కనులు విప్పియోగ నిద్ర నుండి మేల్కొన్న రోజుకే ఉత్థాన ఏకాదశి అను పేరు. ఆ మరుసటి రోజు ద్వాదశినాడు ముప్పది ముగ్గురు దేవతలలో శ్రీ మహాలక్ష్మీ సమేతుడై తులసీ ధాత్రివనమందు ఉంటాడని చెప్తారు.

ఈ ద్వాదశిని క్షీరాబ్ధి ద్వాదశి అంటారు అంటే, పూర్వం కృతయుగంలో దేవదానవులు పాలసముద్ర మధనము చేసిన రోజు. కనుక దీనికి క్షీరాబ్ధి ద్వాదశి అను పేరు వచ్చినది. పాల సముద్రమును చిలికారు కనుక చిల్కు ద్వాదశి అని కూడా అంటారు. కనుక స్త్రీలు ఈ రోజు వారి సౌభాగ్య సంపదల కోసం తులసీ ధాత్రి (తులసికోట) వద్ద విశేష దీపారాధ నలు గావించి షోడశోపచారములతో తులసీధాత్రి లక్ష్మీనారాయణులను పూజిస్తారు. ఆ రోజు దేశము నలుమూలలా గల ఆలయాలలోని లక్ష్మీనారాయణ మూర్తులను మిరుమి ట్లు గొలిపే విద్యుత్‌ దీపకాంతితో, బాణసంచాలతో సమీప నదీజాలలో తెప్సోత్సవం నిర్వ హిస్తూ ఉంటారు. కార్తీక పూర్ణిమనాడు వరిగడ్డిని వెంటిగా చుట్టి దానిని రెండు స్తంభము లకు కట్టి ఆ వెంటిని మూడుమార్లు కాగడాలతో వెలిగిస్తూ వాటి క్రింది పార్వతీ పరమే శ్వరుల ప్రతిమలను పల్లకిలో ఉంచి ముమ్మారు త్రిప్పి జ్వాలాతోరణ వేడుకను నిర్వహి స్తారు. అలా హరి హరాదులకు ప్రత్యేక ఉత్సవ వేడుకలు నిర్వహిస్తారు. ఇలా ఈ కార్తీక మాస విశేషాలను కొనియాడి చెప్పుటకు సహస్రముఖములు కలిగిన ఆదిశేషుడు, చతు ర్ముఖుడైన బ్రహ్మకే సాధ్యం కాదని చెప్పగా, ఇక మానవ మాత్రులమైన మనమెంత? అని సూతమహాముని చెప్పియున్నారు.

మన సంసృ్కతిలో ఈ దీపారాధన అనేది ప్రధానాంశం. ఈ దీపదానమందు ఆవునెయ్యి ఉత్తమోత్తమమైనది. మంచి నూనె మధ్యమము, ఇప్పనూనె అధమము, ఇతరములైన అడవియందు పుట్టిన నూనెలు అధమాతి అధమములు. గేదె నేతితో దీపము, వెలిగించిన పూర్వ పుణ్యము కూడా నశించి పోతుంది. అదే స్వల్పముగా ఆవునేయి కలిపి వెలిగించిన దోషములేదని, అలా! ఒకటి మొదలు వేయి వరకు దీపములు వెలిగించుట ఎంతో శుభ ప్రదమని వాటి సంఖ్యనుబట్టి వివిధ ఫలితాలు అందిస్తుందని, దీపదాన మహాత్యములో చెప్పియున్నారు. అట్టి దీపారాధన పూజామందిరమందు, దేవాలయములో గృహప్రాం గణములలో, తులసీ బృందావనమందు, మారేడు, రావి వంటి దేవతా వృక్షాల వద్ద, పుణ్య నదీతీరములందు వెలిగించుట అత్యంత పుణ్యప్రదమని పురాణాలు వర్ణించి చెబుతున్నాయి.
ఈ మాసమందు సోదరి చేతివంట భగనీ హస్తభోజనము చేసి యధాశక్తి వార్కి కాను కలు సమర్పించుటతోపాటు, సమీప వన మందు బంధువులు, స్నేహితులతోకూడి ఉసి రిచెట్టును పూజించి, సాత్విక ఆహారముతో వన భోజనములు చేస్తూ ఉండుట మంచిది. అం దువల్ల మన జీవన గమనంలో మంచి ఆహ్లాదము తోపాటు అన్నదాన ఫలితము కూడా లభిస్తుంది.

అట్టి మహిమాన్వితమైన ఈ కార్తీకమాసమందు నియమనిష్టలతో హరిహరాదులను అనునిత్యము ఆరాధిస్తూ ‘‘కార్తీకపురాణ’’ పఠనము గావించిన ఎడల అనంతకోటి పుణ్యఫలం లభిస్తుందని, ఈ పవిత్ర పుణ్యదినములందు అలసత్వం వహించకుండా యథాశక్తి దీపదానము, వస్త్ర, ఫల, పుష్ప, సువర్ణ దానములు మొదలైనవి చేయుటవల్ల ఇహమందు సర్వసుఖములు అనుభవించుటయే కాకుండా, జన్మాంతరమందు జన్మరాహిత్యాన్ని పొందగలరని ఈ కార్తీకమాస వ్రతమహాత్య్యమును గూర్చి సూతమహాముని శౌనకాది మునులకు వివరించినాడు.

విశిష్టత
ఆయా మాసాలలో చంద్రుడు పూర్ణుడై ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్రం వేరే ఆ మాసానికి వస్తుంది. కృత్తికా నక్షత్రంపై చంద్రుడు పూర్ణుడై ఉండటంవల్ల ఈ మాసానికి కార్తీకమాసమని పేరు. ఈ మాసంలో కృత్తిక నక్షత్రానికి, దీపారాధనకు, సోమవారాలకు ప్రాధాన్యత ఉంది. ఈ విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

కృత్తికా నక్షత్రం:కృత్తికానక్షత్రానికి నక్షత్రాలలో మంచి ప్రాముఖ్యత ఉంది. దేవతలలో ప్రథముడైన అగ్నిదేవుడు ఈ నక్షత్రానికి అధి పతి. అగ్ని నక్షత్రాలైన కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాడలలో మొదటిది కృత్తికయే. వేదకాలంలో సంవత్సరం కృత్తికా నక్షత్రం తోనే ఆరంభమయ్యేది. ఈ నక్షత్రాన్ని అగ్ని నక్షత్రమని అంటారు. అగ్ని ఆరు ముఖాలు కలవాడు. కృత్తికలు కూడా ఆరు నక్షత్రాలు. ఈ కృత్తికలు ఒక విశిష్టత ఉంది. అదేమిటంటే కుమారస్వామిని షణ్ముఖుడు అంటారు. అంటే ఆరు ముఖములు కలవాడని అర్థం. ఆకాశంలోని ఆరు కృత్తికా నక్షత్రములు మాతృమూర్తులై పాలు యివ్వగా కుమార స్వామి ఆరు ముఖాలతోపాలు త్రాగాడు. ఈ విధంగా కృత్తికలచే పెంచబడుటచే కుమరస్వామికి కార్తీకేయుడని పేరు వచ్చినది. ఈ కారణాల వల్ల కృత్తికలకు ప్రాముఖ్యం కలిగినది.

కార్తీక దీపాలు:ఈ మాసంలో చెప్పుకోదగ్గ మరో అంశం దీపారాధన. ఈ మాస ప్రారంభం నుండి సూర్యోదయానికి పూర్వమే లేచి నదీస్నానమాచరించి శుచియై, పొడిబట్టలు ధరించి దీపారాధన చేయవలెను. ఈ మాసంలోనే జ్వాలా తోరణాన్ని కొన్ని చోట్ల వెలిగిస్తారు. ఈ కాలమంతా దేవాలయాలన్నీ దీపాలచే అలంకరించబడి ప్రజలను ఉత్తేజపరుస్తూ శోభాయమా నంగా ఉంటాయి. ప్రతి ఇంటి ముంగిట ఈ మాసాంతం వరకు దీపం వెలుగుతూ ఉంటుంది. కార్తీకమాసంలో స్త్రీలు నదులలో, కోనేటిలలో దీపాలు వదలుతారు. ఈ దీపాలు ఆకాశంలోని చుక్కలవలె ప్రకాశవంతంగా వెలుగుతూ కన్ను లపండుగను కలుగచేస్తాయి. ఈ మాసంలో స్త్రీలు దీపాన్ని దానంగా ఇస్తారు. దీని వల్ల వారికి ఎనలేని కీర్తిసౌ భాగ్యాలు కలు గుతాయని భావిస్తారు. ఈ దీపాలు మనిషిలోని అజ్ఞానమునే చీకటిని తొలగించి జ్ఞానమనే వెలుగును నింపుతాయి.

కార్తీక సోమవారాలు:ఈ మాసవారాలలో సోమవారానికి ప్రత్యేకత ఉంది. సోమవారానికి చంద్రుడు అధిపతి. దేవతలలో ప్రథముడైన అగ్ని నక్షత్రాలలో మొదటిదైన కృత్తికను అధిపతిగా ఉండటం, చంద్రుడు పూర్ణుడై ఈ నక్షత్రం మీద ఉండటం చేత మాసం లోని సోమవారాలకు విశిష్టత కలిగినది. చంద్రుని వారమైన ఈ సోమవారం శివునికి ఎంతో ప్రీతికరమైనది. శైవభకు ్తలు ఈ మాసంలో ముఖ్యంగా సోమవారాలలో భక్తిశ్రద్ధలతో నియమనిష్టలతో శివుణ్ణి ఆరాధిస్తారు. ఈ మాస కాలంలో సూర్యోదయ పూర్వమే బ్రహ్మ ముహూర్తమున నదీ స్నానమాచరించి హరహరశంభో అంటూ శివుణ్ణి స్తుతి స్తూ భక్తి ప్రపంచంలో మునిగిపోతారు. ముఖ్యంగా శైవభక్తులు ఈ మాసమంతా ఉపవాసముండి శివుడిని పూజిస్తారు. శివప్రీతి కరమైన సోమవారమున భానోదయం ముందు లేచి స్నానాదికార్యాక్రమాలు ముగించుకుని, పొడి బట్టలు ధరించి మొ దటగా దీపారాధన చేయాలి. అనంతరం శివుడికి రుద్రాభిషేకం చేయించి శివవ్రత నియమాలను పాటించాలి. ఈ విధంగా చేయడం వల్ల నిత్యమూ సిరిసంపదలతో, సుఖసౌఖ్యాలతో వర్థిల్లుతారని ప్రజల నమ్మకం. సూర్యుడు తులారా శి యందు ప్రవేశించిన నాటి నుండిగాని, కార్తీక మాసారంభదినమగు శుద్ధపాడ్యమి మొదలు కొనిగాని వ్రతారంభము ను చేయవలెను. అట్లు ప్రారంభించు సమయంలో ఓ కార్తీక దామోదార! నీకు వందనములు. నాచే నారంభింపబడు కార్తీక వ్రతంబును విఘ్నము లేకుండ చేయుము అనిపిమ్మట స్నానముచేయవలెను.

ఆ విధముగ జీవనదికి బోయి గంగకును, శ్రీ మన్నారాయణునకును, భైరవు నకు ను నమస్కరించి భైరవాజ్ఞను తలదాల్చి మొలలోతు నీటిలో నిలువబడి మొ దట సంకల్పము జెప్పికొని సూక్తములను జదివి, మార్జన మంత్రముతోడను, అఘమ ర్షణ మంత్రముతోడను, గంగోదకమును శిరస్సున జల్లుకొని అఘమర్ష స్నానమా చరింపవలెను. పిదప సూర్యున కర్ఘ్య ప్రదానమొసంగి దేవతలకును, ఋషూలకు ను, పితృదేవతలకును క్రమ ప్రకారముగ తర్పణంబు లొనర్పవలెను. అప్పుడది సుస్నామగును. స్నానము చేసిన పిమ్మట నదీతీరము జేరి మూడుదోసిళ్ళ నీరు గట్టుపైన పోయవలెను.

కార్తీకమాసంబున గంగా గోదావరి కావేరీ తుంగభద్రాదిన దులందు స్నానమొనర్చిన నత్యుత్తమము, గంగానది కార్తీకమాసమునందు నదుల న్నిటియందు ద్రవరూప సన్నిహితయై యుండును. శ్రీ ఆదినారాయణుండు గోష్పా ద మాత్ర ప్రదేశమందున్న జలము నందు సన్నిహితుడై ఉండునని వేదములు, శ్రుతీసృ్మతులు చెప్పుచున్నవి కావున సముద్రకామియగు నదీ స్నానము మిగుల పవిత్రమైనది. నదీ స్నానావకాశము లభింపనిచో! కులువయందుగాని, చెరువునం దుగాని, కూపము కడగాని సూర్యోదయము స్నానము చేయవలెను. పిదప మడిబ ట్టలను ధరించి ముందుగ భగవంతుని స్మరింపవలెను. తదుపరి భస్మమును త్రిపుండ్రముగా నుదుట ధరింపవలెను. లేక గోపీచందనముపైన నుదుట నూర్ద్వ పుండ్రముగా నుంచుకొనవలెను. అనంతరం సంధ్యావందనము, బ్రహ్మ యజ్ఞము ను ముగించి, నిత్యాగ్నిహోత్రమును గావించుకుని దేవతార్చనమును చేయవలె ను. స్నానతీర్థమునందే కార్తీక పురాణ శ్రవణమును చేయాలి.

సూర్యుడస్తమించు కాలమున సాయంసంధ్యను పూర్తి చేసికొని శివాలయముగాని, విష్ణ్వాలయమున గాని దీపారాధన చేయవలెను. షోడశోపచార పూజావిధానమున హరిహరులను బూజించి షడ్రసోపేతమై, భక్ష్యభోజ్యాదులతోగూడిన నైవేద్యము నిడవలయును. ఈ రీతిగా కార్తీకశుద్ధ ప్రతిపత్తు మొదలు అమావాశ్య తుదివరకు నక్త వ్రతము చేసినచో కార్తీక మాస వ్రతము పూర్తగును. మరునాడు శక్తిననుసరించి మృష్టాన్నముతో భూత తృప్తి గావించవలెను. కార్తీక మాసమున సోమవారమున శివప్రీతికై సోమవారవ్రతము నొనర్చినవారికి కైలాసమున శివుని సన్నిధానమున నుండుట ప్రాప్తించును. సోమ వా రవ్రత విధానమెట్టిదన సోమవారమున నదీ స్నాన మొనర్చి సంపూర్ణముగ నుపవ సించి శివునకభిషేకమొనర్చి రాత్రి మొదటి యామమున భుజింపవలెను.


ఆ దినమున నితరుల వలననే పదార్థమును గ్రహింపరాదు. తిలదాన మొనర్చినందువలన పాపము లన్నియు నశించును. ఇంకనునత్యంత నిష్ఠతోను, భక్తితోను నాచరింపనవ కాశ మున్నవారు ఆ దినమున రాత్రిగూడ నిద్రింపక పురాణాది పఠనంబువలన జాగరణ మొనర్చి, మరునాడు శక్తి కొలదిగ బ్రాహ్మణులకు సంతర్పణమును చేసి పిదప భుజిం పవలెను. ఈ పై రెండును జేయలేనివారు సోమవారమున నపరాహ్ణము వరకుండి భుజించవలెను.ఇందేది చేయుటకు శక్తిలేనిచో నదీస్నానమును గావించుకుని భగవంతుని ధ్యానించవలెను సోమవారమునస్త్రీగాని, పురుషుడుగాని నక్షత్ర దర్శ నమగువరకుపవసించి పిమ్మట భుజించినవారి పాపములు అగ్నిలోబడిన దూదివలె నాశనమగును.ఆ దినమున శివునికభిషేకమొనర్చి బిల్వదళంబులచే సహస్రనామార్చ నము నొనర్చినను, ఇతరులచే చేయించినను, శివపంచాక్షరీ మంత్రమును జపించి నను, వారిని శివుడనుగ్రహించి సర్వసంపదలను, సమస్త శుభంబులను చేకూర్చును.

ఇంకా చదవండి »

కార్తీక మాసంలో వనబోజనాలు

కార్తీక మాసంలో వనబోజనాలుకృత్రిక నక్షత్రంలో చంద్రుడు పూజ్యుడై సంచరిండం వలన ఈ మాసానికి కార్తీక మాసం అని పేరు వచ్చిందని పురాణ గాధలు చెబుతుంటాయి.

కార్తీక మాసంలో వనభోజనానికి విశేష ప్రాధాన్యం ఉంది. ఉసిరి చెట్టు కింద సాలగ్రామాన్ని ఉంచి గంధం, అక్షతలుపుష్పాలతో పూజించాలి. అనంతరం పండితులను పిలిచి సత్కరించి అందరూ భోజం చేయాలి. వనభోజన కార్యక్రమాలను నిర్వహించే వారికి పాపాల నుంచి విముక్తి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. కార్తీక సోమవారాల్లో వనభోజం చేయడం శుభప్రదం. కార్తీక సోమవారాల్లో మాత్రమే గాకుండా కార్తీక మాసంలో ఏ రోజైన ఉసిరిక చెట్టుకింద భోజనం చేయడం మంచిది. శివుడిని అర్చించి అనంతరం అన్నదానము నిర్వహించి, అతిథి సత్కారాల తర్వాత దీక్ష వహించిన వ్యక్తి భుజించవలెను. ఈ నియమాలను పాటించడం వల్ల శివానుగ్రహం కలిగి సర్వపాపములు నశిస్తాయని నమ్మకం.

ధాత్రీ వృక్షం అంటే ఉసిరి చెట్టు అని అర్థం. కార్తీక మాసంలో ప్రతిరోజూ కానీ, పౌర్ణమి రోజున కానీ ఉసిరి చెట్టును పూజిస్తే సర్వశుభాలు కలుగుతాయి. కార్తీక మాసంలో ఉసిరి చెట్టులో లక్ష్మీ సమేతంగా శ్రీమహావిష్ణువు నివాసముంటాడు. బ్రహ్మ ఆనందబాష్ప కణాలనుంచి ఉసిరిక ఉద్భవించిందంటారు.

ఉసిరికాయలతో నివేదన, ఉసిరి కాయలపై ఆవునేతితో దీపారాధన, ఉసిరి వనంలో అన్న సమారాధనలు చేయడం, సాలగ్రామాలను, దీపాలను దానం చేయడం వల్ల అఖండ అష్టయిశ్వర్య ప్రాప్తి, అనంత పుణ్య ఫలప్రాప్తి లభిస్తాయి.

ఉసిరిచెట్టు మూలంలో శ్రీహరి, స్కంధంలో రుద్రుడు, ఊర్ధ్వంలో బ్రహ్మ, శాఖలలో సూర్యుడు, ఉపశాఖలలో దేవతలు ఆశ్రయించి ఉంటారు. కార్తీక పౌర్ణమి రోజున శ్రీమహావిష్ణువును పూజించి, చిత్రాన్నాలను నివేదించి, మధ్యాహ్నం బంధుమిత్రులతో కలసి ఉసిరి చెట్టు నీడలో వన భోజనం చేస్తే సకల పాపాలు తొలగిపోయి విష్ణులోకం పొందుతారు.

కార్తీకమాసంలో వాతావరణ ప్రభావం వల్ల మనిషిలో ఉష్ణాంశము తక్కువై, త్రిదోషాలు వికృతి చెందుతాయి. తులసి వాసన, ఉసిరిక వాసన పీల్చుకోవడం వల్ల ఆరోగ్యం చేకూరుతుందనే నమ్మకం వనభోజనాలు ఏర్పాటు చేయడానికి నాంది పలికిందని పెద్దలు అంటారు.


కార్తీక పొర్ణమి నాడు చేసే సాలగ్రామ దానం, ఉసిరి కాయల దానం వల్ల కూడా పాపాలు నశిస్తాయి

ఇంకా చదవండి »

క్షీరాబ్ధి ద్వాదశి (చిలుకు ద్వాదశి)

ఆషాడ మాసం లో శుద్ధ ఏకాదశి రోజున క్షీరసాగరం లో శయనించిన విష్నుభగవానుడు ... కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్రనుండి మేల్కొంటాడని , అలా నిద్రనుండి మేల్కొనిన మరుసటి రోజే క్షీరాబ్ది ఏకాదశి గాను ఆ మరుచటి రోజు క్షీరాబ్ధి ద్వాదశి గాను భక్తులు పండుగను జరుపుకుంటారు .

కృతయుగం లో దేవతలు , రాక్షసులు అమృతం కోసం క్షీరసాగర మదనాన్ని కార్తీక శుద్ధ ద్వాదశి నాడు చేసిన రోజు కనుకే " క్షీరాబ్ధి ద్వాదశి " అని పిలుస్తారు . అమృతం కోసం క్షీరసాగరాన్ని చిలికారు కనుక " చిలుక ద్వాదశి" అని అమృతం కోసం సాగరాన్ని మధించారు గనుక "మధన ద్వాదశి" అని వాడుకలో ఉంది. క్షీరసాగర మధనము లో జన్మించిన లక్ష్మీదేవిని శ్రీమహావిష్ణువు దేవ దానవ సమక్షములో వివాహమాడుతాడు . లక్ష్మీ కల్యాణము జరుపుతారు .

శ్రీమహావిష్ణువు లక్ష్మీ సమేతం గా బ్రహ్మ , ఇంద్రాది దేవతల తో కలసి బృందావనానికి వెళ్ళారు అంటారు ... అందుకే ఈ రోజుని " బృందావని ద్వాదశి" అని కుడా అంటారు . బృందా విష్ణువుల వివాహము (గాంధర్వ వివాహము)జరిగి బృంద తులసి చెట్టు గాను విష్ణువు సాలగ్రామం (శిలగా)గా ఒకరిని ఒకరు శపించుకున్న రోజు గనుక " బృంద ద్వాదశి " అంటారు .

దశావతారాల్లోని శ్రీకృష్ణావతారంలో తులసికీ శ్రీకృష్ణునికీ కార్తీక ద్వాదశినాడు వివాహం జరిగిందని పురాణ కథనం. తులసి కల్యాణానికి దేవ దీపావళి అనీ పేరు. దీపావళినాటిలాగా కార్తీక శుద్ధ ద్వాదశినాడు ఇంటినిండా దీపాలు ప్రమిదల్లో వెలిగిస్తారు. చాతుర్మాస్యవ్రతం ఆచరించిన సాధకులు కార్తీకశుద్ధ ద్వాదశిరోజు వ్రతసమాప్తి చేయడం ఆచారంగా వస్తోంది.

క్షీరాబ్ధి ద్వాదశి శ్రీ మహావిష్ణువు తేజోభరితంగా అమృతకలశాహస్తయై సకల సిరులతో ఆవిర్భవించిన లక్ష్మీదేవిని పరిణయమాడిన శుభతిధి. ఈ కారణం చేతనేక్షీరాబ్ది ద్వాదశి సాయంత్రం ముత్తయిదువలు లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించి, శ్రీ మహావిష్ణువుకు, లక్ష్మీదేవికి వివాహం జరిపిస్తారు. తులసీదేవిని శ్రీలక్ష్మీదేవిగానూ, ఉసిరి చెట్టును శ్రీమన్నారాయణునిగాను తలచడం వల్ల తులసి చెట్టుకు, ఉసిరి కొమ్మకను కలిపి విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని సభక్తికంగా పూజించి, వారిద్దరికీ వివాహం జరిపించినట్లుగా భావించి పునీతులవుతారు.

కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతం

కార్తీక శుద్ధ ద్వాదశీ వ్రతం విష్ణువుకు ఇష్టమైన వ్రతం . ఈ రోజున ఆవు కొమ్ముకు బంగారు తొడుగులు తొడిగి , ఆవు కాళ్ళకు వెండి డెక్కలు తగిలించి , దూడతో సహా బ్రాహ్మణుని కి దానమిస్తే ఆ ఆవు శరీము మీద ఎన్ని రోమాలున్నాయో అన్ని సంవత్సరాలు ఇంద్రలోకం లో స్వర్గసుఖాలు పొందుతారు .

కార్తీకశుద్ధ ద్వాదశి రోజు యజ్నోపవీతములు .. దక్షిణ తో బ్రాహ్మణునికి దానమిస్తే ... ఇహపర సుఖములు పొందుతారు . ఈ రోజున బంగారు తులసి చెట్టుగాని , సాలగ్రామాన్ని గాని బ్రాహ్మణుని కి దానమిస్తే నాలుగు సముద్రాల మధ్య ఉన్న భూమిని దానం చేసిన ఫలితం లభిస్తుంది . ఈ కార్తీక శుద్ధ ద్వాదశినే " ఉత్దాన ద్వాదశి " అంటారు .

ఈ ద్వాదశిరోజు దీపదానం చేయాలి ---------
ఒక దీపాన్ని దానం చేస్తే " ఉపపాతకములు "నశిస్తాయి ,
పది దీపాల్ని దానం చేస్తే " మహా పాతకాలు" నశిస్తాయి ,
వంద దీపాలు దానం చేస్తే " శివ సాన్నిధ్యం" లభిస్తుంది ,
వంద కి పై గా దానం చేస్తే " స్వర్గాదిపత్యం" లభిస్తుంది ,

ఈ రోజు దీప దర్శనం లభిస్తేనే ఆయుర్దాయం , బుద్ధిబలం , దైర్యం , సంపద , కలుగుతాయి . ఈ రోజు స్నానసంధ్యలు చేశాక , కల్పోక్త ప్రకారం నానావిధ వేదమంత్రాల తో గాని , పురుష సూక్తం చేత గాని శ్రద్ధ గా మహావిష్ణువును అర్పించాలి . మొదట పంచామృత స్నానం గావించి , ఆ తర్వాత శుద్దోదకముల తో అభిషేకం చేసి శ్రీమహావిష్ణువును స్వర్ణం తో , వస్త్రాలతో అలంకరించి , నా నావిధములైన పుస్ఫాల తో , ధూపదీపాల తో పూజించి , నైవేద్యం పెట్టి ,దక్షినతాంబులాడులను సమర్పిస్తే .. వారి సకలపాపాలు పోయి , సమస్త సంపదలు సమకూరుతాయి .
ఈ కార్తిక శుద్ధ ద్వాదశి రోజు తులసి పూజ , విష్ణువు తో తులసీ కల్యాణం చేస్తారు . కార్తీక శుద్ధ ద్వాదశి రోజునే శ్రిమహావిశ్ను లక్ష్మీ సమేతం గా బ్రహ్మ , ఇంద్రాది దేవతల తో కలసి బృందావనానికి వెళ్ళారు అంటారు ... అందుకే ఈ రోజుని " బృందావని ద్వాదశి" అని కుడా అంటారు .

" బృంద ద్వాదశి " గురించి న ఓ పురాణ కధ ఉంది :
పూర్వము 'కాలనేమి ' అనే రాక్షసుడికి గుణవతి అయిన ఒక కుమార్తె ఉండేది . ఆమె పేరు "బృంద" . కుమార్తెను "జలంధరుడు " అనే మరో రాక్షసుడు కిచ్చి వివ్వాహము చేసారు . కొంత కాలానికి జలంధరుడు దేవతుల పై యుద్ధానికి వెళ్ళాడు . దేవతలు అతన్ని జయించలేకపోయారు . అందుకు కారణం పతివ్రత అయిన బృంద యేనని గ్రహిస్తారు . ఆ విషయం విష్ణువు కి తెలియజేస్తారు .

బృంద పాతివ్రత్యం చెడి పోతే గాని జలంధురుని జయించడం కష్టమని గ్రహించిన విష్ణు ... జలంధురుని రూపం లో బృంద దగ్గరికి వెళ్తాడు , వచ్చించి భార్తేనని భ్రమపడిన బృంద అప్పటిదాకా చేస్తున్న ధ్యానాన్ని వదిలేస్తుంది . దాంతో జలన్డురుడు ఇంద్రుని చేతిలో మరణిస్తాడు . అది తెలిసి బృంద కోపం తో విష్ణువును శిలవు(రాయి) కమ్మని శపిస్తుంది . విష్ణువు తన భక్తురాలైన బ్రిందను అనుగ్రహించి ఆమె తులసి చెట్టు గా అవతరించి అన్ని లోకాల వారిచేత పూజలన్డుకుంటుందని వరమిచ్చి మోక్షం ప్రసాదిస్తాడు . ఆ విధం గా బృంద తులసి చెట్టు గా పూజలందుకొంటుంది .

తులసి పూజ :
దేవుడు ఏ తప్పు చేసిన అది సమాజ శ్రేయస్సు కొరకే అని భావించే మన భారత సంస్కృతి లో తప్పులు చేసిన రోజులు కూడా పవిత్రదినాలే . . . పండగలే . కార్తీక శుద్ధ ద్వాదశిని చిలుకు ద్వాదశి అనీ వ్యవహరిస్తారు. గృహిణులు నేడు క్షీరాబ్ధిశయన వ్రతాన్ని ఆచరిస్తారు. శ్రీ మహావిష్ణువు ద్వాదశిరోజు ''తులసి బృందావనానికి'' వస్తాడని ప్రతీతి. క్షీరాబ్ధిశయన వ్రతంలో తులసినీ, విష్ణువునూ పూజించి దీపారాధన చేస్తారు. సూర్యాస్తమయం అనంతరం స్త్రీలు తులసి బృందం పై శ్రీవిష్ణువు పటాన్నిగానీ, విగ్రహాన్నిగానీ ఉంచి ఆచరించే వ్రతం వల్ల ఐదోతనం ప్రాప్తించి సుఖసంపదలు కలుగుతాయని విశ్వసిస్తారు.

భారతీయ సంప్రదాయంలో తులసికి అధికప్రాధాన్యముంది. దేవతార్చనకు తులసి దళం అతిశ్రేష్ఠం. తులసి మొక్క శ్రీమహావిష్ణువుకు ప్రీతికరమైంది. నువ్వుల్లో నూనెలాగా, పెరుగులో వెన్నలా, ప్రవాహంలో నీటిలాగా, ఇంధనంలో అగ్నిలాగా శ్రీమహావిష్ణువు తులసి మొక్కలో నిగూఢంగా ఉంటాడని బ్రహ్మోపనిషత్తు తెలుపుతోంది. తులసి సాక్షాత్తు లక్ష్మీదేవి అవతారం. చిలుకు ద్వాదశి రోజు తులసికోట వద్ద కర్ర పాతి ఆకాశదీపం వెలిగించాలని శాస్త్రం తెలుపుతోంది. కార్తీక శుద్ధ ద్వాదశి శివునికి ఇష్టమైన సోమవారం ఉత్తరాభాద్ర నక్షత్రంతోనైనా, శనివారం రేవతి నక్షత్రంతోనైనా కలిసిరావడం మంచిదని అంటారు. సోమవారం ఉత్తరాభాద్రతో వచ్చిన కార్తీక ద్వాదశిని హరవాసరమనీ, శనివారం రేవతీ నక్షత్రయుక్తమైతే హరివాసరమని అంటారు. ఈ సంవత్సరం కార్తీక శుద్ధ ద్వాదశి హరవాసరమైరావడం శుభసూచకమని కృత్యసారస సంహితం తెలుపుతోంది. చాతుర్మాస్యవ్రతం ఆచరించిన సాధకులు కార్తీకశుద్ధ ద్వాదశిరోజు వ్రతసమాప్తి చేయడం ఆచారంగా వస్తోంది.

పారమార్థికంగానే కాక, మనిషి విధి విధానాల్లోనూ తులసికి మహత్తు ఉన్నదని భావిస్తారు. ఆరోగ్యదృష్ట్యా తులసి అత్యంత హితమైంది. ఈ మొక్క అతిపెద్దమానుగా ఎదగదు. మూడడుగులు ఎదిగే చిన్న పొద . పరిమళాలను వెదజల్లే ఈ మొక్కను ప్రతి గృహంలో పెంచడం వల్ల దుర్గంధాలు తొలగి దోమలతో పాటు క్రిమికీటకాలు నశిస్తాయి. తులసి ఆకులు, గింజలు, వేళ్లు, కొమ్మలు వైద్యపరంగా ఉపయుక్తమైనవే! రెండుకన్నా ఎక్కువ ఆకులు చేరివున్నవాటిని తులసి దళాలు అంటారు. వాటిని నీటిలో ఉంచి తీర్థంగానైనా, నేరుగానైనా వినియోగిస్తే- శరీరంలోని జలుబుకారక రుగ్మతలు తొలగి చర్మసౌందర్యం ఇనుమడిస్తుంది. వివిధ సాంక్రామిక వ్యాధులను తులసి వినియోగంతో నివారించవచ్చు. తులసి మొక్క నుంచి వచ్చే తావివల్ల పరిసరాలు శుభ్రంగా మారతాయి. అందుకే తులసి మొక్కను పవిత్రమైందిగా పరిగణిస్తారు. భారతీయ సంస్కృతిలో ప్రతి ఇంట్లోనూ తులసికోట నిర్మించడం ఆచారంగా వస్తోంది. చిలుక ద్వాదశిరోజు తులసిని దేవతగా భావించి పూజిస్తారు. స్మృతికౌస్తుభం ప్రకారం- కార్తీక శుద్ధ ద్వాదశి మొదలు, పౌర్ణమి వరకు తులసి కల్యాణం జరపాలని చెబుతారు. దశావతారాల్లోని శ్రీకృష్ణావతారంలో తులసికీ శ్రీకృష్ణునికీ కార్తీక ద్వాదశినాడు వివాహం జరిగిందని పురాణ కథనం. తులసి కల్యాణానికి దేవ దీపావళి అనీ పేరు. దీపావళినాటిలాగా కార్తీక శుద్ధ ద్వాదశినాడు ఇంటినిండా దీపాలు ప్రమిదల్లో వెలిగిస్తారు. శ్రీకృష్ణుడు సర్వదా తన సొత్తుగా భావిస్తూ గర్వపడిన సత్యభామతో నారదుడు ఆచరింపజేసిన వ్రతం తెలిసిందే. తులసి దళాల బరువుకు మాత్రమే శ్రీకృష్ణుడు తూగి సత్యభామకు గర్వభంగం కలిగిన రసవత్తరమైన కథ మరిచిపోలేనిది. కార్తీకశుద్ధ ద్వాదశిరోజు ఉసిరికాయలతో కూడిన కొమ్మను తులసితో కలిపి పూజించి దీపారాధన చేయడం మన రాష్ట్రంలో ఆచారంగా వస్తోంది.


దేవ దేవుళ్ళ కథలు, కథనాలు ఒక్కొక్క పురాణము లో ఒక్కో విధము గా ఉన్ననూ వాటి సారాంశము విదివిధానాలు ఒక్కటే .

ఇంకా చదవండి »