పుట్టలో పాలు పోయామని శాస్త్రం లో ఉనాద ?
మనకి పూర్వ కాలం నుండి ఆనవాయతి గ ఉంది కానీ , ప్రామానికమయిన గ్రంధాలూ లో అయితే పుట్టలో పాలు పోయామని లేదు . ధర్మ సింధు లాంటి గ్రంధాలలో నాగుల చవితి రోజున ఎఎ పూజ చేయాలి , ఎలాంటి స్తోత్రం చదవాలి అనేవి ఉంటాయి.
పూర్వం ఆవు పేడ తీసుకుని వచ్చి సింహ ద్వారానికి ఇరువైపులా నాగు పావు బొమ్మలు గీసి వాటికి పాలు పోసే వారు . ఒకవేళ అల వీలు కాక పోతే పూజ మందిరం లో అటు పక్కన ఇట్టు పక్కన అల నాగు పాము వేసుకోవచు. ఒక వేల అదీ వీలు కాలేదు దేవుడి ఎదురుగుండా పీట మీద పసుపు తో ప్రతిమ వేసి పూజ చేసి , అర్చన చేయవచ్చు .
పూర్వకాలం నుండి నాగ పడగలు వెండి , బంగారం , రాగి , ఇత్తడి లో పూజలు చేసే సాంప్రదాయం కొంత మంది ఇళ్ళలో ఉంటుంది, అలంటి ప్రతిమకి అయిన పాలు పోయవచు. లేదా పారే నది లో నుంచి బంక మట్టి తీసుకుని వచ్చి నవ నాగులు చేసి ప్రాణ ప్రతిష్ట చేసి కింద పేర్లు చదువుతూ పాలు పోసి తరువాత ఉద్వాసన చేయాలి . బంక మట్టి దొరకదు అనుకున్నపుడు గోధుమ పిండి తో కానీ , పసుపు కాని , బియ్యం పిండి , మినప పిండి తో కానీ చేసుకోవచు . నిమజననికి కుదరదు అనుకుంట పీట మీద పసుపు తో ముగ్గు లాగా వేసి పూజ చేయవచు. ఒక వేల ఇంట్లో కుదరదు అనుకుంటే గుడికి వెళ్లి ప్రాణ ప్రతిష్ట చేసి నవ నాగులు ఉంటాయి , వాటికి తెల్లవారుఝామునే చుట్టూ సుబ్రం చేసి పసుపు రాసి బొట్టు , పువ్వులు పెట్టి అభిషేకం చేసి అలంకరించి దూప , దీప నైవేద్యాలు సంర్పించవాచు . కానీ ఎక్కడ కూడా పుట్టలో పాలు పోయామని లేదు .
కుష్టు వ్యాది కి మందు గా పాము విషాని చాల మైక్రో లెవెల్ లో వాడతారంట . పుట్టలో పాలు పోయడానికి వెళ్లి నప్పుడు పాము విషం ఏమన ఒకవేళ అ పుట్ట మీద పది ఉంటె ఇలా పోయటానికి వెళ్ళినప్పుడు అ వాసన వలన కూడా రోగం తాగవచ్చు అని మన పూర్వికులు అల సంప్రదాయం గ పెట్టి ఉంటారు. పుట్ట మట్టి ని తీసుకుని వచ్చి చెవి పక్కన పెట్టుకోవటం , కంటి పక్కన పెడితే కంటి దోషాలు పోతాయని కూడా పెద్దలు అనేవారు , చేసేవారు . కానీ కృత్రిమం గ పుట్ట లో పాలు పోయడం ద్వార వచ్చే ప్రయోజనం ఏమి ఉండదు.