-
విష్ణుషట్పదీ స్తోత్రం
నారాయణ నారాయణ జయ గోవింద హరే |నారాయణ నారాయణ జయ గోపాల హరే ||
-
శ్రీ రామ
ఆపదం అపహర్థారమ్ దాతారం సర్వ సంపదం, లోకాభి రామం శ్రీ రామం భూయో భూయో నమామ్యహమ్I
-
శ్రీ సీతామాత
త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ, హనుమాన్ యత్న మాస్తాయ దు:ఖ: క్షయ కరోభవ
-
ఓం నమ:శివాయ:
చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర పాహిమామ్ , చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర రక్షమామ్ I
-
శ్రీమాత్రే నమః
అమ్మల గన్న యమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాల పెద్దమ్మ, సురారులమ్మ కడుపారడి పుచ్చిన యమ్మ, తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ మాయమ్మ కృపాబ్ధి నిచ్చుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్
-
శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు
పురుషోవిష్ణు రిత్యుక్తః శివోనానామతః స్మృతః I అవ్యక్తం తు ఉమాదేవీ శ్రీర్వా పద్మ నిభేక్షణా I తత్ సంయోగా దహంకారః స చ సేనాపతిరుహః I
దేవతలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
రేపు శని త్రయోదశి. ఈరోజు
శనిదేవుని స్మరించినా, అర్చించినా, శివపూజ చేసినా శనిదోషాలు నశిస్తాయి. రుద్రాభిషేకం వంటివి
ఈరోజున విశేషఫలాన్నిస్తాయి. ప్రతి శనివారం సంవత్సరం పాటు ఈక్రింది నామాలను,
స్తోత్రాన్ని పఠిస్తే శనిబాధలు ఉండవు.
శౌరః శనైశ్చరో మందః
పిప్పలాదేన సంస్తుతః!!
నమస్తే కోణ సంస్థాయ పింగలాయ
నమోస్తుతే
నమస్తే బభ్రు రూపాయ కృష్ణాయ
చ నమోస్తుతే!!
నమస్తే రౌద్రదేహాయ నమస్తే
చాంతకాయచ
నమస్తే యమ సంజ్ఞాయ నమస్తే
సౌరయే విభో!!
నమస్తే మంద సంజ్ఞాయ శనైశ్చర
నమోస్తుతే
ప్రసాదం మమదేవేశ దీనస్య
ప్రణతస్యచ!!
ఇంకా చదవండి »
మనదేశంలో అన్ని
రాష్ట్రాలలోను, ఈ కాలంలో మంచినీటి గురించి
ఎన్నో బాధలు పడవలసి వస్తోంది. ఈ సమయంలో పరమాత్మను నమ్మి, ఈ క్రింది స్తోత్రములను ఉచ్ఛరించిన యెడల ఇంద్రుని, వరుణుని, మరియు వాయుదేవుని కృప పొంది
వర్షమును పొందవచ్చును. చక్కని వర్షాలు కురవడానికి ఈ క్రింది స్తోత్రములు నిత్యము
పారాయణ చేయగోరెదము.
ఇంద్రస్తుతి:
దేవదేవమహాభాగత్వంహి
వర్ధిష్ణుతాంగతః
త్వం ప్రభుః శాశ్వతశ్చైవ
సర్వభూతహితే రతః
అనంతతేజో విరజోయశో
విజయవర్ధనః
అప్రభుస్త్వం
ప్రభుర్నిత్యముత్తిష్ఠ సురపూజిత
తవప్రసాదాత్ పృధివీ నిత్యం
సస్యవతీ భవేత్
సర్వేషామేవలోకానాం
త్వమేకాపరమాగతిః
త్వమేవ పరమః ప్రాణః
సర్వస్యాస్య జగత్పతే
పాశీహ్యసి పయః స్రష్టుం
త్వమనల్పం పురందర
త్వమేవ మేఘస్త్వం వాయుః
త్వమగ్నిర్వైద్యుతోంబరే
మహోదధిస్సతిమింగలస్తధామహోర్మిమాన్
బహుమకరోఝుషాకులః
మహాయశాస్త్వమిహ సదాచపూజ్యసే
మహర్షిభిర్ముదితమనా
మహర్షభిః
వజ్రస్యభర్తాభువనస్య
గోప్తావృత్రస్యహర్తా నముచేర్నిహన్తా
కృష్ణేవసానోవసనే
మహాత్మాసత్యానృతే యోవివినక్తిలోకే
వరుణ స్తుతి:
వరుణంచ ప్రవక్ష్యామి
పాశహస్తం మహాలం
శంఖస్ఫటిక వర్ణాభం సిత
హారాంబరావృతం
సముత్పతంతు ప్రదిశోనభస్వతీః
సర్వా ఆపః పృధివీంతర్పయంతు
అపాంరసాః ఓషధీన్ జీవయంతు
వర్ధంతు చౌషధయో విశ్వరూపాః
వరుణను గ్రహాత్సర్వం
జీవశక్తిర్వివర్ధతు
భూమింసించతు పర్జన్యః
పయసాపూర్ణ రూపిణా
జీవశక్తి వివృద్ధ్యర్ధం
ఓషధీనాం చ వృద్ధయే
మరుద్భిః ప్రచ్యుతా
మేఘావర్షంతు పృధివీమను
జలం ప్రాణం చామృతంచ జీవితం
దేహిదేహినాం
మరుద్భిః ప్రచ్యుతా
మేఘావర్షంతు పృధివీమను
ప్రజాపతిః సలిలదః
వరుణోయాదపాంపతిః
మరుద్భిః ప్రచ్యుతా
మేఘావర్షంతు పృధివీమను
ఆనందదో వర్షతు మేఘ వృందః
ఆనందదాజలధరా స్సంతతం భవంతు
ఆనందదోవుణ ఏష సదాస్తుమహ్యం
ఆనందినీ రోషధయోభవంతు
వాయుస్తుతి:
బృహస్పతిరువాచ!!
జగదాయుర్భవాన్వాయో శరీరస్థః శరీరిణాం
అనంతమూర్తిర్ధర్మాత్మా దేవో
నారాయణః ప్రభుః!
అచింత్యవీర్యఃపురుషః
సదాధారః సనాతనః!
సాక్షిభూతశ్చ సర్వేషాం
కర్మణో శుభపాపయోః!
ఘ్రాణస్త్వం దేహినాం దేహే
చేష్టితంచ తధా భవాన్
భవాన్ రుద్రోభవాన్ బ్రహ్మా
భవాన్విష్ణుః సనాతనః
తవాయత్తం హిజగతాం
వర్షావర్షం శుభాశుభమ్
భవాన్విసృజతే మేఘాన్
భవాన్సంహరతే పునః
భవన్ధారయతే మేఘాన్
వర్షమాణాంస్తధాదివి
ఆదిత్యరశ్మిపీతస్య
మేఘోదరగతస్యచ
రసస్య భంక్తా సతతం
భవానేవ్థనభస్సలే
తటిల్లతానాం చ తథా భవాన్
కర్తా జగత్త్రయే
అంభసాంభేదకాలేతు సర్వాధారః
సమీరణః
పరస్పరంహిభవత స్థధా,
సంఘటనాత్ప్రభో
గర్జితం జాయతే లోకే మేఘోదర
గతం మహత్
బలేనత్వత్సమంనాన్యం భూతం
పశ్యామి భూతలే
తస్మాత్త్వం కురు సాహాయ్యం
వేదమూర్తేర్విభావసోః!
ఇంకా చదవండి »
1. అసితాంగభైరవుడు
2. రురుభైరవుడు
3. చండబైరవుడు
4. క్రోధబైరవుడు 5.ఉన్మత్తభైరవుడు
6. కపాలభైరవుడు
7. భీషణభైరవుడు
8. సంహారభైరవుడు.
ఈ ఎనిమిది మంచి శ్యామలా,
ఛండీ యంత్రాలలో కూడా పూజింపబడే దేవతలు. వీరు
రక్షక స్వరూపాలు. తీవ్రమైన నాదశక్తి, తేజశ్శక్తి
కలిగినవారు భైరవులు. మార్తాండభైరవుడు - ఆదిత్య స్వరూపుడు. కాలభైరవుడు -
శివస్వరూపం. ఆ భైరవులు అంశలుగా వీరిని భావించవచ్చు.
ఇంకా చదవండి »
వారణాశి
అయోధ్యా మథురా మాయా కాశీ
కాంచీ అవంతికా
పురీ ద్వారావతీ చైవ సప్తైత
మోక్షదాయికాః
అయోధ్య, మథుర, మాయ (హరిద్వార్), కాశి (వారణాశి), కంచి, అవంతిక (ఉజ్జయిని), పురీ, ద్వారక అనే ఏడు పుణ్యధామములు మోక్షమును ప్రసాదించే
క్షేత్రములు. ఈ క్షేత్రములు దర్శించి
భక్తి, శ్రద్ధలతో కొలిచే వారికి
మోక్షము కలుగుతుందని భారతీయ ఆధ్యాత్మిక వేత్తల ప్రగాఢ విశ్వాసం. దీనికి ఎన్నో
నిదర్శనాలు ఉన్నాయి. ఈ అన్ని క్షేత్రాలలోకీ అత్యంత మహిమాన్వితమైనది వారణాశి.
కాశ్యాం హి మరణాన్ముక్తిః - కాశీలో మరణం పొందిన వారికి ముక్తి వెంటనే కలుగుతుంది
అని ఇంకో ఆర్యోక్తి. వరుణ మరియు ఆశి నదులు గంగానదిలో సంగమమయ్యే ప్రాంతంలో ఉన్న
పట్టణం కాబట్టి కాశిని వారణాశిగా పిలుస్తారు.
ఆది శంకరులు దేశమంతా
పర్యటిస్తూ కాశీ పట్టణంలో చాల కాలం గడిపారు. ఆ నగరంలోనే ఆయన కాశీ పంచకం, మనిషి తానూ ఎవరో తెలుసుకునే సాధనమైన మనీషా పంచకం
రచించారు. ఇదివరకే మహత్కర మనీషా పంచకము ఈ
బ్లాగ్ లో వివరించాను. ఈ వ్యాసంలో కాశీ పంచకము, తాత్పర్యము మీకోసం.
మనోనివృత్తిః పరమోపశాంతిః
సా తీర్థవర్యా మణికర్ణికా చ
జ్ఞానప్రవాహా విమలాదిగంగా
సా కాశికాహం
నిజబోధరూపా ౧
యస్యామిదం కల్పితమింద్రజాలం
చరాచరం భాతి మనోవిలాసం
సచ్చిత్సుఖైకా పరమాత్మరూపా
సా కాశికాహం
నిజబోధరూపా ౨
కోశేషు పంచస్వధిరాజమానా
బుద్ధిర్భవానీ ప్రతిదేహగేహం
సాక్షీ శివః
సర్వగతోఽంతరాత్మా
సా కాశికాహం
నిజబోధరూపా ౩
కాశ్యాం హి కాశ్యతే కాశీ
కాశీ సర్వప్రకాశికా
సా కాశీ విదితా యేన తేన
ప్రాప్తా హి కాశికా ౪
కాశీక్షేత్రం శరీరం
త్రిభువన జననీ వ్యాపినీ జ్ఞానగంగా
భక్తిః శ్రద్ధా గయేయం
నిజగురుచరణధ్యానయోగః ప్రయాగః
విశ్వేశోఽయం తురీయః
సకలజనమనఃసాక్షిభూతోఽంతరాత్మా
దేహే సర్వం మదీయే యది వసతి
పునస్తీర్థమన్యత్కిమస్తి ౫
తాత్పర్యము:
మనసులోని ప్రశ్నలకు
నివృత్తి, అత్యుత్తమమైన ఉపశాంతి,
తీర్థ రాజమైన మణి కర్ణిక , జ్ఞాన ప్రవాహమైన, శుద్ధమైన
గంగానదికి రూపమైన, నిజ ఆత్మ రూపమైన ఆ కాశికను నేనే.
మాయా పూరితమైన (ఇంద్రజాలము
వలె) ఈ చరాచర సృష్టికి నిలయమైన, సచ్చిదానందమునకు రూపమైన,
పరమాత్మ రూపమైన, నిజ ఆత్మ రూపమైన ఆ కాశికను నేనే.
పంచ కోశముల జ్ఞాన ప్రకాశమైన,
భవాని అనే దేహమునందు అర్థ భాగముగా ప్రకాశించుచు,
అంతరాత్మకు ప్రభువైన, సాక్షియైన శివునిగా, నిజ ఆత్మ రూపమైన ఆ కాశికను
నేనే.
కాశి కాశిలోనే యుండి
అన్నిటినీ ప్రకాశింప చేయును. అటువంటి కాశిని తెలుసుకున్న వాడు కాశికి చేరును.
నా దేహమే కాశిలో ఉన్న
విశ్వనాథుని దేవాలయము. నా భక్తియే విశ్వవ్యాప్తమైన త్రిభువన జనని గంగానది. నా
శ్రద్ధయే గయా క్షేత్రము. గురుదేవుని నిజ పాద ధ్యానమే నాకు ప్రయాగ. నా అంతరాత్మయే ఈ
సకల జగత్ప్రాణి మనస్సాక్షీ భూతమైన ఆ
విశ్వేశ్వరుడు. దేహములో అంతటా ఈ విధముగా నివశించి యుండగా వేరే తీర్థములతో పని
ఏమున్నది?
పరిశీలన:
ప్రత్యక్షముగా కనిపిస్తున్న
కాశీ క్షేత్రము మరియు తన దేహములోని ఆత్మ ఒకటే అని నిస్సందేహముగా ఈ స్తోత్రము
ద్వారా చాటారు ఆది శంకరులు. పరిపూర్ణ ఆత్మ జ్ఞాన అనుభూతుడైన శంకర గురువులకు తన
శరీరమే దేవాలయము, అందులోని జీవుడే (ఆత్మ)
పరమాత్మ, సనాతన దైవము. ఈ భావాన్ని
శంకరులు ఈ కాశీ పంచకము ద్వారా -భక్తి
శ్రద్ధలే సజల స్రవంతి యైన గంగ మరియు మోక్ష ధామమైన గయలని, అహంకారమును నాశనము చేసి, జ్ఞాన జ్యోతిని వెలిగించి ఆత్మ సాక్షాత్కారములో మార్గ
సహాయకుడైన సద్గురువు పాద పద్మములే ప్రయాగయని -
అద్వైతములోని జీవాత్మ పరమాత్మ ఏకత్వమును అత్యున్నతమైన స్థాయిలో ఉదహరించారు.
దేహములోని పంచకోశములలోని
ప్రకాశమును ఆ భవానీశంకరుని రూపముగా, ఆ దేహమును చరాచర
సృష్టికి సంకేతముగా, మాయారూపముగా, మోక్ష సాధనకు సాధనముగా ఈ
స్తుతిలో వర్ణించారు ఆది శంకరులు. కాశీ
క్షేత్రములో కనిపించే యోగము, జీవన్ముక్తి, గంగా నది మహత్తు, ఆ నదీమ తల్లి సర్వ
వ్యాపకత, అక్కడి మణి కర్ణికా
ఘట్టములో జరిగే నిరంతర దేహ కాష్టము, నదిలో ప్రవహించే
అనేకములు, విశాలాక్షీ విశ్వేశ్వరులు -
మొత్తం కాశీ పట్టణమే మహదనుభవైక వేద్యముగా
భావించి, ఆ భావనను పరిపూర్ణముగా
ఆత్మకు ఆలయమైన దేహములో అనుభూతి చెంది రచించారు శంకరులు. అందుకే, ఆయన శంకారవతారులు, జగద్గురువులు
అయినారు.
ఇంకా చదవండి »

"ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్" అని శాస్త్రవచనం. వేదంలో సౌర, అరుణమంత్రాలు శక్తివంతమైన ప్రభావం కలిగినవి. వాటిలోని
భావాలను, శబ్దశక్తులను మిళితం చేసిన
దివ్యస్తోత్రమిది. శ్రీకృష్ణుని పుత్రుడైన సాంబుడు ఒకసారి మహావ్యాధిగ్రస్తుడై,
కృష్ణోపదేశంతో సూర్యోపాసన దీక్షను వహించాడు.
సముద్ర తీరంలో దీక్షాబద్ధుడైన సాంబునకు ఆకాశమార్గం నుండి ఒక దివ్యపత్రం ఎగిరవచ్చి
చేరింది. ఆ పత్రంలోనివి ఈ శ్లోకాలు. వీటిని నియమంగా రోజూ పారాయణ చేస్తే
సంపూర్ణారోగ్యం చేకూరుతుంది. వ్యాధులన్నిటినీ నివారింపజేసే ఈ స్తోత్రంలో
వైదికమంత్ర స్ఫురణ నిబద్ధమై ఉంది. సాక్షాత్తు భాస్కర భగవానుడు అనుగ్రహించిన
అక్షరౌషధమిది.
౧. ఉద్యన్నద్య వివస్వా- నారోహన్నుత్తరాం దివం దేవః!
హృద్రోగం మమ
సూర్యో హరిమాణం చాశు నాశయేదఖిలమ్!!
౨. నిమిషార్ధేనైకేన ద్వేచ శతే ద్వే సహస్రే
ద్వే!
క్రమమాణ యోజనానాం నమోస్తుతే నళిననాథాయ!!
౩. కర్మజ్ఞానఖదశకం మనశ్చ జీవ ఇతి
విశ్వసర్గాయ ద్వాదశథా యో విచరతి స ద్వాదశమూర్తి రస్తు మోదాయ!!
౪. త్వం హి యజూ
ఋక్సామ త్వమాగమస్త్వం వషట్కారః!
త్వం విశ్వం త్వం హంస - స్త్వం భానో! పరమహంసశ్చ!!
౫. శివరూపాద్ జ్ఞానమహం త్వత్తో ముక్తిం జనార్దనాకారాత్!
శిఖిరూపాదైశ్వర్యం త్వత్త
స్సంప్రాప్తుమిచ్ఛామి!!
౬. త్వచి దోషా దృశి దోషా హృది దోషా యేఖిలేంద్రియజదోషాః!
తాన్పూషా హతదోషః కించిద్రోషాగ్నినా దహతు!!
౭. ధర్మార్థ కామ మోక్ష - ప్రతిరోధిన
ఉగ్రతాపవేగకరాన్ బందీకృతేంద్రియగణాన్ గదాన్విఖండయతు చండాంశుః!!
౮. యేన వినేదం
తిమిరం జగదేతద్ గ్రసతి చరమచర మఖిలం తం నళినీ భర్తారం హర్తారం చాపదామీడే!!
౯. యస్య
సహస్రాభీశో - రభీశులేశో హిమాంశుబింబగతః భాసయతి నక్తమఖిలం భేదయతు విపద్గణానరుణః
౧౦.
తిమిరమివ నేత్రతిమిరం పటలమివాశేషరోగపటలం నః కాశమివాధినికాయం కాలపితా రోగశూన్యతాం
కురుతాత్!!
౧౧. వాతాశ్మరీగదార్శస్ త్వగ్దోషమహోదరప్రమేహాన్ గ్రహణీభగందరాఖ్యా
మహారుజోప్యేష మే హన్తి!!
౧౨. త్వం మాతా త్వం శరణం త్వం దాతా త్వం ధనం త్వమాచార్యః
త్వం త్రాతా త్వం హర్తా విపదామర్క ప్రసీద మమ భానో!!
౧౩. ఇత్యార్యాద్వాదశకం సాంబస్య
పురో నభస్స్థ లాత్పతితం పఠతాం భాగ్యసమృద్ధి - స్సమస్తరోగప్రశాంతిశ్చ స్యాత్!!
ఇతి
ద్వాదశార్యా స్తుతిః
ఇంకా చదవండి »

ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీదే
మమ భాస్కర
ధివాకర నమస్తుభ్యం ప్రభాకర
నమోస్తుతే
సప్తాశ్వరథమారుఢం ప్రచండం
కశ్యపాత్మజం
శ్వేతపద్మధరం దేవం తం
సూర్యం ప్రణమామ్యహం
లోహితం రథమారుఢం సర్వలోక
పితామహం
మహాపాపహరం దేవం తం సూర్యం
ప్రణమామ్యహం
త్రైగుణ్యం చ మహాశూరం
బ్రహ్మ విష్ణు మహేశ్వరం
మహాపాపహరం దేవం తం సూర్యం
ప్రణమామ్యహం
బృంహితం తేజసాంపుంజం
వాయురాకాశ మేవచ
ప్రభుస్త్యం సర్వలోకానాం తం
సూర్యం ప్రణమామ్యహం
బంధూకపుష్ప సంకాశం హరకుండల
భూషితం
ఏకచక్రధరం దేవం తం సతూర్యం
ప్రణమామ్యహం
విశ్వేశం విశ్వకర్తారం
మహాతేజః ప్రదీపనం
మహాపాపహరం దేవం తం సూర్యం
ప్రణమామ్యహం
శ్రీ విష్ణుం జగతాంనాథం
జ్ఞానవిజ్ఞాన మోక్షదం
మహాపాపహరం దేవం తం సూర్యం
ప్రణమామ్యహం
సూర్యాష్టకం పఠేన్నిత్యం
గ్రహపీడా ప్రణాశనం
అపుత్రో లభతేపుత్రం దరిద్రో
ధనవాన్ భవేత్
అమిషం మధుపానం చ యః కరోతి
రవేర్దినే
సప్తజన్మ భవేద్రోగీ జన్మ
జన్మ దరిద్రతా
స్త్రీ తైల మధుమాంసాని యే
త్యజంతి రవేర్దినే
న వ్యాధి శోక దారిద్ర్యం,
సూర్యలోకం స గచ్చతి
ఇతి శ్రీ శివప్రోక్తం శ్రీ సూర్యాష్టకం సంపూర్ణం
ఇతి శ్రీ శివప్రోక్తం శ్రీ సూర్యాష్టకం సంపూర్ణం
ఇంకా చదవండి »
సూర్యభగవానునికి
మార్తాండుడు, ఆదిత్యుడు వంటి పేర్లతో పాటూ సహిత మిహిరుడు,
అర్కుడు, ప్రభాకరుడు, భాస్కరుడు, భానుడు, రవి, దినకరుడు వంటి
అనేక పేర్లు ఉన్నాయి. ఆ సూర్యభగవానుడు పన్నేండు రాశులలో పన్నేండు పేర్లతో
సంచరిస్తూ ఉంటాడు. ఋషులు,గంధర్వులు,అప్సరసలు,నాగులు,యక్షులు కూడా సూర్యునితో పాటూ ఉంటారు.
ఈ విధముగా
పన్నేండు నెలలలో, పన్నేండు పేర్లతో,పన్నేండు రూపాలతో సంచరిస్తూ ఉండటం వల్ల
సూర్యభగవానునికి " ద్వాదశాత్ముడు" అనే పేరు వచ్చింది. పన్నెండు
నెలల్లోనూ సూర్యుడుని ఒక్కొక్కనేలలో ఒక్కొక్క మంత్రంతో ఆర్ర్ధించి, నివేదన సమర్పించడం వల్ల విశేషమైన ఫలితాలు
కలుగుతాయి.
సూర్యుని నామాలు
ఈ కృంద విధముగా ఉన్నాయి
చైత్ర మాసం - ధాత
జ్యేష్ట మాసం -
మిత్ర
ఆషాడ మాదం - వరుణ
శ్రావణ మాసం -
ఇంద్ర
భాద్రపద మాసం -
వివస్వాన
ఆస్వ్యుజ మాసం -
పుషా
కార్తీక మాసం -
పర్జన్య
మార్గశిర మాసం -
అంసుమన్
పుష్య మాసం - భగ
మాఘ మాసం -
తష్ట్యా
ఫాల్గుణ మాసం -
విష్ణువు
నిజానికి
సూర్యకిరణాల లీలా విలాసమే ఈ విశ్వమంతా!
ఓక్కొక్క మాసంలో
ఒక్కొక్క విధముగా ఉంటుంది. ఆయామాసాలలో సౌర
శక్తి విశేషాన్నే ఈ "ద్వాదశాదిత్యులు" అని పేర్కున్నారు. సూర్యుడుని
ఉపాసించినవారికి ఆయురారోగ్యాలు , ఐశవర్యం, అన్నసమృద్ధి లభిస్తాయి.
ఒక్కొక్క మాసం లో
ఆయనను ఆయా మంత్రములతో పూజిస్తే, విశేషమైన ఫలితాలు
లభించును. అలాగ ఇప్పుడు మాఘ
మాసంలో " తష్ట్వా " అని పిలువబడతాడు. ఈ మాసంలో
సూర్యుని వెంట బ్రహ్మరాత మహర్షి, కంబల సర్పము,
ఊర్వశి అప్సరస, ఋచీకుడు అనే రాక్షసుడు, శత్ జిత్ అనే యక్షుడు, ధృత రాష్ట్రుడు అనే గంధర్వుడు సంచరిస్తు ఉంటారు. ఈ మాసంలో చిత్ర
వర్ణంలో ,తొమ్మిది వేల
కిరణాలతో సూర్యుడు ప్రకాశిస్తూ ఉంటాడు. ఈ నెలలోని
ఆదివారాల్లో " శివాయ నమః " అనే మంత్రాన్ని పఠించడంతో పాటు, నిమ్మకాయలు, పండ్లు వంటి వాటిని నైవేద్యంగా సమర్పించాలి. ఈ మాసంలో తష్ట్వా
సూర్యుడు వృక్షాలల్లోనూ, వివిధ ఔషదాలలోను
ఉండి ప్రజలను రక్షిస్తూ ఉంటాడు. ఈ మాసం అంతా
సూర్యుడిని పూజించటం వల్ల అన్నింటా విజయం కలిగి, ఆయురారోగ్యాలతో వృద్ధి అవుతాయి. రథం పై ఆశీనుడై
ఉన్న ఒక చిన్న సూర్యుని విగ్రహాన్ని,లోహం తో చెసినది...ఒక పండితునికి దానం ఇవ్వడం కూడా శుభకరం!
శ్రీ సూర్యనారయణ
స్వామినే నమః.
ఇంకా చదవండి »

ధ్యాయేత్సూర్య మనంతకోటి
కిరణం తేజోమయం భాస్కరమ్
భక్తానా మభయప్రదం దినకరం
జ్యోతిర్మయం శంకరమ్
ఆదిత్యం జగదీశ మచ్యుత మజం
త్రైలోక్యచూడామణిమ్
భక్తాభీష్ట వరప్రదం దినమణిం
మార్తాండ మాద్యం శుభమ్!!
కాలాత్మా సర్వభూతాత్మా
వేదాత్మా విశ్వతోముఖః
జన్మమృత్యు జరావ్యాధి
సంసారభయనాశనః
బ్రహ్మస్వరూప ఉదయే
మధ్యాహ్నేతు మహేశ్వరః
అన్తకాలే స్వయం విష్ణుః
త్రయీ మూర్తి ర్దివాకరః!!
ఏకచక్ర రథో యస్య దివ్యః
కనకభూషితః
సోయం భవతు నః ప్రీతః
పద్మహస్తో దివాకరః
పద్మహస్తః పరంజ్యోతిః
పరేశాయ నమోనమః
అండయోనిర్మహాసాక్షీ
ఆదిత్యాయ నమోనమః
కమలాసన దేవేశ ఆదిత్యాయ
నమోనమః
ధర్మమూర్తిర్దయామూర్తి
స్సత్వమూర్తి ర్నమోనమః!!
సకలేశాయ సూర్యాయ క్షాంతేశాయ
నమోనమః
క్షయాపస్మార గుల్మాది
దుర్దోష వ్యాధినాశనం
సర్వజ్వరహరం చైవ కుక్షిరోగ
నివారణం
ఏతత్ స్తోత్రం శివప్రోక్తం
సర్వసిద్ధికరం పరమ్
సర్వసంపత్కరం చైవ
సర్వాభీష్ట ప్రదాయకమ్!!
ఇతి శ్రీ సూర్యనారాయణ
స్తోత్రం సంపూర్ణమ్
ఇంకా చదవండి »
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)


