శ్రీ షష్ఠీ దేవి కథ & శ్రీ షష్ఠీ దేవి స్తోత్రం
కష్ట సుఖాలు,
కలిమి లేములు, సంతతి కలగడం, కలగక పోవడం, కలిగిన సంతతి అల్పాయువుగా వుండడం, చిరంజీవిగా వుండడం ఇదంతా కర్మ ఫలాలను బట్టి
వుంటుంది. అంతా కర్మాధీనం అని వేదం చెబుతుంది.
షష్టీ దేవి
ఉపాఖ్యానం చెబుతాను విను. ఈ దేవి కధ చాలా మహిమ గలది. ప్రకృతి దేవి యొక్క షష్టా౦శ
(ఆరవ కళ) వల్ల అవతరించినది గనుక ఆమెకు షష్టీ దేవి అని పేరు వచ్చినది.
పేరు దేవ సేన.
ఈమె కుమార స్వామికి ప్రియురాలు. శిశు రక్షకి. బాలారిష్టముల నుంచి శిశువులను
కాపాడుతుంది. శిశువుల ప్రక్కనే వుండి వారి ఆయువును అభివృద్ధి చేస్తుంది. శిశువుల
పాలిట ఈ దేవి దివ్య మాత. ఈమెకు సంబంధించిన కధ వ్రాసినా, వినినా, చదివినా సుఖ సంపదలు, పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుతుంది. ముఖ్యముగా
గర్భముతో వున్నవాళ్ళు తప్పక రోజూ చదవ వలసిన మహా మంత్రము, స్తోత్రము ఇది.
స్వాయంభువ మనువు
కొడుకు ప్రియవ్రతుడు, సార్ధక నామధేయుడు,
సంసార సంబంధము బంధకారణమని
పెండ్లి మాని తపస్సు చేస్తూ వుండగా బ్రహ్మ వచ్చి, సంసారం సక్రమముగా చేసి పుత్రుని గని వానికి
రాజ్యం అప్పగించి తపస్సు చేయడం రాజ ధర్మం, అని చెప్పగా, ప్రియ వ్రతుడు
మాలతి అనే క్షత్రియ కన్యను పరిణయమాడి, దాంపత్య జీవితాన్ని సుఖ సంతోషాలతో అనుభవిస్తూ వచ్చారు. ఎంతకాలమైనా సంతతి
కలుగలేదు. కశ్యప మహాముని ప్రోత్సాహాముతో పుత్ర కామేష్టి చేసినారు. తత్ఫలితముగా రాజ
పత్ని గర్భవతి అయినది. ఆ గర్భం చాలా దుర్భరముగా ఎంతో కాలం మోసి చివరకు ఒక మృత
శిశువును కన్నది. కన్నతల్లి కడుపు భాధ చెప్ప శక్యం కాదు. ఏడిచి ఏడిచి సొమ్మసిల్లి
పడిపోయినది.
ప్రియవ్రతుడు
లోలోపల క్రుంగి కొంతసేపటికి తేరుకొని, రాతి గుండెతో శిశువును భుజాన వేసుకొని శ్మశానానికి వెళ్లి అక్కడ క్రింద పెట్టి
దైవాన్ని నిందిస్తూ కూర్చున్నాడు. అంతలో అక్కడకు ఒక దివ్య విమానములో ఒక దేవత
వచ్చినది. ఆ దేవతకు ప్రియవ్రతుడు అభివాదము చేసి “ అమ్మా ఎవరు మీరు? మీ తల్లిదండ్రులు ఎవరు? ఎందుకు ఇక్కడకు దయచేసినారు? అని సవినయముగా అడిగాడు.
“రాజా! నేను
ప్రకృతి షష్టా౦శ వల్ల బ్రహ్మ మానస సృష్టిగా అవతరించినాను. స్కందుని పత్నిని. నా
పేరు దేవసేన. షష్టి దేవి అని నన్ను స్మరిస్తారు. .అని అన్నది. ప్రియవ్రతుడి
ప్రార్ధనతో కనికరించి పిల్లవానిని బ్రతికించి తిరిగి ప్రియవ్రతుడికి ఇస్తూ “వీని పేరు సువ్రతుడు, అప్రమేయమైన బల పరాక్రమాలతో ఈ భూమిని
ఏకచ్చత్రంగా పాలిస్తాడు, నూరు యజ్ఞాలు
చేస్తాడు. అని అన్నది. వేదం చెప్పిన
రీతిగా నన్ను నీ ఇంట ఆరాధిస్తూ, నీ ప్రజల చేత
కూడా ఆరాధింప చేస్తూ వుండు. నీకు అంతా మంచి జరుగుతుంది అని దీవించి అంతర్దానమైనది.
ప్రియవ్రతుడు
పరమానందముతో ఇంటికి వచ్చి షష్టీ దేవి యొక్క కధ చెప్పి, తన భార్య తో కలిసి వేదోక్త విధానముగా ఆ దేవిని
ఆరాధించి, ప్రజల చేత కూడా
షష్టీ దేవి యొక్క పూజలు చేయించినాడు.
పురుటింట ఆరవనాడు
షష్టీ పూజ చేస్తే పురుటితల్లికి,పుట్టిన శిశువుకు
క్షేమం. అలాగే పురిటి శుద్దినాడు కూడా చేయించడం చాలా మంచిది. అన్న ప్రాశన సమయములో
కూడా చేయడం వలన పురిటి దోషాలు, బాలారిష్ట
దోషములు తొలగి శిశువు పూర్ణాయుర్దాయము కలిగి ఉండును.
ఆ ప్రియవ్రతుడు
షష్టీ దేవిని ఈ విధముగా స్తుతించినాడు.
కొడుకును కోరి
షష్టీ దేవిని పూజించి యీ స్తోత్రముతో శ్రద్దా భక్తులతో పఠిస్తూ వుంటే శుభలక్షణ
లక్షితుడు, దీర్ఘాయుష్మంతుడు
అయిన కొడుకు జన్మిస్తాడు. బాల బాలికలు భయపడి ఏడుస్తూవున్నప్పుడు, పురిటి ఇంట ఈ స్తోత్రం పఠిస్తే అన్ని భాధలు
పోయి, పిల్లలు సుఖముగా,సురక్షితముగా వుంటారు. షష్టీ దేవి అనుగ్రహము
వలన అన్ని రకములైన బాల గ్రహ పీడలు తొలగి పోతాయి. ఇది షష్టీ దేవి కధ.
ఓం శ్రీ సుబ్రహ్మణ్య కుటుంబిన్యై నమః
II ధ్యానం II
శ్రీమన్మాతరం
అంబికాం విధి మనోజాతాం సదాభీష్టదాం ।
స్కందేష్టాం చ
జగత్ప్రసూం విజయదాం సత్పుత్ర సౌభాగ్యదాం ।
సద్రత్నాభరణాన్వితాం
సకరుణాం శుభ్రాం శుభాం సుప్రభాం ।
షష్ఠాంశాం
ప్రకృతేః పరాం భగవతీం శ్రీ దేవసేనాం భజే II
షష్ఠాంశాం
ప్రకృతేః శుద్ధాం సుప్రతిష్ఠాం చ సువ్రతాం ।
సుపుత్రదాం చ
శుభదాం దయారూపాం జగత్ప్రసూం ।
శ్వేతచంపక
వర్ణాభాం రక్తభూషణ భూషితాం ।
పవిత్రరూపాం
పరమాం దేవసేనాం పరాంభజే II
II శ్రీ షష్ఠీ దేవి
స్తోత్రం II
నమోదేవ్యై
మహాదేవ్యై సిద్ధ్యై శాన్త్యై నమో నమః
శుభాయై దేవసేనాయై
షష్ఠీదేవ్యై నమో నమః II 1 II
వరదాయై పుత్రదాయై ధనదాయై నమో నమః
సుఖదాయై
మోక్షదాయై చ షష్ఠీదేవ్యై నమో నమః II 2 II
సృష్ట్యై
షష్ఠాంశరూపాయై సిద్ధాయై చ నమో నమః
మాయాయై
సిద్ధయోగిన్యై షష్ఠీదేవ్యై నమో నమః II 3 II
సారాయై శరదాయై చ
పరాదేవ్యై నమో నమః
బాలాధిష్ఠాతృదేవ్యై
చ షష్ఠీదేవ్యై నమో నమః II 4 II
కళ్యాణదాయై
కళ్యాణ్యై ఫలదాయై చ కర్మణామ్
ప్రత్యక్షాయై చ
భక్తానం షష్ఠీదేవ్యై నమో నమః II 5 II
పూజ్యాయై
స్కందకాంతాయై సర్వేషాం సర్వకర్మసు
దేవరక్షణకారిణ్యై
షష్ఠీదేవ్యై నమో నమః II 6 II
శుద్ధసత్త్వ
స్వరూపాయై వందితాయై నృణాం సదా
హింసాక్రోధవర్జితాయై
షష్ఠీదేవ్యై నమో నమః II 7 II
ధనం దేహి ప్రియం
(ప్రియాం) దేహి పుత్రందేహి సురేశ్వరి
ధర్మం దేహి
యశోదేహి షష్ఠీదేవ్యై నమో నమః II 8 II
మానందేహి జయందేహి
దిషోజహి మహేశ్వరి
భూమిం దేహి
ప్రజాందేహి విద్యాందేహి సుపూజితే
కల్యాణం చ
జయందేహి విద్యాదేవ్యై నమోనమః II 9 II
II ఫలశృతి II
ఇతి దేవీం చ
సంస్తుత్య లభే పుత్రం ప్రియవ్రతం
యశశ్వినం చ
రాజేంద్రం షష్ఠీదేవి ప్రసాదతః II 10 II
షష్ఠీ స్తోత్ర
మిదం బ్రహ్మన్ యః శృణోతి వత్సరం
అపుత్రో లభతే
పుత్రమ్ వరం సుచిర జీవనం II 11 II
వర్షమేకం చ
యాభక్త్యాసంస్తుత్యేదం శృణోతి చ
సర్వపాప
వినిర్ముక్తా మహావంధ్యా ప్రసూయతే II 12 II
వీరం పుత్రం చ
గుణినం విద్యావన్తం యశస్వినం
సుచిరాయుష్యవన్తం
చ సూతే దేవి ప్రసాదతః II 13 II
కాక వంధ్యా చ
యానారీ మృతపత్యా చ యా భవేత్
వర్షం శృత్వా
లభేత్పుత్రం షష్ఠీ దేవీ ప్రసాదతః II 14 II
రోగయుక్తే చ బాలే
చ పితామాతా శృణోతి చేత్
మాసేన ముచ్యతే
రోగాన్ షష్ఠీ దేవీ ప్రసాదతః II 15 II
జయదేవి జగన్మాతః
జగదానందకారిణి
ప్రసీద మమ
కళ్యాణి నమస్తే షష్ఠి దేవతే II 17 II
II శ్రీ షష్ఠీ దేవి
స్తోత్రం సంపూర్ణం II