శని త్రయోదశి
జ్యోతిష్య శాస్త్రరీత్యా శని శనివారానికి అధిపతి. ఏ వ్యక్తికైనా
పూర్వజన్మ సుకృత, దుష్కృత ఫలితాలను ప్రదానం చేసే అధికారం
శనిది. ఆధ్యాత్మిక జ్యోతిష్యంలో శనిని పూర్వజన్మలోని సంచిత కర్మలకు అధిష్టాతగా
చెప్పబడింది. శని దశల్లో వ్యక్తికి పూర్వజన్మలోని దుష్కర్మలకు సైతం దండన
లభిస్తుంది. బౌతిక దృష్టిలో శని క్రూరుడుగా కనపడినా వాస్తవానికి అగ్ని పరీక్షకు
గురి చేసి వ్యక్తిని సత్కర్మల వైపు మళ్ళిస్తాడు.. ఈశ్వర శాసనంలో శని దండనాధికారి.
శని మనం చేసిన దుష్కర్మాలకే దండన విధిస్తాడు నిష్పక్షపాతంగా ఉన్న న్యాయాధిపతిలా
శని దండన విధిస్తాడు.
శనివారానికి స్థితి కారకుడైన శ్రీమన్నారాయణుడు అధిపతి, త్రయోదశికి
అధిపతి కామదేవుడు. అంటే శివుడు. అలా శివకేశవుల క్రియలకు శని అధిపతి అయ్యాడు.
అందుకే శనిత్రయోదశి శనికి ఇష్టమైన రోజు. త్రయోదశి తిథి శివుడికి ఎంతో
ప్రీతికరమైనది. క్షీరసాగర మదనం జరిగి అమృతం ఉద్భవించిన తరువాత, హాలాహలాన్ని
దిగమింగి తన కంఠంలో దాచుకొని లోకాలను కాపాడిన శివుడికి కృతఙ్ఞతలు చెప్పడానికి
దేవతలందరూ ఆయన వద్దకు వెళ్ళినది ఈ త్రయోదశి తిథి నాడే అని పురాణాల ద్వారా
తెలుస్తుంది. ఆ సమయంలో శివుడు,
మన గణాల ప్రకారం 2 గంటల 24 నిమిషాల పాటు ఆనంద
తాండవం చేసాడట. ఆ శివ తాండవాన్ని దేవతలందరూ పరవశించి చూస్తూ ఆనందించారని
చెప్పబడింది. ఆ తాండవం చేసిన సమయమే ప్రదోషం. ప్రదోషమంటే మునిమాపు వేళ దోషం అంటే
రాత్రి అని అర్ధం చంద్రున్ని దోషాకరుడు అని అంటారు, రాత్రికి కారణమయ్యేవాడనే అర్ధం
ప్రదోషమంటే దోష ప్రారంభకాలం అంటే రాత్రి ప్రారంభ సమయం.
శనికి ప్రదోష పూజలు
ప్రదోష కాలంలో చేసే పూజాపునస్కారాలు దానధర్మాలు మామూలు సమయంలో చేసే
వాటికంటే అధిక శుభఫలితాలనిస్తాయి,
అలాగే ఈ సమయం లో చేసే పాపాలు కూడా అధిక చెడు
ఫలితాలనిస్తాయి. శని త్రయోదశి ప్రదోష సమయాన శివుడికి అభిషేకం చేయడం చాల విశేషంగా
లాభిస్తుంది. ఈ సమయంలో శివుడికి చేసే పూజలు అత్యంత ఫలితాలనిస్తాయని శాస్త్రాలు
చెబుతున్నాయి. జాతక రీత్యా శని బాగాలేని వారు, శని దశ అంతర్దశలు జరుగుతున్నవారు.
ఏలిననాటి శని, అష్టమ శని, అర్దాష్టమ శని వలన పీడింప బడుతున్నారో అటువంటి వారు ఈ రోజు శని
పరిహారాలు అంటే నువ్వుల నూనెతో శనికి అభిషేకం చేయడం, ఉపవాసం ఉండడం, రావి చెట్టుకి
ప్రదక్షిణాలు చేసి ఆవ నూనెతో దీపం పెట్టడం, నువ్వుల నూనెలో ముఖం చూసుకొని ఆ నూనెని
దానం చేయడం. నల్ల కాకి కి అన్నం పెట్టడం, నల్ల కుక్కకి అన్నం పెట్టడం, నల్లని గొడుగు, నల్లని
వస్త్రాలు, తోలు వస్తువులు, నవధాన్యాలు, ఇనుము దానం చేయడం మంచిది. ఈ విధం గా శని ని పూజించి ఆరాదిస్తే బద్ధకం, చెడు ఆలోచనలు, రోగాలు, అపమౄఎత్యు దోషము, దార్రిద్యం
తొలగుతాయి. వౄఎత్తిపరమైన సమస్యలు,
వివాహంలో ఆటంకాలు, శత్రు భయం, కోర్టు సమస్యలలో
ఉన్న వారి సమస్యలు కూడా తొలగుతాయి.
దేవతలకు సైతం భయం
శని అనే మాట వినగానే అందరిలోనూ అలజడి మొదలవుతుంది. సాధారణ మానవులే
కాదు, దేవతలు సైతం ఆయనంటే భయపడుతుంటారు ... ఆయన బారిన పడుతుంటారు. శనికి
శనివారమంటే ఎందుకు ఇష్టమో ... శని త్రయోదశి రోజునే ఆయనను ఎందుకు పూజించాలనే సందేహం
కొంతమందికి కలుగుతూ వుంటుంది.
సూర్యుడు - సంజ్ఞాదేవి దంపతులకు వైవస్వతుడు - యమధర్మరాజు
జన్మించారు. ఆ తరువాత సూర్యుడి వేడి భరించలేని సంజ్ఞాదేవి, తన నీడకి ప్రాణం
పోసి పుట్టినింటికి వెళ్లిపోయింది. ఆ నీడయే ఛాయాదేవి. సూర్యుడి వలన ఆమె సావర్ణి
మనువుకు ... శనీశ్వరుడికి జన్మనిచ్చింది. వైశాఖ మాసంలో త్రయోదశిన శని జన్మించాడు.
ఆయన పుట్టిన రోజు ... శనివారంగా ప్రసిద్ధి చెం దింది.
నల్లని పదార్థాల తో
ఈ కారణం గానే శని వారంతో కూడిన త్రయోదశి రోజున శనికి పూజలు
చేస్తుంటారు. ఈ రోజు ఉదయాన్నే తలస్నానం చేసి శనిదేవుడికి నువ్వుల నూనెతో దీపం
పెట్టి, నువ్వుల నూనెతోనే ఆయనకి అభిషేకం చేయాలి. నువ్వుల నూనెతో చేసిన
వంటకాలనే శనికి నైవేద్యంగా సమర్పించాలి. నువ్వులను ... నల్లని వస్త్రాలను
బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి. శని వాహనమైన కాకికి ఆహారాన్ని ఏర్పాటు చేయాలి. ఈ
విధంగా చేయడం వలన దోషాలు తొలగిపోతాయని శాస్త్రం చెబుతోంది. ఇక ఏలినాటి శనితో
బాధపడుతున్న వారు వరుసగా 13 శనివారాలు శనిదేవుడిని పూజించడం వలన, ప్రతి శనివారం
హనుమంతుడికి సిందూ రాభిషేకం చేయించ డం వలన మంచి ఫలితం ఉంటుందని శాస్త్రం
తెలియజేస్తోంది.
భారతీయ ఖగోళశాస్త్రం ప్రకారం నక్షత్ర, గ్రహకూటములు ఓ వ్యక్తి పుట్టుక మొదలు
అతని జీవిత పర్యంతం ప్రభావి తం చేస్తాయి. గ్రహాల స్థితిని అనుసరించి అతని
భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఈ గ్రహాలన్నింటికన్నా శని గ్రహం ప్రభావం మానవులపై
ఎక్కువగా ఉంటుంది.
పీడించే దేవుడు కాదు
విశ్వాన్ని గ్రహాలు ప్రభావితం చేస్తున్నా... శనీశ్వరుడి ప్రభావం చాలా
తీవ్రమై నదని చెప్పవచ్చు. మానవులకు ఎదురయ్యే కష్టసుఖాలకు, వారి వారి కర్మల
అనుసారంగా ఫలితంగా ప్రసాదించేది శని దేవతనే! సాధార ణంగా శనిదేవతపై అనేకమందిలో చాలా
రకాలైన అపోహలున్నాయి. శనీశ్వరుడి పేరు చెప్పగానే ఉలిక్కిపడతాం. నామాన్ని
ఉచ్ఛరించడానికి సైతం వెనకాడతాం. ఆయనకు ఆగ్రహం కలిగే పనుల్ని చేయరాదని
తీర్మానించుకుంటాం. శనీశ్వరుడిని ఆహ్వానించినట్టవుతుందని తైల పదార్థాలు వేటినీ
చేతులతో అందుకోం. ఆయన దృష్టి మనపైకి సోకరాదని పదే పదే కోరుకుంటాం. కొన్ని
ప్రాంతాలవారైతే శనివారంనాడు తిలా సంబంధిత వస్తువులేవీ కొనరు, తినరు. అంత భయం
ఆయనంటే. శనీశ్వరుడు కేవలం క్రూరత్వానికి, పీడించడానికి మాత్రమే ఉద్దేశించబడలేదు.
గ్రహరూపంలో ఉండే భగవంతుడు
సృష్టి, స్థితి, లయ కారకులు త్రిమూర్తులు. మనం చేసిన కర్మల ఫలితాలనివ్వడానికి
భగవంతుడే గ్రహాల రూపంలో అవతరించాడు. ఒక్కో గ్రహానికి ఒక్కో దేవత మూల పురుషుడు.
సూర్యుడు, చంద్రుడు, మార్స్, మెర్క్యు రీ,బౄఎహస్పతి, వీనస్, శని గ్రహాలకు వరుసగా శ్రీరాము డు, శ్రీకౄఎష్ణుడు, నరసింహస్వామి, బుద్ధుడు, వామనుడు, పరశురాముడు, కూర్మావతార
విష్ణువు, వరాహస్వామి, మత్స్యావతార స్వామి ఆవహించి ఉన్నారు. అందువల్ల గ్రహాలు
దైవాంశసంభూతులని అర్థంచేసుకోవాలి. గ్రహకూటములు రాజ్యాలను కూల్చడానికే కాక మొత్తం
ప్రపంచం ఉనికికే మూలం.
పూర్వజన్మ కర్మ ఫలం
ఓ వ్యక్తి పూర్వ జన్మలో చేసిన కర్మల ఫలితాలనే ఈ జన్మలో అనుభవిస్తాడు.
అందుకే ప్రతి వ్యక్తీ తన మహర్దశ,
అంతర్దశలను తెలుసుకోవలసిన అవసరం ఉంది. జీవితంలో
ఎదు రయ్యే చేదు అనుభవాలనుంచి తప్పించుకోవడానికి ఇది చాలా అవసరం. శని మంచి
దృష్ట్టితో ఉంటే జీవి తం నందనవనమవుతుంది. అదే శనిదేవుడు వక్రదౄఎష్టి పడిందంటే అంతే
సంగతులు. ఆయన అనుగ్రహముంటే రాజ్యాలేలే చక్రవర్తులవుతారు. ఆయన గనుక పట్టుకు
న్నాడంటే అమీరులయినా బికారులవడం ఖాయం. అయితే, ఇక్కడ గుర్తుంచుకోవలసిన అంశం. చెడు
కార్యాల్లో నిమగ్నమైనవారినే శనీశ్వరుడు పీడిస్తాడు.
ఫలితం అనుభవించాల్సిందే: ఎంత దైవాంశసం భూతులైనా వారి వారి
కర్మలననుసరించి ఫలితాలను అనుభవించి తీరాలి. చెడుకార్యాలకు పాల్పడినవారిని
శనిదేవుడు తప్పనిసరిగా శిక్ష విధిస్తాడు. పురాణాల ప్రకారం సూర్యభగవానుడు కర్మలకు
సాక్షి అయితే, శనిదేవుడు వాటి ఫలితాలను నిర్దేశిస్తాడు. ఆయా ఫలితాలను
మాతౄఎగర్భంనుంచి వెలువడిన మరుక్షణం నుంచీ అనుభవించడం మొదలవుతుంది. మంచి కార్యాలు
చేసినవారికి శనిదేవుడు చల్లగా చూసి అద్భుతమైన జీవితం ప్రసాదిస్తాడు. ఇది అర్థం
చేసుకోనివారు శని భగవానుని క్రూరాత్మునిగా భావిస్తారు. ఇది కేవలం మూర్ఖత్వం. శని
దేవుడికి భయపడడం అవివేకం. ఆయన మానవ కర్మలకు ఫలితాలనిచ్చే దైవం. అలుపు సొలుపూ
లేకుండా బిజీగా ఉండే లైఫ్‌లో కొంచెం సమయాన్ని సత్కార్యాలకు కేటాయించాలి.
నిజాయితీగా జీవించాలి.