అసలు ఉత్తరాయణం, దక్షిణాయణం అంటే ఏంటి?
సూర్యుడు మకర
రాశిలోకి ప్రవేశిస్తాడు అప్పటి నుండి ప్రారంభం అవుతుంది ఉత్తరాయణం! దీన్ని మనం చాల
తేలికగా కనిపెట్టవచ్చు! సూర్యుడు ఉత్తరం వైపు నుండి ఉదయిస్తాడు! అంటే తూర్పు వైపు
మీరు నుంచుంటే ఎండ వల్ల మీ నీడ మీ కుడివైపు పడుతుంది! గమనించండి!
సూర్యుడు కర్కాటక
రాశి లో ప్రవేసిస్తాడు! దక్షిణాయణం అంటే దక్షిణం వైపునుండి ఉదయిస్తాడు! ఇప్పుడు మీ
నీడ ఎడమ వైపు పడుతుంది! ఇది దక్షిణాయణం!
ఈ దక్షిణాయనం లో
దేవతలు నిద్రిస్తారు! ఆ సమయంలో మనకి పండగలు ఎక్కువగా వస్తాయి ఎందుకంటే మనం చేసే
పూజలు దేవతలకి శక్తులు ఇస్తాయి (మనం అలసిపోయి పడుకుంటే విశ్వ శక్తి మనలో
ప్రవేశించి ఎంత శక్తిని ఇస్తుందో మనం చేసే పూజలు వారికీ అలా శక్తిని ఇస్తాయి)!
ఉత్తరాయణంలో దేవతలు మేల్కొంటారు! ఆ సమయంలో దేవతలు మనకి అన్ని విధాలుగా
ఆయురారోగ్యాలు ప్రసాదిస్తారు!
మన సంవత్సరం
దేవతలకిఒక్క రోజు! ఉత్తరాయణం పగలు! దక్షిణాయనం రాత్రి!