ఏ తీరున నను దయ జూచెదవోఏ తీరున నను దయ జూచెదవో యినవంశోత్తమ రామా,
నా తరమా భవసాగర మీదగ నళినదళేక్షణ రామా
.
ఏ తీరుగ నను దయ జూచెదవో
(రాగం: మాయామాళవ గౌళ, తాళం: ఆది)
ఏ తీరుగ నను దయ జూచెదవో ఇన వంశోత్తమ రామా
నా తరమా భవ సాగర మీదను నళినదళేక్షణ రామా |ఏ తీరుగ...|
శ్రీ రఘు నందన సీతా రమణా శ్రితజన పోషక రామా
కారుణ్యాలయ భక్త వరద నిను కన్నది కానుపు రామా |ఏ తీరుగ...|
క్రూర కర్మములు నేరక చేసితి నేరములెంచకు రామా
దారిద్ర్యము పరిహారము సేయవె దైవ శిఖామణి రామా |ఏ తీరుగ...|
వాసవనుత రామదాస పోషక వందనమయోధ్య రామా
దాసార్చిత మాకభయమొసంగవె దాశరథీ రఘు రామా |ఏ తీరుగ...|