పోతనామాత్యుని ..భాగవత పద్యాలు
హరికిన్‌పట్టపురాణి, పున్నెముల ప్రోవర్థంబు పెన్నిక్క చం
దురు తోబుట్టువు భారతీ గిరిసుతలతోనాడు పూబోడితా
మరలందుండెడి ముద్దరాలు జగముల్ మన్నించునిల్లాలు భా
సురతన్ లేములువాపు తల్లి సిరి యిచ్చున్ నిత్యకళ్యాణముల్
.
ప్రతిపదార్థం: హరికిన్, పట్టపురాణి, పున్నెముల, ప్రోవు, అర్థంబు, పెన్నిక్క, చందురు, తోబుట్టువు, భారతీ, గిరి, సుతలతోన్, ఆడు, పూబోడి, తామరలందు, ఉండెడి, ముద్దరాలు, జగముల్, మన్నించున్, ఇల్లాలు, భాసురతన్, లేములు, బాపు, తల్లి, సిరి, ఇచ్చున్ నిత్య కళ్యాణముల్
భావం:
విష్ణుమూర్తికి పట్టపుదేవి, శ్రీదేవి, పుణ్యాలరాశి, సిరిసంపదల పెన్నిధి, చంద్రుని సోదరి, సరస్వతిపార్వతులతో ఆడుకునే పూవు వంటి శరీరం కలది, తామరపూలలో నివసించేది, ముల్లోకాలలోనూ పూజలు అందుకునే పూజనీయురాలు, వెలుగు చూపులతో దారిద్య్రాన్ని తొలగించే తల్లియైన శ్రీమహాలక్ష్మి... మాకు నిత్యకల్యాణాలను అనుగ్రహించుగాక.