ఆనంద వల్లి - కోటప్పకొండ
ఎల్లమందకు దగ్గరలో నందిపాడు అనే ఒక ఊరిలో మరొక గోపకాంత
ఉన్నది. వీరి కులవృత్తి గోవులను కాచుకోవడం. ఆమె చిన్నప్పటి నుంచి ఈ క్షేత్రంలో
తిరగడం వల్ల శివుడిపై మమకారం. వాళ్ళ అమ్మా నాన్న చేసిన మంచి పని ఏమిటంటే
ప్రొద్దున్నే పాలు పితికి ఈ పాలు తీసుకెళ్ళి శివుడికి ఇచ్చి రావే అనే వాళ్ళుట. ఆ
పాలతో శివాలయంలో శివుడికి అభిషేకం చేసుకొని వచ్చేది ఆమె. ఇది ఆవిడ పని. అలా చేయగా
చేయగా ఆయన మీద ప్రేమ పెరిగిపోయింది. శివుడు తప్ప మరొకటి లేదు అనే స్థితికి ఆవిడ
వెళ్ళిపోయింది. క్రమంగా ఆమెకు యుక్త వయస్సు వచ్చింది. ఆమె పేరు ఆనంద వల్లి. చక్కని
భక్తి ప్రపత్తులు, వినయ సంపద, సౌందర్యము, అన్నీ కలిగిన పిల్ల. పైగా
సామాన్య కుటుంబంలో అంత శోభాయమానంగా ఉంటూ అంత సంస్కారంగా ఉన్న వాళ్లు అరుదు.
అందుకు తల్లిదండ్రులకు మరింత మురిపెం. ఊళ్ళో ఎవరు చూసినా ఈమె సంస్కారానికి సంతోషించి దీవించేవారట. ఇలా చేస్తూ ఉండగా శివుడికి ఎంత ప్రేమ పుట్టేసిందో! ఊళ్ళో వాళ్ళు అమ్మాయికి పెళ్లి చేయరా అంటే అమ్మా నీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం అన్నారు తల్లిదండ్రులు. అప్పుడు ఆమె నేను ఎవరినీ నావాడు అనుకోలేదు. ఆయనే నావాడు అనుకుంది పరమశివుని. అలాగని ఆయననే పెళ్లి చేసుకుంటాను వంటి భావాలు కూడా లేవు. ఆయన ఎప్పుడూ కావాలి ఇదొక్కటే. అయితే అమ్మా! పెళ్లి చేసుకున్నంత మాత్రాన నీ భక్తికి అవరోధం ఏమిటి చెప్పు. పెద్దలం చెప్తున్నాం. అయిన సంబంధం ఒకటి ఉన్నది. మేనత్త కొడుకు ఉన్నాడు. పేరు సుందరయ్య. నీకిచ్చి వివాహం చేస్తాం. అని నిర్ణయించారు, పెళ్లి అయిపొయింది. పేర్లు కూడా ఎలా కలిశాయో చూడండి - ఈయన అందం, ఆవిడ ఆనందం. వాడూ చాలా యోగ్యుడే. ఇద్దరూ వచ్చి క్షీరాభిషేకం చేసి ఇద్దరూ కలిసి వెళ్లి ఆవులను కాచుకోనేవారట. కొన్నాళ్ళకి ఈమె గర్భవతి అయింది. అయినా దీక్ష మానలేదు. కొంతకాలానికి నిండు చూలాలు అయింది. ఆ సమయంలో కొండ ఎక్కడం చాలా బాధ వేసిందిట. ఆ పాలు పట్టుకొని గట్టుమీద ఆమె సేద తీరుతూ ఉంటే కాకి వచ్చి పాలకుండని కాలితో తన్నింది. వెంటనే దిక్కుమాలిన కాకి పాలను పారపోసింది అనుకోని ఈ చోటుకి కాకి అనేది రాకూడదు అనుకుందిట. అది శాపమైపోయింది. ఇప్పటికీ ఆ చోటులో ఒక్క కాకీ కనపడదు. కథకీ, దీనికీ ప్రబల సాక్ష్యం. ఇలాంటివి బోలెడు భారతదేశంలో. ఋషి వాక్కులా అయిపొయింది. అందుకే భక్తి ఎంత బలాన్ని అయినా ఇస్తుంది.ఎవరు సర్వ సమర్థుడో వాడిని మనస్సులో పెట్టుకున్న వాడు ఆడిన మాట కూడా సర్వ సమర్థమ్ అవుతుంది. ఎవడు సత్య స్వరూపుడో వాడిని మనస్సులో పెట్టుకున్న వాడు ఆడిన మాట కూడా సత్యం అయిపోతుంది. వాసన కలిగిన కర్పూరాన్ని చేతితో పట్టుకుంటే మన చెయ్యి కూడా కర్పూరపు వాసనే వస్తుంది. మనలో భగవంతుణ్ణి పెట్టుకుంటే మననుంచి భగవంతుని ప్రకాశమే వస్తుంది. సహజం కదా! అలా అని గర్వించలేదు ఆ తల్లి. రేపో మాపో ప్రసవిస్తాను అని అంటున్నారు. నాకు ఓపిక లేదు. నువ్వే కిందికి రాకూడదూ! అన్నదిట.
మా శివుడు మాశివుడు అని చూసింది. అలా ఎలా ప్రేమగా ఎవరు చూస్తారో వాడు దేనిలో చూస్తాడో దానిలో కూర్చుంటాడు ఆయన. నువ్వు పిలిస్తే రానా? ఇంతకాలం నువ్వు పిలవలేదు, నువ్వు వెళ్తూ ఉండు నీ వెనక వస్తాను, అయితే ఎప్పుడూ వెనక్కి తిరిగి చూడకు సుమా! అన్నాడు. వెనక్కి తిరిగి చూడడమంటే డౌటేగా. ఇలాంటివి ఎన్నో భారతదేశంలో అయితే ఒకరిని చూసి ఒకరు కాపీ కొట్టారు అనుకోవద్దు. ఎన్నో బ్రతుకులు ఉంటాయి ఒకే లాంటివి. ఒకేలాంటివి చాలామందికి జరుగుతూ ఉంటాయి.వెనక్కి తిరిగి చూడకు అని అనడంలో అంతరార్థం మన మానాన భగవంతుడు ఉన్నాడు అనే ధైర్యంతో వెళుతూ నిజంగా ఉన్నాడో లేడో అని డౌట్ పడకు. అదీ ఇందులోని భావం. సందేహించకు భగవంతుడి గురించి ఎప్పుడూ కూడా. నువ్వు అనుకుంటావు ఇలా ఉంటే బాగుంటుంది అని. ఇంకా బాగుండలేదు అంటే ఆయన ఉన్నాడో లేడో అని డౌట్. కొంత దూరం వెళ్ళేసరికి సందడి ఎక్కువ కనిపిస్తోందిట. మరి ఆయన వస్తే సందడి ఉండక ఏం అవుతుంది? మన ఊర్లో ఉన్న వార్డు మెంబరు బయలుదేరితేనే వాడి వెనకాల పొలోమని పటాలం బయలుదేరుతుందే! అలాంటిది జగదీశ్వరుడు. ఆయన బయలుదేరితే పటాలం బయలుదేరదూ? హరి అరవింద సూతి మునులష్ట దిశాపతులాదిగా వియచ్చరులిరువంకలన్ గొలువహరి అరవింద సూతి మునులష్ట దిశాపతులాదిగా - ఆయన కదిలితే అందరూ కడులుతారుట. అందుకే కృష్ణుడు చెప్తున్నాడు బ్రహ్మ వైవర్త పురాణంలో. ఏమని అంటే ఎవరు మహాదేవ! మహాదేవ! మహాదేవ! అని అంటారో వారి వెనకాల శివుడు పరుగెడతాడట. ఎలా అంటే దూడ వెంట ఆవు వలె అన్నారు. "వత్సం గౌరివ గౌరీశో ధావంత మనుధావతి". ఆయన పరుగెడుతూ ఉంటాడు ఎలాగూ గౌరీ సమేతుడై.
ఎందుకంటే ఆవిడని వదిలిపెట్టి ఆవిడ ఉండదు. "తన వెంటన్ సిరి, లచ్చి వెంట నవరోధవ్రాతమున్" - హరి కదిలితే సిరి కదిలింది, శివుడు కదిలితే గౌరీ కదిలింది. ఎప్పుడైతే పార్వతీ పరమేశ్వరులు కదిల్తే వాళ్ళని వదలలేక లక్ష్మీ సమేతుడనై నేను కదులుతాను అని కృష్ణుడు చెప్తున్నాడు నారదుడితో ఈమాట బ్రహ్మ వైవర్త పురాణంలో. మేమిద్దరం కదిలితే మమ్మల్ని వదలలేక దేవతలంతా కదిలిపోతారు. కనుక మహాదేవ! అనే వాడి వెనకాల ఇంత బలం, బలగం ఉంటుంది. మరి ఆయన వస్తుంటే ఎంత ఆచి తూచి అడుగులు వేస్తున్నా సందడి వినపడుతోంది. ఆ సందడికి ఆశ్చర్య చకితురాలై ఆమె వెనక్కి తిరిగి చూసిందిట.నేను మాటకి కట్టుబడతా. మరింక కిందికి దిగను. ఇక్కడే ఉండి పోతాను అన్నాడు శివుడు. నువ్వు కిందికి దిగకపోతే నేనూ దిగను అని ఆవిడ పట్టుబట్టింది. నువ్వు ఎక్కడుంటే నా బ్రతుకు అక్కడే.
కొంతమంది ఈ ప్రపంచం అంతా వేస్ట్ అని కన్ఫర్మ్ చేసుకొని భగవంతుడే గొప్పవాడు అని అటు వెళ్తారు. అయితే ఇది వేస్ట్ అని తేలేలోపల బ్రతుకు అయిపోతుంది. వీళ్ళకి ఏ జన్మ సంస్కారాల వల్లో ఆయన పట్టేస్తాడు. ఆయన పట్టేస్తే మరి ఇటు చూపు రాదు. నిరంతరం సూర్యుడిని చూసే వారికి దీపం వెలిగించుకోవాలి అని బుద్ధి పుట్టదు. వాడు చూస్తున్నది మహాకాంతిని. వాళ్ళయొక్క స్థితి ఇలా ఉంటుంది. ఇలా పరమాత్మను చూస్తూ పరవశించి పోతూ ఉంటారు. ఇప్పడు ఆవిడ అక్కడ కూర్చుందిట. ఆ స్థితి ఎలాంటిది అంటే నెలలునిండి పోయాయి. అక్కడే ప్రసవించింది. అప్పటికైనా పిల్లవాడిని చూసుకొని వెళ్ళచ్చుగా. అప్పటికీ కదలలేదట ఆవిడ. అప్పుడు పరమాత్మ అమ్మా! రా అన్నాడు. శివజ్యోతిలో పుట్టిన బిడ్డతో సహా లీనమైపోయింది ఆ తల్లి. అలా లీనం చేసుకున్నాడు ఆ పరమాత్మ. ఒకప్పుడు సాలంకయ్య ఇంటికి వచ్చి భోజనం చేసి ఆయనను అనుగ్రహించి వెలిసి ఇక్కడ ఉండిపోయాను. నీకోసం ఇప్పుడు కొంచెం క్రిందికి దిగి ఉన్నాను.
అయితే నన్ను చూడాలంటే ముందు నిన్ను చూస్తే గానీ నన్ను చూసి ప్రయోజనం లేదు. కనుక అందరూ నిన్ను చూసేలా చేయాలి అన్నాడు. ఈ వార్త ఆనోటా ఈనోటా పాకి ఇప్పటికీ ఆ తల్లి పేరున ఒక ఆలయం ఉంది. ఆనందవల్లి ఆలయం. ఆ తల్లికి నమస్కారం చేసుకొని తర్వాత శివుడిని చూడాలిట. ఇంతవరకు చెప్పుకున్న శివక్షేత్రం నరసరావు పేట దగ్గరున్న కోటప్పకొండ. దీనిని బట్టి చూస్తే ఒక్క క్షేత్రాన్ని కదిలిస్తే ఎన్ని కథలు మనకి. అందుకే మన ధర్మం పుస్తకాలలో కూర్చోలేదు. మన క్షేత్రాలలో పండింది. దేవుడిని తీసుకొచ్చి కూర్చోబెట్టాం మనం. కనుక భగవంతుడు గొప్పవాడు అని పుస్తకాలు చూసి చెప్పక్కరలేదు. భక్తుల కథలు చూసి చెప్పుకోవచ్చు. వాటికి తార్కాణంగా క్షేత్రాలున్నాయి. మహాక్షేత్రం ఇది. దాని పేరు త్రికూటాద్రి. బ్రహ్మవిష్ణు రుద్రాత్మకుడైన పరమాత్ముడున్నాడు. వీరిని అనుగ్రహించినటువంటి ఆ దైవం దక్షిణామూర్తి. దక్షిణామూర్తి అంటే మోక్ష ప్రదాత. నేరుగా మోక్షాన్నిస్తాడు. లయం చేసుకున్నాడు. నేరుగా లాక్కునే మూర్తులలో దక్షిణామూర్తి, నటరాజు వీళ్ళిద్దరుంటారు. దక్షిణామూర్తి క్షేత్రాలలో ఇటువంటి ప్రత్యేకత ఉన్నది.