కాత్యాయని వ్రతం / శ్రీ వ్రతం
ధనుర్మాసం లో కాత్యాయని వ్రతం చేస్తారు , దీనినె శ్రీ వ్రతం అని కూడా అంటారు. పూర్వం పార్వతి దేవి , మేన దేవి , హిమవంతుడు కి జన్మించింది. శివుడ్ని పెళ్లి చేసుకోవటానికి కాత్యని వ్రతం చేసి శివుడ్ని పెళ్లి చేసుకుంది. ఒకపుడు నెల రోజులు రంగనాధుని పూజ చేసింది. ద్వాపర యుగం లో గోపికలు అందరు కూడా ఈ వ్రతాని చేసి కృష్ణుడ్ని భర్త గ పొందారు. ఇక్కడ మనకి గొబ్బిళ్ళు పెడుతూ ఉంటారు. గోమయం తో మాత్రమే గొబ్బిళ్ళు పెడతారు. గోమయం లో లక్ష్మి ఉంటుంది. కార్తిక పురాణం ప్రకారం గోమయం తో శివలింగం చేసి , శివుడ్ని ఆవాహన చేసి పూజ చేయడం వలన శివుడి కృపకి పాత్రులం కావచు. తెల్లవారుఝామున లేచి గౌరీ దేవి కి పూజ చేయడం వలన పెళ్లి కానీ అమ్మాయి లేదా అబ్బాయి పెళ్లి అవుతుంది. సౌభాగ్యం నిలుస్తుంది, నిత్యం తెల్లవారు ఝామున సూర్యోదయానికి మునుపు లేచి స్నానం చేసి దీపం పెట్టాలి. ఏ కోరిక కోసం చేస్తారో వారి కోరిక తీరుతుంది అని ప్రమాణం.