మార్గశిర మాసం లో ఆరుద్ర నక్షత్రం విశేషం ఏంటి ?

శివుడికి నాటు ఆవు నేయి తో తెల్లవారుఝామున లేదా ప్రదోష కాలం లో అభిషేకం చేయాలి. శివాలయం లో మాత్రమే అబిషేకం చేయాలి, ప్రదోష కాలం లో గుడికి వెళ్లి దీపం వెలిగించి , అభిషేకం ఎందుకు చేయాలి అనుకున్టునారో సంకల్పం చెప్పుకుని , ముందుగా పంచమ్రుతలతొ అబిషేకం చేసి ఆ తరువాత ఆవునేయి తో అబిషేకం చేయలి. 

ఆరోగ్యం కోసం అయితే మృత్యుంజయ స్తోత్రం తో 
ఐశ్వర్యం కోసం అయితే నమకం - చమకం తో 
శివపంచాక్షరి తో కూడా చేయవచు 
వ్యాది పోవటం కోసం ఆవు పాలు , నేయి తో 
10,000 సార్లు చదువుతూ పురుష సూక్తం చదువుతూ కూడా చేయవచు అని కొన్ని గ్రంధాల లో ఉంది . (శివ మహా పురాణం ) వివాహం జరగడం లేదు అంటే పాసుపత మంత్రం తో చేస్తారు కానీ నేటి తో చేయరు.  కష్టాలు వచినపుడు , ఉపద్రవాలు వచినప్పుడు అలాంటివి వచినప్పుడు మార్గశిర మాసం లో ఆరుద్ర నక్షత్రం రోజున నాటు ఆవు నేయి తో అబిషేకం చేయాలి. మూపురం తో ఉన్న ఆవు మాత్రమే మన దేశి ఆవు . ఎందుకంటే ఇప్పుడు సంకరం చేసేటపుడు కూడా వేరా జంతువూ నుంచి లేదా విదేశి దున్నపోతు నుంచి సంకరం చేయటం వలన వచ్చే సంతానం కి మూపురం ఉండదు. మూపురం లో ముక్కోటి దేవతలు ఉంటారు, మూపురం నుంచి -సూర్య కేతు నడి నుంచి సూర్య రసిమి గ్రహించి రోగ నిరోధక శక్తి ని తీసుకోవటం వలన కెరోటిన్ అనే పదార్థం తయారవుతుంది. 

కార్తిక మాసం లో 1000 దీపాలు వెలిగిస్తే సకల దోషాలు పోతాయి అంట. పుష్య మాసం లో పుష్యమి నక్షత్రం రోజు శివుడికి నీరాజనం ఇవాలి. మాఘ మసం లో మాఘ నక్షత్రం రోజు శివుడి ప్రీత్యర్ధం గ నేయి దానం చేయాలి , కంబలి దానం చేయాలి, ఇలా చేయటం వలన శివానుగ్రహం కలుగుతుంది. 

వైశాఖ మాసం లో విశాఖ నక్షత్రం రోజున పువ్వులతో శివలింగాని తాయారు చేసి , ఆవాహన చేసి అర్చన చేయటం వలన శివానుగ్రహం కలుగుతుంది అంట (శివ మహాపురణం ). 

అస్విజ మాసం లో నూకలు లేని బియం తో పాయసం చేసి శివుడికి నివేదన చేయటం వలన శివానుగ్రహం కలుగుతుంది. అ పాయసం పాత్ర తో పటు దానం చేయటం వలన దరిద్రం పోతుంది అంట.