గర్భం తో ఉన్నపుడు ఆహార నియమాలు


2, 4, 6, 8 వ నెల లో అబోరిషన్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉండడం వలన ఈ ఈ మాసాలలో తగు జాగ్రత్తగా ఉండాలి . 

భార్య గర్భం తో ఉంటె 6వ నెల వచ్చినప్పటినుంచి భర్త గోళ్లు , జుట్టు కత్తిరించకూడదు . 6వ నెలనుంచి భార్య భర్తలు ఇరువురు నిత్య దేవతార్చన చేసుకోవచ్చు కానీ విశేష పూజలు , పీటల మీద కూర్చుని చేసేపూజలు చేయకూడదు . గృహ ప్రవేశం చేయకూడదు .6వ నెల నుంచి భర్త భార్య ఇద్దరు గుడికి వెళ్ళకూడదు. 6 నుంచి 8 నెల వరకు సౌచం ఉంటుంది . భర్త తన ఇంటి వారిది కాకుంటే మాత్రం శవం మోయకూడదు . భార్య తో గొడవపెట్టుకోకూడదు . సముద్రస్నానం , కర్మలు, పిండప్రదానం భర్త  చేయకూడదు.