సంకట హర చతుర్థి


సుద్ధ చవితి రోజున ఉదయం పూత పూజ చేయాలి . బహుళ చవితి అంటే పౌర్ణిమ తరువాత చవితి రోజున ఉదయం పోదున పూజ చేసిన చద్రోదయ సమయానికి విషేష పూజ చేయాలి.

సంకష్ట హర చతుర్థి చేసేవారు చవితి తిథి మాత్రమే చూసుకుని చేయకూడదు , అ తిథి ఉన్న సమయం కూడా చూసుకోవాలి . చద్రోదయ సమయానికి చవితి తిథి ఉన్నదీ మాత్రమే చేయాలి . రోజు మొత్తం చవితి తిధి ఉంటె సమస్య లేదు కానీ తగులు మిగులు (అంటే ఎ రోజు మధ్యానం లేదా రాత్రి కి చవితి తిధి ప్రారంభం అయి మరుసటి రోజు తిధి పూర్తి అయితే ) వచినప్పుడు కచితంగా తిధి సమయం చూసుకోవాలి.

ధర్మ సింధు లాంటి గ్రంధాలో మనకి చేపెటువంటి విషయం ఏంటి అంటే "తదియతో కలిసిన చవితి " చెయాలి తప్ప పంచమి తో కలిసిన చవితి చేయకూడదు. ఇలా చేయటం వలన సంకటాలు అని తొలిగి పోవు. తిధి నిర్ణయం తప్పు జరుగుతుంది . శాస్త్ర ప్రకారం చవితి చేయడం లేదు .

సంకట హర చతుర్థి కొంత మంది జన్మంతము చేస్తారు . కొంత మంది 21 సంవత్సరలు చేస్తారు . కొంతమంది ప్రత్యేకమయిన కామ్య సిద్ధికోసం మాత్రమే ఒక సంవత్సరం చేస్తారు .
ఇలా సంవత్సరం కూడా చేయలేనివారు ( ఒంట్లో బాగోదు , మధుమేహం ఉంది , రోజు తినకుండా ఉండలేము అనుకునే వాలు) శ్రావణమాసం లో వచ్చే సంకట హర చతుర్థి చేస్తే సంవత్సరం మొత్తం సంకట హర చతుర్థి చేసిన ఫలితం వస్తుంది .

జాతకం లో దోషాలు ఉంటె కేతువు బాగోలేక పోతే , రాహువు దోషాలు , వివాహ దోషాలు , సంతానం దోషాలు , ఇల్లు కట్టుకోవాలి , విద్యార్ధులు , ఏదయినా ఒక పని వెన్నకి పోతుంది అనుకునే వాలు అందరు ఈ పూజ చేయవచు.  

సంకట హర చతుర్థి పూజ చేసే విధి విధానం :
సంకటాలు ఉన్నపుడు , వినాయకుడు సంకల్పం చెప్పుకుని అ రోజు తేలవరుఝామున లేచి తలారా స్నానం చేసి దీపం పెట్టుకుని మిగిలిన పూజ కార్యక్రమాలు పూర్తి చేసుకుని సాయంకాలం మల్లి స్నానం చేసి ఇంట్లో ఒకవేళ వినాయక విగ్రహం ఉంటె అభిషేకం చేసుకోవచు (గణపతి అధర్వణ శీర్షం తో అభిషేకం చేసుకోవటం మరీ విశేషం ). 

గుడిలో పూజ చేసుకోవచు . లేదా ఇంట్లో నే గణపతి పటానికి గణపతి స్తోత్రాలు , గణపతి అధర్వణ శీర్షం చదువుకోవడం , వీలయితె గణపతి మంత్రాని "ఓం గం గణపతయే నమః" అనే నామని జపించుకోవాచు. 

చవితి రోజు చంద్రుడు కనిపించక పోతే?
గరిక , ఎర్రని గన్నేరు పూలు , ఎర్రని మంధర పూలు , ఎర్రని గులాబీలు , ఎర్రని రక్త చందనం పెట్టి గణపతి కి పూజ చేయాలి . తెల్ల జిలెడు పూలతో పూజ చేస్తే మహా విశేషం. మోదకం , లడ్లు నైవేద్యం చేసి చద్రుడికి కూడా నివేదన చేసి , చంద్రుడికి కూడా నమస్కారం పెట్టి , ఎవరికైనా నైవేద్యం లేదా భోజనం పెట్టి వాలు తినాలి . నిష్ఠ గ చేయాలి అనుకునే వారు ఇంకా అ రోజు కి ఉపహారం చేసి మర్నాడు దీపం పెట్టి అప్పుడు తినాలి . ఉండలేని వాలు ఇంకా చవితి రోజే చంద్రోదయం పూజ అయిన తరువాత తినే య వచ్చు. ఆకాశం వంక చూసి చంద్రుడిని , విగ్నేస్వరుడ్ని తలచుకుని నమస్కరించి వ్రతం నిష్క్రమించవచ్చు.