ఆగమములు

ఆగమములనగా వచ్చి చేరుట అని  అర్థం.  వీటిని  శివుడు  మొదటగా  పార్వతీదేవికి ఉపదేశించుట జరిగినది. ఇవి వేదాలతో బాటు  ప్రాచీనమైనవి.  వీటిని ఆవిర్భూతాలని అంటారు. ఆగమములు వైదికము, తాంత్రికము అని కలవు. శైవాగమములు వైదిక ఆగమములుగా చెప్పబడతాయి. ఎంతో విశేషత కలిగిన ఈ ఆగమములలో వీరశైవము - సిద్దాంతము - దీక్ష - ఆచరణ గూర్చి  విశేషంగా కలదు. అంతేగాక ఈ ఆగమ సిద్దాంతాల ఆధారంగానే వీరశైవపు పెక్కు గ్రంధాలు వెలువరించబడినవి.

ఆగమాల ప్రస్తావన పెక్కు పురాణాలలో కనిపిస్తుంది. అంతేగాక శ్వేతాశ్వరాది ఉపనిషత్తులలోని శ్లోకాలు విషయమూ ఆగమములలో కూడా కలవు. భగవద్గీతలోని చాలా శ్లోకాలు ఆగమములోనివిగా (ఎక్కువగా  పారమేశ్వరాగామము నుండి) అగుపిస్తాయి.  కొన్ని శ్లోకాలు యథాతతంగానూ మరికొన్ని కొద్ది మార్పులతోనూ కలవు.

ఆగములను ప్రాచీనులైన కాళిదాసాది పండితులు తమ రచనలలో ఆగమ విషయ ప్రస్తావన చేయడం ఇవి చారిత్రకంగానూ బహు పురాతణమని తెలియదగును. 

ప్రాచీన కాలంలో వేదపరంగా ఆచరణాధికాలు ఉండేవి, కాని ప్రస్తుతం హిందూమతం యావత్తు ఈ ఆగమ శాస్త్రం ప్రకారమే నడుస్తుందని చెప్పవచ్చు. మనం నిత్యం ఆచరించే పద్దతులు, పూజా విధానాలు, దేవాలయాలు - వాటి పూజాధికాలు, పండుగలు ఇత్యాది ఎన్నో ఆగమ యుతంగా నడుస్తున్నాయి.

వేదములు కర్మను ప్రధానంగా భోదిస్తాయి, ఉపనిషత్తులు జ్ఞాన బోధకములు, కాగా ఆగమములు కర్మజ్ఞాన సముచ్చయక భోదములు.  కేవల తత్వ జ్ఞానమునే కాక ఉపాసనాధి క్రియల తెలిపి జీవులకు ముక్తిని ప్రసాదించు నట్టివి - కావున అందరికీ ఆచరనీయమైనవి.

ఆగమ శబ్దార్థం  
Aagatha Shiva Vaktrebhyah, Gathasthu Girijaa Mukham  ! 
Maheshwara Thathva Kathaanaadaagamah Kathitho Dvija !! (Kaaranagama)
పరమశివుని పంచ ముఖముల నుండి వెలువడి పార్వతి మరియు బ్రహ్మాదులచే గ్రహించబడినవి. ఇవి పరమేశ్వరుని పరతత్వ భోధకములు. 

ఆగమాస్ - వైదికం  
"Shivaagama Midam Punyam Shruthimoolam Vimukthidame
Tasmath Sadaa Sevaneeyam" (Kaamikaagamam)
శివాగామములు పుణ్యమైనవి వేద మూలకములు. ఇవి ముక్తిదాయకములైనందున వీటిని సదా సేవించవలయును. 

ఆగమం అనగా ?  
Aachaara KathanaathDivyagathi Praapthi Vidhaanathahv !
Mahesha Thathva KathanaathAagamah Kathithah Priye !! (Kiranaagama)
ఆగమములలో శైవాచారాలు, శివదీక్షాది విధులు, మోక్ష సాధకములైన శివలింగాది పూజాధికాలు, మహేశ్వర తత్వ ప్రతిపాదకుమలైన విషయములు ఉండును.  

 ఆగమ శాస్త్రములు 2 విధాలు:
1) శైవాగమాలు 2) శాక్తేయ ఆగమాలు (శాక్తేయ ఆగమాలను  తంత్ర ఆగమాలు అని కూడా అంటారు ) 
వీటిలో  దేవతామూర్తుల నిర్మాణం, దేవాలయాల నిర్మాణం, విగ్రహ ప్రతిష్టలు, పూజోపాసనాది క్రియలతో కూడుకొని ఉండును. 

శాక్తేయ (తంత్ర) ఆగమాలు 64 కలవు, వీటిలో శాక్త పద్దతుల సిద్దాంతాల గూర్చి వివరంగా తెలుపబడి ఉండును.  ఇవి పరాశాక్తియైన  పార్వతికి  సంబందించినవి.


శైవ అగమాస్ 
శైవాగమాలు 28 కలవు. ఈ 28 ఆగమాలను అద్వైత, ద్వైత, విశిష్టాద్వైత పరంగా కూడా విభాగించ బడ్డవి.

ప్రతి శైవాగామములో దిగువ విషయాలు ప్రతిపాదింపబడి ఉంటాయి :
క్రియాపాద, చర్యపాద, యోగపాద, జ్ఞానపాద అనే నాలుగు పాదములు
పతి, కుండలిని, మాయ, పశు, పాశ, దీక్ష అనే షట్పదార్థములు తెలియజేయబడి ఉండును. . 

గురుముఖమున నిర్గతమగుజ్ఞానము, ప్రత్యక్షాది పదార్థరూప జ్ఞేయము, లింగార్చనా లక్షణమగు అనుష్టేయము, భస్మధారణాత్మకమగు అధికృతము, శివమంత్ర రూపమగు సాధనము, శివ సమానతా ముక్తి రూపమగు సాధ్యము అనే షట్పదార్థములు తెలియజేయబడి ఉండును. 

శివుని సగుణ, నిర్గుణ ఉపాసనల వివరించునవే శైవాగమములు.   ఇవి పూర్తిగా శైవ సిద్దాంతాలను, పద్దతులను, దీక్షాది విధులను, ఆలయ నిర్మాణ, నిర్వాహణాది విషయాలను     భొదించును. ఇవి సమస్త శైవులందరికీ ప్రధానమైనవి. పార్వతీదేవి సందేహాల నివృత్తి చేస్తూ శివునిచే భోదించబడెను.  ఈ ఆగమాలను వేరు వేరు మహాత్ములు విని ప్రచారము చేశారు.


సద్యోజాత ముఖమున - 5
వామదేవ ముఖమున - 5
అఘోర ముఖమున - 5
తత్పురుష ముఖమున - 5

ఈశాన ముఖమున - 8