సంకటహర చవితి వ్రత కధ

GANAPATHY  {WALL PAINTING}

శత్రు, దారిద్ర్యాది మహాకష్టములచే బాధింపబడువారికి, ఋణబాధలు ఉన్నవారికి, సంతానం లేనివారికి, భూమి, ఇల్లూ లేకపోవడం వంటి ఈతి బాధలు పడేవారికి, ధీర్ఘవ్యాధులచే పీడింపబడేవారికి, చదువు సారిగ్గా రాకపోవడం, ముందు సాగాకపోవడం లాంటి ఆటంకాలు ఎదురయ్యేవారు అనుభవించే మానాసిక క్షోభ అంతా ఇంతా కాదు. భూలోకంలో కలియుగం మొదలై 5000 సంవత్సరములు గడిచిన తరువాత ఇట్టి క్లేశములు మనుష్యులను ఎక్కువగా బాధిస్తాయి. ఈ విధంగా క్షోభ అనుభవించే వారి కష్టములను తీర్చే వ్రత రాజమేదైనా ఉంటే చెప్పవలసిందిగా స్కందుని(కూమారస్వామిని) ఋషులందరూ అడిగారు.

"శ్రీలు సిద్ధించుటకు, తక్షణ ఫలదాయిని అయిన సంకష్టహరచవితి అనే వ్రతం మహాశ్రేష్టమైనది. ఇది వ్రతాలలోకేల్లా ఉత్తమమైనది. ధర్మరాజు అరణ్యవాస, అజ్ఞాతవాస మహాకష్టములను ఎదుర్కోన్నప్పుడు రాజ్యలాభము, పూర్వవైభవము పొందు నిమిత్తము శ్రీ కృష్ణుని ప్రేరణచే ఈ వ్రతాన్ని ఆచారించాడు. శ్రీ క్ర్ష్ణుడు ధర్మరాజుకు ఈ వ్రతం యొక్క మహాత్యాన్ని వివరిస్తూ ఇది గణపతి స్వయంగా పార్వతీ దేవికి చెప్పినట్ట్లు, తాను ఆ వ్రతన్నే ఉపదేశిస్తున్నట్లు చెప్పాడు" అంటూ కుమారస్వామి చెప్పగానే ఋషులు ఈ విధంగా అడిగారు.

"మహాసేనాధిపతి! లోకకల్యాణ నిమిత్తం తన జనని అయిన పార్వతీ దేవికి గణపతి ఈ వ్రతాన్ని ఏ విధ్మగా చెప్పాడో, ఆ విధానం మాకు కుడా తెలియజేయండి" అని కోరారు.

" ఒకానొక కల్పంలో హిమవంతుని కుమార్తే అయిన పార్వతి, సివుని పతిగా కోరి భక్తితో తీవ్ర తపస్సు చేసినా, ఫలితం లేకపోవడంతో, పూర్వలీల రూపమున తనయందు జన్మించిన హేరంబ గణపతిని మనసులో స్మరించింది.

స్మరణమాత్రానే తన ఎదుట ప్రత్యక్షమైన గణేశుని చూసి "ఇతరులకు అసాధ్యమైన కఠోర తపస్సు చేసినా, సర్వజనవశంకరుడైన శంకరుని భర్తగా పొందటంలో జాప్యం జరగుతోంది. ఇటువంటి ఆటంకాలు తొలగడానికి, స్వర్గాది లోకాల్లో నీకు సంబంధించిన సంకటహరణం అనే వ్రతాన్ని ఆచరిస్తూంటారని నారద మహర్షి ద్వారా వినాను. ఆ వ్రత విధానం వివరించి" అని కోరింది.

దానికి వినాయకుడు "తల్లీ! గురు-శుక్ర మూఢాలేవి లేని శుభశ్రావణ బహుళ చవితినాడు సూర్యోదయానికి ముందే నిద్ర లేచి, దృఢ సంకల్పంతో సంకష్టహర చతుర్థి వ్రతం చేస్తాన్ని మొక్కుకుని, దంతధావనాధికాలు పూర్తి చెసుకుని నల్లటి నువ్వులతో కూడిన నీటితో స్నానం చేసి, సంధావందనం మొదలైన నిత్యనైమిత్తికాలు ఆచరించి కల్పోక్త ప్రకారం గణేశ పూజ నిర్వర్తించాలి.

ఉద్యాపన విధి : 
బంగార, వెండి, రాగి లేదా మట్టితోనైనా నా ప్రతిమ చేసి(లోభత్వం పనికిరాదు) నీటితో నింపి, ఎర్రని వస్త్రంతో చుట్టిన కలశంపై గాని, మంటపంపై అష్టదళపద్మం ఏర్పరిచి గాని నా ప్రతిమను ఉంచిం ప్రాణ ప్రతిష్ట చేసి, విభూతి, గంధాక్షతలతో, పుష్పబిల్వాలతో, గరికపోచలతో అర్చిచి, ధూపదీప నైవేధ్యాలు అర్పించి హారతి ఇవ్వాలి. శ్రావణ బహుళ చతుర్థీ నాడు ఈ వ్రత ఉద్యాపన చేయాలి. పూజానంతరం హవనం(హోమం) చేయాలి. వ్రతం విధానం బాగా తెలిసిన ఆచార్యునిచే పూజాది కార్యక్రమాలు నిర్వర్తింపజేయడం చాలా ఉత్తమం. ఈ పూజపై చెప్పిన తిధిలో ఏడాదికొకసారైనా సరే చంద్రోద్య సమయంలో ఆచరించదగినది.

ఏ రాత్రి పురాణోత వేదమంత్రాలతో కాలక్షేపం, దైవసంబంధిత నృత్యగీత వ్ద్యాదులచే జాగరణం వేయాలి. మరునాడు యధాశక్తి21 మంది బ్రాహమ్ణులకు దానాదులు చేసి సంతృప్తి పరచాలి. వ్రతం చేయించిన  ఆచార్యునకు వస్త్ర. భూషణ, ఛత్ర పాదుకాది సమస్త సంభారములు దక్షిణ సహితంగా ఇవ్వాలి.

నాకు ప్రియమైన ఈ వ్రతరాజాన్ని భక్తి స్రద్ధల్తో ఆచరించడం వల్ల నేను సంప్రీతి చెంది కోరికలను తీర్చుతాను" అన్నాడు గణపతి. గణపతి ద్వారా విన్న పార్వతీదేవి యధావిధిగా సంకష్టహర గణపతిని అర్చించి, ఈ వ్రత మహిమవల్ల 6 నెలలు తిరగకుండానే ఇతర ప్రయత్నాలు అవసరం లేకుండానే శివుడిని భర్తగా పొందింది.

ఈ ప్రకారమే శ్రీ కృష్ణుడు ధర్మరాజుకు ఉపదేశించడు. భారతంలో పాండవులకు విజయప్రాప్తి కలిగినదని మేకు తెలుసు కదా! కనుక ఋషివరేణ్యులారా! లోకంలో సంకటాలు నశించడానికి, మనుష్య, యక్ష, రాక్షస, గంధరావాది సమస్త జాతులవారి సర్వాభీష్టాలు తీరడానికి ఇంతకంటే సులభోపాయం లేదు" అని స్కందుడు ఋషులకు తెలిపాడు.

"ఇంకా ఈ వ్రతం ఎవరెవరి వేత ఆచరించబదింది?" అని ఋషులు అడుగగా, " మహబలవంతుడైన వాలి, రావణునే తన చంకయందు ఇరికించుకుని బందీని చేయు సందర్భంలో రావణుడు ఈ వ్రతం ఆచరించి సుఖంగా లంక చేరుకున్నాడు. హనుమతుడీ వ్రతప్రభాముచేత లంకలో సీతమ్మవారి జాడ కనిపెట్టగలిగాడు.

అట్లే, మహారణ్యంలో భర్తను గానక, అలమటిస్తున్న దమయంతి సంకష్టహర గణపతిని సంకల్ప మాత్రాన ప్రసన్నం చేసుకుని భర్త అయిన నలమహారాజును కలిసి సుఖంగా జీవించింది. అహల్యానాత కూడా పతి శావపశాన భర్తకు దూరమై ఈ వ్రతాచరణ వల్ల తిర్గి భర్త అయిన గౌతమ మహర్షిని చేరింది.

ఈ సంకష్టహర వ్రతం చేసి పుత్రులు లేనివారు పుత్రలాభం, ధనం లేనివారు ధనలాభం, విద్యలేనివారు విద్యాప్రాప్తి, వ్యాధిగ్రస్తులు ఆరోగ్యం పొంది సుఖంగా ఉండగలరు" అంటూ కుమారస్వామి వివరించాడు.

కధా సేకరణ : శ్రీ గణేశ పుస్తకం