అమ్మవారిని ఏ పువ్వులతో , పత్రీ తో పూజ చేయాలి?

అమ్మవారికి ఈ నవరాత్రి లో రోజు ఒక రకమయిన పువ్వు లేదా పత్రీ తో పూజ చేయల ? లేక ఈ నవత్రులలో ఒకే రకమయిన పువ్వులతో పూజ చేయాలి అనుకుంటూనారో నిర్ణయించుకోవాలి. కోటి బిల్వార్చన , లక్ష బిల్వర్చాన తో కూడా పూజ చేయటం వలన శివుడికి పూజ చేయటం వలన ఎలాంటి ఫలితం లబిస్తుందో అలంటి ఫలితమే అమ్మవారికి చేయటం వలన లబిస్తుంది. 

ఉపాసన పరులు అయితే రక్త చందనం అనే గంధం తో ఆ బిల్వ ఆకుల మీద అమ్మవారి నామాలు,
బీజాక్షారలు రాసి, అమ్మవారి నామాలు చదువుతూ అంటే లలితా సహస్రనామాలు చదువుతూ ఒకో నామానికి "నమః" అని అన్నపుడు అమ్మవారి పాదాల మీద ఈ బిల్వాలు పెడుతూ ఉండాలి.

మల్లెలు తో అమ్మవారికి ఎవరు లలితా సహస్రనామాల తో పూజ చేస్తారో వారికి సకల అబిష్టాలు నెరవేరుతాయి. మగవారికి అయితే అనుకులవతి, సిళవతి అయిన బార్య  లబిస్తుంది, ఆడవారికి అయితే అనుకూలమయిన బర్త , శ్రీ రాముడు లాంటి బర్త లబిస్తాడు, సౌభాగ్యం లబిస్తుంది. 

మాలతి పుష్పాలు తో పూజ చేయటం వలన సకల శుభాలు, సౌభాగ్యాలు జరుగుతాయి. దాడిమి కుసుమాలు ( దానిమ్మ పువ్వులు ) తో పూజ చేయటం , అగస్త్య పువ్వులు ( అవిశ పువ్వులు ) తో కూడా పూజ చేయటం వలన విశేషం అయిన ఫలితం లబిస్తుంది.