నవరాత్రి రోజులో అబిషేకం ఎలా చేయాలి?

బంగారం , స్పటికం , ఇత్తడి , వెండి, రాగి విగ్రాహాలకి మాత్రమే అబిషేకం చేయాలి. పసుపు గౌరీ కి లేదా పట్టానికి చేయకూడదు. ప్రాతః కాలం లో అంటే బ్రాహ్మి ముహూర్తం లో అంటే 4:00 గంటల సమయం లో చేయాలి. 

అమ్మవారికి అంగ వస్త్రం కట్టి, పూల మాల వేసి , బొట్టు పెట్టి , హారతి ఇచ్చి కుమ్బబిషేకం చేయాలి . అల సత కుమ్బాలతో అబిషేకం చేస్తే 100 సంవత్సారాల నుంచి వచ్చే పాపం పోతుంది. దీనికి ముందుగానే అ కలసలకి కలసస్థాపన చేయాలి. అ కళాశాలలో కర్పూరం , పసుపు , కుంకుమ , కస్తూరి, గంగా జలం సుగంధ ద్రవ్యాలు అనీ వేసి కళాశాల కి కూడా పూజ చేసి అప్పుడు అబిషేకం చేయాలి. 

మేధస్సు లేదు , జ్ఞ్యపకశక్తి ఉండటం లేదు, గుర్తు పట్టటం లేదు , చదివినది గుర్తు రావటం లేదు , కదల లేకపొతున్నారు , అనుకున్నపుడు పానకం తో కానీ , ఇక్షు (చెరుకు )  రసం తో కానీ , పాల తో కానీ అబిషేకం చేయాలి . 100 కలసలతో అంటే 100 పూర్ణ కుమ్బాలు పెట్టి పానకం తో కానీ , ఇక్షు (చెరుకు )  రసం తో కానీ , పాల తో కానీ నింపి పూజ చేసి అప్పుడు అబిషేకం చేయాలి. 

ఎవరు మామిడి రసం తో అమ్మవారికి అబిషేకం చేస్తారో వారికీ సర్వ దోషాలు పోయి, రోగ నివారణ జరుగుతుంది. పాలతో చేస్తే వారికీ సరస్వతి కటాక్షం కలుగుతుంది. వారిని సరస్వతి విడిచి వెళ్ళదు. 

100 కలశలతొ తో కుదరక పొతే కనీసం 11, లేదా ఒక్క కలశం తో అయిన ఈ నవరాత్రులలో రోజు అబిషేకం చేయటం, లేదా రోజు ఏదో ఒక ద్రవ్యం తో అబిషేకం చేయటం వలన అమ్మవారిని ప్రస్సనం చేసుకోవచ్చును. అమ్మవారికి గంగా జలం తో అబిషేకం చేస్తే సకల పాపలు పోతాయంట. 

అమ్మవారికి పసుపు (మంచి పసుపు నీలలొ కలిపి) తో అబిషేకం చేయటం వలన ఆడవారికి సౌభ్యగ్యం లబిస్తుంది, దానిమ్మ పళ్ళు రసం  తో అబిషేకం చేస్తే సర్వ కామానాలు నెరవేరుతాయి. శోకం నివారణ కోసం మంచి బెల్లం పానకం తో అబిషేకం చేయటం వలన ఎంత తీరని శోకం , బాద , రోగం, శత్రువులు , మనః క్లేశాల వలన అయిన తీరుతున్ధి. 100 కలసాలతో చేస్తే మంచిది , 100 చేయలేని వారు కనీసం ఒక్కటి ఒక్క కలశం తో చేయటం వలన వారి ఇంట్లో శోకం అనేది ఉండదు , బాద అనేది ఉండదు. ఆ కలశం లో బెల్లం నీరు పోసి , గంధం , యాలకులు , సుద్ద గంగా జలం ఆవాహన చేసి , పచ్చ కర్పూరం వేసి అ నీటి తో మన ఇంట్లో ఉండే అమ్మవారి విగ్రహానికి అబిషేకం చేయటం వలన సర్వ దుకాలు దూరం అవుతాయి. 

ఇన్ని చేయలేని వారు, ఆవు పాలు , లేదా చెరుకు రసం ఏది వీలు అయితే దానితో అమ్మవారికి అబిషేకం చేయాలి. అయితే అమ్మవారికి రాగి తో అబిషేకం చేయకూడదు, కంచు , వెండి , బంగారం తో శ్రీ సూక్తం తో అబిషేకం చేయాలి. ఈ నవరాత్రులలో రోజు ఒక అవతారం, లేదా మామూలు రోజులలో కూడా ఏ అమ్మవారికి అబిషేకం అని ఆలోచన అవసరం లేదు, ఎప్పుడు అమ్మవారికి అబిషేకం చేసిన శ్రీ సూక్తం తోనే చేయాలి. దానికి తోడుగా లక్ష్మి సూక్తం ,సరస్వతి సూక్తం , పురుష సూక్తం , కాళి సూక్తం తో చేసుకోవచ్చు. ఒక వెల్ల తెలుగు రాదు మేము చదవలేము అనుకునే వారు ఏదయినా ఒక అమ్మవారి మంత్రం తో కూడా అబిషేకం చేయవచ్చు. 

అబిషేకం అయిన తరువాత అమ్మవారికి హారతి ఇచ్చి, బట్ట తో తుడిచి (అద్ది) , బొట్టు పెట్టి , పాపిటలో సింధూరం పెట్టి , పాదాలకి పసుపు రాసి అప్పుడు అలకరించాలి. తరువాత అమ్మవారికి పుష్పాలతో సహస్రనామార్చన చేయాలి లేదా అష్టోత్రం పూజ చేయాలి. పాలు , పళ్ళు నివేదన చేయాలి. ఒక పరిసుబ్రమయిన పాత్రలో సుగంధ ద్రవ్యాలు వేసి పచ్చ కర్పూరం వేసి , పట్టిక బెల్లం వేసి అ నీటి ని అమ్మవారి దగ్గర పెట్టాలి. "మధ్యే మధ్యే పనీయమ్ సమర్పయామి " అని అంతము కదా , నవరాత్రులలో మధుర పానీయం పెట్టాలి. 

తప్పనిసరిగా అమ్మవారికి తాంబూలం పెట్టాలి. లేత తమలపాకులు తెచ్చి దాని ఇనెలు తీసి, సున్నం , వాక్క, కాజు , ఇలాచి , లవంగాలు , జాపత్రి , జాజికాయ , పచ్చకర్పూరం తో సహా పెట్టాలి. మనం ఎవరికయినా తాంబూలం ఇవటం అంటే ఉత్తి తమలపాకులు ఇస్తూ ఉంటారు, అలా కాకుండా ఇలా అన్ని పెట్టి అమ్మవారికి సమర్పణ చేసి అప్పుడు ముతయిదువులకి ఇవ్వాలి. అల ఇవ్వటం వలన అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది, సౌభాగ్యం కలుగుతుంది , దంపతుల మద్య అన్యోన్యం కలుగుతుంది, రోగాలు తగ్గుతాయి అంట. 

లక రివాజు ఏమిటి అంటే రెండు పళ్ళు , ఒకటి లేదా రెండు అకులు (దానికి కనాలు ఉంటాయో ఇంకేమయిన ఉంటాయో ) , రెండు వక్కలు వేసి ఇస్తారు. అల చేయకూడదు. చక్కగా తాంబూలం సుగంధ ద్రవ్యాలతో చుట్టి ఇవ్వాలి.