మూల నక్షత్రం రోజున సరస్వతి పూజ ఎలా చేయాలి?

చండి పారాయణం కూడా మొదటి , మధ్యమ , ఉత్తమ చరిత్ర కిన ఉండి, పూజ కూడా మహాకాళి , మహాలక్ష్మి , మహా సరస్వతి ని పూజ చేస్తారు. నవరాత్రి లో 3 రోజులు , 3 రోజులు , 3 రోజులు గ పూజ చేస్తారు.

మూల నక్షత్రం మొదటి పాదం లో పూజ చేయాలి. చివరి 3 రోజులు మూల నక్షత్రం + సప్తమి - సరస్వతి , అష్టమి - దుర్గ అష్టమి , నవమి - మహర్నవమి చేస్తారు. నవరాత్రి దీక్షలు చేసే వారు , ఉపాసన ఉన్న వాలు , అన్ని రోజులు చేయలేనివారు మూల నక్షత్రం రోజున కలస స్థాపన చేసి దీక్ష గ పూజ చేసి, సప్తమి , అష్టమి, నవమి అయిన తరువాత దసరా రోజు అపరాజిత పూజ చేసి కలసనికి ఉద్వాసన చేస్తారు. 3 రోజులు పూజ చేయాలి అనుకునే వారు దుర్ముహూర్తం లేకుండా కలస స్తాపన చేసి , 3 రోజులు అకండ దీపారాధన చేసి చండి సప్తసతి పారాయణం చేయాలి. శ్రీచక్రం ఉంటె ఆవరణ పూజ , లలితా సహస్రనామార్చన, సరస్వతి అష్టోతరం , కుంకుమార్చన , తెల్లని పువ్వులు లేదా కలువలతో పూజ చేయడం విశేషం. పాయసం ప్రసాదం పెట్టడం . దీక్ష ప్రరంబించేప్పుడే నక్తం చేస్తారా ? ఏక బుక్తం చేస్తారా ? లేదా 3 రోజులు ఉప్వసిస్తర అనేది సంకల్పం లో చెప్పుకోవటం , బ్రహ్మచర్యం చేయటం , అర్చనలు, అబిషేకాలు చేయటం . వీలయితే మహర్నవమి రోజు చండీ హోమం చేయటం. తరువాత రోజు దశిమి రోజు , పూజ అయిపోయిన తరువాత, మహా నివేదన్ తరువాత , సువాసిని పూజ అయిన తరువాత కలశానికి ఉద్వాసన చేయాలి.

9 రోజులు చేసే వాలు పాడ్యమి రోజు, 5 రోజులు చేసే వాలు పంచమి రోజు, అది కూడా వీలుకానీ వారు మూల నక్షత్రం రోజున కూడా కలశ స్తాపన చేసుకుని పూజ చేయవచ్చు.

సరస్వతి సూక్తం , సరస్వతి సహస్రనామాలు చదువుకోవటం , మేధో సూక్తం , సరస్వతి కవచం , యజ్ఞవాల్క స్తుతి చదువుకోవటం మంచిది, పుస్తక రూపం లో సరస్వతి ని పూజ చేయాలి. మన ఇంట్లో ఉండే గ్రందాలు రామాయణం , భాగవతం లేదా పాట్య పుస్తకాలకి పూజ చేయలి. 

ఈ 3 రోజులు కూడా సరస్వతి అలంకారం చేస్తారు . తెల్లని పట్టు చీర కి ఎర్రని అంచు ఉన్న చీరను కడతారు. ముత్యాల హారం వేస్తారు. పాయసం , పరమాణం , పళ్ళు , పాలు, పేలాలు నివేదన చేయాలి. నువ్వులతో చేసిన లడ్డులు , వరి పేలాలు నివేద విశేషం. తేన నివేదన చేయటం , వస తో హోమమ చేయటం విశేషం. మాటలు రాణి వారు వసతొ హోమమ చేయటం వలన మాటలు వచ్చే అవకాసం ఉంటుంది. వాక్ సిద్ధి కావాలి అనుకునే వాలు, పాండిత్య రావాలి అనుకునే వాలు , జ్యోతిష్యం లో ప్రావిణ్యం కావలి అనుకునే వారు , సర్వజనులు సరస్వతి పూజ చేసుకోవాలి. 

సరస్వతి వ్రతం ఎలా చేయాలి?
మూల నక్షత్రం రోజున సరస్వతి వ్రతం చేయవచ్చు. ప్రతి నెల వచ్చే మూల నక్షత్రం రోజున చేయవచ్చు లేదా నవరాత్రి లో వచ్చే మూల నక్షత్రం రోజున అయిన చేయవచు. 

మూల నక్షత్రం రోజున సరస్వతి వ్రతం చేయాలి అనుకునే వారు ఒక వేదికను ఏర్పాటు చేసుకుని కలశ స్తాపన చేసే ప్రదేశం లో "సర్వతో భద్ర " అనే ముగ్గుని బియ్యం పిండి తో పెట్టాలి. ప్రత్యేకమయిన రంగులు ఉంటాయి వాటితో నింపాలి, ఇరు వైపులా శంకు చక్రాలు వేయాలి, గో పాదుకలు వేయాలి. అప్పుడు కలశం లో పంచ పల్లవాలు వేయటం, సప్త నదులని, సరస్వతి దేవిని ఆవాహన చేసి కలశ స్తాపన చేసి సరస్వతి అమ్మవారి ప్రతిమ / ఫోటో కానీ పెటాలి. సరస్వతి వ్రతం చేసే వాలు అ రోజు అంట అకండ దీపారాదన చేయాలి. అంటే మరునాటి ఉదయం పూజ ఆయె వరకు దీపం కొండెక్క కూడదు.

శ్రీ సూక్తం తో , సరస్వతి సూక్తం తోనూ అబిషేకం చేయాలి సరస్వతి విగ్రహం లేకపోతె కలశం మీద పువ్వులతో నీరు చలుతూ కూడా అబిషేకం చేయవచ్చు. సరస్వతి ఆశ్తోత్రం , సహస్రనామాలు చదువుకోవాలి. వ్రతం కద చదువుకోవాలి. పాయసం నివేదన్ చేయాలి. ఒక సుమంగాలికి సువాసన పూజ చేయాలి. బాల పూజ చేసి బట్టలు పెట్టి భోజనం పెట్టాలి. సరస్వతి మంత్రోపదేశం ఉంటె జపం చేసుకోవచ్చు. 

కధ 
ఒక రాజు ఉండేవాడు. నియమ నిష్టలతో ఉండేవాడు , సత్య పాలన చేసేవాడు. కానీ ఎంత వారికి అయిన సరే "నల రామ యుదిష్టరః " అని కాలం కలిసి రానప్పుడు కష్టాలు వస్తాయి. గ్రహచారం బాలేనప్పుడు సేత్రు రాజులు ఓడించారు. అయన తో పాటు తన బార్య కూడా అడవికి వెళ్ళిపోయారు. ఒక ముని దగ్గరకి వచ్చారు , మాకు పుత్రా సంతానం లేదు , రాజ్యం పోయింది ఏమి చేయాలి అని అడిగారు. అప్పుడు ముని సరస్వతి మంత్రోపదేశం చేసి ఆశ్రయం ఇచాడు. మూల నక్షత్రం రోజున సరస్వతి పూజ చేసి జపం మొదలు పెట్టారు. వెంటనే బార్య గర్బవతి అయి కొడుకు పుట్టాడు. 5 సంవత్సరాలు వచ్చే సరికి సర్వ శాస్త్రాల ప్రవీన్యుదు అయాడు. తరువాత తను యుదానికి వెళ్లి తన రాజ్యం తను తీసుకునాడు. 

విద్య ని అర్దించే వాలు సర్వ జనులూ సరస్వతి ని పూజ చేయాలి. అయితే సరస్వతి అనుగ్రహం కావాలి అనుకునే వారు సాంతం గ ఉండడం, సత్వ గుణం తో ఉండడం , శాంత చిన్తులయి ఉండాలి. కొపమ్ , ద్వేషం , క్రోదం లేకుండా ఉండడం అవసరం. 

" ఐం " సరస్వతి బీజం. సరస్వతి కటాక్షం కావాలి అనుకునే వారు కింద మంత్రం జపం చేయటం వలన సరస్వతి కటాక్షం పొందవచ్చు.