విజయ దశమి నిర్ణయం ఎలా చేయాలి?

విజయదసమి దశమి కలిసి ఉన్నపుడు చేయల? లేక శ్రవణ నక్షత్రం రోజున చేయల?
ధర్మ సిందు ప్రకారం విజయదసమి మధ్యానం చేయాలి అంటే అపరాననికి దశమి తిధి ఉండాలి. 
ఒకో సారి మద్యానం దాటినా తరువాత తిధి వచ్చి మరునాడు మద్యననికి తిధి ఉండదు అప్పుడు ఎలా చేయాలి ?
అలంటి అప్పుడు ఏ రోజు మధ్యానానికి దశమి తిధి ఉంటుందో ఆ రోజు విజయదసమి చేయాలి అని అంటారు. శ్రవణ నక్షత్రం కూడా ఉంటె విశేషం. 

ఈ రోజు అపరాజిత దేవి పూజ కుడచేయాలి. ఎందుకు అంటే అ + పరాజిత = ఎవరికీ ఓటమి లేకుండా ఉండాలి అని అపరాజిత పూజ చేయాలి . 

ఇంకోటి సిమూలోఘనం అంటారు అంటే ఈ రోజు ఊరు దాటి వెళ్ళాలి. ఈ రోజు పూజ అంతా అయిన తరువాత ఊరికి ఈసన్యమ్ వైపు వెల్లి అక్కడ పరిశుద్ధ మయిన అష్టదల పద్మం వేసి అక్కడ పీటం పెట్టి అమ్మవార్ని పెట్టి అపరాజిత గా పూజ చేయాలి. అక్కడ కుడివైపు ఎడమ వైపు విజయ దేవి , జయ దేవి నాయి పెట్టి పూజ చేయాలి, సెమి వృక్షాని కూడా పూజ చేయాలి. ఈ రోజు ప్రయాణం మంచిది. 1. నక్షత్రం వచ్చిన తరువాత ప్రయాణం చేస్తే విజయం వస్తుంది. 
2. దశమి ప్రారంబం అయిన తరువాత 8 గంటల తరువాత మొదలయిన 48 నిముషాలు మంచిది అంటారు. 
అష్టమాన కుజుడు ఉంటె మాత్రం అ ప్రయాణం మానుకోవాలి ఎందుకంటే ప్రమాదాలు అవి జరిగే అవకాసం ఉంటుంది. 

ఈ రోజు కలసానికి కానీ పసుపు గౌరికి కూడా ఉద్వాసన చేయాలి. సెమి వృక్షం దర్శనం చేసుకోవాలి , ఈ రోజు గుడిలో కానీ పెద్దలకి కానీ జమ్మి పత్రీ ఇచ్చి అసిర్వచనం తీసుకోవాలి.

కొంతమందికి బొమ్మల కొలువు పెడతారు . ఈ 9 రోజులు చుట్టుపక్కల వర్ని పిలిచి, బదువుల్ని పిలిచి పండు తాంబూలం ఇవ్వటం, దీని ప్రయోజనం ఏమిటి అంటే పిల్లలకి మన సంప్రదాయాల్ని , పురాణాలని , ధార్మిక నియమాల్ని చెపే లాగ ఇక్కడ బొమ్మల్ని ఏర్పాటు చేయటం మనకి కనిపిస్తుంది.