మహర్నవమి విశేషం ఏమిటి ?

ఈ రోజు చండి హోమము చేయాలి , ఉపాసన పరులు , నవరాత్రి దీక్ష చేసే వాలు , చండి పారాయణ చేసే వారు , గుడిలో ఉత్సవాలు చేసే వారు అందరు తప్పనిసరిగా ఈ చండి హోమమ చేస్తారు. 9, 5, లేదా 3 రోజులు చేసిన ఈ రోజు హోమం చేయాలి అంటారు. ఈ 9 రోజులు నావర్ణ మంత్రాని ఎవరు ఎంత మంత్రం జపం చేస్తారో అందులో 10 వ వంతు చండి హోమం చేయాలి అనేవారు. 

మహర్నవమి ఎలా నిర్ణయం చేస్తారు , కొంటమి అష్టమి రోజు మరి కొంత మంది నవమి రోజు చేస్తారు. అష్టమి తో కలిసిన నవమి ని మహర్నవమి గ నిర్ణయించుకుంటారు. 

చండి హోమం లో ఎలాంటి సమిధలు వాడాలి? 
అమ్మవారికి ముక్యం గా మోదుగ చెక్క , ఇప్ప పువ్వులు, తెల్లని నువ్వులు కలిపిన పాయసం , లేదా తెల్ల నువ్వులు , ఆవు నేయి , తెల్ల అవ్వలు , రక్త చందనం కూడా కచితంగా హోమం లో వేయాలి అని అంటారు . 

హోమం చేయలేనివారు, దీక్షపరులు లేదా దీక్షగా చేయాలి అనుకునే వారు అకండం దీపం పెడతారు. శుక్ల పాడ్యమి రోజె ఆవు నేయి తో అఖండ దీపం పెడతారు . ఈ అఖండ దీపం ఎప్పుడు ఏ క్షణం కూడా రాత్రి కానీ పగలు కానీ కొండెక్క కూడదు. ఈ అఖండ దీపం రూపం లో అమ్మవార్ని పూజించడం. ఈ అఖండ దీపమ్ పెట్టినప్పుడు కొన్ని మంత్రాల తో దీప ప్రతిష్టాపన చేసిన తరువాత ఏ ఏ మంత్రాలూ , పారాయనాలు చేస్తామో అవి అనీ కూడా హోమం చేసిన ఫలితాలనే ఇస్తాయి. దీక్షలొ ఉన్న వాలు లేదా దీక్షగా ఈ 9 రోజులు పూజలు చేసిన వాలు హోమం చేయలేనప్పుడు ఏ ఏ మంత్రాలూ , పారాయనాలు చేస్తామో అవి అనీ కూడా హోమం చేసిన ఫలితాలనే ఇస్తాయి. 

కొంతమంది కి కలశ స్తాపన ఉండదు , ఉపాసన ఉండదు , దీక్ష ఉండదు , కాలి ఉండదు కానీ అమ్మవార్ని భక్తీ తో కొలవాలి అని అనుకుంటారు , అమ్మవారి పటానికి తోచిన పళ్ళు నైవేద్యం కింద పెట్టడం వలన కూడా అమ్మవారి క్రుపకి పత్రులు కావచ్చు. 

మహర్నవమి రోజున ఆయుధ పూజ ఎందుకు చేస్తారు?
పూర్వ కాలంలో మహర్నవమి రోజున చత్ర చామరాలకి , వాద్యలకి , గాజాస్వలకి  కి కూడా పూజ చేయాలి అని చెప్తారు , దీనికి ప్రత్యేకమయిన మంత్రాలూ పూజలు కూడా ఉన్నాయి. పాడ్యమి మొదలు నవమి వరకు గజాలకి , అస్వలకి రోజు పూజ చేయాలి, ఇంద్రుడు దగ్గర ఉన్న అస్వనికి కూడా పూజ చేయాలి (అక్కడకి వెళ్లి పూజ చేయలేము కబ్బతి పటానికి పూజ చేయాలి ). గజాలు , అశ్వాలు యుధం లో వాడే వారు కనుక వాటికి కూడా వంస వ్రుస్షి కలగాలి అని పూజ చేసే వారు. 

అమ్మవారికి ఈ నవరాత్రిలో  మినపప్పు తో చేసిన అల్లం వేసిన గారెలు నైవేద్యం పెట్టాలి . ఉపాసన దీక్ష ఉన్నవారు కచ్చితం గ పెట్టాలి. అల్లం జీర్న శక్తి ని పెంచుతుంది. దీని తేనే తో తినాలి 

అన్నం కంటే పిండి కి 8 రెట్లు ఎక్కువ బల్లం 
పిండి కంటే పాలు 8 రెట్లు ఎక్కువ బల్లం
పాల కంటే నెయ్యి 8 రెట్లు ఎక్కువ బల్లం
నెయ్యి కంటే మాంసం 8 రెట్లు ఎక్కువ బల్లం
మాంసం కంటే మినపప్పు 8 రెట్లు ఎక్కువ బల్లం