కుమారీపూజ
శరన్నవరాత్రి తొమ్మిదిరోజులు కూడా కుమారీపూజ, సువాసినీ పూజ చేస్తారు.
దీనినే బాలా పూజ అని కూడా అంటారు. కుమారి అని అంటేనే కన్య అనే అర్థంలో మనం వాడుతూ ఉంటాం. సందేహం
లేదు కానీ మరొక అర్థమున్నది. “కుత్సితాన్ మారయతీతి కుమారీ”
అని – కుత్సితులని
నశింపజేయునది. కుత్సితులు అంటే లోకకంటకులైన అసురులు. వారిని సంహరించే శక్తి కనుక
కుమారీ, కౌమారీ ఇది ఒక అర్థం.
అదేవిధంగా మన హృదయంలో పుట్టే కుత్సితమైన అసుర బుద్ధులు మన ప్రగతికి అవరోధాలు.
వాటిని తొలగించేది కుమారీ. శ్రీవిద్యా సంప్రదాయంలో బాలాత్రిపురసుందరీ అని ఒక ఆరాధన
కనపడుతున్నది. కానీ కుమారీపూజ అన్నది ఏ సంప్రదాయంలోనైనా ఉన్నది. ఈ కుమారీ పూజని
శ్రీవిద్యా సంప్రదాయంలో బాల అంటారు.
ఈ నడిమి వయస్సులో
ఉన్నవారిని ఈ తొమ్మిదిరోజులు కూడా అమ్మవారి స్వరూపంగా ఆరాధన చేయాలి. దీనిని
ప్రత్యక్ష పూజ అంటారు. అయితే ఈ బాలాపూజ విధానంలో ఒక్కొక్కరోజు ఒక్కొక్క పేరు
శాస్త్రం చెప్తున్నది. ఇందులో రెండు సంవత్సరాల బాలికను కుమారీ అనే పేరుతో
పూజించాలి. అంటే పాదాలకి పసుపు రాసి పారని పెట్టి, కొత్త బట్టలు పెట్టి, తలలో పువ్వులు , అక్షింతలు పెట్టి పసుపు కుంకుమ తో పాదాలకి అర్చన చేయాలి.