శరదృతువులో వచ్చే నవరాత్రులు - శరన్నవరాత్రులు
దేవీ నవరాత్రులు సంవత్సరంలో రెండు సార్లు జరుగుతాయి కానీ శరదృతువులో వచ్చే నవరాత్రులు శ్రేష్టమైనవి
ఎందుకంటే...
దేవతలకు ఒక రోజు = మానవులకు
ఒక సంవత్సరం. ఒక సంవత్సరం లో దేవతలకు
ఉత్తరాయణం పగలు అయితే దక్షిణాయణం రాత్రి అవుతుంది. మనకు రోజు లో ప్రతి మూడు
గంటలకు ఒక ఝాముగా పరిగణిస్తాం ఇందులో వేకువ ఝాము అత్యంత విశిష్టమయినది అందుకే ఆ
కాలాన్ని బ్రహ్మ ముహూర్తం అంటాము.
ఈ బ్రహ్మ ముహూర్తంలో తలపెట్టిన పనులేవైనా
దిగ్విజయంగా పూర్తి అవుతాయి. అలాగే మన ఒక సంవత్సరకాలం
దేవతలకు ఒక రోజు అనుకున్నాం కదా ..శరదృతువు దేవతలకు వేకువఝాములాంటిది. రోజులో
వేకువ ఝాము ఎంత శ్రేష్టమో సంవత్సరంలో ఈ శరదృతువు అంత శ్రేష్టం. శరదృతువులో వచ్చే
ఈ పండుగ మరియు ఈ దసరా నవరాత్రులలో అమ్మవారిని సేవించడం అత్యుత్తమం. శరదృతువులో వస్తుంది
కాబట్టి ‘శరన్నవరాత్రులు’ అంటారు. ఈ ఋతువులో వర్షాకాలం ముగిసి చలికాలం మొదలవుతుంది. ఈ
సమయంలో వాతావరణంలో కలిగే మార్పులు అనేక రోగాలకు కారణమవుతాయి. అందుకే ఈ అశ్వయుజ
శుద్ధ పాడ్యమినుండి నవమి వరకు శక్తి ఆరాధన పేరుతో ప్రజలంతా శుచిగా, శుభ్రంగా ఉండి ఎలాంటి రోగాల దరిజేరవన్నది ఈ నవరాత్రి వేడుకల
వెనుక ఉన్న చరిత్ర. మార్కండేయ మహర్షి అమ్మవారిని ఎలా ఆరాధించాలి అని అడగడంతో
బ్రహ్మ ఇలా వివరించాడట.
ప్రధమంశైలపుత్రిణి, ద్వితీయం బ్రహ్మచారిణి
తృతీయం చంద్రఘంటేతి,
కూష్మాంతేతి చతుర్ధామ్||
పంచమం స్కంధమాతేతి షష్ఠమం
కాత్యాయనీ తిచ
సప్తమం కాళరాత్రంచ, మహాగౌరేతి చాష్టమం
నవమం సిద్ధితి ప్రోక్త,
నవదుర్గ ప్రకీర్తిత||
ఆ జగన్మాతను వేర్వేరు
ప్రదేశాలలో వేర్వేరు విధాలుగా అలంకరించుకోవడం మనందరకు విదితమే. అందుకే శ్రీశైలంలో
అమ్మవారి అలంకరణలు క్రింది విధంగా ఉంటాయి.
1 శైలపుత్రి
2 బ్రహ్మచారిణి
3 చంద్రఘంట
4 కూష్మాండ
5 స్కందమాత
6 కాత్యాయని
7 కాళరాత్రి
8 మహాగౌరి
9 సిద్ధిధాత్రి
నవరాత్రులలో ఆటంకాలు ఎదురయినప్పుడు ఏం చేయాలి?
కొంతమందికి ఆడవాలకి నెలసరి వలన , బాలింత , అనారోగ్య కారనం వలన కొన్ని ఆటంకాలు. ఇంకా కొన్ని జాత సౌచం( పిల్లలు పుట్టినప్పుడు పురుడు వస్తుంది కదా దానిని జాత సౌచం అంటారు ) , ఒక వేల జాత సౌచం కలస స్తాపన కంటే ముందు వచ్చి 3,4 రోజుల తరువాత ఆగిపోతే బ్రాహ్మణుడ్ని పిలిచి కలస స్తాపన చేయవచ్చు. సౌచం పోయిన తరువాత ఇంటి ని సుద్ధి చేసి తలస్నానం చేసి దీక్ష ప్రారంబించవచ్చు. మృత సౌచం వచ్చినప్పుడు అంటే వారి తల్లి తండ్రులే కర్మ కాండ చేసినట్టు అయితే ఒక సంవత్సర కాలం ఆ ఇంట్లో దీక్షలు చేయకూడదు. ఇంట్లో కాకుండా వంశీకులు కానీ , ఇంటి పేరు కల వారు కానీ పోయినప్పుడు ఒక 10 రోజులు మృత సౌచం అని పడుతూ వుంటారు. ఒక వేల ఈ 10 రోజులు ఉంది అనుకోండి , వారి ఇంటి పేరు వారే అయితే ఒక బ్రాహ్మణుడి చేత ప్రారంబించవచ్చు లేదు ఈ వ్రాతనికంటే ముందే వచ్చే మద్యలో అయిపోతుంది లేదా మద్యలో వచ్చి చివరిలో అయిపోతుంది అన్నపుడు వంసికులు అయీ లేదా ఇంటి పేరు గల వారు అయి వారి ఇంట్లో కానప్పుడు (పోకుండా ఉంటె ) ఈ వ్రత దీక్షలు నేరవేర్చవచ్చు. ఎప్పుడు అయితే ఈ సౌచం అయిపోతుందో అప్పుడు సుద్ది చేసుకుని తలస్నానం చేసి ఈ పూజ చేసుకోవచ్చు అని ధార్మిక శాస్త్రాలు చెపుతునాయి.
విజయదసిమి రోజు పూజ ప్రారంబించి అ తరువాత ముగింపు కూడా చేసుకుని పారణ చేసి బ్రహ్మనుకి ఎదావిదిగా దానాలు , ధర్మాలు చేయవచు.