భాగవతం రచించిన సంవత్సరం స్పష్టంగా తెలుసుకున్న మన భారతీయ జ్యోతిష్య పండితులు

భాగవతపురాణం, దీనినే భాగవతం అంటాము. ఇందులో శ్రీమహావిష్ణువుకు సంబంధించిన ఎన్నో భక్తితో కూడిన ఆధ్యాత్మిక కథలు ఇవి ప్రధానంగా శ్రీ కృష్ణుడికి(3200 BCE )సంబంధించినవి.

భాగవతం 1840 లో ఒకసారి తిరిగి 1857 లో ఒకసారి అనగా రెండుసార్లు యూరోపియన్ భాషల(ఫ్రెంచ్) లోకి అనువదించబడిన ఏకైక పురాణం. వారు దీనిని రచించినది వేదవ్యాసుడు అని పూర్తి గౌరవం వేదవ్యాసునికే ఇవ్వటం గమనార్హం. ఈ భాగవతాన్ని రచించేటపుడు సూర్యుడు మేషసంక్రాంతిలో ఉన్నాడట, అంటే ఆ రోజు రాత్రి పగళ్ళు ఘడియ విఘడియలతో సహా సమానంగా ఉంటాయి. ఆ సమయంలో సూర్యుడికి భూమికి మధ్య ఉన్న కోణం కూడా స్పష్టంగా నమోదుచేయబడింది. ఆ కాలంలో ఈ కోణం 30 డిగ్రీలుగా ఉందట. ఈ కోణంలో ఒక్కడిగ్రీ మార్పు రావడానికి పట్టే కాలం 72 సంవత్సరాలు. ప్రస్తుతం ఈ కోణం 336 డిగ్రీలు అంటే అప్పటికి ఇప్పటికి తేడా 54 డిగ్రీలు = 3888 సంవత్సరాలు.


భాగవతపురాణమును రచించి ప్రస్తుతం 3888 సంవత్సరాలయిందని తెలుసుకోవచ్చు. మన క్యాలండర్ ప్రకారం ఈ పురాణం 1800 BCE లో రచించారని తెలుస్తోంది. మన పురాణాలలో ఇంతటి ఖచ్చితత్వం ఉంది కానీ దానిని తెలుసుకొనటమే మన ధర్మం.