నవరాత్రి లో పంచమి రోజు పూజ ఎలా చేయాలి?



నవరత్రిలో 9 రోజులు కలశ పూజ చేస్తారు, ఒక వేల ఏ కారణం చేతనయిన చేయలేనివారు, ఈ పంచమి రోజు / లలిత పంచమి రోజు కలశం నిలబెట్టుకోవచ్చు.

ఉపాంగా లలితా పూజ చేయాలి , పంచమి రోజున. శ్రీవిద్య ఉపాసన ఉన్నవాలు జపం ఎక్కువగా చేసుకుంటే విశేషం, బీజక్షరలతో లలిత సహస్రనామాలతో శ్రిచాక్రచన చేయటం విశేష ఫలితానిస్తుంది.

9 రోజులు చండి పారాయణం చేస్తారు, ఒక వేల చేయలేనివారు పంచమి మొదలుకొని ఈ 5 రోజులు చండి పారాయనం చేయవచ్చు. లలిత సహస్రనామాలు బీజక్షరాల తో పూజ చేయాలి అంటే కనీసం బాల / పంచదసి / చండి / షోడశి అయిన ఉపదేశం ఉండాలి. అప్పుడు మాత్రమే బీజక్షరలతో (నమః)పూజ చేయాలి , లేకుంటే స్తోత్రం లాగా చదువుకోవాలి. అమ్మవారి మంత్రోపదేశం ఉన్నవారు తాంబూలం వేసుకుని అప్పుడు అమ్మవారికి పూజ చేయాలి అని శాస్త్రం చెపుతుంది. అంటే అమ్మవారి మంత్రాలూ మన నోటి నుంచి వచ్చే దుర్వాసన తో కాకుండా సుగంధ బరితం గ ఉండాలి , తాంబూలం వసుకుని తరువాత బయట ఉసెసి ఆ సుగంధ పరిమలాలతో అమ్మవారిని పూజ చేయాలి.

అన్నం + పెసరపప్పు + నెయ్యి / వెన్న + బెల్లం తో కూడా అమంవారికి అభిషేకం చేయవచ్చు. ఇది చేయటానికి తెలిసినవారిని వివరం అడిగి / దగ్గర ఉండగా నేర్చుకుని చేయాలి.

శ్రీచక్రం ఉన్న వాలు కుంకుమ / పువ్వులు / తులసి / బిల్వ / సెమి పత్రీ తో అర్చన చేయవచు . మల్లె / కలువలు / జాజి పత్రీ / మరువం / అగస్త్య పువ్వులు (అవిశి పూలతో అర్చన చేస్తే విశేషం) . వీలు అయినది వండి నివేదన చేయాలి.


అందరు కలశ పూజ చేయలేరు / ఉపాసన లేని వారు / చండి పారాయణం చేయలేని వారు, రోజు దీపారాధన చేయాలి. అందంగా అలకరించుకోవాలి(తలస్నానం చేసి , కుంకుమ పెట్టుకుని , కాలకి పసుపు రాసుకుని , ఆవు నేటి తో / నువ్వుల నూనె తో దీపం పెట్టాలి, ఇంటి ముగ్గు పెట్టుకోవాలి. ఒక పెద్ద ముతయిదువుకి తాంబూలం ఇవ్వండి. లలితా సహస్రనామం చేయాలి, యంత్రం ఉంటె యంత్రం మీద లేదా పసుపు గౌరి పెట్టుకుని అయిన కుంకుమ పూజ చేసుకోవచ్చు. ఏ మంత్రం రాకపోయినా లలితా అష్టోతరం , లక్ష్మి అష్టోత్రం అయిన చదువుకుంటే పూజ చేయాలి. భక్తీ తో చేయటం వలన ఎంత చిన్న గ చేసిన అమ్మవారు మన మీద కరుణిస్తుంది.