శైవము

శైవం ప్రకారం సమస్త లోకానికి అధిపతి సదాశివుడు. శివుడే సృష్టి స్థితి లయ కారుడు. శైవం యొక్క చరిత్ర అతి పురాతనం . శ్వేతాశ్వతర ఉపనిషద్ (bc 400-200 కంటే ముందు) లో ఆనాటి శైవ సంప్రదాయాలను వివరించటం జరిగింది. 
గుప్తులకాలం(ce.300 to 500 అని అంటున్నారు)లో శైవం భాగా అభివృద్ధి . శైవం గొప్ప అక్షరాస్యతను కలిగి అనేక సిద్దాంతాలను కలిగి ఉండేది. అందులో భాగంగా మూడు సిద్దాంతాలు ఉండేవి. 
1. అభేద సిద్దాంతం. 2. భేద సిద్దాంతం. 3. భేదాభేద సిద్దాంతం. 

రుద్రుడిని లేక శివుడిని పూజించే దిశగా ఏర్పడిన విధానాలు రెండు శాఖలుగా విభజన చెందాయి. అందులో ఒకటి 

1." పురాణాల ఆధారంగా శివుడిపైన భక్తిని ఏర్పరచుకుని ఆయనలో ఐక్యం చెందటానికి తపో మార్గాన్ని ఎంచుకున్న వారిది"
2.రెండవది, "ఆనాటి వైష్ణవ సంప్రదాయం నుంచి శివుని ఉనికిని రక్షించటానికి ఏర్పడిన శాఖ".ఈ రెండు శాఖలలో మొదటి శాఖ శివుడి దగ్గరకు పోయే మార్గం కాబట్టి మొదటి శాఖవారు ఎల్లప్పుడు ఆది గురువైన సదాశివుని ధ్యానంలోనే ఉండేవారు.

రెండవశాఖ మాత్రం శాఖోపశాఖలుగా విభజన చెంది శైవాన్ని ప్రదేశానికి అనుగుణంగా మార్చి సుస్థిరపరచాయి. రెండవ శాఖ రెండు ఉప శాఖలుగా విభజన చెందింది. 
1. అతి మార్గం. 2. మంత్ర మార్గం. 

1. అతిమార్గంలో కొన్ని శాఖలు ఉద్భవించాయి. 
 a. పాశుపత శైవం. b. లాకుల శైవం. c. లింగాయత శైవం. 

2. మంత్ర మార్గంలో తిరిగి రెండు శాఖలు ఏర్పడి అవి రెండు తిరిగి ఉప శాఖలుగా విభజన చెందాయి. 
మంత్ర మార్గం లోని శాఖలు : a. కాపాలిక శైవం. b. సిద్దాంత శైవం. 

a. కాపాలిక శైవంలో 
కౌల శైవము, త్రిక శైవము ఒక వైపు ఏర్పడితే "అఘోరీ" శైవం విడిగా ఏర్పడింది. 

b. సిద్దాంత శైవం తమిళనాడు లో అభివృద్ధి చెందినది. 
శైవ సంప్రదాయం ఏయే ప్రదేశాలలో ఎలా పిలువబడేదో తెలుసుకుందాం . 

1. ఆ.ప్ర లోను, తమిళనాడులోను మరియు శ్రీలంకలోను గల శైవాన్ని "సిద్దాంత శైవం" అంటారు. 
2. నేపాల్, కాశ్మీర్, గుజరాత్ రాష్ట్రాలలో గల శైవాన్ని "పాశుపత శైవం" అంటారు. 
3. ఒక్క కాశ్మీర్ లో గల ప్రత్యకమైన శైవాన్ని "కాష్మీర శైవం" అంటారు. 
4. నేపాల్, ఉత్తర ప్రదేశ్, భీహర్ మరియు పశ్చిమ భెంగాల్ రాష్ట్రాలలో "భేదాభేద శైవం" ఉండేది. 
5. కర్నాటక లో "లింగాయత్ శైవం" మరియు "అద్వైత శైవం"