భాగవతం వ్రతాలూ యజ్ఞ్యాలూ

ఇంటి పనులలో ఆసక్తురాలవై ఉండగా ఎవరైన అథితులు వచ్చి గౌరవించబడకుండా వెళ్ళారా. ఇంటికొచ్చిన అథితులకు జలం ఐనా ఇవ్వకుండా ఉండి, వారు వెళ్ళిపోతే అది ఇల్లు కాదు, నక్కల ఇల్లు (శ్మశానాలు).

మీరు ప్రజాపతులు.ఇంతటి చక్కని ధర్మాన్ని బోధిస్తూ ఉండగా ఇంక మాకు లోటేమిటి ఉంటుంది. లోకమంతా మీ పిల్లలే

సాత్విక తామస సంతానం అందరూ నీ పిల్లలే. సంకల్పముతో కొందరూ శరీరముతో కొందరూ పుట్టారు. నీకు వారూ వీరూ అందరూ సమానమే. అందరియందూ సమానముగా ఉన్నా, భగవంతుడూ, మీవంటి పెద్దలూ కాస్త సేవించినవారి మీద ఎక్కువ ప్రీతి కలిగి ఉంటారు

నిన్ను సేవిస్తున్న నాకు శ్రేయస్సు కలిగేలా చూడండి. శత్రువుల చేత సంపదా అధికారం రెండూ కోల్పోయిన నాపిల్లలను దయతో చూడు. శత్రువులచేత వెళ్ళగొట్టబడిన నా పిల్లలలను చూసిబాధపడుతున్నాను. వారికి నిలువ నీడ కూడా లేదు. సంపదా శాస్కత్వం స్థానం కీర్తినీ నాలిగింటినీ శత్రువులు అపహరించారు. ఆనాలుగూ నా పిల్లలకు కలిగేలా చూసి మాకు కళ్యాణాన్ని కలిగించడి

ఇలా అడిగితే ఆశ్చర్యముతో నవ్వి ఇలా అన్నాడు. శ్రీమన్నారాయణుని మాయాబలం చాలాగొప్పది ప్రపంచమంతా స్నేహముతో బంధించబడినది

ఆత్మకానిది పంచభూతములతో చేయబడిన శరీరమెక్కడా, ప్రకృతికన్నా పరమైన ఆత్మ ఎక్కడ. ఎవరికి ఎవరు భర్తా, ఎవరికి ఎవరు పుత్రులు ఇవన్నీ మోహముతో అనుకుంటున్నాము

నీవన్నదానికి నేనేమీ చేయలేను పరమాత్మను సేవించండి ఆయన సకల ప్రాణుల హృదయములో ఉండే అంతర్యామి

జగత్గురువు ఐన స్వామిని ఉపాసించు దీనులను దయచూచే పరమాత్మ నీవు కోరేకోరికలను జరిపిస్తాడు. పరమాత్మయందు భక్తి ఎప్పుడూ సఫలమే అవుతుంది అని నా అభిప్రాయం

నేను ఏ విధానముతో సత్యసంకల్పుడైన పరమాత్మను ఆరాధించాలి ఉపాసించాలి?

పరమాత్మ దగ్గరకు తొందరగా చేరేచే మార్గాన్నీ, సంతోషించే మార్గాన్నీ నాకు ఉపదేశించండి

ఒక సారి నేను ఇదే ప్రశ్నను తాతగారైన బ్రహ్మగారిని అడిగాను (బ్రహ్మ - మరీచి - కశ్యపుడు). ఫాల్గుణ శుద్ధ పాడ్యమి నుండీ ద్వాదశి దాకా ఈ వ్రతాన్ని ఉత్తమ భక్తి కలవారై ఆరాధించాలి

ఫాల్గుణ శుద్ధ పాడ్యమి నాడు వ్రతం చేయాలంటే అంతకు ముందే సన్నధం చేసుకోవాలి. చంద్రరేఖ కొంచెం కనపడే అమావాస్య సినీవాలి. లేకపోతే దాన్ని కుహూ అంటారు. చతుర్దశీ శేషముతో అమావాస్య వస్తే చంద్రుడు కనపడతాడు (సినీవాలి అంటే పార్వతీ (దుర్గ) లక్ష్మీ. సకల ప్రపంచాన్ని సృష్టించి రక్షించే పరమాత్మని సంతోషింపచేసేది అని కూడా అర్థం. ఇది విశేషార్థం.మాఘబహుళ అమావాస్య చంద్రునితో కలిసే వస్తుంది. అలాగే ఆశ్వయుజ మాసములో వస్తుంది.వైశాఖ కార్తీకములో కూడా అపుడపుడు వస్తుంది) నదీ తీరములో అడవిపంది చేత పెకిలించబడిన మట్టి దొరికితే అది పూసుకుని, ఈ మంత్రాన్ని ఉచ్చరించాలి

దేవీ నీవు రసాతలం నుండి ప్రజలకు ఒక స్థానము కోరిన ఆదివరాహముతోటి
ఉద్దరించబడ్డావు.నా పాపాన్ని నీవు నశింపచేయి

తమ తమ నియమాలన్నీ ఆచరించి శ్రీమన్నారాయణనున్ని ఆరాధించాలి అర్చా స్తండిలం సూర్యుని యందూ అగ్ని యందూ జలం యందూ గురువు యందూ ఆరాధించి అందరిలో అంతర్యామిగా ఉన్న వాసుదేవుడినీ సాక్షినీ నమస్కరించాలి

ఇతనే అవ్యక్తం సూక్షం ప్రకృతి ప్రధానం 24 గుణాలూ సృష్టించిన వాడు.గుణాలను లెక్కపెట్టడానికీ ఉనికికీ నీవే కారణం

నీవే త్రయీ విద్య నాలుగు కొమ్ములున్న వృషభం.శబ్దం నాలుగు రకాలు.పరా పశ్యంతి మధ్యమా వైఖరీ ఈ నాలుగూ నాలుగు శ్రంగాలు. భూత భవిష్యత్ వర్తమానాలు మూడు పాదాలు. రెండు తలలు.నిత్యానిత్యములు.ఏడు హస్తములు ఏడు విభక్తులు.మూడు చోట్ల బంధించబడి. మన నొటినుంచి శబ్దం ఈ తీరుగా వస్తుంది.ఆత్మ బుద్ధితో కలిసి మనసుకు చెబుతుంది "ఇలా మాట్లాడు" అని.ఈ మనసు జఠరాగనిని కొడుతుంది. అందుకే జఠరాగ్ని బాగా ఉంటేనే మాట్లాడగలం.అది వాయువును పైకి ఎగదోస్తుంది. అప్పుడు తల అడ్డువస్తుంది.దాని చేత కొట్టబడి మధ్యనుంచి వాక్కు రూపములో బయటకు వస్తుంది. మూడు చోట్ల బంధించబడింది, వక్షస్థలం కంఠం శిరస్సు. పరమాత్మ కూడా త్రిధాబద్ధః. ప్రకృతీ పురుషుడూ పరమాత్మ. జగత్తులో సత్వ రజస్తమో గుణాలుగా. స్వామి వేద స్వరూపుడు.

నీవు మంగళ కరుడివి.దుష్టులకు రుద్రుడివి.జ్ఞ్యాన క్రియా ఇచ్చా శక్తులు ధరించేవాడివి.అన్ని విద్యలకూ పతివి. అటువంటి నీకు నమస్కారం.నీవే హిరణ్యగర్భుడవు.సర్వ జగత్తుకూప్రాణం. యోగానికీ ఐశ్వర్యానికీ కారణం. జగత్తుకి సాక్షి నారాయణ ఋషికీ నర ఋషికీ హరికి నమస్కారం

అమ్మవారిని భార్యగా పొంది మరకత మణి ఉన్న పీతాంభరధారికి నమస్కారం. నీవు వరేణ్యుడవు (శ్రేష్టుడవు), వరాలిచ్చేవారిలో శ్రేష్టుడవు. అందరికీ వరాలించ్హేవాడవు. శ్రేయస్సుకోసం నీ పాదాలను సేవిస్తారు. దేవతలూ అమ్మవారూ నీ పాదపద్మాలనే అనుసరించి ఉన్నారు. తుమ్మెదలు పూలను కోరినట్లుగా అందరూ నిన్ను కోరుతారు, ఆరాధిస్తారు

షోడశ ఉపచార పూజను ఈ మంత్రాలతో చేయాలి.ఎనిమిది శ్లోకాలూ కలిపి. దీనితో షోడశోపచారాలను చేయాలి. అర్ఘ్యం పాద్యం ఆచమనీయం స్నానం ధూపం దీపం వస్త్రం ఇలా... ఆవాహనతో మొదలుపెట్టాలి. అర్ఘ్యమూ పాద్యము మొదలైనవాటితో శ్రద్ధగా చేయాలి. గంధమాల్యాదులతో అర్చన చేసి పాలతో స్వామికి అభిషేకం చేయాలి. వస్త్రం ఉపవీతం ఆభరణం పాద్యం ఆచమనీయాదులతో చేయాలి.వీటన్నిటినీ ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రముతో చేయాలి

అవకాశం సంపదా ఉంటే బియ్యాన్ని పాలలో ఉడికించి, లేదా బెల్లముతో ఉడికించి చేయాలి. నెయ్యి బెల్లం కూడా వేయాలి.మూల మంత్రముతో చేయాలి.ఆరగింపుచేసిన దాన్ని ఉపవాసం ఉంటే భక్తులకివ్వాలి, లేకుంటే పెద్దల అనుమతితో తానే తినాలి. ఇలా ఆరగింపుచేసి తాంబూలం ఇచ్చి ద్వాదశాక్షర మంత్రాన్ని 108 సార్లుజపించాలి. రకరకాల స్తోత్రాలతో స్వామిని సేవించి ప్రదక్షిణం చేసి దండ ప్రణాం చేసి, ఆయన నిర్మాల్యాన్ని శిరస్సుయందు పెట్టుకుని స్వామికి ఉద్వాసన చేయలి.

ఇద్దరికంటే తక్కువకాకుండా బ్రాహ్మణులను పాయసముతో భోజనం పెట్టి, వారు తిన్నాక ఆ శేషాన్ని తాను లేదా తనవారితో తినాలి.

ఆ రాత్రి బ్రహ్మచర్యముతో ఉండాలి స్నానం చేసి పవిత్రుడై యధోక్తవిధితో స్వామిని రోజూ వ్రతం పూర్తయ్యే వరకూ పాలతో అభిషేకించాలి. శక్తి ఉంటే ఈ పన్నెండు రోజులూ పాలు మాత్రమే భుజించాలి, లేదా పాలతో చేసినవే భుజించాలి.

మొదటి రోజు రాగానే హోమం చేసి బ్రాహ్మణులను అర్చించి పన్నెండు రోజులు చేయాలి. పరమాత్మ పూజా బ్రాహ్మణుల పూజా తర్పణం చేయాలి. శుద్ధ త్రయోదశి వరకూ చేయాలి. బ్రహ్మచర్యం అధోశయనం మూడు సార్లు స్నానం చేయాలి ఈ పన్నెండు రోజులు. చేడు వారితో మాట్లాడరాదు. పెద్ద భోగాలు వదిలిపెట్టాలి. ఏ ప్రాణినీ హింసించక వాసుదేవ పరాయణులై ఉండాలి

చివరి రోజు గో గవ్యముతో పంచామృతముతో స్నానం చేసి విధి బాగా తెలిసిన్ వారితో పూజ చేయించి, డబ్బు విషయములో వంచన చేయకుండా పూజ చేయించాలి

శక్తి ఉన్నవారు తక్కువా శక్తి లేని వారు ఎక్కువా చేయరాదు. పాలతో వండినీ చెరువును పరమ తేజస్వరూపమైన విష్ణువుకు నివేదించి పూజించాలి. పరమాత్మకు సంతోషము కలిగించేందుకు నేయి బాగా వేసి సుగంధ ద్రవ్యాలు వేసి పాయసం వండాలి. మనకు ఏవేవి ఆహారములో కావాలని కోరుకుంటామో అవే చేసి స్వామికి నివేదించాలి

భగవంతునికి సతోషం కలిగించే ఎక్కువ గుణాలున్న నైవేద్యాన్ని సమర్పించాలి.సమాప్తినాడు జ్ఞ్యానాంశలైన గురువుగారిని వస్త్రాభరణములతో సత్కరించి, సంతోషింపచేసి,గురువులనూ బ్రాహ్మణులనూ ఆరాధించాలి వారిని ఆరాధించుటే నిజమైన ఆరాధన.

బ్రాహ్మణోత్తములకూ గురువుకీ మంచి గుణములతో ఉన్న భోజనాన్ని భుజింపచేయాలి. శక్తి ఉంటే మిగతా బ్రాహ్మణులకు కూడా భుజింపచేసి దక్షిణలు ఇవ్వాలి

కుక్క దగ్గరనుంచీ కుక్కను తినేవాటి వరకూ అందరికీ భోజనం పెట్టి సంతోషింపచేయాలి. అదే నిజమైన ఆరాధన 

దీనులూ గుడ్డివారూ దరిద్రులూ అందరూ భోజనం చేసిన తరువాత అదే నిజమైన పరమాత్మ పూజ అని తెలుసుకుని బంధువులతో కూర్చుని తరువాత భుజించాలి.

ప్రతీరోజు ఖాళీ సమయములో నాట్యం గానం, బ్రాహ్మణుల స్వస్తి వాచకముతో పూజ చేయాలి, పరమాత్మ కథలను గానం చేయాలి నాట్యం చేయాలి . మృదంగ వాద్యాలను మోగించాలి.. 

ఉత్తమమైన భగవంతుని ఆరాధనా రూపమైన పయో వ్రతం. ఈ విషయం నాకు మా తాతగారైన బ్రహ్మగారు చెప్పారు. అది నీకు చెప్పాను. నీవు కూడా ఈ వ్రతముతో పరమాత్మను పరిశుద్ధమైన మనసుతో నిగ్రహం ఉన్న ఆత్మతో స్వామిని సేవించు. ఈ వ్రతానికి రెండు పేరులు ఉన్నాయి. సర్వ యజ్ఞ్యమూ సర్వ వ్రతమూ అని.ఇందులోనే అన్ని వ్రతాలూ యజ్ఞ్యాలూ ఉన్నాయి

ఇది సకల తపసులకూ సారమూ దానమూ పరమాత్మకు తృప్తి కలిగించేది. పరమాత్మను సంతోషింపచేసే యజ్ఞ్య దాన తపస్సులే నియమములూ యమములూ వ్రతములూ. దేన్ని ఆచరిస్తే పరమాత్మ సంతోషిస్తాడో అదే తపస్సూ దానం యజ్ఞ్యం

నీవు ఈ వ్రతాన్ని శ్రద్ధా భక్తులతో చేస్తే స్వామి సంతోషించి నీవు కోరిన వ్రతాన్ని ప్రసాదిస్తాడు. కశ్యప ప్రజాపతి ఇలా విధానాన్ని చెప్పిన తరువాత ఈ వ్రతాన్ని ఏమరపాటులేకుండా శ్రద్ధగా నిరంతరం పరమాత్మనే ధ్యానిస్తూ చేసింది.మనసుతో ఇంద్రియములనే అశ్వములను బుద్ధి అనే సారధితో నియమించింది

మనసును ఏకాగ్ర బుద్ధితో పరమాత్మ యందు ఉంచి ఈ పయో వ్రతాన్ని ఆచరించింది. భర్త చెప్పినట్లు శ్రద్ధా భక్తులతో చేయగా పరమాత్మ నాలుగు భుజాలతో ఆయుధాలతో పీతాంబరము ధరించి ఆవిర్భవించాడు.

పరమ ప్రీతితో దండ ప్రణామం చేసి పరమానందముతో పరమాత్మను స్తోత్రం చేయాలనుకున్నా ఆనందముతో గొంతు పెగలక ఉండి పోయింది.ఆ ఆనందముతో శరీరమంతా చెమట పుట్టి వణుకుపుట్టి పులకించింది

స్వామి అనుగ్రహాన్ని పొందిన అదితికి పరమాత్మ శక్తిని ఇవ్వగా, రమాపతి యజ్ఞ్యపతి జగద్పతి అయిన స్వామిని నేత్రాలతో తాగుతున్నట్లు చూస్తూ ఇలా స్తోత్రం చేసింది

యజ్ఞేశ యజ్ఞపురుషాచ్యుత తీర్థపాద
తీర్థశ్రవః శ్రవణమఙ్గలనామధేయ
ఆపన్నలోకవృజినోపశమోదయాద్య
శం నః కృధీశ భగవన్నసి దీననాథః

పరమాత్మ యజ్ఞ్య పురుషుడు.అచ్యుతుడు (జారనివాడు జారనీయనివాడు) పవిత్రమైన పాదములు కలవాడు పవిత్రమైన కీర్తి కలవాడు,చెవులకు పవిత్రత కలిగించే పేరు కలవాడు. ఆపద పొందినవారి కష్టాలను తొలగించడములో మొదటివాడా 

విశ్వాయ విశ్వభవనస్థితిసంయమాయ
స్వైరం గృహీతపురుశక్తిగుణాయ భూమ్నే
స్వస్థాయ శశ్వదుపబృంహితపూర్ణబోధ
వ్యాపాదితాత్మతమసే హరయే నమస్తే

ఆపద పొందినవారి కష్టాలను తొలగించడములో మొదటివాడా.నీవు దీన నాధుడివి కాబట్టి మాకు శుభాన్ని కలిగించు.నీవే విశ్వము.సృష్టి స్థితి లయములు చేస్తావు నీవు ఆచరించే పనికి నీకు కావలసిన శక్తిని నీవే కల్పించుకుంటావు పరమాత్మ యందు ప్రేమ లేని వారు కూడా ఆరాధించడానికి కావలసిన విధానాన్ని మన ఋషులు ఏర్పరచారు. పరిపూర్ణమైన జ్ఞ్యాన స్వరూపాన్ని వృద్ధి పొందింపచేయగలిగిన నీకు నమస్కారం.నీ చీకటినీ నీవే పోగొట్టుకుంటావు (తమస పరస్తాత్).

ఆయుః పరం వపురభీష్టమతుల్యలక్ష్మీర్
ద్యోభూరసాః సకలయోగగుణాస్త్రివర్గః
జ్ఞానం చ కేవలమనన్త భవన్తి తుష్టాత్
త్వత్తో నృణాం కిము సపత్నజయాదిరాశీః

పరమాత్మను ఆరాధించడానికి ఆయుష్షు కావాలి.ఆ ఆయుష్షు నీవే.పరమదైవమూ పరమాయువూ నీవే.భూమ్యాకాశాలూ అన్ని యోగాలూ త్రివిర్గమూ నీవే.జ్ఞ్యానము నీవే.కేవలం నీ స్వరూప జ్ఞ్యానం కలిగినా తనకు తానుగా ఒక చిన్న పూవు ఇచ్చినా నీవు ఆనందిస్తావు. ప్రతీవాడు శత్రువుల నుండి జయము పొందాలని ఐశ్వర్యం పొందాలని ఆశిస్తాడు.

అందరిలో అంతర్యామిగా ఉన్న పరమాత్మ అథితితో స్తోత్రం చేయబడిన పుండరీకాక్షుడు ఇలా అన్నాడు. దేవమాతా నీవెప్పటినుంచో అనుకున్నది నాకు తెలుసు. శత్రువులు అపహరించి రాజ్యాన్ని నెట్టివేసారు.బాగా మధించి ఉన్న అసురులను యుద్ధములో గెలిచి రాజ్యలక్ష్మిని పొందిన పుత్రులతో కలిసి నన్ను మళ్ళీ ఆరాధించాలని అనుకుంటున్నావు.మనం కోరిక కోరుతూ స్వామిని ఆరాధిస్తాము.అది తీరుతుంది.దానికి కృతజ్ఞ్యతతో మళ్ళీ ఆరాధించాలి.వ్రతం పూర్తై ఫలితం వచ్చాక కూడా స్వామిని ఆరాధించాలి.తొందరగా కరుణించాడు కాబట్టి కృతజ్యతగా స్వామిని మరలా ఆరాధించాలి

శత్రువుల యుద్ధములో ఓడిపోయిన ఇంద్రాది (ఇంద్రుడు పెద్దవాడిగా ఉన్న పుత్రులు) దేవతలూ, వారి భార్యలూ స్వర్గాన్ని విడిచి వెళ్ళిపోయారు.వారి భార్యలు ఏదుస్తున్నారు.అలా ఆ రాక్షస స్త్రీలు బాధపడడాన్ని కోరుతున్నావు కదా. వారు ఏడవాలి నీ కొడుకులు ఆనందైంచాలి అని ఉందా కానీ ఇపుడు రాక్షసులు ఓడడం జరగదు.దైవం వారికి అనుకూలం ఇపుడు.

వారు ఏడవాలి నీ కొడుకులు ఆనందైంచాలి అని ఉందా.కానీ ఇపుడు రాక్షసులు ఓడడం జరగదు.దైవం వారికి అనుకూలం ఇపుడు.

నీ శ్రద్ధకు ఫలితం ఇవ్వాలి నీ పిల్లల రక్షణకు నీవు యథావిధిగా ఆ వ్రతాన్ని ఆచరించావు నేను స్వయముగా వస్తేనే నీ పని అవుతుంది నిన్ను కాపాడతాను కశ్యపుని తేజస్సులో నేను వచ్చి చేరతాను. ఏ పాపం లేని కశ్యపున్ని నీవు సేవించు నీవు చేసిన ఈ రూపాన్ని మనసులో పెట్టుకునే నీ భర్త దగ్గరకు వెళ్ళు భార్యా భర్తలు సంగమిస్తూ ఉన్నప్పుడు పరమాత్మనే తలచుకోవాలి.

ఎవరు అడిగిన ఈ విషయం చెప్పకు.ఇది దేవ రహస్యం.జాగ్రత్తగా దాచిపెట్టు
పరమాత్మ ఈ విషయం చెప్పి అంతర్ధానమయ్యాడు. దుర్లభమైన పరమాత్మను పుత్రునిగా పొందిన అథితి కృతకృత్యురాలిగా భర్తను సమీపించింది. జరిగిన దాన్ని కశ్యపుడు యోగ దృష్టితో తెలుసుకున్నాడు.ఎంతో కాలమునుండీ తపస్సుతో నింపిన తన వీర్యాన్ని ఇచ్చాడు.వాయువు ఎలా ఐతే కాష్ఠములో అగ్నిని ఉంచుతో కశ్యపుడు సమాధాన మనస్కుడై తన వీర్యాన్ని అథితిలో ఉంచాడు.బ్రహ్మ అథితి గర్భములో ఉన్న పరమాత్మని స్తోత్రం చేసాడు

పెద్దల చేత గానంచేయబడే ఉరుక్రముడివైన (పరాక్రమ కలవడవైన) నీకు నమస్కారం, బ్రహ్మణ్య దేవుడివీ త్రిగుణాత్ముడివీ, పృశ్ని గర్భుడవైన నీకు నమస్కరాం (ఇంతకు ముందు జన్మ) వేద గర్భుడవైన నీకు నమస్కారం, త్రినాభ (సత్వ గుణం), సత్వ రజసతమోగుణాలు నీవే, నీవే ఆది అంతమూ మధ్యము, అనంత పురుషుడివి,కాలరూపములో వ్యాపించి ఉన్నవాడివి,ఎలా ఐతే లోపలి ప్రవాహం అన్ని వైపులా వ్యాపిస్తుందో నీవు అన్ని వైపులా వ్యాపించి ఉంటావు. అందరి సృష్టి కర్తవూ నీవే.అందరిలా పుట్టేదీ నీవే.నీటిలో మునిగిన వారికి పడవలా స్వర్గము నుండి జారిన దేవతలకు నీవే ఆధారం.