శ్రీ లలితా శివ జ్యోతి సర్వ కామదా


శ్రీ లలితా శివ జ్యోతి సర్వకామదా
శ్రీ గిరి నిలయా గిరామయా సర్వమంగళా  II 2
శ్రీ లలితా శివ జ్యోతి సర్వకామదా
శ్రీ లలితా శివ జ్యోతి సర్వకామదా
శ్రీ గిరి నిలయా గిరామయా సర్వమంగళా

జగముల చిరు నగముల పరిపాలించే జననీ
అనయము మము కనికరమున కాపాడే జననీ   II 2

మనసే నీ వసమై, స్మరణే జీవనమై  II  2

మాయని వరమీయవె పరమేశ్వరి మంగళ నాయకి
శ్రీ లలితా శివ జ్యోతి సర్వ కామదా

అందరికన్నా చక్కని తల్లికి --- సూర్యహారతి,
అందలేలే చల్లని తల్లికి --- చంద్రహారతి
రవ్వల తళుకుల కలలా జ్యోతుల --- కర్పూరహారతి
సకల నిగమ వినుత చరణ --- శాశ్వత మంగళ హారతి

శ్రీ లలితా శివ జ్యోతి సర్వ కామదా
శ్రీ గిరి నిలయా గిరామయా సర్వ మంగళా
శ్రీ లలితా శివ జ్యోతి సర్వ కామద