దీపావళి ఎలా జరుపుకోవాలి
లక్ష్మి దేవి పూజ ఎలా చేయాలి ?
తెల్లవారుజామునే స్నానము చేసి కుదిరితే కొత్త బట్టలు లేదా పరిసుబ్రమయిన బట్టలు అయినా వేసుకోవాలి . ఇల్లు అంత పరిశుభ్రం గ ఉండాలి . ఇంటి చుట్టూ దీపమాలికలు వెలిగించాలి.
రాత్రి పూట గవ్వలు ఆడాలి అని ప్రతీతి. మెమోలు రోజులో ఆడకూడదు కానీ ఈ రోజు మాత్రం గవ్వలు ఆడటం వలన లక్ష్మి దేవి వస్తుంది అని ప్రతీతి .
ఉపవాసం చేయలేని వారు, మినుములతో చేసిన వంటలు తినాలి. pcos ఉన్నవాళ్లు మినుములు తినడం వలన గర్బాశయా లోపల శుద్ధి అవుతుంది . మగవాళ్లు తినడం వలన వీర్య వృద్ధి జరుగుతుంది . బాలింతలు తినడం వలన పాలు సమృద్ధిగా పడతాయి .
దీపావళి రోజున రాత్రి పూట భోజనం చేయకూడదు. స్నానం చేసి పూజ చేసుకుని మరునాటి రోజున స్నానం చేసి పూజ చేసుకునే వరకు ఉపవాసం చేయాలి. దీపావళి రోజున ప్రొదున్న పూజ అయినప్పటి నుంచి ప్రతి గంటకి స్త్రీ సూక్తం తో అమ్మవారిని పూజ చేసి, నైవేద్యం సమర్పించాలి. ప్రతి గంటకి ఒక సారి స్త్రీ సూక్తం తో పారాయణం చేయాలి మరునాడు ఉదయం మల్లి స్నానం చేసి పూజ చేసుకునే సమయానికి , రోజుకి 24 గంటలు గాబట్టి 24 సార్లు పారాయణం అవాలి. రాత్రి అంతా జాగరణ చేస్తూ స్త్రీ సూక్తం , రాత్రి సూక్తం , లక్ష్మీ పూజ చేయాలి . అమ్మవారికి నైవేద్యం గ వరి పేలాలు , పూర్ణాలు , పంచ బక్షి పరమాన్నాలు పెట్టాలి . గోవు ఉన్న చోట తప్పకుండ దీపాలు పెట్టాలి , పోదున , మధ్యాహ్నం , సాయంత్రం . ద్వాదశి (గోవత్స ద్వాదశి) నుంచి 5 రోజులు , లేదా 3 రోజులు గోవు పూజ చేయాలి . అయితే గోవు పూజ , వ్రతం చేసేవాళ్లు మాత్రం పాలు , నూనె , నేయి , పెరుగు తీసుకోకూడదు .
ఆముదం తో దీపాలు వెలిగించాలి . ఇంటి బయట లోపల వరుసగా దీపాలు వెలిగించాలి.
అగ్ని ప్రమాదాలు జరగకుండా ఉండడానికి ఉదయం పూజలో ప్రతి ఒక్కరు స్కంద కవచం చదువుకోవాలి.